ఆ ఐటీ కంపెనీ ఉద్యోగుల్లో ఫుల్‌ జోష్‌.. | Good news for TCS employees Variable pay climbs to 80pc | Sakshi
Sakshi News home page

ఆ ఐటీ కంపెనీ ఉద్యోగుల్లో ఫుల్‌ జోష్‌..

Feb 22 2026 4:54 PM | Updated on Feb 22 2026 5:28 PM

Good news for TCS employees Variable pay climbs to 80pc

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో (TCS) పనిచేసే ఉద్యోగుల్లో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. కారణం.. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగుల త్రైమాసిక వేరియబుల్ పేను మూడో త్రైమాసికంలో గరిష్ఠంగా 80 శాతం వరకు పెంచింది. దాదాపు రెండేళ్లుగా తక్కువ స్థాయిలో కొనసాగిన చెల్లింపుల తరువాత ఇది గణనీయమైన మార్పుగా భావిస్తున్నారు.

రెండేళ్ల తర్వాత గణనీయమైన పెంపు
ఇటీవలి కాలంలో మధ్య, సీనియర్ స్థాయి సిబ్బందికి వేరియబుల్ పే 20–50 శాతం మధ్యకే పరిమితమై ఉండేది. ఇప్పుడు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి చాలామంది మధ్యస్థాయి ఉద్యోగులు సుమారు 80 శాతం వేరియబుల్ చెల్లింపులు పొందినట్లు సమాచారం. సీనియర్ స్థాయి ఉద్యోగులకు 40–80 శాతం మధ్య చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. ‘మనీ కంట్రోల్‌’ కథనం ప్రకారం.. ఉద్యోగులకు జనవరిలో ఈ మొత్తాలు జమయ్యాయి.

కంపెనీ వర్గాల ప్రకారం.. మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం మందికి పైగా తమ త్రైమాసిక వేరియబుల్ వేతనంలో 100 శాతం అందుతోంది. అయితే, పూర్తి చెల్లింపులు ఎక్కువగా జూనియర్ స్థాయి ఉద్యోగులకే పరిమితమై ఉన్నట్లు తెలుస్తోంది.

ఇన్ఫోసిస్‌లోనూ బలమైన చెల్లింపులు
ఇక మరో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) కూడా డిసెంబర్ 31, 2025తో ముగిసిన త్రైమాసికానికి (Q3FY26) సగటున 85 శాతం పనితీరు బోనస్ చెల్లింపులు విడుదల చేసింది. గత మూడున్నరేళ్లలో ఇది బలమైన వేరియబుల్ పే ఫలితంగా నిలిచింది.

ఇదీ చదవండి: కోట్లాది ఉద్యోగాలు.. అమెరికా పారిశ్రామికవేత్త ఆందోళన
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement