ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్‌ ధరల్లో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ | Infinix Note Edge 5G Launched in India with Premium Features at Budget Price | Sakshi
Sakshi News home page

ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్‌ ధరల్లో కొత్త స్మార్ట్‌ ఫోన్‌

Feb 22 2026 3:02 PM | Updated on Feb 22 2026 3:13 PM

Infinix Note Edge 5G Launched in India with Premium Features at Budget Price

చైనా మొబైల్‌ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్‌ బడ్జెట్‌ ధరల్లో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ తీసుకువచ్చింది.‘ఇన్ఫినిక్స్‌ నోట్‌ ఎడ్జ్‌ 5జీ’ పేరుతో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 21,999గా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 23,999గా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 25,999గా నిర్ణయించారు.

లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా 12 నెలల సాధారణ వారెంటీతో పాటు 12 నెలల ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది. వన్‌టైమ్‌ స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై రూ.2 వేల వరకు అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ వెబ్‌సైట్, ఆఫ్‌ లైన్‌ స్టోర్స్‌లో ఈ ఫిబ్రవరి 25నుంచి సేల్‌ అందుబాటులో ఉండనుంది.

సిల్క్‌ ఫైబర్‌ ఫినిష్, స్టెల్లర్‌ బ్లూ, లూనార్‌ టైటానియం కలర్స్‌లో మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 6.78 అంగుళాల 1.5కే త్రీడీ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7ఐ ప్రొటెక్షన్, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, ఐపీ65 వాటర్‌ అండ్‌ డస్ట్‌ రెసిస్టెన్స్‌ సర్టిఫికెట్, ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత ఎక్స్‌ఓఎస్‌ 16 ఆపరేటింగ్‌ సిస్టం తదితర ఫీచర్లు ఉన్నాయి. వెనకవైపు 50 మెగా పిక్సెల్‌ మెయిన్‌ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ లెన్స్‌తో కూడిన డ్యుయల్‌ కెమెరా సెట్‌ అప్‌ ఉంది.

ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 13 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 6500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 45డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో వస్తోంది. 5జీ, డ్యూయల్‌ 4జీ వీఓఎల్‌ఈటీ కనెక్టివిటీ సపోర్టులున్నాయి. వై–ఫై, బ్లూటూత్‌ 5.4, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ ఉన్నాయి. యూఎస్‌బీ టైప్‌–సీ పోర్ట్, ఐఆర్‌ సెన్సార్‌ ఉన్నాయి. ఇన్‌–డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌లున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement