
రూ.10 వేల లోపు కేటగిరిలో మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. హెచ్‌డీ+ డిస్‌ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ64 వాటర్ రెసిస్టెన్స్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఎన్‌ఎఫ్‌సీ, ఎఫ్‌ఎం రేడియో సపోర్ట్ తో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ వివో టీ4 లైట్, పోకో ఎం7, లావా స్టార్మ్ ప్లే ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 ధర.. లభ్యత
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్మార్ట్‌ఫోన్ 4 జీబీ ర్యామ్ / 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే వస్తుంది. దీని ధర రూ .6,799. ఐరిస్ బ్లూ, ట్విలైట్ గోల్డ్, టైటానియం సిల్వర్, స్లీక్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఆగస్టు 2వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 స్పెసిఫికేషన్లు
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10లో 6.67 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.
ఇది ఐపీ 64 వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ తో వస్తుంది. అంటే ఫోన్‌పై దుమ్ము, నీటి చుక్కలు పడినా ఏమీ అవ్వదు కానీ నీటిలో పూర్తిగా మునిగిపోకుండా ఉండాలి.
స్మార్ట్ 10 డీటీఎస్ ట్యూన్ చేసిన డ్యూయల్ స్పీకర్ సెటప్ తో వస్తుంది. 300% వాల్యూమ్ బూస్ట్ ను సపోర్ట్ చేస్తుంది.
ఏ55 జీపీయూతో కూడిన యూనిసోక్ టీ7250 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఏడాది లాంచ్ అయిన ఇతర ఇన్ఫినిక్స్ ఫోన్ల మాదిరిగానే, ఈ స్మార్ట్ 10 ఆండ్రాయిడ్ 15 ఆధారిత కంపెనీ తాజా ఎక్స్ఓఎస్ 15 పై పనిచేస్తుంది.
ఇందులో 4 జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. మైక్రో ఎస్ డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ ను 2 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే, ఫోన్లలో 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, వెనుక భాగంలో డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ షూటర్ ఉంది. రియర్, ఫ్రంట్ కెమెరా రెండూ 2కే 30 ఎఫ్పీఎస్ వేగంతో వీడియోలను షూట్ చేయగలవు.
15వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
