పీక్‌లో వెండి ధరలు… ఒక్కసారిగా కుప్పకూలుతాయా? | Silver Thursday 1980 and Contemporary Market Dynamics: Lessons on Price Crashes | Sakshi
Sakshi News home page

పీక్‌లో వెండి ధరలు… ఒక్కసారిగా కుప్పకూలుతాయా?

Feb 2 2026 9:26 PM | Updated on Feb 2 2026 9:29 PM

Silver Thursday 1980 and Contemporary Market Dynamics: Lessons on Price Crashes

వెండి ధర సగానికి పడిపోతుందా? 1980 నాటి సీన్‌ మళ్లీ రిపీట్‌ అవుతుందా ? ఇప్పుడైతే వెండి ధరలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా పీక్ స్టేజ్ లోనే ఉంది — MCXలో వెండి ధర ప్రస్తుతం సుమారు ₹3,00,000/కిలోగా ట్రేడవుతోంది.  ఇలాంటి పరిస్థితిలో చాలా మంది మనసుల్లో వస్తున్న ప్రశ్న ఏమిటంటే.. 1980ల నాటి ‘వెండి పతనం’ మళ్ళీ జరుగుతుందా? ఒకప్పుడు  జరిగినట్లు రాత్రికి రాత్రే ధరలు సగానికి పైగా పడిపోతాయా. 1980 లో జరిగిన వెండి పతనం ఇప్పుడు మళ్ళీ జరుగుతుందా? అనే భయం నెలకొంది. 

ఆ రోజు వెండి ధర ఒకే రోజులో 50 డాలర్ల నుండి 10.80 డాలర్లకి పడిపోయింది. అసలు 1980 లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. 1979-1980లో  అమెరికన్ బిలియనీర్ సోదరులు ..వీళ్లను హంట్ బ్రదర్స్  అని పిలుస్తారు. వీళ్లు వెండిపై భారీ పందెం వేశారు. ఇద్దరు సోదరులు భౌతిక వెండి, ఫ్యూచర్లలో చాలా పెద్ద స్థానాన్ని నిర్మించుకున్నారు. దీంతో  ప్రపంచ సరఫరాలో 50-60 శాతాన్ని నియంత్రణ లోకి తీసుకున్నారు. వీళ్లు ప్రపంచంలోనే 50 శాతం వెండి సరఫరాను నియంత్రించారు. అప్పట్లోనే వెండి ధర ఔన్సుకు 50 డాలర్లకు చేరుకున్నాయి. అయితే అప్పట్లో అమెరికన్ ప్రభుత్వం కఠినమైన నిబంధనలు నియమించింది.దీని ఫలితంగా 1980 మార్చి 27న ‘సిల్వర్ థర్స్‌డే’ అని పిలుస్తారు. ఇది చరిత్రలో వెండి పతనాన్ని సూచిస్తుంది.

ఇక ఈ సంఘటన తర్వాత హంట్ బ్రదర్స్ దివాలా తీశారు. వెండి ధరలు చాలా సంవత్సరాలు 5-10 డాలర్ల మధ్య ఉన్నాయి. ఇక చూస్తే ఈ సంవత్సరం కూడా వెండి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కిలో వెండి రూ.3.75 లక్షలకు చేరుకుంది. అటువంటి పరిస్థితిలో వెండిలో ఇంత వేగంగా పెరుగుదల దాని పతనానికి  కారణం అవుతుందని చాలా మంది నిపుణులు అంచనా వేస్తున్నారు.  అయితే ఈ సంవత్సరం 1980లో జరిగినట్లు ఏ ఒక్క కంపెనీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించడం లేదు. 

1980 నాటి వెండి మార్కెట్ కు నేటి వెండి మార్కెట్ చాలా భిన్నంగా ఉంది. అతిపెద్ద తేడా ఏమిటంటే ఇప్పుడు వెండి పెట్టుబడికి డిమాండ్ లేదు. సౌర ఫలకాలు, ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, వైద్య పరికరాలు సహా అన్ని రంగాలలో వెండి వినియోగం బాగా పెరుగుతోంది. 

ప్రపంచదేశాలు వెండిని భవిష్యత్తు అవసరాలకోసం పోగుచేసుకుంటున్నారు. దీంతో సామాన్యులకు వెండి దూరమవుతుంది.  అయితే 1980 లో జరిగినట్లు రాత్రికి రాత్రే వెండి ధరలు ఢమాల్ అయ్యే  ఛాన్స్ లేకపోలేదు..ప్రపంచ ఆర్థిక అస్థిరత పెరిగితే, వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఎక్కువగా ఉంటే, డాలర్ బలపడితే లేదా పెద్ద పెట్టుబడిదారులు కలిసి లాభాల బుకింగ్ ప్రారంభించినట్లయితే, అటువంటి పరిస్థితిలో వెండి ధరలు ఒక్కసారిగా  తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement