ఆల్గో ట్రేడింగ్‌ కేసులో సెటిల్‌మెంట్లు | SEBI Algo Trading Case 111 Brokers Settle Violations for Rs 1 Lakh Each | Sakshi
Sakshi News home page

ఆల్గో ట్రేడింగ్‌ కేసులో సెటిల్‌మెంట్లు

Mar 19 2026 8:36 PM | Updated on Mar 19 2026 8:41 PM

SEBI Algo Trading Case 111 Brokers Settle Violations for Rs 1 Lakh Each

న్యూఢిల్లీ: స్టాక్‌ బ్రోకర్ల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని 111 సంస్థలు వినియోగించుకున్నట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా వెల్లడించింది. కొన్ని ఆల్గోరిథమిక్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌తో చేతులు కలిపిన స్టాక్‌ బ్రోకర్లపై పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలను నిలువరించేందుకు వీలుగా సెటిల్‌మెంట్‌ పథకాన్ని సెబీ తీసుకువచ్చింది.

దీంతో ఒక్కో సంస్థ రూ. లక్ష చొప్పున చెల్లించి కేసులు సెటిల్‌ చేసుకున్నట్లు సెబీ పేర్కొంది. శాట్‌ లేదా వివిధ కోర్టులలో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కోవలసి ఉన్న స్టాక్‌ బ్రోకర్‌ సంస్థలకు 2025 జూన్‌ 16 నుంచి సెపె్టంబర్‌ 16వరకూ సెబీ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే పథకానికి చివర్లో భారీ స్పందన కనిపించడంతో 2025 అక్టోబర్‌వరకూ గడువును పొడిగించింది.

Advertisement
 
Advertisement
Advertisement