breaking news
sebi
-
5 కంపెనీలు లిస్టింగ్‌కు రెడీ
ఈ కేలండర్ ఏడాది(2025) సరికొత్త రికార్డు నెలకొల్పే బాటలో ప్రైమరీ మార్కెట్లు పలు లిస్టింగ్‌లతో కదం తొక్కుతున్నాయి. ఇప్పటికే సెంచరీ మార్క్‌కు చేరువైన ఐపీవోలు రూ. 1.6 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఈ బాటలో తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరో 5 కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు తాజాగా సెబీ నుంచి 5 కంపెనీలకు అనుమతి లభించింది. జాబితాలో లీప్ ఇండియా, ఎల్డొరాడో అగ్రిటెక్, మోల్బియో డయాగ్నోస్టిక్స్, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్, ఫుడ్లింక్ ఎఫ్అండ్బీ హోల్డింగ్స్(ఇండియా) చేరాయి. నిధుల సమీకరణకు వీలుగా ఈ కంపెనీలన్నీ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. అయితే మరోపక్క ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ, స్కై అల్లాయ్స్ అండ్ పవర్ వెనకడుగు వేశాయి. ఈ నెల మొదట్లో సెబీ నుంచి ఐపీవో పత్రాలను వాపస్ తీసుకున్నాయి. వీటిలో ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ తాత్కాలికంగానే ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రీఐపీవో రౌండ్లో భాగంగా కంపెనీ ఇటీవల రూ. 5,000 కోట్లు సమకూర్చుకున్న నేపథ్యంలో ఫైనాన్షియల్స్పై సవరించిన ముసాయిదా పత్రాలను తిరిగి దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రూ. 2,400 కోట్లపై కన్ను పబ్లిక్ ఇష్యూలో భాగంగా సప్లైచైన్ అసెట్ పూలింగ్ కంపెనీ లీప్ ఇండియా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. దీంతో లిస్టింగ్ ద్వారా రూ. 2,400 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 300 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచి్చంచనుంది. రూ. 1,000 కోట్లకు రెడీ శ్రీకార్ సీడ్స్ బ్రాండ్ కంపెనీ ఎల్డొరాడో అగ్రిటెక్ ఐపీవోలో భాగంగా రూ. 340 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 660 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. విత్తనాలుసహా.. సస్యరక్షణ సొల్యూషన్స్ సమకూర్చే తెలంగాణ కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 245 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. పీఈ సంస్థల వాటాలు పీఈ సంస్థలు టెమాసెక్, మోతీలాల్ ఓస్వాల్‌కు పెట్టుబడులున్న మోల్బియో డయాగ్నోస్టిక్స్ ఐపీవోలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 1.25 కోట్ల షేర్లను కంపెనీ ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 99 కోట్లు కొత్త ఆర్అండ్డీ యూనిట్(ఎక్సలెన్స్ సెంటర్, ఆఫీస్ స్పేస్) ఏర్పాటుకు వెచి్చంచనుంది. కేంద్రీకృత కిచెన్ల ఏర్పాటు కేటరింగ్, ఫుడ్ రిటైల్ చైన్ కంపెనీ ఫుడ్లింక్ ఎఫ్అండ్బీ హోల్డింగ్స్(ఇండియా) ఐపీవోలో భాగంగా రూ. 160 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.19 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కొత్త కేంద్రీకృత కిచెన్ల ఏర్పాటుతోపాటు, మెటీరియల్ అనుబంధ సంస్థ ఫుడ్లింక్ గ్లోబల్ రెస్టారెంట్స్ అండ్ కేటరింగ్ సర్వీసెస్ కొత్తగా నెలకొల్పనున్న క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్లకు వినియోగించనుంది. ఇండియా బిస్ట్రో, ఆర్ట్ ఆఫ్ దమ్, చైనా బిస్ట్రో తదితర బ్రాండ్లతో 30 క్యాజువల్ రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లను నిర్వహిస్తోంది. తాజా ఈక్విటీ, ఓఎఫ్ఎస్ ఐపీవోలో భాగంగా వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్లు అందించే టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ 95.05 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 23.76 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్ సంస్థ కార్తికేయ కన్స్ట్రక్షన్స్ ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 138 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. రెండు కంపెనీల దరఖాస్తు జాబితాలో స్టీమ్‌హౌస్ ఇండియా సిటియస్ ట్రాన్స్‌నెట్ ఇన్వెస్ట్ ట్రస్ట్ రవాణా సంబంధ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు చేపట్టే సిటియస్ ట్రాన్స్‌నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్) పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా యూనిట్ల జారీ ద్వారా రూ. 1,340 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇష్యూ నిధుల్లో రూ. 1,235 కోట్లు ఎస్‌ఆర్‌పీఎల్‌లో సెక్యూరిటీల కొనుగోలు, టీఈఎల్, జేఎస్‌ఈఎల్, ధోలా, డిబంగ్ తదితర ఎస్పీవీ ప్రాజెక్టులలో పెట్టుబడులు చేపట్టనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. దాదాపు 3,407 కిలోమీటర్ల పోర్ట్‌ఫోలియో(ఆస్తులు)ను కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 1,987 కోట్ల ఆదాయం, రూ. 418 కోట్ల నికర నష్టం ప్రకటించింది. రూ. 425 కోట్లకు సై ఇండ్రస్టియల్ స్టీమ్, గ్యాస్ సరఫరా చేసే స్టీమ్‌హౌస్ ఇండియా ఐపీవోకు వీలుగా సెబీకి అప్డేటెడ్ ప్రాస్పెక్టస్‌ను జత చేసింది. జూలైలో గోప్యతా విధానంలో దరఖాస్తు చేయడంతో తాజాగా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 345 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 80 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ ఆఫర్ చేయనున్నారు. తద్వారా 425 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, అంకలేశ్వర్, పనోలీ యూనిట్ల విస్తరణకు, దహేజ్‌లో కొత్త స్టీమ్ జనరేషన్ యూనిట్ ఏర్పాటుకు వినియోగించనుంది. 2024–25లో రూ. 395 కోట్ల ఆదాయం, రూ. 31 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
లోరిస్క్ విదేశీ ఇన్వెస్టర్లకు సింగిల్ విండో
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా లోరిస్క్ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సింగిల్ విండోను ప్రవేశపెట్టింది. తద్వారా దేశీ స్టాక్ మార్కెట్లో లావాదేవీలు చేపట్టేందుకు నిబంధనలను సరళతరం చేసింది. ఇందుకు సింగిల్ విండో ఆటోమేటిక్ అండ్ జనరలైజ్డ్ యాక్సెస్ ఫర్ ట్రస్ట్డ్ ఫారిన్ ఇన్వెస్టర్స్(స్వాగత్–ఎఫ్ఐ)పేరుతో తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. తద్వారా విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకట్టుకునేందుకు వీలు చిక్కనుంది. దీంతో వివిధ పెట్టుబడి మార్గాలను ఏకీకృతం చేయడంతోపాటు.. ఆయా సంస్థలు నిబంధనలు పాటించడంలో మరింత సరళతర విధానాలకు తెరతీసింది. లోరిస్క్ విదేశీ ఇన్వెస్టర్ల జాబితాలో ప్రభుత్వ ఫండ్స్, కేంద్ర బ్యాంకులు, సావరిన్ వెల్త్ ఫండ్స్, మలీ్టలేటరల్ సంస్థలు, అత్యధిక నియంత్రణలు కలిగిన పబ్లిక్ రిటైల్ ఫండ్స్, తగిన నియంత్రణలున్న బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్‌ను సెబీ చేర్చింది. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), విదేశీ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల(ఎఫ్‌వీసీఐలు)కు విడిగా రెండు నోటిఫికేషన్లను స్వాగత్–ఎఫ్ఐ మార్గదర్శకాలకు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా సెబీ నిబంధనలను సవరించింది. వెరసి 2026 జూన్1 నుంచి ఇవి అమలుకానున్నాయి. ఈ ప్రతిపాదనలకు సెబీ బోర్డు సెపె్టంబర్లో ఆమోదముద్ర వేసింది. -
విద్య ముసుగులో రూ.546 కోట్ల మోసం
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స్టాక్ మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను కీలక చర్య తీసుకుంది. అవధూత్ సాథే ట్రేడింగ్ అకాడమీ (ఆస్టా) వ్యవస్థాపకుడు అవధూత్ సాథే, ఆస్టా సంస్థ, డైరెక్టర్ గౌరీ సాథేలను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా, వారి ఖాతాల్లో ఉన్న ఏకంగా రూ.546 కోట్లను జప్తు చేయాలని సెబీ ఆదేశించింది.విద్య ముసుగులో..రిటైల్ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించి ఈ భారీ మొత్తాన్ని సేకరించడానికి ఆస్టా రిజిస్టర్ చేయని పెట్టుబడి సలహాదారుగా పనిచేసిందని సెబీ నిర్ధారించింది. ఆస్టా అందించిన విద్యా కోర్సుల పేరుతో నిర్దిష్ట స్టాక్ చిట్కాలు, లైవ్ ట్రేడింగ్ కాల్స్, ఎంట్రీ-ఎగ్జిట్ సూచనలు ఇవ్వడం ద్వారా ఈ ఆదాయం వచ్చిందని సెబీ తేల్చింది. ఈ సంస్థపై ఫిర్యాదులు రావడంతో సెబీ దర్యాప్తు చేపట్టింది. వీడియోలు, వాట్సాప్ సందేశాలు, సోషల్ మీడియా కంటెంట్, పేమెంట్ లేవాదేవీలు, కొంతమంది వ్యక్తుల సాక్ష్యాలను పరిశీలించిన సెబీ ఆస్టా కార్యకలాపాలు కేవలం విద్యా శిక్షణకు పరిమితం కాకుండా, ప్రత్యక్ష పెట్టుబడి సలహాగా ఉన్నాయని స్పష్టం చేసింది.ఉదాహరణకు, ఒక లైవ్ సెషన్లో అవధూత్ సాథే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్‌ను నిర్దిష్ట ధరకు కొనుగోలు చేయమని, స్టాప్-లాస్, టార్గెట్‌తో సహా సూచించారు. దీన్ని సెబీ ఉత్తర్వుల్లో ఉటంకిస్తూ ‘ఇది విద్య కాదు, పెట్టుబడి సలహా’ అని స్పష్టంగా పేర్కొంది.అధిక ఫీజులు, హామీ రాబడుల భ్రమఆస్టా కౌన్సెలింగ్ బ్యాచ్‌ల పేరుతో ప్రైవేట్ వాట్సాప్ గ్రూపుల ద్వారా అధిక ఫీజులు చెల్లించిన వందలాది మంది సభ్యులకు రియల్‌టైమ్ ట్రేడింగ్ సూచనలు ఇచ్చింది. ఈ కోర్సుల ధర రూ.6.75 లక్షల వరకు ఉండగా, ఇవి కేవలం సైద్ధాంతిక పాఠాలకే కాకుండా రియల్‌టైమ్ సలహా కోసమేనని సెబీ గుర్తించింది. సంస్థ లాభదాయక ట్రేడ్ స్క్రీన్షాట్లు ప్రదర్శించి, నష్టాలను దాచిపెట్టి, అధిక రాబడుల హామీ భ్రమ కల్పించిందని సెబీ విమర్శించింది.2024 ప్రారంభంలో అధికారిక హెచ్చరిక అందినా సాథే ఈ పద్ధతులను కొనసాగించి, కార్యకలాపాలను మరింత రహస్యంగా మార్చారని సెబీ తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.సెబీ ఆదేశాలు ఇవే..సెక్యూరిటీస్ మార్కెట్‌ను రక్షించడానికి, పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటానికి సెబీ కొన్ని ఆదేశాలను జారీ చేసింది. అవధూత్ సాథే, గౌరీ సాథే, ఆస్టా సంస్థపై సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి తాత్కాలిక నిషేధిస్తున్నట్లు చెప్పింది. వీరు సెక్యూరిటీల కొనుగోలు-విక్రయాలు, సలహా కార్యకలాపాలు, లైవ్ ట్రేడింగ్ సెషన్లు నిర్వహించడంపై నిషేధం విధించింది. రూ.546 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్‌ల్లో ఉంచే వరకు వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. పూర్తి ఆర్థిక రికార్డులు, ఆస్తి వివరాలు, జీఎస్టీ ఫైలింగ్స్, కస్టమర్ జాబితాను సమర్పించాలని చెప్పింది. సెబీ ఈ కేసుపై విచారణ కొనసాగిస్తోంది. నోటీసులకు 21 రోజుల్లో అవధూత్ సాథే, ఇతరులు సమాధానం ఇవ్వాల్సి ఉంది.రిటైలర్లు ఏం చేయాలంటే..రిటైల్ పెట్టుబడిదారులు, వ్యాపారులు తమ డబ్బును రక్షించుకోవడానికి, ఆర్థిక నష్టాలను నివారించడానికి కొన్ని జాగ్రత్తులు తప్పకుండా పాటించాలి. ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా స్టాక్ చిట్కాలు, ట్రేడింగ్ కాల్స్ లేదా నిర్దిష్ట స్టాక్‌లపై సలహా ఇస్తే వారు సెబీతో రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ (RIA) లేదా రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ (RA)గా నమోదు చేసుకున్నారో లేదో తప్పకుండా తనిఖీ చేయాలి.సలహా ఇచ్చే వ్యక్తి/ సంస్థ సెబీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను (ఉదాహరణకు, INA0000XXXXXX లేదా INH0000XXXXXX) సెబీ అధికారిక వెబ్సైట్లో 'Intermediaries/Market Participants' విభాగంలో తనిఖీ చేయాలి. ట్రేడింగ్ కోర్సు లేదా విద్యా తరగతులు పేరుతో లైవ్ ట్రేడింగ్ కాల్స్, నిర్దిష్ట ట్రేడ్ సూచనలు ఇస్తే, వారు రిజిస్టర్ కాకపోయినా సెబీ దృష్టిలో అది పెట్టుబడి సలహాగానే పరిగణిస్తారు.హామీ రాబడులుస్టాక్ మార్కెట్లో ఎలాంటి హామీ రాబడులు ఉండవు. ఏ వ్యక్తి అయినా ‘కచ్చితమైన లాభం’, ‘రిస్క్-ఫ్రీ స్ట్రాటజీ’ లేదా ‘మీ డబ్బు రెట్టింపు’ అవుతుందని హామీ ఇస్తే అది మోసమే. లాభాల స్క్రీన్షాట్లు, విజయం సాధించిన క్లయింట్ల కథనాలు మాత్రమే చూపించి నష్టాలను లేదా రిస్క్‌లను దాచిపెడితే అలాంటి వారి నుంచి దూరంగా ఉండండి.ఇదీ చదవండి: ‘విమానం రాలేదు.. దయచేసి ఉద్యోగం తీసేయకండి’ -
ఐపీవోకు 4 కంపెనీలు రెడీ.. రూ. 10,000 కోట్లకు సై!
తాజాగా సెకండరీ మార్కెట్లు కొత్త గరిష్టాల రికార్డ్‌ను సాధించగా.. ప్రైమరీ మార్కెట్లు సైతం ఈ కేలండర్ ఏడాది(2025) సరికొత్త రికార్డులవైపు పరుగెడుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది 96 కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమకూర్చుకోవడం ద్వారా స్టాక్ ఎక్ఛ్సేంజీలలో లిస్టయ్యాయి. గత మూడు నెలల్లోనే 40 కంపెనీలకుపైగా ఐపీవోకు రావడం విశేషం! ఇంతక్రితం 2024లో 94 కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించి రికార్డ్ నెలకొల్పాయి. కాగా.. తాజాగా మరో 4 కంపెనీలు నిధుల సమీకరణకు సిద్ధపడనున్నాయి. వివరాలు చూద్దాం..ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిది. దీంతో రూ. 10,000 కోట్ల సమీకరణ ద్వారా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు వీలు చిక్కింది.ఈ బాటలో మరో మూడు కంపెనీల ముసాయిదా ప్రాస్పెక్టస్‌లకు సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. జాబితాలో పవరికా లిమిటెడ్, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్, అన్ను ప్రాజెక్ట్స్ చేరాయి. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు అనుమతించమంటూ ఈ కంపెనీలు సెబీకి 2025 జూలై– సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. తాజాగా అనుమతులు పొందాయి. ఈ నెలలోనే ఆఫర్ ప్రస్తుతం కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఈ నెలలోనే పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు తెలుస్తోంది. తద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం సంస్థలో ఐసీఐసీఐ బ్యాంక్ వాటా 51 శాతంకాగా.. ప్రుడెన్షియల్ కార్పొరేషన్ 49 శాతం వాటా కలిగి ఉంది.ఇష్యూలో భాగంగా 1.76 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్(యూకే) ఆఫర్ చేయనుంది. దీంతో ఐపీవో నిధులు ప్రుడెన్షియల్ కార్పొరేషన్(ప్రమోటర్)కు చేరనున్నాయి. దేశీయంగా ఇప్పటికే నాలుగు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాయి. లిస్టెడ్ ఏఎంసీలు.. హెచ్డీఎఫ్సీ, యూటీఐ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, శ్రీరామ్, నిప్పన్ లైఫ్ జాబితాలో ఐదో కంపెనీగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చేరనుంది.పవర్ సొల్యూషన్స్.. పవర్ సొల్యూషన్స్ సమకూర్చే పవరికా లిమిటెడ్ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 700 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,400 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 525 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు మరికొన్ని నిధులు కేటాయించనుంది.వృథా నీటి సొల్యూషన్లు వ్యర్థ జలాల ట్రీట్మెంట్ సొల్యూషన్లు అందించే టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీవోకు వస్తోంది. దీనిలో భాగంగా 95.05 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 23.76 లక్షల షేర్లను ప్రమోటర్ సంస్థ కార్తకేయ కన్స్ట్రక్షన్స్ విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 138 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో సేవలందిస్తున్న అన్ను ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా ఐపీవో చేపట్టనుంది. 2003లో అన్ను ఇన్ఫ్రా కన్స్ట్రక్ట్(ఇండియా) ప్రయివేట్ లిమిటెడ్‌గా ఏర్పాటైన కంపెనీ తదుపరి అన్ను ప్రాజెక్ట్స్‌గా అవతరించింది. మౌలిక రంగ సంబంధ డిజైన్, డెవలప్మెంట్, అభివృద్ధి, నిర్వహణ తదితర సరీ్వసులు సమకూర్చుతోంది.వేక్‌ఫిట్ @ రూ. 185–195 హోమ్, ఫర్నిషింగ్స్ కంపెనీ వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 185–195 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 8న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా రూ. 377 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 912 కోట్ల విలువైన 4.67 కోట్లకుపైగా షేర్లను కంపెనీ ప్రమోటర్లతోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,289 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూ 10న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 5న షేర్లను ఆఫర్ చేయనుంది. ఇష్యూ తదుపరి ప్రమోటర్ల వాటా 43.7 శాతం నుంచి 37 శాతానికి దిగిరానున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామలింగెగౌడ వెల్లడించారు. ఈ నెల 15కల్లా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. కంపెనీ విలువ రూ. 6,400 కోట్లుగా నమోదయ్యే వీలుంది.నిధుల వినియోగమిలా ఈక్విటీ జారీ నిధులలో రూ. 31 కోట్లు కొత్తగా 117 కోకో రెగ్యులర్ స్టోర్ల ఏర్పాటుకు, రూ. 15 కోట్లు మెషీనరీ తదితర కొనుగోళ్లకు, రూ. 161 కోట్లు లీజ్, సబ్‌లీజ్ అద్దెలుసహా ప్రస్తుత స్టోర్ల లైసెన్స్ ఫీజు చెల్లింపులకు వినియోగించనున్నట్లు వేక్‌ఫిట్ పేర్కొంది. మరో రూ. 108 కోట్లు మార్కెటింగ్, ప్రకటనలకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ప్రస్తుతం 130 స్టోర్లను నిర్వహిస్తున్న కంపెనీ వార్షికంగా 25–45 స్టోర్లను జత చేసుకునే ప్రణాళికలు అమలు చేయనుంది.2016లో ఏర్పాటైన కంపెనీ హోమ్, ఫర్నిషింగ్ మార్కెట్లో దేశీయంగా వేగవంత వృద్ధిని సాధిస్తోంది. 2024 మార్చి31కల్లా రూ. 1,000 కోట్లుపైగా ఆదాయం అందుకుంది. 2025 సెప్టెంబర్30కల్లా 6 నెలల్లో రూ. 724 కోట్ల టర్నోవర్, రూ. 35 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ సొంత చానళ్లు, కోకో స్టోర్లతోపాటు.. ఇతర ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, మల్టీబ్రాండ్ ఔట్లెట్ల ద్వారా విభిన్న ఫర్నీచర్, ఫర్నిషింగ్స్ ప్రొడక్టులను విక్రయిస్తోంది. బెంగళూరు(కర్ణాటక), హోసూర్(తమిళనాడు), సోనిపట్(హర్యానా)లలో రెండేసి చొప్పున తయారీ యూనిట్లను కలిగి ఉంది. -
మీషో ఐపీవో @ రూ. 5,421 కోట్లు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం మీషో ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) రేపు (డిసెంబర్ 3న) ప్రారంభమై 5న ముగుస్తుంది. దీని ద్వారా కంపెనీ రూ. 5,421 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించి ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 105–111గా ఉంటుంది. దీని ప్రకారం మీషో వేల్యుయేషన్ గరిష్టంగా రూ. 50,096 కోట్లుగా ఉంటుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 4,250 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో రూ. 1,171 కోట్ల విలువ చేసే 10.55 కోట్ల షేర్లను విక్రయించనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు డిసెంబర్ 2 బిడ్డింగ్ తేదీగా ఉంటుంది. డిసెంబర్ 12న స్టాక్ మార్కెట్లో లిస్టవుతుంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను క్లౌడ్ మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్, బ్రాండ్ ప్రచారం, వేరే సంస్థల కొనుగోళ్లు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. వినియోగదారులు, విక్రేతలు, లాజిస్టిక్స్ భాగస్వాములు, కంటెంట్ క్రియేటర్లను అనుసంధానించే ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంగా మీషో కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రతి రోజు కొనుగోలుదారులకు తక్కువ ధరల్లో ఉత్పత్తులను అందించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు కంపెనీ ఎండీ విదిత్ ఆత్రే తెలిపారు. మీషో ఈ ఏడాది జూలైలో కాని్ఫడెన్షియల్ విధానంలో సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించగా, ఐపీవోకి అక్టోబర్‌లో అనుమతులు లభించాయి. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో కంపెనీ ఆదాయాలు రూ. 5,577 కోట్లకు చేరాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఇది రూ. 4,311 కోట్లుగా నమోదైంది. రూ. 922 కోట్ల ఈక్వస్ ఇష్యూకన్జూమర్ డ్యూరబుల్ గూడ్స్, ఏరోస్పేస్ భాగాల కాంట్రాక్ట్ తయారీ సంస్థ ఈక్వస్ ఐపీవో ద్వారా రూ. 922 కోట్లు సమీకరించనుంది. ఇది కూడా డిసెంబర్ 3న ప్రారంభమై 5న ముగుస్తుంది. ఇష్యూ ప్రకారం ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 118–124గా ఉంటుంది. ఐపీవోలో భాగంగా రూ. 670 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఓఎఫ్ఎస్ కింద రూ. 252 కోట్ల విలువ చేసే 2.03 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. రెండు అనుబంధ సంస్థలైన ఏరోస్ట్రక్చర్స్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా, ఈక్వస్ కన్జూమర్ ప్రోడక్ట్స్ తీసుకున్న రుణాలను తీర్చివేసేందుకు, మెషినరీ కొనుగోలుకు, ఇతర సంస్థల కొనుగోళ్లకు ఐపీవో నిధులను కంపెనీ ఉపయోగించుకోనుంది. ఐపీవో కోసం జూన్‌లో సెబీకి దరఖాస్తు చేసుకోగా సెపె్టంబర్లో అనుమతులు వచ్చాయి. ప్రధానంగా ఏరోస్పేస్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈక్వస్ ఇతరత్రా కన్జూమర్ ఎల్రక్టానిక్స్, ప్లాస్టిక్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ మొదలైన విభాగాల్లోకి కూడా విస్తరించింది. ఇన్ఫీ నారాయణ మూర్తి ఫ్యామిలీ ఆఫీస్ అయిన కాటమారన్, ఎమికస్ క్యాపిటల్ మొదలైనవి ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. ఎయిర్‌బస్, బోయింగ్, హనీవెల్ హాస్బ్రో, వండర్òÙఫ్లాంటి సంస్థలు ఈక్వస్‌కి క్లయింట్లుగా ఉన్నాయి. పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఓయోట్రావెల్ టెక్ ప్లాట్‌ఫాం ఓయో మాతృ సంస్థ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించేందుకు వాటాదారుల అనుమతిని పొందడం కోసం డిసెంబర్ 20న అసాధారణ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి షేర్హోల్డర్లకు ఇచి్చన సమాచారం ప్రకారం అర్హులైన షేర్హోల్డర్లకు ప్రతి 19 ఈక్విటీ షేర్లకు గాను 1 ఈక్విటీ షేరును బోనస్‌గా జారీ చేసే ప్రతిపాదనపై ఓటింగ్ ఉంటుంది. దీనికి డిసెంబర్ 5 రికార్డు తేదీగా ఉంటుంది. బోనస్ ఇష్యూ, ఐపీవో సంబంధిత తదుపరి నిధుల అవసరాలరీత్యా అ«దీకృత మూలధనాన్ని రూ. 2,431 కోట్ల నుంచి రూ. 2,491 కోట్లకు పెంచుకునే ప్రతిపాదనపైనా షేర్హోల్డర్లు ఓటింగ్‌లో పాల్గొంటారు.అదే బాటలో విద్యా వైర్స్ .. వైండింగ్, కండక్టివిటీ ఉత్పత్తుల తయారీ సంస్థ విద్యా వైర్స్ తమ ఐపీవోకి సంబంధించి ఒక్కో షేరు ధర శ్రేణిని రూ. 48–52గా నిర్ణయించింది. దీని ప్రకారం కంపెనీ గరిష్ట విలువ రూ. 1,100 కోట్లుగా ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా విద్యా వైర్స్ రూ. 300 కోట్లు సమీకరిస్తోంది. ఐపీవో డిసెంబర్ 3న ప్రారంభమై 5న ముగుస్తుంది. ఇష్యూలో భాగంగా రూ. 274 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుండగా రూ. 26 కోట్ల విలువ చేసే 50.01 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు, రుణాల చెల్లింపునకు, కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. విద్యా వైర్స్ ప్రధానంగా పేపర్ ఇన్సులేటెడ్ కాపర్ కండక్టర్లు, స్పెషలైజ్డ్ వైండింగ్ వైర్లు, పేపర్ ఇన్సులేటెడ్ కాపర్ కండక్టర్స్ మొదలైనవి ఉత్పత్తి చేస్తోంది. డిసెంబర్ 9న స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు లిస్టవుతాయి. -
ఇక ఇన్వెస్ట్మెంట్ సలహా ఇవ్వాలంటే.. రూల్స్ మార్చిన సెబీ
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పెట్టుబడి సలహాదారులు(ఐఏలు), పరిశోధనా విశ్లేషకులు(ఆర్ఏలు)గా గుర్తింపు పొందేవారి అర్హతల నిబంధనలను సడలించింది. తద్వారా ఇందుకు రిజి్రస్టేషన్ చేసుకునేందుకు గ్రాడ్యుయేట్లను అనుమతించింది. అయితే ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్ పరీక్షలో ఉత్తీర్ణతను తప్పనిసరి నిబంధనగా చేర్చింది.దీంతో అర్హతపొందే వ్యక్తులు సంబంధిత విభాగంలో విజ్ఞానంతోపాటు వృత్తిసంబంధ అవగాహనను కలిగి ఉండే వీలు కల్పించింది. సెబీ తాజాగా జారీ చేసిన రెండు నోటిఫికేషన్లలో నిబంధనల సవరణలను పేర్కొంది. ప్రస్తుతం దరఖాస్తుదారులు ఫైనాన్స్ సంబంధ విభాగాలలో గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేయవలసి ఉంది.ఫైనాన్స్, బిజినెస్ మేనేజ్మెంట్, కామర్స్, ఎకనమిక్స్, క్యాపిటల్ మార్కెట్లలో డిగ్రీ కలిగినవారికి మాత్రమే రిజిస్ట్రేషన్‌కు వీలు కల్పిస్తోంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఏ విభాగంలోని గ్రాడ్యుయేట్లకైనా రిజిస్ట్రేషన్‌కు అర్హత ఉంటుంది. అయితే ఇందుకు ఎన్ఎస్ఐఎం పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి. -
లిస్టింగ్‌కు 3 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూస్తున్నప్పటికీ ఈ క్యాలండర్ ఏడాది(2025)లో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డులవైపు దూసుకెళుతున్నాయి. నిజానికి 2024లో 76 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా ఉమ్మడిగా రూ. 1.53 లక్షల కోట్లు సమీకరించాయి. అయితే ఈ ఏడాది ఇప్పటికే మెయిన్‌బోర్డులో 93 కంపెనీలు రూ. 1.54 లక్షల కోట్లు సమకూర్చుకోవడం ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. ఈ బాటలో మరో మూడు కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ఏఐ సొల్యూషన్స్ ఎండ్టు ఎండ్ ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సొల్యూషన్లు అందించే ఫ్రాక్టల్ అనలిటిక్స్ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా రూ. 1,279 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 3,621 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా మొత్తం రూ. 4,900 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో క్వినాగ్ బిడ్కో రూ. 1,463 కోట్లు, టీపీజీ హోల్డింగ్స్ రూ. 2,000 కోట్లు, జీఎల్‌ఎమ్ కుటుంబ ట్రస్ట్ రూ. 129 కోట్లు విలువైన షేర్లను ఆఫర్ ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, అనుబంధ కంపెనీ ఫ్రాక్టల్ యూఎస్ఏలో పెట్టుబడులు, కొత్త కార్యాలయాల ఏర్పాటు, ఆర్అండ్డీ, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వెచి్చంచనుంది. సాస్ కంపెనీ సాస్ సర్వీసులందించే అమాగీ మీడియా ల్యాబ్స్ ఐపీవోలో భాగంగా రూ. 1,020 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రస్తుత వాటాదారులు 3.41 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 667 కోట్లు టెక్నాలజీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. కార్డియాక్ స్టెంట్స్ 2001లో ఏర్పాటైన మెడికల్ పరికరాల తయారీ కంపెనీ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ ఐపీవోకు రానుంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 2.76 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేర్లు ఆఫర్ చేయనున్న సంస్థలలో శ్రీ హరి ట్రస్ట్, సమారా క్యాపిటల్ మార్కెట్స్ హోల్డింగ్, కొటక్ ప్రీఐపీవో అపార్చునిటీస్ ఫండ్ తదితరాలున్నాయి. కంపెనీ ప్రధానంగా కార్డియాక్ స్టెంట్స్‌ను తయారు చేస్తోంది. కంపెనీ భారత్, థాయ్‌లాండ్‌లలో రెండు ఆర్అండ్డీ కేంద్రాలను నిర్వహిస్తోంది. -
ఇండెక్సులలో రీట్స్‌కు చోటు
న్యూఢిల్లీ: రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు(రీట్స్)ను మార్కెట్ ఇండెక్సులలో చేర్చే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా వెల్లడించింది. ఇందుకు సంబంధిత వర్గాలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. దీంతో రీట్స్‌కు లిక్విడిటీ భారీగా మెరుగుపడే వీలున్నట్లు తెలియజేశారు. 2025 రిట్స్, ఇని్వట్స్ జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ పాండే ఇండెక్సులలో రీట్స్‌ను పొందుపరిచేందుకు పరిశ్రమ ప్రతినిధులతో చర్చిస్తున్నట్లు తెలియజేశారు. రియల్టీ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలు రీట్స్‌ను జారీ చేస్తాయి. తద్వారా ఇన్వెస్టర్లకు అధిక ధరల రియలీ్టని ఆఫర్ చేసేందుకు వీలుంటుంది. ప్రధానంగా డివిడెండ్ ఆదాయం ఆర్జించేందుకు వీలు కల్పించడంతోపాటు.. భవిష్యత్‌లో పెట్టుబడుల వృద్ధికి సైతం రీట్స్ ఉపయోగపడతాయి. ఇండెక్సులలో చోటు లభిస్తే రీట్స్‌లో లిక్విడిటీ పెరుగుతుందని పాండే పేర్కొన్నారు. మరోపక్క రీట్స్, ఇని్వట్స్ సంబంధిత బిజినెస్‌ల సులభతర నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎంఎఫ్ పథకాలలో.. ఇన్వెస్టర్లకు రక్షణ కలి్పస్తూనే లిక్విడ్ ఎంఎఫ్ పథకాలలో రీట్స్, ఇన్విట్స్ ఇన్వెస్ట్ చేసేందుకున్న అవకాశాలను సైతం పరిశీలిస్తున్నట్లు సెబీ చీఫ్ పాండే తెలియజేశారు. ఈ బాటలో తగిన రక్షణాత్మక విధానాలకు తెరతీయడం ద్వారా గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులలో ప్రయివేట్ ఇని్వట్స్ పెట్టుబడులు చేపట్టేందుకు అవకాశాలను అన్వేíÙస్తున్నట్లు వెల్లడించారు. ఇదే విధంగా రీట్స్, ఇని్వట్స్‌లో మరిన్ని పెట్టుబడులను చేపట్టేందుకు వీలుగా సంస్థాగత ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నట్లు వివరించారు. ఇందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ, పలు రాష్ట్ర ప్రభుత్వాలతో పబ్లిక్ ఆస్తుల మానిటైజేషన్‌ను పెంచేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వీటిలో పెట్టుబడులపై బీమా రంగ నియంత్రణ సంస్థ, పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి అ«దీకృత సంస్థ, ఈపీఎఫ్‌వో తదితరాలతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.ఎంఎఫ్‌లపై సెబీ ఆంక్షలు ప్రీఐపీవోలో పెట్టుబడులకు చెక్ న్యూఢిల్లీ: ప్రీఐపీవోలో షేర్ల కొనుగోలుపై మ్యూచువల్ ఫండ్స్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. సంబంధితవర్గాల సమాచారం ప్రకారం ఐపీవోకుముందు షేర్ల జారీ(ప్లేస్‌మెంట్స్)లో ఫండ్స్ ఇన్వెస్ట్ చేయకుండా సెబీ నిషేధం విధించింది. తద్వారా ఐపీవోలలో లిక్విడిటీని పెంచడంతోపాటు.. కంపెనీల విలువ నిర్ధారణలో పారదర్శకతకు మరింత ప్రాధాన్యత ఇవ్వనుంది. ప్రీఐపీవో షేర్ల జారీలో పాల్గొనకుండా ఆదేశించామని, అయితే యాంకర్ రౌండ్లలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతులు కొనసాగుతాయని అధికారిక వర్గాలు తెలియజేశాయి. ఈ నెల మొదట్లో సెబీ యాంకర్ ఇన్వెస్టర్ కేటగిరీ, షేర్ల కేటాయింపులో సైతం సవరణలకు తెరతీసిన సంగతి తెలిసిందే. తద్వారా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్‌కు మరింత చోటు కల్పించింది. ఇందుకు వీలుగా యాంకర్ పోర్షన్‌ను 33 శాతం నుంచి 40 శాతానికి పెంచిన విషయం విదితమే. -
మ్యూచువల్ ఫండ్స్ కొత్త రూల్స్‌పై మరింత గడువు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్టు సెబీ ప్రకటించింది. టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్)కు మరింత మెరుగైన నిర్వచనం ఇస్తూ, బ్రోకరేజీ సంస్థలు ఫండ్స్ నుంచి వసూలు చేసే చార్జీలను గణనీయంగా తగ్గిస్తూ సెబీ కొత్త ప్రతిపాదనలను సిద్దం చేయడం తెలిసిందే.అక్టోబర్ 28న వీటిని విడుదల చేస్తూ, ప్రజాభిప్రాయాలను ఆహ్వానించింది. తమకు అందించిన వినతుల మేరకు అభిప్రాయాలు తెలియజేసే గడువును 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సెబీ ప్రకటన విడుదల చేసింది. -
సులువుగా ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేసే బాటలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నూతన చర్యలకు శ్రీకారం చుట్టనుంది. దీనిలో భాగంగా ఎండ్టు ఎండ్ డిజిటైజేషన్‌కు తెరతీయాలని ప్రణాళికలు వేస్తోంది. డిజిటల్ సిగ్నేచర్లను వినియోగించుకోవడం ద్వారా పూర్తిగా పేపర్‌లెస్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. తద్వారా రిజిస్ట్రేషన్ సమయాన్ని భారీగా కుదించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం నెలలపాటు కొనసాగుతున్న ప్రక్రియను రోజులలోకి తగ్గించాలని చూస్తున్నట్లు వెల్లడించారు. ఇదేసమయంలో డేటా ప్రైవసీ ఆందోళనలకు చెక్ పెట్టనున్నట్లు తెలియజేశారు. సర్వీసుల నాణ్యతను పెంచే బాటలో ఎఫ్‌పీఐ రిజిస్ట్రేషన్‌కు రెండో ప్లాట్‌ఫామ్‌ను సైతం తీసుకురానున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం సీడీఎస్ఎల్ దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. దేశీ క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు కీలక పాత్రధారులని గోల్డ్‌మన్ శాక్స్ నిర్వహించిన 14వ భారత సీఐవో సదస్సు సందర్భంగా పాండే అభివరి్ణంచారు. -
ఐదేళ్లలో ఇన్వెస్టర్లు రెట్టింపు!
ముంబై: రానున్న మూడు నుంచి ఐదేళ్లలో ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడిదారుల సంఖ్య రెట్టింపునకు పెంచే లక్ష్యంతో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలియజేశారు. ఇటీవల సెబీ చేపట్టిన సర్వే పలు అంశాలు వెల్లడైనట్లు పాండే పేర్కొన్నారు.సర్వేలో పాల్గొన్నవారిలో ఐదోవంతు వివిధ మార్గాల ద్వారా సెక్యూరిటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిని ప్రదర్శించినట్లు వెల్లడించారు. 2025 అక్టోబర్‌కల్లా దేశీయంగా మొత్తం ఇన్వెస్టర్ల సంఖ్య 12.2 కోట్లకు చేరింది. 2020లో కోవిడ్ మహ మ్మారి బయటపడ్డాక ఈ సంఖ్య వేగంగా పెరిగింది. కాగా.. ఇన్వెస్టర్ల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పాండే తెలియజేశారు. తద్వారా 10 కోట్లమందిని జత చేసుకోగలిగితే పలు దేశాల ప్రజలను మించి దేశీ ఇన్వెస్టర్ల సంఖ్య బలపడనున్నట్లు సీఐఐ ఫైనాన్సింగ్ సదస్సులో ప్రస్తావించారు.సెబీతోపాటు..నియంత్రణ సంస్థ సెబీసహా.. కార్పొరేట్లు నాణ్యమైన సెక్యూరిటీల జారీకి కట్టుబడటం ద్వారా క్యాపిటల్ మార్కెట్ల ఎకోసిస్టమ్ బలపడుతుందని పాండే పేర్కొన్నారు. దీంతో పెట్టుబడిదారులను ఆకట్టుకోవచ్చని తెలియజేశారు. యూఎస్ మార్కెట్లలో కరెక్షన్ వచి్చనప్పటికీ దేశీయంగా ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడుల కారణంగా దేశీ మార్కెట్లు నిలదొక్కుకుంటాయని అభిప్రాయపడ్డారు.దేశీ మార్కెట్లలో గాలిబుడగల(బబుల్) పరిస్థితిలేదని, అత్యుత్తమ ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ పెట్టుబడులు, సంస్కరణలు, సులభతర వ్యాపార నిర్వహణకు వీలు వంటి అంశాలపట్ల ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపడుతున్నట్లు వివరించారు. కొత్త నియంత్రణలకు తెరతీయడం సెబీ అజెండాకాదని, అర్ధంచేసుకోగలిగే సరళతర, ఆవిష్కరణలకు మద్దతిచ్చే తెలివైన నిబంధనలను రూపొందించనున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో ఈక్విటీ క్యాపిటల్ రూ. 2.5 లక్షల కోట్లను అధిగమించగా.. 7 నెలల్లో కార్పొరేట్ బాండ్ల పెట్టుబడులు రూ. 5.5 లక్షల కోట్లను తాకినట్లు వెల్లడించారు. -
ఇక మహీంద్రా ఇన్సూరెన్స్..!
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) తాజాగా బీమా రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. జీవిత బీమాకు సంబంధించి కెనడాకు చెందిన మాన్యులైఫ్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఇందులో రెండు సంస్థలకు చెరి 50 శాతం వాటాలు ఉంటాయి. దానికి తగ్గట్లుగా చెరి రూ. 3,600 కోట్లు చొప్పున మొత్తం రూ. 7,200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ప్రాథమికంగా తొలి అయిదేళ్లలో రెండు సంస్థలు చెరో రూ. 1,250 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. రాబోయే పదేళ్లలో రూ. 18,000 కోట్లు–రూ. 30,000 కోట్ల వేల్యుయేషన్ స్థాయికి వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా తెలిపారు. మహీంద్రా ఫైనాన్స్ నుంచి ఎంఅండ్ఎంకి అందే డివిడెండ్‌ను కొత్త వ్యాపారంలోకి ఇన్వెస్ట్ చేయనున్నట్లు చెప్పారు. దేశీయంగా ఇప్పటికీ బీమా కవరేజీ అత్యంత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ పరిశ్రమ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నట్లు షా తెలిపారు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బీమా పరిశ్రమల్లో ఒకటైన భారత్ మార్కెట్లో ఎంట్రీ తమకు కీలక మైలురాయని మాన్యులైఫ్ ప్రెసిడెంట్ ఫిల్ విదరింగ్టన్ తెలిపారు. మూడు నెలల్లో లైసెన్సుకు దరఖాస్తు.. వచ్చే రెండు, మూడు నెలల్లో లైసెన్సు కోసం బీమా రంగ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకోనున్నట్లు షా చెప్పారు. జాయింట్ వెంచర్ కార్యకలాపాలు ప్రారంభం కావడానికి 15 నుంచి 18 నెలల సమయం పడుతుందని వివరించారు. సాధారణంగా కొత్త వెంచర్లు బ్రేక్–ఈవెన్ సాధించేందుకు 10–12 ఏళ్లు పడుతుందని షా పేర్కొన్నారు. గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల్లో ఈ జాయింట్ వెంచర్‌ను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. జీవిత బీమాతో ప్రారంభించబోతున్న తమకు కాంపోజిట్ లైసెన్సు కూడా లభిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. మాన్యులైఫ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌కి ఆసియా, యూరప్, అమెరికావ్యాప్తంగా 3.6 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. 37,000 మంది పైగా ఉద్యోగులు, 1.09 లక్షల మంది ఏజెంట్లు,, వేల సంఖ్యలో డి్రస్టిబ్యూషన్ పార్ట్నర్లు ఉన్నారు. బీఎస్ఈలో గురువారం ఎంఅండ్ఎం షేర్లు 1.45% క్షీణించి రూ. 3,699 వద్ద ముగిశాయి. -
నెఫ్రోకేర్ ఐపీవోకి సెబీ ఓకే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న డయాలిసిస్ సేవల సంస్థ నెఫ్రోకేర్ హెల్త్ సరీ్వసెస్, పునరుత్పాదక విద్యుత్ సేవల సంస్థ క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. ఈ రెండు సంస్థలు మొత్తం రూ.5,553 కోట్లు సమీకరించనున్నాయి. ఇరు కంపెనీలు సెబీకి ఆగస్టులో ప్రాస్పెక్టస్‌లు దాఖలు చేయగా .. అక్టోబర్, నవంబర్‌లో సెబీ నుంచి క్లియరెన్సులు వచ్చాయి. ప్రాస్పెక్టస్‌ల ప్రకారం నెఫ్రోప్లస్ బ్రాండ్ పేరిట సేవలందించే నెఫ్రోకేర్ హెల్త్ తాజా షేర్ల జారీ ద్వారా రూ. 353.4 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో 1.27 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీతో సమీకరించిన నిధుల్లో రూ. 129.1 కోట్లను కొత్త డయాలిసిస్ క్లినిక్‌లను ప్రారంభించేందుకు, రూ. 136 కోట్ల మొత్తా న్ని రుణాలను చెల్లించివేసేందుకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. క్లీన్ మ్యాక్స్ ఐపీవో రూ. 5,200 కోట్లు.. ప్రాస్పెక్టస్ ప్రకారం క్లీన్ మ్యాక్స్ రూ. 5,200 కోట్లు సమీకరించనుంది. ఇందులో తాజా షేర్ల జారీ ద్వారా రూ. 1,500 కోట్లు సమకూర్చుకోనుండగా, ప్రమోటర్లు..ఇతర ఇన్వెస్టర్లు ఓఎఫ్ఎస్ విధానంలో రూ. 3,700 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. రూ. 1,125 కోట్ల మొత్తాన్ని రుణాల చెల్లింపునకు, మిగతాది ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 2010లో ప్రారంభమైన క్లీన్ మ్యాక్స్ పారిశ్రామిక కస్టమర్లకు సౌర, పవన, హైబ్రిడ్ విద్యుత్ సరఫరా సేవలు అందిస్తోంది. -
డిజిటల్ గోల్డ్‌తో జాగ్రత్త.. సెబీ హెచ్చరిక
డిజిటల్ గోల్డ్‌ను విక్రయించే సంస్థలు, ఆయా ఉత్పత్తులు నియంత్రణ పరిధిలో లేవని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తెలిపింది. కాబట్టి, డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని, జాగ్రత్త వహించాలని హెచ్చరించింది. సెబీ నియంత్రించే పసిడి ఉత్పత్తులతో పోలిస్తే ఇవి భిన్నమైనవని పేర్కొంది.డిజిటల్ గోల్డ్ లేదా ఈ–గోల్డ్ ప్రోడక్టుల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యంత్రాంగంపరమైన హామీ ఉండబోదని వివరించింది. ప్రస్తుతం పసిడికి డిమాండ్ భారీగా పెరగడం, ఆన్లైన్లో అత్యంత తక్కువగా రూ. 10 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చంటూ పలు సంస్థలు ఊరిస్తుండటం తదితర పరిణామాల నేపథ్యంలో సెబీ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్ట్‌లు, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ మొదలైన సాధనాల ద్వారా నియంత్రణ సంస్థ పరిధిలో పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని సెబీ తెలిపింది.ఏమిటీ గోల్డ్ ఈటీఎఫ్‌లు?గోల్డ్ ఈటీఎఫ్‌లు బంగారంపై పెట్టుబడి పెట్టే డిజిటల్ మార్గం. ఇవి భౌతిక బంగారాన్ని కొనకుండా, స్టాక్ మార్కెట్ ద్వారా బంగారం ధరలపై పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) అంటే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది మ్యూచువల్ ఫండ్ల తరహాలో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడయ్యే ఒక ఫండ్. బంగారం ధరల ఆధారంగా దీని విలువ మారుతూ ఉంటుంది. దీంతో భౌతిక బంగారం కొనకుండా డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు.ముఖ్యమైన ప్రయోజనాలుభౌతిక బంగారానికి ఉన్న భద్రతా సమస్యలు గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఉండవు.స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా కొనుగోలు లేదా అమ్మకం చేయవచ్చు.గోల్డ్ ఈటీఎఫ్‌లపై తక్కువ మొత్తాలతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు.లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్లకు సమానం.భౌతికంగా నిల్వ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి స్టోరేజ్ ఖర్చులు ఉండవు.పెట్టుబడి ఎలా పెట్టాలంటే..గోల్డ్ ఈటీఎఫ్‌లపై పెట్టుబడి పెట్టాలంటే డీమాట్ ఖాతా (Demat Account) అవసరం. స్టాక్ బ్రోకర్ ద్వారా గోల్డ్ ఈటీఎఫ్‌లు కొనుగోలు చేయవచ్చు. నిర్దిష్ట ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఈ ఫండ్లను నిర్వహిస్తాయి. -
ఆర్బీఎల్ బ్యాంక్ ఓపెన్ ఆఫర్ @ రూ. 280
న్యూఢిల్లీ: సాధారణ వాటాదారుల(పబ్లిక్) నుంచి ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ 26 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ప్రైవేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్ తాజాగా పేర్కొంది. ఇందుకు ఓపెన్ ఆఫర్ డిసెంబర్ 12న ప్రారంభమై 26న ముగియనున్నట్లు వెల్లడించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాల ప్రకారం షేరుకి రూ. 280 ధరలో 26 శాతం వాటాకు సమానమైన 41,55,86,443 షేర్ల కొనుగోలుకి ఎమిరేట్స్ ఎన్బీడీ ఆఫర్ చేపట్టనున్నట్లు తెలియజేసింది. గత నెలలో ఆర్బీఎల్ బ్యాంక్‌లో 60 శాతం వాటా సొంతం చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు యూఏఈ బ్యాంకింగ్ దిగ్గజం ఎమిరేట్స్ ఎన్బీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 26,853 కోట్లు వెచ్చించనుంది. విలువరీత్యా ఇది దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద డీల్‌కాగా.. అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగానూ నిలవనుంది. ఇటీవల జపనీస్ దిగ్గజం ఎస్ఎంబీసీ మరో దేశీ ప్రైవేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్‌లో 24.9 శాతం వాటా కొనుగోలు చేసిన నేపథ్యంలో ఎమిరేట్స్ డీల్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. యస్ బ్యాంక్ వాటాకు ఎస్ఎంబీసీ రూ. 16,333 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
లిస్టింగ్‌కు మరో 7 కంపెనీలు సై!
పబ్లిక్ ఇష్యూల తాకిడితో దలాల్ స్ట్రీట్ దుమ్మురేగుతోంది. తాజాగా మరో ఏడు కంపెనీల ఐపీఓలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లిస్టింగ్ బాట పట్టనున్నాయి. వీటిలో ముఖ్యంగా సాఫ్ట్‌బ్యాంక్ భారీగా పెట్టుబడులు పెట్టిన ఈ–కామర్స్ కంపెనీ మీషో, టెమాసెక్ దన్నుతో దూసుకెళ్తున్న షిప్ రాకెట్ ముందు వరుసలో ఉన్నాయి. ఈ ఏడు కంపెనీలు కలిపి దాదాపు రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. పబ్లిక్ ఆఫర్‌కు సెబీ ఓకే చెప్పిన ఇతర కంపెనీల్లో జర్మన్ గ్రీన్ స్టీల్ అండ్ పవర్, అలైడ్ ఇంజనీరింగ్ వర్క్స్, స్కైవేస్ ఎయిర్ సరీ్వసెస్, రాజ్‌పుటానా స్టెయిన్లెస్, మానిక ప్లాస్టెక్ ఉన్నాయి. ఈ ఏడాది మే–జూలై మధ్య ఐపీఓల కోసం ఈ కంపెనీలన్నీ దరఖాస్తు చేసుకోగా, సెబీ తాజాగా ఆమోముద్ర వేసింది.2025 కొత్త రికార్డ్...ప్రైమరీ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూలు ఈ ఏడాది రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 2025లో ఇప్పటికే మొత్తం 86 కంపెనీలు ప్రధాన స్టాక్ ఎక్సే్చంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో అరంగేట్రం చేశాయి. ఇవి దాదాపు రూ.1.4 లక్షల కోట్లను సమీకరించాయి. 2024లో 90 కంపెనీలు రూ.1.67 లక్షల కోట్లను సమీకరించగా.. ఈ ఏడాది ఈ రికార్డు తుడిచిపెట్టుకుపోనుంది. కాగా, బ్రోకరేజీ సంచలనం గ్రో (రూ.6,632 కోట్లు)తో పాటు పైన్ ల్యాబ్స్ (రూ.3,840 కోట్లు) తదితర బడా ఇష్యూలు ఈ ’వారంలోనే క్యూ కడుతున్నాయి.మీషో రూ.4,250 కోట్ల తాజా షేర్లుఈకామర్స్ దిగ్గజం మీషో తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.4,250 కోట్లు సమీకరించనుంది. అలాగే కంపెనీలో ప్రస్తుత వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూట్లో 17.57 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఈ ఇన్వెస్టర్లలో ఎలివేషన్, పీక్ ఎక్స్‌వీ, వెంచర్ హైవే, వై కాంబినేటర్ తదితర సంస్థలున్నాయి. తాజాగా సమీకరించే నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని క్లౌడ్ ఇన్ఫ్రా కంపెనీ మీషో టెక్నాలజీస్‌లో పెట్టుబడిగా వెచ్చించనుంది. మార్కెటింగ్, బ్రాండ్ కార్యకలాపాలు, ఇతర కంపెనీల కొనుగోళ్ల వంటి కార్పరేట్ అవసరాల కోసం కొంత మొత్తాన్ని ఖర్చు చేయనుంది.షిప్‌రాకెట్ @ రూ.2,000–2,500 కోట్లుఐపీఓ ద్వారా లాజిస్టిక్స్ కంపెనీ షిప్‌రాకెట్ సుమారు రూ.2,000–2,500 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇక గుజరాత్‌కు చెందిన జర్మన్ గ్రీన్ స్టీల్ అండ్ పవర్ రూ.450 కోట్ల విలువైన తాజా షేర్ల జారీతో పాటు ప్రమోటర్లు ఓఎఫ్ఎస్ ద్వారా 20 లక్షల షేర్లు విక్రయించనున్నారు. ఐపీఓ నిధులను గుజరాత్ ప్లాంట్ విస్తరణతో పాటు హైబ్రీడ్ పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, రుణాల తిరిగి చెల్లింపుల కోసం ఉపయోగించుకోనుంది. స్మార్ట్ ఎనర్జీ మీటర్ల తయారీ సంస్థ అలైడ్ ఇంజనీరింగ్ వర్క్స్ తాజా షేర్ల జారీ ద్వారా రూ.400 కోట్ల సమీకరణపై కన్నేసింది. ప్రమోటర్ కూడా ఓఎఫ్ఎస్ రూట్లో 75 లక్షల షేర్లు విక్రయించనున్నారు.మరోపక్క, ఎయిర్ కార్గో, లాజిస్టిక్స్ కంపెనీ స్కైవేస్ ఎయిర్ సర్వీస్ కూడా 3.29 కోట్ల తాజా ఈక్విటీ జారీ చేయనుంది. అలాగే ప్రమోటర్లు, వాటాదారులు ఓఎఫ్ఎస్లో 1.33 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించే ప్రణాళికల్లో ఉన్నారు. రాజ్‌పుటానా స్టెయిన్లెస్ 1.46 కోట్ల మేర తాజా ఈక్విటీ జారీతో నిధులు సమీకరించనుంది. ప్రమోటర్ మరో 62.5 లక్షల షేర్లు అమ్మనున్నారు. ముంబైకి చెందిన మానిక ప్లాస్టెక్ రూ.115 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ఓఎఫ్ఎస్ ద్వారా మరో రూ.1.5 కోట్ల విలువైన షేర్లను విక్రయించే ప్లాన్‌లో ఉంది.ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా? -
ఐపీవోకి ఫిన్‌టెక్ కంపెనీ.. రూ.2,080 కోట్లు టార్గెట్
ఫిన్‌టెక్ దిగ్గజం పైన్ ల్యాబ్స్ తమ పబ్లిక్ ఇష్యూ (IPO) కోసం సిద్ధమైంది. ఈ ఇష్యూ నవంబర్ 7న ప్రారంభమై 11న ముగియనుంది. దీని ద్వారా కంపెనీ రూ. 2,080 కోట్లు సమీకరించనుంది. డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద 8.23 కోట్ల షేర్లను పీక్ ఫిఫ్టీన్ పార్ట్నర్స్, పేపాల్, మాస్టర్‌కార్డ్ ఏషియా/పసిఫిక్, ఇన్వెస్కో మొదలైన ఇన్వెస్టర్లు, సహ వ్యవస్థాపకుడు లోక్‌వీర్ కపూర్ విక్రయించనున్నారు.ఫ్రెష్ ఇష్యూ ద్వారా సమీకరించి నిధులను రుణాల చెల్లింపు, ఐటీ అసెట్స్‌లో పెట్టుబడులకు, క్లౌడ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు మొదలైన వాటికి కంపెనీ వినియోగించుకోనుంది. తాజా ఇష్యూ ద్వారా కంపెనీ ముందుగా రూ. 2,600 కోట్లు సమీకరించాలని భావించింది. డిజిటల్ చెల్లింపుల ప్రాసెసింగ్ సేవలందించే పైన్ ల్యాబ్స్‌కి భారత్‌తో పాటు మలేషియా, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా కార్యకలాపాలు ఉన్నాయి. సెబీకి షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ ప్రాస్పెక్టస్.. లాజిస్టిక్స్ సేవల సంస్థ షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి సంబంధించి అప్డేట్ చేసిన ముసాయిదా ప్రాస్పెక్ట్స్ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. దీని ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,000 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ కింద రూ. 1,000 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, మరో రూ. 1,000 కోట్ల విలువ చేసే షేర్లను ప్రస్తుత షేర్హోల్డర్లు.. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు. తాజా ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను నెట్వర్క్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుకుంటుంది. -
బ్రోకరేజీ, ఏఎంసీ చార్జీల్లో కోత!?
మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు /ఏఎంసీలు) ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీలు (ఎక్స్పెన్స్ రేషియో), బ్రోకరేజీ చార్జీలపై సెబీ కీలక మార్పులను ప్రతిపాదించింది. క్యాష్ మార్కెట్ లావాదేవీలపై బ్రోకరేజీ చార్జీ ఇప్పటివరకు గరిష్టంగా 12 బేసిస్ పాయింట్లకు అనుమతి ఉండగా, 2 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. డెరివేటివ్స్‌కు బేసిస్ పాయింట్ల గరిష్ట పరిమితిని ఒక బేసిస్ పాయింట్‌కు కుదించింది.ఇక ప్రతీ మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడిదారుల నుంచి ఏఎంసీలు టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్) వసూలు చేస్తుంటాయి. అయితే, బ్రోకరేజీ, సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీసీ), జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ వంటి చార్జీలు ఇప్పటి వరకు టీఈఆర్‌లో కలసి ఉంటుండగా, ఇకపై వీటిని విడిగా చూపించాల్సి ఉంటుంది. దీనివల్ల అసలు పెట్టుబడుల నిర్వహణపై ఎంత చార్జీ పడుతుందో ఇన్వెస్టర్లకు తెలుస్తుందన్నది సెబీ ఉద్దేశం.టీఈఆర్ గరిష్ట పరిమితిలోనూ 15–20 బేసిస్ పాయింట్లను తగ్గించాలన్నది మరొక ప్రతిపాదన. పనితీరు ఆధారిత టీఈఆర్‌ను కూడా ప్రతిపాదించింది. 2018లో మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 5 బేసిస్ పాయింట్ల మేర అదనంగా వసూలు చేసుకునేందుకు సెబీ అనుమతించింది. ఇప్పుడు దీన్ని తొలగించనున్నట్టు పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై సూచనలకు సెబీ ఆహ్వానించింది.ఇన్వెస్టర్లకు ప్రయోజనంసెబీ ప్రతిపాదనలతో ఇన్వెస్టర్లకు వ్యయాలు తగ్గి, రాబడులు పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘బ్రోకరేజీ చార్జీలను క్రమబద్ధీకరించడం వల్ల ఇన్వెస్టర్లు పరిశోధన, అడ్వైజరీల కోసం రెట్టింపు చెల్లించాల్సిన అవసరం తప్పుతుంది’’అని ఆనంద్‌రాఠీ వెల్త్ జాయింట్ సీఈవో ఫెరోజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. జీఎస్టీ, ఎస్టీటీ, స్టాంప్ డ్యూటీలను టీఈఆర్‌లో కాకుండా విడిగా పేర్కొనడం వల్ల వివిధ పథకాల మధ్య అసలు వ్యయాలు ఎంతన్నది పోల్చుకోవడం సులభం అవుతుందన్నారు. ‘‘నికరంగా ఇన్వెస్టర్లకు టీఈఆర్ తగ్గుతుంది. దీంతో రాబడులు అధికం కావడం వల్ల అదనపు ప్రయోజనం పొందుతారు’’అని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో సందీప్ బగ్లా తెలిపారు.ఇదీ చదవండి: ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు -
ఐపీవోకి బోట్.. సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు
వేరబుల్స్ బ్రాండ్ ‘బోట్’ మాతృ సంస్థ ఇమేజిన్ మార్కెటింగ్ తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కి సంబంధించి అప్డేట్ చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (యూడీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసింది. దీని ప్రకారం కంపెనీ రూ. 1,500 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 500 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 1,000 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు.. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు.తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 225 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రూ. 150 కోట్ల మొత్తాన్ని బ్రాండ్..మార్కెట్ వ్యయాల కోసం కంపెనీ ఉపయోగించుకోనుంది. 2013లో అమన్ గుప్తా, సమీర్ మెహతా ప్రారంభించిన బోట్ సంస్థ ఆడియో పరికరాలు, స్మార్ట్ వేరబుల్స్, మొబైల్ యాక్సెసరీలు మొదలైనవి విక్రయిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 60 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. పబ్లిక్ ఇష్యూ కోసం బోట్ ప్రయత్నించడం ఇది రెండోసారి. రూ. 2,000 కోట్ల ఐపీవో కోసం 2022 జనవరిలో ముసాయిదా పత్రాలు సమర్పించింది. అప్పట్లో రూ. 900 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేసేట్లు, ఓఎఫ్ఎస్ కింద రూ.1,100 కోట్ల షేర్లు విక్రయించేట్లు ప్రతిపాదించింది.ఇదీ చదవండి: ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు -
ఐపీవోకు 5 కంపెనీలు సై
న్యూఢిల్లీ: 2025లో ఇప్పటివరకూ 84 కంపెనీలు మెయిన్‌బోర్డులో ఐపీవో చేపట్టి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. ఈ బాటలో ఐవేర్ రిటైలర్ లెన్స్‌కార్ట్, హెల్మెట్ల తయారీ స్టడ్స్ పబ్లిక్ ఇష్యూలకు ఈ వారం తెరలేవనుంది. కాగా.. తాజాగా మరో 5 కంపెనీలు సెబీ నుంచి అక్టోబర్ 14–24 మధ్య గ్రీన్ సిగ్నల్ పొందాయి. ఈ కంపెనీలన్నీ 2025 మే నుంచి జూలై మధ్య కాలంలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. తమిళనాడు కంపెనీ డైరీ ప్రొడక్టుల తమిళనాడు కంపెనీ మిల్కీ మిస్త్ డైరీ ఫుడ్ ఐపీవో ద్వారా రూ. 2,035 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,785 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, విస్తరణసహా పెరుందురై ప్లాంటు ఆధునీకరణకు వినియోగించనుంది. యోగుర్త్, క్రీమ్ చీజ్ తయారీతోపాటు.. ఐస్‌క్రీమ్ ఫ్రీజర్లు, చాకొలెట్ కూలర్లు, విజీ కూలర్ల ఏర్పాటుపై మరికొన్ని నిధులు వెచి్చంచనుంది. క్లౌడ్ కిచెన్స్‌తో.. క్లౌడ్ కిచెన్స్ నిర్వాహక బెంగళూరు కంపెనీ క్యూర్‌ఫుడ్స్ ఇండియా ఐపీవో ద్వారా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 4.85 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. కంపెనీ కేక్‌జోన్, నోమడ్ పిజ్జా బ్రాండ్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఇష్యూ నిధులను క్రిస్పీ క్రీమ్ క్లౌడ్ కిచెన్లతోపాటు రెస్టారెంట్లు, సెంట్రల్ కిచెన్ల ఏర్పాటు, విస్తరణకు వినియోగించనుంది. అనుబంధ సంస్థలు హాస్పిటాలిటీ సరీ్వసెస్, కేక్‌జోన్ ఫుడ్‌టెక్స్‌లో పెట్టుబడులు, రుణ చెల్లింపులకు సైతం నిధులను వెచ్చించనుంది. ఇండ్రస్టియల్ స్టీమ్ అండ్ గ్యాస్ గోప్యతా మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసి అనుమతి పొందిన స్టీమ్‌హౌస్ ఇండియా ప్రధానంగా ఇండ్రస్టియల్ స్టీమ్ అండ్ గ్యాస్‌ను సరఫరా చేస్తోంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 500 కోట్లు అందుకోవాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్టర్నేటివ్ పెట్టుబడులు గాజా క్యాపిటల్ బ్రాండుతో ఆల్టర్నేటివ్ పెట్టుబడులు నిర్వహించే గాజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ ఐపీవోకు వస్తోంది. తద్వారా రూ. 700 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ఈ ఏడాది మొదట్లో సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హాను నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా గాజా క్యాపిటల్ ఎంపిక చేసుకుంది. సిమెంట్ తయారీ కంపెనీ సిమెంట్ తయారీ కంపెనీ కనోడియా సిమెంట్ ఐపీవో ద్వారా 1.49 కోట్ల షేర్లను విక్రయించనుంది. వీటిని కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. దీంతో ఐపీవో నిధులు కంపెనీకి చేరబోవు.కొత్త కేలండర్ ఏడాదిలో ఏకధాటిగా దూకుడు చూపుతున్న ప్రైమరీ మార్కెట్లు మరింత కళకళలాడనున్నాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు 5 కంపెనీలను అనుమతించింది. ఈ జాబితాలో మిల్కీ మిస్త్ డైరీ ఫుడ్, క్యూర్‌ఫుడ్స్ ఇండియా, స్టీమ్‌హౌస్ ఇండియా, గాజా ఆల్టర్నేటివ్ ఏఎంసీ, కనోడియా సిమెంట్ చేరాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి బిజినెస్ డెస్క్ -
లిస్టింగ్‌కు 7 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ప్రైమరీ మార్కెట్లు ఇటీవల దుమ్ము రేపుతున్న నేపథ్యంలో తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 7 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీ అనుమతించిన జాబితాలో షాడోఫాక్స్ టెక్నాలజీస్, రేజన్ సోలార్, ఏఆర్‌సీఐఎల్(ఆర్సిల్), సుదీప్ ఫార్మా, సేఫెక్స్ కెమికల్స్(ఇండియా), ఆగ్‌కాన్ ఎక్విప్మెంట్స్ ఇంటర్నేషనల్, పీఎన్‌జీఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ చేరాయి. ఈ కంపెనీలన్నీ 2025 జూన్–ఆగస్ట్ మధ్య కాలంలో సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు వేసిన ప్రణాళికలు అమలుకానున్నాయి. వివరాలు చూద్దాం.. లాజిస్టిక్స్ సర్వీసులు గోప్యతా మార్గంలో లాజిస్టిక్స్ సర్వీసులందించే షాడోఫాక్స్ టెక్నాలజీస్ సెబీకి జూలైలో దరఖాస్తు చేసింది. ఐపీవో ద్వారా రూ. 2,000–2,500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు తాజా ఈక్విటీ జారీసహా.. ప్రస్తుత వాటాదారులు షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను సామర్థ్య విస్తరణ, వృద్ధి, నెట్వర్క్ బిజినెస్‌పై వెచి్చంచనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రుణ పునర్వ్యవస్థీకరణ ఆస్తుల(రుణాల) పునర్వ్యవస్థీకరణ కంపెనీ ఏఆర్‌సీఐఎల్(ఆర్సిల్) ఐపీవోలో భాగంగా 10.54 కోట్ల ఈక్వటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని పూర్తిగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఎవెన్యూ క్యాపిటల్(న్యూయార్క్) 6.87 కోట్ల షేర్లు, పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ 1.94 కోట్ల షేర్లు, జీఐసీ 1.62 కోట్ల షేర్లు చొప్పున విక్రయించనున్నాయి. కంపెనీ ప్రధానంగా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి ఒత్తిడిలోపడ్డ రుణాలను సొంతం చేసుకుని పరిష్కార ప్రణాళికలను అమలు చేయడం ద్వారా రికవరీకి ప్రయతి్నంచే సంగతి తెలిసిందే. సోలార్ సెల్ తయారీ గుజరాత్ కంపెనీ రేజన్ సోలార్ ఐపీవోలో భాగంగా రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. నిధులలో రూ. 1,265 కోట్లు 3.5 గిగావాట్ల సోలర్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకుగాను సొంత అనుబంధ సంస్థ రేజన్ ఎనర్జీకి అందించనుంది. 2017లో ఏర్పాటైన కంపెనీ సోలార్ ఫొటొవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీలో దేశీయంగా టాప్–10లో ఒకటిగా నిలుస్తోంది. 2025 మార్చికల్లా 6 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. స్పెషాలిటీ కెమికల్స్ ఐపీవోలో భాగంగా స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ సేఫెక్స్ కెమికల్స్(ఇండియా) రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 3.57 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 1991లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా బ్రాండెడ్ ఫార్ములేషన్స్, స్పెషాలిటీ కెమికల్స్, కాంట్రాక్ట్ తయారీలో ఉంది. పీఈ సంస్థ క్రిస్ క్యాపిటల్ 44.8 శాతం వాటా కలిగి ఉంది. రెంటల్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ అద్దెకిచ్చే ఆగ్‌కాన్ ఎక్విప్మెంట్స్ ఇంటర్నేషనల్ ఐపీవోలో భాగంగా రూ. 332 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 94 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. పీఎన్ గాడ్గిల్ ద్వారా ఐపీవో ద్వారా పీఎన్‌జీఎస్ రెవా డైమండ్ జ్యువెలరీ రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. పీఎన్ గాడ్గిల్ అండ్ సన్స్ నుంచి డైమండ్ జ్యువెలరీ బిజినెస్‌ను స్లంప్ సేల్ ద్వారా సొంతం చేసుకుంది. ఇలా ఏర్పాటైన కంపెనీ విడిగా సొంత గుర్తింపుతో డైమండ్ జ్యువెలరీ బిజినెస్ నిర్వహిస్తోంది. కలరింగ్ ఏజెంట్స్ 1989లో ఏర్పాటైన వడోదర కంపెనీ సుదీప్ ఫార్మా ఐపీవోలో భాగంగా రూ. 95 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా మరో కోటి షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. కంపెనీ ప్రధానంగా 100 రకాలకుపైగా కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ తయారు చేస్తోంది. వీటిని ఫార్మా, ఫుడ్, న్యూట్రిషన్ పరిశ్రమల్లో వినియోగిస్తారు. -
అమీర్ చంద్ ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: బాస్మతి బియ్యం ఎగుమతి సంస్థ అమీర్ చంద్ జగదీష్ కుమార్(ఎక్స్‌పోర్ట్స్) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూ ద్వారా హర్యానా కంపెనీ రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఏడాది జూన్‌లో సెబీకి దరఖాస్తు చేసిన కంపెనీ తాజాగా అనుమతి పొందింది. ఐపీవో నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఏరోప్లేన్ బ్రాండు కంపెనీ ప్రధానంగా బాస్మతి బియ్యం ప్రాసెసింగ్‌తోపాటు ఎగుమతులు చేపడుతోంది. దేశీయంగా లిస్టెడ్ కంపెనీలు కేఆర్‌బీఎల్, ఎల్టీ ఫుడ్స్‌సహా సర్వేశ్వర్ ఫుడ్స్ తదితరాలతో పోటీ పడుతోంది. 2024 డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో రూ. 1,421 కోట్ల ఆదాయం, రూ. 49 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
సెబీకి డ్యూరోఫ్లెక్స్ ప్రాస్పెక్టస్
న్యూఢిల్లీ: మ్యాట్రెస్‌ల తయారీ సంస్థ డ్యూరోఫ్లెక్స్ తమ పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచింది. దీని ప్రకారం రూ. 183.6 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.25 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కొత్తగా 120 స్టోర్స్ (కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్ – కోకో) ప్రారంభించేందుకు, ప్రస్తుత స్టోర్స్.. తయారీ ప్లాంటు లీజులు–అద్దెలు చెల్లించేందుకు, మార్కెటింగ్ వ్యయాలు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. 1963లో ప్రారంభమైన డ్యూరోఫ్లెక్స్, మార్కెట్ వాటాపరంగా దేశీయంగా టాప్ 3 మ్యాట్రెస్‌ల తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. డ్యూరోఫ్లెక్స్, స్లీపీహెడ్ బ్రాండ్స్ పేరిట మ్యాట్రెస్లు, సోఫాలు, ఇతరత్రా ఫర్నిచర్లు మొదలైనవి విక్రయిస్తోంది. 2025 జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా 73 కోకో స్టోర్స్, 5,500 పైగా జనరల్ ట్రేడ్ స్టోర్స్ ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,057 కోట్లుగా ఉన్న ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,134 కోట్లకు చేరింది. -
ఆరు ఐపీవోలకు గ్రీన్‌సిగ్నల్
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరో ఆరు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవో) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐవేర్ రిటైల్ సంస్థ లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్, వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్, టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియా, కార్డీలియా క్రూయిజెస్ నిర్వహణ సంస్థ వాటర్‌వేస్ లీజర్ టూరిజం, కాటన్ యార్న్‌ల తయారీ కంపెనీ శ్రీరామ్ ట్విస్టెక్స్, ఇండ్రస్టియల్ ల్యామినేట్స్ ఉత్పత్తి చేసే లామ్టఫ్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి సుమారు రూ. 6,500 కోట్లు పైగా సమీకరించవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్–జూలై మధ్య ఈ ఆరు కంపెనీలు దరఖాస్తు చేసుకోగా, సెపె్టంబర్ 26 – అక్టోబర్ 3 మధ్య అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది. 2025లో 80 కంపెనీలు ఇప్పటికే ఐపీవోల ద్వారా నిధులు సమీకరించుకోగా, ఈ నెలలో మరిన్ని సంస్థలు లైనులో ఉన్నాయి.లెన్స్కార్ట్తాజాగా షేర్ల జారీ ద్వారా లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ రూ. 2,150 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 13.22 కోట్ల షేర్లు విక్రయించనున్నారు. ఐపీవో నిధులను కొత్త స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు, స్టోర్ల లీజులు–అద్దెలు మొదలైన వాటి చెల్లింపులకు, టెక్నాలజీ–క్లౌడ్ ఇన్ఫ్రాపై ఇన్వెస్ట్ చేసేందుకు, బ్రాండ్ మార్కెటింగ్‌కు, ఇతర సంస్థ కొనుగోలుకు, ఇతరత్రా సాధారణ కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్రూ. 468.2 కోట్ల వరకు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రస్తుత వాటాదారులు 5.84 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 82 కోట్లను 117 కంపెనీ ఆపరేటెడ్ కంపెనీ ఓన్డ్ (కోకో)–రెగ్యులర్ స్టోర్స్, ఒక కోకో–జంబో స్టోర్ ఏర్పాటుకు; కొత్త పరికరాల కొనుగోలుకు రూ. 15.4 కోట్లు; ప్రస్తుత స్టోర్ల లీజులు, అద్దెల కోసం రూ. 145 కోట్లు; మార్కెటింగ్ కోసం రూ. 108 కోట్లను కంపెనీ వినియోగించుకోనుంది.టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియాఇష్యూ ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ టెనెకో మారిషస్ హోల్డింగ్స్ ఈ షేర్లను విక్రయించనుంది. వాటర్‌వేస్ లీజర్ టూరిజంకొత్తగా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.727 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 552.53 కోట్లను తమ అనుబంధ సంస్థ బేక్రూయిజ్ షిప్పింగ్ అండ్ లీజింగ్‌కి సంబంధించిన అడ్వాన్స్‌లు, లీజులు మొదలైన వాటిని చెల్లించేందుకు, మిగతా మొత్తాన్ని కార్పొరేట్ అవసరాలకు కంపెనీ ఉపయోగించుకోనుంది. శ్రీరామ్ ట్విస్టెక్స్1.06 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈ నిధులను సొంత అవసరాల కోసం 6.1 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంటు, 4.2 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంటు ఏర్పాటు కోసం; అలాగే రుణాల చెల్లింపు, ఇతరత్రా నిర్వహణ మూలధన అవసరాల కోసం వినియోగించుకోనుంది.లామ్టఫ్కొత్తగా 1 కోటి షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు 20 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ కింద విక్రయించనున్నారు. తెలంగాణలో తమకున్న తయారీ ప్లాంటు విస్తరణకు, నిర్వహణ మూలధనం, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం నిధులను కంపెనీ ఉపయోగించుకుంటుంది.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
సోషల్ మీడియాలో మోసపూరిత కంటెంట్ తొలగింపు
సోషల్ మీడియా వేదికలపై ఇన్వెస్టర్లను మోసగించే చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను గత 18 నెలల్లో లక్షకు పైగా తొలగించినట్టు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మోసగాళ్ల బారి నుంచి ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. చట్టవిరుద్ధమైన కంటెంట్ విషయాన్ని గూగుల్, మెటా తదితర ప్లాట్‌ఫామ్‌ల దృష్టికి తీసుకెళ్లి వాటిని తొలగించే దిశగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.ఎన్ఎస్ఈలో ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్ల అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మోసపూరిత కంటెంట్‌ను గుర్తించడంతో టెక్నాలజీ సాయపడుతున్నట్టు తెలిపారు. క్యాపిటల్ మార్కెట్లపై కేవలం 36 శాతం మందికే అధికంగా లేక మోస్తరు అవగాహన ఉందన్న ఇటీవలి సర్వే ఫలితాలను ప్రస్తావిస్తూ.. ఈ పరిస్థితుల్లో మోసపూరిత కంటెంట్ మెజారిటీ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే అవకాశం లేకపోలేదన్నారు.‘విశ్వాసం దెబ్బతింటే అప్పుడు ఆర్థిక వ్యవస్థకు చోదకం కుంటుపడుతుంది. పెట్టుబడులకు ఇన్వెస్టర్లు వెనకాడతారు’అని పాండే పేర్కొన్నారు. అందుకే ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించడం సెబీకి కీలక ప్రాధాన్యంగా తెలిపారు. ఈ దిశగా ఎన్నో చర్యలు చేపట్టినట్టు చెప్పారు.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
లిస్టింగ్ బాటలో మరిన్ని కంపెనీలు
ఈ ఏడాది ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ మరోవైపు ప్రైమరీ మార్కెట్లు మాత్రం చెలరేగిపోతున్నాయి. ఈ నెలలోనూ (అక్టోబర్) సెకండరీ మార్కెట్లను ఓవర్టేక్ చేయనున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి హైదరాబాద్ కంపెనీలు విరూపాక్ష ఆర్గానిక్స్, ఆర్వీ ఇంజినీరింగ్ ఇటీవలే ప్రాస్పెక్టస్‌లు దాఖలు చేయగా.. అదే బాటలో మరో 5 కంపెనీలు నిధుల వేటలో పడ్డాయి. ఈ జాబితాలో రన్వాల్ డెవలపర్స్, లాల్‌బాబా ఇంజినీరింగ్, స్టెరిలైట్ ఎలక్ట్రిక్, సీజే డార్సిల్ లాజిస్టిక్స్, జెరాయ్ ఫిట్నెస్ చేరాయి. 2025లో ఇప్పటివరకూ మెయిన్‌బోర్డులో 77 కంపెనీలు లిస్ట్‌కాగా.. ఈ నెలలో టాటా ఇన్వెస్ట్మెంట్, ఎల్జీ ఎల్రక్టానిక్స్ తదితర దిగ్గజాల ఐపీవోలకు తెరలేవనుంది. రూ. 2,000 కోట్లపై కన్ను రియల్టీ రంగ కంపెనీ రన్వాల్ డెవలపర్స్ ఐపీవో ద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ ముంబై కంపెనీ రూ. 1,700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్ సందీప్ సుభాష్ రన్వాల్ మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ సహా అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 1988లో ఏర్పాటైన కంపెనీ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణె నగరాల్లో రిటైల్, వాణిజ్య ప్రాపరీ్టలను నిర్వహిస్తోంది. 1,500 కోట్ల సమీకరణ .. రూ.1,500 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో సెబీకి స్టెరిలైట్ ఎలక్ట్రిక్ ఐపీవో పత్రాలను దాఖలు చేసింది. కార్యకలాపాల విస్తరణ, రుణ భారం తగ్గింపు లక్ష్యాలతో కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందులో భాగంగా 77.9 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇంతే పరిమాణంలో షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్లు ట్విన్ స్టార్ ఓవర్సీస్తోపాటు కైలాష్ చంద్ర మహేశ్వరి, జాకబ్ జాన్, రామ్గురు రాధాకృష్ణన్ షేర్లను విక్రయించనున్నారు. సెపె్టంబర్ 20 నాటికి కంపెనీకి రూ.600 కోట్ల రుణ భారం ఉంది. ఐపీవోలో సమీకరించే నిధుల్లో రుణ చెల్లింపులకు రూ.350 కోట్లు వినియోగించాలన్న ప్రణాళికతో ఉంది. మిగిలిన నిధులను విస్తరణ కార్యకలాపాలకు వెచి్చంచనుంది. లాల్‌బాబా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కార్యకలాపాలు నిర్వహించే లాల్‌బాబా ఇంజనీరింగ్ ఐపీవోలో భాగంగా తాజా షేర్ల జారీ రూపంలో రూ.630 కోట్ల నిధులను, ప్రమోటర్ల వాటాల విక్రయ రూపంలో మరో రూ.370 కోట్లను సమీకరించనుంది. తాజా షేర్ల జారీ రూపంలో సమకూరే నిధుల నుంచి రూ.271 కోట్లను మూలధన వ్యయాల కోసం వెచ్చించనుంది. హల్దియా ప్లాంట్ విస్తరణకు కేటాయించనుంది. రూ.209 కోట్లను రుణ చెల్లింపులకు ఉపయోగించుకోనుంది. లాల్‌బాబా ఇంజనీరింగ్ సంస్థ సీమ్‌లెస్ ట్యూబులు, ప్రెసిషన్ ఫోర్జింగ్స్, ఇంటెగ్రేటెడ్ రైల్ స్టిస్టమ్స్ తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సీజే డార్సిల్స్ లాజిస్టిక్స్ సమగ్ర లాజిస్టిక్స్ సరీ్వసుల సంస్థ సీజే డార్సిల్ లాజిస్టిక్స్ భారత్‌తో పాటు అంతర్జాతీయంగా ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు సరుకు రవాణా, వేర్‌హౌసింగ్ తదితర సేవలను అందిస్తోంది. సెబీకి సమరి్పంచిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ 2.64 కోట్ల వరకు షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు 99.05 లక్షల షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కొత్త యంత్రపరికరాల కొనుగోలు, రుణాల చెల్లింపునకు కంపెనీ వినియోగించుకోనుంది.జెరాయ్ ఫిట్నెస్ జిమ్ ఎక్విప్మెంట్ సరఫరా చేసే జెరాయ్ ఫిట్నెస్ ప్రమోటర్లు 43.92 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ విధానంలో విక్రయించనున్నారు. ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి కంపెనీకి ఐపీవో ద్వారా నిధులేమీ లభించవు. దేశ, విదేశాల్లో కమర్షియల్ జిమ్‌లు, హోటళ్లు, కార్పొరేషన్లు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు జెరాయ్ ఎక్విప్మెంట్ను అందిస్తోంది. జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆ్రస్టేలియా, సెర్బియా, స్వీడన్ తదితర దేశాలకు కూడా ఎగుమతులు చేస్తోంది. దేశవ్యాప్తంగా 14 ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లు ఉన్నాయి. -
స్టాక్ మార్కెట్‌పై కుటుంబాల ఆసక్తి
న్యూఢిల్లీ: దేశీయంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపట్ల కుటుంబాలలో ఆసక్తి కనిపిస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన సర్వే పేర్కొంది. కుటుంబ ఆదాయాలలో 10 శాతం సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. కుటుంబీకులలో 63 శాతం కనీసం ఒక మార్కెట్ ప్రొడక్ట్‌పై అవగాహన ఉన్నట్లు సెబీ ఇన్వెస్టర్ల సర్వే వెల్లడించింది. సెక్యూరిటీలలో పట్టణ ప్రాంతాల నుంచి 15 శాతం పార్టిసిపేషన్ కనిపించగా.. గ్రామీణ ప్రాంతాలలో 6 శాతమే పెట్టుబడులు నమోదయ్యాయి. రాష్ట్రాలలో 20.7 శాతం వాటాతో ఢిల్లీ ఆధిపత్యంవహించగా.. 15.4 శాతం కుటుంబాల పార్టిసిపేషన్‌తో గుజరాత్ తదుపరి ర్యాంకులో నిలిచింది. అయితే 36 శాతంమంది ఇన్వెస్టర్లకు మాత్రమే సెక్యూరిటీ మార్కెట్లపట్ల ఓమాదిరి అవగాహన ఉన్నట్లు సర్వే తెలియజేసింది. దీంతో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ విస్తరించవలసిన అవసరం ఉన్నట్లు అభిప్రాయపడింది. పెట్టుబడి రక్షణకే ఓటు సెబీ తాజా సర్వే ప్రకారం 80 శాతం కుటుంబీకులు అధిక రిటర్నులకంటే పెట్టుబడి పరిరక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వెరసి వివిధ వయసులవారు రిస్క్ తీసుకోవడంలో విముఖత చూపుతున్నట్లు సర్వే తెలియజేసింది. నిజానికి జెన్‌జెడ్ కుటుంబీకులలోనూ 79 శాతంమంది రిస్‌్కలకు వెనకాడుతున్నట్లు పేర్కొంది. ప్రధానంగా ఫైనాన్షియల్ ప్రొడక్టులలో క్లిష్టత, అవగాహనాలేమి, విశ్వాసరాహిత్యం, నష్టాల భయం వంటి అంశాలు అధికశాతం మందిలో పెట్టుబడులకు అడ్డుతగులుతున్నట్లు వివరించింది. దేశీ మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ)తోపాటు.. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ తదితర మార్కెట్ ఇన్ఫ్రా సంస్థల సహకారంతో సెబీ ఇన్వెస్టర్ల సర్వే చేపట్టింది. సుమారు 400 పట్టణాలలోని 90,000 కుటుంబాలు, 1,000 గ్రామాలలో సర్వే నిర్వహించింది. -
ఫోన్‌పే ఐపీవో బాట
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవో నిర్వహణ కోసం కంపెనీ కొటక్ మహీంద్రా క్యాపిటల్, జేపీమోర్గాన్ చేజ్, సిటీగ్రూప్, మోర్గాన్ స్టాన్లీని ఎంపిక చేసుకున్నట్లు జూన్‌లో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా.. గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ గ్రూప్ సంస్థ 2023లో ఇన్వెస్టర్ల నుంచి 85 కోట్ల డాలర్లు(రూ. 7,021 కోట్లు) సమీకరించింది. 12 బిలియన్ డాలర్ల(రూ. లక్ష కోట్లు) విలువలో జనరల్ అట్లాంటిక్, వాల్‌మార్ట్, రిబ్బిట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ తదితరాలు ఫోన్‌పేలో ఇన్వెస్ట్ చేశాయి. ఐపీవో ద్వారా రూ. 12,000 కోట్లు సమీకరించే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది(2024–25) కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలు తగ్గి రూ. 1,727 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇవి రూ. 1,996 కోట్లుగా నమోదయ్యాయి. టోఫ్లర్ వివరాల ప్రకారం మొత్తం ఆదాయం 40 శాతంపైగా జంప్‌చేసి రూ. 7,115 కోట్లను తాకింది. డిజిటల్ పేమెంట్ సొల్యూషన్లతోపాటు కంపెనీ ఇన్సూరెన్స్, రుణాలు, వెల్త్ మేనేజ్మెంట్ తదితర సర్వీసులు సైతం అందిస్తోంది. ఇటీవల కాలంలో గ్రో, ఫిజిక్స్‌వాలా, షాడోఫాక్స్ టెక్నాలజీస్, షిప్‌రాకెట్, బోట్, టాటా క్యాపిటల్ సైతం గోప్యతా మార్గంలోనే సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన విషయం విదితమే. గతేడాది(2024)లో స్విగ్గీ, విశాల్ మెగామార్ట్ ఇదే విధానంలో లిస్టింగ్‌కు వెళ్లడం గమనార్హం! -
ఎస్ఎస్ఈలో మరిన్ని ట్రస్ట్‌లకు చోటు
సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎస్ఎస్ఈ) ప్లాట్‌ఫామ్‌ను మరింత విస్తృతపరిచేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నిర్ణయించింది. దీనిలో భాగంగా ఎస్ఎస్ఈ ద్వారా నిధుల సమీకరణకు మరిన్ని చారిటబుల్ ట్రస్ట్‌లను అనుమతించనుంది. ఈ బాటలో లిస్టింగ్ పరిధిని పెంచుతూ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇందుకు లాభాపేక్షలేని సంస్థ(ఎన్పీవో)ల నిర్వచనాన్ని విస్తృతం చేసింది. దీంతో ఎస్ఎస్ఈ లిస్టింగ్ పరిధిలోకి మరిన్ని సంస్థలు చేరనున్నాయి.ఇందుకు అనుగుణంగా 1908 ఇండియన్ రిజిస్ట్రేషన్ చట్టం, సంబంధిత రాష్ట్ర సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం, 1956 కంపెనీల చట్టంలో భాగంగా సెక్షన్ 25కింద రిజిస్టరైన కంపెనీలను తాజా మార్గదర్శకాలలోకి చేర్చింది. అయితే ఈ సంస్థల జవాబుదారీతనాన్ని పెంచుతూ సంబంధిత నిబంధనలను సైతం ప్రకటించింది. ఎలాంటి సెక్యూరిటీలను లిస్ట్చేయని ఎన్‌పీవోలు ఏఐఆర్ నివేదికను సొంతంగా రూపొందించి దాఖలు చేయవలసి ఉంటుంది. తద్వారా ఎన్పీవో ప్రధాన కార్యకలాపాలతోపాటు ఏడాది పొడవునా చేపట్టిన ప్రోగ్రామ్‌లు, మధ్యవర్తిత్వాలు, ప్రాజెక్టులను వివరణలతో తెలియజేయవలసి ఉంటుంది. ఆయా సంస్థల ప్రాధాన్యతను గుర్తించేలా వీటిని రూపొందించవలసి ఉంటుంది.ఇదీ చదవండి: మారుతీ కార్ల ధరలు తగ్గాయ్! -
అదానీ స్టాక్స్‌లో ర్యాలీ..
అదానీ గ్రూప్ స్టాక్‌లు ఈ రోజు మార్కెట్ సెషన్ ప్రారంభం నుంచి భారీగా పుంజుకున్నాయి. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీతోపాటు అదానీ పోర్ట్స్, అదానీ పవర్ వంటి గ్రూప్ కంపెనీలపై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొట్టిపారేయడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.నేటి మార్కెట్ ప్రారంభ సెషన్ నుంచి అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం లాభపడింది.అదానీ ఎంటర్ ప్రైజెస్ 4.3 శాతం లాభపడింది.అదానీ పవర్ 7.4 శాతం పెరిగింది.అదానీ పోర్ట్స్ 2 శాతం పుంజుకుంది.అదానీ గ్రీన్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 4 శాతం చొప్పున పెరిగాయి.జనవరి 2023లో హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ సంస్థలు డబ్బు మళ్లించడానికి మూడు కంపెనీలు - అడికార్ప్ ఎంటర్ ప్రైజెస్, మైల్ స్టోన్ ట్రేడ్ లింక్స్, రెహ్వార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లను ఉపయోగించిందని ఆరోపించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మానిప్యులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై వివరణాత్మక దర్యాప్తు తర్వాత అవి పూర్తీగా నిరాధారమైనవని సెబీ రెండు వేర్వేరు వివరణాత్మక ఉత్తర్వులలో తెలిపింది.ఇదీ చదవండి: ఇండియా ఏఐ మిషన్‌లోకి ఎనిమిది కంపెనీలు -
ఆ ఆరోపణలు తప్పు.. అదానీకి సెబీ క్లీన్ చిట్
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు సంబంధించి అదానీ గ్రూప్‌నకు, దాని చైర్మన్ గౌతమ్ అదానీకి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇన్ సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మానిప్యులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై వివరణాత్మక దర్యాప్తు తర్వాత అవి పూర్తీగా నిరాధారమైనవని సెబీ రెండు వేర్వేరు వివరణాత్మక ఉత్తర్వులలో తెలిపింది.హిండెన్ బర్గ్ 2023 జనవరిలో అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలతో ఒక నివేదికను వెల్లడించింది. అడికార్ప్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మైల్ స్టోన్ ట్రేడ్ లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెహ్వార్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను వాడుకుని పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలైన అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ లకు నిధులు సమకూర్చడానికి వివిధ అదానీ గ్రూప్ కంపెనీల నుండి నిధులను మళ్లించారని ఆరోపించింది.అయితే అదానీ గ్రూపుపై ఈ అభియోగాలను సెబీ కొట్టేసింది. అదానీ గ్రూప్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన గౌతమ్ అదానీ.. పడిన ప్రతిసారి మరింత గట్టిగా పైకి లేస్తామన్నారు. తమ సంస్థను నష్టపరిచేందుకు కొన్ని వర్గాల మీడియా స్వార్థ ప్రయోజనం కోసం ఆరోపణలు చేసిందని వెల్లడించారు. -
7 ఐపీవోలకు సెబీ గ్రీన్ సిగ్నల్
కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్లు ఊగిసలాడుతున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సెబీ తాజాగా 7 కంపెనీలను అనుమతించింది. జాబితాలో కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్,కెనరా రొబెకో, హీరో మోటర్స్ తదితర కంపెనీలున్నాయి. ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటికే 55 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టడం ద్వారా సుమారు రూ. 75,000 కోట్లు సమీకరించాయి. మరో 12 కంపెనీలు రెండు, మూడు వారాల్లో ఐపీవోకు రానున్నాయి. తాజా వివరాలు చూద్దాం.. దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఇటీవల జోరుగా లిస్టవుతున్న పలు కంపెనీల బాటలో మరో 7 కంపెనీలు ఐపీవో చేపట్టేందుకు దారి ఏర్పడింది. సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిధుల సమీకరణ బాటలో సాగనున్నాయి. ఐపీవోకు అనుమతి పొందిన కంపెనీల జాబితాలో కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, కెనరా రొబెకో ఏఎంసీ, హీరో మోటార్స్సహా ఎమ్వీ ఫొటోవోల్టాయిక్ పవర్, పైన్ ల్యాబ్స్, మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్, ఎంటీఆర్ ఫుడ్స్ చేరాయి. ఈ ఏడాది(2025) ఏప్రిల్–జూలై మధ్య ఈ కంపెనీలన్నీ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వెరసి ఈ 7 కంపెనీలు ఉమ్మడిగా రూ. 10,000 కోట్లకుపైగా సమీకరించే వీలున్నట్లు మర్చంట్ వర్గాలు తెలియజేశాయి. అత్యధిక శాతం కంపెనీలు ఈక్విటీ జారీ నిధులను ప్రధానంగా వ్యాపార విస్తరణ, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నాయి. మరోవైపు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత వాటాదారులకు తమ పెట్టుబడులు విక్రయించేందుకు సైతం వీలు కల్పించనున్నాయి. జీవిత బీమా సంస్థ పీఎస్‌యూ దిగ్గజం కెనరా బ్యాంక్ బీమా అనుబంధ సంస్థ కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ తాజాగా క్లియరెన్స్ ఇచ్చినట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఇష్యూలో భాగంగా సంస్థ 23.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో కెనరా బ్యాంక్ 13.77 కోట్ల షేర్లు, ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) 9.5 కోట్ల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ఈ బాటలో హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్(ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ సైతం 47 లక్షల షేర్లు విక్రయించనుంది. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్‌ను కెనరా బ్యాంక్, పీఎన్బీ, హెచ్ఎస్బీసీ గ్రూప్ ప్రమోట్ చేశాయి. 2024 మార్చికల్లా నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం)రీత్యా మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది.ఫిన్‌టెక్ కంపెనీపీఈ దిగ్గజాలు టెమాసెక్, పీక్ 15 పార్ట్నర్స్ తదితరాలకు పెట్టుబడులున్న ఫిన్‌టెక్ కంపెనీ పైన్ ల్యాబ్స్ ఐపీవోలో భాగంగా రూ. 2,600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రస్తుత వాటాదారులు మరో 14.78 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. లోక్‌వీర్ కపూర్సహా.. టెమాసెక్, పీక్ 15 పార్ట్నర్స్, యాక్టిస్ తదితర సంస్థలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 870 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 760 కోట్లు క్లౌడ్, డిజిటల్ చెక్ఔట్ పాయింట్లు తదితర ఐటీ మౌలికసదుపాయాలపై వెచి్చంచనుంది.రూ. 1,200 కోట్లపై కన్నుపబ్లిక్ ఇష్యూలో భాగంగా హీరో మోటార్స్ రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,200 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ప్రమోటర్ సంస్థలలో ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ. 390 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 285 కోట్లు రుణ చెల్లింపులకు, యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్‌లోగల యూనిట్ విస్తరణకు రూ. 237 కోట్లు(పరికరాల కొనుగోలుకి) వెచి్చంచనుంది.అసెట్ మేనేజ్మెంట్ఐపీవోలో భాగంగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ).. కెనరా రొబెకో ఏఎంసీ 4.98 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని సంస్థ ప్రమోటర్లు కెనరా బ్యాంక్(2.59 కోట్ల షేర్లు), ఓరిక్స్ కార్పొరేషన్ యూరోప్ ఎన్వీ(2.39 కోట్ల షేర్లు) ఆఫర్ చేయనున్నాయి. వెరసి ఐపీవో నిధులు కంపెనీకికాకుండా ప్రమోటర్లకు చేరనున్నాయి.సోలార్ పరికరాలుఐపీవో ద్వారా సోలార్ పరికరాల తయారీ కంపెనీ ఎమ్వీ ఫొటొవోల్టాయిక్ పవర్ రూ. 3,000 కోట్లు అందుకోవాలని ప్రణాళికలు వేసింది. వీటిలో తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 2,144 కోట్లు, ప్రమోటర్ల షేర్ల విక్రయం ద్వారా మరో రూ. 856 కోట్లు చొప్పున సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,608 కోట్లు అనుబంధ సంస్థలతోపాటు కంపెనీ రుణ చెల్లింపులకు వినియోగించనుంది. ఒర్క్లా ఇండియాఎంటీఆర్ ఫుడ్స్, ఈస్టర్న్ బ్రాండ్లతో సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు విక్రయించే ఒర్క్లా ఇండియా(మాతృ సంస్థ) ఐపీవో ద్వారా 2.28 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని కంపెనీ ప్రమోటర్లతోపాటు.. ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. మణిపాల్ పేమెంట్బ్యాంకింగ్ సేవలు, స్మార్ట్ కార్ట్ తయారీ కంపెనీ మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,200 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది.ఇదీ చదవండి: సెస్‌ల లక్ష్యం నీరుగారుతోందా? -
ఇక భారీ ఐపీవోలకు జోష్
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా భారీ కంపెనీల పబ్లిక్ ఇష్యూ నిబంధనలను సరళీకరించేందుకు నిర్ణయించింది. పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా విషయంలో వెసులుబాటును కల్పించనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పరిమితినీ సవరించనుంది. వీటితో పాటు పలు తాజా ప్రతిపాదనలను శుక్రవారం(12న) నిర్వహించిన బోర్డు సమావేశంలో సెబీ అనుమతించింది. వివరాలు చూద్దాం..ముంబై: అతి భారీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టడంలో దన్నునిస్తూ సెబీ తాజాగా పలు వెసులుబాట్లకు తెరతీస్తోంది. ప్రధానంగా పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా కల్పించే అంశంలో గడువును సవరించేందుకు నిర్ణయించింది. దీంతో నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తదితర మెగా అన్‌లిస్టెడ్ కంపెనీలు లబ్ది పొందే వీలుంది. తాజా మార్గదర్శకాలు అమల్లోకి వస్తే దిగ్గజ కంపెనీలు లిస్టింగ్‌లోనే భారీగా వాటాను విక్రయించవలసిన అవసరం ఉండదు. పబ్లిక్కు కనీస వాటా కల్పించే విషయంలో తగినంత గడువుకు వీలు చిక్కనుంది. 10 శాతం నుంచి తగ్గింపు కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ. 50,000 కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువగల కంపెనీలు ఐపీవోలో ప్రస్తుత 10 శాతానికి బదులుగా 8 శాతం వాటాను విక్రయించేందుకు అనుమతిస్తారు. వీటికి పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా కల్పించడంలో ఐదేళ్ల గడువునిస్తారు. ప్రస్తుతం ఇది మూడేళ్లుగా అమలవుతోంది. రూ. లక్ష కోట్లకుపైన మార్కెట్ విలువతో ఐపీవోకు వచ్చే కంపెనీలు ప్రస్తుత 5 శాతానికి బదులుగా 2.75 శాతం వాటాను ఆఫర్ చేయవచ్చు. రూ. 5 లక్షల కోట్లకు మించిన అతిభారీ కంపెనీలైతే ఐపీవోలో 2.5 శాతం వాటా విక్రయానికీ వీలుంటుంది. ఇలాంటి భారీ కంపెనీలు 10ఏళ్లలో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనను అమలు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిబంధన ఐదేళ్లు గడువును అనుమతిస్తోంది. వెరసి అతితక్కువ స్థాయిలో వాటా విక్రయించడం ద్వారా కంపెనీలు లిస్టయ్యేందుకు వీలు చిక్కుతుంది. తదుపరి దశలవారీగా పబ్లిక్ వాటాకు తెరతీయవచ్చు. దీంతో ఓకేసారి భారీస్థాయిలో వాటా విక్రయించవలసిన అవసరం తప్పుతుందని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. తద్వారా భారీ ఐపీవోలకు లిక్విడిటీ సమస్య తలెత్తకుండా నివారించవచ్చని తెలియజేశారు. రిటైల్ పరిమాణం ఓకే రూ. 5,000 కోట్లకు మించిన ఐపీవోల పరిమాణంలో రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయింపులను 35 శాతంగానే కొనసాగించనున్నట్లు పాండే తెలియజేశారు. అంతేకాకుండా అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) వాటాను సైతం 50 శాతం నుంచి పెంచే ఆలోచనలేదని స్పష్టం చేశారు. అయితే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఐపీవోలలో మరింత చోటు కల్పించేందుకు వీలుగా యాంకర్ కేటాయింపులను సవరిస్తున్నట్లు వెల్లడించారు. వీటి ప్రకారం యాంకర్ వాటా రూ. 250 కోట్లుదాటితే ఇన్వెస్టర్ల సంఖ్యను ప్రస్తుత 10 నుంచి 15కు పెంచనుంది. కనీసం 5 నుంచి గరిష్టంగా 15వరకూ అనుమతిస్తారు. ఆపై ప్రతీ రూ. 250 కోట్ల కేటాయింపులకు అదనంగా 15మంది ఇన్వెస్టర్లకు వీలుంటుంది. అంటే ఒక్కో ఇన్వెస్టర్‌కు కనీసం రూ. 5 కోట్ల పెట్టుబడికి వీలుంటుంది. ఇదేవిధంగా యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయింపుల వాటా ప్రస్తుత 33 శాతం నుంచి 40 శాతానికి పెరగనుంది. దీనిలో ఎంఎఫ్లకు 33 శాతం, జీవిత బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్లకు మిగిలిన వాటాను రిజర్వ్ చేయనున్నారు. రీట్, ఇన్విట్లలో బీమా, పెన్షన్ ఫండ్స్ రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్)లలో వ్యూహాత్మక ఇన్వెస్టర్ నిబంధనలను సెబీ సవరించింది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్)సహా కొన్ని కేటగిరీ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు)ను ఇందుకు అనుమతించనుంది. అంతేకాకుండా రీట్‌ను ఈక్విటీగా గుర్తించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు), స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ప్రత్యేక పెట్టుబడులకు వీలుగా ఇన్విట్‌ను హైబ్రిడ్‌గా కొనసాగించనుంది. ఇన్విట్, రీట్ నిబంధనల సవరణ ద్వారా ఇన్వెస్టర్ల పరిధి మరింత విస్తరించనుంది. దీంతో రీట్, ఇన్విట్ల వ్యూహాత్మక పెట్టుబడిదారుల కేటగిరీలో విభిన్న ఇన్వెస్టర్ల పెట్టుబడులకు వీలు చిక్కనుంది. ఇది రీట్, ఇన్విట్‌లకు జోష్‌నివ్వడంతోపాటు.. సులభ వ్యాపార నిర్వహణకు దారి ఏర్పడనున్నట్లు పాండే పేర్కొన్నారు. పెన్షన్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్, బీమా ఫండ్స్ తదితర పలు భారీ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్లకు ప్రస్తుత నిబంధనలు అడ్డుపడుతున్నట్లు తెలియజేశారు. నిజానికి దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆసక్తి చూపే ఆయా సంస్థలకు రీట్, ఇన్విట్లు అత్యుత్తమ అవకాశాలని సెబీ పేర్కొంది. ఎగ్జిట్ లోడ్ కుదింపు ఆర్థిక వృద్ధిలో అందరినీ భాగస్వాములను చేసే వ్యూహంలో భాగంగా సెబీ బోర్డు ఎంఎఫ్ పంపిణీ సంస్థలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా మరింత పారదర్శక, నిలకడైన ప్రోత్సాహకాలకు దన్నునిస్తూ గరిష్ట ఎగ్జిట్ లోడ్‌ను ప్రస్తుత 5 శాతం నుంచి 3 శాతానికి కోత పెట్టింది. టాప్–30 పట్టణాలను దాటి ఫండ్స్‌లోకి కొత్తగా మహిళా ఇన్వెస్టర్లను చేర్చుకుంటే పంపిణీదారులకు అధిక ప్రోత్సాహకాలు అందేటట్లు నిబంధనలు సవరించింది.లోరిస్క్ ఎఫ్‌పీఐలకు సపోర్ట్ తక్కువ రిస్్కగల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు)ను సింగిల్ విండో ద్వారా దేశీ సెక్యూరిటీల మార్కెట్లో కార్యకలాపాలు చేపట్టేందుకు అనుమతించనున్నారు. ఇందుకు వీలుగా సెబీ బోర్డు నిబంధనలను సవరించింది. తద్వారా ఎఫ్‌పీఐలకు దేశీయంగా సులభతర పెట్టుబడులకు వీలు చిక్కనుంది. లోరిస్క్ ఎఫ్‌పీఐలు దేశీ క్యాపిటల్ మార్కెట్లో సులభంగా పెట్టుబడులు చేపట్టేందుకు స్వాగత్–ఎఫ్ఐ పేరుతో తెరతీయనున్న సింగిల్ విండో దారి చూపనుంది. దీంతో యూనిఫైడ్ రిజి్రస్టేషన్ విధానం ద్వా రా విభిన్న పె ట్టుబడి మార్గాలలో ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని పాండే తెలియజేశారు. ఫలితంగా పెట్టుబడుల విష యంలో ఎఫ్‌పీఐలకు పదేపదే ఎదురయ్యే నిబంధనలు, భారీ డాక్యుమెంటేషన్ వంటి అవరోధాలు తొలగిపోనున్నట్లు వివరించారు. లోరిస్క్ విదేశీ ఇన్వెస్టర్ల జాబితాలో ప్రభుత్వ సొంత ఫండ్స్, కేంద్ర బ్యాంకులు, సావరిన్ వెల్త్ ఫండ్స్, మలీ్టలేటరల్ సంస్థలు, అత్యంత నియంత్రణలతోకూడిన పబ్లిక్ రిటైల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ చేరనున్నట్లు వెల్లడించారు. స్వాగత్–ఎఫ్ఐ మార్గదర్శకాల ను ఎఫ్ఫీఐలతోపాటు.. విదేశీ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల(ఎఫ్‌వీసీఐలు)కు వర్తించనున్న ట్లు పేర్కొన్నారు. 2025 జూన్30కల్లా దేశీయంగా 11,913 మంది ఎఫ్‌పీఐలు రిజిస్టరై ఉన్నట్లు వెల్లడించింది. రూ. 80.83 లక్షల కోట్ల ఆస్తులను హోల్డ్ చేస్తున్నట్లు తెలియజేసింది. -
ఇకపై సులువుగా పీఎస్‌యూ డీలిస్టింగ్
ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లు స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి స్వచ్చందంగా వైదొలగేందుకు(డీలిస్టింగ్) వెసులుబాటు కల్పిస్తూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వానికి 90 శాతం లేదా అంతకుమించి వాటా ఉన్న పీఎస్‌యూలను ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్ చేసేందుకు వీలు చిక్కనుంది. డీలిస్టింగ్‌కి మెజారిటీ సాధారణ వాటాదారులు అనుమతి పొందాల్సిన నిబంధనలను కూడా సెబీ సడలించింది. అలాగే, ఫ్లోర్ ధర మదింపులోనూ మార్పులకు తెరతీసింది. వెరసి ఫ్లోర్ ధరకంటే కనీసం 15 శాతం ప్రీమియంతో, ఫిక్స్డ్ ధర ద్వారా డీలిస్టింగ్‌కు అవకాశం ఏర్పడనుంది. ఇందుకు లావాదేవీల పరిమాణం తదితరాలను పరిగణనలోకి తీసుకోరు. ప్రభుత్వానికి 90 శాతం పైగా వాటా గల పీఎస్‌యూలకు ఈ వెసులుబాటును వర్తింపచేసేలా సెపె్టంబర్ 1న సెబీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, బీమా కంపెనీలను దీన్నుంచి మినహాయించింది. ఇన్విట్స్‌లో కనీస లాట్ తగ్గింపుప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా ఐపీవోలో కేటాయించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్) కనీస లాట్ పరిమాణాన్ని సెబీ తాజాగా కుదించింది. సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ లాట్‌తో సమానం చేస్తూ రూ. 25 లక్షలకు తగ్గించింది. ఇందుకు నిబంధనలు సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకూ ప్రయివేట్ ప్లేస్మెంట్ చేసే ఇన్విట్‌లకు అసెట్ మిక్స్ ఆధారంగా కనీస లాట్ రూ. కోటి లేదా రూ. 25 కోట్లుగా అమలవుతోంది. అయితే ఇప్పటికే అసెట్ మిక్స్‌తో సంబంధంలేకుండా సెబీ సెకండరీ మార్కెట్లో లాట్ పరిమాణాన్ని రూ. 25 లక్షలకు కుదించింది. దీంతో ఐపీవో ప్లేస్మెంట్ లాట్‌ను అలైన్ చేసింది.ఇదీ చదవండి: మళ్లీ చక్కెర షేర్లు మధురం -
రూ. 3,820 కోట్ల ఐపీవో.. సెబీకి ఫిజిక్స్‌వాలా అప్డేట్
ఎడ్టెక్ యూనికార్న్ సంస్థ ఫిజిక్స్‌వాలా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి అప్డేటెడ్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి తాజా ముసాయిదా పత్రాలను అందించింది. రూ. 3,820 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసిన కంపెనీ తొలుత 2025 మార్చిలో గోప్యతా విధానంలో సెబీకి దరఖాస్తు చేసింది.దీనిలో భాగంగా మరోసారి అప్డేటెడ్ పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 3,100 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికితోడు మరో రూ. 720 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్లు అలఖ్ పాండే, ప్రతీక్ బూబ్ విడిగా రూ. 360 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నారు.ప్రస్తుతం కంపెనీలో ఇరువురుకీ విడిగా 40.35 శాతం చొప్పున వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 461 కోట్లు ఆఫ్‌లైన్, హైబ్రిడ్ సెంటర్ల ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరో రూ. 548 కోట్లు ప్రస్తుత కేంద్రాల లీజ్ చెల్లింపులకు వినియోగించనుంది. -
ఐపీవోకి మరో రెండు కంపెనీలు
ఇన్సూరెన్స్ టెక్నాలజీ సంస్థ టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సంబంధించిన పత్రాలను ప్రీ–ఫైలింగ్ విధానంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జెఫ్రీస్ ఇండియా తదితర సంస్థలు ఈ ఇష్యూకి మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి.2015లో ధీరేంద్ర మాహ్యవంశి, ఆనంద్ ప్రభుదేశాయ్ కలిసి టర్టిల్మింట్ను ప్రారంభించారు. బీమా పాలసీల కొనుగోలు, నిర్వహణ ప్రక్రియను సరళతరం చేసే లక్ష్యంతో కంపెనీ ఏర్పాటైంది. అయిదు లక్షల మంది పైగా అడ్వైజర్లతో సంస్థ దాదాపు 1.6 కోట్ల పాలసీలను విక్రయించింది. ఇందులో అమాన్సా క్యాపిటల్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ మొదలైన సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి.రూ. 499 కోట్ల సుప్రీత్ కెమికల్స్ ఐపీవోసుప్రీత్ కెమికల్స్ సంస్థ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 499 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవో పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో ఉంటుందని కంపెనీ తెలిపింది.ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 310 కోట్లను కొత్త ప్రాజెక్టు ఏర్పాటుకు, మరో రూ. 65 కోట్ల మొత్తాన్ని రుణాలు చెల్లింపునకు సంస్థ వినియోగించుకోనుంది. 2025 మార్చి ఆఖరు నాటికి కంపెనీ మొతత్తం రుణభారం రూ. 200 కోట్లుగా ఉంది. ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ ద్వారా సుప్రీత్ కెమికల్స్ రూ. 99 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. అలా సమీకరిస్తే తాజా షేర్ల జారీ తగ్గుతుంది.గుజరాత్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సుప్రీత్ కెమికల్స్ ప్రధానంగా స్పెషాలిటీ కెమికల్ ఇంటరీ్మడియట్స్ను తయారు చేస్తోంది. టెక్స్టైల్స్, ఫార్మా, ఆగ్రో–కెమికల్స్ తదితర పరిశ్రమలకు అవసరమయ్యే ఉత్పత్తులను అందిస్తోంది. 2024లో 1,309 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ స్పెషాలిటీ కెమికల్స్ ఇంటరీ్మడియట్స్ మార్కెట్ 2029 నాటికి 1,802 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. -
రూ.855 కోట్ల ఐపీవో.. సెబీకి ప్రాస్పెక్టస్
న్యూఢిల్లీ: ప్రయాణ సర్వీసులందించే చార్టర్డ్ స్పీడ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 655 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు పంకజ్ గాంధీ, అల్కా పంకజ్ గాంధీ విక్రయానికి ఉంచనున్నారు.ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 396 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 97 కోట్లు ఎలక్ట్రిక్ బస్‌ల కొనుగోలుకీ వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. 2007లో ఏర్పాటైన అహ్మదాబాద్ కంపెనీ ప్రధానంగా ప్యాసింజర్ మొబిలిటీ సర్వీసులను అందిస్తోంది.2025 జూన్30కల్లా 500 పట్టణాలలో 2,000 బస్సులతో సర్వీసులు సమకూర్చుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ. 667 కోట్ల ఆదాయం, రూ. 70 కోట్ల నికర లాభం ఆర్జించింది. అనుబంధ సంస్థల ద్వారా 945 ఎలక్ట్రిక్ బస్‌ల కొనుగోలుకి ఆర్డర్లు జారీ చేసింది. -
ఐపీవోకు ఎల్డొరాడో అగ్రిటెక్
న్యూఢిల్లీ: విత్తనాలు, సస్య రక్షణ రంగ కంపెనీ ఎల్డొరాడో అగ్రిటెక్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 340 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 660 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వీటిలో రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని శ్రీనివాసరావు లింగ, రూ. 160 కోట్ల విలువైన షేర్లను ఉషా రాణి పాపినేని ఆఫర్ చేయనున్నారు. తద్వారా మొత్తం రూ. 1,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. శ్రీకర్ సీడ్స్ బ్రాండుతో కార్యకలాపాలు విస్తరించిన తెలంగాణ కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 245 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. విత్తనాలుసహా సమీకృత సస్య రక్షణ సొల్యూషన్లు అందించే కంపెనీ పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ) ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, పంపిణీ తదితరాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా విభిన్నతరహా హైబ్రిడ్, స్వీయ పరాగ సంపర్క(ఓపీవీ) విత్తనాలను పంపిణీ చేస్తోంది. జొన్న, ధాన్యం, పత్తి, గోధుమలు, సజ్జలు తదితర పంటల సంబంధ విత్తనాలను ఆఫర్ చేస్తోంది. 2025 జూన్‌కల్లా సీఐబీఆర్‌సీ నుంచి 269 రిజి్రస్టేషన్లు పొందింది. గతేడాది(2024–25)లో రూ. 441 కోట్ల ఆదాయం, రూ. 71 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
ఇన్సైడర్ ట్రేడింగ్‌కు చెక్ పెట్టాలి
ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణలను పాటించడం బ్యాంకుల యాజమాన్యాల నైతిక బాధ్యత అని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే గుర్తు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఉల్లంఘనలను గుర్తించి, నివారించేందుకు వీలుగా అంతర్గత నియంత్రణలను బలోపేతం చేసుకోవాలని సూచించారు.‘అంతర్గత నియంత్రణలు బలహీనంగా ఉన్నప్పుడు, ప్రక్రియలు అస్పష్టంగా ఉన్నప్పుడు, బాధ్యతలను సరిగ్గా నిర్వచించనప్పుడు, పర్యవేక్షణ సరిగ్గా లేనప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ రిస్క్ పెరుగుతుంది’ అని పాండే తెలిపారు. చాలా మోసాలకు అంతర్గత నియంత్రణలు బలహీనంగా ఉండడమే కారణమన్నారు. ఇండస్ ఇండ్ బ్యాంక్ మాజీ ఎండీ–సీఈవో, డిప్యూటీ సీఈవోలు బయటకు వెల్లడించని సున్నిత సమాచారం (యూపీఎస్‌ఐ) ఆధారంగా బ్యాంక్ షేర్లలో ట్రేడింగ్ నిర్వహించినట్టు తేలుస్తూ, సెబీ ఇటీవలే చర్యలు ప్రకటించడం గమనార్హం. దీంతో సెబీ చైర్మన్ తాజా సూచనలకు ప్రాధాన్యం నెలకొంది.అంతర్గతంగా బలమైన నియంత్రణలు ఏర్పాటు చేసుకోవడం, వెంటనే సమాచారాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించడం, తమ బాద్యతల పట్ల ఉద్యోగుల్లో స్పష్టమైన అవగాహన కల్పించడం ద్వారా ప్రతి సున్నిత సమాచారం విషయంలో జవాబుదారీ తనం ఉండేలా చూడొచ్చని అభిప్రాయపడ్డారు. సమావేశాల్లో సున్నిత సమాచారాన్ని అనధికారికంగా పంచుకోవడం, ఈమెయిల్ రూపంలో తెలియజేసినా దాన్ని ఉల్లంఘనగానే పరిగణించాలని పేర్కొన్నారు. ‘ఒక్కసారి సమచారం లీక్ అయితే సెకన్లలోనే డిజిటల్ నెట్వర్క్లపైకి చేరిపోతుంది. దాంతో స్టాక్ ధరలకు, ఇన్వెస్టర్ల విశ్వాసం, బ్యాంకు ప్రతిష్టకు జరిగే నష్టాన్ని భర్తీ చేయలేం’ అని పేర్కొన్నారు. -
ఐపీవోలకు కంపెనీల క్యూ..!
కొద్ది నెలలుగా జోరు చూపుతున్న ప్రైమరీ మార్కెట్లు మరోసారి కళకళలాడనున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా 13 కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం దోహదపడనుంది. ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ మెయిన్ బోర్డులో 50 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. వీటిలో అత్యధికంగా 12 కంపెనీలు గత నెల(ఆగస్ట్)లోనే ఐపీవోలు చేపట్టడం గమనార్హం! వివరాలు చూద్దాం..ఐపీవో చేపట్టేందుకు సెబీ తాజాగా అనుమతించిన సంస్థల జాబితాలో అర్బన్ కంపెనీ, ఇమేజిన్ మార్కెటింగ్, జూనిపర్ గ్రీన్ ఎనర్జీ, జైన్ రిసోర్స్ రీసైక్లింగ్, మౌరి టెక్, రవి ఇన్ఫ్రా బిల్డ్ ప్రాజెక్ట్స్, పేస్ డిజిటెక్, ఓమ్నిటెక్ ఇంజినీరింగ్, కరోనా రెమిడీస్, కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్, ఆల్కెమ్ లైఫ్‌సైన్స్, ప్రయారిటీ జ్యువెల్స్, ఓమ్ ఫ్రైట్ ఫార్వార్డర్స్ చేరాయి. ఈ కంపెనీలన్నీ ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టయ్యే ప్రణాళికల్లో ఉన్నాయి.గత నెలలోనే..లిస్టింగ్ బాట పట్టిన కంపెనీలన్నీ ఆగస్ట్ 1–29 మధ్య సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. తద్వారా నిధుల సమీకరణకు తాజాగా అనుమతి పొందాయి. మర్చంట్ వర్గాల అంచనాల ప్రకారం ఈ 13 కంపెనీలు ఉమ్మడిగా రూ. 15,000 కోట్లకుపైగా సమీకరించనున్నాయి. ఇష్యూ నిధులను పలు కంపెనీలు రుణ చెల్లింపులకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నాయి. ఆయా కంపెనీలలోని ప్రస్తుత వాటాదారులు ఐపీవోలో షేర్లను ఆఫర్ చేయడం ద్వారా పెట్టుబడులను విక్రయించనున్నారు. రూ.1,900 కోట్లపై కన్నుయాప్ ఆధారంగా బ్యూటీ, హోమ్ సర్వీసులందించే అర్బన్ కంపెనీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 429 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రస్తుత ఇన్వెస్టర్లు మరో రూ. 1,471 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 1,900 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వాటాలు ఆఫర్ చేయనున్న సంస్థలలో యాక్సెల్ ఇండియా, ఎలివేషన్ క్యాపిటల్ తదితరాలున్నాయి.ఇమేజిన్ మార్కెటింగ్బోట్ బ్రాండుతో ఆడియో, వేరబుల్ ప్రొడక్టులు రూపొందిస్తున్న ఇమేజిన్ మార్కెటింగ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం తద్వారా రూ. 2,000 కోట్లు సమకూర్చుకునే సన్నాహాల్లో ఉంది. కంపెనీ గోప్యతా మార్గంలో ఐపీవోకు దరఖాస్తు చేసింది. రెనెవబుల్ ఎనర్జీపునరుత్పాదక ఇంధన(రెనెవబుల్ ఎనర్జీ) రంగ కంపెనీ జూనిపర్ గ్రీన్ ఎనర్జీ ఐపీవో ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించడంపై కన్నేసింది. ఇందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. మెటల్ గ్రూప్ నుంచి..జైన్ మెటల్ గ్రూప్ కంపెనీ జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ ఐపీవోకు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 1,500 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. తద్వారా రూ. 2,000 కోట్ల సమీకరణకు తెరతీయనుంది.రూ. 1,500 కోట్లకు రెడీగ్లోబల్ ఎంటర్ప్రైజ్ ఐటీ సొల్యూషన్స్ అందించే మౌరి టెక్ లిమిటెడ్ లిస్టింగ్ బాటలో సాగుతోంది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 1,250 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 1,500 కోట్లు అందుకోవాలని చూస్తోంది.విడిభాగాల కంపెనీప్రెసిషన్ ఇంజినీర్డ్ విడిభాగాలు రూపొందించే ఓమ్నిటెక్ ఇంజినీరింగ్ ఐపీవో ద్వారా రూ. 850 కోట్లు సమీకరించడంపై దృష్టి పెట్టింది. ఇష్యూలో భాగంగా రూ. 520 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 330 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ ఆఫర్ చేయనున్నారు. ఫార్మా కంపెనీలు తాజాగా లిస్టింగ్‌కు అనుమతి పొందిన ఫార్మాస్యూటికల్ రంగ కంపెనీల తీరిలా ఉంది. కరోనా రెమిడీస్ ఐపీవో ద్వారా రూ. 800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా ప్రస్తుత వాటాదారులు షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఫార్మా సంబంధ ఏపీఐ, స్పెషాలిటీ కెమికల్స్ తయారు చేసే ఆల్కెమ్ లైఫ్‌సైన్స్ ఐపీవోలో భాగంగా రూ. 190 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 71.55 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఇతర సంస్థల తీరిలానిర్మాణ రంగ కంపెనీ రవీ ఇన్ఫ్రాబిల్డ్ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. టెలికం ప్యాసివ్ మౌలికసదుపాయాల సంస్థ పేస్ డిజిటెక్ సైతం ఐపీవోలో భాగంగా ఈక్విటీ జారీ(కొత్తగా) ద్వారానే రూ. 900 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికలు వేసింది. ఈ బాటలో వైర్ల తయారీ సంస్థ కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్ ఐపీవోలో భాగంగా రూ. 420 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 325 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. తద్వారా రూ. 745 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. బంగారు ఆభరణ తయారీ కంపెనీ ప్రయారిటీ జ్యువెల్స్ ఐపీవో ద్వారా 54 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్ అందించే ఓమ్ ఫ్రైట్ ఫార్వార్డ్స్ ఐపీవోలో భాగంగా రూ. 25 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రమోటర్లు మరో 72.5 లక్షల షేర్లను ఆఫర్ చేయనున్నారు.ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే.. -
టాటా క్యాపిటల్ ఐపీవో 22న
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. ఐపీవోలో భాగంగా మొత్తం 47.58 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 21 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్‌సీ 3.58 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా 2 బిలియన్ డాలర్లు(రూ. 17,200 కోట్లు) సమీకరించే యోచనలో ఉంది. వెరసి కంపెనీ విలువ 11 బిలియన్ డాలర్లుగా నమోదుకానున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేశాయి. నెలాఖరు(30)కల్లా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నట్లు అంచనా. కంపెనీలో ప్రస్తుతం టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్‌సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ పెట్టుబడి అవసరాలకుగాను టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. లిస్టింగ్ విజయవంతమైతే దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డ్ నెలకొల్పనుంది. 2023 నవంబర్‌లో టాటా టెక్నాలజీస్ లిస్టయ్యాక, తిరిగి టాటా గ్రూప్ నుంచి మరో దిగ్గజం ఐపీవోకు రానుండటం ప్రస్తావించదగ్గ అంశం! 2022 సెపె్టంబర్లో అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్ ఆర్బీఐ నిబంధనల ప్రకారం 2025 సెపె్టంబర్‌లోగా ఐపీవో చేపట్టవలసి ఉంది. ఇప్పటికే అప్పర్‌లేయర్ ఎన్బీఎఫ్సీలు.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్(హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థ), బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో సెబీ ప్రత్యేక కార్యక్రమం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లెయిమ్ చేయని డివిడెండ్లు, షేర్లను పొందడంలో ఇన్వెస్టర్లకు అవసరమయ్యే సహాయాన్ని అందించే దిశగా హైదరాబాద్‌లో ‘నివేశక్ శివిర్’ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చొరవతో, కార్పొరేట్ వ్యవహారాల శాఖలో భాగమైన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) దీన్ని నిర్వహించింది.సీడీఎస్ఎల్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్, బీఎస్ఈ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్, ఎన్ఎస్ఈ, కేఫిన్ టెక్నాలజీస్ మొదలైనవి ఇందులో పాలుపంచుకున్నాయి. ఇన్వెస్టర్లకు కావాల్సిన సహాయాన్ని అందించేందుకు ప్రత్యేకంగా 23 సరీ్వస్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 360 మంది పైగా ఇన్వెస్టర్లు, క్లెయిమెంట్లు ఇందులో పాల్గొన్నారు. ఐఈపీఎఫ్ఏ సీఈవో అనితా షా ఆకెళ్ల, సెబీ ఈడీలు జీవన్ సోన్పరోటే, సునీల్ జయవంత్ కదమ్ తదితరులు దీనికి హాజరయ్యారు. -
లీప్ ఇండియా రూ.2,400 కోట్ల ఐపీఓ
న్యూఢిల్లీ: సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రొవైడర్ లీప్ ఇండియా తొలి పబ్లిక్ ఇష్యూకి (ఐపీఓ) రాబోతోంది. ఈ ఇష్యూ ద్వారా రూ.2,400 కోట్లు సమీకరించాలని సంస్థ భావిస్తోంది. ఇందుకు అనుమతి కోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ.400 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్సీ) కింద ప్రమోటర్లు రూ.2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.300 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన మొత్తాన్ని ఇతర కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించనుంది. ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్, జేఎం ఫైనాన్షియల్, యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా, అవెండస్ క్యాపిటల్ సంస్థలు ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. సప్లై చైన్ రంగ సంస్థలకు అవసరమైన కంటైనర్లు, క్రేట్స్లాంటి అసెట్స్‌ను లీజుకు అందించే లీప్ ఇండియా 2013లో ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా 7,747 కస్టమర్ టచ్పాయింట్లు, 30 పుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.485 కోట్ల ఆదాయం, రూ.37.5 కోట్లు నికర లాభాన్ని ప్రకటించింది. పానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా, మారికో, హైయర్ అప్లయిన్సెస్, డైకిన్, డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ తదితర 900 పైగా కంపెనీలు, క్లయింట్లుగా ఉన్నాయి. -
ఐపీవో నిధుల సమీకరణకు కోత..!
ఇటీవల తిరిగి ప్రైమరీ మార్కెట్లు జోరందుకున్నప్పటికీ పలు కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణకు కోత పెడుతున్నాయి. సెకండరీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, పెట్టుబడులకు పలు అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం అంతగా ఆసక్తి చూపకపోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నిజానికి ప్రస్తుత కేలండర్ ఏడాది (2025)లో పలు అన్‌లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యూ కడుతున్నాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేస్తున్నాయి. అనుమతులు సైతం పొందుతున్నాయి. అయితే జనవరి మొదలు ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అదనపు సుంకాలను విధిస్తుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా భారత్ ఎగుమతులపై ఇటీవల 50 శాతంవరకూ టారిఫ్‌లను ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. యూఎస్ టారిఫ్‌ల కారణంగా సముద్ర ఉత్పత్తులు, టెక్స్టైల్స్, లెదర్, జ్యువెలరీ, కెమికల్స్ తదితర పలు రంగాలు ప్రభావితంకావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫార్మాపై సైతం సుంకాలు విధించే వీలున్నట్లు ట్రంప్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా కొద్ది నెలలుగా దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలోనే సాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. వీటికితోడు దేశీ కంపెనీల ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు ఆకట్టుకోకపోవడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సైతం దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పలు అన్‌లిస్టెడ్ కంపెనీలు ఐపీవో ద్వారా సమీకరించదలచిన నిధుల పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయి. పునరాలోచనలో.. ఈ ఏడాది జనవరి నుంచి పలు కంపెనీలు లిస్టింగ్‌కు ఆసక్తి చూపుతున్నప్పటికీ సమీకరించతలపెట్టిన నిధుల పరిమాణంలో కోత పెట్టుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. వెరసి 2025లో ఇప్పటివరకూ సుమారు 15 కంపెనీలు ఇష్యూల పరిమాణాన్ని తగ్గించుకున్నాయి. ఈ జాబితాలో ఇటీవల లిస్టయిన దిగ్గజాలు ఎన్ఎస్డీఎల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్సహా.. ఏథర్ ఎనర్జీ, ఎస్కే ఫైనాన్స్, బ్లూస్టోన్, మొబిక్విక్, ష్లాస్ బెంగళూరు(లీలా హోటల్స్), ఇండిక్యూబ్, అర్బన్ కంపెనీ, స్మార్ట్ వర్క్స్, స్వస్తికా ఇన్ఫ్రా తదితరాలు చేరాయి. 48 కంపెనీల లిస్టింగ్ ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ 48 కంపెనీలు ఐపీవోలు చేపట్టి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. తద్వారా రూ. 64,135 కోట్లు సమకూర్చుకున్నాయి. అంతక్రితం ఏడాది అంటే 2024లో 90 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. తద్వారా ఏకంగా రూ. 1,67,535 కోట్లు(19.5 బిలియన్ డాలర్లు) సమీకరించాయి. ఇది రికార్డుకాగా.. ఈ ఏడాది ద్వితీయార్థంలోనూ పలు దిగ్గజాలు లిస్టింగ్ బాటలో సాగనున్నాయి. పలు అవకాశాలు ప్రైమరీ మార్కెట్లలో కొన్ని నెలలుగా చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈ) సైతం సందడి చేస్తున్నాయి. దీంతో ఎన్ఎస్ఈ ఎమర్జ్, బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారా పలు చిన్న కంపెనీలు సైతం భారీ స్థాయిలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు కొద్ది నెలలుగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఆకర్షణీయ రిటర్నులు ఇవ్వడం, రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌ల ఐపీవోలు, మ్యూచువల్ ఫండ్ల సిప్ పథకాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో మెయిన్ బోర్డ్ ప్రైమరీ మార్కెట్లో కొన్ని ఇష్యూలు మాత్రమే లిస్టింగ్‌లోనూ విజయవంతమవుతున్నట్లు వివరించారు. వెనకడుగు తీరిదీ... వివిధ ప్రతికూలతల కారణంగా తొలుత వేసిన ప్రణాళికలను సవరిస్తూ కొన్ని కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణ పరిమాణంలో కోత పెడుతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ రూ. 4,000 కోట్ల విలువను రూ. 3,600 కోట్లకు సవరించగా.. ఏథర్ ఎనర్జీ రూ. 3,100 కోట్ల నుంచి రూ. 2,626 కోట్లకు తగ్గించుకుంది. ఈ బాటలో ఎస్కే ఫైనాన్స్ రూ. 2,200 కోట్లస్థానే రూ. 1,600 కోట్లు మాత్రమే సమీకరించగా.. బ్లూస్టోన్ రూ. 1,000 కోట్ల నుంచి రూ. 820 కోట్లకు వెనకడుగు వేసింది. లీలా హోటల్స్ రూ. 5,000 కోట్ల ప్రణాళికను రూ. 3,000 కోట్లకు కుదిస్తే.. మొబిక్విక్ రూ. 1,900 కోట్ల నుంచి రూ. 700 కోట్లకు భారీగా కోత పెట్టుకుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మోసపూరిత పథకాల పట్ల జాగ్రత్త: సెబీ హెచ్చరిక
మోసపూరిత ట్రేడింగ్ పథకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఇన్వెస్టర్లను సెబీ హెచ్చరించింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ద్వారా (ఎఫ్‌పీఐలు) స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశం కలి్పస్తామంటూ సోషల్ మీడియా సందేశాలు, మొబైల్ అప్లికేషన్లపై చేసే ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ తరహా పథకాలు చట్టవిరుద్ధమైనవంటూ.. వీటికి సెబీ ఆమోదం లేనట్టు స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఏఐలో ఆధిపత్యం కోసం ఎగబడుతున్నారు!వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఇతర యాప్‌లపై ఎఫ్‌పీఐల రూపంలో పెట్టుబడుల అవకాశాలు కల్సిస్తామన్న మోసపూరిత పథకాలకు దూరంగా ఉండాలని కోరింది. ఇనిస్టిట్యూషనల్ ట్రేడింగ్ ఖాతాలు, తక్కువ ధరలకే ఐపీవోలు, ఐపీవోల్లో కచ్చితమైన కేటాయింపులు అంటూ తప్పుదోవ పట్టించే క్లెయిమ్‌లను నమ్మొద్దని సూచించింది. భారత్‌లో నివసించే పౌరులకు ఎఫ్‌పీఐ పెట్టుబడుల మార్గం అందుబాటులో ఉండదని గుర్తు చేసింది. ఆయా సంస్థలకు రిజిస్ట్రేషన్ ఉందా? లేదా అన్నది సెబీ వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చని తెలిపింది. -
మహిళా ఇన్వెస్టర్లపై సెబీ స్పెషల్ ఫోకస్
ముంబై: మ్యూచువల్ ఫండ్స్‌లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచడంపై సెబీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొదటిసారి పెట్టుబడులు పెట్టే మహిళలకు ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికతో ఉన్నట్టు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే ప్రకటించారు. మహిళల సమాన ప్రాతినిధ్యం లేకుండా ఆర్థిక సమ్మిళితత్వం అసంపూర్ణంగా ఉండిపోతుందన్నారు. అందుకని వారికి పంపిణీ పరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాండే మాట్లాడారు. టాప్ 30కి (బీ30) వెలుపలి పట్టణాల్లో పంపిణీదారులకు రాయితీలు కలి్పంచాలన్న ఇటీవలి ప్రతిపాదనను ప్రస్తావించారు. ఈ చర్యలతో కొత్త పెట్టుబడిదారులను భాగస్వాములను చేయొచ్చని, మరింత మందికి మ్యూచువల్ ఫండ్స్ సేవలను చేరువ చేయొచ్చని అభిప్రాయపడ్డారు. -
ఐపీవోకు 5 కంపెనీలు రెడీ
ఇటీవల జోరు చూపుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా ఐదు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు దారి ఏర్పడింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ జాబితాలో ఇన్నోవేటివ్యూ ఇండియా, పార్క్ మెడీ వరల్డ్, రన్వాల్ ఎంటర్ప్రైజెస్, జిన్‌కుషాల్ ఇండస్ట్రీస్, అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ చేరాయి. ఈ కంపెనీలు 2025 ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ మెయిన్‌బోర్డులో 48 కంపెనీలు లిస్ట్‌కావడం గమనార్హం! ఈ నెలలో ఇప్పటివరకూ 11 కంపెనీలు ఐపీవోకురాగా.. వచ్చేవారం మరికొన్ని కంపెనీల ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఇష్యూల వివరాలు చూద్దాం..సెక్యూరిటీ సొల్యూషన్లుభద్రతా, నిఘా(సెక్యూరిటీ, సర్వెలెన్స్) సొల్యూషన్లు అందించే ఇన్నోవిటివ్యూ ఇండియా ఐపీవోకు రానుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు రూ. 2,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. దీంతో ఇష్యూ నిధులు కంపెనీకికాకుండా పూర్తిగా ప్రమోటర్లకు చేరనున్నాయి.ఆసుపత్రుల చైన్ఆరోగ్యపరిరక్షణ రంగ సంస్థ పార్క్ మెడి వరల్డ్ ఐపీవో చేపట్టనుంది. పార్క్ బ్రాండ్‌తో ఆసుపత్రులను నిర్వహిస్తున్న కంపెనీ తద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించనుంది. వీటిలో కొత్తగా ఈక్విటీ జారీ ద్వారా రూ. 900 కోట్లు సమకూర్చుకోనుండగా.. ప్రమోటర్ అజిత్ గుప్తా రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు(కొత్త ఆసుపత్రుల ఏర్పాటు), పరికరాల కొనుగోలుకి వెచి్చంచనుంది. అనుబంధ సంస్థలు పార్క్ మెడిసిటీ(ఎన్సీఆర్), బ్లూహెవెన్స్ విస్తరణకు సైతం నిధులు వెచ్చించనుంది.రియల్టీ సంస్థఐపీవోకు రానున్న రియల్టీ అభివృద్ధి సంస్థ రన్వాల్ ఎంటర్ప్రైజెస్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఈ నిధులలో రూ. 200 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 450 కోట్లు అనుబంధ సంస్థలలో పెట్టుబడులకు కేటాయించనుంది. మిగిలిన నిధులను భవిష్యత్ రియల్టీ ప్రాజెక్టుల అభివృద్ధి, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.మెషీన్ల కంపెనీచత్తీస్గఢ్కు చెందిన మెషీన్ల ఎగుమతి కంపెనీ జిన్‌కుషాల్ ఇండస్ట్రీస్ ఐపీవోలో భాగంగా 86.5 లక్షల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్లు 10 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.ఆగ్రోకెమికల్జైపూర్ సంస్థ అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా 1.92 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇలా సమీకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్‌తోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. డిజిటల్ రుణాల ప్లాట్ఫామ్డిజిటల్ రుణాల ప్లాట్‌ఫామ్ కిస్త్ మాతృ సంస్థ ఆన్‌ఈఎంఐ టెక్నాలజీ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 88.79 లక్షల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 750 కోట్లు అనుబంధ సంస్థ సై క్రెవా మూలధన పటిష్టతకు కేటాయించనుంది. తద్వారా భవిష్యత్ పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 2016లో ప్రారంభమైన కంపెనీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వేగవంత, సులభతర క్రెడిట్ సొల్యూషన్లు అందిస్తోంది. ప్రధానంగా యువతపై దృష్టిసారించింది. 2025 మార్చి31కల్లా 5.32 కోట్ల రిజిస్టర్డ్ యూజర్లను కలిగి ఉంది. 91 లక్షలకుపైగా కస్టమర్లకు సేవలు సమకూర్చింది. రూ. 4,087 కోట్ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 1,337 కోట్ల ఆదాయం, రూ. 161 కోట్ల నికర లాభం ఆర్జించింది.ఇదీ చదవండి: మొబైళ్లను 5% జీఎస్టీ శ్లాబ్‌లో చేర్చాలి -
ఎన్బీఎఫ్సీ బాహుబలి ఐపీవో!
న్యూఢిల్లీ: అప్పర్‌లేయర్ ఎన్బీఎఫ్సీ.. టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ ద్వారా 2 బిలియన్ డాలర్లు(రూ. 17,200 కోట్లు) సమీకరించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కంపెనీ విలువ 11 బిలియన్ డాలర్లు(రూ. 94,600 కోట్లు)గా నమోదుకానున్నట్లు తాజాగా అంచనా వేశాయి. ఈ ఇష్యూ పూర్తియితే దేశంలో అతిపెద్ద ఎన్బీఎఫ్సీ ఐపీఓగా రికార్డు సృష్టించనుంది. లిస్టింగ్‌కు వీలుగా టాటా గ్రూప్ దిగ్గజం ఇటీవలే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో మొత్తం 26.58 కోట్ల షేర్లు విక్రయించనుంది. వీటిలో 21 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుండగా.. మరో 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. టాటా క్యాపిటల్ మాతృ సంస్థ టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్‌సీ 3.58 కోట్ల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్‌సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. కంపెనీ లిస్టయితే దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా నమోదుకానుంది. వెరసి టాటా గ్రూప్ నుంచి రెండేళ్లలో రెండు కంపెనీలు లిస్టింగ్‌ను పొందినట్లవుతుంది. ఇంతక్రితం ఐటీ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ 2023 నవంబర్‌లో ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. పటిష్ట పనితీరు: ఈ ఏడాది తొలి త్రైమాసికం (2025–26, క్యూ1)లో టాటా క్యాపిటల్ కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపై రూ.1,041 కోట్లకు చేరింది. గతేడాది (2024–25) ఇదే కాలంలో రూ.472 కోట్లు ఆర్జించింది. ఆదా యం రూ. 6,557 కోట్ల నుంచి రూ.7,692 కోట్లకు ఎగసింది. -
ఐపీవో బాటలో పవరికా
న్యూఢిల్లీ: పవర్ సొల్యూషన్లు అందించే పవరికా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా మొత్తం రూ. 1,400 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ప్రమోటర్లలో నరేష్ ఒబెరాయ్ కుటుంబ ట్రస్ట్ రూ. 490 కోట్లు, కబీర్, కిమయా ఫ్యామిలీ ప్రయివేట్ ట్రస్ట్ రూ. 210 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 525 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. కాగా.. కంపెనీ ఇంతక్రితం 2019లోనూ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసినప్పటికీ ఐపీవో చేపట్టకపోవడం గమనార్హం! కంపెనీ ప్రధానంగా డీజిల్ జనరేటర్(డీజీ) సెట్లు, మధ్యస్థాయి స్పీడ్ భారీ జనరేటర్లు(ఎంఎస్ఎల్జీ), తత్సంబంధ సరీ్వసులను అందిస్తోంది. -
ఐపీవోకి ఆర్ఎస్ బ్రదర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తుల రిటైలింగ్ సంస్థ ఆర్ఎస్బీ రిటైల్ ఇండియా (ఆర్ఎస్ బ్రదర్స్) పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీని ప్రకారం రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.98 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు విక్రయించనున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 275 కోట్లను నిర్దిష్ట రుణాల చెల్లింపునకు, రూ. 118 కోట్ల మొత్తాన్ని ఆర్ఎస్ బ్రదర్స్, సౌతిండియా షాపింగ్ మాల్ ఫార్మాట్లలో కొత్త స్టోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు కంపెనీ వినియోగించుకోనుంది. సంస్థకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో మొత్తం 73 స్టోర్స్ ఉన్నాయి. సౌతిండియా షాపింగ్ మాల్, ఆర్ఎస్ బ్రదర్స్, కాంచీపురం నారాయణి సిల్క్స్, డి రాయల్, వేల్యూ జోన్ హైపర్‌మార్ట్ పేరిట వివిధ ఫార్మాట్లలో స్టోర్స్ నిర్వహిస్తోంది. పొట్టి వెంకటేశ్వర్లు, సీర్న రాజమౌళి, తిరువీధుల ప్రసాద రావు తదితరులు ప్రమోటర్లుగా ఉన్నారు. 2024–25లో కంపెనీ రూ. 2,694 కోట్ల ఆదాయం, రూ. 104 కోట్ల లాభం నమోదు చేసింది. -
ఈ కంపెనీలు ఐపీవోకి వస్తున్నాయ్..
ఎలక్ట్రికల్ ఉత్పత్తుల సంస్థ సిల్వర్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ తాజాగా పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,400 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను మార్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. వీటి ప్రకారం రూ. 1,000 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటర్లు విక్రయించనున్నారు.2023–2025 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో కంపెనీ ఆదాయం వార్షికంగా 95 శాతం వృద్ధి చెందింది. పంపులు, మోటర్ల ఉత్పత్తికి సంబంధించి 24,00,000 యూనిట్లు, 72,00,000 ఫ్యాన్ల స్థాపిత సామర్థ్యంతో సంస్థకు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ప్లాంటు ఉంది. ఐపీఓకు టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సన్నద్ధమవుతోంది. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూలో భాగంగా 95.05 లక్షల తాజా ఈక్విటీలు జారీ చేయనుంది. ప్రమోటర్ కంపెనీ కార్తికేయ్ కన్స్ట్రక్షన్స్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద 23.76 లక్షల షేర్లను విక్రయించనుంది.సమీకరించే రూ.138 కోట్ల నిధులను మూలధన వ్యయ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకుంటామని కంపెనీ ముసాయిదా పత్రాల్లో తెలిపింది. ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా ఖంబట్టా సెక్యూరిటీస్, రిజిస్ట్రార్‌గా బిగ్‌షేర్ సర్వీసెస్‌లు సంస్థలు వ్యవహరించనున్నాయి. టెక్నోక్రాఫ్ట్ 2025 జూన్ 30 నాటికి రూ.685.83 కోట్ల విలువైన ఆర్డర్లు కలిగి ఉంది. ఆర్థిక సంవత్సరం 2025లో రూ.28.20 కోట్ల నికర లాభం, రూ.279.56 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. -
5 కంపెనీలు ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఐదు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ వెంచర్స్, ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్, ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా, గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ, ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్నాలజీస్ చేరాయి. ఈ కంపెనీలు సెబీకి ఈ ఏడాది జనవరి–ఏప్రిల్ మధ్య ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ అనుబంధ సంస్థ ప్రెస్టీజ్ హాస్పిటాలిటీ వెంచర్స్ ఐపీవో ద్వారా రూ. 2,700 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీనిలో భాగంగా రూ. 1,700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ విక్రయానికి ఉంచనుంది. ఆనంద్ రాఠీ ఆనంద్ రాఠీ గ్రూప్ బ్రోకింగ్ సరీ్వసుల విభాగం ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఐపీవోలో భాగంగా రూ. 745 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా సమీకరించనున్న రూ. 745 కోట్లలో రూ. 550 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీనిలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ప్లాంటు, మెషీనరీ కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఈప్యాక్ ప్రీఫ్యాబ్ టెక్నాలజీస్ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో కోటి ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయ నున్నారు. ఈక్విటీ జారీ నిధులను రాజస్తాన్‌లోని అల్వార్‌లోగల జిలోత్ ఇండ్రస్టియల్ ఏరియాలో తయారీ యూనిట్ ఏర్పాటుకు వెచ్చించనుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోగల ప్లాంటు విస్తరణతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వినియోగించనుంది. గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీఆరోగ్య పరిరక్షణ రంగ సంస్థ గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులను అహ్మదాబాద్‌లోని పరేఖ్స్ హాస్పిటల్ కొనుగోలుసహా.. ఇప్పటికే సొంతం చేసుకున్న అశ్విని మెడికల్ సెంటర్ పాక్షిక చెల్లింపులకు, వడోదరలో రోబోటిక్స్ పరికరాలతోపాటు కొత్త ఆసుపత్రి ఏర్పాటుకు వినియోగించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వెచ్చించనుంది. -
ఫైనాన్షియల్ మోసాలకు చెక్ పెట్టేలా 5 చర్యలు
డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక నియంత్రణ సంస్థలు అత్యవసర సర్వీసులు ప్రారంభిస్తున్నాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) సంయుక్తంగా పెట్టుబడిదారుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా హెచ్చరికలను జారీ చేస్తున్నాయి.డిజిటల్ ఫైనాన్షియల్ మోసాలు పెరుగుతున్నందున, రిటైల్ ఇన్వెస్టర్లను లక్ష్యంగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో ఇన్వెస్టర్లకు పెట్టుబడి సాధనాలతోపాటు టెక్నాలజీపై అవగాహన కల్పించడమే లక్ష్యం పెట్టుకున్నాయి. మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ఇన్ఫ్లుయెన్సర్ ఆధారిత కంటెంట్ పెరిగిపోతుండడంతో ఇన్వెస్టర్లు మోసాల బారిన పడుతున్నారు.గ్యారెంటీడ్ రిటర్న్స్.. ఇన్వెస్టర్ల పెట్టుబడులపై గ్యారెంటీడ్ రిటర్న్స్ అంటూ సైబర్ నేరగాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు.డిజిటల్ హైజీన్: ఇన్వెస్టర్లు సెబీ రిజిస్టర్డ్ యాప్‌లను మాత్రమే ఉపయోగించాలి. అధికారిక ఛానెళ్లలో మధ్యవర్తులను వెరిఫై చేసుకోవాలి. కాదని ప్రత్యేకంగా నేరగాళ్లు పంపే లింక్‌లపై క్లిక్ చేస్తే మొదటికే మోసం వస్తుంది.పెట్టుబడి సలహాలు: ముఖ్యంగా సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లు లేదా ఈమెయిల్స్ లోని తెలియని సోర్స్ నుంచి వస్తున్న సమాచారాన్ని నమ్మవద్దు. ఉచిత సలహా వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఎవరికివారు నిత్యం ప్రశ్నించుకోవాలి.సెబీ రిజిస్టర్డ్ యాప్‌లు: సెబీ రిజిస్టర్డ్ యాప్‌లను మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి. సదరు యాప్ సెబీ అధికారిక జాబితాలో లేకపోతే దాన్ని వెంటనే డిలీట్ చేయాలి. ఫిషింగ్, మోసం స్కీమ్‌ల్లో నకిలీ యాప్‌లే సాధనంగా ఉంటాయి.మధ్యవర్తులను వెరిఫై చేయడం: బ్రోకర్లు, సలహాదారులు, ఇతర ప్లాట్‌ఫామ్‌ల చట్టబద్ధతను ధ్రువీకరించుకోవాలి. అందుకు సెబీ అధికారిక పోర్టలో ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే రిపోర్ట్ చేయాలి. ముందస్తు రిపోర్టింగ్ ఇతరులను రక్షించడంలో సహాయపడుతుంది. రెగ్యులేటర్లు వేగంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. -
రూ. 353 కోట్ల ఐపీవోకి హైదరాబాదీ సంస్థ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెఫ్రోప్లస్ బ్రాండ్ పేరిట డయాలసిస్ సేవలందించే హైదరాబాదీ సంస్థ నెఫ్రోకేర్ హెల్త్ సరీ్వసెస్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. దీని ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 353.4 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్లు, ప్రస్తుత షేర్హోల్డర్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో 1.27 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ ద్వారా నెఫ్రోప్లస్ రూ. 70.6 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇన్వెస్ట్‌కార్ప్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ టూ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ మొదలైనవి కంపెనీ ప్రమోటర్లుగా ఉన్నాయి. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 129.1 కోట్లను దేశీయంగా కొత్తగా డయాలసిస్ క్లినిక్‌లను ప్రారంభించేందుకు, రూ. 136 కోట్లను రుణాల చెల్లింపునకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది.2009లో ఏర్పాటైన నెఫ్రోప్లస్‌కి దేశవ్యాప్తంగా 269 నగరాల్లో 447 క్లినిక్‌లు ఉన్నాయి. ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్తాన్, నేపాల్‌తో పాటు ఇటీవలే సౌదీ అరేబియా ద్వారా మధ్యప్రాచ్య మార్కెట్లోకి కూడా విస్తరించింది. 2025 మార్చి 31 నాటికి కంపెనీ వద్ద 5,000 పైగా డయాలసిస్ మెషిన్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 755.8 కోట్ల ఆదాయం, రూ. 67 కోట్ల లాభం ఆర్జించింది. -
‘డబ్బా ట్రేడింగ్’ చట్ట విరుద్ధం
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా డబ్బా ట్రేడింగ్ చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ అంశంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండవలసిందిగా హెచ్చరించింది. చట్ట విరుద్ధంగా జరిగే ట్రేడింగ్ సర్వీసుల ద్వారా ఎలాంటి లావాదేవీలు చేపట్టవద్దని సూచించింది. ఈ విషయంలో జాగరూకతతో వ్యవహరించవలసిందిగా పేర్కొంది.స్టాక్ మార్కెట్లకు సమాంతరంగా నియంత్రణలులేని ఆఫ్మార్కెట్లో నిర్వహించే అక్రమ లావాదేవీలకు దూరంగా ఉండమంటూ హెచ్చరించింది. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలకు సంబంధం లేకుండా నిర్వహించే ఇలాంటి లావాదేవీలు భారీ రిస్క్‌లతో కూడి ఉంటాయని తెలియజేసింది. అంతేకాకుండా సెక్యూరిటీస్ కాంట్రాక్టుల చట్టంలోని పలు నిబంధనల ఉల్లంఘనకు సైతం దారితీస్తాయని హెచ్చరించింది. వెరసి డబ్బా ట్రేడింగ్ చట్ట విరుద్ధమేకాకుండా.. రిస్క్‌లను సైతం ఎదుర్కోవలసి ఉంటుందని వివరించింది. నియంత్రణ, అవగాహన, చట్టబద్ధ సంస్థల సహకారంతో సెబీ ఇన్వెస్టర్ల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసింది.ఇదీ చదవండి: రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలాఏమిటీ డబ్బా ట్రేడింగ్..సెబీ నిర్వచించిన విధంగా డబ్బా ట్రేడింగ్ అనేది చట్టవిరుద్ధమైన, క్రమబద్ధీకరించని ఆఫ్ మార్కెట్ ట్రేడింగ్. ఇది గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల నియంత్రణలో ఉండదు. సెబీ గుర్తింపు పొందిన ఏ ఎక్స్ఛేంజ్లోనూ ఈ ట్రేడులు నమోదు అవ్వవు. వ్యాపారులు, డబ్బా ఆపరేటర్ల మధ్య నగదు రూపంలో సెటిల్మెంట్లు జరుగుతాయి. ప్రధానంగా స్టాక్ ధర కదలికలపై బెట్టింగ్ వేస్తారు. సెక్యూరిటీల వాస్తవ కొనుగోలు లేదా అమ్మకం ఉండదు. వీటిని అనుసరించడం సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్, 1956, సెబీ యాక్ట్ 1992, భారతీయ న్యాయ్ సంహిత 2023ను ఉల్లంఘించడం అవుతుందని గుర్తుంచుకోవాలి. -
జేన్ స్ట్రీట్‌పై సెబీ నిషేధం ఎత్తివేత
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా యూఎస్ ప్రొప్రయిటరీ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది. తద్వారా సెక్యూరిటీస్ మార్కెట్లో తిరిగి లావాదేవీలు నిర్వహించేందుకు అనుమతించింది. ఎఫ్‌అండ్‌వో లావాదేవీల్లో మార్కెట్ మ్యానిప్యులేషన్‌కు పాల్పడిందంటూ ఈ నెల 3న జారీ చేసిన మధ్యంతర ఆదేశాలలో జేన్ స్ట్రీట్‌పై సెబీ నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: టైర్.. రయ్ రయ్!నిషేధం విధించిన సమయంలో దాదాపు రూ.4,843 కోట్ల జరిమానా సైతం చెల్లించాలని ఆదేశించింది. అయితే సెబీ సూచించిన విధంగా ఎస్క్రో ఖాతాలో గత వారమే జేన్ స్ట్రీట్ రూ.4,843 కోట్లకుపైగా జమ చేయడంతో తాజాగా సెబీ నిషేధాన్ని ఎత్తివేసింది. కాగా.. ఇకపై అక్రమంగా లేదా మ్యానిప్యులేటివ్గా లేదా మోసపూరితంగా లావాదేవీలు చేపడితే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చర్యలు తీసుకోనున్నట్లు సెబీ హెచ్చరించింది. -
మ్యూచువల్ ఫండ్స్‌లోకి మరో కొత్త కంపెనీ.. సెబీ నుంచి లైసెన్స్
ద వెల్త్ కంపెనీ అస్సెట్ మేనేజ్మెంట్ హోల్డింగ్స్ ప్రైవేటు లిమిటెడ్ (పాంటోమ్యాథ్ గ్రూప్ సంస్థ) మ్యూచువల్ ఫండ్స్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా సెబీ నుంచి తుది ఆమోదం పొందినట్టు ప్రకటించింది. దీంతో రూ.74 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి ‘ద వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్’ పేరుతో అధికారికంగా ప్రవేశించడానికి మార్గం సుగమం అయినట్టు తెలిపింది.సెబీ నుంచి సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈ నెల 18న మంజూరైనట్టు పేర్కొంది. సాధారణంగా ప్రైవేటు ఈక్విటీ మార్కెట్లో కనిపించే డేటా ఆధారిత పరిశోధన, వినూత్నమైన బోటమ్ అప్ విధానాలను తమ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు అందించనున్నట్టు తెలిపింది.హెచ్డీఎఫ్సీ ఏఎంసీ లాభం జూమ్ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 24 శాతం ఎగసి రూ. 748 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 604 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 25 శాతం జంప్‌చేసి రూ. 968 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 775 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీ నిర్వహణలోని సగటు ఆస్తుల విలువ(ఏయూఎం) రూ. 6.71 లక్షల కోట్ల నుంచి రూ. 8.3 లక్షల కోట్లకు బలపడింది. -
గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల ప్రక్షాళన!
న్యూఢిల్లీ: బంగారం, వెండి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) నిర్వహణలోని భౌతిక బంగారం, వెండి విలువ మదింపునకు సెబీ నడుం బిగించింది. మరింత పారదర్శకతకు తోడు, స్థానిక మార్కెట్ ధరలకు అనుగుణంగా స్థిరత్వం కోసం కీలక ప్రతిపాదనలు చేసింది. అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) దేశీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లు ప్రకటించే స్పాట్ ధరలను ఈటీఎఫ్‌ల నిర్వహణలోని బంగారం, వెండి విలువ మదింపునకు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తన ముసాయిదా నిబంధనల్లో సెబీ పేర్కొంది. ప్రస్తుతం గోల్డ్ ఈటీఎఫ్‌లు తమ నిర్వహణలోని భౌతిక బంగారం విలువ మదింపునకు లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (ఎల్‌బీఎంఏ) ధరలను అనుసరిస్తున్నాయి. ట్రాయ్ ఔన్స్ బంగారం ధర యూఎస్ డాలర్ల రూపంలో ఉంటుండగా.. మారకం రేటు ఆధారంగా బంగారం, వెండి విలువను నిర్ణయిస్తున్నాయి. సిల్వర్ ఈటీఎఫ్‌లకు సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఎల్‌బీఎంఏ స్థానంలో దేశీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లు ప్రకటించే బంగారం, వెండి ధరలను అనుసరించేలా సెబీ ప్రతిపాదించింది. స్పాట్ ధరల విషయంలోనూ పోలింగ్ విధానాన్ని ప్రతిపాదించింది. తద్వారా దేశవ్యాప్తంగా ఒకే బెంచ్‌మార్క్ ఉండేలా చూడనుంది. దీనిపై ఆగస్ట్ 6 వరకు సలహా, సూచనలను అందించాలని సెబీ కోరింది. -
జేన్ స్ట్రీట్ నుంచి రూ. 4,844 కోట్లు
న్యూఢిల్లీ: యూఎస్ హెడ్జ్ ఫండ్ జేన్ స్ట్రీట్ తాజాగా సెబీ పేరున ఎస్క్రో ఖాతాలో దాదాపు రూ. 4,844 కోట్లు డిపాజిట్ చేసింది. దీంతో సంస్థపై విధించిన ఆంక్షలు ఎత్తివేయవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని అభ్యరి్థంచింది. మార్కెట్ మ్యానిప్యులేషన్ ద్వారా భారీ ఆర్జనకు తెరతీసిందన్న ఆరోపణలతో జేన్ స్ట్రీట్‌పై సెబీ కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రూ. 4,843.57 కోట్లు జమ చేయవలసిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో జేన్స్ స్ట్రీట్ అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు సెబీ పేర్కొంది. ఎఫ్‌అండ్‌వో, నగదు విభాగాలలో పొజిషన్లు తీసుకోవడం ద్వారా జేన్ స్ట్రీట్ ఇండెక్సులను మ్యానిప్యులేట్ చేసిందని, తద్వారా భారీగా సంపాదించిందని ఈ నెల 3న జారీ చేసిన తాత్కాలిక ఆదేశాలలో సెబీ పేర్కొంది. 2023 జనవరి– 2025 మే నెల మధ్య రూ. 36,671 కోట్లు ఆర్జించినట్లు సెబీ దర్యాప్తులో వెల్లడైంది. ఫలితంగా హెడ్జ్ ఫండ్‌ను మార్కెట్ కార్యకలాపాల నుంచి దూరం పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. -
ఐపీవోకు ఇన్ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరికరాలను అద్దెకిచ్చే అగ్కాన్ ఎక్విప్మెంట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 332 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్లు 94 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు.ఇదీ చదవండి: వాణిజ్య బీమాపై జ్యూరిక్ కోటక్ ఫోకస్ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 168 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 84 కోట్లు పరికరాల కొనుగోళ్లకు, మరికొన్ని నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 2003లో ఏర్పాటైన హర్యానా కంపెనీ ప్రధానంగా మౌలిక రంగ కంపెనీలకు పరిశ్రమ సంబంధిత పరికరాలను అద్దె ప్రాతిపదికన సమకూర్చుతుంది. గతేడాది(2024–25) ఆదాయం 20 శాతం ఎగసి రూ. 164 కోట్లను తాకగా.. నికర లాభం 36 శాతం జంప్‌చేసి రూ. 31 కోట్లకు చేరింది. -
ఐపీవోకు ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1.76 కోట్ల ఈక్విటీ షేర్లను యూకే ప్రమోటర్ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ విక్రయానికి ఉంచనుంది. కొత్తగా ఈక్విటీ జారీ లేకపోవడంతో ఐపీవో నిధులు ప్రమోటర్లకు చేరనున్నాయి. ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ అనుబంధ సంస్థ ఇది. ఈ భాగస్వామ్య సంస్థలో ఐసీఐసీఐ బ్యాంక్ వాటా 51 శాతంకాగా.. ప్రుడెన్షియల్ కార్పొరేషన్‌కు 49 శాతం వాటా ఉంది. కాగా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీలో 2 శాతం అదనపు వాటా కొనుగోలుకి బోర్డు అనుమతించినట్లు మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. తద్వారా సంస్థలో మెజారిటీ వాటాను నిలుపుకోనున్నట్లు తెలియజేసింది. ఐపీవో ద్వారా దేశీయంగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన ఐదో అసెట్ మేనేజ్మెంట్ సంస్థగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిలవనుంది.బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 0.7 శాతం నష్టంతో రూ. 1432 వద్ద ముగిసింది. -
ఇండిగో వెంచర్స్‌కు పెట్టుబడులు
ముంబై: విమానయాన దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కార్పొరేట్ వెంచర్ క్యాపిటల్ విభాగం ఇండిగో వెంచర్స్ తొలి ఫండ్ ద్వారా రూ. 450 కోట్లు సమీకరించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతితో గతేడాది ఆగస్ట్‌లో రూ. 600 కోట్ల సమీకరణ లక్ష్యంగా తొలిసారి ఫండ్‌కు తెరతీసింది. తొలి దశలో రూ. 450 కోట్లు సమకూర్చుకున్నట్లు ఇండిగో వెంచర్స్ తెలియజేసింది. కాగా.. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన ఏరోస్పేస్ స్టార్టప్ జే ఏరోస్పేస్లో తొలి పెట్టుబడికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించింది. అయితే పెట్టుబడి వివరాలు వెల్లడించలేదు. నిధులను అడ్వాన్స్డ్ డిజిటల్ తయారీ మౌలికసదుపాయాలు, ఏఐ ఆధారిత ఉత్పాదకత పెంపు(ప్రొడక్షన్ ఆప్టమైజేషన్), సరఫరా చైన్ వ్యవస్థలను ఏకంచేసే ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి, ఇంజినీరింగ్, ప్రొడక్షన్ నిపుణులను ఆకట్టుకోవడం తదితరాలకు వినియోగించనున్నట్లు ఇండిగో వెంచర్స్ వివరించింది. విమానయానం, తత్సంబంధిత రంగాలలో స్టార్టప్‌లకు ప్రాథమిక దశలో పెట్టుబడులను సమకూర్చేందుకు ఇండిగో వెంచర్స్ ఫండ్‌కు తెరతీసింది. బీఎస్ఈలో ఇండిగో షేరు 0.8 శాతం బలపడి రూ. 5,847 వద్ద ముగిసింది. -
లిస్టింగ్‌కి రెడీ.. ఆరు కంపెనీలకు సెబీ ఓకే
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఐదు కంపెనీల లిస్టింగ్ సన్నాహాలకు ఓకే చెప్పింది. జాబితాలో రైట్ వాటర్ ల్యూషన్స్(ఇండియా), వీడా క్లినికల్ రీసెర్చ్, ఎల్సీసీ ప్రాజెక్ట్స్, శ్రింగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర, సీడ్‌వర్క్స్ ఇంటర్నేషనల్ చేరాయి. ఈ ఐదు కంపెనీలు ఐపీవో చేపట్టేందుకు వీలుగా 2025 జనవరి–ఫిబ్రవరి మధ్య సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. మరోపక్క ఈ ఏడాది మార్చిలో వియ్ వర్క్ ఇండియా మేనేజ్మెంట్ ఇష్యూపై నిర్ణయాన్ని పక్కనపెట్టిన సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెరసి ఆరు కంపెనీల నిధుల సమీకరణకు లైన్ క్లియరైంది. వివరాలు చూద్దాం.. ఎంబసీ గ్రూప్ దన్ను ప్రీమియం, ఫ్లెక్సిబుల్ కార్యాలయాల నిర్వహణ సంస్థ వియ్ వర్క్ ఇండియా మేనేజ్మెంట్ పబ్లిక్ ఇష్యూకి అనుమతి లభించింది. ఎంబసీ గ్రూప్ ప్రమోట్ చేసిన కంపెనీ ఐపీవోలో భాగంగా 4.37 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. సంస్థలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నారు. క్లీన్ టెక్ కంపెనీ వాటర్ యాక్సెస్ యాక్సెలరేషన్ ఫండ్ ఎస్ఎల్పీకి పెట్టుబడులున్న క్లీన్ టెక్ సంస్థ రైట్ వాటర్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు రూ. 445 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ మొత్తం రూ. 745 కోట్లు సమీకరించాలని చూస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 225 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఆభరణాల తయారీ జ్యువెలరీ తయారీ కంపెనీ శ్రింగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర ఐపీవోకు సెబీ అనుమతించడంతో 2.43 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 250 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. ఈ బాటలో సీడ్‌వర్క్స్ ఇంటర్నేషనల్ సైతం లిస్టింగ్ సన్నాహాలు ప్రారంభించనుంది. దీనిలో భాగంగా కంపెనీలో ప్రస్తుత ఇన్వెస్టర్లు 5.19 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈ కంపెనీలన్నీ ఐపీవో ద్వారా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యే యోచనలో ఉన్నాయి.ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలు ఈపీసీ కంపెనీ ఎల్సీసీ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూకి సెబీ అనుమతించడంతో లిస్టింగ్ ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు సైతం 2.29 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.క్లినికల్ రీసెర్చ్ సంస్థ ప్రధానంగా క్లినికల్ రీసెర్చ్ కార్యకలాపాలు సమకూర్చే గుజరాత్ కంపెనీ వీడా క్లినికల్ రీసెర్చ్ ఐపీవోకు రెడీ అవుతోంది. ఇందుకు వీలుగా రూ. 185 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.3 కోట్ల షేర్లను ప్రమోటర్, ఇతర వాటాదారులు ఆఫర్ చేస్తారు. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ కొనుగోలుతోపాటు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. -
ఎఫ్‌అండ్‌వోలో రిటైలర్లకు నష్టాలే..
న్యూఢిల్లీ: గతేడాది(2024–25) ఈక్విటీ డెరివేటివ్స్‌లో అత్యధిక శాతం రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోయినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అంతక్రితం ఏడాది నమోదైన రీతిలోనే డెరివేటివ్స్‌లో చిన్న ఇన్వెస్టర్లు భారీగా దెబ్బతిన్నట్లు తెలియజేసింది. ఈ విభాగంలో వ్యక్తిగత ఇన్వెస్టర్ల నికర నష్టాలు వార్షికంగా 41 శాతం పెరిగి రూ. 1,05,603 కోట్లను తాకినట్లు వెల్లడించింది. ఎఫ్‌అండ్‌వో విభాగంలో రిటైలర్లకు 2023–24లో రూ. 74,812 కోట్ల నష్టాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ బాటలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో లావాదేవీలు చేపట్టే వ్యక్తిగత ఇన్వెస్టర్ల సంఖ్య సైతం 20 శాతం తగ్గినట్లు నివేదిక తెలియజేసింది. అంతకుపూర్వం రెండేళ్లలో ఈ విభాగంలో లావాదేవీలు చేపట్టే ప్రత్యేక రిటైలర్ల సంఖ్య 24 శాతం పుంజుకోవడం గమనార్హం! ఈక్విటీ ఇండెక్స్ డెరివేటివ్స్ మార్గదర్శకాలను పటిష్టపరుస్తూ 2024 అక్టోబర్ 1 నుంచి కొత్త చర్యలు ప్రకటించాక ఈక్విటీ డెరివేటివ్ విభాగంలో లావాదేవీలపై సెబీ విశ్లేషణ చేపట్టింది. ఇందుకు 2024 డిసెంబర్ నుంచి 2025 మే వరకూ మొత్తం రిటైల్ ఇన్వెస్టర్ల వ్యక్తిగత లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంది. మొత్తం రిటైల్ ట్రేడర్ల లాభనష్టాలను విశ్లేíÙంచాక దాదాపు 91 శాతం మంది నష్టపోయినట్లు గుర్తించింది. 2024 బాటలోనే రిటైల్ ట్రేడర్లు భారీగా పెట్టుబడులను కోల్పోయినట్లు సెబీ నివేదిక వివరించింది. నష్టాల తీరిలా: గత ఆరు నెలల కాలంలో ఇండెక్స్ ఆప్షన్స్ టర్నోవర్ ప్రీమియంలవారీగా చూస్తే వార్షికంగా 9 శాతం క్షీణించినట్లు సెబీ నివేదిక పేర్కొంది. నోషనల్‌గా మదింపు చేస్తే 29 శాతం తగ్గింది. అయితే రెండేళ్ల క్రితం పరిస్థితితో పోలిస్తే ఇండెక్స్ ఆప్షన్స్ పరిమాణం ప్రీమియంలవారీగా 14 శాతం పుంజుకుంది. నోషనల్‌గా 42 శాతం ఎగసింది. ఈక్విటీ డెరివేటివ్ విభాగంలో ప్రీమియంలవారీగా రిటైలర్ల టర్నోవర్ 11 శాతం క్షీణించింది. అయితే రెండేళ్ల క్రితం ఇదే కాలంలో 36 శాతం జంప్‌చేసింది. ఈ హెచ్చుతగ్గులు దేశీ మార్కెట్లో ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ప్రధానంగా ఇండెక్స్ ఆప్షన్స్‌లో అధిక లావాదేవీలను పట్టిచూపుతున్నట్లు నివేదిక ప్రస్తావించింది. ఇన్వెస్టర్ల పరిరక్షణ, మార్కెట్ నిలకడ యోచనతో ఇండెక్స్ ఆప్షన్స్‌లో లావాదేవీలు, టర్నోవర్‌ను పర్యవేక్షిస్తున్నట్లు సెబీ వివరించింది. ఈ బాటలోనే 2025 మే 29న రిస్కుల పర్యవేక్షణా విధానాలు తదితరాలకు సెబీ తెరతీసింది. జేన్ స్ట్రీట్ లాంటి రిస్క్‌లు పెద్దగా లేవు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే 3ముంబై: మార్కెట్లో కలకలం రేపిన హెడ్జ్ ఫండ్ జేన్ స్ట్రీట్ తరహా రిసు్కలేమీ పెద్దగా కనిపించడం లేదని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. నిఘాపరమైన సవాళ్ల వల్లే ఈ ఉదంతం చోటు చేసుకుందని, ఈ నేపథ్యంలో సర్వైలెన్స్‌పై సెబీ మరింతగా దృష్టి పెడుతోందని ఆయన చెప్పారు. నియంత్రణాధికారాలకు లోబడే జేన్ స్ట్రీట్‌పై చర్యలు తీసుకున్నామని, అయితే నిఘా, నిబంధనలను పటిష్టంగా అమలు చేయడం ద్వారానే నేరాలకు పాల్పడేవారిని కట్టడి చేయడానికి వీలవుతుందని పాండే పేర్కొన్నారు. డెరివేటివ్స్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు నియంత్రణ సంస్థ ఎలాంటి చర్యలు తీసుకున్నా అవి డేటా ఆధారితమైనవిగానే ఉంటాయని చెప్పారు. క్యాష్, డెరివేటివ్స్ విభాగాల్లో పొజిషన్లతో సూచీలను ప్రభావితం చేయడం ద్వారా రెండేళ్ల వ్యవధిలో అక్రమంగా ఆర్జించిన రూ. 4,800 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో ఖాతాకు బదలాయించాలని ఆదేశిస్తూ, జేన్ స్ట్రీట్ గ్రూప్ సంస్థలు భారత మార్కెట్లో లావాదేవీలు జరపకుండా సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
ఐపీవోకు స్టీమ్‌హౌస్ ఇండియా
ఇండ్రస్టియల్ స్టీమ్ అండ్ గ్యాస్ సరఫరా కంపెనీ స్టీమ్‌హౌస్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 500–700 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. మెయిన్‌బోర్డులో లిస్టింగ్‌పై కన్నేసిన కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సైతం ప్రాథమిక పత్రాలను దాఖలు చేసినట్లు వెల్లడించింది. 2014లో ఏర్పాటైన సంజూ గ్రూప్ కంపెనీ సూరత్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు విస్తరించింది. 167 క్లయింట్లకు సర్వీసులు అందిస్తోంది.ఇదీ చదవండి: పుట్టకతో చెవిటివారా? ‘ఫర్వాలేదు శబ్దాలు వినవచ్చు’పిరానా, దహేజ్ సెజ్సహా.. వపీ, అంకలేశ్వర్, నందెశారీ, పనోలీ ఫేజ్–2, 3లలో విస్తరణ చేపట్టింది. ఈ బాటలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, యూపీ, హర్యానా, రాజస్తాన్‌లలోనూ కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టింది. 2023–24లో రూ. 292 కోట్ల ఆదాయం, రూ. 26 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇటీవల రహస్య పద్ధతిలో ఫైలింగ్‌కు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాటా క్యాపిటల్, ఫిజిక్స్‌వాలా, ఇమేజిన్ మార్కెటింగ్(బోట్)తోపాటు.. షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్, గాజా ఆల్టర్నేటివ్ ఏఎంసీ, షిప్‌రాకెట్ ఇదే బాటలో సాగాయి. 2024 చివర్లో స్విగ్గీ, విశాల్ మెగామార్ట్ ఇదే విధంగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. -
క్రిజాక్ ఐపీవో జులై 2న
న్యూఢిల్లీ: విద్యార్థుల రిక్రూట్మెంట్ సొల్యూషన్లు అందించే క్రిజాక్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. జులై 2న ప్రారంభంకానున్న ఇష్యూ 4న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు జులై 1న షేర్లను కేటాయించనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు రూ. 860 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ నిధులు ప్రమోటర్లకు చేరనున్నాయి. కాగా.. గతేడాది నవంబర్‌లో రూ. 1,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. తాజాగా ఇష్యూ పరిమాణాన్ని రూ. 860 కోట్లకు కుదించింది. తొలుత 2024 మార్చిలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. అయితే జులైలో ప్రాస్పెక్టస్‌ను సెబీ తిప్పిపంపింది. ఆపై నవంబర్‌లో తిరిగి ఐపీవో చేపట్టేందుకు సెబీ తలుపు తట్టింది. 2025 మార్చిలో అనుమతి పొందింది. గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెంట్లకు బీటూబీ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ ద్వారా అంతర్జాతీయస్థాయిలో విద్యార్థుల రిక్రూట్మెంట్ సొల్యూషన్లు అందిస్తోంది. ఈ కోల్‌కతా కంపెనీ ద్వారా విద్యార్థులు యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఉన్నత చదువులకు వెళ్లేందుకు గ్లోబల్ సంస్థలు తోడ్పాటునిస్తున్నాయి. రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారా గత మూడేళ్లలో 75 దేశాలకుపైగా ఎన్రోల్మెంట్ అప్లికేషన్లకు కంపెనీ ప్లాట్‌ఫామ్ వీలు కల్పించింది. సుమారు 7.11 లక్షల విద్యార్థుల అప్లికేషన్ల ప్రాసెస్ చేసింది. కాగా.. గతేడాది(2024–25) రూ. 849 కోట్లకుపైగా ఆదాయం, రూ. 153 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
ఐపీవో స్ట్రీట్ ...లిస్టింగ్‌కు కంపెనీల క్యూ
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు మళ్లీ సరికొత్త గరిష్టాలవైపు పరుగు తీస్తుండటంతో గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. పలు అన్‌లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కడుతున్నాయి. వచ్చే వారం పలు దిగ్గజాలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానుండగా.. మరిన్ని కంపెనీలు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం.. రూ. 5,000 కోట్లకు రెడీ గత డిసెంబర్లో గోప్యతా విధాన పబ్లిక్ ఇష్యూ బాట పట్టిన విద్యా సంబంధ రుణాలందించే క్రెడిలా ఫిన్ సర్వీసెస్ సెబీకి తాజాగా అప్డేటెడ్ డాక్యుమెంట్లు అందించింది. గత నెలలో అనుమతి పొందిన కంపెనీ ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధపడుతోంది. ఇష్యూలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. వీటిలో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ రూ. 1,050 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా రూ. 600 కోట్ల సమీకరణపై కంపెనీ కన్నేసింది. దీంతో ఐపీవోలో ఇష్యూ పరిమాణం ఆ మేర తగ్గే అవకాశముంది. 2006లో ఏర్పాటైన కంపెనీ నిధులను భవిష్యత్‌లో బిజినెస్ వృద్ధికి అవసరమయ్యే మూలధన పటిష్టతకు వినియోగించనుంది. విద్యా సంబంధ రుణాలపై అధికంగా దృష్టిసారించే ఎన్బీఎఫ్సీలో హెచ్డీఎఫ్సీ 2009లో ఇన్వెస్ట్ చేసింది. 2010 నుంచి హెచ్‌డీఎఫ్‌సీకి అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోంది. అయితే 2023లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో మాతృ సంస్థ విలీనంకావడంతో ఈక్యూటీ, క్రిస్‌క్యాపిటల్ గ్రూప్‌లు ఉమ్మడిగా 2024 మార్చిలో 90 శాతం వాటాను కొనుగోలు చేశాయి. రూ. 1,500 కోట్లకు సై పునరుత్పాక ఇంధన రంగంలో కార్యకలాపాలు కలిగిన రేజన్ సోలార్ స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్టింగ్‌కు వీలుగా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా గుజరాత్ కంపెనీ రూ. 1,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా రూ. 300 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇది జరిగితే ఐపీవో పరిమాణం తగ్గనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,265 కోట్లు సొంత అనుబంధ సంస్థ రేజన్ ఎనర్జీపై వెచి్చంచనుంది. తద్వారా 3.5 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఏర్పాటవుతున్న సంస్థకు ఆర్థికంగా దన్నునివ్వనుంది. సోలార్ ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీలో కార్యకలాపాలు విస్తరించిన రేజన్ సోలార్ 2017లో ప్రారంభమైంది. 2025 మార్చికల్లా 6 గిగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్యానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, మైక్రోటెక్ ఇంటర్నేషనల్, అక్మే క్లీన్టెక్ సొల్యూషన్స్, వీగార్డ్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలకు సేవలందిస్తోంది. గతేడాది (కేలండర్ 2024)లో రూ. 1,957 కోట్ల ఆదాయం, రూ. 239 కోట్ల నికర లాభం ఆర్జించింది. వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్ హోమ్ అండ్ ఫరీ్నíÙంగ్స్ కంపెనీ వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో రూ. 468 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా 5.84 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 2016లో ఏర్పాటైన కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 145 కోట్లు ప్రస్తుత స్టోర్ల లీజ్తోపాటు, లైసెన్స్ ఫీజు చెల్లింపులకు వినియోగించనుంది. మరో రూ. 82 కోట్లు 117 కోకో రెగ్యులర్ స్టోర్లతోపాటు ఒక జుంబో స్టోర్ ఏర్పాటుకు, రూ. 15 కోట్లు కొత్త పరికరాలు, మెషీనరీ కొనుగోలుకీ వెచి్చంచనుంది. ఈ బాటలో రూ. 108 కోట్లు మార్కెటింగ్, ఇతర వ్యయాలకు కేటాయించనుంది. 2023–24లో రూ. 986 కోట్లకుపైగా ఆదాయం సాధించింది. సుదీప్ ఫార్మా ఐపీవో బాట ఔషధ రంగ కంపెనీ సుదీప్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 95 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు 1,00,76,492 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 76 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. గుజరాత్‌లోని నందెసారి యూనిట్లో ఉత్పత్తికి వీలుగా మెషీనరీ కొనుగోలుకి నిధులు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. 1989లో ఏర్పాటైన వడోదర సంస్థ సుదీప్ ఫార్మా ప్రధానంగా ఫార్మాస్యూటికల్, ఫుడ్ అంట్ న్యూట్రిషన్లో కార్యకలాపాలు విస్తరించింది. కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ విభాగంలో 100 రకాల ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఫార్మా, ఫుడ్, న్యూట్రిషన్ పరిశ్రమల్లో వీటిని వినియోగిస్తారు. వడోదరలోగల మూడు యూనిట్ల ద్వారా మొత్తం 65,579 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ క్లయింట్ల జాబితాలో ఫార్మా రంగ దిగ్గజాలు ఫైజర్, ఇన్‌టాస్ ఫార్మా, మ్యాన్‌కైండ్ ఫార్మా, మెర్క్ గ్రూప్, క్యాడిలా ఫార్మా, మైక్రో ల్యాబ్స్‌తోపాటు ఫ్రెంచ్ దిగ్గజం గ్రూప్ దానోన్ చేరింది. గత క్యాలండర్ ఏడాది(2024)లో ఆదాయం రూ. 344 కోట్లను అధిగమించగా, దాదాపు రూ. 95 కోట్ల నికర లాభం ఆర్జించింది.రూ. 2,500 కోట్లపై చూపు దిగ్గజాలు టీపీజీ, ఫ్లిప్‌కార్ట్, మిరాయ్ అసెట్స్ తదితరాలకు పెట్టుబడులున్న ఈకామర్స్ కంపెనీ షాడోఫ్యాక్స్ వచ్చే వారం సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం తద్వారా రూ. 2,500 కోట్లవరకూ సమకూర్చుకునేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు కొత్తగా ఈక్విటీ జారీతోపాటు ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను సామర్థ్య విస్తరణ, వృద్ధి, నెట్‌వర్క్‌పై వినియోగించనుంది. 2015లో ఏర్పాటైన కంపెనీ ఫిబ్రవరిలో సుమారు రూ. 6,000 కోట్ల విలువలో నిధులను సమీకరించింది. -
సెబీ నిబంధనల్లో వెసులుబాటు
పెట్టుబడి సలహాదారులు (ఐఏలు), పరిశోధన విశ్లేషకులకు (ఆర్ఏలు) సెబీ నిబంధనల్లో వెసులుబాటు కల్పించింది. తమ డిపాజిట్ అవసరాలకు అనుగుణంగా వారు ఇప్పటి వరకు నిబంధనల ప్రకారం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎఫ్డీలకు అదనంగా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, ఓవర్‌నైట్ మ్యూచువల్ ఫండ్స్‌కు సైతం సెబీ అనుమతించింది.ఏదేనీ షెడ్యూల్డ్ బ్యాంకులో ఎఫ్డీ చేసి, అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఏఎస్‌బీ) పేరిట లీన్మార్క్డ్ (హక్కులు కల్పించడం) చేయాల్సి వచ్చేది. ఎఫ్డీ ఖాతాల ప్రారంభం విషయంలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు సెబీ దృష్టికి తీసుకెళ్లారు.ఎఫ్డీకి ప్రత్యామ్నాయంగా ఏఎస్బీకి అనుకూలంగా మార్క్ చేసిన లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కూడా అనుమతించవచ్చని వారు సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు సెబీ బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది.ఈ ప్రతిపాదనను ఆమోదించిన సెబీ బోర్డు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లను తక్కువ రిస్క్, తక్కువ అస్థిర సాధనాలుగా పరిగణించవచ్చని పేర్కొంది. అంతేకాకుండా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ పై కూడా లైను మార్క్ చేయవచ్చు. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై లీన్ నిర్వహణ, లీన్ అమలు సెక్యూరిటీస్ మార్కెట్ ఎకోసిస్టమ్ పరిధిలోనే ఉందని, ఇది మరింత సమర్థతను తీసుకువస్తుందని సెబీ తెలిపింది. -
పీఎస్‌యూల డీలిస్టింగ్ సరళతరం
ప్రభుత్వ రంగ సంస్థలు స్వచ్ఛందంగా డీలిస్ట్ అయ్యేందుకు వెసులుబాటు కల్పించేలా నిబంధనలను సడలించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రమోటర్ షేర్‌హోల్డింగ్ 90 శాతానికి చేరితేనే డీలిస్టింగ్ విజయవంతమైనట్లవుతుంది. దీని కోసం షేరు కనీస ధరను 60 రోజుల సగటు రేటు, గత 26 వారాల్లో గరిష్ట ధర తదితర అంశాల ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. అయితే, బుక్ వేల్యూ తక్కువగా ఉన్నా లేక ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా గానీ మార్కెట్లో రేటు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ విధానంతో డీలిస్టింగ్ ప్రక్రియ పీఎస్‌యూలకు చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది.ఈ నేపథ్యంలోనే 90 శాతం పైగా ప్రభుత్వ వాటాలున్న పీఎస్‌యూల స్వచ్ఛంద డీలిస్టింగ్‌కి సంబంధించి కనీస ధరను లెక్కించే విధానాన్ని, మూడింట రెండొంతుల మంది పబ్లిక్ షేర్హోల్డర్లు ఆమోదం తెలపాలన్న నిబంధనను సడలించాలని సెబీ భావిస్తోంది. మరోవైపు, కేవలం భారతీయ ప్రభుత్వ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేసే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) పాటించాల్సిన నిబంధనలను సడలించాలని చైర్మన్ తుహిన్ కాంత పాండే సారథ్యంలో జరిగిన రెండో బోర్డు మీటింగ్‌లో నిర్ణయించింది. స్టార్టప్ వ్యవస్థాపకులకు ఊరట..పబ్లిక్ ఇష్యూకి వెళ్లాలనుకునే అంకుర సంస్థల వ్యవస్థాపకులకు ఊరటనిచ్చే ప్రతిపాదనకు సెబీ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఐపీవో ప్రాథమిక పత్రాలను దాఖలు చేయడానికి కనీసం ఒక్క ఏడాది ముందు కేటాయించిన ఎసాప్స్‌ను (ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు) వారు అట్టే పెట్టుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐపీవోకెళ్లే సమయంలో ఎసాప్స్ సహా ఇతరత్రా షేర్ల కేటాయింపు రూపంలో ప్రయోజనాలేవీ అంకురాల ప్రమోటర్ల వద్ద ఉండకూడదు. ఒకవేళ ఉంటే, వాటిని ఐపీవోకి ముందుగానే విక్రయించాలి.ఇదీ చదవండి: ‘ఆరు నెలల్లో అంతా తేల్చేస్తాం..’విదేశాల నుంచి భారత్‌కు తమ ప్రధాన కార్యాలయాన్ని మార్చుకోవాలనుకుంటున్న సంస్థలకు తాజా సడలింపు ఉపయోగపడనుంది. అటు ఎన్ఎస్ఈఎల్ పేమెంట్ సంక్షోభంలో ఎన్ఫోర్స్మెంట్ చర్యలు ఎదుర్కొన్న నిర్దిష్ట స్టాక్ బ్రోకర్ల కోసం సెటిల్మెంట్ స్కీమును ప్రవేశపెట్టినట్లు సెబీ తెలిపింది. ఈ స్కీమును ఎంచుకోవడం ద్వారా తమపై ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు వారికి వీలుంటుంది. ఇక, ఐపీవో పత్రాల ఫైలింగ్‌కు ముందు కీలక మేనేజ్మెంట్ సిబ్బంది, ప్రస్తుత ఉద్యోగులు, డైరెక్టర్లు దగ్గర షేర్లు డీమ్యాట్ రూపంలో ఉండాలనే ప్రతిపాదనకు కూడా సెబీ ఆమోదముద్ర వేసింది. -
మోతీలాల్ ఓస్వాల్‌పై సెబీ జరిమానా
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై రూ.3 లక్షల జరిమానా విధించింది. స్టాక్ బ్రోకర్ నిబంధనలు అతిక్రమించినందుకు విధించిన జరిమానాను 45 రోజుల్లోగా చెల్లించవలసిందిగా ఆదేశించింది. 2022 ఏప్రిల్ నుంచి 2024 జనవరి కాలంలో సెబీ నిర్దిష్ట పరిశోధన చేపట్టింది.ఇదీ చదవండి: చమురు సలసల.. రూపాయి డీలా13 ఎన్ఎస్ఈ ట్రేడింగ్ టెర్మినళ్లు అదీకృత ప్రదేశాల్లో లేనట్లు ఈ సందర్భంగా గుర్తించింది. 13 టెర్మినళ్లకుగాను 5 టెర్మినళ్ల నుంచి లావాదేవీలు నిర్వహించినట్లు సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. 9 బీఎస్ఈ టెర్మినళ్లు సంబంధిత ప్రాంతాల్లో లేవని తెలియజేసింది. లావాదేవీలు 1 టెర్మినల్ నుంచే జరిగినట్లు వెల్లడించింది. నాలుగు ఎన్ఎస్ఈ, 4 బీఎస్ఈ టెర్మినళ్లలో అనుమతించిన వ్యక్తులుకాకుండా ఇతరులు నిర్వహిస్తున్నట్లు సెబీ దర్యాప్తులో గుర్తించింది. -
ఫలితాలతోపాటే వేగంగా వార్షిక నివేదికలు
ముంబై: కంపెనీలు ఆర్థిక ఫలితాల వెల్లడికి, వార్షిక నివేదికల విడుదలకు మధ్య అంతరాన్ని తగ్గించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కోరింది. దీనివల్ల ఇన్వెస్టర్ల విశ్వాసం ఇనుమడిస్తుందని కంపెనీ సీఎఫ్‌వోలకు సూచించింది. ఆడిట్ కమిటీలు, ఆడిటర్లతో సీఎఫ్‌వోలు మరింత లోతుగా సంప్రదింపులు నిర్వహించాలని, తద్వారా మరింత సహకారంతో ఆర్థిక ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకోవాలని సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత నారాయణ్ కోరారు. సీఎఫ్‌వోలకు సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా విశ్వాసం నిలబెట్టడంలో సీఎఫ్‌వోలు పోషిస్తున్న ప్రాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ప్రస్తుతం వార్షిక ఫలితాలు, వార్షిక నివేదికల వెల్లడికి మధ్య అంతరం 70 నుంచి 140 రోజుల వరకు ఉంటోంది. ఖాతాలు, అంతర్గత నియంత్రణలు, కంపెనీ ఆడిటర్ రిపోర్ట్ గురించి మరింత లోతైన వివరాలతో కూడిన వార్షిక నివేదిక మరింత సమాచారయుక్తంగా ఉంటుంది. ఈ జాప్యాన్ని తగ్గిస్తే ఇన్వెస్టర్లకు పారదర్శకత పెరుగుతుంది’’అని అనంత నారాయణ్ పేర్కొన్నారు. -
ఎలక్ట్రిసిటీ ఎఫ్అండ్వోకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ఇకపై నెలవారీ ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. విద్యుత్ ధరల హెచ్చుతగ్గులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు హెడ్జింగ్ టూల్స్‌గా వీటిని మార్కెట్ వర్గాలు వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. తద్వారా విద్యుత్ రంగంలో తగిన ధరల సంకేతాలతోపాటు.. పెట్టుబడుల ప్రోత్సాహానికి వీలు కలగనున్నట్లు తెలియజేసింది. విద్యుదుత్పత్తితోపాటు.. ప్రసారం, పంపిణీ, రిటైల్ తదితర విభాగాలలో పెట్టుబడులు పెరిగే వీలున్నట్లు వివరించింది. ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ ఎకోసిస్టమ్ మరింత విస్తరించేందుకు తాజా అనుమతి సహకరించగలదని, ఇందుకు ఇది తొలి అడుగు అని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు. నియంత్రణ సంస్థల అనుమతులకు అనుగుణంగా త్రైమాసిక, వార్షిక తదితర దీర్ఘకాలిక కాంట్రాక్టులు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. కాగా.. ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్‌ను ప్రవేశపెట్టేందుకు సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు గత వారం ఎంసీఎక్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త యూపీఐ విధానం ఇన్వెస్టర్ల పరిరక్షణ లక్ష్యంగా సెబీ కొత్త యూపీఐ మార్గదర్శకాలను తప్పనిసరి చేసింది. ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించే అన్ని రిజిస్టర్డ్ ఇంటరీ్మడియరీలకు ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. సెక్యూరిటీల మార్కెట్లో ఆర్థిక లావాదేవీలకు వీలు, వీటి భద్రత లక్ష్యంగా తాజా యూపీఐ మెకనిజంకు తెరతీసినట్లు సెబీ తెలియజేసింది. వెరసి 2025 అక్టోబర్ 1నుంచి యూపీఐ చెల్లింపుల మెకనిజం అమల్లోకి రానున్నట్లు సెబీ చీఫ్ తుహిన్ కాంతా పాండే వెల్లడించారు. ఇటీవల కాలంలో అన్‌రిజిస్టర్డ్ సంస్థలు ఇన్వెస్టర్లను మోసగించడం ఎక్కువైన నేపథ్యంలో సెబీ తాజా చర్యలు చేపట్టింది. ధృవీకరించిన, భద్రతతోకూడిన చెల్లింపుల చానల్‌కు తెరతీయడం ద్వారా సెక్యూరిటీల మార్కెట్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులకు రక్షణ కల్పించనున్నట్లు పాండే వివరించారు. -
నాలుగు కంపెనీలు రెడీ
ఇటీవల తిరిగి కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ ప్రభావంతో పలు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌వైపు చూస్తున్నాయి. విభిన్న పంపుల తయారీ కంపెనీ ఓస్వాల్ పంప్స్ ఐపీవో ఈ నెల 13న ప్రారంభంకానుండగా.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి 4 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు తాజాగా అనుమతి పొందాయి. జాబితాలో కెంట్ ఆర్వో, కరమ్‌టరా ఇంజినీరింగ్, మంగళ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, విద్యా వైర్స్ చేరాయి.వాటర్ ప్యూరిఫయర్ కంపెనీ కెంట్ ఆర్వో సిస్టమ్స్‌తోపాటు.. ట్రాన్స్ఫార్మర్ల తయారీ కంపెనీ మంగళ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, వైండింగ్, కండక్టివిటీ ప్రొడక్టుల కంపెనీ విద్యా వైర్స్, కరమ్‌టరా ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు సెబీ నుంచి తాజాగా అనుమతులు పొందాయి. ఈ నాలుగు సంస్థలు సెబీకి జనవరిలో ప్రాస్పెక్టస్ దాఖలు చేయగా.. ఈ నెల 3–6 మధ్య గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రాస్పెక్టస్‌ల ప్రకారం ఈ సంస్థలు ఉమ్మడిగా కనీసం రూ. 2,500 కోట్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. సాయి ఇన్ఫినియం ఈ నెల 4న సెబీ నుంచి ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. కోటి షేర్ల విక్రయంఐపీవోలో భాగంగా కెంట్ ఆర్వో సిస్టమ్స్ కోటి ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. తద్వారా ఇష్యూ నిధులు ప్రమోటర్లకు చేరనున్నాయి. కరమ్‌టరా ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూకింద రూ. 1,350 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,750 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,050 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. రూ. 450 కోట్లపై కన్నుఐపీవోలో ద్వారా మంగళ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ రూ. 450 కోట్లు సమకూర్చుకోనుంది. ఇందుకు అనుగుణంగా ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఈ నిధులలో రూ. 120 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మరో రూ. 120 కోట్లు రాజస్తాన్‌లోని శికార్ యూనిట్ విస్తరణతోపాటు జైపూర్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులకు వినియోగించనుంది. మిగిలిన నిధులలో రూ. 96 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. కాగా.. విద్యా వైర్స్ ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్లు కోటి షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ ఏఎల్సీయూలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇదీ చదవండి: ఎన్ఆర్ఐలకు భారత్‌లో ఐటీ నోటీసులు!ఓస్వాల్ పంప్స్ @ రూ.584–614సబ్మెర్సిబుల్, మోనోబ్లాక్ పంపుల తయారీ కంపెనీ ఓస్వాల్ పంప్స్ షేరుకి రూ. 584–614 ధరల శ్రేణిలో పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇష్యూ ఈ నెల 13న ప్రారంభమై 17న ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ. 890 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 497 కోట్ల విలువైన మరో 81 లక్షల షేర్లను ప్రమోటర్ వివేక్ గుప్తా విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ మొత్తం రూ. 1,387 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను సొంత అనుబంధ సంస్థ ఓస్వాల్ సోలార్‌లో పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. అంతేకాకుండా హర్యానాలోని కర్ణాల్లో కొత్తగా తయారీ యూనిట్లను ఏర్పాటుతోపాటు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వెచ్చించనుంది. -
ఐపీవోకు లలితా జ్యువెలరీ
న్యూఢిల్లీ: బంగారు ఆభరణ వర్తక దిగ్గజం లలితా జ్యువెలరీ మార్ట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.1,200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ఎం.కిరణ్ కుమార్ జైన్ విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. అర్హతగల సంస్థ ఉద్యోగులకు డిస్కౌంట్లో షేర్లను ఆఫర్ చేయనుంది. ఐపీవో నిధుల్లో రూ. 1,015 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు వెచ్చించనుంది. 1985లో చెన్నైలోని టీనగర్లో తొలి స్టోర్‌ను ప్రారంభించిన కంపెనీ 2024 డిసెంబర్‌కల్లా 56 స్టోర్లకు విస్తరించింది. తద్వారా గోల్డ్, సిల్వర్, డైమండ్ జ్యువెలరీ విక్రయిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో అధిక స్టోర్లు కలిగిన కంపెనీకి తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలోనూ కార్యకలాపాలున్నాయి. 2024 డిసెంబర్31తో ముగిసిన 9 నెలల్లో రూ.12,595 కోట్ల ఆదాయం, రూ. 262 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
సెబీ పేరుతో మోసాలు
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తన పేరిట జరుగుతున్న మోసాల విషయంలో ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసింది. సెబీ అధికారులమని చెప్పుకుంటూ కొందరు మోసగాళ్లు రెగ్యులేటర్ పేరు, లోగో, లెటర్‌హెడ్‌ను వాడుకుని, అమాయక ఇన్వెస్టర్లకు నకిలీ నోటీసులు పంపిస్తూ, మోసగిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు వివరించింది.ఇదీ చదవండి: ఆర్బీఐ బాటలోనే బ్యాంక్లుఇన్వెస్టరు నిర్దిష్ట ఉల్లంఘనకు పాల్పడినందున చర్యలు తీసుకోకుండా ఉండాలంటే పెనాల్టీ కట్టాలంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా మోసగాళ్లు నకిలీ నోటీసులు పంపుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించాలని, తమకు ఇలాంటి సమాచారం వస్తే, సెబీ జారీ చేసిందా లేదా అనేది ధృవీకరించుకోవాలని తెలిపింది. తాము ఇచ్చే ప్రతి ఆర్డరుపైనా, పంపించే అన్ని లెటర్లు, నోటీసులు, షోకాజ్ నోటీసులు, సమన్లపైనా ఒక విశిష్ట రిఫరెన్స్ నంబరు ఉంటుందని సెబీ తెలిపింది. అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు, ఆర్డర్లు, రికవరీ సర్టిఫికెట్లు అన్నీ తమ వెబ్సైట్లో ఉంటాయని పేర్కొంది. -
డబ్బులు ఊరికే రావు: ఐపీవోకి వస్తున్న లలితా జ్యువెలరీ
తమిళనాడుకు చెందిన ప్రముఖ జువెలరీ రిటైలర్ లలితా జ్యువెలరీ మార్ట్ క్యాపిటల్ మార్కెట్లలోకి అడుగు పెడుతోంది. ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు వస్తోంది. ఈమేరకు సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. ఈ ఐపీవోలో భాగంగా ఫ్రెష్ ఈక్విటీ షేర్ల కింద రూ.1,200 కోట్ల విలువైన షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ జారీ చేయనున్నారు.1985లో ఏర్పాటైన లలితా జ్యువెల్లరీ తాజా ఇష్యూ ద్వారా వచ్చే రూ.1,014.5 కోట్లను భారత్ లో 12 కొత్త స్టోర్ల ఏర్పాటుకు, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించాలని యోచిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని 46 నగరాల్లోని 56 స్టోర్ల ద్వారా ఆభరణాల ఉత్పత్తులను ఈ సంస్థ విక్రయిస్తోంది.లలితా జ్యువెల్లరీ 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.359.8 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అలాగే ఆదాయం 26 శాతం పెరిగి రూ.16,788 కోట్లకు చేరింది. 2024 డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి రూ.262.3 కోట్ల లాభం, రూ.12,594.7 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. లలితా జ్యువెలరీ మార్ట్ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ గా ఆనంద్ రాఠీ అడ్వైజర్స్, ఎక్విరస్ క్యాపిటల్‌ను నియమించారు. -
ఐపీవోకి వస్తున్న ఏక్వస్
న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యురబుల్ గూడ్స్, వైమానిక విడిభాగాల కాంట్రాక్ట్ తయారీ కంపెనీ ఏక్వస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా మార్గంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా 20 కోట్ల డాలర్లు(రూ. 1,700 కోట్లు) సమీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.తాజా ఈక్విటీ జారీ, ప్రస్తుత ఇన్వెస్టర్ల వాటా విక్రయం ద్వారా కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్‌కానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీలో ఇప్పటికే అమికస్, అమన్సా, స్టెడ్‌వ్యూ క్యాపిటల్‌సహా కాటమారన్, స్పర్ట గ్రూప్ తదితరాలు ఇన్వెస్ట్ చేశాయి. కంపెనీ ఏరోస్పేస్, కన్జూమర్ రంగాలకు ప్రెసిషన్ మ్యాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్‌ను సమకూర్చుతోందిఏక్వస్ భారత్‌తోపాటు ఫ్రాన్స్, మూఎస్ఏలలో తయారీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. బహుళ పరిశ్రమ విభాగాలలో తన ప్రపంచ కస్టమర్ బేస్‌కు ఉత్పత్తులను అందిస్తోంది. ఈ సంస్థకు భారత్‌లోని కర్ణాటకలో మూడు తయారీ క్లస్టర్లు (బెల్గావి, హుబ్బళ్ళి, కొప్పల్) ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. టాటా ఎలక్ట్రానిక్స్, మదర్సన్ గ్రూప్, జబిల్తో కలిసి ఏక్వస్ కూడా యాపిల్ ఉత్పత్తుల కోసం మెకానికల్ విడిభాగాలను ఉత్పత్తి చేస్తోంది. -
మెహుల్ చోక్సీ ఖాతాల అటాచ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మెహుల్ చోక్సీ ఆస్తులను అటాచ్ చేసేందుకు ఆదేశించింది. వీటిలో చోక్సీ బ్యాంక్ ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ ఉన్నాయి. జ్యువెలరీ కంపెనీ గీతాంజలి జెమ్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘన కేసులో సెబీ రూ. 2.1 కోట్లు రికవర్ చేసుకునేందుకు తాజా ఆదేశాలు జారీ చేసింది. గత నెల 15న చోక్సీకి డిమాండ్ నోటీసు జారీ చేసిన సెబీ 15 రోజుల గడువు ముగియడంతో రికవరీ చర్యలకు తెరతీసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు నేపథ్యంలో 2022 జనవరిలోనూ సెబీ జరిమానా విధించింది. అయితే చెల్లింపులు చేపట్టకపోవడంతో డిమాండ్ నోటీసు జారీ చేసింది. గీతాంజలి జెమ్స్ చైర్మన్, ఎండీ చోక్సీ ప్రమోటర్ గ్రూప్‌లోని వ్యక్తికావడంతోపాటు.. నీరవ్ మోడీకి మేనమామకూడా. ప్రభుత్వ రంగ పీఎన్బీలో రూ. 14,000 కోట్లమేర మోసానికి తెరతీసినట్లు ఇరువురిపైనా కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే పీఎన్బీని మోసగించిన అంశం వెలుగుచూసిన 2018 మొదట్లో వీరిరువురూ విదేశాలకు పారిపోగా.. చోక్సీని బెల్జియంలోనూ, మోడీని స్కాట్లాండ్లోనూ అక్కడి ప్రభుత్వాలు అరెస్ట్ చేయడం గమనార్హం! -
ఐపీవోకు 6 కంపెనీలు రెడీ
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆరు కంపెనీల ఐపీవో ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుబంధ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌సహా డార్ఫ్–కెటల్ కెమికల్స్, విక్రమ్ సోలార్ తదితరాలు చేరాయి. ఈ ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా ఉమ్మడిగా రూ. 20,000 కోట్లకుపైగా సమీకరించాలని ప్రణాళికలు వేశాయి. 2024 అక్టోబర్– 2025 జనవరి మధ్య సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. సెబీ అనుమతి పొందిన జాబితాలో ఏవన్ స్టీల్స్ ఇండియా, శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్, శ్రీజి షిప్పింగ్ గ్లోబల్ సైతం ఉన్నాయి. గత నెలలో వచి్చన ఐదు ఐపీవోలతో కలసి 2025లో ఇప్పటివరకూ 16 కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగడం గమనార్హం!రూ. 12,500 కోట్లపై కన్నుఐపీవోలో హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ చేయనుంది. ఎన్బీఎఫ్సీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 94.36 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను టైర్–1 మూలధన పటిష్టతకు వెచ్చించనుంది.రూ. 5,000 కోట్లకు రెడీ డార్ఫ్–కెటల్ కెమికల్స్ ఐపీవోలో రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. మరో రూ. 3,500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ మెనన్ ఫ్యామిలీ హోల్డింగ్స్ ట్రస్ట్ విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 829 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 333 కోట్లు అనుబంధ సంస్థలో పెట్టుబడికి వెచ్చించనుంది. సోలార్ మాడ్యూల్ సంస్థ ఐపీవోలో విక్రమ్ సోలార్ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 17.45 మిలియన్ షేర్లను ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయించనున్నాయి. ఐపీవో నిధుల్లో రూ. 793 కోట్లు అనుబంధ సంస్థ వీఎస్ఎల్ గ్రీన్ పవర్ పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. తద్వారా 3,000 మెగావాట్ల సోలా ర్ సెల్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.లాజిస్టిక్స్ సొల్యూషన్ల సంస్థ షిప్పింగ్, లాజిస్టిక్స్సొల్యూషన్లు అందించే శ్రీజి షిప్పింగ్ గ్లోబల్ ఐపీవోలో భాగంగా 2 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ప్రధానంగా డ్రై బల్క్ కార్గోకు సేవలందించే కంపెనీ ఇష్యూ నిధుల్లో రూ. 289 కోట్లు సూపర్‌మ్యాక్స్ విభాగంలో సెకండరీ మార్కెట్ నుంచి డ్రై బల్క్ క్యారియర్స్ కొనుగోలుకి వెచ్చించనుంది. మరో రూ. 20 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది. ఏవన్ స్టీల్స్ ఇండియా సై ఐపీవోలో భాగంగా ఏవన్ స్టీల్స్ ఇండియా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 50 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ వన్యా స్టీల్స్‌లో పెట్టుబడులకు వినియోగించనుంది. తద్వారా మెషీనరీ కొనుగోలు, తయారీ సామర్థ్య విస్తరణ, విద్యుత్ యూనిట్ ఏర్పాటు, రుణ చెల్లింపులు చేపట్టనుంది.బంగారు ఆభరణ కంపెనీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా బంగారు ఆభరణాల తయారీ కంపెనీ శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ 1.8 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 46 కోట్లు జైపూర్ యూనిట్ ఏర్పాటుకు వెచ్చించనుంది. మరో రూ. 190 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ. 20 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది. -
ఐపీవోల బాటలో బీఎఫ్ఎస్ఐ సంస్థలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగం) కంపెనీలు భారీ స్థాయిలో పబ్లిక్ ఇష్యూకి రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి పలు కంపెనీలు ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లు దాఖలు చేశాయి. కొత్తగా షేర్లను జారీ చేయడం లేక ఆఫర్ ఫర్ సేల్ రూపంలో లేదా రెండింటి మేళవింపుతో ఈ ఇష్యూలు ఉండబోతున్నాయి. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇష్యూల ద్వారా బీఎఫ్ఎస్ఐ కంపెనీల నిధుల సమీకరణ రూ. 50,000 కోట్ల మార్కును దాటేసే అవకాశం ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో సమీకరించిన దానికి మూడు రెట్లు అధికం. 2025 ఆర్థిక సంవత్సరంలో బీఎఫ్ఎస్ఐ రంగానికి చెందిన ఎనిమిది కంపెనీలు ఐపీవోల ద్వారా సుమారు రూ. 16,275 కోట్లు సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 10 సంస్థలు రూ. 9,655 కోట్ల మొత్తాన్ని పబ్లిక్ ఇష్యూల ద్వారా సమకూర్చుకున్నాయి. హెచ్డీబీ ఫైనాన్షియల్ రూ. 12,500 కోట్లు... పబ్లిక్ ఇష్యూలకు వస్తున్న వాటిలో హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ (రూ. 12,500 కోట్లు), క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్ (5,000 కోట్లు), అవాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ (రూ. 3,500 కోట్లు), హీరో ఫిన్‌కార్ప్ (రూ. 3,668 కోట్లు), వెరిటాస్ ఫైనాన్స్ (రూ. 2,800 కోట్లు), ఎస్కే ఫైనాన్స్ (రూ. 2,200 కోట్లు) మొదలైన సంస్థలు ఉన్నాయి. టాటా క్యాపిటల్ నిర్దిష్టంగా ఎంత సమీకరించేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ అన్‌లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్ తీరుతెన్నులను బట్టి చూస్తే 2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఇష్యూ ఉండొచ్చని భావిస్తున్నారు. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ మొదలైనవి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వ్యాపార అవసరాలరీత్యా.. నియంత్రణ సంస్థపరమైన నిబంధనలు, మార్కెట్.. వ్యాపార అవసరాల రీత్యా పలు బీఎఫ్ఎస్ఐ కంపెనీలు ఐపీవో బాట పడుతున్నాయి. దాదాపు డజను పైగా సంస్థలు పబ్లిక్ ఇష్యూకి సిద్ధమవుతున్నాయి. కొంతకాలం పాటు మందగించిన ఈక్విటీ మార్కెట్లు, మళ్లీ కనిష్ట స్థాయుల నుంచి 15–20 శాతం పుంజుకున్నాయని ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ హెడ్ (ఫండమెంటల్ రీసెర్చ్ – ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్) నరేంద్ర సోలంకి తెలిపారు. దీంతో ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు బీఎఫ్ఎస్ఐ సంస్థలు ధీమాగా ముందుకొస్తున్నాయని వివరించారు. ఇక లిక్విడిటీ కొరతను అధిగమించేందుకు ఆయా కంపెనీల మాతృసంస్థలు .. ముఖ్యంగా బ్యాంకులకు, ఈ ఐపీవోలు కొంత ఉపయోగకరంగా ఉండగలవని తెలిపారు. క్యాపిటల్ అడిక్వసీ నిష్పత్తి నిబంధనలను పాటించడానికి, కార్యకలాపాల విస్తరణకు, రుణభారాలను తగ్గించుకునేందుకు ఐపీవోలు వ్యూహాత్మక మార్గంగా ఉంటాయని ప్రమోటర్లు భావిస్తున్నట్లు వివరించారు. చాలా కంపెనీలు వ్యాపార వృద్ధికి అవసరమైన మూలధనాన్ని సమకూర్చుకునేందుకు, నియంత్రణ సంస్థపరమైన నిబంధనలు పాటించేందుకు, నిధుల సమీకరణకు ఉపయోగపడే వనరులను పెంచుకునేందుకు చాలా మటుకు నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బీమా సంస్థలు, ఫిన్‌టెక్ సంస్థలు ప్రైమరీ మార్కెట్ల బాట పడుతున్నాయి. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ), రిజర్వ్ బ్యాంక్ నిబంధనల కారణంగా పారదర్శకత, గవర్నెన్స్‌పరమైన ప్రమాణాలను మెరుగుపర్చుకునేందుకు ఐపీవోలకు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇన్వెస్టర్లు ఆచితూచి కంపెనీలను ఎంచుకుంటున్న నేపథ్యంలో ఈ ఐపీవోల్లో ఎన్ని భారీ స్థాయిలో విజయవంతమవుతాయో చూడాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. -
సెబీ మాజీ చీఫ్ మాధవికి క్లీన్ చిట్
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ విషయంలో అనైతికంగా వ్యవహరించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ మాజీ చీఫ్ మాధవి పురి బచ్‌కు లోక్‌పాల్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమెపై ఆరోపణలన్నీ ఊహాగానాలు, అభిప్రాయాలతో కూడుకున్నవేనని వ్యాఖ్యానించింది.టీఎంసీ ఎంపీ మహువా మైత్రా సహా ఇతరుల ఫిర్యాదులన్నీ కూడా, అదానీ కంపెనీలను టార్గెట్ చేసుకుంటారని పేరొందిన ఓ షార్ట్‌సెల్లర్ నివేదిక ఆధారంగా చేసినవేనని పేర్కొంది. ఇవన్నీ నిరాధారమైనవేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఆదేశించడానికి ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.వాటిపై సెబీ చైర్మన్ హోదాలో బచ్ విచారణ జరపాల్సినప్పటికీ.. అదానీ గ్రూప్ కుంభకోణంతో సంబంధమున్న ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో గతంలో ఆమెకి, ఆమె భర్తకి వాటాలు ఉన్నందున సరైన చర్యలు తీసుకోలేదంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. ఈ ప్రాతిపదికన దాఖలైన ఫిర్యాదులను లోక్‌పాల్ తాజాగా కొట్టివేసింది. -
హీరో ఫిన్‌కార్ప్ ఐపీవోకు వచ్చేస్తోంది..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం హీరో ఫిన్‌కార్ప్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 2,100 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది.వీటికి జతగా మరో రూ. 1,568 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా కంపెనీ రూ. 3,668 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. లిస్టింగ్‌కు వీలుగా 2024 ఆగస్ట్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది.ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ మూలధన అవసరాలకు ఎన్బీఎఫ్సీ హీరో ఫిన్‌కార్ప్ వినియోగించనుంది. తద్వారా రుణ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. 2024 మార్చికల్లా కంపెనీ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ. 51,281 కోట్లుగా నమోదయ్యాయి. -
ఇండస్ఇండ్ బ్యాంక్ కథ్పాలియాపై సెబీ నిషేధం
న్యూఢిల్లీ: ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన ఆరోపణలపై సంస్థ మాజీ సీఈవో సుమంత్ కథ్పాలియాతో పాటు మరో నలుగురికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 19.78 కోట్ల జరిమానా విధించింది. అలాగే వారు సెక్యూరిటీస్ మార్కెట్లో లావాదేవీలు జరపకుండా నిషేధం విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సెక్యూరిటీస్‌ను కొనడం, అమ్మడం లేదా ఇతరత్రా ఏ విధమైన లావాదేవీలు జరపరాదని స్పష్టం చేసింది. నిషేధం ఎదుర్కొంటున్న మిగతావారిలో అప్పటి డిప్యూటీ సీఈవో అరుణ్ ఖురానా, ట్రెజరీ ఆపరేషన్స్ హెడ్ సుశాంత్ సౌరవ్, జీఎంజీ ఆపరేషన్స్ హెడ్ రోహన్ జఠన్న, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనిల్ మార్కో రావు ఉన్నారు. కీలక హోదాల్లో ఉన్న ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకి, సంస్థకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు, బైటికి రావడానికి ముందే తెలుస్తాయి. ఆ వివరాలను ఉపయోగించుకుని వీరు బ్యాంక్ షేర్లలో ట్రేడింగ్ చేసి లబ్ధి పొందారని సెబీ విచారణలో వెల్లడైంది. -
కొత్త ఈపీఎఫ్‌వో.. ఫిక్స్డ్ డిపాజిట్లు.. జూన్ 1 నుంచి కీలక మార్పులు
మే నెల ముగింపునకు వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో జూన్ నెల ప్రారంభం కాబోతోంది. దేశంలో అనేక ముఖ్యమైన ఆర్థిక మార్పులు జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇవి మీ పొదుపు, క్రెడిట్ కార్డు వాడకం, ప్రావిడెంట్ ఫండ్ రాబడిని ప్రభావితం చేస్తాయి. జూన్ 1 నుంచి ఏయే మార్పులు అమల్లోకి రానున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం..ఈపీఎఫ్ఓ 3.0ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO) జూన్ 1 నుంచి అప్‌గ్రేడ్ చేసిన నూతన ఈపీఎఫ్ఓ 3.0 వ్యవస్థను ప్రారంభించనుంది. పీఎఫ్ ఉపసంహరణలను సులభతరం చేయడం, కేవైసీ అప్డేట్లను క్రమబద్ధీకరించడం, క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడం ఈ కొత్త విధానం లక్ష్యం. ఈపీఎఫ్ నిధులను సులభంగా, వేగంగా పొందేందుకు వీలుగా ఏటీఎం తరహా కార్డులను ప్రవేశపెట్టడం ఇందులో ప్రధాన ఆకర్షణ.క్రెడిట్ కార్డ్ రూల్స్🔸యాక్సిస్ బ్యాంక్ జూన్ 20 నుంచి క్రెడిట్ కార్డు లావాదేవీల వర్గీకరణలో సవరణలు చేయనుంది. రివార్డ్ పాయింట్లు, ఫీజు మినహాయింపులు ఏ లావాదేవీలకు వర్తిస్తాయో కొత్త అప్ డేట్ స్పష్టం చేస్తుంది.🔸కోటక్ మహీంద్రా బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్‌లు, ఫీజులలో జూన్ 1 నుండి మార్పులను అమలు చేస్తుంది. ఖర్చు కేటగిరీలలో సంపాదించిన రివార్డ్ పాయింట్లపై కొత్త పరిమితులు రానున్నాయి. అలాగే కొన్ని క్రెడిట్ కార్డ్ ఫీజులు పెరుగుతాయి. ఇవి కార్డు రకాన్ని బట్టి మారుతాయి. సవరించిన బెనిఫిట్ లు, ఖర్చులకు అనుగుణంగా కార్డుదారులు తమ కార్డు వినియోగాన్ని మార్చుకోవాలి.ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల సవరణలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఇప్పటికే తమ ఎఫ్డీ వడ్డీ రేట్లను తగ్గించాయి. మరిన్ని బ్యాంకులు జూన్ 1 నుండి వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. ప్రస్తుత రేట్లు 6.5 శాతం నుంచి 7.5 శాతం మధ్య ఉన్నందున, రేట్ల కోతకు ముందు అధిక రాబడిని పొందడానికి ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను ఇప్పుడే లాక్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.సెబీ మ్యూచువల్ ఫండ్ కటాఫ్ టైమింగ్ మార్పులుసెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) జూన్ 1 నుండి ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ (ఎంఎఫ్ఓఎస్) కటాఫ్ సమయాలను సవరించనుంది. ఈ మార్పు క్లయింట్ ఫండ్స్ తాకట్టు ఆధారిత అప్ స్ట్రీమింగ్‌ను క్రమబద్ధీకరిస్తుంది. ఒక రోజులో మెచ్యూరిటీ అయ్యే రిస్క్ లేని ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే ఓవర్‌నైట్ ఫండ్లు సర్దుబాటు చేసిన రిడంప్షన్, లావాదేవీ సమయాలను కలిగి ఉంటాయి. ఇది నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఏవీ) లెక్కలను ప్రభావితం చేస్తుంది. -
గెట్.. సెట్.. గ్రో!
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకింగ్ సంస్థ బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా కంపెనీ బిలియన్ డాలర్ల(రూ. 8,500 కోట్లు)వరకూ సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రో బ్రాండుతో కంపెనీ రిటైల్ బ్రోకింగ్ సర్వీసులందించే సంగతి తెలిసిందే. ఐపీవోలో భాగంగా కొత్తగా ఈక్విటీ జారీసహా ప్రస్తుత వాటాదారులు షేర్లను విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గ్రోలో ఇప్పటికే పీక్ ఎక్స్‌వీ, టైగర్ క్యాపిటల్, సత్య నాదెళ్ల(మైక్రోసాఫ్ట్ సీఈవో) తదితరులు ఇన్వెస్ట్ చేశారు. ఇష్యూ నిధులను టెక్నాలజీ డెవలప్మెంట్, వ్యాపార విస్తరణ తదితరాలకు వినియోగించనుంది. 2016లో ఏర్పాటైన కంపెనీ ప్రస్తుత విలువ 7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 60,000 కోట్లు)కు చేరుకున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. వేగంగా విస్తరించిన కంపెనీ 2025 మార్చికల్లా 26 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం గతేడాది(2024–25) 34 లక్షల మంది కొత్త కస్టమర్లను జత చేసుకుంది. మొత్తం యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 95 లక్షల నుంచి 1.29 కోట్లకు ఎగసింది. 2023లో కంపెనీ టర్న్అరౌండ్ సాధించి రూ. 449 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం రూ. 1,277 కోట్లను తాకింది. 2024కల్లా ఆదాయం రూ. 3,145 కోట్లకు ఎగసింది. రూ. 535 కోట్ల నిర్వహణ లాభం సాధించినప్పటికీ రూ. 1,340 కోట్ల వన్‌టైమ్ పన్ను చెల్లింపుల కారణంగా రూ. 805 కోట్ల నికర నష్టం ప్రకటించింది. -
సెబీ బోర్డు సమావేశంలో కీలక మార్పులు?
రాబోయే బోర్డు సమావేశంలో మార్కెట్లో సులభతర వ్యాపారాన్ని పెంపొందించడానికి సెక్యూరిటీ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిబంధనలను క్రమబద్ధీకరించడంపై దృష్టి సారించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 18న జరిగే ఈ సమావేశంలో కీలక ప్రతిపాదనలపై చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. అందులోని కొన్నింటి గురించి కింద తెలియజేశాం.పేపర్ వర్క్‌ను తగ్గించడానికి, కార్యకలాపాలను మరింత సులభతరం చేయడానికి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్(క్యూఐపీ)ల నిబంధనలు క్రమబద్ధీకరించడం.రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఆర్ఈఐటీలు), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులను (ఇన్వీట్లు) ఈక్విటీలతో అనుసంధానం చేయడం వల్ల ఈ రంగాల్లో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెరిగే అవకాశాన్ని మెరుగుపరచడం.కో-ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్స్‌లో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)లను సులభతరం చేయడం.ప్రభుత్వ బాండ్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) నిబంధనలను సడలించడం.చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎస్ఎంఈ) నిబంధనలను బలోపేతం చేయడం.క్లియరింగ్ కార్పొరేషన్ల స్వతంత్రతను ఖరారు చేయడం.ఇదీ చదవండి: 5-10 ఏళ్లలో ప్రమాదంలో ఉద్యోగాలుఈ ప్రతిపాదనలను మెరుగుపరచడానికి స్టాక్ బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతో సహా పరిశ్రమ వాటాదారులతో సెబీ సంప్రదింపులు జరుపుతోంది. మార్కెట్ పారదర్శకత, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ సమావేశలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని అంచనా. -
ఎఫ్‌అండ్‌వో.. ఓ డేంజర్ ‘గేమ్’!
ప్రసాద్ (55) ఓ ప్రైవేటు ఉద్యోగి. ఇటీవలి మార్కెట్ దిద్దుబాటుకు ముందు ఎఫ్‌అండ్‌వో (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) మార్కెట్లోకి అడుగుపెట్టాడు. ఒక ప్రైవేటు సంస్థ సిఫారసులతో ట్రేడ్ చేయగా.. ఒక్కరోజులోనే రూ. లక్షన్నర లాభం కళ్లజూడడంతో రెట్టించిన ఉత్సాహంతో ట్రేడింగ్ చేశాడు. పది రోజుల తర్వాత అకౌంట్ చూసుకుంటే అప్పటి వరకు వచ్చిన లాభాన్నంతా మళ్లీ మార్కెట్టే పట్టుకుపోయిందని అర్థమైంది. అంతేకాదు, అదనంగా రూ.2 లక్షల పెట్టుబడి కూడా కరిగిపోయింది. అయినా సరే పోయినచోటే వెతుక్కోవాలనే తపనతో.. ప్రసాద్ పొద్దస్తమానం ఎఫ్‌అండ్‌వో ఆలోచనలతో బతికేస్తున్నాడు. ఎఫ్‌అండ్‌వో మార్కెట్ విషయంలో రిటైల్ ఇన్వెస్టర్ల పరిణతి లేమికి మచ్చుకు ఇదొక్క ఉదాహరణ మాత్రమే! సెబీ అధ్యయనం ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌అండ్‌వో విభాగంలో ప్రతి 10 మంది ట్రేడర్లకు గాను లాభం పొందింది ఒక్కరే. 91.1 శాతం మంది (73 లక్షల మంది సుమారు) ఎఫ్‌అండ్‌వోలో నష్టాలు పోగేసుకోవాల్సి వచ్చింది. ఇక మిగిలిన 8.9 శాతం మందిలో రూ. లక్షపైన లాభం సొంతం చేసుకున్నది కూడా కేవలం ఒక్క శాతమే ఉన్నారు. 75 శాతానికి పైగా ఎఫ్‌అండ్‌వో ట్రేడర్లు 2023–24లో తమ ఆదాయం రూ.5 లక్షల్లోపే అని వెల్లడించడం వీరంతా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారన్నది స్పష్టం చేస్తోంది. అంతేకాదు వీరంతా అంతకు ముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ చేతులు కాల్చుకున్నట్టు సెబీ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. అందుకే ఎఫ్‌అండ్‌వో చిన్న ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్ల ‘గేమ్’ కానే కాదని నిపుణులు తరచూ చెప్పేది. ఇనిస్టిట్యూషనల్ ట్రేడర్లతో పోటీపడే సామర్థ్యాలు, వసతులు, నైపుణ్యాలు రిటైల్ ఇన్వెస్టర్లకు లేకపోవడంతో ఎఫ్‌అండ్‌వోలో నెగ్గలేని పరిస్థితి. సమగ్రమైన అవగాహన, తగినంత పెట్టుబడి, ట్రేడింగ్ వ్యూహాలు, టెక్నాలజీ, వసతులతోనే ఎఫ్‌అండ్‌వోలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం సరైనదన్న సూచన నిపుణుల నుంచి వస్తోంది. వేగంగా లాభాలు అసాధ్యం! కరోనా విపత్తు తర్వాత ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. 2019లో 3.93 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉంటే అవి ప్రస్తుతం 19.24 కోట్లకు పెరగడం దీనికి నిదర్శనం. కొత్త ఇన్వెస్టర్లలో ప్రధానంగా కనిపించే సమస్య.. లాభాల ఆకాంక్షలు ఎక్కువ, పెట్టుబడి తక్కువ. కొద్ది పెట్టుబడితోనే భారీగా సంపాదించేయొచ్చన్న అత్యాశ వారిని ఎఫ్‌అండ్‌వో మార్కెట్‌వైపు ఆకర్షిస్తోంది. ‘‘డెరివేటివ్‌లు (ఎఫ్‌అండ్‌వో) అన్నవి హెడ్జింగ్, ఆర్బిట్రేజ్, యాక్టివ్ ట్రేడింగ్ కోసం రూపొందించినవి. కానీ, ప్రస్తుత రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని పరిశీలిస్తే స్పెక్యులేటివ్ ట్రేడింగ్వైపే మొగ్గు కనిపిస్తోంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ సహజ్ అగర్వాల్ తెలిపారు. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్టు.. ఎఫ్‌అండ్‌వోలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే పెట్టుబడి అంత వేగంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇవేమీ అర్థం చేసుకోకుండా దీన్నొక ఆదాయ మార్గంగా చూస్తుండడం మరింత రిస్‌్కను ఆహ్వానించడమే అవుతుంది. రుణంతో మరింత రిస్క్ ఎఫ్‌అండ్‌వో మార్కెట్లో మార్జిన్ ఫండింగ్, వ్యక్తిగత రుణాలతో ట్రేడింగ్‌కు సైతం రిటైల్ ఇన్వెస్టర్లు వెనుకాడడం లేదు. ట్రేడ్లతో నష్టపోయి.. తమవద్ద పెట్టుబడి సరిపోక రుణ సదుపాయంతో పొజిషన్లు తీసుకుంటున్నారు. లాభంతో తీర్చేయొచ్చన్న అంచనాలతో మరింత రిస్క్ తీసుకుంటున్నారు. నష్టం వస్తే పరిస్థితి ఏంటన్న ఆలోచన కూడా కనిపించడం లేదు. ఇన్వెస్టర్లలో ప్రవర్తనా పరమైన బలహీనతలు సైతం అధిక నష్టాలకు దారితీస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక ట్రేడ్‌లో నష్టం రాగా, తదుపరి ట్రేడ్‌లో లాభం వస్తుందన్న అతివిశ్వాసం పనికిరాదంటున్నారు. ‘‘ఆప్షన్ ధరల తీరు, నమూనాలు, డెరివేటివ్‌లను సరిగ్గా అర్థం చేసుకోకుండా.. యూట్యూబ్ ఛానళ్లను చూడడం, సోషల్ మీడియా గురువులను అనుసరించడం లేదంటే వాట్సాప్ గ్రూప్‌లలో చేరడం ద్వారా ఎఫ్‌అండ్‌వోలో లాభాలు సంపాదించేయగలమన్నది తప్పుడు అవగాహనే అవుతుంది’’ అని ప్రైమ్ వెల్త్‌కు చెందిన సరి్టఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (సీఎఫ్‌పీ) అలోక్ దూబే పేర్కొన్నారు. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లలో సరైన విజ్ఞానం, క్రమశిక్షణ ఉండడం లేదన్నారు. ఇవి లేకుండా ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ గ్యాంబ్లింగే అవుతుందని హెచ్చరించారు. పెద్ద సవాలు.. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ అన్నది ఎంతో సంక్లిష్టమైనదని నిపుణుల విశ్లేషణ. మార్కెట్, స్టాక్స్ కదలికలు దేశీ, అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా ఉంటాయి. కనుక ఒక స్టాక్ పెరుగుతుందా? పడుతుందా? అని ఊహించడం అసాధ్యం. ఈ సవాళ్లను అధిగమించేందుకు సరైన వ్యూహాలు ఉండాలి. ట్రేడ్స్ ఎంపికకు స్పష్టమైన, నిర్మాణాత్మకమైన విధానం లేకుండా ఎఫ్‌అండ్‌వో మార్కెట్లోకి అడుగు పెట్టడం ఎక్కువ మంది ఇన్వెస్టర్లు చేస్తున్న తప్పిదమని కోటక్ సెక్యూరిటీస్ డెరివేటివ్స్ హెడ్ సహజ్ అగర్వాల్ తెలిపారు. అసలు ఎఫ్‌అండ్‌వో మార్కెట్ ఎలా పనిచేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలని సూచించారు. క్యాష్ మార్కెట్ లేదా ఎఫ్‌అండ్‌వో లేదా కమోడిటీలు ఇలా ఏ విభాగమైనప్పటికీ కాల పరీక్షలకు నిలిచిన చక్కని వ్యూహాలు అవసమరని.. అవి లేకుండా ట్రేడింగ్ చేయడం అవకాశమే కానీ, నైపుణ్యం కాబోదన్నారు. ‘‘ఎఫ్‌అండ్‌వో వారం, నెలవారీ సిరీస్‌లలో రోజులు గడుస్తూ, ఎక్స్పైరీ సమీపిస్తున్న క్రమంలో అనుకున్న దిశలో దాని చలనం లేకపోతే, అప్పుడు ఆప్షన్ల విలువ వేగంగా తగ్గిపోతుంటుంది. ఏదైనా ఒక వ్యూహం ఫలించి మంచి లాభం వచ్చినప్పటికీ.. అదే వ్యూహం ప్రతి రోజూ ఫలితమిస్తుందని గ్యారంటీ లేదు’’ అని అగర్వాల్ వివరించారు. ఫిన్‌ఫ్లుయెన్సర్స్ మాయలోపడితే అంతే.. బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ ప్రకారం.. ఎఫ్‌అండ్‌వోలోకి ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్లు అడుగు పెట్టడం వెనుక ఆర్థిక ప్రభావశీలురు (ఫిన్ఫ్లూయెర్స్) పరోక్ష ప్రోద్బలం, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఎఫ్‌అండ్‌వోలో తాము పెద్ద మొత్తంలో సంపాదించామంటూ యూట్యూబ్, ఎక్స్ ప్లాట్‌ఫామ్, ఇన్స్టా్రగామ్లపై కనిపించే ఎన్నో వీడియోలు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తున్నాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా.. అప్పటి వరకు ఎఫ్‌అండ్‌వో మొహం చూడని వారు సైతం ట్రేడింగ్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్థిక ప్రభావశీలురులో రాబడులను ఎక్కువ చేసి చూపించడంపై ఉన్న శ్రద్ధ అదే సమయంలో రిస్‌్కలు, ట్రేడింగ్ స్ట్రాటజీలను వెల్లడించడంపై ఉండదు. దీంతో ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ ధనవంతులు కావడానికి సులభ మార్గం అన్న తప్పుడు అభిప్రాయానికి దారితీస్తోంది. అందుకే ఫిన్‌ఫ్లుయెన్సర్స్ తీరును నియంత్రించేందుకు సెబీ ఎన్నో కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. ఇన్‌స్టిట్యూటషనల్ ఇన్వెస్టర్లదేపైచేయి ఎఫ్‌అండ్‌వో మార్కెట్లో మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి.. అతి కొద్ది మంది బడా ఇన్వెస్టర్లు, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు సమర్పయామిగా మారుతోంది. ‘‘ఎఫ్‌అండ్‌వో విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్లతో పోల్చుకుంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్లకు స్పష్టమైన అనుకూలతలు ఉన్నాయి. గొప్ప టెక్నాలజీ వసతులు, ట్రేడ్లపై తక్కువ చార్జీలు, క్రమశిక్షణతో కూడిన విధానాలు వారి సొంతం’’ అని రెలిగేర్ బ్రోకింగ్ రిటైల్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవిసింగ్ వివరించారు. 2023–24లో ప్రొప్రయిటరీ ట్రేడర్లు (బ్యాంక్‌లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌లు, బ్రోకరేజీలు తదితర) రూ.33,000 కోట్లు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ.28,000 కోట్ల చొప్పున ఎఫ్‌అండ్‌వో మార్కెట్లో లాభాలు పోగేసుకున్నారు. రిటైల్ ట్రేడర్లు ఉమ్మడిగా రూ.61,000 కోట్లు నష్టపోయారు. లావాదేవీల చార్జీలు దీనికి అదనం. ‘‘అతి విశ్వాసం, పాక్షిక వాదం తదితర ప్రవర్తనా లోపాలకు ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు దూరంగా ఉంటారు. రిటైల్ ఇన్వెస్టర్లను ఉచ్చులోకి లాగేవి ఇవే. అత్యాధునిక టూల్స్, వ్యయాల పరంగా సానుకూలత, సహేతుక నిర్ణయాలు ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు ఎఫ్‌అండ్‌వో మార్కెట్లో అనుకూలిస్తున్నాయి’’ అని రవిసింగ్ తెలిపారు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు ఆల్గోరిథమ్ ట్రేడింగ్ (ఎప్పుడు ఏ ధరలో కొనుగోలు, విక్రయాలు చేయాలన్న కోడింగ్ సాఫ్ట్వేర్) అత్యంత అనుకూలించే అంశం. ప్రొప్రయిటరీ ట్రేడర్లలో 96 శాతం మందికి లాభాలు ఈ మార్గంలోనే వస్తున్నట్టు రవిసింగ్ తెలిపారు. భావోద్వేగాలతో సంబంధం లేకుండా ధరల గమనం ఆధారంగా వేగంగా కొనుగోలు, అమ్మకాల లావాదేవీలను ఆల్గోరిథమ్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ పూర్తి చేస్తాయి. రిటైల్ ఇన్వెస్టర్లలో 13 శాతం మందే ఆల్గోరిథమ్ ట్రేడింగ్ వినియోగిస్తున్నారు. ‘‘ఇనిసిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు తాజా మార్కెట్ సమాచారాన్ని మైక్రో సెకన్లలోనే తెలుసుకోగలరు. ఆప్షన్లతో హెడ్జ్ చేసుకోగలరు. వోలటాలిటీ స్ప్రెడ్స్ (తటస్థ ఆప్షన్ విధానం), నేరుగా మార్కెట్ యాక్సెస్, తక్కువ చార్జీలు వారికి అనుకూలం. రిటైల్ ట్రేడర్లు కొంచెం ఆలస్యంగా వచ్చే డేటాపై ఆధారపడుతుంటారు. ట్రేడ్వారీ చార్జీలు వీరికి ఎక్కువ. అంచనాలు తప్పడం, సోషల్ మీడియా టిప్స్ వారికి ప్రతికూలం’’ అని రవిసింగ్ వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్ల తప్పటడుగులు → ఫ్యూచర్స్, ఆప్షన్లు ఎలా పనిచేస్తాయో కూడా తెలియకుండా ఎఫ్‌అండ్‌వోలోకి పెట్టుబడితో అడుగుపెట్టడం. → మార్కెట్ సంకేతాలను, కాంట్రాక్టుల సంక్లిష్టతలను తప్పుగా అర్థం చేసుకోవడం. → మార్జిన్ ఫండింగ్‌తో ట్రేడ్లు చేయడం. → నష్టాన్ని పరిమితం చేసుకునేందుకు స్టాప్‌లాస్ ఆర్డర్లను వినియోగించుకోకపోవడం. → స్పష్టమైన ప్రణాళిక లేకుండా అత్యాశ, భయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం. → నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మరిన్ని ట్రేడ్లు చేయడం. → తరచూ ట్రేడ్లు చేయడం ద్వారా చార్జీల రూపంలో అధికంగా నష్టపోవడం. → ప్రతికూల పరిణామాల్లోనూ ట్రేడ్లు కొనసాగించడం. → ఎలాంటి వ్యూహాలు లేకుండా మార్కెట్లో వచ్చే సమాచారం ఆధారంగా స్వీయ అంచనాలతో ట్రేడ్లు చేయడం. ప్రయోజనాలు వేరు.. ఎఫ్‌అండ్‌వో అన్నది నిజమైన స్టాక్స్ కాకుండా డిజిటల్ కాంట్రాక్టులు. కనుక 10–20 శాతం మార్జిన్‌తోనే 100 శాతం విలువైన ఫ్యూచర్ కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆప్షన్లు అయితే ఇంకా తక్కువ పెట్టుబడికే వస్తాయి. మార్కెట్ పతనాల్లో స్టాక్స్ హోల్డింగ్స్ విలువను కాపాడుకునేందుకు ఎఫ్‌అండ్‌వోను హెడ్జింగ్ టూల్ కింద బడా ఇన్వెస్టర్లు ఉపయోగించుకుంటారు. మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ హెడ్జింగ్ స్ట్రాటజీలు తెలియవు. పైగా వారి పెట్టుబడి హెడ్జ్ చేసుకునే స్థాయిలోనూ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ పథకాల తరఫున ఫండ్ మేనేజర్లు ఈ హెడ్జింగ్ టూల్స్‌ను వినియోగించుకునేందుకు అనుమతి ఉంది. సెబీ ఇటీవలే అనుమతించిన స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్) అనే కొత్త మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో అయితే ఫండ్ మేనేజర్లు తమ నిర్వహణ ఆస్తుల్లో గరిష్టంగా 20 శాతం వరకు ఎఫ్‌అండ్‌వో ఎక్స్పోజర్ తీసుకునేందుకు అనుమతి ఉంది. కనుక రిస్క్ ఉన్నా అధిక రాబడి కోరుకునే వారు సిఫ్లను పరిశీలించొచ్చు. ఇందులో కనీసం రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమిటి మార్గం..? ‘‘భావోద్వేగాలతో కూడిన నిర్ణయాలు, అపరిమిత ట్రేడింగ్, స్టాప్‌లాస్‌లను నిర్లక్ష్యం చేయడం, సరైన ప్రణాళిక లేకపోవడం పెట్టుబడిని వేగంగా హరించేస్తుంది. విజయవంతమైన ట్రేడింగ్ అంటే సానుకూల పరిస్థితుల్లో లాభాలు ఆర్జించడమే కాదు. క్రమశిక్షణతో ప్రతికూలతలను అధిగమించి పెట్టుబడిని కాపాడుకోవడం కూడా’’ అని సహజ్ అగర్వాల్ తెలిపారు. → డెరివేటివ్‌లకు సంబంధించి సాంకేతిక సంక్లిష్టతలను అర్థం చేసుకోవడంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించాలి. మార్జిన్ అవసరాలు, అస్థిరతలు, ఆప్షన్ ధరల తీరుతెన్నులను అర్థం చేసుకోవాలి. టెక్నికల్ అంశాలు తెలియాలి. – సంప్రదాయ స్టాక్స్‌లో పెట్టుబడులతో పోలి్చనప్పుడు ఎఫ్‌అండ్‌వోలో పెట్టుబడులపై ప్రాథమి క అవగాహన ఒక్కటే సరిపోదు. తగినంత వి జ్ఞానం కోసం గట్టిగా కృషి చేయాల్సిందే. వేగంగా లాభాలు సంపాదించాలన్న కాంక్షతో చాలా మంది రిటైల్ ట్రేడర్లు దీన్ని విస్మరిస్తుంటారు. – దశాబ్దాల అనుభవం, అత్యాధునిక టెక్నాలజీ టూల్స్, పెట్టుబడి బలంతో ఉన్న ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లతో పోటీపడాలంటే రిటైల్ ఇన్వెస్టర్లు సైతం తగిన విధంగా సన్నద్ధం అవ్వాలి. – స్పెక్యులేటివ్ ధోరణిని వీడి క్రమశిక్షణతో కూడిన వ్యూహాలు, హెడ్జింగ్ స్ట్రాటజీలపై దృష్టి పెట్టాలి. – ఆర్థిక ప్రభావశీలురు, తప్పుదోవ పట్టించే కంటెంట్‌కు దూరంగా ఉండాలి. ట్రేడింగ్, సాంకేతిక అంశాలపై విఖ్యాత ఇన్వెస్టర్లు రాసిన పుస్తకాలను చదవి అపోహలు తొలగించుకోవాలి. ‘‘ ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ రెండూ విరుద్ధమైనవి. పెట్టుబడులకు సహనం, దీర్ఘకాల దృష్టి అవసరం. ట్రేడింగ్‌లో రిస్‌్కతో కూడిన తక్షణ వ్యూహాత్మక చర్య అవసరం. అవగాహన కలిగిన రిటైల్ ఇన్వెస్టర్లు సైతం తమ స్వల్పకాల, దీర్ఘకాల లక్ష్యాల కోసం సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌కు పరిమితం కావడం మంచిది. ఈ విషయంలోనూ నిపుణుల మార్గదర్శనం అవసరమే’’ అని సహజ్ అగర్వాల్ సూచించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎన్ఎస్ఈ ఐపీవో సవాళ్లకు చెక్
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పబ్లిక్ ఇష్యూకి అడ్డుగా నిలుస్తున్న సమస్యలు త్వరలో పరిష్కారంకాగలవని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. కొన్ని అంశాల కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) ఐపీవో ప్రతిపాదన సెబీ వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.కీలక యాజమాన్య వ్యక్తులకు చెల్లించిన పరిహారం, టెక్నాలజీ, క్లియరింగ్ కార్పొరేషన్లో మెజారిటీ ఓనర్షిప్ తదితరాలకు పరిష్కారం లభించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలనూ తొలగించేందుకు ఎన్ఎస్ఈ, సెబీ చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అసోచామ్ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో పాండే ఈ విషయాలు వెల్లడించారు. ఇందుకు గడువును ప్రకటించనప్పటికీ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలియజేశారు. ఎన్వోసీ కోసం సెబీకి ఎన్ఎస్ఈ తిరిగి దరఖాస్తు చేసిన నేపథ్యంలో పాండే వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. -
ఐపీవోకు ఏడు కంపెనీలు రెడీ
దేశీ స్టాక్ మార్కెట్లు ఇటీవల తిరిగి జోరందుకోవడంతో మరోసారి ప్రైమరీ మార్కెట్లకు జోష్ వస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో తొలిగా ఏథర్ ఎనర్జీ ఐపీవో ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించగా.. సుమారు 10 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌వైపు సాగుతున్నాయి. బొరానా వీవ్స్, బెల్రైజ్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ బాటలో మరో 7 కంపెనీలు సన్నాహాలు ప్రారంభించనున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ 7 కంపెనీలు ఉమ్మడిగా రూ.3,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికలు అమలు చేయనున్నాయి. ఇవన్నీ 2024 అక్టోబర్– 2025 జనవరి మధ్య కాలంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం..హెచ్డీఎఫ్సీ క్రెడిలాగతంలో హెచ్డీఎఫ్సీ క్రెడిలాగా కార్యకలాపాలు నిర్వహించిన క్రెడిలా ఫైనాన్షియల్ సరీ్వసెస్ కాన్ఫిడెన్షియల్(గోప్యత) పద్ధతిలో ప్రాస్పెక్టస్‌ను డిసెంబర్లో దాఖలు చేసింది. అంటే ప్రాస్పెక్టస్ వివరాలు గోప్యంగా ఉంచేందుకు వీలుంటుంది. కంపెనీ ప్రధానంగా విద్యాసంబంధ రుణాలను అందిస్తోంది.శ్రీ లోటస్ డెవలపర్స్ అండ్ రియల్టీబాలీవుడ్ స్టార్స్‌తోపాటు.. సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కొచాలియాకు పెట్టుబడులున్న శ్రీ లోటస్ డెవలపర్స్ అండ్ రియల్టీ ఐపీవో ద్వారా రూ. 792 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు వీలుగా కొత్తగా ఈక్విటీ షేర్లు జారీ చేయనుంది. ఐపీవో నిధుల ద్వారా అనుబంధ సంస్థలు రిచ్‌ఫీల్ రియల్టీ, ధ్యాన్ ప్రాజెక్ట్స్, త్రిక్షా రియల్టీలో పెట్టుబడులు సమకూర్చనుంది. మరికొన్ని నిధులను నిర్మాణంలో ఉన్న అమల్ఫి, ఆర్కేడియన్, వరుణ్ ప్రాజెక్టులపై వెచ్చించనుంది.యూరో ప్రతీక్వాల్ ప్యానల్ డెకొరేటివ్ పరిశ్రమలో కార్యకలాపాలు విస్తరించిన యూరో ప్రతీక్ ఐపీవో ద్వారా రూ. 730 కోట్లు అందుకునే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలో కొంతమేర విక్రయానికి ఉంచనున్నారు. మైనింగ్, లాజిస్టిక్స్ నాగ్‌పూర్ కంపెనీ కాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, మెషీనరీ కొనుగోలు తదితరాలకు వినియోగించనుంది.జారో ఇన్స్టిట్యూట్ఐపీవోలో భాగంగా జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ రూ. 170 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్ మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 570 కోట్లు అందుకోవాలని చూస్తోంది. నిధులను బ్రాండ్ పటిష్టత, ప్రకటనలు, రుణ చెల్లింపులు తదితరాలకు వెచి్చంచనుంది. జెన్సన్స్ ఇండస్ట్రీస్ఐపీవోలో భాగంగా జెన్సన్స్ ఇండస్ట్రీస్ రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్ మరో 94.61 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలు.. తదితరాలకు వెచ్చించనుంది.ఇదీ చదవండి: దానశీలురు ఈ కార్పొరేట్లుజెమ్ ఆరోమాటిక్స్స్పెషాలిటీ ఇన్‌గ్రెడియంట్స్ తయారీ ముంబై కంపెనీ జెమ్ ఆరోమాటిక్స్ ఐపీవోలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 89.24 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసు
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 2.1 కోట్లకు డిమాండ్ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా చెల్లించకపోతే అసెట్స్‌తో పాటు బ్యాంకు ఖాతాలు కూడా అటాచ్ అవుతాయంటూ హెచ్చరించింది. గీతాంజలి జెమ్స్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణల మీద 2022 జనవరిలో విధించిన జరిమానాను చోక్సీ చెల్లించకపోవడంతో ఈ నోటీసు జారీ అయింది. గీతాంజలి జెమ్స్ సీఎండీ అయిన చోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14,000 కోట్లు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2018లో వారు దేశం నుంచి పరారయ్యారు. 2019లో బ్రిటన్‌లో అరెస్టయిన మోదీ ప్రస్తుతం అక్కడి జైల్లో ఉండగా, చోక్సీ బెల్జియంలో అరెస్టయ్యారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ఎఫ్డీ రేట్లలో కోతఇటీవల అరెస్ట్భారత సీబీఐ అధికారుల కోరిక మేరకు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని ఇటీవల బెల్జియం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.14,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలున్నాయి. దాంతో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే తనను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు గతంలో విశ్వప్రయత్నాలు చేసినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ఈమేరకు భారత్‌లోని ఉన్నతాధికారులకు లంచాలు కూడా ఇచ్చినట్లు గతంలో ఆరోపణలున్నాయి. -
డెడ్‌లైన్ దగ్గరపడుతోంది.. క్లెయిమ్స్ దాఖలు చేయండి
న్యూఢిల్లీ: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) ఇన్వెస్టర్లు తమ క్లెయిమ్‌లను దాఖలు చేసేందుకు గడువు తేదీ అయిన జూన్ 2 దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో మదుపరులు త్వరపడాలని, సత్వరం క్లెయిమ్‌లను ఫైల్ చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సూచించింది.దీనిపై సహాయం కోసం ఎన్ఎస్ఈని సంప్రదించవచ్చని లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 266 0050కి కాల్ చేయొచ్చని (ఐవీఆర్ ఆప్షన్ 5), లేదా defaultisc@nse.co.in ఈమెయిల్ ఐడీకి మెయిల్ చేయొచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. కేఎస్‌బీఎల్ తమ క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి భారీగా నిధులు సమీకరించడం, వాటిని సొంత అవసరాల కోసం ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించడం తెలిసిందే. -
జెన్సోల్ ఇంజినీరింగ్ ప్రమోటర్ల రాజీనామా
సంక్షోభంలో చిక్కుకున్న జెన్సోల్ ఇంజినీరింగ్ సంస్థ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ తమ పదవులకు రాజీనామా చేశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మధ్యంతర ఉత్తర్వుల మేరకు వారు కంపెనీ నుంచి తప్పుకున్నారు. అన్మోల్ సింగ్ జగ్గీ ఎండీగా, పునీత్ సింగ్ జగ్గీ హోల్‌టైమ్ డైరెక్టరు పోస్టులకు రాజీనామా చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలియజేసింది. అలాగే, వారిద్దరూ ఇకపై వివిధ కమిటీల్లో సభ్యులుగా కూడా ఉండబోరని పేర్కొంది. నిధుల మళ్లింపు, గవర్నెన్స్ లోపాల ఆరోపణలపై సెబీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.కంపెనీ నిధులను ఇష్టాసారం వాడేసుకుని, ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన జెన్సోల్ ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంపెనీ షేరు ధరతో పాటు నిధుల్లో గోల్మాల్ చోటు చేసుకుందని గతేడాది జూన్‌లో సెబీకి అందిన ఫిర్యాదుపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)అధికారి పుణెలోని కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్లాంట్‌లో జరిపిన తనిఖీల్లో అసలు ఎలాంటి తయారీ కార్యకలాపాలు లేనట్లు బట్టబయలైంది. అలాగే, అక్కడ కేవలం ఇద్దరు ముగ్గురు కార్మికులు మాత్రమే ఉన్నారని గత నెల 15న సెబీ జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో సెబీ వెల్లడించింది. జెన్సోల్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ.. కంపెనీ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా ఇన్వెస్టర్లను పక్కదారి పట్టించిన విషయాన్ని నియంత్రణ సంస్థ బయటపెట్టింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో రూ.848 కోట్ల పెట్టుబడిజెన్సోల్ ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ 6,400 ఈవీలను కొనుగోలు చేయడం కోసం ఇరెడా, పీఎఫ్సీ నుంచి 978 కోట్ల రుణాలు తీసుకుని కేవలం 4,704 ఈవీలను మాత్రమే (రూ.568 కోట్లు) కొనుగోలు చేసిన విషయం సెబీ దర్యాప్తులో తాజాగా బయటపడిన విషయం తెలిసిందే. మిగతా నిధులను పక్కదారి పట్టించి, జగ్గీ బ్రదర్స్ సొంతానికి వాడేసుకున్నట్లు కూడా సెబీ తేల్చింది. -
ప్రాపర్టీ షేర్ మళ్లీ ఐపీవో బాట
న్యూఢిల్లీ: రియల్టీ రంగ కంపెనీ ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్మెంట్ మరోసారి పబ్లిక్ ఇష్యూకి రానుంది. ప్రాప్‌షేర్ టైటానియా కోసం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా రూ. 472 కోట్లు సమీకరించే ప్రణాళికలు ప్రకటించింది. దేశీయంగా తొలి చిన్న, మధ్యతరహా(ఎస్ఎం) రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)గా లిస్టయిన ప్రాపర్టీ షేర్ రెండో ఎస్ఎం రీట్ ఐపీవో చేపట్టనుంది. ఇష్యూలో భాగంగా ప్రాప్õÙర్ టైటానియా రూ. 472 కోట్ల విలువైన యూనిట్లను తాజాగా జారీ చేయనుంది. టైటానియా ముంబైలోని జీ కార్ప్ టెక్ పార్క్‌లో 4,37,973 చదరపు అడుగుల గ్రేడ్–ఏ ఆఫీస్ సౌకర్యాలను కలిగి ఉంది. డిసెంబర్లో ప్రాప్õÙర్ ప్లాటినా ఐపీవో ద్వారా ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రూ. 353 కోట్లు సమీకరించింది. ఇది తొలి ఎస్ఎం రీట్ పథకంకాగా.. రూ. 50–500 కోట్ల మధ్య విలువైన ఆస్తులుగల సంస్థలకు సెబీ ఈ విభాగాన్ని ప్రవేశపెట్టింది. కాగా.. యూనిట్స్ బీఎస్ఈలో లిస్ట్‌కానున్నాయి. -
ఐపీవోకు 5 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా పుంజుకున్న ప్రైమరీ మార్కెట్ ప్రభావంతో పలు కంపెనీలు మరోసారి లిస్టింగ్ బాటలో సాగుతున్నాయి. తాజాగా ఐదు కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. జాబితాలో వెరిటాస్ ఫైనాన్స్, లక్ష్మీ ఇండియా ఫైనాన్స్, అజయ్ పాలీ, జజూ రష్మీ రిఫ్రాక్టరీస్, రెగాల్ రిసోర్సెస్ చేరాయి. ఈ 5 కంపెనీలు 2024 డిసెంబర్, 2025 జనవరిలో సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి. అయితే మరోపక్క ఈ ఏడాది జనవరి 6న లిస్టింగ్‌కు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసిన ఎర్తూడ్ సరీ్వసెస్ ఇటీవల ఐపీవో డాక్యుమెంట్లను వెనక్కి తీసుకుంది.రూ. 2,800 కోట్లు: నాన్డిపాజిట్ ఎన్బీఎఫ్సీ వెరిటాస్ ఫైనాన్స్ ఐపీవో ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,200 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. రిటైల్ విభాగంపై అధిక దృష్టిపెట్టిన కంపెనీ ఈక్విటీ జారీ నిధులను రుణ విడుదలకు సహకరించే మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఎన్బీఎఫ్సీ..: ఎన్బీఎఫ్సీ.. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ ఐపీవోలో భాగంగా 1.04 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 56.38 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలకు సహకరించే మూలధన పటిష్టత, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిఫ్రిజిరేషన్ సీలింగ్: రిఫ్రిజిరేషన్ సీలింగ్ సొల్యూషన్లు అందించే అజయ్ పాలీ ఐపీవోలో భాగంగా రూ. 238 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 93 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులతోపాటు ప్లాంట్, మెషినరీ తదితర పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. రూ. 190 కోట్లు సహా..: రెగాల్ రిసోర్సెస్ ఐపీవోలో భాగంగా రూ. 190 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు ప్రమోటర్ 90 లక్షల షేర్ల వరకూ ఆఫర్ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. రూ. 150 కోట్లు మాత్రమే: ప్రాస్పెక్టస్ ప్రకారం జజూ రష్మీ రిఫ్రాక్టరీస్ ఐపీవోలో భాగంగా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. నిధులను జార్ఖండ్‌లోని బొకారో ఫెర్రో అల్లాయ్స్ విస్తరణకు వీలుగా కొత్త తయారీ సౌకర్యాలపై వెచి్చంచనుంది. నిధులలో కొంతమేర వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు సైతం వినియోగించనుంది.మెప్పించని ఏథర్ ఎనర్జీ ఎంట్రీ ముంబై: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ షేరు లిస్టింగ్ రోజే నష్టాలు చవిచూసింది. ఇష్యూ ధర(రూ.321)తో పోలిస్తే బీఎస్ఈలో 1.57% స్వల్ప ప్రీమియంతో రూ.326 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్ ప్రారంభంలో 4% లాభపడి రూ.333 వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా షేరు అమ్మకాల ఒత్తిడికి లోనై ఆరంభ లాభాలు కోల్పోయింది. ఒకానొక దశలో 6.50% క్షీణించి రూ.300 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 6% నష్టంతో రూ. 302.50 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ రూ.11,267 కోట్లుగా నమోదైంది. ‘‘ఏథర్ ఎనర్జీ షేరు నామమాత్రపు ధరతో లిస్టింగ్ అవ్వడం, ఇంట్రాడేలో 6.50% పతనం పరిణామాలను పరిశీలిస్తే ఇన్వెస్టర్లు అధిక వాల్యుయేషన్ల పట్ల అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తుంది’’ అని లెమాన్ మార్కెట్స్ డెస్క్ విశ్లేషకుడు గౌరవ్ గార్గ్ తెలిపారు. -
త్వరలో కేంద్రీకృత కేవైసీ వ్యవస్థ
న్యూఢిల్లీ: కేంద్రీకృత కేవైసీ (నో యువర్ కస్టమర్) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ, ఆర్థిక నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. కస్టమర్ల కేవైసీ వివరాలను ఒకే చోట నిర్వహించేదే సెంట్రల్ కేవైసీ. దీనివద్ద కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తే.. అన్ని ఆర్థిక సంస్థల వద్ద ఆటోమేటిక్‌గా అది అప్డేట్ అయిపోతుంది.ఎప్పటిలోగా ఈ వ్యవస్థను తీసుకొచ్చేదీ పాండే స్పష్టంగా వెల్లడించలేదు. కానీ వీలైనంత త్వరగా చేయాల్సి ఉందన్నారు. ఉమ్మడి కేవైసీ వ్యవస్థ గురించి ఎదురైన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘ఈ విషయంలోనూ మేము సానుకూలంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. మరింత సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన గల కమిటీ ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.ఇదీ చదవండి: బఫెట్ వారసుడొచ్చాడు..!2025లో నూతన సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీని తీసుకురానున్నట్టు బడ్జెట్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. సెక్యూరిటీలకు సంబంధించి టీప్లస్0 సెటిల్మెంట్ ప్రస్తుతం ఐచ్ఛికంగానే ఉందని పాండే చెప్పారు. దీనివల్ల మార్కెట్ భాగస్వాములు క్రమంగా కొత్త వ్యవస్థకు మారేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. నిఘా, ఐపీవో దరఖాస్తులను వేగంగా మదింపు వేసేందుకు ప్రస్తుతం సెబీ కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగిస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని చోట్ల దీన్ని వాడనున్నట్టు తెలిపారు. టీప్లస్1 ప్రస్తుతం తప్పనిసరిగా అమల్లో ఉన్న విధానం. స్టాక్స్ కొనుగోలు చేసిన తర్వాతి పనిదినం రోజున అవి కస్టమర్ల డీమ్యాట్ ఖాతాలకు జమ అవుతాయి. -
ఐపీవోకు సిద్ధమవుతున్న ప్రముఖ కంపెనీలు
ఐపీవోకు ప్రయారిటీ జ్యువెల్స్ఆభరణాల రిటైల్ కంపెనీ ప్రయారిటీ జ్యువెల్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 54 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈ నిధుల్లో రూ. 75 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 2007లో ఏర్పాటైన కంపెనీ బంగారం, ప్లాటినం, వెండిసహా వజ్రాలతోకూడిన ఆభరణాలను తయారు చేసి విక్రయిస్తోంది. క్యారట్‌లేన్, కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్, రిలయన్స్ రిటైల్, టీబీజెడ్, సెన్కో గోల్డ్ తదితర జ్యువెలరీ రిటైల్ స్టోర్లకు సైతం ప్రొడక్టులు సరఫరా చేస్తోంది. ఎన్ఎస్ఈ ఐపీవోపై సెబీతో చర్చలుపబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతున్న స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో చర్చలు నిర్వహిస్తోంది. కొన్ని కీలక అంశాల పరిష్కారం కోసం ఎన్ఎస్ఈ, సెబీ మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే తాజాగా వెల్లడించారు. కీలక యాజమాన్య వ్యక్తులకు చెల్లింపులు, టెక్నాలజీ, క్లియరింగ్ కార్పొరేషన్లో మెజారిటీ ఓనర్షిప్ తదితర అంశాలపై సెబీ ఎన్ఎస్ఈతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్ఎస్ఈ ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఎన్వోసీ కోసం సెబీకి దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీకొరోనా రెమిడీస్ ఐపీవోఫార్మా రంగ కంపెనీ కొరోనా రెమిడీస్ ఐపీవో బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. వీటి ప్రకారం కంపెనీ రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 800 కోట్లు సమీకరించనున్నప్పటికీ నిధులు కంపెనీకి లభించబోవు. మహిళా ఆరోగ్య పరిరక్షణ, కార్డియో– డయాబెటో, పెయిన్ మేనేజ్మెంట్, యూరాలజీ తదితర విభాగాలలో కంపెనీ ప్రొడక్టులు రూపొందిస్తోంది. -
పెట్టుబడుల కొనసాగింపుపై సెబీ ఛైర్మన్ సూచనలు
అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ భారత్ కాస్త పటిష్టమైన స్థితిలోనే ఉందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మార్కెట్ ఒడిదుడుకులపై ఆందోళన చెందకుండా, ఇన్వెస్టర్లు దీర్ఘకాలంపాటు తమ పెట్టుబడులను కొనసాగించడం శ్రేయస్కరమని ఆయన సూచించారు.టారిఫ్‌ల యుద్ధం మార్కెట్లపై ప్రభావాలు చూపడం మొదలైనప్పటి నుంచి కూడా భారత్ దీటుగా ఎదురు నిలుస్తోందని పాండే చెప్పారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి, తక్కువ స్థాయిలో ద్రవ్య లోటు, సముచిత స్థాయిలో విదేశీ రుణభారం, కరెంటు అకౌంటు లోటు అదుపులోనే ఉండటం మొదలైనవి దేశానికి సానుకూల అంశాలని ఆయన పేర్కొన్నారు. భారత్ పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై కూడా చర్చలు జరుపుతోందని వివరించారు. ఇటీవల పెట్టుబడులు పెట్టిన చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లకు మార్కెట్ల పతనం గురించి పెద్దగా తెలియదు కాబట్టి, ప్రస్తుత పరిస్థితులను ఒక పాఠంగా భావించి, పెట్టుబడులను కొనసాగిస్తే దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుందని పాండే చెప్పారు.ఇదీ చదవండి: తక్కువ ధరకే బంగారం కావాలా!రిటైల్ ఇన్వెస్టర్లు అన్ని వివరాలను తెలుసుకుని, పూర్తి అవగాహనతోనే ఇన్వెస్ట్ చేయాలని పాండే సూచించారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో భారీ నష్టాలను ఉటంకిస్తూ.. మార్కెట్‌ను కేసినోగా భావించరాదని చెప్పారు. అధిక రాబడులు వస్తాయనే తప్పుడు హామీల వైపు ఆకర్షితులు కాకుండా వివేకవంతంగా వ్యవహరించాలని సూచించారు. -
నేటి నుంచి ఏథర్ ఐపీవో
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ నేడు(28న) ప్రారంభంకానుంది. 30న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 304–321కాగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు షేరుకి రూ. 321 ధరలో 4.17 కోట్ల షేర్లను కేటాయించింది. తద్వారా రూ. 1,340 కోట్లు అందుకుంది. మ్యూచువల్ ఫండ్స్‌సహా 36 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. ఇష్యూలో భాగంగా రూ. 2,626 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.1 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా మొత్తం రూ. 2,981 కోట్లు సమకూర్చుకోనుంది. వెరసి కొత్త ఆర్థిక సంవత్సరం (2025–26)లో తొలి పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. ఐపీవో ద్వారా మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులను సమీకరించాలని భావిస్తోంది. రుణ చెల్లింపులకూ నిధులను వెచ్చించనుంది. ఐపీవో ద్వారా దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో గతేడాది ఆగస్ట్‌లో లిస్టయిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా ఏథర్ నిలవనుంది. ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,145 కోట్లు అందుకున్న విషయం విదితమే. మొత్తం రూ. 11,956 కోట్ల విలువలో ఏథర్ ఎనర్జీ ఐపీవోకు వస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్లవరకూ దరఖాస్తుకు వీలుంటుంది. షేర్ల కేటాయింపు మే 2న ఉండవచ్చు. స్టాక్ ఎక్సే్ఛంజీలలో 6న లిస్టయ్యే వీలుంది. -
తొలి ఐపీవో వచ్చేస్తోంది..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 2,626 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.1 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26)లో తొలి పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 25న షేర్లను ఆఫర్ చేయనుంది.ఐపీవో ద్వారా మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులను సమీకరించాలని ఆశిస్తోంది. అంతేకాకుండా రుణ చెల్లింపులకూ నిధులను వెచ్చించనుంది. ఐపీవో ద్వారా దేశీ స్టాక్ ఎక్స్చేంజీలలో గతేడాది ఆగస్ట్‌లో లిస్టయిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా ఏథర్ నిలవనుంది. ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,145 కోట్లు అందుకున్న విషయం విదితమే. మూన్ బెవరేజెస్ ఐపీవో యోచన గ్లోబల్ పానీయాల దిగ్గజం కోక కోలా బాట్లర్ మూన్ బెవరేజెస్ (Moon Beverages IPO) పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో భారీగా విస్తరించే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ఎంఎంజీ గ్రూప్ కంపెనీ వైస్‌చైర్మన్ అనంత్ అగర్వాల్ తెలియజేశారు. రానున్న మూడు, నాలుగేళ్లలో ఆదాయాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేశారు. ఇందుకు వీలుగా ఇప్పటికే రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు.వెరసి కొత్త ప్లాంట్లు, సామర్థ్య విస్తరణ, కొత్త మార్కెట్లలో ప్రవేశం తదితరాలను చేపట్టనున్నట్లు వివరించారు. మరోవైపు పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. అస్సామ్‌లోని గువాహటి, ఒడిషాలోని రూర్కెలాలో ఏర్పాటవుతున్న ప్లాంట్లపై మరిన్ని పెట్టుబడులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసినట్లు తెలియజేశారు. దీంతో నిమిషానికి 7,000 బాటిళ్ల సామర్థ్యం జత కలవనున్నట్లు తెలియజేశారు.ఐపీవోకు కాంటినుమ్ గ్రీన్క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా కాంటినుమ్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ( Continuum Green Energy IPO) పబ్లిక్ ఇష్యూకి అనుమతించింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ కాంటినుమ్ గ్రీన్ ఎనర్జీ హోల్డింగ్స్ రూ. 2,400 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. వెరసి కంపెనీ లిస్టింగ్ ద్వారా రూ. 3,650 కోట్లు సమీకరించనుంది. 2024 డిసెంబర్లో కంపెనీ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది.ఈక్విటీ జారీ నిధులలో రూ. 1,100 కోట్లు అనుబంధ సంస్థలు తీసుకున్న కొన్ని రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 2007లో ఏర్పాటైన కంపెనీ దేశీయంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో కార్యకలాపాలు కలిగి ఉంది. వీటి అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణ తదితరాలను చేపడుతోంది. 2023–24లో కంపెనీ ఆదాయం 33 శాతం ఎగసి రూ. 1,294 కోట్లను తాకింది. -
కటాఫ్టైమ్లో సెబీ మార్పులు
న్యూఢిల్లీ: ఓవర్‌నైట్ ఫండ్స్ (డెట్ మ్యూచువల్ ఫండ్స్)కు సంబంధించి కటాఫ్టైమ్లో సెబీ మార్పులు చేసింది. పనిదినంలో మధ్యాహ్నం 3 గంటల వరకు (కటాఫ్ టైమ్) వచ్చిన పెట్టుబడి అభ్యర్థనలకు అదే రోజు ముగింపు ఎన్ఏవీ (తదుపరి వ్యాపార దినం ముందు నాటి) వర్తిస్తుంది. 3 గంటల తర్వాత వచ్చిన దరఖాస్తులకు తదుపరి వ్యాపార దినం ఎన్ఏవీ ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు సాయంత్రం 7 గంటలను కటాఫ్ టైమ్‌గా సెబీ నిర్ణయించింది.అంటే ఆలోపు వచ్చిన ఆన్లైన్ దరఖాస్తులకు అదే రోజు ఎన్ఏవీ ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు. ఈ కొత్త వేళలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఓవర్‌నైట్ పథకాల యూనిట్లను తనఖా నుంచి విడిపించుకునేందుకు స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ సబ్యులకు కొత్త మార్పులు అనుకూలించనున్నాయి. వీరు తమవద్దనున్న క్లయింట్ల నిధులను ఓవర్‌నైట్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. తద్వారా ఇన్వెస్టర్ల నిధులకు రిస్క్ ఉండకపోగా, స్టాక్ బ్రోకర్లకు కొంత ఆదాయం కూడా లభిస్తుంటుంది. -
జెన్సోల్.. ఓ ఉత్తుత్తి కంపెనీ!
ముంబై: కంపెనీ నిధులను ఇష్టాసారం వాడేసుకుని, ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన జోన్సోల్ ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంపెనీ షేరు ధరతో పాటు నిధుల్లో గోల్మాల్ చోటు చేసుకుందని గతేడాది జూన్‌లో సెబీకి అందిన ఫిర్యాదుపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ)అధికారి పుణెలోని కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్లాంట్‌లో జరిపిన తనిఖీల్లో అసలు ఎలాంటి తయారీ కార్యకలాపాలు లేనట్లు బట్టబయలైంది. అలాగే, అక్కడ కేవలం ఇద్దరు ముగ్గురు కార్మికులు మాత్రమే ఉన్నారని ఈ నెల 15న సెబీ జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో సెబీ వెల్లడించింది. జెన్సోల్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ.. కంపెనీ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా ఇన్వెస్టర్లను పక్కదారి పట్టించిన విషయాన్ని నియంత్రణ సంస్థ బయటపెట్టింది. తవ్వేకొద్దీ... సెబీ తరఫున ఎస్ఎస్ఈ అధికారి ఈ నెల 9న పుణె దగ్గర్లోని చకన్ వద్దనున్న జెన్సోల్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్‌లో విచారణ చేపట్టారు. ‘ఈ సందర్భంగా అక్కడ ఉత్పత్తి కార్యకపాపాలు ఏవీ కనబడలేదు. ఇద్దరు ముగ్గురు కార్మికులే ఉన్నారు. దీంతో గత 12 నెలల కరెంట్ బిల్లులను అధికారి కోరగా 2024 ఏడాది డిసెంబర్ నెలలో మాత్రమే అత్యధికంగా రూ.1,57,037 మొత్తాన్ని ఈ యూనిట్ చెల్లించినట్లు వెల్లడైంది‘ అని సెబీ తెలిపింది. కాగా, ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో జెన్సోల్ కొత్త ఈవీని ప్రదర్శించడమే కాకుండా, దాదాపు 30,000 ఈవీలకు ప్రి–ఆర్డర్లు కూడా వచ్చాయని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేయడం గమనార్హం. అయితే, కంపెనీ డాక్యుమెంట్ల ప్రకారం 29,000 ఈవీల కొనుగోలుకు వ్యక్తం చేసిన 9 సంస్థలతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) మాత్రమే కుదిరినట్లు సెబీ గుర్తించింది. ఎలాంటి ధర, డెలివరీ తేదీలు లేకపోవడాన్ని చూస్తే, ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన విషయం స్పష్టమవుతోందని సెబీ పేర్కొంది. జెన్సోల్ ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ 6,400 ఈవీలను కొనుగోలు చేయడం కోసం ఇరెడా, పీఎఫ్సీ నుంచి 978 కోట్ల రుణాలు తీసుకుని కేవలం 4,704 ఈవీలను మాత్రమే (రూ.568 కోట్లు) కొనుగోలు చేసిన విషయం సెబీ దర్యాప్తులో తాజాగా బయటపడిన విషయం తెలిసిందే. మిగతా నిధులను పక్కదారి పట్టించి, జగ్గీ బ్రదర్స్ సొంతానికి వాడేసుకున్నట్లు కూడా సెబీ తేల్చింది. దీంతో జెన్సోల్ సహా ప్రమోటర్లను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధించడంతో పాటు జగ్గీ సోదరులు కంపెనీలో ఎలాంటి పదవులూ చేపట్టకుండా కఠిన చర్యలు చేపట్టింది. దీంతో ప్రమోటర్లు తమ డైరెక్టర్ పదవులను రాజీనామా చేశారు, మరోపక్క, జెన్సోల్ ఇంజినీరింగ్ షేరు విభజన ప్రణాళికను కూడా సెబీ పక్కనబెట్టింది. -
సెబీ కొత్త ప్రతిపాదన.. రీట్, ఇన్విట్లలో మరిన్ని పెట్టుబడులు!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పరిమితిని పెంచే ప్రతిపాదనను సెబీ ముందుకు తీసుకొచ్చింది. ఈ నిర్ణయం అమలైతే అప్పుడు రీట్, ఇన్విట్లలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది.తద్వారా వీటిల్లో లిక్విడిటీ మరింత మెరుగుపడనుంది. ప్రస్తుతం ఒక ఫండ్ ఎన్ఏవీలో గరిష్టంగా 10 శాతం మేరే రీట్, ఇన్విట్లలో పెట్టుబడులకు అనుమతి ఉంది. ఇప్పుడు దీన్ని ఈక్విటీ, హైబ్రిడ్ ఫండ్స్‌కు 20 శాతానికి ప్రతిపాదించింది. మే 11 వరకు ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను తెలియజేయాలని సెబీ కోరింది. ఓఎన్డీసీ నెట్‌వర్క్‌లోకి యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ఫండ్స్లో పెట్టుబడులను సులభతరం చేసే దిశగా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లో చేరినట్లు యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ వెల్లడించింది. దీనితో అంతగా ఆర్థిక సేవలు అందుబాటులో లేని, మారుమూల ప్రాంతాల్లోని వారు కూడా సరళతరంగా, తక్కువ వ్యయాలతో తమ ఫండ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుందని సంస్థ ఎండీ బి. గోప్‌కుమార్ తెలిపారు. తమ ప్లాట్‌ఫాంలో యాక్సిస్ ఎంఎఫ్ చేరడమనేది అందరికీ ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్య సాకారానికి తోడ్పడుతుందని ఓఎన్డీసీ ఎండీ టి. కోషి చెప్పారు. -
ఇంకా చాలామంది మోసగాళ్లు దాక్కున్నారు..
జెన్సోల్ ఇంజినీరింగ్ వంటి మోసపూరిత కంపెనీల పట్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ మార్కెట్ నిపుణులు విజయ్ కేడియా హెచ్చరించారు. మార్కెట్లో ఇంకా చాలా మంది ‘జెన్సోల్స్’ దాగి ఉన్నారని తెలిపారు. వీరి కంపెనీలు ప్రస్తుతం సెబీ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ కాలక్రమేణా ఇన్వెస్టర్ల సంపదను గణనీయంగా దెబ్బతీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.కంపెనీల్లో ఏదైనా అవకతవకలు జరుగుతున్నట్లు గమనిస్తే సెబీ దర్యాప్తు చేసి అందుకు సంబంధించిన సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెడుతుందని చెప్పారు. దాన్ని పట్టించుకోకుండా పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేస్తే నష్టాలు తప్పవని సూచించారు. సెబీ హెచ్చరికలు జరగబోయే ప్రమాదానికి ముందు రెడ్ఫ్లాగ్లాగా పని చేస్తాయన్నారు. ఇది పెట్టుబడిదారులకు ఇలాంటి ప్రమాదకరమైన స్టాక్స్ నుంచి దూరంగా ఉండటానికి సహాయపడుతుందని చెప్పారు. మార్కెట్లో ఇంకా చాలామంది ‘జెన్సోల్స్’ దాక్కున్నారని, సమయం గడిచేకొద్దీ బయటకు వస్తారని పేర్కొన్నారు. ఇది ఆలస్యం కాకూడదని ఆశిద్దామన్నారు.లిస్డెడ్ కంపెనీ జెన్సోల్ ఇంజినీరింగ్‌ను ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ సొంత (ప్రొప్రయిటరీ) సంస్థలా వాడుకున్నట్లు క్యాపిటల్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది.కంపెనీ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీపై నిషేధ అస్త్రాన్ని ప్రయోగించింది. వెరసి వీరిరువురూ జెన్సోల్ సహా ఏ ఇతర లిస్టెడ్ కంపెనీలోనూ డైరెక్టర్లుగా లేదా కీలక యాజమాన్య స్థానంలో బాధ్యతలు చేపట్టేందుకు వీలుండదు. అంతేకాకుండా తదుపరి నోటీసు జారీ చేసేటంతవరకూ సెక్యూరిటీల మార్కెట్లో కార్యకలాపాలకూ అనుమతించమని సెబీ పేర్కొంది. నిధుల మళ్లింపునకుతోడు పాలనా సంబంధ అక్రమాలను గుర్తించడంతో సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. ఏం జరిగిందంటే..?లిస్టెడ్ కంపెనీ జెన్సోల్ ఇంజినీరింగ్‌కు చెందిన కార్పొరేట్ నిధులను జగ్గీ బ్రదర్స్ అక్రమ మార్గంలో వినియోగించినట్లు 29 పేజీల మధ్యంతర ఆదేశాలలో సెబీ పేర్కొంది. వీటి ప్రకారం గుర్గావ్లోని డీఎల్ఎఫ్ కామెలియాస్‌లో హైఎండ్ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. విలాసవంత గోల్ఫ్ సెట్‌ను సొంతం చేసుకున్నారు. క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపు, దగ్గరి బంధువులకు నిధుల బదిలీ తదితరాలను చేపట్టారు. తద్వారా దగ్గరి బంధువుల వ్యక్తిగత ప్రయాణాలు, విలాసాలకు సైతం నిధులు వెచ్చించారు. వెరసి లిస్టెడ్ కంపెనీని పిగ్గీ బ్యాంకులాగా మార్చుకున్నారు.ఇదీ చదవండి: ‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’ఇవికాకుండా ఫైనాన్షియల్ పీఎస్‌యూ దిగ్గజాలు ఇరెడా, పీఎఫ్‌సీల నుంచి ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) కొనుగోళ్ల కోసం తీసుకున్న రూ. 978 కోట్ల రుణాలను అక్రమంగా వినియోగించారు. 6,400 ఈవీ కొనుగోళ్లకు రూ. 664 కోట్లు వెచి్చంచనున్నట్లు పేర్కొనగా.. 4,704 వాహనాలను మాత్రమే ప్రొక్యూర్ చేసినట్లు ఫిబ్రవరిలో సెబీకి వెల్లడించింది. ఈవీలను బ్లూస్మార్ట్‌కు లీజుకిచ్చారు. అయితే 4,704 ఈవీలకు రూ. 568 కోట్లు మాత్రమే చెల్లించినట్లు గో ఆటో టెడ్ వెల్లడించింది. అయితే 20% అదనపు ఈక్విటీ చెల్లింపులతో కలిపి ఈవీలకు జెన్సోల్ రూ. 830 కోట్లు కేటాయించింది. అంటే వీటిలో రూ. 262 కోట్లు లెక్కతేలాల్సి ఉంది. కాగా.. జెన్సోల్, గో ఆటో బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే గో ఆటోకు చెల్లించిన నిధులు తిరిగి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జెన్సోల్ సంబంధిత సంస్థలలోకి చేరడం గమనార్హం! కాగా, బ్లూస్మార్ట్ క్యాబ్ సర్వీసులు 3 మెట్రో నగరాల్లో నిలిచిపోయాయి. -
జెన్సోల్ ప్రమోటర్లకు సెబీ షాక్
న్యూఢిల్లీ: లిస్డెడ్ కంపెనీ జెన్సోల్ ఇంజినీరింగ్‌ను ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ సొంత (ప్రొప్రయిటరీ) సంస్థలా వాడుకున్నట్లు క్యాపిటల్‌మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది.కంపెనీ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీపై నిషేధ అ్రస్తాన్ని ప్రయోగించింది. వెరసి వీరిరువురూ జెన్సోల్ సహా ఏ ఇతర లిస్టెడ్ కంపెనీలోనూ డైరెక్టర్లుగా లేదా కీలక యాజమాన్య స్థానంలో బాధ్యతలు చేపట్టేందుకు వీలుండదు. అంతేకాకుండా తదుపరి నోటీసు జారీ చేసేటంతవరకూ సెక్యూరిటీల మార్కెట్లో కార్యకలాపాలకూ అనుమతించమని సెబీ పేర్కొంది. నిధుల మళ్లింపునకుతోడు పాలనా సంబంధ అక్రమాలను గుర్తించడంతో సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. ఏం జరిగిందంటే..? లిస్టెడ్ కంపెనీ జెన్సోల్ ఇంజినీరింగ్‌కు చెందిన కార్పొరేట్ నిధులను జగ్గీ బ్రదర్స్ అక్రమ మార్గంలో వినియోగించినట్లు 29 పేజీల మధ్యంతర ఆదేశాలలో సెబీ పేర్కొంది. వీటి ప్రకారం గుర్గావ్లోని డీఎల్ఎఫ్ కామెలియాస్‌లో హైఎండ్ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. విలాసవంత గోల్ఫ్ సెట్‌ను సొంతం చేసుకున్నారు. క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపు, దగ్గరి బంధువులకు నిధుల బదిలీ తదితరాలను చేపట్టారు. తద్వారా దగ్గరి బంధువుల వ్యక్తిగత ప్రయాణాలు, విలాసాలకు సైతం నిధులు వెచ్చించారు. వెరసి లిస్టెడ్ కంపెనీని పిగ్గీ బ్యాంకులాగా మార్చుకున్నారు. ఇవికాకుండా ఫైనాన్షియల్ పీఎస్‌యూ దిగ్గజాలు ఇరెడా, పీఎఫ్‌సీల నుంచి ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) కొనుగోళ్ల కోసం తీసుకున్న రూ. 978 కోట్ల రుణాలను అక్రమంగా వినియోగించారు. 6,400 ఈవీ కొనుగోళ్లకు రూ. 664 కోట్లు వెచి్చంచనున్నట్లు పేర్కొనగా.. 4,704 వాహనాలను మాత్రమే ప్రొక్యూర్ చేసినట్లు ఫిబ్రవరిలో సెబీకి వెల్లడించింది. ఈవీలను బ్లూస్మార్ట్‌కు లీజుకిచ్చారు. అయితే 4,704 ఈవీలకు రూ. 568 కోట్లు మాత్రమే చెల్లించినట్లు గో ఆటో టెడ్ వెల్లడించింది. అయితే 20% అదనపు ఈక్విటీ చెల్లింపులతో కలిపి ఈవీలకు జెన్సోల్ రూ. 830 కోట్లు కేటాయించింది. అంటే వీటిలో రూ. 262 కోట్లు లెక్కతేలాల్సి ఉంది. కాగా.. జెన్సోల్, గో ఆటో బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే గో ఆటోకు చెల్లించిన నిధులు తిరిగి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జెన్సోల్ సంబంధిత సంస్థలలోకి చేరడం గమనార్హం! కాగా, బ్లూస్మార్ట్ క్యాబ్ సర్వీసులు 3 మెట్రో నగరాల్లో నిలిచిపోయాయి.షేర్ల విభజనకు చెక్...జెన్సోల్ ఇంజనీరింగ్ ప్రతిపాదించిన 1:10 నిష్పత్తిలో షేర్ల విభజనను సెబీ నిలిపివేసింది. 1 షేరుకి 10 షేర్లుగా విభజించడం ద్వారా మరింతమంది రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ ప్రతిపాదించింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టయిన కంపెనీ సోలార్ కన్సల్టింగ్, ఈపీసీ సర్వీసులు, ఈవీల లీజింగ్ తదితర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాగా.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో షేరు 5 శాతం డౌన్ సర్క్యూట్‌తో రూ. 124 వద్ద నిలిచింది. బీఎస్ఈలో 2024 జూన్ 24న రూ. 1,125 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది! -
సోషల్ మీడియా సలహాలతో జాగ్రత్త
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్(ఎస్‌ఎంపీలు) ద్వారా సెక్యూరిటీ మార్కెట్ల సంబంధిత కుట్రపూరిత కార్యకలాపాలు జరుగుతున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలని హెచ్చరించింది. ఎస్‌ఎంపీల ద్వారా సెక్యూరిటీ మార్కెట్ల మోసాలు అధికమయ్యాయని తెలియజేసింది. కేవలం సెబీ వద్ద రిజిస్టరైన ఇంటరీ్మడియరీల ద్వారా లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వమంటూ పబ్లిక్కు సూచించింది. పెట్టుబడులు చేపట్టేందుకు అ«దీకృత ట్రేడింగ్ యాప్స్‌ను మాత్రమే వినియోగించుకోమంటూ సలహా ఇచ్చింది. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్(ట్విటర్), టెలిగ్రామ్, గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ తదితర సుప్రసిద్ధ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఇటీవల మోసపూరిత సలహాలు, లావాదేవీలు అధికమైన నేపథ్యంలోసెబీ తాజా హెచ్చరికలు జారీ చేసింది. వీటి ద్వారా ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు ఎడ్యుకేషనల్ కంటెంట్ ఆఫర్ చేస్తున్నట్లు సెబీ తెలియజేసింది. దీనిలో భాగంగా తప్పుదారి పట్టించే కాల్స్, మోసపూరిత డాక్యుమెంట్లు, తప్పనిసరిగా లేదా రిస్‌్కలేని లాభాల అక్రమ హామీలు వంటివి ఇన్వెస్టర్లకు ఎరగా వేస్తున్నట్లు వివరించింది. అంతేకాకుండా రిజిస్టర్‌కాకుండానే పెట్టుబడి సలహాలు, సెబీ నకిలీ రిజిస్ట్రేషన్ సరి్టఫికెట్లు వంటివి వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. మరికొన్ని సందర్భాలలో సెబీ రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్స్ పేరిట మోసాలకు తెరతీస్తూ అధిక రిటర్నుల ఆశ చూపుతూ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు ప్రయతి్నస్తున్నట్లు వివరించింది. ఇందుకు వాట్సాప్, టెలిగ్రామ్ చానళ్లలో తప్పుడు గ్రూప్‌లను సైతం సృష్టించడం ద్వారా మోసపుచ్చుతున్నట్లు పేర్కొంది. వెరసి నకిలీ సలహాదారులపట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లను మరోసారి సెబీ హెచ్చరించింది! -
ఐపీఓకు రెండు కంపెనీలు రెడీ
ఐపీఓ ద్వారా నిధుల సమీకరించేందుకు రెండు కంపెనీలు సిద్ధమయ్యాయి. సాయి ఇన్ఫినియం, అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ సంస్థలు పబ్లిక్ ఇష్యూకు అనుమతులు కోరుతూ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించాయి. ఈ రెండు ఇష్యూలు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) లేకుండానే జరగనున్నాయి.సాయి ఇన్ఫినియం 1.96 కోట్ల తాజా ఈక్విటీలు జారీ చేయనుంది. సమీకరించిన నిధుల్లో 17.4 మెగావాట్ల హైబ్రిడ్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రూ.130 కోట్లు, రోలింగ్ మిల్లు కొనుగోలుకు రూ.65 కోట్లు, కార్గో వెసెల్ కొనుగోలుకు రూ.19 కోట్లు ఉపయోగించనుంది.అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ అగ్రోకెమికల్ తయారీ కంపెనీ ‘అడ్వాన్స్ అగ్రోలైఫ్’ 1.92 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల ద్వారా నిధులు సమీకరించనుంది. అర్హులైన కంపెనీ ఉద్యోగులకు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. అలాంటి వారికి డిస్కౌంట్‌తో షేర్లు కేటాయించనుంది. సమీకరించిన నిధుల్లో రూ.135 కోట్లు మూలధన అవసరాలకు మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
IPO: ఎన్ఎస్డీఎల్ లిస్టింగ్‌కు గడువు పెంపు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్)కు వెసులుబాటు లభించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా 2025 జులై 31వరకూ గడువు పెంచింది. ఎన్ఎస్డీఎల్ అభ్యర్ధనమేరకు గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యేందుకు మరింత గడువును సెబీ అనుమతించింది. దీంతో మార్కెట్ల పరిస్థితులు అనుకూలించేటంతవరకూ కంపెనీ లిస్టింగ్‌కు వెసులుబాటు లభించింది.నిజానికి 2024 సెప్టెంబర్‌లోనే ఎన్ఎస్డీఎల్ ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోలో భాగంగా ఎన్ఎస్డీఎల్ ప్రస్తుత వాటాదారులు ఎన్ఎస్ఈ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 5.72 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. దేశీయంగా తొలి సెక్యూరిటీల డిపాజిటరీగా కార్యకలాపాలు ప్రారంభించిన ఎన్ఎస్డీఎల్ 2024 సెప్టెంబర్‌కల్లా 6 ట్రిలియన్ డాలర్ల(సుమారు 500 లక్షల కోట్లు) విలువైన ఆస్తులను నిర్వహిస్తోంది. కాగా.. 2017లోనే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్) ఎన్ఎస్ఈలో లిస్ట్‌కావడం గమనార్హం!టాన్బో ఇమేజింగ్ రూ. 175 కోట్ల సమీకరణ బెంగళూరు: డిఫెన్స్ టెక్నాలజీలను రూపొందించే టాన్బో ఇమేజింగ్ తాజాగా రూ. 175 కోట్లు సమీకరించింది. తమ పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో భాగంగా డీ–సిరీస్ కింద ఫ్లోరిన్‌ట్రీ అడ్వైజర్స్, టెనాసిటీ వెంచర్స్, ఎగ్జిమ్ బ్యాంక్ తదితర సంస్థల నుంచి ఈ మొత్తాన్ని సేకరించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు అరవింద్ లక్ష్మీకుమార్ తెలిపారు.ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు, అత్యంత శక్తిమంతమైన మైక్రోవేవ్ టెక్నాలజీస్ మొదలైనవాటిని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే క్వాల్కామ్, ఆర్టిమాన్ వంటి ఇన్వెస్టర్ల నుంచి రూ. 300 కోట్లు సమకూర్చుకున్నట్లు వివరించారు. భారత రక్షణ శాఖ, నాటో, అమెరికా నేవీ సీల్స్ సహా 30 దేశాల రక్షణ బలగాలకు సేవలు అందిస్తున్నట్లు అరవింద్ చెప్పారు. -
ఓపెన్ ఆఫర్‌కు మినహాయింపు
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించే అంశంలో ప్రభుత్వానికి మినహాయింపు లభించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఇందుకు అనుమతించింది. స్పెక్ట్రమ్ బకాయిలను ఈక్విటీగా మారి్పడి చేసుకునే ప్రతిపాదన నేపథ్యంలో కంపెనీలో ప్రభుత్వ వాటా 34 శాతంపైగా పెరగనుంది. దీంతో ప్రభుత్వ వాటా 22.6 శాతం నుంచి 49 శాతానికి చేరనుంది. అయితే ప్రజా ప్రయోజనార్ధమే ప్రభుత్వం వొడాఫోన్ ఐడియాలో వాటాను పెంచుకుంటున్న కారణంగా ఓపెన్ ఆఫర్ నుంచి మినహాయింపును ప్రకటించినట్లు సెబీ హోల్ టైమ్ సభ్యులు అశ్వనీ భాటియా పేర్కొన్నారు. ప్రభుత్వానికి కంపెనీ మేనేజ్మెంట్ లేదా బోర్డులో చేరే యోచనలేని నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా యాజమాన్య నియంత్రణలో మార్పులకు చోటులేదని తెలియజేశారు. వెరసి ప్రభుత్వ వాటా పబ్లిక్ హోల్డింగ్‌గా పరిగణనలోకి రానున్నట్లు వెల్లడించారు. గత నెలలో ప్రభుత్వం రుణ సవాళ్లు ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్ బకాయిలు రూ. 36,950 కోట్లను ఈక్విటీగా మారి్పడి చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2021 టెలికం సహాయక ప్యాకేజీలో భాగంగా బకాయిలను ఈక్విటీగా మార్చుకునేందుకు ప్రతిపాదించింది. -
SEBI: 72 రీసెర్చ్ అనలిస్టుల రిజిస్ట్రేషన్ రద్దు
న్యూఢిల్లీ: రెన్యువల్ ఫీజును కట్టనందుకు గాను 72 రీసెర్చ్ అనలిస్టుల రిజిస్ట్రేషన్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రద్దు చేసింది. దీంతో వాటి రిజిస్ట్రేషన్ ఇక చెల్లుబాటు కాదు. గడువు తీరిపోయిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబీ తెలిపింది. సెబీ నిబంధనల ప్రకారం నమోదు చేసుకున్న ప్రతి రీసెర్చ్ అనలిస్టు అయిదేళ్లకోసారి రెన్యువల్ ఫీజును కట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ 72 అనలిస్టులు రెన్యువల్ ఫీజులు చెల్లించలేదని, వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గడువు ముగిసిపోయిందని సెబీ గుర్తించింది. దీంతో నిబంధనల ఉల్లంఘనకు గాను వారికి షోకాజ్ నోటీసులు పంపించి, తాజా నిర్ణయం తీసుకుంది. అటు లిక్విడిటీ ఉండని స్టాక్ ఆప్షన్లలో మోసపూరిత ట్రేడింగ్ ఆరోపణలపై సహదేవ్ పైక్ హెచ్‌యూఎఫ్, పరితోష్ సాహా హెచ్‌యూఎఫ్, త్రిప్తా ష్రాఫ్, దక్ష్ షేర్ బ్రోకర్స్ మొదలైన వర్గాలపై జరిమానా విధించింది. -
ఐపీవోలపై కంపెనీల కసరత్తు..
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరించుకునేందుకు మరిన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేస్తున్నాయి. తాజాగా స్టడ్స్ హెల్మెట్స్, పార్క్ మెడి వరల్డ్, ఎస్ఐఎస్ క్యాష్ సర్వీస్ మొదలైన సంస్థలు తమ ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఇక ఐపీవో సన్నాహాల్లో ఉన్న ఒక్కొక్క సంస్థ వివరాలను చూస్తే.. రూ. 1,260 కోట్ల పార్క్ మెడి వరల్డ్ ఇష్యూ.. పార్క్ బ్రాండ్ కింద హాస్పిటల్ చెయిన్ నిర్వహించే పార్క్ మెడి వరల్డ్ సంస్థ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,260 కోట్లు సమీకరించనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది. ఈ ఇష్యూ కింద రూ. 900 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్ అజిత్ గుప్తా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ కింద రూ. 192 కోట్లు సమీకరించే యోచనలో కంపెనీ ఉంది. ఇష్యూ ద్వారా సేకరించిన నిధుల్లో రూ. 410 కోట్ల మొత్తాన్ని రుణాలను తీర్చేసేందుకు, రూ. 110 కోట్లను కొత్త ఆస్పత్రి నిర్మాణం, అనుబంధ సంస్థలైన పార్క్ మెడిసిటీ (ఎన్సీఆర్), బ్లూ హెవెన్స్‌కి చెందిన ప్రస్తుత ఆస్పత్రుల విస్తరణ కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 3,000 పైచిలుకు పడకల సామర్థ్యంతో ఉత్తరాదిలో పార్క్ మెడి వరల్డ్ రెండో అతి పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ చెయిన్‌గా కార్యకలాపాలు సాగిస్తోంది. న్యూఢిల్లీ, జైపూర్, ఫరీదాబాద్ తదితర ప్రాంతాల్లో కంపెనీకి 13 మల్టీ–సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయి. ఎస్ఐఎస్.. షేర్ల జారీతో రూ. 100 కోట్లు.. క్యాష్ లాజిస్టిక్స్ సేవల సంస్థ ఎస్ఐఎస్ క్యాష్ సర్వీస్ తాజాగా షేర్లను జారీ చేయడం ద్వారా ఐపీవో కింద రూ. 100 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్ సంస్థలు ఎస్ఐఎస్ లిమిటెడ్, ఎస్ఎంసీ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ 37.15 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నాయి. తాజా షేర్ల విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో రూ. 37.59 కోట్లను వాహనాల కొనుగోళ్లు, ఫ్యాబ్రికేషన్‌కు, రూ. 30 కోట్ల మొత్తాన్ని రుణాల చెల్లింపు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయంపరంగా 17–18 శాతం మార్కెట్ వాటాతో పరిశ్రమలో రెండో అతి పెద్ద సంస్థగా ఎస్ఐఎస్ క్యాష్ సర్వీసెస్ నిలుస్తోంది. 2024 డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలల్లో కంపెనీ రూ. 530 కోట్ల ఆదాయాన్ని రూ. 39 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సందిగ్ధంలో కొన్ని.. మరోవైపు, ఎంబసీ గ్రూప్ ప్రమోట్ చేస్తున్న వర్క్‌స్పేస్ ఆపరేటర్ వుయ్‌వర్క్ ఇండియా మేనేజ్మెంట్ ఐపీవో ప్రతిపాదనను సెబీ పక్కన పెట్టింది. ఇందుకు నిర్దిష్ట కారణాలేమీ వెల్లడి కాలేదు. ఇష్యూ కింద ప్రమోటర్ సంస్థ ఎంబసీ బిల్డ్‌కాన్, 1 ఏరియల్ వే టెనెంట్ అనే ఇన్వెస్టరు 4.37 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానం కింద విక్రయించే యోచనలో ఉన్నాయి. అటు ఫెర్టిలిటీ క్లినిక్ చెయిన్ ఇందిరా ఐవీఎఫ్ తమ ఐపీవో ముసాయిదా పత్రాలను వెనక్కి తీసుకుంది. ఐపీవో సన్నాహాల సమయంలోనే కంపెనీ వ్యవస్థాపకుడు అజయ్ మూర్దియాపై బాలీవుడ్ బయోపిక్ విడుదల కావడమనేది ఇష్యూను పరోక్షంగా ప్రభావితం చేస్తుందని సెబీ అభిప్రాయం వ్యక్తం చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందిరా ఐవీఎఫ్ ఐపీవో పత్రాలను దాఖలు చేసిన సుమారు నెల రోజుల్లో మార్చి 21న చిత్రం విడుదలైంది. ఇందులో అనుపమ్ కేర్, ఈషా డియోల్ నటించారు.ఓఎఫ్ఎస్ మార్గంలో స్టడ్స్.. పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించడంపై హెల్మెట్ల తయారీ సంస్థ స్టడ్స్ యాక్సెసరీస్ రెండోసారి కసరత్తు చేస్తోంది. ఏడేళ్ల క్రితం 2018లో ఇందుకు సంబంధించి సెబీ నుంచి అనుమతులు పొందినప్పటికీ, అప్పట్లో ముందుకెళ్లలేదు. తాజా ప్రతిపాదన ప్రకారం ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ గ్రూప్, ఇతరత్రా షేర్హోల్డర్లు 77.9 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఇది పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఐపీవో ద్వారా సమీకరించిన నిధులేమీ కంపెనీకి లభించవు. స్టడ్స్ యాక్సెసరీస్ సంస్థ ’స్టడ్స్’, ’ఎస్ఎంకే’ బ్రాండ్ల కింద టూ–వీలర్ హెల్మెట్లను తయారు చేస్తోంది. అలాగే స్టడ్స్ బ్రాండ్ కింద గ్లవ్స్, హెల్మెట్ లాకింగ్ డివైజ్‌లు, రెయిన్ సూట్లు వంటి యాక్సెసరీలను ఉత్పత్తి చేస్తోంది. దేశవ్యాప్తంగానే కాకుండా 70 పైచిలుకు దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. అమెరికాలో ఓ’నీల్ అనే సంస్థకు, ’డేటోనా’ బ్రాండ్ పేరిట జే స్క్వేర్డ్ అనే సంస్థకు హెల్మెట్లు తయారు చేసి అందిస్తోంది. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో కంపెనీ రూ. 285 కోట్ల ఆదాయంపై రూ. 33 కోట్ల నికర లాభం ఆర్జించింది. పేస్ డిజిటెక్ అదే బాటలో..న్యూఢిల్లీ: టెలికం టవర్, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల విభాగంలో సొల్యూషన్లు అందించే పేస్ డిజిటెక్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయాలని భావిస్తోంది. తద్వారా రూ. 900 కోట్లు సమీకరించనుంది. టెలికం మౌలిక సదుపాయాల విభాగంలో సేవలందించే కంపెనీ ఐపీవోకు ముందు రూ. 180 కోట్ల ప్లేస్మెంట్ చేపట్టే యోచనలో ఉంది. ఇష్యూ నిధుల్లో రూ. 630 కోట్లు పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన 6 నెలల్లో రూ. 1,188 కోట్ల ఆదాయం, రూ. 152 కోట్ల నికర లాభం సాధించింది. -
ఐపీవోకు హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్: ఇంజినీరింగ్ సంబంధ సేవలందించే హైదరాబాద్ కంపెనీ ఆర్డీ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 80 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లలో ఒకరైన చంద్ర శేఖర్ మోటూరు విక్రయానికి ఉంచనున్నారు.కంపెనీ సమీకృత డిజైన్, ఇంజినీరింగ్, మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసులు సమకూర్చుతోంది. ప్రధానంగా ప్రీఇంజినీర్డ్ బిల్డింగ్స్(పీఈబీ), మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్(ఎంహెచ్ఎస్), ఇంజినీరింగ్ సర్వీసెస్ పేరుతో మూడు విభాగాలలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 280 కోట్లు తెలంగాణలో కొత్తగా రెండు తయారీ యూనిట్ల ఏర్పాటుకు, మరో రూ. 45 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లోని పరవాడలో సమీకృత తయారీ యూనిట్ ఏర్పాటుకు వెచ్చించనుంది.రుణ చెల్లింపులకు రూ. 65 కోట్లు వినియోగించనుంది. 2008లో ఏర్పాటైన కంపెనీ క్లయింట్లలో ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా(ఏఎంఎన్ఎస్), జేకే సిమెంట్, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ, ఉదయ్‌పూర్ సిమెంట్ వర్క్స్ తదితరాలున్నాయి. గతేడాది(2023–24) రూ. 620 కోట్ల ఆదాయం, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
సెబీ సభ్యుల ఆస్తుల వివరాల వెల్లడికి ప్రతిపాదనలు
సెబీ బోర్డు సభ్యులు, అధికారుల ఆస్తులు, అప్పుల వివరాలు తెలియజేసేలా సమగ్ర నిబంధనలపై సమీక్ష నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని సెబీ యోచిస్తోంది. ఇటీవల సెబీ కొత్త ఛైర్మన్ తుహిన్ కాంత పాండే ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అదానీ గ్రూప్ వ్యవహారంలో సెబీ మాజీ ఛైర్పర్సన్ మాధవిపురి బచ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారుల లావాదేవీల్లో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.సెబీ ప్రతిపాదిత నిర్ణయంలో భాగంగా అధికారులు, సభ్యులు, ఇతర సిబ్బంది ఆస్తులు, అప్పులు, పెట్టుబడులకు సంబంధించి వివరాల వెల్లడి, పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనలపై కమిటీ సమీక్ష నిర్వహించనుంది. సెబీపై మరింతగా విశ్వాసం పెంపొందించాలంటే ఈ నిబంధనలను సమీక్షించాలని పాండే తెలిపారు. బోర్డు సభ్యులు, అధికారుల నైతిక ప్రవర్తన, జవాబుదారీతనం, పారదర్శకతను నెలకొల్పాలన్నదే ఈ కమిటీ ఉద్దేశమని స్పష్టం చేశారు.ఏడాది చార్జీని ముందే తీసుకోవచ్చుపెట్టుబడుల సలహాదారులు (ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు), పరిశోధన విశ్లేషకులు (రీసెర్చ్ అనలిస్టులు) తమ సేవలకు సంబంధించి ఏడాది కాల చార్జీని ముందుగానే క్లయింట్ల నుంచి తీసుకునేందుకు అనుమతించాలని సెబీ నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల మేరకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు క్లయింట్ల ఆమోదం మేరకు రెండు త్రైమాసికాల చార్జీలనే (ఆరు నెలలు) ముందస్తుగా తీసుకునేందుకు అనుమతి ఉంది. అదే, రీసెర్చ్ అనలిస్టులు అయితే ఒక త్రైమాసికం చార్జీలనే ముందుగా తీసుకోవచ్చు.ఇదీ చదవండి: బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?‘ఐఏలు, ఆర్ఏలు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో.. క్లయింట్లు సమ్మతిస్తే ఏడాది కాల ఫీజులను ముందుగానే తీసుకునేందుకు అనుమతించాలని బోర్డు నిర్ణయించింది’ అని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. ఫీజుల పరిమితులు, చెల్లింపుల విధానాలు, రిఫండ్లు, బ్రేకేజ్ ఫీజులకు సంబంధించి నిబంధనల అమలు కేవలం వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాల (హెచ్‌యూఎఫ్) క్లయింట్లకే పరిమితమని స్పష్టం చేశారు. -
రిజిస్టర్డ్ ఫిన్ఫ్లుయెన్సర్లు 2 శాతమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు, ఇతరత్రా పెట్టుబడులపై రిటైల్ మదుపరుల మీద ఫిన్ఫ్లుయెన్సర్లు చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. సరైన అర్హతలు, తగిన అనుమతులు లేకుండా వారిచ్చే ఆర్థిక సలహాలను పట్టుకుని ఇన్వెస్ట్ చేస్తూ, ఎంతో మంది నష్టాల పాలవుతున్నారు. ఫిన్‌ఫ్లుయెన్సర్లపై అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషనల్స్ సంస్థ సీఎఫ్ఏ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారి వివరాల ప్రకారం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద నమోదు చేసుకున్న ఇన్ఫ్లుయెన్సర్లు (ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు) రెండు శాతమే ఉన్నారు. కానీ 33 శాతం మంది బాహాటంగానే క్రయ, విక్రయాలకు సంబంధించిన రికమెండేషన్లు ఇస్తున్నారు. దీంతో సదరు సలహాల విశ్వసనీయతపైనా, ఇన్ఫ్లుయెన్సర్ల జవాబుదారీతనంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిన్ఫ్లుయెన్సర్ల సానుకూల, ప్రతికూల ప్రభావాలు, పరిణామాలను తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సర్వేలో 51 మంది ప్రముఖ ఫిన్ఫ్లుయెన్సర్ల తీరును లోతుగా విశ్లేషించారు. ఇందులో 1,600 మంది ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ‘‘ఆర్థిక అంశాలపై అవగాహన పెంచేందుకు దేశీయంగా ఫిన్‌ఫ్లుయెన్సర్ వ్యవస్థ ద్వారా ఎంతో చేయడానికి ఆస్కారం ఉంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు బాధ్యతాయుతమైన విధానాలను పాటించడం, పూర్తి సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఫిన్ఫ్లుయెన్సర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సెబీ వద్ద రిజిస్టర్ చేసుకున్న అడ్వైజర్ల నుంచే పెట్టుబడులకు సంబంధించిన గైడెన్స్ తీసుకోవాలి. తాము ఫాలో అయ్యే ఇన్ఫ్లుయెన్సర్ల వివరాలను ధృవీకరించుకోవాలి’’ అని సీఎఫ్ఏ ఇనిస్టిట్యూట్–ఇండియా కంట్రీ హెడ్ ఆరతి పోర్వాల్ తెలిపారు. నివేదికలోని మరిన్ని వివరాలు.. → 21 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సున్న యువ ఇన్వెస్టర్లు ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం లేదు. పొదుపు రూపంలో కాస్త చెప్పుకోతగిన మొత్తాన్ని పోగేసుకునే వరకు వేచి చూస్తున్నారు. వయస్సులో పెద్దవారైన ఇన్వెస్టర్లు మాత్రం నెలవారీగా ఇన్వెస్ట్ చేయడంలో స్థిరమైన విధానాలను పాటిస్తున్నారు. → విశ్వసనీయత, ఉపయోగించడానికి సులభతరంగా ఉండటమనేవి ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవడంలో కీలకాంశాలుగా ఉంటున్నాయి. యువ ఇన్వెస్టర్లు తక్కువ బ్రోకరేజీ ఉండే ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకుంటుండగా, కాస్త సీనియర్లు ఫుల్–సర్వీస్ బ్రోకరేజీలను, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా గైడెన్స్ ఇచ్చే ఫ్లాట్‌ఫామ్‌లను ఎంచుకుంటున్నారు. → సంక్లిష్టమైన ఆర్థికాంశాలను ఇన్ఫ్లుయెన్సర్లు సరళంగా వివరిస్తున్నప్పటికీ, తమకు ఒనగూరే ప్రయోజనాల వివరాలను సరిగ్గా వెల్లడించడం లేదు. 63 శాతం మంది ఇన్ఫ్లుయెన్సర్లు తమకు వచ్చే స్పాన్సర్‌షిప్‌ల గురించి, ఆర్థిక సంస్థలతో ఉన్న సంబంధాల గురించి సరైన వివరాలు వెల్లడించలేదు. → ఈ నేపథ్యంలో నియంత్రణ, అవగాహనకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సర్టీఫికేషన్ ప్రమాణాలను పటిష్టం చేయాలి. ఆర్థిక సలహాలు ఇచ్చే ఇన్ఫ్లుయెన్సర్లు, సెబీలో రిజిస్టర్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేయాలి. పర్యవేక్షణ విధానాలను కఠినతరం చేయాలి. సోషల్ మీడియాల్లో స్పాన్సర్డ్ కంటెంట్‌ను స్పష్టంగా పేర్కొనాలి. ఫిన్ఫ్లుయెన్సర్ల విశ్వసనీయతను ధృవీకరించే విధానాలను రూపొందించాలి. అలాగే, రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.ఉపయోగాలు ఉన్నాయి, రిస్కులూ ఉన్నాయి..గత అయిదేళ్లుగా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య అనేక రెట్లు పెరిగింది. ఇది స్వాగతించతగిన పరిణామమే అయినప్పటికీ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అధ్యయనం ప్రకారం వీరిలో చాలా మంది స్పెక్యులేటర్లే ఉంటున్నారు తప్ప నిజమైన ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువే ఉంటోంది. వీరిని ప్రభావితం చేస్తూ, అక్రమంగా లబ్ధి పొందుతున్న ఫిన్ఫ్లుయెన్సర్లను కట్టడి చేసేందుకు సెబీ భారీ జరిమానాలు విధిస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. దీంతో ఫిన్ఫ్లుయెన్సర్లను నియంత్రించడానికి ఇంకా చాలా సమయమే పట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా తగు చర్యలు తీసుకోవాలంటే ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణులను అర్థం చేసుకోవడం, ఫిన్ఫ్లుయెన్సర్లు అందిస్తున్న కంటెంట్‌ను సమీక్షించడం కీలకమైన అంశాలని సీఎఫ్ఏ గుర్తించింది. ఇందులో భాగంగానే నిర్వహించిన అధ్యనయంలో ఇన్వెస్టర్లను ఫిన్ఫ్లుయెన్సర్లు గణనీయంగా ప్రభావితం చేస్తున్న సంగతి వెల్లడైంది. ఇన్ఫ్లుయెన్సర్ల సలహాల మేరకు పెట్టుబడులు పెట్టినట్లు 82 శాతం మంది ఫాలోయర్లు తెలిపారు. వీరిలో 72 శాతం మందికి ఆర్థికంగా ప్రయోజనాలు కూడా లభించాయి. అయితే, ఇందులో రిసు్కలూ ఉంటున్నాయి. వయస్సులో కాస్త పెద్దవారైన ఇన్వెస్టర్లలో (40 ఏళ్లు అంతకు పైబడి) 14 శాతం మంది తాము తప్పుదోవ పట్టించే సలహాలు విని మోసపోయినట్లు వెల్లడించినట్లు నివేదిక తెలిపింది. -
సెబీ కొత్త రూల్స్: ఏప్రిల్ 1 నుంచే..
న్యూఢిల్లీ: అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) పనిచేసే ఉద్యోగులకు సెబీ నిబంధనల పరంగా ఊరట కల్పించింది. మఖ్య నిర్వహణ అధికారి (సీఈవో), ముఖ్య పెట్టుబడుల అధికారి (సీఐవో), ఫండ్ మేనేజర్లు తదితర ఎంపిక చేసిన కీలక ఉద్యోగులు తమ వార్షిక వేతనంలో 20 శాతం మేర తమ సంస్థ నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోనే ఇన్వెస్ట్ చేయాలని ప్రస్తుత నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అంతేకాదు ఇలా చేసిన పెట్టుబడులకు మూడేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. దీన్నే ‘స్కిన్ ఇన్ ద గేమ్’గా చెబుతారు.ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనల అమలులో కొంత ఉపశమనాన్ని సెబీ కల్పించింది. స్థూల వార్షిక పారితోషికం ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థల ఉద్యోగులు సొంత నిర్వహణ పథకాల్లో చేయాల్సిన పెట్టుబడుల శాతంలో మార్పులు చేసింది. మ్యూచువల్ ఫండ్స్ ఉద్యోగుల నైతిక నడవడిక, సొంత పథకాల నిర్వహణలో బాధ్యతను పెంచడం, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ ఇందులోని ఉద్దేశ్యాలుగా ఉన్నాయి.కొత్త నిబంధనలు..కొత్త నిబంధనల కింద రూ.25 లక్షలకు మించని వేతనం ఉన్న వారు సొంత మ్యూచువల్ ఫండ్స్ సంస్థ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.రూ.25 లక్షలకు మించి ఆదాయం ఉన్న వారు 10 శాతం ఇన్వెస్ట్ చేయాలి. ఇసాప్‌లు/ఉద్యోగ స్టాక్ ఆప్షన్లు కూడా కలుపుకుంటే 12.5% పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య వేతనం ఉన్న వారు కనీసం 14 శాతం మేర (ఒకవేళ స్టాక్ ఆప్షన్లు కూడా ఉంటే 17.5 శాతం) పెట్టుబడులు పెట్టాలి. -
కొత్త ఐపీవో.. రూ. 550 కోట్లు టార్గెట్
ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా రూ. 550 కోట్లు సమీకరించేందుకు ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా లిమిటెడ్, క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ప్రతిపాదిత ఐపీవో కింద రూ. 300 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నాయి. ప్రస్తుతం ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు కంపెనీలో 100 శాతం వాటాలు ఉన్నాయి.తాజా ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, ప్లాంటు, మెషినరీ కొనుగోలు వంటి మూలధన వ్యయాల అవసరాలకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. బాటిల్స్, కంటైనర్స్, ఇంజినీరింగ్ ప్లాస్టిక్ కాంపోనెంట్లు మొదలైన వాటి డిజైనింగ్ నుంచి డెలివరీ వరకు వివిధ ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌ను ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ అందిస్తోంది. పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఫుడ్ అండ్ బెవరేజెస్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఇంజిన్ ఆయిల్, లూబ్రికెంట్స్ తదితర పరిశ్రమలకు సేవలు అందిస్తోంది.2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ రూ. 397.41 కోట్ల ఆదాయంపై రూ. 15.19 కోట్ల లాభం నమోదు చేసింది. ఈ ఇష్యూకి ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, నువామా వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. -
ఐపీవోకు ఫిజిక్స్‌వాలా
ఎడ్యుటెక్ యూనికార్న్ ఫిజిక్స్‌వాలా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు ముందస్తు గోప్యతా దరఖాస్తు ద్వారా సెబీని ఆశ్రయించింది. దీంతో ప్రాస్పెక్టస్ వివరాలను పబ్లిక్కు వెల్లడించకుండా నిలువరించేందుకు కంపెనీకి వీలుంటుంది. కాగా.. స్టాక్ ఎక్స్ఛేంజీల మెయిన్‌బోర్డులో లిస్టయ్యేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసినట్లు ఫిజిక్స్‌వాలా తాజాగా ప్రకటించింది. అయితే ముందస్తు ఫైలింగ్ ద్వారా ఐపీవోకు వెళ్లడంపై గ్యారంటీలేదని స్పష్టం చేసింది. వెరసి ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ, సూపర్‌మార్ట్ కంపెనీ విశాల్ మెగా మార్ట్ బాటలో ఐపీవోకు గోప్యతా దరఖాస్తును ఎంచుకుంది. పలు కంపెనీలు..ఇంతకుముందు 2023లోనూ ఆతిథ్య రంగ కంపెనీ ఓయో కాన్ఫిడెన్షియల్ మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. అంతకంటే ముందు 2022 డిసెంబర్లో టాటా ప్లే(స్కై) రహస్య దరఖాస్తు చేసి 2023 ఏప్రిల్‌లో సెబీ అనుమతి పొందింది. అయితే ఈ రెండు సంస్థలూ పబ్లిక్ ఇష్యూ చేపట్టకపోవడం గమనార్హం! కాగా.. 2020లో ఏర్పాటైన ఫిజిక్స్‌వాలా ఆన్లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ విధానాల్లో దేశవ్యాప్తంగా విద్యార్ధులకు శిక్షణ ఇస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో హార్న్‌బిల్ క్యాపిటల్ ఆధ్వర్యంలో 21 కోట్ల డాలర్ల(రూ.1,800 కోట్లు) పెట్టుబడులు అందుకుంది. 2.8 బిలియన్ డాలర్ల విలువలో నిధులు సమకూర్చుకుంది. ముందస్తు ఫైలింగ్ ఎంచుకుంటే సెబీ తుది అనుమతి తదుపరి ఐపీవోకు 18 నెలల గడువు లభిస్తుంది. సాధారణ పద్ధతిలో అయితే 12 నెలల్లోగా పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుంది.ఇదీ చదవండి: మున్సిపల్ బాండ్లకు వెబ్సైట్ రూ.550 కోట్లపై కన్నుప్యాకేజింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 550 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా రూ.300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, సంబంధిత సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. ప్రస్తుతం ప్రమోటర్లు 100 శాతం వాటా కలిగి ఉన్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ప్లాంటు, మెషీనరీ తదితర పెట్టుబడి వ్యయాలతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా బాటిళ్లు, కంటెయినర్లు, మూతలు, టబ్‌లు, ఇంజినీరింగ్ ప్లాస్టిక్ విడిభాగాలు తదితర ఉత్పత్తులను రూపొందిస్తోంది. వ్యక్తిగత సంరక్షణ, పానీయాలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్, లూబ్రికెంట్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలలో ప్రొడక్టులను వినియోగిస్తారు. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో రూ.397 కోట్ల ఆదాయం, రూ.15 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
ఇక 23 రోజులే గడువు.. సెబీ తాజా మార్గదర్శకాలు
లిస్టెడ్ కంపెనీ లు చేపట్టే రైట్స్ ఇష్యూలను ఇకపై 23 రోజుల్లోగా పూర్తి చేయవలసి ఉంటుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజా చర్యలకు తెరతీసింది. దీంతో ముసాయిదా ఆఫర్‌ను దాఖలు చేయవలసిన అవసరం తప్పుతుంది. ఇందుకు బదులుగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చి సూత్రప్రాయ అనుమతిని పొందవచ్చు.దీంతో వేగవంత రైట్స్ ఇష్యూలకు సెబీ దారి చూపింది. తాజా మార్గదర్శకాల ప్రకారం బోర్డు అనుమతించిన 23 పనిదినాల్లోగా రైట్స్ ఇష్యూని పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రస్తుత 317 రోజుల గడువును భారీగా కుదిస్తూ సర్క్యులర్‌ను జారీ చేసింది. దీంతో 40 రోజుల గడువున్న ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్కంటే రైట్స్‌ను వేగవంతం చేసింది. తద్వారా నిధుల సమీకరణకు ప్రాధాన్యతా మార్గంగా రైట్స్‌కు సెబీ మద్దతు పలికింది. ఎన్ఎస్ఈలో రోడ్‌స్టార్ ఇన్విట్ లిస్టింగ్రుణ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రోడ్‌స్టార్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్)ను ఎన్ఎస్ఈలో లిస్టింగ్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్)కు చెందిన రోడ్‌స్టార్ ఇన్విట్‌ను రూ. 8,592 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో లిస్ట్ చేసింది. తద్వారా రుణ పరిష్కారంలో గ్రూప్‌నకున్న విభిన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ను సమర్ధవంతంగా వినియోగించుకుంటున్నట్లు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తెలియజేసింది.ఈ బాటలో రుణదాతలకు రూ. 5,000 కోట్ల మధ్యంతర చెల్లింపులను పూర్తి చేసినట్లు ప్రస్తావించింది. ఇన్విట్ యూనిట్ల ద్వారా రూ. 3,500 కోట్లు, మరో రూ. 1,500 కోట్లకు నగదు చెల్లించినట్లు తెలియజేసింది. రహదారి ఆస్తుల (ప్రాజెక్టులు)పై గరిష్ట రిటర్నులు అందుకోవడం ద్వారా సమర్ధవంత పరిష్కారాలకు తెరతీస్తున్నట్లు వివరించింది. -
ఎస్ఎంఈ ఐపీఓలు అంత ఈజీ కాదు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈ)ల పబ్లిక్ ఇష్యూలకు నిబంధనలను కఠినతరం చేసింది. వీటిలో భాగంగా లాభదాయకత అంశాన్ని ప్రవేశపెట్టింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) పరిమితిని 20 శాతానికి పరిమితం చేసింది. ఇన్వెస్టర్లకు రక్షణ కల్పిస్తూనే పటిష్ట పనితీరు సాధిస్తున్న ఎస్ఎంఈల నిధుల సమీకరణకు అండగా నిలిచే లక్ష్యంతో సంస్కరణలకు సెబీ తెరతీసింది. గత క్యాలెండర్ ఏడాదిలో ఎస్ఎంఈ ఐపీఓలు, ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ భారీగా పెరిగిన నేపథ్యంలో సెబీ తాజా చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. లాభదాయకత అంశానికివస్తే పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉన్న ఎస్ఎంఈ గత మూడేళ్లలో కనీసం రెండేళ్ల పాటు రూ. కోటి చొప్పున నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించి ఉండాలి. మొత్తం ఇష్యూ పరిమాణంలో 20 శాతానికి మించి వాటాదారులు షేర్లను విక్రయించేందుకు అనుమతించరు. ఇదేవిధంగా వాటాదారుల హోల్డింగ్స్‌లో 50 శాతానికి మించి ఆఫర్ చేసేందుకు వీలుండదు.నిధుల వినియోగమిలాసంస్థాగతేతర ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపులో మెయిన్ బోర్డ్ ఐపీఓ నిబంధనలే ఎస్‌ఎంఈలకూ వర్తించనున్నాయి. కనీస దరఖాస్తు పరిమాణాన్ని రెండు లాట్లకు సెబీ కుదించింది. తద్వారా అనవసర స్పెక్యులేషన్‌కు చెక్ పెట్టనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఐపీఓ నిధుల్లో 15 శాతం లేదా రూ. 10 కోట్లవరకూ(ఏది తక్కువైతే) మాత్రమే కేటాయించేందుకు అనుమతిస్తారు. ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, సంబంధిత పార్టీల నుంచి తీసుకున్న రుణ చెల్లింపులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఐపీఓ నిధులు వెచ్చించేందుకు అనుమతి ఉండదు. ప్రమోటర్ల కనీస వాటాకుపైన గల ప్రమోటర్ హోల్డింగ్‌కు దశలవారీ లాకిన్ గడువు వర్తిస్తుంది. అధికంగా ఉన్న ప్రమోటర్ వాటాలో ఏడాది తరువాత 50 శాతం, రెండేళ్ల తదుపరి మిగిలిన 50 శాతానికి గడువు ముగుస్తుంది. పబ్లిక్కు అందుబాటుఎస్ఎంఈలు సెబీకి దాఖలు చేసిన ఐపీఓ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)ను 21 రోజులపాటు పబ్లిక్కు అందుబాటులో ఉంచాలి. వార్తా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియజేయాలి. సులభంగా తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ను సైతం వినియోగించాలి. ఎస్ఎంఈ ఎక్సే్ఛంజ్, కంపెనీ వెబ్సైట్, మర్చంట్ బ్యాంకర్.. సంబంధిత డీఆర్హెచ్పీపై పబ్లిక్ స్పందనకు వీలు కల్పించాలి. ఎస్ఎంఈలు ఐపీఓ తదుపరి మెయిన్ బోర్డులోకి చేరకుండానే నిధుల సమీకరణ చేపట్టాలంటే సెబీ(ఎల్‌వోడీఆర్) నిబంధనలు పాటించవలసి ఉంటుంది. చెల్లించిన మూలధనం రూ. 25 కోట్లకు మించవలసి ఉంటుంది. రైట్స్, ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, బోనస్ షేర్ల జారీ తదితరాలు ఈ విభాగంలోకి వస్తాయి. గత రెండేళ్లలో ఎస్ఎంఈ ఐపీఓలు భారీగా ఎగసిన నేపథ్యంలో సెబీ నిబంధనలు మరింత కఠినతరం చేసేందుకు ఉపక్రమించింది. 2024లో ఐపీఓల ద్వారా 240 చిన్న, మధ్యతరహా సంస్థలు రూ. 8,700 కోట్లు సమీకరించాయి. అంతక్రితం 2023లో సమకూర్చుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే ఇవి రెట్టింపుకావడం ప్రస్తావించదగ్గ అంశం!! -
రూ. 1,000కే ఎస్ఎస్ఈ ఇన్స్ట్రుమెంట్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా లాభాపేక్షలేని సంస్థ(ఎన్పీవో)ల నిధుల సమీకరణకు మరింత వెసులుబాటు కల్పించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా ఎన్‌పీవోలు జారీ చేసే జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్(జెడ్‌సీజెడ్‌పీ)ల కనీస పరిమాణాన్ని భారీగా తగ్గించేందుకు ప్రతిపాదించింది. వెరసి ప్రస్తుత రూ. 10,000 నుంచి రూ. 5,000 లేదా రూ. 1,000కు దరఖాస్తు కనీస పరిమాణాన్ని కుదించాలని భావిస్తోంది.ఇందుకు చర్చా పత్రాన్ని విడుదల చేసింది. తద్వారా మార్చి 14వరకూ ప్రజాభిప్రాయ సేకరణకు తెరతీసింది. సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎస్ఎస్ఈ)లతో ఎన్‌పీవోలు జెడ్సీజెడ్పీలను జారీ చేస్తుంటాయి. ప్రస్తుత ప్రతిపాదనలు అమలైతే ఎన్‌పీవోలు జారీ చేసే జెడ్సీజెడ్పీలలో రిటైలర్ల పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశముంటుంది.జెడ్సీజెడ్పీలంటే? సెబీ ఎన్‌పీవోల కోసం ఎస్‌ఎస్‌ఈని ఏర్పాటు చేసింది. ఎస్ఎస్ఈలో లిస్టయిన ఎన్‌పీవోలు అందుకునే విరాళాలకుగాను జెడ్సీజెడ్పీలను జారీ చేస్తాయి. నిజానికి 2023 నవంబర్‌లో జెడ్‌సీజెడ్‌పీ కనీస పరిమాణాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 10,000కు కుదించింది. ఇదేవిధంగా జెడ్‌సీజెడ్‌పీ మొత్తం పరిమాణాన్ని రూ. కోటి నుంచి రూ. 50 లక్షలకు తగ్గించింది.ఎస్ఎస్ఈల ద్వారా రిటైలర్ల విరాళాలు పెరుగుతుండటాన్ని ఎన్‌పీవోలు సెబీ దృష్టికి తీసుకువెళ్లాయి. అయితే రూ. 10,000 కనీస పరిమాణం పలువురికి అడ్డు తగులుతున్నట్లు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత స్టాక్ ఎక్సే్ఛంజీలకు భిన్నమైన ఎస్ఎస్ఈ దేశీయంగా కొత్త విభాగంకాగా.. సామాజిక సంస్థలు, దాతలను కలపడంతోపాటు.. నిధుల ఆసరాకు వీలు కలుగుతుంది. -
మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే కఠిన నిబంధనలు
ముంబై: ఇండెక్స్ డెరివేటివ్స్‌లో ఎక్స్పైరీ రోజున మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత నారాయణ్ తెలిపారు. డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని అధ్యయనంలో తేలిన మీదట గతేడాది అక్టోబర్‌లో చర్యలు ప్రకటించినట్లు ఆయన చెప్పారు.కనీస కాంట్రాక్టు పరిమాణాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 30 లక్షలకు దశలవారీగా పెంచడం, ప్రీమియంను ముందుగా వసూలు చేయడం తదితర చర్యలను సెబీ ప్రకటించింది. ముందుగా క్యాష్ మార్కెట్‌ను అభివృద్ధి చేసి, ఆ తర్వాత డెరివేటివ్స్‌పై కసరత్తు చేయాలని స్టాక్ ఎక్స్చేంజీలకు సూచించారు. మరోవైపు, పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివరాలను సెబీ బోర్డు సభ్యులందరూ ప్రజలకు వెల్లడించడాన్ని తప్పనిసరి చేసేలా నిబంధనలను రూపొందిస్తామని సెబీ కొత్త చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు.విశ్వసనీయతను, పారదర్శకతను పెంపొందించడానికి ఇది ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ఓవైపు నియంత్రణ సంస్థ అధిపతిగా, మరోవైపు నియంత్రిత సంస్థల్లో భాగస్వామిగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పని చేశారంటూ సెబీ మాజీ చీఫ్ మాధవి పురి బుచ్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాండే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెబీ విచారణ ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ సంస్థ సహ–ఇన్వెస్టరుగా ఉన్న ఫండ్‌లో ఆమె పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
గడవు పొడిగించిన సెబీ..
న్యూఢిల్లీ: క్లెయిమ్ చేయని నిధులు, సెక్యూరిటీలు బ్రోకర్ల వద్దే ఉండిపోతే.. వాటిని ‘విచారణ పరిధిలో’ పెట్టాలన్న ప్రతిపాదనపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును ఈ నెల 31 వరకు సెబీ పొడిగించింది. ఈ ప్రతిపాదనపై ఫిబ్రవరి 11న సెబీ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై స్పందనలు తెలియజేయడానికి మార్చి 4వరకు గడువు ఇవ్వడం గమనార్హం.సెబీ నిబంధనల ప్రకారం క్లయింట్ల ఖాతాల్లోని నిధులను (ఫండ్స్) ప్రతి త్రైమాసికానికి ఒకసారి వెనక్కి పంపాల్సి ఉంటుంది. సెక్యూరిటీలను నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు వారి డీమ్యాట్ ఖాతాల్లో జమ చేయాలి. ఒకవేళ నిధులు, సెక్యూరిటీలను బదిలీ చేసే విషయంలో క్లయింట్ల ఆచూకీ లేనట్టయితే.. సంబంధిత ఖాతాలను వెంటనే ‘ఎంక్వైరీ స్టేటస్’ కింద ఉంచాలని సెబీ ప్రతిపాదన తీసుకొచ్చింది.లేఖలు, ఈమెయిల్స్, టెలిఫోన్ ద్వారా బ్రోకర్లు క్లయింట్లను సంప్రదించాలి. ఇలా ఎంక్వైరీ స్టేటస్ కింద 30 రోజులకుపైగా నిధులు, సెక్యూరిటీలు ఉండిపోతే, వాటిని అన్క్లెయిమ్డ్గా పరిగణిస్తారు. ఆ తర్వాత క్లయింట్ నామినీని సంప్రదించాల్సి ఉంటుందని సెబీ తన ప్రతిపాదనలో పేర్కొంది. -
‘కొత్త ఫండ్’ పథకానికి సెబీ కొత్త రూల్
న్యూఢిల్లీ: ఇకపై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)లు తప్పనిసరిగా కొత్త ఫండ్ పథకం (NFO) నిధుల ను 30 రోజుల్లోగా వినియోగించవలసి ఉంటుంది. 2025 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది.వెరసి ఏఎంసీలు ఎన్ఎఫ్వోలో భాగంగా సమీకరించిన నిధులను సంబంధిత పెట్టుబడుల కోసం 30 రోజుల్లోగా వెచ్చించవలసి ఉంటుంది. సెబీ తాజా స ర్క్యులర్ ప్రకారం ఇన్వెస్టర్లకు యూనిట్ల కేటాయింపు తదుపరి గడువు అమల్లోకి రానుంది. దీంతో మ్యూచువల్ ఫండ్ పథకాలలో తప్పుడు విక్రయాలకు తావివ్వకుండా సెబీ చెక్ పెట్టనుంది.పథకం సమాచార పత్రా(ఎస్ఐడీ)లలో ఏ ఎంసీలు నిధుల వినియోగ గడువు, కేటాయింపు తదితరాలను వెల్లడించవలసి ఉంటుంది. ఒకవేళ 30 పనిదినాల్లోగా నిధుల వినియోగా న్ని చేపట్టలేకపోతే.. కారణాలను వివరిస్తూ ఏఎంసీ ఇన్వెస్ట్మెంట్ కమిటీకి లేఖ ద్వారా వెల్లడించవలసి ఉంటుంది. తద్వారా కమిటీ మరో 30 రోజుల గడువును ఇచ్చేందుకు వీలుంటుంది. -
సెబీ మాజీ చీఫ్‌కు బాంబే హైకోర్టులో ఊరట
స్టాక్ మార్కెట్ మోసాల కేసులో.. సెబీ మాజీ చీఫ్ 'మాదభి పురి బుచ్' (Madhabi Puri Buch)కు ఊరట లభించింది. పురి, మరో ఐదుగురిపై పోలీసు కేసు నమోదు చేయాలన్న దిగువ కోర్టు ఆదేశాన్ని, బాంబే హైకోర్టు నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.స్టాక్ఎక్స్ఛేంజ్లో కంపెనీలను లిస్ట్ చేయడంలో ఆర్ధిక పరమైన మోసం జరిగిందని ఆరోపిస్తూ.. సంబంధిత వ్యక్తులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీని ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఇందులో పురి బుచ్ మాత్రమే కాకుండా.. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్లైన అశ్వని భాటియా, అనంత్ నారాయణ్, కమలేష్ చంద్ర వర్ష్నీలు.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామమూర్తి, బిఎస్ఇ మాజీ చైర్మన్ & పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్ ప్రమోద్ అగర్వాల్ ఉన్నారు.ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాల తరువాత.. పురి బుచ్, మిగిలిన ఐదుగురు హైకోర్టులో వ్యక్తిగతంగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపి.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను నిలిపివేసింది.పూర్తిస్థాయి పరిశీలన లేకుండానే.. కింది కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కనిపిస్తోంది. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన తర్వాత వాటిని నిలిపివేస్తున్నాం.. అని హైకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణ వరకు వీరిపై ఎటువంటి చర్య తీసుకోవద్దని కూడా ఏసీబీని ఆదేశించింది.నిజానికి పురి బుచ్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. అదానీ గ్రూపుకు చెందిన కొన్ని కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు.. గతేడాది ఆగస్టులో హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఆ తరువాత ఒక్కొక్కటిగా.. ఈమెపైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వచ్చిన ఆరోపణలన్నీ ఒట్టివే అని పురి బుచ్ కొట్టిపారేశారు. -
సెబీ మార్గదర్శకాలలో సవరణలు
న్యూఢిల్లీ: డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలకు నామినీలను పేర్కొనే విషయంలో నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సవరించింది. ఆస్తుల బదిలీ, నామినీ సులభతర ఎంపికకు వీలుగా మార్గదర్శకాలను సవరిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. వెరసి సెక్యూరిటీల మార్కెట్లలో నామినేషన్ సౌకర్యంపై అవసరమైన స్పష్టతను కల్పించింది.ఒక వ్యక్తి లేదా సంయుక్త ఖాతాదారులలో ఒకరు మరణిస్తే ఆస్తుల బదిలీని అదనపు కేవైసీ అవసరంలేకుండా రెండవ వ్యక్తికి బదిలీ చేసేందుకు దారి ఏర్పాటు చేసింది. ముందస్తుగానే కేవైసీ ఇచ్చి ఉంటే వీటి అవసరం ఉండదు. ఖాతాదారులలో జీవించి ఉన్న వ్యక్తి ఏ సమయంలోనైనా కాంటాక్టు వివరాలు, నామినీ మార్పు వంటివి చేపట్టవచ్చు.ఈ బాటలో ఫిజికల్‌గా ఖాతా నిర్వహించేలేని వ్యక్తులు, ఎన్ఆర్ఐలకు సంబంధించి సైతం మార్పులు ప్రవేపెట్టింది. తాజా సవరణలు 2025 మార్చి1 నుంచి మూడు దశలలో అమలుకానున్నాయి. సవరించిన మరికొన్ని నిబంధనలు జూన్1 నుంచి, పూర్తి నిబంధనలు సెపె్టంబర్ 1నుంచి వర్తించనున్నాయి. -
సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండే
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 11వ ఛైర్మన్‌గా మాదబిపురీ బుచ్ స్థానంలో తుహిన్ కాంత పాండే నియమితులయ్యారు. మార్చి 1 నుంచి తాను సెబీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఒడిశా కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన గతంలో ఆర్థిక కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు. ఎయిరిండియా ప్రైవేటీకరణలో పాండే కీలక పాత్ర పోషించారు. తుహిన్ కాంత పాండేకు ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌లో విస్తృత అనుభవం ఉంది.తుహిన్ కాంత పాండే అనుభవంఆర్థిక కార్యదర్శి: భారత ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన ఆయన వివిధ ఆర్థిక సంస్కరణలు, విధానాల్లో కీలక పాత్ర పోషించారు.రెవెన్యూ కార్యదర్శి: దేశ రెవెన్యూ వసూళ్లు, పన్ను విధానాలను పర్యవేక్షించే రెవెన్యూ కార్యదర్శి పదవిని కూడా పాండే నిర్వహించారు.ఎయిరిండియా ప్రైవేటీకరణ: భారతదేశ ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో ముఖ్యమైన ఎయిరిండియా ప్రైవేటీకరణలో కీలక పాత్ర పోషించారు.పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నిర్వహణ: పాండే తన కెరీర్ అంతటా ప్రభుత్వ సంస్థలు, వాటిలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణల నిర్వహణలో నిమగ్నమయ్యారు. అనేక ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల పునర్నిర్మాణం, ఆర్థిక స్థిరత్వానికి దోహదపడ్డారు.ఇదీ చదవండి: రూ.10 లక్షల పెట్టుబడితో ‘సిఫ్’ముందున్న సవాళ్లు..కొత్త సెబీ ఛైర్మన్ పాండే రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్, మార్కెట్ సమగ్రతను పెంపొందించడానికి పలు కీలక రంగాలపై దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.విజిలెన్స్‌ను బలోపేతం చేయడం: మార్కెట్ మానిప్యులేషన్, ఇన్ సైడర్ ట్రేడింగ్(అనధికారికంగా ముందుగానే కంపెనీలోని కీలక సమాచారాన్ని తెలుసుకుని తర్వాత షేర్లు పెరిగాక తిరిగి విక్రయించి లాభపడడం)ను గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి పాండే మార్కెట్ నిఘా యంత్రాంగాలను పెంచే అవకాశం ఉంది.ఇన్వెస్టర్ ప్రొటెక్షన్: కఠినమైన నిబంధనలు, పకడ్బందీ ఆర్థిక విధానల ద్వారా పారదర్శకతతో ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించాలి.డిజిటల్ సహకారం: నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సాంకేతికత, డిజిటల్ వేదికల వాడకాన్ని ప్రోత్సహించాల్సి ఉంది.కార్పొరేట్ గవర్నెన్స్: లిస్టెడ్ కంపెనీల్లో తమ కార్యకలాపాలపై జవాబుదారీతనాన్ని మెరుగుపరిచేందుకు కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను బలోపేతం చేయాలి.సుస్థిర ఆర్థిక విధానాలు: ప్రపంచ పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా సుస్థిర ఆర్థిక కార్యక్రమాలు, హరిత పెట్టుబడులను ప్రోత్సహించడం. -
రూ.10 లక్షల పెట్టుబడితో ‘సిఫ్’
ప్రత్యేక పెట్టుబడి పథకాలకు(SIF) సంబంధించి సెబీ నిబంధనల కార్యచరణను ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి సిఫ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం రూ.250 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (PMS)లో అయితే పెట్టుబడికి కనీసం రూ.50 లక్షల ఉండాలి. ఈ రెండింటికి మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేస్తూ.. అధిక పెట్టుబడి పెట్టే సామర్థం, రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్)ను ప్రవేశపెట్టడం గమనార్హం.అన్ని రకాల సిఫ్ కేటగిరీల్లో ఇన్వెస్టర్లు కనీసం రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) సాధనాలను వినియోగించుకోవచ్చు. మొత్తం మీద పెట్టుబడి విలువ రూ.10 లక్షలకుపైనే ఉండాలి. మార్కెట్ పతనం కారణంగా రూ.10లక్షల్లోపునకు వచ్చేస్తే, మిగిలిన మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. సిఫ్లో 25 శాతం మేర డెట్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. బ్యాండ్ 1 నుంచి 5 వరకు మొత్తం ఐదు స్థాయిల్లో రిస్క్‌ను సెబీ వర్గీకరించింది.ఇదీ చదవండి: ఏఐకి కంపెనీల జైప్రస్తుత మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సెబీ నుంచి అనుమతి తీసుకుని సిఫ్లను ప్రారంభించొచ్చు. ఇందుకు నిర్దేశిత అర్హత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. కనీసం మూడేళ్లకు పైగా కార్యకలాపాలతో, రూ.10,000 కోట్ల నిర్వహణ ఆస్తులు కలిగినవి దరఖాస్తు చేసుకోవచ్చు. మరో మార్గంలో కనీసం 10 ఏళ్లు ఫండ్ నిర్వహణలో అనుభవం ఉండి, కనీసం రూ.5,000 కోట్లకు పైగా ఆస్తులను నిర్వహించిన చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌ను సిఫ్‌కు నియమించడం ద్వారా వీటి నిర్వహణకు అనుమతి కోరొచ్చని సెబీ ప్రకటించింది. -
అంకుర సంస్థలకు ప్రభుత్వ తోడ్పాటు
తయారీ, ఫిన్‌టెక్ స్టార్టప్‌ల అభివృద్ధికి తోడ్పాటు అందించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పేటీఎంతో పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంకుర సంస్థలు కార్యకలాపాలు విస్తరించేందుకు, కొత్త ఆవిష్కరణలు చేసేందుకు అవసరమైన మెంటార్షిప్, మార్కెట్ యాక్సెస్, నిధుల అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన అంశాలపరంగా మద్దతునిచ్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.ఈ చర్యల్లో భాగంగా నియంత్రణ నిబంధనలను పాటించడంపై, పెట్టుబడులను సమకూర్చుకోవడానికి ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లను నిర్వహిస్తారు. పేటీఎం విస్తృత మర్చంట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను టెస్ట్ చేసేందుకు, వేలిడేట్ చేసేందుకు, వాటిని మరింత మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడేలా మౌలిక సదుపాయాలు, మార్కెట్ యాక్సెస్‌కి సంబంధించిన మద్దతు లభిస్తుంది. మెంటార్షిప్, ఆర్థిక సాయం, అధునాతన టెక్నాలజీ ద్వారా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సాధికారత కలి్పంచేందుకు పేటీఎం కట్టుబడి ఉందని సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. పేటీఎం ఫిన్‌టెక్ అనుభవాన్ని, మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని, కార్యకలాపాలను విస్తరించడంలో, సవాళ్లను అధిగమించడంలో స్టార్టప్‌లను తోడ్పాటు అందిస్తామని డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి సంజీవ్ తెలిపారు.హెచ్బీఎన్ డెయిరీస్‌కు నోసెబీ తాజా హెచ్చరికక్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా హెచ్బీఎన్ డెయిరీస్‌కు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు చేపట్టవద్దంటూ పబ్లిక్‌ను హెచ్చరించింది. హెచ్బీఎన్ డెయిరీస్ అండ్ అలైడ్ లిమిటెడ్‌కు చెందిన ఎలాంటి ప్రాపర్టీ కొనుగోలు లేదా లావాదేవీలు చేపట్టవద్దంటూ పేర్కొంది. వీటి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా సూచించింది. కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలు తప్పుడు సమాచారం(వదంతులు) ప్రచారం చేస్తూ హెచ్బీఎన్ ప్రాపర్టీస్ వేలాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని తెలియజేసింది. సెబీ అధికారులుగా చెప్పుకుంటూ చట్టాన్ని అతిక్రమిస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా నిజమైన కొనుగోలుదారులను పక్కదారి పట్టించడంతోపాటు.. సెబీ ఈవేలం విధానానికి అడ్డుతగులుతున్నట్లు వివరించింది. హెచ్బీఎన్ ప్రాపరీ్టస్లో.. సంస్థ డైరెక్టర్లు, సంబంధిత అనుబంధ, సహచర సంస్థలు తదితరాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి హక్కులూ లేవని స్పష్టం చేసింది. వెరసి హెచ్బీఎన్ ఆస్తుల విషయంలో సంస్థకు సంబంధించిన ఏ వ్యక్తినీ లేదా ఏ సంస్థనూ చట్ట విరుద్ధంగా అనుమతించబోమని పేర్కొంది. -
ఈక్విటీ డెరివేటివ్స్‌పై సెబీ ఫోకస్
న్యూఢిల్లీ: ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్లో సరళతర లావాదేవీల నిర్వహణకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చర్యలు చేపట్టనుంది. అంతేకాకుండా రిస్క్ పర్యవేక్షణను పటిష్టపరచడం ద్వారా సమర్థవంత లావాదేవీలకు తెరతీయనుంది. దీనిలో భాగంగా ఫ్యూచర్స్ అండ్ అప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) ఓపెన్ ఇంటరెస్ట్(ఓఐ)పై రియల్‌టైమ్ పర్యవేక్షణకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై మార్చి 17వరకూ ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. ప్రతిపాదనలను అమలు చేస్తే మరింతగా సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకునేందుకు మార్కెట్ పార్టిసిపెంట్లకు వీలు ఏర్పడుతుంది. తద్వారా రిస్కులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవకాశమేర్పడుతుంది. రియల్‌టైమ్‌లో సెబీ రూపొందించిన తాజా ప్రతిపాదనల ప్రకారం మార్కెట్ పార్టిసిపెంట్లు ఇంట్రాడే స్నాప్‌చాట్స్ ద్వారా రియల్‌టైమ్ ఎఫ్‌అండ్‌వో ఓఐ సంబంధిత సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఇది రిస్క్ లను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో సహకరించడంతోపాటు.. ఉత్తమ నిర్ణయాలు తీసుకునేందుకు దారి చూపిస్తుంది. సెబీ సిద్ధం చేసిన కన్సల్టేషన్ పేపర్ ప్రకారం డెరివేటివ్స్‌లో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్), ఆల్టర్నేటివ్ పండ్స్(ఏఐఎఫ్) చేపట్టే లావాదేవీల(ఎక్స్పోజర్) పరిమితులలో సవరణలకు తెరలేవనుంది. ఫ్యూచర్స్ ఎక్స్పోజర్ మదింపులో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే ఆప్షన్స్(లాంగ్ అండ్ షార్ట్) ఎక్స్పోజర్లో సవరణలు చోటు చేసుకోనున్నాయి. వీటి ప్రకారం ఫ్యూచర్ ఈక్వివాలెంట్ లేదా డెల్టా ప్రాతిపదికన వీటిని మదింపు చేస్తారు. తద్వారా ఇవి మార్కెట్ కదలికల(సెన్సిటివిటీ)ను సమర్ధవంతంగా ప్రతిఫలిస్తాయి. సవరణల బాటలో ప్రస్తుతం విభిన్న పద్ధతుల్లో ఎఫ్‌అండ్‌వో ఎక్స్పోజర్లను మదింపు చేస్తున్నారు. ఫ్యూచర్స్ పొజిషన్ల ఆధారంగా, షార్ట్ అప్షన్స్ను నోషనల్ విలువ ద్వారా, లాంగ్ ఆప్షన్స్ అయితే ప్రీమియం చెల్లింపు ద్వారా మదింపు చేస్తున్నారు. కాగా.. మార్కెట్ రిస్క్ లను మరింతగా ప్రతిఫలించేలా ఇండెక్స్ డెరివేటివ్స్‌కు సెబీ కొత్త పొజిషన్ పరిమితులను ప్రతిపాదించింది. ఇండెక్స్ ఆప్షన్స్‌కు రోజువారీ ముగింపులో నికర విలువ రూ. 500 కోట్లు, స్థూలంగా రూ. 1,500 కోట్లవరకూ అనుమతించనుండగా.. ఇంట్రాడేకు నికరంగా రూ. 1,000 కోట్లు, స్థూలంగా రూ. 2,500 కోట్లు చొప్పున పరిమితులు అమలుకానున్నాయి.ఇక ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు రోజువారీ ముగింపు పరిమితి రూ. 500 కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెరగనుంది. రూ. 2,500 కోట్ల ఇంట్రాడే పరిమితి ఇందుకు అమలుకానుంది. తాజా ప్రతిపాదనలు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), ఎంఎఫ్‌లు, ట్రేడర్లు, క్లయింట్లతోపాటు మార్కెట్ పార్టిసిపెంట్లు అందరికీ అమలుకానున్నాయి. అయితే నిజంగా హోల్డింగ్స్ కలిగిన పొజిషన్లకు మినహాయింపులు లభించనున్నాయి. స్టాక్స్ కలిగిన షార్ట్ పొజిషన్లు, నగదు కలిగిన లాంగ్ పొజిషన్లకు మినహాయింపులు వర్తించనున్నాయి. -
ఐపీవో బాటలో ఎల్సీసీ ప్రాజెక్ట్స్
న్యూఢిల్లీ: ఈపీసీ సంస్థ ఎల్సీసీ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో .29 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా నీటి పారుదల, నీటి సరఫరా ప్రాజెక్టుల విభాగాలలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) సేవలు అందిస్తోంది. రెండు దశాబ్దాల కాలంలో కంపెనీ ఆనకట్టలు, బ్యారేజీలు, హైడ్రాలిక్ స్ట్రక్చర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తదితర ప్రాజెక్టులను పూర్తి చేసింది. -
‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’
మధ్య, చిన్నతరహా షేర్ల పతనంపై స్పందించవలసిన అవసరంలేదని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్పర్సన్ మాధవి పురీ బచ్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవల మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా పతనమవుతున్న నేపథ్యంలో బచ్ వ్యాఖ్యాలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే గతేడాది మార్చిలోనే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అధిక విలువల్లో ట్రేడవుతున్నట్లు సెబీ హెచ్చరించిందని బచ్ గుర్తు చేశారు.నిజానికి చిన్న షేర్లపై అవసరమైన సందర్భంలో సెబీ ఆందోళన వ్యక్తం చేసినట్లు దేశీ మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ అంశంపై సెబీ మరోసారి స్పందించవలసిన అవసరం కనిపించడంలేదని స్పష్టం చేశారు. ఇటీవల మధ్య, చిన్నతరహా షేర్ల కౌంటర్లలో నిరవధిక అమ్మకాల కారణంగా కొన్ని షేర్లు 20 శాతానికి మించి పతనమయ్యాయి. ఫలితంగా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో బేర్ ట్రెండ్ కనిపిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ రెండు విభాగాల్లోనూ షేర్లు అధిక విలువలకు చేరినట్లు 2024 మార్చిలోనే బచ్ ఇన్వెస్టర్లను హెచ్చరించడం గమనార్హం! కాగా.. ఇటీవల ప్రవేశపెట్టిన రూ.250 సిప్ పథకాలను ఫండ్ హౌస్‌లకు తప్పనిసరి చేయాలన్న ఆలోచనేదీ సెబీకి లేదని బచ్ తెలియజేశారు.వారసత్వ పెట్టుబడుల బదిలీకి ఎంతో కృషితొలి తరం క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను వారి వారసులు పొందడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. వారసులకు పెట్టుబడుల బదిలీని సులభతరం చేసే విషయంలో సెబీ ఎంతో కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు మరణించిన సందర్భాల్లో కొత్త సమస్యలు ఎదురవుతున్నట్టు పేర్కొన్నారు. ‘ఆ తరం ఇప్పుడు అంతరిస్తోంది. వారి వారసులు సెక్యూరిటీలను వారసత్వంగా పొందుతున్నారు. ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం లేనివి కూడా నేడు సమస్యగా మారుతున్నాయి. ఎందుకంటే ఆ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయన్నది వారసులు గుర్తించలేకపోతున్నారు’ అని బుచ్ వివరించారు.ఇదీ చదవండి: జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారా..? నిబంధనలు మార్పు?క్యాపిటల్ మార్కెట్ల పట్ల విశ్వాసంతో పెట్టుబడులు పెట్టిన తొలి తరం వారిని మార్గదర్శకులుగా ఆమె అభివర్ణించారు. ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ రూపొందించిన యూనిఫైడ్ ఇన్వెస్టర్ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఈ రెండు డిపాజిటరీల పరిధిలో ఒక ఇన్వెస్టర్ పేరిట వివిధ డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న అన్ని రకాల హోల్డింగ్స్‌ను ఇందులో పొందుపరిచారు. ఆ నాటి ఇన్వెస్టర్ల వారసులకు పెట్టుబడుల గుర్తింపు విషయంలో ఇది ఉపయోగకరంగా ఉంటుందని బుచ్ చెప్పారు. -
ట్రేడింగ్–డీమ్యాట్ ఖాతా లాగిన్ మరింత భద్రం!
ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల లాగిన్‌ను మరింత భద్రంగా మార్చే దిశగా కీలక చర్యలను సెబీ(SEBI) ప్రతిపాదించింది. వీటి ప్రకారం ఇకమీదట అ«దీకృత యూజర్లే వారి ట్రేడింగ్ ఖాతాలోకి లాగిన్ అవ్వగలరు. యూనిక్ క్లయింట్ కోడ్ (యూసీసీ)–డివైజ్–సిమ్ ఈ మూడింటితో కూడిన సిమ్ బైండింగ్ విధానాన్ని తీసుకురావాలన్నది సెబీ ప్రతిపాదన. యూపీఐ యాప్ అన్నది ఒక మొబైల్లో ఒకే యూజర్‌తో ఎలా అనుసంధానం అయి ఉంటుందో.. ట్రేడింగ్/డీమ్యాట్ ఖాతా సైతం యూజర్ మొబైల్‌తో అనుసంధానమై ఉంటుంది. యూపీఐ లావాదేవీల సమయంలో యూపీఐ అప్లికేషన్ క్లయింట్ సిమ్, మొబైల్ డివైజ్, వారి బ్యాంక్ ఖాతాలను గుర్తించిన తర్వాతే ప్రాసెస్ చేస్తుంది. అదే మాదిరిగా ట్రేడింగ్ అప్లికేషన్ సైతం యూజర్ యూసీసీ, సిమ్, మొబైల్ డివైజ్ నిజమైనవని ధ్రువీకరించుకున్న తర్వాతే లాగిన్‌కు వీలు కల్పిస్తుంది.యూనిక్ క్లయింట్ కోడ్‌కు క్లయింట్ మొబైల్ నంబర్, డివైజ్ ఐఎంఈఐ నంబర్‌ను లింక్ చేయడాన్ని సెబీ ప్రతిపాదించింది. డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా లాగిన్ అవ్వాలంటే.. సోషల్ మీడియా యాప్‌ల మాదిరే టైమ్ సెన్సిటివ్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సిటివ్ క్యూఆర్ కోడ్ ఆథెంటికేషన్ ద్వారే చేయాల్సి వస్తుంది. అలాగే, ట్రేడింగ్ యాప్‌లోకి బయోమోట్రిక్ ధ్రువీకరణతోనే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ పత్రిపాదనలపై సలహా, సూచనలను మార్చి 11 లోపు తెలియజేయాలని సెబీ కోరింది.ఏఎంసీలు సకాలంలో పెట్టుబడి పెట్టాల్సిందేనూతన ఫండ్ పథకం (ఎన్ఎఫ్వో) ద్వారా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను నిర్దేశిత సమయంలోపు తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలంటూ నిబంధనలను సెబీ సవరించింది. అలాగే, పారదర్శకత పెంపుకోసం మ్యూచువల్ ఫండ్ పథకాలకు సంబంధించి స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను సైతం ఇన్వెస్టర్లకు తెలియజేయడాన్ని కూడా తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలను అమలు చేయనుంది. మరింత జవాబుదారీతనం, ఇన్వెస్టర్లలో విశ్వాసం, మ్యూచువల్ ఫండ్స్‌కు నిర్వహణ సౌలభ్యం తీసుకొచ్చే దిశగా సెబీ ఈ చర్యలు తీసుకుంది.ఇదీ చదవండి: స్మార్ట్ టీవీలకు జియో ఆపరేటింగ్ సిస్టమ్ఎన్ఎఫ్వో ముగిసిన అనంతరం, పథకం పెట్టుబడుల విధానానికి అనుగుణంగా నిర్దేశిత సమయంలోపు ఇన్వెస్ట్ చేయాలన్న ప్రతిపాదనకు సెబీ బోర్డు గత డిసెంబర్లో ఆమోదం తెలపడం గమనార్హం. సాధారణంగా ఈ గడువు 30 రోజులుగా ఉంటుంది. ఎన్ఎఫ్వో ముగిసిన అనంతరం 30 రోజుల్లో ఇన్వెస్ట్ చేయకపోతే.. ఇన్వెస్టర్లు ఎలాంటి ఎగ్జిట్ లోడ్ (చార్జీ) చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకు ఏఎంసీలు అనుమతించాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లు వచ్చినప్పుడు, మ్యూచువల్ ఫండ్ పథకాలు ఎలా ఎదుర్కొంటాయో స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు తెలియజేస్తాయి. -
అన్ని వివరాలూ ఇవ్వాల్సిందే: సెబీ
పెట్టుబడి సలహాదారులు (ఐఏలు), పరిశోధన విశ్లేషకులు (ఆర్ఏలు) తమ సేవలకు సంబంధించి అన్ని నియమాలు, షరతులను ముందుగానే క్లయింట్లకు వెల్లడించాలని సెబీ ఆదేశించింది. సెబీతో సంప్రదింపుల అనంతరం పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అనలిస్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఆర్ఏఏఎస్బీ) లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఐఏఏఎస్బీ) ‘అత్యంత ముఖ్యమైన నిబంధనలు, షరతులను (ఎంఐటీసీ) ఖరారు చేయాల్సి ఉంటుందని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది.ఆర్ఏలు జూన్ 30 నాటికి ఎంఐటీసీని ప్రస్తుత క్లయింట్లకు ఈ మెయిల్ లేదా మరో విధానంలో వెల్లడించాలని ఆదేశించింది. కొత్త క్లయింట్లతో ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. బ్యాంక్ బదిలీ లేదా యూపీఐ ద్వారా స్వీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘‘స్థిర విధానంలో ప్రస్తుతం ఒక క్లయింట్ కుటుంబానికి వార్షిక ఫీజు పరిమితి రూ.1,51,000. ఆస్తుల విలువలో అయితే ఏటా 2.5 శాతం మించకూడదు’’అని సెబీ పేర్కొంది. పెట్టుబడి సలహాదారులు సలహా సేవలకు మాత్రమే చెల్లింపులను అంగీకరించగలరని, క్లయింట్ల తరపున వారి ఖాతాల్లోకి నిధులు లేదా సెక్యూరిటీలను స్వీకరించడం నిషేధించినట్లు కూడా మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. "రీసెర్చ్ అనలిస్టులు వారి ట్రేడింగ్, డీమ్యాట్ లేదా బ్యాంక్ ఖాతాల కోసం క్లయింట్‌కు సంబంధించిన లాగిన్ వివరాలు లేదా ఓటీపీలను అడగకూడదు. అటువంటి సమాచారాన్ని ఆర్ఏలతో సహా ఎవరితోనూ పంచుకోవద్దని క్లయింట్లకు సూచిస్తున్నాం" అని సర్క్యులర్ స్పష్టంగా పేర్కొంది. -
అడ్వైజర్లు, అనలిస్టులు అన్ని వివరాలు ఇవ్వాల్సిందే
పెట్టుబడి సలహాదారులు (ఐఏలు), పరిశోధన విశ్లేషకులు (ఆర్ఏలు) తమ సేవలకు సంబంధించి అన్ని నియమాలు, షరతులను ముందుగానే క్లయింట్లకు వెల్లడించాలని సెబీ ఆదేశించింది. సెబీతో సంప్రదింపుల అనంతరం పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అనలిస్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఆర్ఏఏఎస్బీ) లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఐఏఏఎస్బీ) అత్యంత ముఖ్యమైన నిబంధనలు, షరతులను (ఎంఐటీసీ) ఖరారు చేయాల్సి ఉంటుందని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది.ఆర్ఏలు జూన్ 30 నాటికి ఎంఐటీసీని ప్రస్తుత క్లయింట్లకు ఈ మెయిల్ లేదా మరో విధానంలో వెల్లడించాలని ఆదేశించింది. కొత్త క్లయింట్లతో ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. బ్యాంక్ బదిలీ లేదా యూపీఐ ద్వారా స్వీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘స్థిర విధానంలో ప్రస్తుతం ఒక క్లయింట్ కుటుంబానికి వార్షిక ఫీజు పరిమితి రూ.1,51,000. ఆస్తుల విలువలో అయితే ఏటా 2.5 శాతం మించకూడదు’ అని సెబీ పేర్కొంది. పెనాల్టీలు వేయాల్సింది టెల్కోలపై కాదు: సీఓఏఐస్పామ్ కాల్స్, మెసేజ్‌లను కట్టడి చేయడానికి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధనలతో టెల్కోలకు పెనాల్టీలు గణనీయంగా పెరిగాయని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసెస్‌కు ఎటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల స్పామ్ సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది. ‘టెలికం ఆపరేటర్లు స్పామ్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టడానికి పుష్కలంగా చర్యలు తీసుకున్నాయి. ఇదీ చదవండి: రూ.250కే జన్‌నివేష్ సిప్అయాచిత కమ్యూనికేషన్ల పరిమాణంలో గణనీయ పెరుగుదల, అలాగే న్యాయబద్ధ వాణిజ్య కమ్యూనికేషన్ అంతా ఓటీటీ కమ్యూనికేషన్ యాప్‌లకు మారింది. ఇది దేశంలో ఆర్థిక నేరాల పెరుగుదలకు దారితీసింది. టెలికం సర్వీస్ ప్రొవైడర్లపై పెనాల్టీలు ఏ ప్రయోజనాన్ని అందించవు. అవసరమైతే టెలిమార్కెటర్ డెలివరీ కంపెనీలు లేదా వాణిజ్య సమాచార ప్రసారాల వాస్తవ రూపకర్తలు, లబ్ధాదారులైన ప్రధాన సంస్థలపై ఈ పెనాల్టీలు వేయాలి’ అని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్.పి.కొచ్చర్ అన్నారు. -
ఫండ్ ఇన్వెస్టర్లకు సెబీ ‘మిత్రా’ ప్లాట్‌ఫామ్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల కోసం ‘మిత్రా’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను సెబీ తీసుకొచ్చింది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి, వాటి వివరాలు మర్చిపోయిన వారు, దీర్ఘకాలంగా ఎలాంటి లావాదేవీలు లేకుండా ఉండిపోయిన వాటిని సులభంగా గుర్తించేందుకు ఈ ప్లాట్‌ఫామ్ సాయపడనుంది. ఇలాంటి చురుగ్గాలేని (ఇనాక్టివ్), చాలా కాలంగా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన (అన్క్లెయిమ్డ్) పెట్టుబడులను తిరిగి గుర్తించి, వెనక్కి తీసుకోవడానికి ఈ చర్య తీసుకుంది.గతంలో చేసిన పెట్టుబడుల వివరాలను మర్చిపోయి, తాజా కాంటాక్ట్ సమాచారం లేక, తమ పేరిట చేసిన పెట్టుబడులపై అవగాహన లేని వారి విషయంలో వ్యక్తమవుతున్న ఆందోళనలకు ఈ ప్లాట్‌ఫామ్ పరిష్కారం చూపుతుందని సెబీ తన తాజా సర్క్యులర్‌లో వెల్లడించింది. ఈ తరహా యాక్టివ్‌గా లేని ఫోలియోలు (పెట్టుబడులు) మోసపూరిత ఉపసంహరణలకు దారితీయవచ్చని పేర్కొంది.రిజిస్టార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫామ్.. క్లెయిమ్ చేయకుండా పేరుకుపోయిన పెట్టుబడులను తగ్గించేందుకు సాయపడుతుందని పేర్కొంది. పదేళ్లుగా పెట్టుబడులు, మరే ఇతర ఆర్థికేతర లావాదేవీలు లేకుండా ఉండిపోయిన పెట్టుబడులను ఇనాక్టివిగా పరిగణిస్తుంటారు. ఇన్వెస్టర్లకు సంబంధించి ఇనాక్టివ్ ఫోలియోలు, అన్క్లెయిమ్డ్ డివిడెండ్లను గుర్తించి.. వాటిని తగ్గించే బాధ్యతను ‘యూనిట్ హోల్డర్ ప్రొటెక్షన్ కమిటీ’పై పెట్టింది. తాజా చర్యల గురించి ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించాలంటూ ఏఎంసీలు, ఆర్టీఏలు, ఆర్ఐఏలు, యాంఫి, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులను సెబీ ఆదేశించింది. -
ఇన్ యాక్టివ్ ఫోలియోలకు ‘మిత్రా’ సాయం
యాక్టివ్‌లోలేని లేదా క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇన్వెస్టర్లకు తీపికబురు అందించింది. సదరు ఫండ్ ఫోలియోలను ట్రాక్ చేసేందుకు, వాటిని తిరిగి పొందేందుకు పెట్టుబడిదారులకు సహాయపడటానికి సెబీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ (మిత్రా) అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది.పెట్టుబడుల సమాచారం మిస్ అవ్వడం లేదా తమ పేరుతో చేసిన పెట్టుబడుల గురించి నామినీలకు తెలియకపోవడం వల్ల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ట్రాక్ చేయలేకపోతున్నామనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అలాంటి వారికోసం కొత్తగా ప్రవేశపెట్టిన మిత్రా ఎంతో సహకరిస్తుందని సెబీ తెలిపింది. యాక్టివ్‌లోలేని, క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోల వివరాలను డేటాబేస్ నుంచి శోధించి ‘మిత్రా’ పెట్టుబడిదారులకు సమాచారం అందిస్తుంది. పెట్టుబడుల సమాచారాన్ని విస్మరించినా లేదా ఇతరులు చేసిన ఏవైనా పెట్టుబడులను గుర్తించడానికైనా మిత్రా వేదిక అవ్వనుంది.ఇదీ చదవండి: రూ.50 నోట్లపై గవర్నర్ సంతకం మార్పుఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లకు నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను పూర్తి చేసేలా ప్రోత్సహిస్తుంది. నాన్ కేవైసీ కంప్లైంట్ ఫోలియోల సంఖ్యను తగ్గిస్తుంది. మోసపూరిత రిడంప్షన్లను అరికడుతుంది. ఫండ్స్, సరైన ఫోలియో ఉన్నప్పటికీ పదేళ్ల పాటు ఎలాంటి నిర్వహణ చేయకపోతే వాటిని నిబంధనల ప్రకారం ఇన్‌యాక్టివ్‌గా పరిగణిస్తారు. అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు (ఏఎంసీలు), రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ ఫర్ ఏజెంట్లు (ఆర్టీఏ), రీసెర్చ్ అనలిస్టులు (ఆర్ఏ), అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ), మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు సహా అందరు భాగస్వాములకు ఈ ప్లాట్‌ఫామ్‌పై ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించాలని సెబీ ఆదేశించింది. -
కాలాహరిధాన్ ట్రెండ్జ్‌పై సెబీ కొరడా
న్యూఢిల్లీ: ఇటీవలే ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ(NSE SME) ప్లాట్‌ఫాం ఎమర్జ్‌లో లిస్టయిన కాలాహరిధాన్ ట్రెండ్జ్‌పై (KTL) నిబంధనల ఉల్లంఘనకుగాను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనరాదంటూ కంపెనీతో పాటు ప్రమోటర్లు నిరంజన్ డి అగర్వాల్, ఆదిత్య ఎన్ అగర్వాల్, సునీత నిరంజన్ అగర్వాల్‌ను ఆదేశించింది. అలాగే వారిని పూర్తిగా నిషేధిస్తూ ఎందుకు ఉత్తర్వులు ఇవ్వరాదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది.క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించడంలో విఫలమైందంటూ కేటీఎల్పై హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి ఫిర్యాదు రావడంతో సెబీ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. 2024 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 15 వరకు సాగిన విచారణలో.. ఈ డిఫాల్ట్ వివరాలను కంపెనీ వెల్లడించకుండా డిస్క్లోజర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. పైగా బంగ్లాదేశ్‌లోని ఒక కల్పిత సంస్థ నుంచి భారీ ఆర్డరు వచ్చిందని, పెద్ద ఎత్తున కార్యకలాపాలు విస్తరిస్తున్నామని తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిందని మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది. దీన్ని కప్పి పుచ్చేందుకు ఈమెయిల్స్ సృష్టించినట్లు వివరించింది.ఇదీ చదవండి: మార్కెట్లోకి కొత్త ఐపీవోలుమొత్తం మీద కంపెనీపై సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచి షేర్లలో ట్రేడ్ చేసేలా ఇన్వెస్టర్లను పురిగొల్పి, షేర్లను అమ్ముకుని లబ్ధి పొందేందుకే కేటీఎల్ నిర్దిష్ట కార్పొరేట్ ప్రకటనలను చేసినట్లు సెబీ పేర్కొంది. పైపెచ్చు రైట్స్ ఇష్యూ ద్వారా మరో విడత నిధుల సమీకరణ కూడా కంపెనీ తలపెట్టింది. ఈ నేపథ్యంలోనే సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరి 23న ఇష్యూ ధర రూ.45తో పోలిస్తే రూ.47.15 వద్ద లిస్టయిన కేటీఎల్ షేరు ప్రస్తుతం రూ.20 స్థాయిలో ఉంది. -
యూట్యూబర్‌పై సెబీ కన్నెర్ర: ఎవరీ అస్మితా పటేల్?
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఆరు సంస్థలను నిషేధించింది. రిజిస్ట్రేషన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇచ్చి, కోర్సులు నిర్వహించి పెట్టుబడిదారుల నుంచి డబ్బులు సేకరించిన కారణంగానే సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (APGSOT) డైరెక్టర్ 'అస్మితా పటేల్' కూడా ఉన్నారు.అస్మితా పటేల్ పెట్టుబడికి సంబంధించిన టిప్స్ చెబుతూ.. కోర్సులు నేర్చుకునే వారి దగ్గర నుంచి భారీగానే వసూలు చేసింది. ఈమె టిప్స్ విన్న పెట్టుబడిదారులు నష్టాలను చవిచూశారు. దీంతో చాలామంది ఇన్వెస్టర్లు వరుసగా ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. దీంతో సెబీ రంగంలోకి దిగింది.టిప్స్ పేరుతో అస్మితా పటేల్ సుమారు రూ. 104 కోట్ల కంటే ఎక్కువ సంపాదించినట్లు సమాచారం. ఈ విషయాలు సెబీ విచారణలో తేలాయి. కోర్సు ఫీజుల కింద ఇన్వెస్టర్లు, స్టూడెంట్స్ నుంచి సేకరించిన రూ.53 కోట్లు.. సంబంధిత ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చేయాలని సెబీ ఆదేశించింది.అస్మితా పటేల్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌కు 5.26 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.9 లక్షల మంది ఫాలోవర్లు, ఫేస్బుక్లో 73,000 మంది, లింక్డ్ఇన్లో 1,900 మంది ఫాలోవర్లు, ఎక్స్ (ట్విటర్)లో 4,200 మంది ఫాలోవర్లు ఉన్నారు.ఇదీ చదవండి: తండ్రికి తగ్గ తనయ.. వేలకోట్ల కంపెనీలో కీలక వ్యక్తి: ఎవరీ నీలిమా?ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఎక్స్ (ట్విటర్)లలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్.. అస్మితా పటేల్ తనను తాను షీవోల్ఫ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్.. 'ఆప్షన్స్ క్వీన్'గా ప్రచారం చేసుకుంటోంది. ఈమె దాదాపు ఒక లక్షమంది స్టూడెంట్లకు, పెట్టుబడిదారులకు ట్రేడింగ్ సలహాలు ఇచ్చినట్లు సమాచారం.ఎవరీ అస్మితా పటేల్?అస్మితా పటేల్.. మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఉన్న అస్మితా పటేల్ గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (AGSTPL)కి డైరెక్టర్. కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. ఆమె సాంప్రదాయ గుజరాతీ కుటుంబంలో జన్మించింది. ఈమెకు 17 సంవత్సరాల ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, పదేళ్లకు పైగా బోధనా నైపుణ్యం ఉందని తెలుస్తోంది. అంతే కాకుండా అనేక అవార్డులను గెలుచుకున్నట్లు చెబుతున్నారు. -
సెబీ కొత్త రూల్.. వారి బంధువుల పాన్ కార్డులూ ఫ్రీజ్!
స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి కొత్త సమాచారం వెలువడింది. లిస్టెడ్ కంపెనీల “ట్రేడింగ్ విండో క్లోజ్”కు సంబంధించి సెబీ కొత్త నిబంధనలు తీసుకురాబోంది. ఇవి కంపెనీ ఇన్సైడర్ల బంధువులకు కూడా వర్తిస్తాయి. నిర్ణీత సమయంలో వారి పాన్ కార్డులు (PAN cards) కూడా స్తంభిస్తాయి. ఈ మేరుకు సెబీ ప్రతిపాదనలు జారీ చేసింది. “ట్రేడింగ్ విండో క్లోజ్” అంటే.. “ట్రేడింగ్ విండో క్లోజ్” అనేది కంపెనీ ఇన్సైడర్లకు సంబంధించిన నిబంధన. అంటే ఆ నిర్ణీత సమయంలో కంపెనీ ఇన్సైడర్లు షేర్లను ట్రేడ్ చేయలేరు. తద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్‌ను నిరోధించే ఆస్కారం ఉంటుంది. మార్కెట్ పారదర్శకత కోసం సెబీ దీనిని అమలు చేస్తుంది.త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు "ట్రేడింగ్ విండో" ఆటోమేటిక్ క్లోజర్ నిబంధనలో మరికొంత మందిని చేర్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సెబీ చెబుతోంది. ప్రస్తుతం కంపెనీ డైరెక్టర్లు, ఉన్నత స్థాయి అధికారులు వంటి వారు ఈ నిబంధన కింద ఉన్నారు. కానీ కొత్త నిబంధన ప్రకారం ఈ వ్యక్తులందరి దగ్గరి బంధువులు కూడా దీని పరిధిలోకి వస్తారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు ఎటువంటి అవకాశం లేకుండా నిరోధించడం దీని ఉద్దేశం.ట్రేడింగ్ విండో క్లోజ్ సమయంలో మరింత భద్రత కోసం ఇన్సైడర్ల పాన్ కార్డులను స్తంభింపజేయడానికి, డిపాజిటరీల ట్రేడింగ్‌ను నిలిపివేయడానికి సెబీ 2022 ఆగస్టులో మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం లిస్టెడ్ కంపెనీ విడుదల చేసిన సమాచారం ఆధారంగా వారి పాన్ కార్డులను స్తంభింపజేస్తున్నారు. గతంలో ఈ నిబంధన నిఫ్టీ 50, సెన్సెక్స్ వంటి బెంచ్‌మార్క్ సూచీలలో నమోదైన కంపెనీలకు వర్తించేది. 2023 జూలైలో సెబీ దీనిని అన్ని కంపెనీలకు తప్పనిసరి చేసింది.కొత్త ప్రతిపాదనలపై ఫిబ్రవరి 28 లోగా స్పందనలు తెలియజేయాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కోరింది. సెబీ నిర్వచనం ప్రకారం దగ్గరి బంధువు అంటే తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు. అలాగే స్టాక్ మార్కెట్ వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో సంప్రదించే వ్యక్తులు కూడా ఇందులోకి వస్తారు.ప్రతి త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు ప్రకటించిన 48 గంటల వరకు ట్రేడింగ్ విండో మూసివేత వర్తిస్తుందని సెబీ పేర్కొంది. సెబీ వెబ్సైట్లో విడుదల చేసిన సమాచారం ప్రకారం.. కంపెనీలు సాధారణంగా త్రైమాసిక, వార్షిక ఆర్థిక ఫలితాలు, పెద్ద ఒప్పందాలు, కొనుగోళ్లు లేదా విలీనాలను ప్రకటించే ముందు ట్రేడింగ్ విండోను మూసివేస్తాయి. అలాగే బోనస్ షేర్లు, స్టాక్ స్ల్పిట్‌లు లేదా డివిడెండ్లను ప్రకటించే ముందు కూడా ట్రేడ్ విండో క్లోజ్ వస్తుంది. -
టాప్-100 కంపెనీలకు డిజిటల్ అష్యూరెన్స్: సెబీ
టాప్-100 లిస్టెడ్ కంపెనీలకు ఆర్థిక నివేదికలకు సంబంధించి తప్పనిసరి డిజిటల్ అష్యూరెన్స్‌ను సెబీ ప్రతిపాదించింది. కంపెనీల ఆర్థిక నివేదికలను మదింపు చేసే ఆడిటర్లు, ఆయా కంపెనీల డిజిటల్ సమాచార మూలాలను కూడా ధ్రువీకరించనుండడం ఇందులో భాగంగా ఉంటుంది. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని సెబీ (SEBI) విడుదల చేసింది.‘‘డిజిటల్ అష్యూరెన్స్ రిపోర్ట్‌తో పారదర్శకత పెరుగుతుంది. సమాచార వెల్లడి ప్రమాణాలు మెరుగుపడతాయి. తద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు మరింత రక్షణ లభించి, వ్యవస్థ పట్ల నమ్మకం పెరుగుతుంది’’అని సెబీ పేర్కొంది. కంపెనీ ఆర్థిక నివేదికలను మదింపు చేసే ఆడిటర్లే ఈ డిజిటల్ అష్యూరెన్స్ నివేదికలను ప్రత్యేకంగా జారీ చేయాల్సి ఉంటుంది.దీనికి సహకారం అందించేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కూడా ముందుకు వచ్చింది. డిజిటల్‌గా అందుబాటులో ఉన్న ఆడిట్ ఆధారాలు, సమాచారాన్ని ఉపయోగించడం ద్వారా ఆడిట్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి తమ సభ్యులకు మార్గదర్శకత్వం అందించడానికి డిజిటల్ హామీపై ఒక మార్గదర్శనాన్ని విడుదల చేసింది. -
ఐపీవోకు 7 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(Sebi) తాజాగా 7 కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో డిఫెన్స్ తయారీ కంపెనీ ఏఎంపీపీసహా.. ఆదిత్య ఇన్పోటెక్, బ్రిగేడ్ హోటల్, కుమార్ ఆర్క్ టెక్, సోలార్ వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్, ఇండోగల్ఫ్ క్రాప్ సైన్సెస్, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్, ప్రోస్టార్ ఇన్ఫోసిస్టమ్స్ చేరాయి. అయితే ఆటో విడిభాగాల సంస్థ వినే కార్పొరేషన్ ముసాయిదా పేపర్స్‌ను ఇటీవలే వెనక్కి తీసుకుంది. మర్చంట్ బ్యాంకర్ల వివరాల ప్రకారం ఇవన్నీ ఉమ్మడిగా రూ. 7,800 కోట్లు సమీకరించనున్నాయి. రూ. 4,000 కోట్లపై కన్ను ఐపీవో ద్వారా ఎస్ఎంపీపీ లిమిటెడ్ రూ. 4,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ. 580 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 3,420 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ శివ్ చంద్ కన్సల్ విక్రయానికి ఉంచనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్‌గా కన్సల్ 50 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 437 కోట్లు అనుబంధ కంపెనీ ద్వారా పెట్టుబడి వ్యయాలపై వెచ్చించనుంది. రూ. 1,300 కోట్ల సమీకరణ ఆదిత్య ఇన్ఫోటెక్ ఐపీవో ద్వారా రూ. 1,300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ నిధుల్లో రూ. 375 కోట్లు రుణాల చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రూ. 900 కోట్లకు సై ఆతిథ్య రంగ కంపెనీ బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ ఐపీవోలో భాగంగా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా పెట్టుబడులను సమీకరించాలని ఆశిస్తోంది. వీటిలో రూ. 481 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 59 కోట్లు మెటీరియల్ అనుబంధ సంస్థ ఎస్ఆర్పీ ప్రోస్పరిటా హోటల్ వెంచర్స్‌కు కేటాయించనుంది. మరో రూ. 108 కోట్లు భూమి కొనుగోలుకి వెచ్చించనుంది. రూ. 740 కోట్లపై దృష్టి పీవీసీ బ్లెండ్ ఆధారిత బిల్డింగ్ మెటీరియల్ తయారీ కంపెనీ కుమార్ ఆర్క్ టెక్ ఐపీవో ద్వారా రూ. 740 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనుండగా.. మరో రూ. 240 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. ఈ నిధుల్లో రూ. 182 కోట్లు అనుబంధ సంస్థ టేలియస్ ఇండస్ట్రీలో పెట్టుబడికి వెచ్చించనుంది. రూ. 600 కోట్లకు రెడీ సోలార్‌వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీనిలో రూ. 550 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 50 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. రూ. 200 కోట్లతోపాటు.. ఐపీవోలో భాగంగా ఇండోగల్ఫ్ క్రాప్‌సైన్సెస్ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 38.55 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. 1.9 కోట్ల షేర్ల జారీ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ ఐపీవోలో భాగంగా 1.9 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధులను పరికరాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, సాధరణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. పబ్లిక్ ఇష్యూకు ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ ఐపీవోలో భాగంగా పవర్ సొల్యూషన్లు, ప్రొడక్టుల తయారీ కంపెనీ ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ 1.6 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధులను రుణ చెల్లింపులు, అనుబంధ సంస్థలో వాటా కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, సాధరణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. సెబీకి ఉయ్‌వర్క్ ఇండియా ప్రాస్పెక్టస్వర్క్స్పేస్ సేవల సంస్థ ఉయ్‌వర్క్ తమ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సంబంధించి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ని (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచింది. ఈ ఇష్యూలో భాగంగా కంపెనీ 4,37,53,952 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనుంది. ఐపీవో పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇష్యూ ద్వారా వచ్చే నిధులు కంపెనీకి లభించవు. వ్యక్తులు, చిన్నా .. పెద్ద వ్యాపార సంస్థలు, అంకురాలు మొదలైన కస్టమర్లకు నాణ్యమైన వర్క్‌స్పేస్‌లను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
సెబీకి త్వరలో కొత్త చీఫ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రభుత్వం కొత్త చైర్మన్‌ను ఎంపిక చేయనుంది. ఇందుకు ఆర్థిక శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రస్తుత చైర్‌పర్శన్ మాధవీపురీ బచ్ మూడేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 28న ముగియనుంది. సెబీకి కొత్త చీఫ్‌ను ఐదేళ్ల కాలానికి ఎంపిక చేయనున్నట్లు లేదా అభ్యర్థికి 65 ఏళ్ల వయసు(ఏది ముందయితే)వరకూ బాధ్యతలు అప్పగించనున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ తెలియజేసింది. దరఖాస్తుల దాఖలుకు ఫిబ్రవరి 17 గడువుగా పేర్కొంది. ఈ నెలలో 60వ వసంతంలో అడుగు పెట్టనున్న బచ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. కొత్త చైర్మన్‌గా ఎంపికయ్యే వ్యక్తికి సెబీ నిర్వహణపై ప్రభావం చూపగల ఎలాంటి ఆర్థిక లేదా సంబంధిత వ్యవహారాలు ఉండకూడదని ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. 25ఏళ్లకు మించిన వృత్తి సంబంధ అనుభవంతోపాటు 50ఏళ్లకు మించిన వయసుగల వ్యక్తులు దరఖాస్తు చేయవచ్చని వివరించింది. ఎంపికైన అభ్యర్థి ప్రభుత్వ కార్యదర్శి స్థాయిలో నెలకు రూ. 5,62,500 చొప్పున వేతనాన్ని పొందనున్నట్లు తెలియజేసింది. సాధారణంగా ప్రభుత్వం సెబీ చీఫ్‌ను తొలుత మూడేళ్ల కాలానికి ఎంపిక చేస్తుంది. తదుపరి మరో రెండేళ్లు పదవీ కాలాన్ని పొడిగిస్తుంది. అయితే ఇంతక్రితం యూకే సిన్హా ఐదేళ్ల కాలానికి పదవిని స్వీకరించారు. తదుపరి మరో ఏడాది బాధ్యతలు నిర్వహించారు. -
ఐపీవోకు డార్ఫ్-కీటాల్ కెమికల్స్
న్యూఢిల్లీ: ప్రత్యేక రసాయనాల తయారీలో ఉన్న డార్ఫ్–కీటాల్ కెమికల్స్ ఇండియా లిమిటెడ్ ఐపీవోకు వస్తోంది. రూ.5,000 కోట్లను సమీకరించేందుకు అనుమతి కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.1,500 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు.ప్రమోటర్ మీనన్ ఫ్యామిలీ హోల్డింగ్స్ ట్రస్ట్ రూ.3,500 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. డార్ఫ్–కీటాల్ కెమికల్స్ ఇండియా 1992లో ప్రారంభం అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, పెట్రోనాస్, ఐవోసీ, పీపీజీ ఇండస్ట్రీస్, వేదాంత వంటి దిగ్గజ సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. భారత్‌తోపాటు బ్రెజిల్, యూఎస్, కెనాడాలో మొత్తం 16 తయారీ కేంద్రాలను కలిగి ఉంది.రసాయనాల తయారీలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అతికొద్ది సంస్థల్లో డార్ఫ్–కీటాల్ కెమికల్స్ ఇండియా ఒకటి. భారత్ వెలుపల సంస్థ ఖాతాలో 542 పేటెంట్స్ ఉన్నాయి. వీటిలో యూఎస్‌లో 99 నమోదయ్యాయి. కంపెనీ 2023–24లో రూ.548 కోట్ల టర్నోవర్‌పై రూ.60 కోట్ల నికరలాభం ఆర్జించింది.ఐపీఓ అంటే..స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి రెండు రకాల మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఒకటి..కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుడు వాటికి దరఖాస్తు చేయడం ద్వారా షేర్లను కొనుగోలు చేయడం. అలాకాకుండా మార్కెట్లో నేరుగా షేర్లను కొనుగోలు చేయడం రెండోది. పబ్లిక్ ఇష్యూనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) అని కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా కంపెనీలు తమ ఎదుగుదల క్రమంలో నిధులు అవసరమై ప్రజల నుంచి వాటిని సమీకరించాలనే ఉద్దేశంతో షేర్లను జారీ చేయడం ద్వారా మొట్టమొదటిసారి ఐపీఓకు వస్తాయి.ఇలా ఐపీఓకి వచ్చే కంపెనీలు ముందుగా లీడ్ మేనేజర్లను నియమించుకుంటాయి. వీరు ఆ కంపెనీ ఐపీఓ వ్యవహారాలు సజావుగా పూర్తయ్యేలా చూస్తారు. కంపెనీలు ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీలు విస్తరణ, మూలధన అవసరాలు, అప్పులు తీర్చడం కోసం వాడుకుంటాయి. ఐపీఓ తర్వాత సంస్థలు వాటాదారులకు జవాబుదారీగా నిలవాల్సి ఉంటుంది. -
ఐపీవో గ్రే మార్కెట్‌పై సెబీ కన్ను
పబ్లిక్ ఇష్యూల అనధికార క్రయవిక్రయాల(గ్రే మార్కెట్)కు చెక్ పెట్టే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI) తాజాగా పేర్కొంది. ఇందుకు ఒక వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు సెబీ ఛైర్పర్సన్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. తద్వారా ఐపీవో(IPO)లో షేర్లను పొందగల ఇన్వెస్టర్లు ముందుగానే వీటిని విక్రయించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. ఇటీవల కాలంలో పలు ఐపీవోలకు భారీస్థాయిలో స్పందన లభించడంతోపాటు.. అధిక లాభాలతో లిస్టవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్దికాలంగా గ్రే మార్కెట్ లావాదేవీలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ఇలాంటి లావాదేవీలను కోరుకుంటుంటే నియంత్రణల పరిధిలో వీటిని ఎందుకు అనుమతించకూడదంటూ వ్యాఖ్యానించారు.దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బచ్ పలు అంశాలపై స్పందించారు. నిజానికి గ్రే మార్కెట్ లావాదేవీలు సరికాదని, ఆర్గనైజ్డ్ మార్కెట్ ద్వారానే క్రయవిక్రయాలు చేపట్టడం శ్రేయస్కరమని బచ్ తెలియజేశారు. ఇందుకు రెండు స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్గదర్శకాలు సిద్ధమయ్యాక ఐపీవో షేర్లకు లిస్టింగ్కంటే మూడు రోజులు ముందుగా లావాదేవీలకు తెరతీయనున్నట్లు వివరించారు. షేర్ల కేటాయింపులు, లిస్టింగ్ మధ్యలో ఇందుకు వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: స్టార్టప్స్‌కు ఏటా రూ.1.24 లక్షల కోట్ల నిధులునిధుల దుర్వినియోగంకొన్ని కంపెనీలు ఐపీవోల ద్వారా సమీకరించిన నిధులను దుర్వినియోగపరుస్తున్నట్లు గుర్తించామని బచ్ తెలియజేశారు. క్యాపిటల్ మార్కెట్లలో ఇలాంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహించకుండా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అడ్డుకోవాలని సూచించారు. ఐపీవో డాక్యుమెంట్లను వేగంగా పరిశీలించి అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక సాధనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకర్లకు ఇలాంటి కంపెనీలగురించి తెలుస్తుందని, ఇలాంటి వాటికి సహకరించవద్దని సలహా ఇచ్చారు. ఎస్ఎంఈ విభాగంలో ఇలాంటి ఐపీవోలు వెలువడితే అధిక సబ్ర్స్కిప్షన్ నమోదవుతున్నదని చెప్పారు. ఆపై షేరు ధర భారీగా పెరుగుతూపోవడం ద్వారా ప్రమోటర్లు త్వరితగతిన లాభపడుతున్నట్లు వివరించారు. సంబంధిత పార్టీ లావాదేవీల ద్వారా ఐపీవో నిధులను కొన్ని కంపెనీలు ప్రమోటర్ సంబంధ సంస్థలలోకి చేర్చడం లేదా రక్షణాత్మక ప్రాంతాలకు మళ్లించడం చేస్తున్నట్లు బచ్ తెలియజేశారు. ఈ నిధులను విదేశీ మార్కెట్లలో ఇతర సంస్థలు లేదా సాఫ్ట్వేర్ వంటి ప్రొడక్టుల కొనుగోలుకి వినియోగిస్తున్నాయని వివరించారు. -
రెండేళ్లలో 1,000 ఐపీవోలు
న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో మొత్తం 1,000 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టే వీలున్నట్లు దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్(ఏఐబీఐ) తాజాగా అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఆర్థిక వృద్ధి, సానుకూల స్టాక్ మార్కెట్లు, మెరుగుపడనున్న నియంత్రణా సంబంధ నిబంధనలు తోడ్పాటు నివ్వగలవని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా కంపెనీల నిధుల సమీ కరణ రూ. 3 లక్షల కోట్లను అధిగమించవచ్చునని అభిప్రాయపడింది. రానున్న రెండేళ్ల(2026, 2027)లో దేశీ క్యాపిటల్ మార్కెట్లు భారీ ప్రగతిని సాధించనున్నట్లు ఏఐబీఐ తెలియజేసింది. గత ఆరేళ్లలో 851 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా మొత్తం రూ. 4.58 లక్షల కోట్లు సమీకరించినట్లు వెల్లడించింది. వీటిలో 281 కంపెనీలు మెయిన్ బోర్డు నుంచి లిస్ట్‌కాగా.. 570 సంస్థలు ఎస్ఎంఈ విభాగానికి చెందినవిగా తెలియజేసింది. గతేడాదిలో గత ఆర్థిక సంవత్సరం(2023–24) స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా దేశీ కంపెనీలు ఉమ్మడిగా రూ. 67,955 కోట్లు సమకూర్చుకున్నట్లు ఏఐబీఐ పేర్కొంది. వీటిలో ప్రధాన కంపెనీలు రూ. 61,860 కోట్లు అందుకోగా.. ఎస్ఎంఈలు రూ. 6,095 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. మరోవైపు క్విప్ ద్వారా 61 కంపెనీలు రూ. 68,972 కోట్ల నిధులను సమీకరించాయి. ఐపీవోల పరిమాణంరీత్యా గతేడా ది భారత్ ప్రపంచవ్యాప్తంగా తొలి స్థానంలో నిలిచినట్లు ఏఐబీఐ చైర్మన్ మహావీర్ లునావట్ తెలియజేశారు. మొత్తం 335 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చినట్లు వెల్లడించారు. తద్వారా యూఎస్, యూ రప్లను భారత్ అధిగమించినట్లు పేర్కొన్నారు. గత రెండేళ్ల బాటలో వచ్చే ఏడాదిలోనూ ఐపీవోలు రికార్డ్ సృష్టించనున్నట్లు అంచనా వేశారు. వెరసి క్విప్‌లు, ఐపీవోల ద్వా రా రూ. 3 లక్షల కోట్ల ను మించి పెట్టుబడుల సమీకరణకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.ల్యూమినో ఇండస్ట్రీస్ లిస్టింగ్ బాట సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు కండక్టర్స్, పవర్ కేబుళ్ల తయారీ కంపెనీ ల్యూమినో ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 420 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 15 కోట్లు పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ప్రొడక్ట్ ఆధారిత ఈపీసీ సేవలు అందిస్తోంది. కండక్టర్స్, పవర్ కేబుళ్లు, ఎలక్ట్రికల్ వైర్లతోపాటు విద్యుత్ ప్రసారం, పంపిణీకి చెందిన ఇతర ప్రత్యేక విడిభాగాలను సైతం రూపొందిస్తోంది. కంపెనీ క్లయింట్లలో కల్పతరు ప్రాజెక్ట్స్, మాంటె కార్లో, జాక్సన్ లిమిటెడ్, వరోరా కర్నూల్ ట్రాన్స్మిషన్ తదితరాలున్నాయి. అంతేకాకుండా దేశ, విదేశీ ప్రభుత్వ విద్యుత్ బోర్డులు సైతం కస్టమర్ల జాబితాలో ఉన్నాయి. 2024 సెప్టెంబర్‌కల్లా కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ. 1,804 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఆదాయం 85% జంప్‌చేసి రూ. 1,407 కోట్లను తాకగా.. నికర లా భం రూ. 19 కోట్ల నుంచి రూ. 87 కోట్లకు ఎగసింది. ఐపీవో గ్రే మార్కెట్‌పై సెబీ కన్నుప్రీలిస్టింగ్ ట్రేడింగ్‌ను అనుమతించే యోచనపబ్లిక్ ఇష్యూల అనధికార క్రయవిక్రయాల(గ్రే మార్కెట్)కు చెక్ పెట్టే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. ఇందుకు ఒక వ్యవస్థను ప్రవేవపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలో షేర్లను పొందగల ఇన్వెస్టర్లు ముందుగానే వీటిని విక్రయించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. ఇటీవల కాలంలో పలు ఐపీవోలకు భారీస్థాయిలో స్పందన లభించడంతోపాటు.. అధిక లాభాలతో లిస్టవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్దికాలంగా గ్రే మార్కెట్ లావాదేవీలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ఇలాంటి లావాదేవీలను కోరుకుంటుంటే నియంత్రణల పరిధిలో వీటిని ఎందుకు అనుమతించకూడదంటూ వ్యాఖ్యానించారు. దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బచ్ ఇంకా పలు అంశాలపై స్పందించారు. నిజానికి గ్రే మార్కెట్ లావాదేవీలు సరికాదని, ఆర్గనైజ్డ్ మార్కెట్ ద్వారానే క్రయవిక్రయాలు చేపట్టడం శ్రేయస్కరమని బచ్ తెలియజేశారు. ఇందుకు రెండు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్గదర్శకాలు సిద్ధమయ్యాక ఐపీవో షేర్లకు లిస్టింగ్కంటే మూడు రోజులు ముందుగా లావా దేవీలకు తెరతీయనున్నట్లు వివరించారు. షేర్ల కేటాయింపులు, లిస్టింగ్ మధ్యలో ఇందుకు వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం కొన్ని కంపెనీలు ఐపీవోల ద్వారా సమీకరించిన నిధులను దురి్వనియోగపరుస్తున్నట్లు గుర్తించామని బచ్ తెలియజేశారు. క్యాపిటల్ మార్కెట్లలో ఇలాంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహించకుండా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అడ్డుకోవాలని సూచించారు. ఐపీవో డాక్యుమెంట్లను వేగంగా పరిశీలించి అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక సాధనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఐబ్యాంకర్లకు ఇలాంటి కంపెనీలగురించి తెలుస్తుందని, ఇలాంటి వాటికి సహకరించవద్దని సలహా ఇచ్చారు. ఎస్ఎంఈ విభాగంలో ఇలాంటి ఐపీవోలు వెలువడితే అధిక సబ్ర్స్కిప్షన్ నమోదవుతున్నదని చెప్పారు. ఆపై షేరు ధర భారీగా పెరుగుతూపోవడం ద్వారా ప్రమోటర్లు త్వరితగతిన లాభపడుతున్నట్లు వివరించారు. సంబంధిత పార్టీ లావాదేవీల ద్వారా ఐపీవో నిధులను కొన్ని కంపెనీలు ప్రమోటర్ సంబంధ సంస్థలలోకి చేర్చడం లేదా రక్షణాత్మక ప్రాంతాలకు మళ్లించడం చేస్తున్నట్లు బచ్ తెలియజేశారు. ఈ నిధులను విదేశీ మార్కెట్లలో ఇతర సంస్థలు లేదా సాఫ్ట్వేర్ వంటి ప్రొడక్టుల కొనుగోలుకి వినియోగిస్తున్నాయని వివరించారు. -
ఐపీవోకు ఆరు కంపెనీలు రెడీ
కొత్త క్యాలండర్ ఏడాదిలోనూ ప్రైమరీ మార్కెట్ల దూకుడు కొనసాగనుంది. తాజాగా ఆరు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI) పచ్చ జెండా ఊపింది. జాబితాలో ఐటీ సర్వీసుల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్‌తోపాటు.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు విక్రన్ ఇంజినీరింగ్, అజాక్స్ ఇంజినీరింగ్, పీఎంఈఏ సోలార్ టెక్ సొల్యూషన్స్, ఆల్ టైమ్ ప్లాస్టిక్స్, స్కోడా ట్యూబ్స్ చేరాయి. ఈ ఆరు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ కోసం 2024 సెప్టెంబర్-డిసెంబర్ మధ్య ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. తద్వారా ఉమ్మడిగా రూ.10,000 కోట్లు సమీకరించనున్నాయి. వివరాలు చూద్దాం..కార్లయిల్ మద్దతుతో..డిజిటల్, ఐటీ సొల్యూషన్ల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ ఐపీవో(IPO)లో భాగంగా రూ. 9,950 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్ సంస్థ సీఏ మ్యాగ్నమ్ హోల్డింగ్స్ వీటిని ఆఫర్ చేయనుంది. హెక్సావేర్‌లో పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ సంస్థ సీఏకు ప్రస్తుతం 95.03 శాతం వాటా ఉంది. కంపెనీ ఫైనాన్షియల్, హెల్త్‌కేర్, తయారీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ తదితర రంగాలకు ఐటీ సర్వీసులు సమకూర్చుతోంది. గత ప్రమోటర్ బేరింగ్ పీఈ ఏషియా 2020లో హెక్సావేర్‌ను స్టాక్ ఎక్స్చేంజీల నుంచి డీలిస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తదుపరి ఏడాది కాలంలో బేరింగ్ వాటాను కార్లయిల్ గ్రూప్ కొనుగోలు చేసింది. గతేడాది(2023–24) హెక్సావేర్ రూ.10,380 కోట్ల ఆదాయం, రూ.997 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టెయిన్లెస్ స్టీల్ గుజరాత్ కంపెనీ స్కోడా ట్యూబ్స్ ఐపీవోలో భాగంగా రూ.275 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. సంస్థ ప్రధానంగా ఆయిల్, గ్యాస్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, విద్యుత్ తదితర రంగాలలో కార్యకలాపాలు నిర్వహించే ఈపీసీ, ఇండ్రస్టియల్ కంపెనీలకు స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్స్, పైపులను తయారు చేసి అందిస్తోంది. ఈపీసీ కంపెనీమౌలిక రంగ ఈపీసీ సంస్థ విక్రన్ ఇంజినీరింగ్ ఐపీవోలో భాగంగా రూ.900 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీలో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కొచాలియాకు సైతం పెట్టుబడులున్నాయి. టర్న్‌కీ పద్ధతిలో డిజైన్, సప్లై, ఇన్స్టలేషన్, టెస్టింగ్, కమిషనింగ్ తదితర ఎండ్ టు ఎండ్ ఈపీసీ సర్వీసులదిస్తోంది. సోలార్ టెక్ఐపీవోలో భాగంగా పీఎంఈఏ సోలార్ టెక్ సొల్యూషన్స్ రూ.600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.12 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. 2006లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా సోలార్ ట్రాకింగ్ మౌంటింగ్ సిస్టమ్స్, ఎక్విప్మెంట్ తయారీలో ఉంది. మాడ్యూల్ మౌంటింగ్ అసెంబ్లీలో 16 గిగావాట్ల వార్షిక స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. కన్జూమర్ ప్రొడక్ట్స్కస్టమర్ల కోసం కన్జూమర్‌వేర్ ప్రొడక్టులు తయారు చేసే ఆల్ టైమ్ ప్లాస్టిక్స్ ఐపీవోలో భాగంగా రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 52.5 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వైట్‌లేబుల్ కన్జూమర్‌వేర్ ప్రొడక్టుల తయారీ కంపెనీ క్లయింట్ల సొంత బ్రాండ్లను రూపొందించి అందిస్తోంది. కస్టమర్ల జాబితాలో గ్లోబల్ దిగ్గజాలు ఐకియా, ఏఎస్‌డీఏ స్టోర్స్, టెస్కో పీఎల్సీ, మైఖేల్స్ స్టోర్స్‌తోపాటు దేశీయంగా స్పెన్సర్స్ రిటైల్ తదితరాలున్నాయి.ఇదీ చదవండి: అత్యంత విలువైన ఐటీ బ్రాండ్లుకాంక్రీట్ ఎక్విప్మెంట్పీఈ దిగ్గజం కేదారా క్యాపిటల్‌కు పెట్టుబడులున్న అజాక్స్ ఇంజినీరింగ్ కాంక్రీట్ ఎక్విప్మెంట్ తయారీలో కార్యకలాపాలు విస్తరించింది. ఐపీవోలో భాగంగా 2.28 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కేదారా క్యాపిటల్ 74.37 లక్షల షేర్లను ఆఫర్ చేయనుంది. -
కార్పొరేట్ వ్యవహారాలపై సెబీ నిర్ణయం
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ వినిర్ ఇంజినీరింగ్ తమ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి ముసాయిదా ప్రాస్పెక్టస్ సమర్పించింది. దీని ప్రకారం ఐపీవోలో భాగంగా 5,33,00,000 షేర్లను కంపెనీ ఆఫర్ చేయనుంది. ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్ నితేష్ గుప్తా వీటిని ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద విక్రయించనున్నారు. షేర్ల ముఖవిలువ రూ.2గా ఉంటుంది.ఇదీ చదవండి: మరిన్ని సంస్థలకు పీఎల్ఐ ప్రోత్సాహకాలుఆనంద్ రాఠీకి సెబీ చెక్ఐపీవో ప్రాస్పెక్టస్ వెనక్కిన్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా బ్రోకింగ్ కంపెనీ ఆనంద్ రాఠీ(Anand Rati) గ్రూప్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలకు చెక్ పెట్టింది. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ 2024 డిసెంబర్లో దాఖలు చేసిన ఐపీవో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను తిప్పి పంపింది. వీటి ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ ద్వారా ఆనంద్ రాఠీ షేర్ రూ. 745 కోట్లు సమీకరించాలని భావించింది. ఇందుకు ఈక్విటీని తాజాగా జారీ చేయాలని ప్రతిపాదించింది. అయితే కారణాలు వెల్లడించకుండా సెబీ ప్రాస్పెక్టస్‌ను రిటర్న్ చేసింది. -
స్టాక్ మార్కెట్లోకి రావాలా?.. పోవాలా?
స్టాక్ మార్కెట్లను నియంత్రించే సెబీ (సెక్యూరిటీస్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆమధ్య కొన్ని చర్యలు తీసుకుంది. అవి నవంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చాయి కూడా. కొన్ని ఇండెక్స్‌లలో వారాంతపు ట్రేడింగ్‌లు నిలిపివేయడం, లాట్ సైజులను పెంచడం వీటిలో ప్రధానమైనది. ఇలా చేయడం ద్వారా రిటైల్ ట్రేడర్లు భారీ స్థాయిలో నష్టపోకుండా చూడవచ్చన్నది సెబీ ఉద్దేశం. నిజంగా సెబీ లక్ష్యం నెరవేరిందా / నెరవేరుతుందా.. అంటే ఎన్నో ప్రశ్నలు. ఆ చర్యలను ఒకసారి విశ్లేషిస్తే...గత నవంబర్ దాకా మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్‌లలో వారాంతపు కాంట్రాక్టులు ఉండేవి. ప్రతి వారం.. సోమవారం మిడ్ నిఫ్టీ, మంగళ వారం ఫిన్ నిఫ్టీ, బుధవారం బ్యాంకు నిఫ్టీ, గురువారం నిఫ్టీ, శుక్రవారం సెన్సెక్స్ ఎక్సపైరీలు జరిగేవి. తదనుగుణంగా ట్రేడర్లు పొజిషన్స్ తీసుకుని ట్రేడ్ చేసుకునేవారు. ఇప్పుడు కేవలం నిఫ్టీ, సెన్సెక్స్‌లలో మాత్రమే వారాంతపు కాంట్రాక్టులు అమలు చేస్తున్నారు.మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీలలో ట్రేడ్ చేయాలి అనుకునేవారు.. తప్పనిసరిగా నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే తీసుకోవాల్సి వస్తోంది. పైన పేర్కొన్న అయిదు సూచీల్లో మీకు నచ్చిన ఏదో ఒక సూచీని వారాంతపు ఎక్సపైరీ సూచీలుగా కొనసాగించుకోవచ్చని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీలకు సెబీ సూచించింది. ఈ రెండు ఎక్స్చేంజీలు సహజంగానే వాటి ప్రామాణిక సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్‌లలో వారాంతపు కాంట్రాక్టులు నిర్వహిస్తామని సెబీకి చెప్పాయి. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్‌లలో మాత్రమే ఇప్పుడు వారాంతపు కాంట్రాక్టులు నడుస్తూండగా.. మిగిలిన మూడూ నెలవారీ కాంట్రాక్టులుగా కొనసాగుతున్నాయి. అలాగే మిడ్ నిఫ్టీ లాట్ సైజు ఇప్పటిదాకా 50 ఉంటే.. ఫిబ్రవరి నుంచి 120కి పెరిగింది. ఫిన్ నిఫ్టీ లాట్ సైజు 25 నుంచి 65కి, బ్యాంకు నిఫ్టీ 15 నుంచి 30కి, నిఫ్టీ 25 నుంచి 75కి, సెన్సెక్స్ 10 నుంచి 20కి పెరిగాయి.వారాంతపు కాంట్రాక్టులు ఇప్పటికే నెలవారీ కాంట్రాక్టులుగా మారిపోగా.. లాట్ సైజుల్లో మార్పులు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది. అన్ని అలవాట్లకు లోనైన వ్యక్తి తొందరగా వాటిని ఎలా మానుకోలేడో.. ట్రేడింగ్ కూడా అలాంటిదే. పైగా ఇది ఆర్ధిక పరమైన అంశం. స్టాక్ మార్కెట్లో ఉండే బలహీనత ఏమిటంటే.. పోగొట్టుకున్న వ్యక్తి అంతటితో ఊరుకోడు. ఎలాగైనా ఆ పోగొట్టుకున్నది రాబట్టుకోవాలన్న తాపత్రయంతో ఇంకా ఇంకా డబ్బులు తెచ్చి ట్రేడింగ్‌లో పెడుతూనే ఉంటాడు. వీక్లీ కాంట్రాక్టులు తీసేయడం వల్ల వారం వారం డబ్బులు పోగొట్టుకునే ట్రేడర్లు తగ్గిపోతారని.. తద్వారా సగటు ట్రేడర్లను కాపాడినట్లు అవుతుందన్నది సెబీ సదుద్దేశం. కానీ అలా జరిగిందా..??సగటు ట్రేడర్.. ట్రేడింగ్ ఆపేయలేదు. నెలవారీ కాంట్రాక్టులు కొనడం మొదలుపెట్టాడు. ఇవి రేటు ఎక్కువ ఉంటాయి. పైగా లాట్ సైజు పెరిగింది కూడా.. దీనికి ఒక ఉదాహరణ పరిశీలిద్దాం..బ్యాంకు నిఫ్టీ లాట్ ప్రస్తుతం15 షేర్స్. ఈ సూచీ 51000 దగ్గర ఉంది అనుకుందాం. దాని కాల్ ప్రీమియం రూ. 200 ఉంది అనుకుంటే రూ. 3,000 చేతిలో ఉంటే చాలు. 1 లాట్ వస్తుంది. ఇప్పుడు మంత్లీ కాంట్రాక్టు మాత్రమే కొనాలి. మంత్లీ కాంట్రాక్ట్స్ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇదే 51000 కాల్ మంత్లీలో రూ. 1000 దరిదాపుల్లో ఉంది. కనీసం ఒక లాట్ కొనాలంటే రూ. 15,000 కావాలి. అదే ఫిబ్రవరి నుంచి అయితే లాట్ సైజు 30కి పెరుగుతుంది. అప్పుడు 30,000 అవసరమవుతాయి. దీంతో అంత పెట్టుబడి పెట్టలేక చాలామంది రిటైల్ ట్రేడర్లు మార్కెట్‌కి దూరమవుతారని, తద్వారా ఇలాంటి చిన్న ట్రేడర్లను నష్టాల నుంచి కాపాడవచ్చు అన్నది సెబీ ఉద్దేశం.ఇది జరగొచ్చు.. జరక్కపోవచ్చు కూడా.. అదెలాగంటే... 1. అంత డబ్బులు పెట్టలేని వ్యక్తి ట్రేడింగ్‌కు దూరమవుతాడు. సెబీ కోరుకున్నది ఇదే.2. ట్రేడింగ్‌కు అలవాటు పడ్డ వ్యక్తి, డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి అంత తొందరగా ట్రేడింగ్ మానేయడు. అప్పు చేసో, పొదుపు మొత్తాలు ఖాళీ చేసో.. మరిన్ని డబ్బులు తెచ్చి పెడతాడు. ఇది సెబీ ఉద్దేశాన్ని నెరవేర్చకపోగా రిటైల్ ట్రేడర్లను మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది.కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీల్లో వారాంతపు కాంట్రాక్టుల్లో ట్రేడ్ చేసే వ్యక్తులు ఇప్పుడు మంత్లీ వైపు మళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత డిసెంబర్లో (అంతక్రితం 11 నెలలతో పోలిస్తే) బ్యాంకు నిఫ్టీ మంత్లీ కాంట్రాక్టుల్లో రోజువారీ ప్రీమియం టర్నోవర్ 377 శాతం పెరిగి రూ.12,200 కోట్లుగా నమోదైంది. అదే మిడ్ నిఫ్టీలో 819 శాతం పెరిగి 512 కోట్లకు చేరగా, ఫిన్ నిఫ్టీ లో 575 శాతం పెరిగి రూ. 398 కోట్లకు చేరింది.దీన్నిబట్టి చూస్తే ట్రేడర్లు ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తోంది. వ్యాపార పరిమాణం మందగించవచ్చేమో కానీ వ్యాపారం మాత్రం తగ్గట్లేదు. దీనివల్ల పోగొట్టుకునే వ్యక్తులు మరింత పోగొట్టుకోవడానికి, లబ్ది పొందేవాళ్ళు మరింత ప్రయోజనం పొందడానికి తలుపులు తెరిచినట్లే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పోగొట్టుకునేది చిన్న ట్రేడర్లే కానీ.. ప్రయోజనం పొందేది మాత్రం భారీ స్థాయిలో లావాదేవీలు నిర్వహించే విదేశీ మదుపర్లు, హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్సే.సెబీ నిర్ణయాలు అమల్లోకి వచ్చి ఇంచుమించు రెండు నెలలే కావస్తోంది. కాబట్టి మరికొన్ని నెలల పరిశీలన తర్వాత సెబీ తన నిర్ణయాలను ఏవైనా మార్చుకుంటుందా.. కొత్త పద్ధతినే కొనసాగిస్తుందా.. ఏవైనా మార్పులు చేస్తుందా.. ఇవన్నీ వేచి చూడాల్సిన ప్రశ్నలే.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
నిధుల సమీకరణలో 2025 జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో క్యాపిటల్ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణ జోరందుకున్నట్లు సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. మార్చితో ముగియనున్న పూర్తి ఏడాదికి 21 శాతం ఎగసి రూ. 14.27 లక్షల కోట్లకు చేరే వీలున్నట్లు అంచనా వేశారు. గతేడాది(2023–24)లో ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి రూ. 11.8 లక్షల కోట్లు మాత్రమే సమకూర్చుకున్నట్లు ప్రస్తావించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్(ఎన్ఎస్ఐఎం) నిర్వహించిన ఒక సదస్సులో బచ్ పలు అంశాలను వివరించారు. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) కంపెనీలు ఈక్విటీల నుంచి రూ. 3.3 లక్షల కోట్లు, రుణ మార్గాల ద్వారా రూ. 7.3 లక్షల కోట్లు అందుకున్నట్లు తెలియజేశారు. వెరసి రూ. 10.7 లక్షల కోట్లు సమీకరించినట్లు వెల్లడించారు. ఇక చివరి త్రైమాసికాన్ని(జనవరి–మార్చి) కూడా పరిగణిస్తే ఈక్విటీ, డెట్ విభాగాల ద్వారా సుమారు రూ. 14.27 లక్షల కోట్లను అందుకునే వీలున్నట్లు బచ్ అంచనా వేశారు. ఇకపై ఇన్విట్స్ అదుర్స్ నిజానికి ఈ ఏడాది తొలి 9 నెలల్లో మునిసిపల్ బాండ్లుసహా రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (ఇన్విట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్విట్స్ ద్వారా సమీకరించిన నిధులు రూ. 10,000 కోట్లు మాత్రమేనని బచ్ వెల్లడించారు. అయితే వచ్చే దశాబ్దంలో వీ టిలో యాక్టివిటీ భారీగా పెరగనున్నట్లు అంచనా వే శారు. దీంతో ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి సమీకరించే నిధులను అధిగమించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎన్ఎస్ఐఎంను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఎంఈలకు దన్ను చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈ)ల బోర్డు ప్రతిపాదనలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు బచ్ పేర్కొన్నారు. క్లియరింగ్లకు పడుతున్న సమయాన్ని కుదించే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఎస్ఎంఈ ప్రతిపాదనలను అనుమతించేందుకు సెబీ 3 నెలల గడువును తీసుకుంటున్నదని, బ్యాంకులైతే 15 నిముషాలలో ముందస్తు అనుమతులు మంజూరు చేస్తున్నాయని బచ్ వ్యాఖ్యానించారు. దీంతో అనుమతుల జారీలో మరింత సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలియజేశారు. ఐపీవోల వరద ఇటీవల కొద్ది నెలలుగా పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తుతుండటంతో అప్రమత్తత పెరిగినట్లు బచ్ తెలియజేశారు. పలు కంపెనీలు సెబీ తలుపు తడుతున్నప్పటికీ ఇతర మార్గాలకూ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్లు, ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్లు, రైట్స్ ఇష్యూలు తదితరాలను ప్రస్తావించారు. రైట్స్ జారీలో వ్యవస్థలను ఆధునీకరిస్తున్నట్లు, ఇందుకు కంపెనీలు సైతం సన్నద్ధంకావలసి ఉన్నట్లు వెల్లడించారు. కాగా.. మ్యూచువల్ ఫండ్ల కొత్త ఆఫర్లకు వేగవంత అనుమతులిస్తున్నామని, ఇకపై రూ. 250 కనీస పెట్టుబడులతో సిప్ పథకాలను అనుమతించనున్నట్లు తెలియజేశారు. గత కొన్నేళ్లలో దేశీయంగా పెట్టుబడులు పుంజుకోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడు నమోదయ్యే ఆటుపోట్లు తగ్గినట్లు వివరించారు. -
4 ఐపీవోలకు సెబీ సై
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నాలుగు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో డాక్టర్ అగర్వాల్స్ హెల్త్కేర్సహా కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీగ్రీన్ ఎక్సెల్ ఈపీసీ ఇండియా చేరాయి. గతేడాది సెప్టెంబర్– అక్టోబర్ మధ్య కాలంలో ఈ కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. అయితే మౌరి టెక్, అమంటా హెల్త్‌కేర్ ఐపీవో ప్రణాళికల నుంచి వెనక్కి తగ్గాయి. వివరాలు చూద్దాం.. ఐకేర్ కంపెనీ పీఈ దిగ్గజాలు టెమాసెక్ హోల్డింగ్స్, టీపీజీలకు పెట్టుబడులున్న డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్ ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 6.95 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ప్రధానంగా కంటి పరిరక్షణ(ఐ కేర్) సరీ్వసులు అందిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలినవాటిని ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. రియల్టీ డెవలపర్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రియల్టీ రంగ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.మౌలిక రంగ సంస్థ ఈపీసీ ఇన్ఫ్రా, టోల్ వసూళ్ల కంపెనీ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవోలో భాగంగా రూ. 105 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 31 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్లకు ప్రస్తతం 71.58 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను సాధారణ కార్పొరేట్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. మెషీనరీ తయారీ ఇథనాల్ ప్లాంట్లను రూపొందించే రీగ్రీన్ ఎక్సెల్ ఈపీసీ ఇండియా పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. దీనిలో భాగంగా రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.14 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ప్రధానంగా ఇథనాల్ ప్లాంట్ల డిజైనింగ్, తయారీ, సరఫరా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వెనకడుగులో.. ఐటీ సొల్యూషన్ల కంపెనీ మౌరి టెక్, ఆరోగ్య పరిరక్షణ సంస్థ అమంటా హెల్త్‌కేర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలను విరమించుకున్నాయి. గతేడాది సెపె్టంబర్– అక్టోబర్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. అయితే డిసెంబర్లోనే పత్రాలను వెనక్కి తీసుకున్నాయి. ఇందుకు కారణాలు వెల్లడికాలేదు. ఐపీవోలో భాగంగా హైదరాబాద్ కంపెనీ మౌరి టెక్ రూ. 440 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయాలని భావించింది. వీటితోపాటు మరో రూ. 1,060 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచాలని ప్రణాళికలు వేశారు. ఇక ఫార్మా రంగ కంపెనీ అమంటా హెల్త్‌కేర్ ఐపీవోలో భాగంగా 1.25 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయాలని తొలుత భావించింది. కంపెనీ ప్రధానంగా మెడికల్ పరికరాలు, స్టెరైల్ లిక్విడ్ ప్రొడక్టుల తయారీలో ఉంది. -
తెలంగాణకు కింగ్‌ఫిషర్ బీర్లు బంద్
సాక్షి, హైదరాబాద్: పండుగ ముందర మద్యం ప్రియులకు చేదు వార్త. తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్(TSBCL)కు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్(యూబీ)ప్రకటించింది. దీంతో ఆ సంస్థ నుంచి రాష్ట్రానికి వచ్చే కింగ్‌ఫిషర్(King Fisher), హెనికిన్ బీర్ల సరఫరా ఆగిపోనుంది. తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్ నుంచి తమకు రూ.900 కోట్లు బకాయి ఉందని, పైగా 2019 నుంచి ధరలను సవరించకపోవడంతోనే యూబీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు సెబీకి లేఖ ద్వారా తెలిపింది.కాగా, రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడయే బీర్ బ్రాండ్ కింగ్‌షిషరే. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ యూబీ సంస్థకు ప్రతి 45 రోజులకోసారి బకాయిలు చెల్లించాల్సి ఉండగా, నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లపై 35 శాతం రేట్లు పెంచాలని బేవరేజ్ కార్పొరేషన్‌ను యునైటెడ్ బ్రూవరీస్ కోరింది. యునైటెడ్ బేవరేజస్ ప్రతిపాదనలపై గతంలోనే కమిటీని ప్రభుత్వం నియమించింది. రిటైర్డ్ జడ్జిలతో వేసిన కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. యునైటెడ్ బేవరేజస్ ప్రతిపాదనలతో మందు బాబులపై ఆర్థిక భారం పెరగనుంది. మద్యం ప్రియులపై భారం పడకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: ఫ్యూచర్ సిటీ.. పోలీసుల పోటీ!


