
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లెయిమ్ చేయని డివిడెండ్లు, షేర్లను పొందడంలో ఇన్వెస్టర్లకు అవసరమయ్యే సహాయాన్ని అందించే దిశగా హైదరాబాద్‌లో ‘నివేశక్ శివిర్’ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చొరవతో, కార్పొరేట్ వ్యవహారాల శాఖలో భాగమైన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్‌ఏ) దీన్ని నిర్వహించింది.
సీడీఎస్‌ఎల్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్, బీఎస్‌ఈ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్, ఎన్‌ఎస్‌ఈ, కేఫిన్ టెక్నాలజీస్ మొదలైనవి ఇందులో పాలుపంచుకున్నాయి. ఇన్వెస్టర్లకు కావాల్సిన సహాయాన్ని అందించేందుకు ప్రత్యేకంగా 23 సరీ్వస్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 360 మంది పైగా ఇన్వెస్టర్లు, క్లెయిమెంట్లు ఇందులో పాల్గొన్నారు. ఐఈపీఎఫ్‌ఏ సీఈవో అనితా షా ఆకెళ్ల, సెబీ ఈడీలు జీవన్ సోన్‌పరోటే, సునీల్ జయవంత్ కదమ్ తదితరులు దీనికి హాజరయ్యారు.