breaking news
unclaimed dividends
-
హైదరాబాద్‌లో సెబీ ప్రత్యేక కార్యక్రమం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లెయిమ్ చేయని డివిడెండ్లు, షేర్లను పొందడంలో ఇన్వెస్టర్లకు అవసరమయ్యే సహాయాన్ని అందించే దిశగా హైదరాబాద్‌లో ‘నివేశక్ శివిర్’ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చొరవతో, కార్పొరేట్ వ్యవహారాల శాఖలో భాగమైన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) దీన్ని నిర్వహించింది.సీడీఎస్ఎల్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్, బీఎస్ఈ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్, ఎన్ఎస్ఈ, కేఫిన్ టెక్నాలజీస్ మొదలైనవి ఇందులో పాలుపంచుకున్నాయి. ఇన్వెస్టర్లకు కావాల్సిన సహాయాన్ని అందించేందుకు ప్రత్యేకంగా 23 సరీ్వస్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 360 మంది పైగా ఇన్వెస్టర్లు, క్లెయిమెంట్లు ఇందులో పాల్గొన్నారు. ఐఈపీఎఫ్ఏ సీఈవో అనితా షా ఆకెళ్ల, సెబీ ఈడీలు జీవన్ సోన్పరోటే, సునీల్ జయవంత్ కదమ్ తదితరులు దీనికి హాజరయ్యారు. -
కంపెనీల చట్టానికి సవరణలపై నోటిఫికేషన్
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు, మోసాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు ఉద్దేశించి కొత్త కంపెనీల చట్టం 2013లో పలు సవరణలను కేంద్రం నోటిఫై చేసింది. బోర్డుల తీర్మానాలు, అన్క్లెయిమ్డ్ డివిడెండ్ల వినియోగం, సంస్థల ఏర్పాటు తదితర సవరణలు ఇందులో ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు కోసం కనీస మూలధనం రూ. 1 లక్ష, ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటుకు రూ. 5 లక్షలు ఉండాలన్న నిబంధనను కొత్త కంపెనీల చట్టం తొలగించింది. సమీకరించిన డిపాజిట్లను, వాటిపై వడ్డీని గడువులోగా చెల్లించని కంపెనీలపై రూ. 1 కోటి నుంచి రూ. 10 కోట్ల దాకా జరిమానా పడనుంది. అలాగే, కంపెనీ అధికారులకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.