చలికి చెక్‌ పెట్టె దుప్పటి.. వెచ్చని పాదాల కోసం సాక్స్! | Gadgets For Winter Season Smart Socks Blanket and More | Sakshi
Sakshi News home page

చలికి చెక్‌ పెట్టె దుప్పటి.. వెచ్చని పాదాల కోసం సాక్స్!

Nov 30 2025 3:35 PM | Updated on Nov 30 2025 3:43 PM

Gadgets For Winter Season Smart Socks Blanket and More

చలి గాలులు వీచినా, మీకు మాత్రం హాయిగా హీట్‌ థెరపీ టచ్‌ ఇచ్చే గాడ్జెట్లు వచ్చేశాయి. ఈ స్మార్ట్‌ గాడ్జెట్లు మీ శరీరానికి వెచ్చగా హత్తుకుంటూ కంఫర్ట్, కేర్, రిలాక్సేషన్‌ అన్నీ కలిపి చలికాలాన్ని ఒక హాయికాలంగా మార్చేస్తాయి.

చలికి చెక్‌ ఈ దుప్పటి!
చలి వణికిస్తోందా? ఇక ఆ ఫీలింగ్‌కు ‘టాపిష్‌ ఎలక్ట్రిక్‌ దుప్పటి’తో ఫుల్‌స్టాప్‌ పెట్టొచ్చు! ఈ దుప్పటి కోరల్‌ ఫ్లీస్‌ మెటీరియల్‌తో తయారై, చర్మానికి మృదువుగా తాకుతూ తక్షణమే వెచ్చదనాన్ని ఇస్తుంది. రివర్సిబుల్‌ డిజైన్‌తో రెండు వైపులా ఉపయోగించుకోవచ్చు. అందం కూడా, సౌకర్యం కూడా! ఇన్‌బిల్ట్‌ థర్మల్‌ ప్రొటెక్షన్ ఉండటం వల్ల చలి ఎంత పెరిగినా, వేడి సమతుల్యంగా ఉంటుంది. షాక్‌ప్రూఫ్‌ సిస్టమ్‌ ఉండటంతో దీనిని సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ దుప్పటిని మంచంపై పరచి, పైన హీటింగ్‌ డివైజ్‌ పెట్టి ఉపయోగించాలి. మడిచి పెట్టకూడదు. ఉపయోగించడానికి ముందు పవర్‌ ఆఫ్‌ చేయడం తప్పనిసరి. దీని రిమోట్‌కి ఐదు సంవత్సరాల వారంటీ ఉండటం విశేషం. ధర కేవలం రూ. 995.

వెచ్చని పాదాలు!
చలికాలమైనా, వేసవికాలమైనా ఇక కాళ్లకు ఎప్పుడూ సరైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడే సౌకర్యవంతంగా ఉంటుంది. థర్మామెడ్‌ స్మార్ట్‌ సాక్స్‌ మీ పాదాలను హాయిగా, ఆరోగ్యవంతంగా ఉంచే మంచి స్నేహితులు! ఇవి ప్రత్యేక థర్మో రెగ్యులేషన్ ఫాబ్రిక్‌తో తయారవడం వలన, వేడి చలి రెండింటినీ సమతుల్యం చేస్తాయి. చెమట పట్టినా ఆరిపోతాయి, వాతావరణం చలిగా ఉంటే వెచ్చదనాన్ని ఇస్తాయి. పాదాలను ఎప్పుడూ పొడిగా, సువాసనగా ఉంచుతాయి. ఫంగస్, బ్యాక్టీరియా తదితర ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచే యాంటీ మైక్రోబియల్‌ టెక్నాలజీతో ఈ సాక్స్‌ మరింత హైజినిక్‌గా ఉంటాయి. కాళ్ల వాపు, నొప్పి తగ్గించడంలో సహాయపడే సున్నితమైన కంప్రెషన్ డిజైన్ వీటి ప్రత్యేకత. లోపల మృదువైన కుషన్ ఉండటంతో రోజంతా ధరించినా ఏమాత్రం అసౌకర్యం లేకుండా ఉంటుంది. ధర రూ. 850 మాత్రమే!

స్మార్ట్‌ బాటిల్‌!
బాటిల్‌ని క్లీన్‌ చేయడానికి ఇకపై పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు! ఎందుకంటే, ఈ ‘లార్క్‌ స్మార్ట్‌ వాటర్‌ బాటిల్‌’ ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా సెల్ఫ్‌–క్లీన్ అవుతుంది. దీని లోపలే ఉండే శుద్ధి వ్యవస్థ బాటిల్‌ నీటిని కేవలం 60 సెకన్లలో శుభ్రం చేస్తుంది. యూవీ సీ ఎల్‌ఈడీ టెక్నాలజీతో బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను నిర్వీర్యం చేస్తుంది. దీంతో, ఎటువంటి కెమికల్స్‌ లేకుండా, నీరు ఎప్పుడూ తాజాగా, సురక్షితంగా ఉంటుంది. డబుల్‌ వాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఇన్సులేషన్‌తో చల్లని నీటిని 24 గంటలు, వేడి పానీయాన్ని 12 గంటలు నిల్వ ఉంచుతుంది. యూఎస్‌బీ చార్జింగ్‌తో నెల రోజుల వరకు బ్యాటరీ పవర్‌ ఉంటుంది. ధర రూ. 21,649.

Advertisement
 
Advertisement
Advertisement