ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పొడిబారిపోతోందా..? | Beauty Tips: These tips for protecting your skin in the cold weather | Sakshi
Sakshi News home page

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పొడిబారిపోతోందా..?

Nov 16 2025 1:04 PM | Updated on Nov 16 2025 1:13 PM

Beauty Tips: These tips for protecting your skin in the cold weather

చర్మానికి శుభ్రత, మెరుపు, టోనింగ్‌ వంటి ప్రయోజనాలను అందించే ‘బీ–గ్లో టీ.ఐ.ఏ సోనిక్‌ స్కిన్‌ కేర్‌ సిస్టమ్‌’ ఒక అధునాతన సౌందర్య సాధనం. ఈ ఆల్‌ ఇన్‌ వన్‌ డివైస్‌ చర్మాన్ని ప్రత్యేకంగా మెరిపిస్తుంది. యవ్వనంగా బిగుతుగా మారుస్తుంది. ఈ వినూత్న పరికరం మూడు ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. శుభ్రపరచడం, యాంటీ–ఏజింగ్, డ్యుయల్‌పల్స్‌ కాంటూరింగ్‌ వంటి ఫలితాలను పొందొచ్చు.

ఈ పరికరం పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌. ఇందులో మార్చుకోగలిగే సిలికాన్‌ బ్రష్‌ హెడ్‌ ఉంటుంది. ఇది అల్ట్రా–హైజినిక్‌ శుభ్రతను అందిస్తుంది. చేతులతో శుభ్రం చేయడం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఇది చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఇక దీని వినియోగం తర్వాత, బ్రష్‌ను సులభంగా శుభ్రం చేయడానికి సిలికాన్‌ హెడ్‌ను తొలగించవచ్చు. దీని టైటానియం అప్లికేటర్‌ను శరీరంలో ముడతలు వచ్చే అవకాశం ఉన్న చోటల్లా ఉపయోగించవచ్చు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. 

దీని ప్రత్యేకమైన పల్సేషన్‌ చర్మాన్ని ఇట్టే మెరుగుపరుస్తుంది. రంధ్రాలను తగ్గిస్తుంది. అంతే కాదు, ఇది డబుల్‌ చిన్‌ సమస్యకు పరిష్కారంగా నిలుస్తుంది. ఈ రీచార్జ్‌ చేయదగిన సోనిక్‌ పరికరం దవడలు, బుగ్గలు  వంటి ముఖ కండరాలను బలపరచి, ముఖాకృతిని అందంగా మారుస్తుంది. ఇది ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను ప్రోత్సహించి, చర్మాన్ని కాంతిమంతంగా, శక్తిమంతంగా కనిపించేలా చేస్తుంది. దీనికి చార్జింగ్‌ వెనుక వైపు పెట్టుకునే వీలుంటుంది. వీటిలో చాలా కలర్స్‌ అందుబాటులో ఉన్నాయి.

చలికాలం వచ్చేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పొడిబారిపోతుంది. అలాంటి సమస్యలకు చెక్‌ పెడుతుంది ఆలివ్‌ ఆయిల్‌. ఇది పొడిబారిన చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పైగా ఇది చర్మంపై త్వరగా వృద్ధాప్యఛాయలు రాకుండా కాపాడుతుంది. ఇది అన్ని వయసుల వారికి అనువైన చక్కని, ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తుంది. 

పొడి చర్మాన్ని మసాజ్‌ చేయడానికి ఆలివ్‌ ఆయిల్‌ ఉత్తమమైన నూనెలలో ఒకటి. ప్రతి రాత్రి పడుకునే ముందు, కొన్ని చుక్కల ఆలివ్‌ నూనె తీసుకొని శరీరమంతా పూయండి. మరొక మార్గం ఏమిటంటే, గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల ఆలివ్‌ నూనె వేసి స్నానానికి ఉపయోగించడం కూడా ఉత్తమమే!

(చదవండి: Anupama Parameswaran: నటి అనుపమ అందం వెనకున్న రహస్యం ఇదే..!)

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement