ఓడియమ్మ.. ఫ్లాష్‌ ఉమెన్‌! | Flash Woman Pakistan Cop Trolling Video Viral | Sakshi
Sakshi News home page

ఓడియమ్మ.. ఫ్లాష్‌ ఉమెన్‌!

Dec 29 2025 12:23 PM | Updated on Dec 29 2025 12:50 PM

Flash Woman Pakistan Cop Trolling Video Viral

ఫలానా కేసును.. గంటల్లోనే చేధించిన ఖాకీలు.. అంటూ అత్యంత అరుదుగా చూస్తుంటాం. అదే ఒక కేసును గంటలోనే చేధిస్తే ఎలా ఉంటుంది?.. అదీ ఒక మహిళా ఆఫీసర్‌ ఆ పని చేస్తే!. అయితే.. పాపం అలాంటి సందర్భంలో ఆ సూపర్‌ ఉమెన్‌ను అభినందించాల్సిందిపోయి.. ‘ఒడియమ్మ.. ఫ్లాష్‌ ఉమెన్‌’ అంటూ ఎగతాళి చేసేస్తోంది సోషల్‌ మీడియా..

‘‘మేడమ్‌.. ఇది స్క్రిప్ట్‌ కాదు కాదా.. ఎందుకంటే సీఐడీ(హిందీ క్రైమ్‌ టీవీ సిరీస్‌) కూడా ఇంత ఫాస్ట్‌గా కేసును సాల్వ్‌ చేయలేదేమో’’ అంటూ అనుమానాలతో పాకిస్థాన్‌కు చెందిన మహిళా ఎస్పీని నెట్టింట ట్రోల్‌ చేస్తున్నారు. లాహోర్‌ ఎస్పీ షెహర్బానో నఖ్వీ.. ఈ పేరుతో గతంలోనూ నెట్టింట బాగా వైరల్‌ అయ్యింది. కిందటి ఏడాది.. దుస్తులపై అరబిక్‌ ప్రింట్‌ ఉండడంతో ఒక మహిళపై మూక దాడి ప్రయత్నం జరిగింది. అయితే సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి బాధితురాలిని ఆ మూక నుంచి కాపాడి లాహోర్‌ లేడీ సింగంగా గుర్తింపు పొందింది నఖ్వీ. ఆ సమయంలో నెట్టింట ఆమెపై ప్రశంసలు కురిశాయి. అయితే..

ఆవిడను ఇప్పుడు ట్రోల్‌ చేయడానికి కారణం లేకపోలేదు. ఏఆర్‌వై న్యూస్‌ ప్రకారం.. ఎస్పీ నఖ్వీ ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూకి హాజరైంది. ఆ సమయంలో.. మధ్యలో ఉండగానే ఆమెకు ఒక ఫోన్‌ కాల్‌ రాగా లిఫ్ట్‌ చేసి.. ‘‘ఖుర్రం జీ.. ఎక్కడున్నారు... వాళ్లను పట్టుకున్నారా? మంచిది’’ అంటూ మళ్లీ వస్తానంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ మధ్యలో టైంని బ్రేక్‌ ప్రకటించారు సదరు పాడ్‌కాస్ట్‌ వ్యాఖ్యాత.

గంట సేపటి తర్వాత తిరిగి వచ్చాక.. ఆమె జరిగిందో పాడ్‌కాస్ట్‌లో వివరించారు. డిఫెన్స్‌ ఫేస్‌ ఏలో ఒక హత్య జరిగిందని.. ఆ కేసును చేధించడం కోసమే వెళ్లానని అన్నారామె. ‘‘డబ్బు కోసం ఇద్దరు స్నేహితులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఒకడు మరొకడిని చంపేశాడు. ఆ తర్వాత బాధిత కుటుంబాన్ని బంధించాడు. ఈ విషయం బంధువుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. నాకు సమాచారం ఇచ్చారు. మేం అక్కడికి వెళ్లి.. ఆ హంతకుడ్ని పట్టుకుని ఆ కుటుంబాన్ని సేఫ్‌గా విడిపించాను. అందులో ఓ చిన్నారి కూడా ఉంది.. అని తెలిపారు. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్‌ అయ్యింది..

కానీ, ఆమె చెప్పేది గతంలో ఆమెను పొగిడిన వాళ్లు కూడా నమ్మలేకపోతున్నారు. అంత దూరం.. అదీ అంత స్పీడ్‌గా వెళ్లి ఎలా కేసును సాల్వ్‌ చేశారంటూ ఆమెను ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఏసీపీ ప్రద్యుమన్‌(సీఐబీ సిరీస్‌ క్యారెక్టర్‌) కూడా ఈ కేసును చూసి సుత్తితో తలబద్ధలు కొట్టుకుంటాడేమో అంటూ వెటకారం ప్రదర్శించాడు. ఈ స్క్రిప్ట్‌ రాసింది ఎవరు? అని ఒక యూజర్‌.. కిడ్నీ టచింగ్‌ యాక్టింగ్‌.. అని మరో యూజర్‌ ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు ట్రోలింగ్‌​ చేస్తున్నారు ఆ లేడీ సింగాన్ని..  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement