ఇమ్రాన్‌ఖాన్‌ 85 శాతం కంటి చూపు కోల్పోయారు..! | Imran Khan Loses 85% Vision After Prison | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ఖాన్‌ 85 శాతం కంటి చూపు కోల్పోయారు..!

Feb 12 2026 7:37 PM | Updated on Feb 14 2026 8:28 AM

Imran Khan Loses 85% Vision After Prison

కరాచీ:  ప్రస్తుతం ఆడియాలో జైల్లో ఉన్న పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కల్గిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమవుతువుతున్న ఇమ్రాన్‌ఖాన్‌ యొక్క కంటి చూపు సన్నగిల్లుతున్నట్లు కోర్టు నియమించిన న్యాయవాది సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు.    ఇమ్రాన్ ఖాన్ తన కుడి కంటిలో 85% చూపు కోల్పోయి, ప్రస్తుతం కేవలం 15% మాత్రమే మిగిలి ఉందని వైద్య నివేదికలు వెల్లడించిన విషయాన్ని సదరు లాయర్‌ పేర్కొన్నారు. ఇమ్రాన్‌ పట్ల ఉద్దేశపూర్వకంగా అత్యంత అమానుషంగా అడియాలా జైలు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతోనే కంటి చూపు సన్నగిల్లినట్లు ఆరోపిస్తున్నారు ఆయన సన్నిహితులు. 

గతేడాది అక్టోబర్ వరకు ఆయనకు సాధారణ చూపు ఉన్నప్పటికీ, తరువాత రక్త గడ్డకట్టడం (blood clot) వల్ల తీవ్రమైన నష్టం జరిగినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని  అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.కొన్ని నివేదికలు ఆయనకు సరైన వైద్య సేవలు అందించకపోవడం వల్లే ఈ సమస్య మరింత తీవ్రమైందని పేర్కొంటున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పాకిస్తాన్‌లో రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన చూపు కోల్పోవడం వైద్యపరమైన సమస్య మాత్రమే కాకుండా, జైలు పరిస్థితులు మరియు ప్రభుత్వ వైఖరిపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది.

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్‌వీఓ అంటే..?

Advertisement
 
Advertisement
Advertisement