వాంకోవర్: కెనడాలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో నిందితునికి సంబంధించిన విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ‘జెస్సీ’ అనే యువకుడు సృష్టించిన బీభత్సానికి పదిమంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. మృతుల్లో జెస్సీ కన్నతల్లి, సోదరితో పాటు ఒక ఉపాధ్యాయురాలు, అభం శుభం తెలియని పసిపిల్లలు ఉండటం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురు ఆస్పత్రులలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
🔥 BREAKING 🔥
This is Jesse.
Jesse shot 35 innocent people yesterday including his mother, sister, a teacher & young children.
10 are dead & many are fighting for their lives.
The Government decided that instead of supporting Jesse’s mental health & helping a disturbed child… pic.twitter.com/RDS6ruOcGa— Lozzy B 🇦🇺𝕏 (@TruthFairy131) February 12, 2026
ఈ ఉన్మాదానికి వెనుక ఉన్న కారణాలు ఇప్పడు వార్తల్లో నిలిచాయి. జెస్సీ గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, అతను ఎప్పుడైనా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వానికి, సంబంధిత ఏజెన్సీలకు ముందే తెలుసని సమాచారం. అయినప్పటికీ అతడిని ఒక రోగిగా గుర్తించి, సరైన మానసిక చికిత్స అందించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం జెస్సీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సింది పోయి, అతడిని ఒక అమ్మాయిగా పరిగణించి కృత్రిమమైన పద్ధతులను ప్రోత్సహించిందనే మాట వినిపిస్తోంది. అతనికి ‘క్రాస్ సెక్స్ హార్మోన్లు’, ఇతర మందులను ఇవ్వడం ద్వారా అతని శరీరాన్ని, ఆలోచనా తీరును విషపూరితం చేశారని తెలుస్తోంది. ఒక మానసిక రోగి భ్రమలను సరిదిద్దకుండా, వాటిని మరింతగా ప్రేరేపించిన కారణంగానే అతను తనపై తాను నియంత్రణ కోల్పోయి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.


