KGF తరహాలో 200 మంది సైబర్ ముఠా.. వేలల్లో నకిలీ పోలీస్‌ స్టేషన్లు.. | Authorities busted a cyber gang in Cambodia | Sakshi
Sakshi News home page

KGF తరహాలో 200 మంది సైబర్ ముఠా.. వేలల్లో నకిలీ పోలీస్‌ స్టేషన్లు..

Feb 11 2026 7:06 PM | Updated on Feb 11 2026 7:42 PM

Authorities busted a cyber gang in Cambodia

పాహోన్ పెన్ : కంబోడియాలో సైబర్‌ నేరగాళ్లపై భారీ ఆపరేషన్‌ జరిగింది. ఈ ఆపరేషన్‌లో అక్కడి అధికారులు 200 మంది సైబర్‌  గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేశారు. ఫ్నామ్‌పెన్‌లోని నకిలీ సైబర్‌ సెంటర్లపై పోలీసులు దాడి చేసి, నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యకు కంబోడియా ప్రధానమంత్రి హున్ మానెట్ ప్రత్యక్ష ఆదేశాలు ఇచ్చారు.

16 దేశాలకు సంబంధించిన 11వేల మందిని పట్టుకున్నారు. మొత్తం 172మంది కలిసి సైబర్‌ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. బాధితుల్ని ఉద్యోగాల పేరుతో కంబోడియాకు రప్పించిన మాఫియా వారితో బలవంతంగా సైబర్‌ నేరాలు చేయించినట్లు తేలింది. నేరగాళ్లు కేజీఎఫ్‌ సినిమా తరహాలో ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యోగాల కోసం వచ్చిన వారితో వెట్టి చాకిరి చేయించుకున్నారు. ఇండియాకు సంబంధించిన నకిలీ పోలీస్‌ స్టేషన్లు,సీబీఐ,ఈడీ ఆఫీసులు ఏర్పాటు చేసి డిజిటల్‌ అరెస్టులు అంటూ వసూళ్లకు పాల్పడ్డారు.

ఈ కేంద్రాల్లో పనిచేసిన వారు సోషల్‌ మీడియా ద్వారా ప్రేమ, వ్యాపార సంబంధాలు వంటి మాయాజాలాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను మోసం చేశారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం దక్షిణాసియా ప్రాంతం ఈ తరహా మోసాలకు ప్రతి సంవత్సరం సుమారు 40 బిలియన్ అమెరికన్‌ డాలర్ల మేర మోసాలు జరుగుతున్నాయని అంచనా. సైబర్‌ నేరాలు చేసేందుకు కొన్ని వేల సంఖ్యలో పోలీస్‌ స్టేషన్ల సెట్టింగులు ఏర్పాటు చేశారు. తాజాగా, సైబర్‌ ఆపరేషన్‌తో సైబర్‌ నేరగాళ్ల ముఠా గుట్టు రట్టయ్యింది. 11వేల మందిని పట్టుకుని కంబోడియా ప్రభుత్వం వారి దేశాలకు పంపించి వేసింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement