కాల్పుల కలకలం.. 34 మంది మృతి | Gunman Opens Fire At School In Thailand | Sakshi
Sakshi News home page

కాల్పుల కలకలం.. 34 మంది మృతి

Feb 11 2026 5:21 PM | Updated on Feb 11 2026 6:23 PM

Gunman Opens Fire At School In Thailand

థాయ్‌లాండ్‌లోని శోంక్లా పట్టణంలో దారుణం జరిగింది. పాఠశాలలో అగంతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 34 మంది మృతి చెందారు. మృతుల్లో 22 మంది చిన్నారులు ఉన్నారు. మాజీ పోలీస్‌ అధికారి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. పాఠశాల ముగిసే సమయంలో ప్రాంగణంలోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులు జరిపాడు. పాఠశాలలోకి చొరబడి ఉపాధ్యాయులు, చిన్నారులను బందీలుగా చేసుకుని కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ దాడి థాయ్‌లాండ్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా అధికారులు పేర్కొన్నారు.

థాయ్‌లాండ్‌లో కాల్పుల కలకలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement