ఏలియన్స్ రాక.. పుతిన్ పతనం.. మూడో ప్రపంచ యుద్ధం | Blind mystic Baba Vanga 2026 predictions | Sakshi
Sakshi News home page

ఏలియన్స్ రాక.. పుతిన్ పతనం.. మూడో ప్రపంచ యుద్ధం

Aug 11 2026 4:21 PM | Updated on Aug 11 2026 5:17 PM

Blind mystic Baba Vanga 2026 predictions

బాబా వంగా... బల్గేరియా నోస్టర్‌ డామాస్‌గా పిలిచే ఈ కాలజ్ఞానికి ఉ‍న్నా ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంచలనంగా మారిన  సెప్టెంబర్ 11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం, కోవిడ్ మహమ్మారి వంటి అనేక కీలక ప్రపంచ ఘటనలను ముందే ఊహించి చెప్పారని ఆమె అనుచరులు నమ్ముతుంటారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె భవిష్యవాణికి ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే 2026లో ఆమె చెప్పిన కాలజ్ఞానం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  

2026 సంవత్సరానికి సంబంధించి బాబావంగా చెప్పిన మూడు ఊహాగానాలు 
1. అంతరిక్ష నౌక రాక  

2. మూడవ ప్రపంచ యుద్ధం 

3. పుతిన్ అధికార కోల్పోవడం 

ఈ మూడు ఘటనలు దాదాపు నిజం అయ్యే అవకాశాలున్నాయని ఆమె ఫాలోవర్స్ భావిస్తున్నారు.

బాబా వంగా చెప్పిన జోస్యం ప్రకారం.. ఈ ఏడాది నవంబర్‌లో ఒక భారీ అంతరిక్ష నౌక భూమిపైకి వస్తుందని, ఇది మానవాళికి మరియు బాహ్య ప్రపంచ ప్రాణులకు మధ్య అధికారిక మొదటి సంప్రదింపులకు గుర్తుగా నిలుస్తుందని ఆమె అనుచరులు నమ్ముతున్నారు. అయితే, ఆ జీవులు శాంతియుతంగా వస్తాయా లేక ముప్పుగా మారుతాయా అనేది స్పష్టంగా తెలియరాలేదు.
 

మూడవ ప్రపంచ యుద్ధం  2026లో మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చైనా తైవాన్‌ను ఆక్రమించడానికి ప్రయత్నించడం, రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, పశ్చిమాసియా యుద్ధం. ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకరమవుతున్న దాడులని బాబా జోస్యానికి ప్రతీకలుగా ఆమె ఫాలోవర్స్ భావిస్తున్నారు.

రష్యా అధ్యక్షుడు ఫుతిన్‌ అధికారం కోల్పోవడం 
పుతిన్ అధికార కోల్పోవడం: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2027 వచ్చేసరికి అధికారంలో నుంచి తప్పుకుంటారని, ఆయన స్థానంలో కొత్త నాయకుడు వస్తారని మరో జోస్యం ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఫుతిన్‌ ఏకచక్రాధిపత్యం చూస్తుంటే దాదాపు ఇది అసంభవమే అనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది మాత్రం బాబా వంగా అంచనాకు పెద్ద సవాల్‌గా మారింది

అయితే ఆయన ఆరోగ్యంపై మాత్రం గత కొంతకాలంగా అనేక ఊహాగానాలు చెలరేగాయి. పుతిన్‌కు క్యాన్సర్ లేదా పార్కిన్సన్స్  వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఆయన ఆపరేషన్లు కూడా చేయించుకున్నారని తరచూ వార్తలు వస్తుంటాయి.  బహిరంగ వేదికలపై కనిపించిన లక్షణాలు: కొన్ని సమావేశాల్లో ఆయన చేతులు వణకడం, మాట్లాడేటప్పుడు దగ్గు రావడం లేదా కుర్చీని, టేబుల్‌ను గట్టిగా పట్టుకోవడం వంటి దృశ్యాలు ఆయన అనారోగ్యంతో ఉన్నారనే అనుమానాలకు బలం చేకూర్చాయి. అయితే ఈ వార్తలన్నింటినీ రష్యా ప్రభుత్వం ఎప్పుడూ ఖండిస్తూనే ఉంది. ఆయన పూర్తి స్థాయిలో ఆరోగ్యంతో ఉన్నారని వాదిస్తుంది.

అయితే బాబా వంగా చెప్పిన జోస్యం నిజమవ్వాలంటే పుతిన్‌ అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచ రాజకీయాల్లో అది పెను సంచలనంగా మారుతుంది. 2026లో బాబావంగా చేసిన ప్రడిక్షన్స్‌ నిజం అవుతాయా లేదా తెలియాలంటే మరో ఐదు నెలల పాటు వేచి చూడాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement