breaking news
Baba Vanga
-
2026లో యుగాంతం, భయాలు ఇవిగో..
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘2026లో ప్రపంచం అంతం’ అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాబా వంగా 2026లో ప్రపంచం అంతం గురించి చేసిన జోస్యాలు ప్రజల్లో ఆసక్తిని, భయాన్ని పెంచాయి. అలాగే, చర్చలకు కారణమవుతున్నాయి. అయితే, బాబా వంగా జోస్యాలు శాస్త్రీయ ఆధారాలు లేని ఊహాగానాలు మాత్రమేనని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఇవి ప్రజల్లో సాంస్కృతిక, మానసిక ప్రభావం చూపుతున్నాయి కానీ.. వాస్తవంగా 2026లో ప్రపంచం అంతమవుతుందనే ఆధారం లేదని చెబుతున్నారు. ఇంతకీ 2026 గురించి బాబా వంగా ఏం చెప్పారు...?బల్గేరియాకు చెందిన బాబా వంగా గురించి చాలా మంది అనేక సమయాల్లో వినే ఉంటారు. ఆమె చెప్పిన ఎన్నో జోస్యాలు నిజం అయ్యాయి. చిన్న వయస్సులోనే చూపు కోల్పోయిన బాబా వంగా ప్రకృతి విలయాలు, ప్రపంచ యుద్ధాలు, విపత్తుల గురించి జోస్యం చెప్పారు. అందులో చాలా వరకు నిజం అయ్యాయి కూడా. కరోనా మహమ్మారిని కూడా బాబా వంగా ముందే ఊహించారు. ఈ క్రమంలో 2026 ఏడాది గురించి బాబా వంగా పలు సంచలన విషయాలను వెల్లడించారు. 2026లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆమె 2026 సంవత్సరాన్ని యుద్ధం వినాశన సంవత్సరంగా పేర్కొన్నారు. 2026తో ప్రపంచం అంతం అవుతుందని చెప్పడం టెన్షన్‌కు గురిచేస్తోంది. న్యూయార్క్ పోస్ట్, ది మిర్రర్, ఎక్స్‌ప్రెస్ వంటి పత్రికలలో విస్తృతంగా వచ్చిన నివేదికల ప్రకారం.. ఆమె అనుచరులు మరియు వ్యాఖ్యాతలు 2026 సంవత్సరానికి అనేక నాటకీయ సంఘటనలను ఆపాదిస్తున్నారు. దీంతో, ఈ విషయంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.మూడో ప్రపంచ యుద్దం..వీటిలో రష్యా, అమెరికా, చైనా, యూరప్ వంటి దేశాలు మధ్య ప్రపంచ సంఘర్షణలు తీవ్రతరం కావడం.. మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే విధ్వంసకర భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణం, వరదలు, తుఫానులతో సహా భారీ ప్రకృతి వైపరీత్యాలు భూమిపై 7–8% భూభాగాన్ని ప్రభావితం చేయడం వంటివి ఉన్నాయి. గ్రహాంతరవాసులతో మొదటి పరిచయం, బహుశా నవంబర్‌లో భూమి వాతావరణంలోకి ప్రవేశించే భారీ గ్రహాంతర నౌకతో సహా, AI ఆధిపత్యం, ఆర్థిక అస్థిరత.. ఆసియా లేదా చైనా వైపు ప్రపంచ శక్తిలో మార్పు పెరుగుతుందని కూడా అంచనా వేయబడింది.అయితే, ఇది బాబా వంగా మాత్రమే కాదు. పలువురు ప్రముఖులు సైతం ఆసక్తిగా దీనికి ఆజ్యం పోశారు. నోస్ట్రాడమస్ యొక్క క్వాట్రైన్ల వివరణల ప్రకారం "రక్త నదులు", ప్లేగులు, నిరంకుశుల గురించి హెచ్చరిస్తున్నాయి. 2003లో రహస్యంగా అదృశ్యమైన పాకిస్తాన్ ఆధ్యాత్మిక నాయకుడు రియాజ్ అహ్మద్ గోహర్ షాహి.. ఈ సంవత్సరం భూమిని తాకే మండుతున్న తోకచుక్క గురించి మాట్లాడారు. బ్రెజిల్‌కు చెందిన "లివింగ్ నోస్ట్రాడమస్" అథోస్ సలోమ్ 2024లో ప్రపంచ యుద్ధం, సైబర్ సంఘర్షణ మరియు AI ఆధిపత్యం దగ్గర పడుతున్నాయని అంచనా వేశాడు. మరోవైపు, ఘనా ప్రవక్త ఎబో నోహ్ విపరీతమైన వరదలు వస్తాయన్నారు. దీని కోసం అతను ఘనాలో అనేక చాపలను నిర్మించినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, వీరి వ్యాఖ్యలు నిజమవుతాయా? అనే ప్రశ్నలు ఎదరవుతున్నాయి. ఈ భయం ఎక్కడిది?‘2026 డూమ్స్ డే’ టాక్ మొదటి నుంచీ ఒక్క కారణం మీదే నడుస్తోంది. 1980ల్లో బెంజమిన్ క్రెమ్ అనే వ్యక్తి మైత్రేయ అలియాస్ కొత్త యుగం రాబోతోందని 2025-2026లో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని జోస్యం చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ వ్యవహారం ఆస్టరాయిడ్ వైపు మళ్లింది. మరికొద్ది రోజులకు నోస్ట్రడామస్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంతో జోతిష్యం కూడా తెరపైకి వచ్చింది. పలువురు జోతిష్యులు తమకు నచ్చిన విధంగా ప్రళయం అని ఒకరు అంటే.. ‘2026 మహా ప్రళయం’ అని మరికొందరు చెబుతున్నారు. అయితే, బాబా వంగా యొక్క అసలు "డూమ్స్‌డే" తేదీ చాలా దూరంలో ఉంది. ఆమె 5079లో ప్రపంచ ముగింపు (లేదా విశ్వ సంఘటన ద్వారా "సంపూర్ణ డూమ్స్‌డే") గురించి అంచనా వేసింది.ఆస్టరాయిడ్ ఢీకొడుతుందా?ఇంటర్నెట్లో ఎక్కువగా వైరల్ అయ్యే వీడియోల్లో రెండు ఆస్టరాయిడ్స్ గురించి ఎక్కువగా ప్రస్తావన ఉంటుంది. ఒకటి Apophis (99942), రెండు 2024 YR4. Apophis 2029 ఏప్రిల్ 13న భూమికి 31,000 కిలోమీటర్ల దూరంలోకి వస్తుంది. కానీ 2021లోనే నాసా 100% సేఫ్ అని ధృవీకరించింది. 2026లో దాని దూరం లక్షల కిలోమీటర్లు. 2024 YR4 లేదంటే ఇంకా ఏదైనా ఆస్టరాయిడ్ 2026లో ఢీకొనే ఛాన్స్ ఉందా? అంటే లేదనే చెప్పొచ్చు. నాసా, ESA, NEOWISE టెలిస్కోప్‌లు 99% పెద్ద ఆస్టరాయిడ్స్ ను ట్రాక్ చేస్తున్నాయి. ఏదైనా రిస్క్ ఉంటే ఇప్పటికే పెద్ద హెచ్చరికలు వచ్చేవి.అంతం తప్పదా? గత సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాది కాస్త కష్ట సంవత్సరం కావచ్చు. వాతావరణ మార్పుల విషయం మరింత తీవ్రమవుతుంది. రాజకీయ ఉద్రిక్తతలు ముఖ్యంగా ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ లాంటి ఘటనలు పెరగవచ్చు. AI వల్ల కొత్త రకం ఆర్థిక మాంద్యం రావచ్చు. కానీ, ఇవన్నీ మనం ఇప్పటికే ఎదుర్కొంటున్న సమస్యలే. కొత్తగా ప్రపంచాన్ని నాశనం చేసేవి కావు. చివరిగా.. గతంలో Y2K (2000), మయన్ క్యాలెండర్ (2012), కరోనా ‘ప్రపంచం అంతం’ టాక్ (2020) గురించి విన్నాం. ప్రతిసారీ భయపడ్డాం. కానీ, ఏమీ కాలేదు. 2026 కూడా అలాగే గడిచిపోతుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. -
ప్రపంచ నాయకుడు.. పగటి పూటే పిడుగు పడి చనిపోతారట! ఎవరంటే?
సోఫియా: బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ జ్యోతిష్క రాలు బాబా వాంగా చేసిన 2026 సంవత్సరానికి సంబంధించిన జోస్యం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు, రాజకీయ కల్లోలాలు, ఆర్థిక సంక్షోభాలు, సాంకేతిక పరిణామాలు వంటి అంశాలపై ఆమె చేసిన సూచనలు ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి.2026లో ప్రపంచ వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆమె పేర్కొన్నారు. తుఫానులు, వరదలు, భూకంపాలు మరింత తీవ్రంగా ఉంటాయని అంచనా. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని హెచ్చరించారు. కొన్ని దేశాల్లో పెద్ద రాజకీయ కల్లోలాలు సంభవిస్తాయని ఆమె ప్రవచించారు. అంతర్జాతీయ స్థాయిలో పవర్ బ్యాలెన్స్ మార్పులు చోటు చేసుకుంటాయని సూచించారు. కొత్త కూటములు ఏర్పడి, పాత కూటములు కూలిపోతాయని అంచనా.ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర క్షీణత సంభవిస్తుందని ఆమె చెప్పారు. కొన్ని దేశాల్లో కరెన్సీ విలువలు పడిపోవడం, మార్కెట్లలో అస్థిరత పెరగడం జరుగుతుందని అంచనా. 2026లో కొత్త సాంకేతిక ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయని ఆమె పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు(AI), బయోటెక్నాలజీ రంగాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా.బాబా వాంగా ప్రవచనాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతాయి. అయితే, ఇవి శాస్త్రీయ ఆధారాలు లేని ఊహాగానాలు మాత్రమే. వాతావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ కల్లోలాలు వంటి అంశాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా ఉన్నందున, ఆమె ప్రవచనాలు ప్రజలలో మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. అంతేకాదు ప్రపంచంలో ఓ ప్రముఖ వ్యక్తి మీద పగటి పూట పిడుగు పడి చనిపోతాడు. ఆ వ్యక్తి రాజకీయ వర్గానికి, కళారంగానికి చెందిన వారేనా లేదా అనేది తెలియాల్సి ఉంది. 2026లో ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లపై బాబా వాంగా ప్రవచనాలు ఒక హెచ్చరికలా వినిపిస్తున్నాయి. వాతావరణ మార్పులు, ఆర్థిక అస్థిరత, రాజకీయ కల్లోలాలు, ఇవన్నీ మనం అప్రమత్తంగా ఉండాల్సిన అంశాలుగా గుర్తించబడుతున్నాయి. -
నిజంగానే భూమి మీదకు వస్తే వారితో సావాసం ఎలా?
2026లో మనం ఏలియన్లను కలవ బోతున్నామా? లేక ఏలియన్లు మన వద్దకు రానున్నాయా? ఏలియన్లకు సంబంధించి బాబా వంగా చేసిన భవిష్యవాణి నిజమవుతుందా? నిజంగా ఏలియన్లు భూమి మీదకు రానున్నాయా? అసలు ఏలియన్లు ఉన్నారా? ఇవన్నీ ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలే. ఇప్పటికీ... బాబా వంగా భవిష్య వాణిని నమ్మేవారు ఏలియన్ల ఉనికి సాధ్యమే అంటున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ... సువిశాల విశ్వంలో పరిశోధనల ఇంకా మిగిలే ఉంది. ఒక వేళ బాబా వంగా వ్యాఖ్యలు వాస్తవమేనని అనుకున్నా.. 2026లో నిజంగా ఏలియన్లు భూమి మీదకు వస్తే మరి వారిని ఎలా కలవాలి...? వారు మనకన్నా బలవంతులా? లేక బలహీనులా?... వాళ్లు శక్తి వంతులై... దాడి చేయడానికి ప్రయత్నిస్తే... వారి ఆయుధాల గురించి కనీస జ్ఞానం లేని మానవులు ఎదుర్కొనగలరా.. ఇలాంటి ప్రశ్నలకు మనం సమాధానాలు వెదుకుదాం. ఏలియన్ల ఉనికి ఉందని... అవి త్వరలోనే భూమి మీదకు వస్తాయని బల్గేరియాకు చెందిన బాబా వంగా చెప్పారు. ఆమె జీవించి ఉన్నప్పుడు... భవిష్యత్తులో జరిగే కొన్ని కార్యాల గురించి చెప్పారు. అందులో ఏలియన్ల ప్రస్తావన కూడా ఉంది. అయితే ఆమె చెప్పిన వాటిలో కొన్ని నిజంగా జరిగాయి. కొన్ని జరగలేదు. దాంతో జనం ఆమె భవిష్యత్తును చూడగలరని నమ్మారు. అందులోనే 2026లో ఏలియన్ల గురించి ఆమె భవిష్యవాణి ప్రస్తావన ఉంది. ఏలియన్లు భూమ్మీదకు వస్తారు... అప్పడు భూమిమీద పెద్ద సంక్షోభం ఏర్పడుతుందని చెప్పారు. జనం నమ్మి ఏలియన్ల మీద ఆసక్తి పెంచుకోవడంతో పాటు సంక్షభాన్ని ఎదుర్కొనే తీరుపై చర్చలు కూడా సాగుతున్నాయ. శాస్రవేత్తలు మాత్రం... మానవులు.... గ్రహంతర వాసులను కలుస్తారనే ఆధారాలు లేవని... అది సాధ్యం కాదని చెబుతున్నారు. ఏదేమైనా.. 2026 మాత్రం ఇంటరెస్టింగా మారనుంది. ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారిన ఏలియన్ల ప్రస్తావన... రాను రాను పెద్ద చర్చకే దారి తీసేట్టు ఉంది. ఇప్పటికే భారీ సంఖ్యలో జనం నమ్మడంతో... శాస్త్రవేత్తలు సైతం మరింత లోతుగా వాస్తవాలను గుర్తించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఏలియన్ల చర్చకు భిన్నంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చేసిన విస్తృత పరిశోధనల ద్వారా ఏలియన్ల ఉనికి ఉండొచ్చని... ఉండక పోవచ్చని మాత్రం చెప్పగలిగారు. ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ఖగోళ శాస్త్రవేత్తలకు లభించలేదు. అయినా నిరంతర అన్వేషణ సాగుతోనే ఉంది. సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రోగ్రామ్‌లో ఆకాశాన్ని.. గ్రహాలను స్కాన్ చేస్తూనే ఉన్నప్పటికీ... ఏలియన్ల గురించి స్పష్టమైన ఆధారాలు ఇంకా లభించలేదు.ఏలియన్ల గురించి శాస్త్రవేత్తల ఆలోచన ఏంటనే అంశాలపై ఓ సర్వే జరిగింది. అంతో 1055 మంది శాస్త్రవేత్తలు, వారిలో దాదాపు సగం అంటే 521 మంది ఖగోళ జీవ శాస్త్రవేత్తలతో జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. శాస్త్రవేత్తల్లో 87 శాతం మంది గ్రహంతర వాసులున్నారని నమ్ముతున్నారు. ఖగోళ శాస్త్రవేత్తల్లో సగం మంది మాత్రమే నమ్ముతున్నారు. మిగతా సగం నమ్మడం లేదు. విశ్వంలో... భూమి తప్ప నివాస యోగ్యంగా ఉండే వాతావరణం, నీటి ఉత్పన్నం, ఇతర అవసరాలకు అనుగుణంగా ఇతర గ్రహాలు లేవని... అందుకే వాటిపై జీవం లేకపోవచ్చని కొందరు ఖగోళ శాస్త్రవేత్తల ఆలోచన. ఇతర శాస్త్రవేత్తలు కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. మన సౌర వ్యవస్థలో చంద్రునిపై జీవం ఉండే ఆస్కారం ఉందని... మన గెలాక్సీలో 100 బిలియన్ గ్రహాలు ఉన్నాయి. అన్నింటిపై పరిశోధనలు జరపకుండా ఈ నిర్ణయానికి రావడం తొందరపాటేనని... ఇప్పటి వరకు జరిపిన పరిశోధనలతో పాటు... భవిష్యత్తులో జరిగే పరిశోధనల్లో ఏలియన్లు, ఇతర జీవాల ఉనికి ఉండొచ్చనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.శాస్త్రవేత్తలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే ఏలియన్లు, లేదా ఏలియన్లను పోలే ఆకారాలు, ఇతర జీవాలు గెలాక్సీలో ఉన్నాయనే అనుమానాలకు బలం చేకూరుతోంది. అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... శాస్త్రవేత్తలు ఏలియన్ల ఉనికి ఉందని నమ్ముతున్నారు. కానీ ఖగోళ శాస్త్రవేత్తలు ఆ వార్తను ఖండిస్తున్నారు. మరి కొందరు శాస్ర్తవేత్తలు మాత్రం మరో విధంగా కూడా చెబుతున్నారు. ఏలియన్స్ ఉన్నాయా లేదా అని ఓ చర్చ సాగుతుండగానే... వారి స్వభావం... వారి తీరుతెన్నుల గురించి కూడా కొందర శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో వాటి ఉనికి స్పష్టంగా ఉన్న సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు అస్పష్టమైన హ్యూమనాయిడ్లు సుడిగుండంగా మారి... పొగమంచుతో కూడిన నిల్చున్నాయని... అవి వాటి వెనుక నుండి ప్రకాశవంతమైన కాంతితో చలనంలోకి వస్తాయని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇక విశ్వంలో ఉన్న ఏలియన్స్ ఆకారం ఎలా ఉంటుంది... వారి భాష, వారి జీవన శైలి ఎలా ఉంటుందనే అంశాలపై కూడా కొందరు శాస్త్రవేత్తలు చర్చలు ప్రారంభించారు. వారి తెలివి తేటలు ఎలా ఉంటాయి...? వారు వాడే టెక్నాలజీ మనకన్నా అడ్వాన్సుగా ఉంటుందా... లేక సాంకేతికతకు దూరం మన రాతియుగం లాంటి జీవాలుంటాయా అనే క్యూరియాసిటీ కూడా సృష్టిస్తున్నారు. అయితే ఇవన్నీ ఊహగానాలే తప్ప.... విశ్వ ప్రపంచంలో ఇప్పటి వరకు ఏలియన్ల ఉనికి మాత్రం దొరకలేదు. ఏలియన్లపై వచ్చిన సినిమాల ఆధారంగా ఏలియన్ల ఆకారం, తెలివితేటలు, సాంకేతికత, స్పేష్ షటిల్ సఫవగురించి చర్చలు సాగుతూనే ఉన్నాయి. విస్తృత విశ్వం అంతటా నిజంగా భారీ సంఖ్యలో జీవాలు ఉంటే... నివాసయోగ్యమైన వాతావరణాలు ఎందుకు లేవు. అలాంటి ప్రాంతాలుంటే అక్కడి జీవాలపై పరిశోధనలెందుకు జరగడం లేదు.ఏలియన్లు ఉండి... ఒకవేళ ఏలియన్లు భూమ్మీదకు వచ్చేస్తే పరిస్థతి ఏంటీ? ఇప్పటికే సినిమాల ప్రభావం కారణంగా ఏలియన్ల ఆకారం, వాటి ఉనికి... వారి నడక, వారి భాష గురించి అవగాహన పొందినట్లు జనం భావిస్తున్నప్పటికీ... నిజంగా వాళ్లు వస్తేనే అసలు ఆకారాలు బయటపడతాయి. ఏలియన్లు వచ్చినప్పుడు జనంతో భయపడతారా...? లేక మనకన్నా వాళ్లే అడ్వాన్డ్‌గా ఉంటారా? వాళ్లతో మనం భయపడాల్సి వస్తుందా... ఇలాంటి ప్రశ్నలెన్నో సాధారణ మనుషులను మెదళ్లను తొలచి వేస్తున్నాయి. ఒకవేళ బలహీనులుంటే ... మనుషులు వాటికి హాని కలిగించే ఆలోచనలో మాత్రం ఉండరు. కానీ అవి దాడి చేస్తే మాత్రం ఎలా ఎదుర్కొనాలన్నదే ప్రధాన సమస్య. వారి భాషను డీకోట్cయడానికి ఎలాంటి టెక్నాలజీ వాడాలన్నదీ శాస్త్రవేత్తల ముందున్న సవాళ్లే. -
ప్రపంచం అంతం అయ్యేది అప్పుడే.. 2026 బాబా వంగా భవిష్యవాణి
-
Baba Vanga: మరి కొన్ని రోజుల్లో మరో తీవ్ర సౌర తుఫాను
-
బంగారం ఇక పనికిరాదు.. బాబా వంగా సంచలనం
-
బంగారం ధర 2026లో కొత్త రికార్డులు సృష్టిస్తుందా?
ఆర్థిక భద్రతకు ప్రతీకగా పరిగణించే బంగారం ఇటీవల ధరల పెరుగుదలతో భారత మార్కెట్లో మళ్లీ ప్రధాన చర్చానీయాంశంగా మారింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో ఇప్పటికే బంగారం ధర 10 గ్రాములకు రూ.1.2 లక్షల మార్కును దాటింది.ఇప్పుడు అందరి దృష్టి వచ్చే 2026 సంవత్సరంలో బంగారం ధర ఎలా ఉంటుందా అన్నదాని వైపు మళ్లింది. 2026లో “ఆర్థిక అల్లకల్లోలం” రాబోతుందని ప్రపంచ ప్రసిద్ధ బల్గేరియన్ జ్యోతిషురాలు బాబా వంగా గతంలో చెప్పిన జోస్యం మళ్లీ వార్తల్లోకి వచ్చింది.ప్రపంచ పరిస్థితుల ప్రభావంనిపుణుల ప్రకారం, బంగారం పెరుగుదల వెనుక ప్రధాన కారణాలు ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, ద్రవ్యోల్బణ భయాలు, కరెన్సీ అస్థిరత, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం. ఈ అంశాలు పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంవైపు నెడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.2026 అంచనాలుచరిత్రాత్మకంగా సంక్షోభ సమయాల్లో బంగారం ధరలు 20–50 శాతం వరకు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం, 2026లో ప్రపంచ ఆర్థిక అస్థిరత కొనసాగితే, బంగారం ధరలు 25–40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీపావళి (అక్టోబర్–నవంబర్) 2026 నాటికి భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.62 లక్షల నుంచి రూ.1.82 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. -
బాబా వంగా భయపెట్టే 2026 సంవత్సరపు భారత్ జోస్యాలు
-
బాబా వంగా 2026 జోస్యాలు: యుద్ధం, AI, ఏలియన్స్
-
Global War: బాబా వంగా చెప్పిన ఈ 3 నిజమైతే ప్రళయమే!
-
ఆ రోజే మరోసారి కరోనా ప్రళయం.. జపాన్ బాబా మరో సంచలనం
-
జపాన్ లో భూకంపం.. జోస్యం నిజమవుతుందా?
-
ఎల్లుండే మెగా సునామీ?
-
జులై 5న.. ఆమె జోస్యంతో వణికిపోతున్న జపాన్
బల్గేరియాకు చెందిన సుప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగా గురించి అందరికీ తెలిసే ఉంటుంది!. అంధురాలైన ఆమె భవిష్యత్తులో ఏం జరగనుంది? అనే చాలా విషయాలు చెప్పినవి చెప్పినట్లే జరగడంతో ఆమె కాలజ్ఞానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. సరిగ్గా.. ఈవిడలాగే జపాన్‌లోనూ ఒకావిడ ఉంది. ఆమె పేరు రియో టాట్సుకి(Ryo Tatsuki). ఆమె చెప్పిన ఓ విషయంతో వచ్చే నెలలో ఏకంగా ప్రయాణాలే రద్దు చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. జపనీస్ కాలజ్ఞాని రియో టాట్సుకి (Japanese fortune teller Ryo Tatsuki) 2025, జూలై 5న విపత్తు సంభవించబోతోందని అంచనా వేశారు. భూకంపాలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని జనాల్ని హెచ్చరించారు. ఆమె భవిష్యవాణిపై నమ్మకం కలిగిన జపాన్ ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ‘న్యూ బాబా వంగా’గా పేరొందిన రియో టాట్సుకి అంచనాల దరిమిలా పలువురు త్వరలో జపాన్- ఫిలిప్పీన్స్ మధ్య సముద్రగర్భ విభజన కారణంగా భారీ భూకంపం లేదంటే సునామీ సంభవించవచ్చని చెప్పుకుంటున్నారు. టాట్సుకి అంచనాలకు శాస్త్రీయ ఆధారం లేకపోయినా, 2011లో జపాన్‌లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీలు ఆమె గత అంచనాలను నిజం చేశాయని అంటున్నారు. నాటి భూకంపంలో ఏకంగా 18వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. హాంకాంగ్ నుండి సగటు బుకింగ్‌లు ఏడాదికి 50 శాతం మేరకు తగ్గాయి. జూన్- జూలై మధ్య కాలంలో బుకింగ్‌లు 83శాతం వరకు తగ్గాయి. ఏప్రిల్-మే హాలీడేస్ సమయంలో 50శాతం మేరకు బుకింగ్‌ల తగ్గుదల ఉందని హాంకాంగ్‌లోని ఒక ట్రావెల్ ఏజెన్సీ(Travel agency) తెలిపింది. మరోవైపు రియో టాట్సుకి అంచనాలు నిరాధారమని జపాన్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా టాట్సుకి అంచనాలను పక్కన పెడితే, ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఇటీవల జపాన్ పసిఫిక్ తీరంలో త్వరలో భారీ భూకంపం సంభవించనున్నదని, దీని కారణంగా 2 లక్షల 98 వేల మంది వరకు మరణించే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.చెప్పినవి చెప్పినట్లే జరిగాయి1995 కోబ్ భూకంపం: టాట్సుకి ఈ భూకంపాన్ని ముందుగానే ఊహించారు.2011 తోహోకు భూకంపం, సునామీ: టాట్సుకి ఈ విపత్తును ముందుగానే అంచనా వేశారు. నాటి ఈ విపత్తులో 22 వేలకు పైగా మరణాలు సంభవించాయి. దీనిపై టాట్సుకి అంచనా నిజం కావడంతో ఆమెపై జపనీయులకు మరింత నమ్మకం పెరిగింది.టాట్సుకి రాసిన పుస్తకం ‘ది ఫ్యూచర్ ఐ సా’లో 2020లో ఓ వైరస్ జపాన్‌తో పాటు ప్రపంచాన్ని వణికిస్తుందని చెప్పారామె. అది కోవిడ్-19నేనని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. ఇది కూడా చదవండి: ‘ఒక్కగానొక్క కొడుకయ్యా.. మీకు దణ్ణం పెడతా’ -
ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే!
-
నిజమవుతున్న నోస్ట్రాడమస్, బాబా వంగా హెచ్చరికలు?
న్యూఢిల్లీ: భూకంపం.. ఇప్పటికీ శాస్త్రవేత్తలు ముందుగా అంచనా వేయలేకపోతున్న ఒక ప్రకృతి విపత్తు. కొన్ని వేల ఏళ్లుగా భూకంపాలు పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా ఈరోజు (ఫిబ్రవరి 17)న దేశరాజధాని ఢిల్లీలో సంభవించిన భూకంపం అక్కడి ప్రజలను భయకంపితులను చేసింది. అయితే భవిష్యత్ అంచనాల గురించి తెలిపిన నోస్ట్రాడమస్, బాబా వంగా భూకంపాలు, ప్రకృతి విపత్తులపై ఎటువంటి హెచ్చరికలు చేశారు?నోస్ట్రాడమస్ తన కవితలలో తరచుగా ప్రకృతి వైపరీత్యాల గురించి తెలిపేవాడు. భూమి కంపించటం, నదులు ఉప్పొంగటం లాంటి పర్యావరణ సంక్షోభ హెచ్చరికలను ముందుగానే తెలియజేశాడు. 2025లో వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉంటుందని నోస్ట్రాడమస్ ముందుగానే తెలిపాడు. ఈయన చెప్పినట్లే సముద్ర మట్టాలు పెరగడం, మంచు వేగంగా కరగడం, వాతావరణంలో వేగవంతమైన మార్పుల గురించి శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించారు. నోస్ట్రాడమస్ తన పుస్తకంలో కార్చిచ్చు, కరువు, భారీ వరదలు మొదలైన వాటి గురించి రాశాడు. భూకంపం లేదా ఆకస్మిక భారీ వర్షపాతం మొదలైన ప్రకృతి వైపరీత్యాలను జనం చూస్తారని నోస్ట్రాడమస్ పేర్కొన్నాడు.2025లో సంభవించే ప్రకృతి విపత్తుల గురించి నోస్ట్రాడమస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతాయి. సూడాన్‌లో కరువు, పరిమిత సహాయం, పెద్ద ఎత్తున వలసలు లాంటి మానవతా సంక్షోభం ఎదురవుతుందన్నాడు. దీనికి అనుగుణంగానే బషర్ అల్-అసద్ పతనం తర్వాత సిరియాలో అనిశ్చిత వాతావరణం నెలకొంది.బాబా వంగా 2025లో సంభవించే విపత్తుల గురించి కొన్న అంచనాలు అందించారు. యూరప్‌లో భీకర యుద్ధం ప్రారంభమవుతుంది. ఫలితంగా ఈ ఖండంలోని అధిక జనాభా నాశనమవుతుంది. బాబా వంగా జోస్యం ఒకవేళ నిజమైతే 2025లో రష్యా.. ప్రపంచాన్నంతటినీ శాసిస్తుంది. బాబా వంగా చెప్పినదాని ప్రకారం 2025లో అమెరికా పశ్చిమ తీరంలో భూకంపం వస్తుంది. పలు అగ్నిపర్వతాలు పేలే అవకాశాలున్నాయి. నోస్ట్రాడమస్ 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు. అతని అంచనాలు కొన్ని శతాబ్దాలుగా నిజమవుతున్నాయి. బల్గేరియన్ మహిళ బాబా వంగా చెప్పిన 9/11 దాడి, యువరాణి డయానా మరణం లాంటి అంచనాలు నిజమయ్యాయి.ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా.. -
ఈ రెండు నెలల్లో ట్రంప్‌కు ముప్పుందా?
న్యూయార్క్: అమెరికా అంతర్జాతీయ ట్రేడ్ సెంటర్‌పై లోహ విహంగాలు దాడి చేస్తాయని, ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులు పెరుగుతారని, సునామీ వచ్చి వేలాది మంది చనిపోతారని కచ్చితంగా జోస్యం చెప్పిన బల్గేరియా ప్రవక్త బాబా వాంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వర్గీయుల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. అమెరికా 44వ అధ్యక్షుడిగా ఆఫ్రికన్–అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని మరో నాస్ట్రాడామస్గా పేరుపొందిన బాబా వాంగా వినిపించిన భవిష్యవాణి అంతరార్థం ఎమిటన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఆమె చెప్పినట్లుగానే బరాక్ ఒబామా అమెరికా 44వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరీ ఆయన ఆఖరి అధ్యక్షుడవుతారంటే ఏమిటి? 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటికీ ఆయన వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారనే విషయం తెల్సిందే. అప్పటి వరకు బరాక్ ఒబామే దేశాధ్యక్షుడు. అప్పటివరకు దేశంలో ఏమైనా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయా? ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినందున ఇస్లామిక్ టెర్రరిస్టులు ఆయనపై దాడులు చేసే అవకాశం ఉందా? లేక ఆయనే దేశాధ్యక్ష వ్యవస్థను మార్చేసి మరో వ్యవస్థను తీసుకొస్తారా, అందుకు అమెరికా పార్లమెంట్ రాజ్యాంగ వ్యవస్థ అనుమతిస్తుందా ? రష్యాలో కొన్ని వర్గాలు భావిస్తున్నట్లుగా మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుందా? అందులో అమెరికా అధ్యక్ష వ్యవస్థ కుప్పకూలి పోతుందా? ఇంకేమీ అనూహ్య పరిణామాలు జరగవచ్చనే సందేహాలు అమెరికన్లతోపాటు పలు దేశాల ప్రజల్లో కలుగుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు బాబా వాంగా ఇప్పుడు బతికి లేరు. గుడ్డి బాబాగా కూడా గుర్తింపు పొందిన ఆమె 1996లోనే తన 85వ ఏటా మరణించారు. ప్రపంచ పరిణామాల గురించి 1950 నుంచి ఆమె వినిపించిన భవిష్య వాణిలో 85 శాతం నిజం అయ్యాయి. దాంతో ఆమె వ్యాఖ్యలపై ఎక్కువ మంది ప్రజలకు నమ్మకం కుదిరింది. భూగోళంపైనా శీతల ప్రాంతాలు వేడెక్కుతాయి. అగ్ని పర్వతాలు మేల్కొంటాయని, సముద్ర తీరాన అతి పెద్ద వలలొచ్చి ఇళ్లను, ఊళ్లను ముంచేస్తుందని, ప్రతిదీ నీట మునిగి పోతుందని 1950వ దశకంలో వాంగా జోస్యం చెప్పారు. ఆమె జోస్యం ప్రకారమే 2004, డిసెంబర్ 26నాడు సుమత్రా దీవుల్లో (ఇండోనేషియా) సునామీ వచ్చిందని అంటారు. అప్పుడు 9.3 తీవ్రతతో భూకంపం రావడం వల్ల సముద్రపు అలలు దాదాపు వంద అడుగుల వరకు విరుచుకుపడడంతో 14 దేశాల తీర ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు 2,30,000 మంది మరణించారు. ఇప్పటి వరకు చరిత్రలోనే అదే అత్యంత ప్రళయంగా చరిత్రకారులు కూడా చెబుతున్నారు. ‘అమెరికా సోదరులపై లోహ విహంగాలు దాడి చేస్తాయి. పొదల్లో నుంచి తోడేళ్ల అరుపులు వినిపిస్తాయి. అమాయకుల రక్తపాతం జరుగుతుంది’ అని వాంగా 1989లో జోస్యం చెప్పారు. అమెరికా ట్రేడ్ సెంటర్‌పై జరిగిన 9–11 దాడుల గురించే ఆమె ప్రస్తావించారని అంటారు. 2016లో యూరప్ దేశాలపై ముస్లింలు దాడులు చేస్తారని కూడా ఆమె చెప్పారు. ‘దశాబ్దం అంతంలో రష్యా జలాంతర్గామిలోకి నీళ్లు జొరబడుతాయి. ప్రపంచ ప్రజలంతా తల్లడిల్లుతారు’ అని వాంగా 1980 దశకంలో జోస్యం చెప్పారు. 2000 సంవత్సరంలో కుర్స్క్ అనే రష్యా అణు జలాంతర్గామిలోకి అన్ని వైపుల నుంచి నీళ్లు జొరబడి మునిగిపోతుండగా, దాన్ని మునగకుండా రక్షించేందుకు అంతర్జాతీయ రిస్క్ టీమ్ తీవ్రంగా కృషి చేసింది. ఈ విషయంలో కూడా ఆమె జోస్యం అక్షరాల నిజమైందని అన్వయించి చెప్పేవాళ్లు, నమ్మే వాళ్లు ప్రపంచంలో ఎక్కువగానే ఉన్నారు. అమెరికా భవిష్యత్ గురించి వాంగా ఒక్కరే కాదు, ‘స్ట్రాట్‌ఫర్’ అనే ప్రైవేట్ ఇంటెలిజెన్స్ సంస్థ కూడా భవిష్య వాణిని వినిపించింది. ఇదివరకటిలా అమెరికా ప్రపంచ పరిణామాలపై అంతగా దృష్టిని పెట్టదని దేశ ఆర్థిక, సైనిక అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతుందని ఆ సంస్థ తెలిపింది. ఈ రెండు అంశాలకు తాను ప్రాధాన్యత ఇస్తానని ట్రంప్ చెప్పడం ఇక్కడ గమనార్హం. వాంగా చెప్పినట్లు ట్రంప్ విషయంలో ఏమీ జరుగకపోవచ్చు! ఎందుకంటే ఆమె చెప్పిన వాటిలో 15 శాతం నిజం కాలేదుకదా! -
యూరప్ తుడిచిపెట్టుకు పోతుందా?
సోఫియా: ఆమె వాక్కు బ్రహ్మంగారి వాక్కు. ప్రపంచ పరిణామాల గురించి ఆమె ముందే ఊహించి చెప్పిన వాటిలో దాదాపు 85 శాతం పరిణామాలు నిజమయ్యాయి. అమెరికాపై రెండు లోహ విహంగాల దాడులు జరుగుతాయని, అందులో అమాయక ప్రజలు మృత్యువాత పడతారని. 2004లో భారీ సునామీ వచ్చి అపార ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పిన విషయాలు నిజమయ్యాయి. సిరియా నుంచి ముస్లిం యుద్ధం ప్రారంభమవుతుందనీ చెప్పిన విషయం కూడా, పేట్రేగి పోతున్న ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను చూస్తుంటే దాదాపు నిజమేనని అనిపిస్తోంది. ఈ యుద్ధం 2016 లో ముస్లిం మహా యుద్ధంగా పరిణమించి 2043 నాటికి మొత్తం ఐరోపా తుడిచిపెట్టుకు పోతుందని, ఖలిఫా రాజ్యం ఏర్పడుతుందని కూడా ఆమె భవిష్యవాణి వినిపించారు. ఇందులో ఏ మాత్రం నిజమవుతుందో రానున్న చారిత్రక పరిణామాలే తెలియజేయాలి. ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త నోస్ట్రాడామస్ కన్నా ఎక్కువ కచ్చితంగా ప్రపంచ భవిష్యత్ పరిణామాలు అంచనా వేసినదీ బల్గేరియాకు చెందిన బాబా వాంగ. ఆమె దాదాపు 20 ఏళ్ల క్రితమే, అంటే 1996లో తన 85వ ఏట చనిపోయారు. ఇప్పుడు చెబుతున్నవన్నీ ఆమె అంతకుముందే అంచనావేసినవి. తన చిన్నప్పుడు వచ్చిన ఓ భయంకర పెనుతుపానులో చిక్కుకుని కళ్లు పోగొట్టుకున్న బాబా వాంగ దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలను వీక్షించారని ఆమె అనుచర వర్గాలు చెబుతున్నాయి. రెండు లోహ విహంగాలు అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని బాబా వాంగ 1989లో చెప్పడం, 2001, సెప్టెంబర్ 11న అమెరికా ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడి గురించేనని ఆమె అనుచర వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే 1950లో సముద్రపు అలలు భూభాగాన్ని కబళించివేస్తాయని చెప్పడం 2004, డిసెంబర్ 26వ తేదీన ఇండోనేసియా, సుమిత్ర దీవులను కుదిపేసిన సునామీ గురించి చెప్పడమేనని ఆ వర్గాలు అంటున్నాయి. క్రిస్మస్ రోజుల్లో వచ్చిన ఆ సునామీని బాక్సింగ్ డే సునామీ అని కూడా వ్యవహరిస్తున్నారు. భూమండలంపై వచ్చే పెను వాతావరణ మార్పుల గురించి కూడా ఆమె 60 ఏళ్ల క్రితమే ఊహించారు. ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు కరిగిపోతాయని, ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగిపోతాయని, వేడి ప్రాంతాలు చల్లగాను, చల్లటి ప్రాంతాలు వేడిగాను మారిపోతాయని, అగ్ని పర్వతాలు బుసలకొడతాయని చెప్పారు. అమెరికా 44వ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికన్-అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని కూడా బాబా వాంగ అంచనా వేసినట్టు అనుచర వర్గాలు చెబుతూ వస్తున్నాయి. 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎన్నికవడం తెల్సిందే. ఆయనే ఆఖరి అధ్యక్షుడవాతారా అన్నది మిలియన్ డాలర్ల అనుమానం. 2130 నాటికల్లా భూభాగంపై ఒక్క జీవి కూడా మిగలకుండా నశించి పోతుందని, అంతరిక్షవాసుల సహకారంతో సముద్ర గర్భంలో మానవులు జీవిస్తారని వాంగ అంచనా వేశారు. 3005 నాటికి అంగారక గ్రహంపై కూడా యుద్ధం జరుగుతుందని, 3,797 నాటికి ఈ భూమండలమంతా నశించి పోతుందని, అప్పటికే భూమి మీద మిగిలిన మానవులు మరో సౌర వ్యవస్థలోకి వెళ్లిపోతారని కూడా ఆమె అంచనా వేసింది. బాబా వాంగ బతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండడంతో ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్ గురించి చెప్పించుకునేవారు.


