2026లో మనం ఏలియన్‌లను కలవ బోతున్నామా? లేక ఏలియన్‌లు మన వద్దకు రానున్నాయా? ఏలియన్‌లకు సంబంధించి బాబా వంగా చేసిన భవిష్యవాణి నిజమవుతుందా? నిజంగా ఏలియన్‌లు భూమి మీదకు రానున్నాయా? అసలు ఏలియన్‌లు ఉన్నారా? ఇవన్నీ ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలే. ఇప్పటికీ... బాబా వంగా భవిష్య వాణిని నమ్మేవారు ఏలియన్‌ల ఉనికి సాధ్యమే అంటున్నారు.
శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ... సువిశాల విశ్వంలో పరిశోధనల ఇంకా మిగిలే ఉంది. ఒక వేళ బాబా వంగా వ్యాఖ్యలు వాస్తవమేనని అనుకున్నా.. 2026లో నిజంగా ఏలియన్‌లు భూమి మీదకు వస్తే మరి వారిని ఎలా కలవాలి...? వారు మనకన్నా బలవంతులా? లేక బలహీనులా?... వాళ్లు శక్తి వంతులై... దాడి చేయడానికి ప్రయత్నిస్తే... వారి ఆయుధాల గురించి కనీస జ్ఞానం లేని మానవులు ఎదుర్కొనగలరా.. ఇలాంటి ప్రశ్నలకు మనం సమాధానాలు వెదుకుదాం.
ఏలియన్‌ల ఉనికి ఉందని... అవి త్వరలోనే భూమి మీదకు వస్తాయని బల్గేరియాకు చెందిన బాబా వంగా చెప్పారు. ఆమె జీవించి ఉన్నప్పుడు... భవిష్యత్తులో జరిగే కొన్ని కార్యాల గురించి చెప్పారు. అందులో ఏలియన్‌ల ప్రస్తావన కూడా ఉంది. అయితే ఆమె చెప్పిన వాటిలో కొన్ని నిజంగా జరిగాయి. కొన్ని జరగలేదు. దాంతో జనం ఆమె భవిష్యత్తును చూడగలరని నమ్మారు. అందులోనే 2026లో ఏలియన్‌ల గురించి ఆమె భవిష్యవాణి ప్రస్తావన ఉంది. ఏలియన్‌లు భూమ్మీదకు వస్తారు... అప్పడు భూమిమీద పెద్ద సంక్షోభం ఏర్పడుతుందని చెప్పారు. జనం నమ్మి ఏలియన్‌ల మీద ఆసక్తి పెంచుకోవడంతో పాటు సంక్షభాన్ని ఎదుర్కొనే తీరుపై చర్చలు కూడా సాగుతున్నాయ. శాస్రవేత్తలు మాత్రం... మానవులు.... గ్రహంతర వాసులను కలుస్తారనే ఆధారాలు లేవని... అది సాధ్యం కాదని చెబుతున్నారు. ఏదేమైనా.. 2026 మాత్రం ఇంటరెస్టింగా మారనుంది.
ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారిన ఏలియన్‌ల ప్రస్తావన... రాను రాను పెద్ద చర్చకే దారి తీసేట్టు ఉంది. ఇప్పటికే భారీ సంఖ్యలో జనం నమ్మడంతో... శాస్త్రవేత్తలు సైతం మరింత లోతుగా వాస్తవాలను గుర్తించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఏలియన్‌ల చర్చకు భిన్నంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చేసిన విస్తృత పరిశోధనల ద్వారా ఏలియన్‌ల ఉనికి ఉండొచ్చని... ఉండక పోవచ్చని మాత్రం చెప్పగలిగారు. ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ఖగోళ శాస్త్రవేత్తలకు లభించలేదు. అయినా నిరంతర అన్వేషణ సాగుతోనే ఉంది. సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రోగ్రామ్‌లో ఆకాశాన్ని.. గ్రహాలను స్కాన్ చేస్తూనే ఉన్నప్పటికీ... ఏలియన్‌ల గురించి స్పష్టమైన ఆధారాలు ఇంకా లభించలేదు.
ఏలియన్‌ల గురించి శాస్త్రవేత్తల ఆలోచన ఏంటనే అంశాలపై ఓ సర్వే జరిగింది. అంతో 1055 మంది శాస్త్రవేత్తలు, వారిలో దాదాపు సగం అంటే 521 మంది ఖగోళ జీవ శాస్త్రవేత్తలతో జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. శాస్త్రవేత్తల్లో 87 శాతం మంది గ్రహంతర వాసులున్నారని నమ్ముతున్నారు. ఖగోళ శాస్త్రవేత్తల్లో సగం మంది మాత్రమే నమ్ముతున్నారు. మిగతా సగం నమ్మడం లేదు.
విశ్వంలో... భూమి తప్ప నివాస యోగ్యంగా ఉండే వాతావరణం, నీటి ఉత్పన్నం, ఇతర అవసరాలకు అనుగుణంగా ఇతర గ్రహాలు లేవని... అందుకే వాటిపై జీవం లేకపోవచ్చని కొందరు ఖగోళ శాస్త్రవేత్తల ఆలోచన. ఇతర శాస్త్రవేత్తలు కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. మన సౌర వ్యవస్థలో చంద్రునిపై జీవం ఉండే ఆస్కారం ఉందని... మన గెలాక్సీలో 100 బిలియన్ గ్రహాలు ఉన్నాయి. అన్నింటిపై పరిశోధనలు జరపకుండా ఈ నిర్ణయానికి రావడం తొందరపాటేనని... ఇప్పటి వరకు జరిపిన పరిశోధనలతో పాటు... భవిష్యత్తులో జరిగే పరిశోధనల్లో ఏలియన్‌లు, ఇతర జీవాల ఉనికి ఉండొచ్చనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
శాస్త్రవేత్తలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే ఏలియన్‌లు, లేదా ఏలియన్‌లను పోలే ఆకారాలు, ఇతర జీవాలు గెలాక్సీలో ఉన్నాయనే అనుమానాలకు బలం చేకూరుతోంది. అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... శాస్త్రవేత్తలు ఏలియన్‌ల ఉనికి ఉందని నమ్ముతున్నారు. కానీ ఖగోళ శాస్త్రవేత్తలు ఆ వార్తను ఖండిస్తున్నారు.
మరి కొందరు శాస్ర్తవేత్తలు మాత్రం మరో విధంగా కూడా చెబుతున్నారు. ఏలియన్స్ ఉన్నాయా లేదా అని ఓ చర్చ సాగుతుండగానే... వారి స్వభావం... వారి తీరుతెన్నుల గురించి కూడా కొందర శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో వాటి ఉనికి స్పష్టంగా ఉన్న సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు అస్పష్టమైన హ్యూమనాయిడ్లు సుడిగుండంగా మారి... పొగమంచుతో కూడిన నిల్చున్నాయని... అవి వాటి వెనుక నుండి ప్రకాశవంతమైన కాంతితో చలనంలోకి వస్తాయని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇక విశ్వంలో ఉన్న ఏలియన్స్ ఆకారం ఎలా ఉంటుంది... వారి భాష, వారి జీవన శైలి ఎలా ఉంటుందనే అంశాలపై కూడా కొందరు శాస్త్రవేత్తలు చర్చలు ప్రారంభించారు. వారి తెలివి తేటలు ఎలా ఉంటాయి...?
వారు వాడే టెక్నాలజీ మనకన్నా అడ్వాన్సుగా ఉంటుందా... లేక సాంకేతికతకు దూరం మన రాతియుగం లాంటి జీవాలుంటాయా అనే క్యూరియాసిటీ కూడా సృష్టిస్తున్నారు. అయితే ఇవన్నీ ఊహగానాలే తప్ప.... విశ్వ ప్రపంచంలో ఇప్పటి వరకు ఏలియన్‌ల ఉనికి మాత్రం దొరకలేదు. ఏలియన్‌లపై వచ్చిన సినిమాల ఆధారంగా ఏలియన్‌ల ఆకారం, తెలివితేటలు, సాంకేతికత, స్పేష్ షటిల్ సఫవగురించి చర్చలు సాగుతూనే ఉన్నాయి. విస్తృత విశ్వం అంతటా నిజంగా భారీ సంఖ్యలో జీవాలు ఉంటే... నివాసయోగ్యమైన వాతావరణాలు ఎందుకు లేవు. అలాంటి ప్రాంతాలుంటే అక్కడి జీవాలపై పరిశోధనలెందుకు జరగడం లేదు.
ఏలియన్‌లు ఉండి... ఒకవేళ ఏలియన్‌లు భూమ్మీదకు వచ్చేస్తే పరిస్థతి ఏంటీ? ఇప్పటికే సినిమాల ప్రభావం కారణంగా ఏలియన్‌ల ఆకారం, వాటి ఉనికి... వారి నడక, వారి భాష గురించి అవగాహన పొందినట్లు జనం భావిస్తున్నప్పటికీ... నిజంగా వాళ్లు వస్తేనే అసలు ఆకారాలు బయటపడతాయి. ఏలియన్లు వచ్చినప్పుడు జనంతో భయపడతారా...? లేక మనకన్నా వాళ్లే అడ్వాన్‌డ్‌గా ఉంటారా? వాళ్లతో మనం భయపడాల్సి వస్తుందా... ఇలాంటి ప్రశ్నలెన్నో సాధారణ మనుషులను మెదళ్లను తొలచి వేస్తున్నాయి. ఒకవేళ బలహీనులుంటే ... మనుషులు వాటికి హాని కలిగించే ఆలోచనలో మాత్రం ఉండరు. కానీ అవి దాడి చేస్తే మాత్రం ఎలా ఎదుర్కొనాలన్నదే ప్రధాన సమస్య. వారి భాషను డీకోట్cయడానికి ఎలాంటి టెక్నాలజీ వాడాలన్నదీ శాస్త్రవేత్తల ముందున్న సవాళ్లే.


