కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘2026లో ప్రపంచం అంతం’ అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాబా వంగా 2026లో ప్రపంచం అంతం గురించి చేసిన జోస్యాలు ప్రజల్లో ఆసక్తిని, భయాన్ని పెంచాయి. అలాగే, చర్చలకు కారణమవుతున్నాయి. అయితే, బాబా వంగా జోస్యాలు శాస్త్రీయ ఆధారాలు లేని ఊహాగానాలు మాత్రమేనని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఇవి ప్రజల్లో సాంస్కృతిక, మానసిక ప్రభావం చూపుతున్నాయి కానీ.. వాస్తవంగా 2026లో ప్రపంచం అంతమవుతుందనే ఆధారం లేదని చెబుతున్నారు. ఇంతకీ 2026 గురించి బాబా వంగా ఏం చెప్పారు...?
బల్గేరియాకు చెందిన బాబా వంగా గురించి చాలా మంది అనేక సమయాల్లో వినే ఉంటారు. ఆమె చెప్పిన ఎన్నో జోస్యాలు నిజం అయ్యాయి. చిన్న వయస్సులోనే చూపు కోల్పోయిన బాబా వంగా ప్రకృతి విలయాలు, ప్రపంచ యుద్ధాలు, విపత్తుల గురించి జోస్యం చెప్పారు. అందులో చాలా వరకు నిజం అయ్యాయి కూడా. కరోనా మహమ్మారిని కూడా బాబా వంగా ముందే ఊహించారు. ఈ క్రమంలో 2026 ఏడాది గురించి బాబా వంగా పలు సంచలన విషయాలను వెల్లడించారు. 2026లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆమె 2026 సంవత్సరాన్ని యుద్ధం వినాశన సంవత్సరంగా పేర్కొన్నారు. 2026తో ప్రపంచం అంతం అవుతుందని చెప్పడం టెన్షన్‌కు గురిచేస్తోంది. న్యూయార్క్ పోస్ట్, ది మిర్రర్, ఎక్స్‌ప్రెస్ వంటి పత్రికలలో విస్తృతంగా వచ్చిన నివేదికల ప్రకారం.. ఆమె అనుచరులు మరియు వ్యాఖ్యాతలు 2026 సంవత్సరానికి అనేక నాటకీయ సంఘటనలను ఆపాదిస్తున్నారు. దీంతో, ఈ విషయంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మూడో ప్రపంచ యుద్దం..
వీటిలో రష్యా, అమెరికా, చైనా, యూరప్ వంటి దేశాలు మధ్య ప్రపంచ సంఘర్షణలు తీవ్రతరం కావడం.. మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే విధ్వంసకర భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణం, వరదలు, తుఫానులతో సహా భారీ ప్రకృతి వైపరీత్యాలు భూమిపై 7–8% భూభాగాన్ని ప్రభావితం చేయడం వంటివి ఉన్నాయి. గ్రహాంతరవాసులతో మొదటి పరిచయం, బహుశా నవంబర్‌లో భూమి వాతావరణంలోకి ప్రవేశించే భారీ గ్రహాంతర నౌకతో సహా, AI ఆధిపత్యం, ఆర్థిక అస్థిరత.. ఆసియా లేదా చైనా వైపు ప్రపంచ శక్తిలో మార్పు పెరుగుతుందని కూడా అంచనా వేయబడింది.
అయితే, ఇది బాబా వంగా మాత్రమే కాదు. పలువురు ప్రముఖులు సైతం ఆసక్తిగా దీనికి ఆజ్యం పోశారు. నోస్ట్రాడమస్ యొక్క క్వాట్రైన్‌ల వివరణల ప్రకారం "రక్త నదులు", ప్లేగులు, నిరంకుశుల గురించి హెచ్చరిస్తున్నాయి. 2003లో రహస్యంగా అదృశ్యమైన పాకిస్తాన్ ఆధ్యాత్మిక నాయకుడు రియాజ్ అహ్మద్ గోహర్ షాహి.. ఈ సంవత్సరం భూమిని తాకే మండుతున్న తోకచుక్క గురించి మాట్లాడారు. బ్రెజిల్‌కు చెందిన "లివింగ్ నోస్ట్రాడమస్" అథోస్ సలోమ్ 2024లో ప్రపంచ యుద్ధం, సైబర్ సంఘర్షణ మరియు AI ఆధిపత్యం దగ్గర పడుతున్నాయని అంచనా వేశాడు. మరోవైపు, ఘనా ప్రవక్త ఎబో నోహ్ విపరీతమైన వరదలు వస్తాయన్నారు. దీని కోసం అతను ఘనాలో అనేక చాపలను నిర్మించినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, వీరి వ్యాఖ్యలు నిజమవుతాయా? అనే ప్రశ్నలు ఎదరవుతున్నాయి.
ఈ భయం ఎక్కడిది?
‘2026 డూమ్స్ డే’ టాక్ మొదటి నుంచీ ఒక్క కారణం మీదే నడుస్తోంది. 1980ల్లో బెంజమిన్ క్రెమ్ అనే వ్యక్తి మైత్రేయ అలియాస్ కొత్త యుగం రాబోతోందని 2025-2026లో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని జోస్యం చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ వ్యవహారం ఆస్టరాయిడ్ వైపు మళ్లింది. మరికొద్ది రోజులకు నోస్ట్రడామస్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంతో జోతిష్యం కూడా తెరపైకి వచ్చింది. పలువురు జోతిష్యులు తమకు నచ్చిన విధంగా ప్రళయం అని ఒకరు అంటే.. ‘2026 మహా ప్రళయం’ అని మరికొందరు చెబుతున్నారు. అయితే, బాబా వంగా యొక్క అసలు "డూమ్స్‌డే" తేదీ చాలా దూరంలో ఉంది. ఆమె 5079లో ప్రపంచ ముగింపు (లేదా విశ్వ సంఘటన ద్వారా "సంపూర్ణ డూమ్స్‌డే") గురించి అంచనా వేసింది.
ఆస్టరాయిడ్ ఢీకొడుతుందా?
ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అయ్యే వీడియోల్లో రెండు ఆస్టరాయిడ్స్ గురించి ఎక్కువగా ప్రస్తావన ఉంటుంది. ఒకటి Apophis (99942), రెండు 2024 YR4. Apophis 2029 ఏప్రిల్ 13న భూమికి 31,000 కిలోమీటర్ల దూరంలోకి వస్తుంది. కానీ 2021లోనే నాసా 100% సేఫ్ అని ధృవీకరించింది. 2026లో దాని దూరం లక్షల కిలోమీటర్లు. 2024 YR4 లేదంటే ఇంకా ఏదైనా ఆస్టరాయిడ్ 2026లో ఢీకొనే ఛాన్స్ ఉందా? అంటే లేదనే చెప్పొచ్చు. నాసా, ESA, NEOWISE టెలిస్కోప్‌లు 99% పెద్ద ఆస్టరాయిడ్స్ ను ట్రాక్ చేస్తున్నాయి. ఏదైనా రిస్క్ ఉంటే ఇప్పటికే పెద్ద హెచ్చరికలు వచ్చేవి.
అంతం తప్పదా?
గత సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాది కాస్త కష్ట సంవత్సరం కావచ్చు. వాతావరణ మార్పుల విషయం మరింత తీవ్రమవుతుంది. రాజకీయ ఉద్రిక్తతలు ముఖ్యంగా ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ లాంటి ఘటనలు పెరగవచ్చు. AI వల్ల కొత్త రకం ఆర్థిక మాంద్యం రావచ్చు. కానీ, ఇవన్నీ మనం ఇప్పటికే ఎదుర్కొంటున్న సమస్యలే. కొత్తగా ప్రపంచాన్ని నాశనం చేసేవి కావు. చివరిగా.. గతంలో Y2K (2000), మయన్ క్యాలెండర్ (2012), కరోనా ‘ప్రపంచం అంతం’ టాక్ (2020) గురించి విన్నాం. ప్రతిసారీ భయపడ్డాం. కానీ, ఏమీ కాలేదు. 2026 కూడా అలాగే గడిచిపోతుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.


