కుండపోత వర్షాలు.. 100 మంది మృతి! | Heavy Rain Fall In Southern Africa Floods Kruger Park Shut | Sakshi
Sakshi News home page

కుండపోత వర్షాలు.. 100 మంది మృతి!

Jan 18 2026 7:59 AM | Updated on Jan 18 2026 8:05 AM

Heavy Rain Fall In Southern Africa Floods Kruger Park Shut

ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఆశ్రయం కోల్పోయారు. మరోవైపు.. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఆఫ్రికాలోని మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాలలో ఎడతెరిపిలేని కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మొజాంబిక్‌లో వర్షాలు, వరదల కారణంగా రెండు లక్షల మందికి పైగా ప్రభావితులు అయ్యారు. భారీ వర్షాల కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షాల కారణంగా ఇప్పటికే వంద మందికిపైగా మృతి చెందారు. ఇక, జింబాబ్వేలో వర్షాల వల్ల 70 మంది మరణించగా.. 1000కి పైగా ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. పాఠశాలలు, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.

ఇదిలా ఉండగా.. దక్షిణ ఆఫ్రికాలో మృతుల సంఖ్య 30 చేరింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లను రంగంలోకి దించి, బాధితుల్ని రక్షిస్తున్నారు. ప్రఖ్యాత క్రుగార్‌ నేషనల్‌ పార్క్‌ను కూడా ఈ వరదలు ప్రభావితం చేశాయి. అందులో చిక్కుకున్న 600 మంది పర్యాటకులు, పార్కు సిబ్బందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. లా నినా వల్ల వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఆఫ్రికాలోని ఏడు దేశాలను వర్షాలు ముంచెత్తుతున్నాయని అమెరికా వాతావరణ హెచ్చరికల వ్యవస్థ తెలిపింది. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement