" నేనే ఒత్తిడి చేసి ఉండవచ్చు" | I Might Have Trump Denies Israel forcing war | Sakshi
Sakshi News home page

" నేనే ఒత్తిడి చేసి ఉండవచ్చు"

Mar 4 2026 3:30 PM | Updated on Mar 4 2026 3:57 PM

 I Might Have Trump Denies Israel forcing war

ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నాయి. టెహ్రాన్‌ సైతం తగ్గేదిలేదంటూ పెద్ద ఎత్తున ప్రతి దాడులు చేస్తోంది. అయితే మారణహోమం ఎలా మెుదలైందనే విషయంపై ట్రంప్ మాట్లాడారు. తమ మిత్రదేశం కోసమే అమెరికా యుద్ధం ప్రారంభించిందనే వ్యాఖ్యల్ని ఖండించారు. యుద్ధాన్ని తానే ప్రోత్సహించాననే విధంగా సమాధానం ఇచ్చారు.

ఇరాన్‌పై అమెరికా "ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ" పేరుతో దాడులు ప్రారంభించింది. టెహ్రాన్‌పై విరుచుకపడుతూ ఆ దేశ సుప్రీం నేత ఆయాతుల్లా ఖమేనీ, ఆయన భార్యతో పాటు ఇతర కీలక నేతలను మట్టుబెట్టింది. ఈ దాడులలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌  చిన్నాభిన్నం అయ్యింది. అయితే ఈ యుద్ధంపై అమెరికా సెక్రటరీ మార్క్ రుబియో స్పందించారు. ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేయబోతుందని తెలిసిన తర్వాతే అమెరికా ఈ దాడులలో పాల్గొందన్నారు.

అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం దీనిపై స్పందించారు." నాకు తెలిసి మెుదటగా ఇరాన్ దాడికి ప్రణాళికలు రచించింది. అయితే నేను అది జరగనివ్వకూడదు అనుకున్నా. అయితే ఈ సందర్భంలో నేను ఇజ్రాయెల్‌ని కొంత ఒత్తిడి చేసి ఉండవచ్చు" అన్నారు.   ‍అమెరికాలోని ఆయన అధ్యక్ష కార్యాలయంలో  జర్మన్ ఛాన్సిలర్‌ ఫ్రెడరిక్ మెర్జ్‌తో ట్రంప్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇరాన్ రక్షణ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందన్నారు. ఆ దేశానికి చెందిన నేవీ, ఎయిర్‌ఫోర్స్, రాడార్‌ సిస్టమ్స్ ఏవి ప్రస్తుతం పనిచేయడం లేదని తెలిపారు. అదే విధంగా ఖమేనీతో పాటు ఇతర కీలక నేతలు ఈ దాడులలో మృతి చెందారని ‍ప్రకటించారు. అయితే ఇరాన్‌తో అణుచర్చలు విఫలమైతే ఈ సారి దాడి మరింతగా పెద్దగా ఉంటుందని తొలుత నుంచి ట్రంప్ హెచ్చరిస్తూ వచ్చారు.

అయితే ప్రస్తుతం యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్‌ గల్ప్ కంట్రీస్‍లోని అమెరికా స్థావరాలపై విరుచుకపడుతుంది. మరోవైపు ఇజ్రాయెల్‌పైనా బాలిస్టిక్‌ క్షిపణిలతో దాడి చేస్తుంది.  ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement