ఇరాన్‌ షిప్‌ను కూల్చేసిన అమెరికా.. 85 మంది జలసమాధి | submarine attack on Iranian ship | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ షిప్‌ను కూల్చేసిన అమెరికా.. 85 మంది జలసమాధి

Mar 4 2026 4:47 PM | Updated on Mar 4 2026 8:51 PM

submarine attack on Iranian ship

అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న ఇరాన్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక తీరంలో ఇరాన్‌కు చెందిన షిప్‌పై సబ్‌ మెరైన్‌ అటాక్‌తో అమెరికా కూల్చివేసింది. దీంతో నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమదాంలో  ఇరాన్ సైనికులు మృతిచెందారు. ఇప్పటి వరకూ శ్రీలంక నావికా దళం   85 మృతదేహాలు స్వాధీనం చేసుకుంది. మరికొందరి  జాడ తెలియాల్సి ఉందని ప్రకటించింది. కాగా నౌక మునిగిపోతుండగా 32 మందిని రక్షించినట్లు శ్రీలంక నేవీ ప్రకటించింది.

ప్రస్తుతం పశ్చిమాసియాను యుద్ధం కమ్ముకుంది. టెహ్రాన్‌పై యుఎస్‌, ఇజ్రాయెల్ పెద్దఎత్తున దాడులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ నగరం విధ్వంసమైంది. ఆ దేశానికి చెందిన అనేక భవనాలు నేల కూలాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇరాన్‌ ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, రాడార్‌ సిస్టమ్స్ ఇలా అన్నింటిని నిర్వర్యం చేశామని తెలిపారు. ఇలా దాడులతో ఇప్పటికే పెద్దఎత్తున సైనికవ్యవస్థ దెబ్బతిన్న ఇరాన్‌కు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌కు చెందిన యుద్ధనౌకను శ్రీలంక తీరంలో యుఎస్ కూల్చివేసింది.

శ్రీలంక గాలే నగర తీరంలో ఇరాన్‌కు చెందిన ఐరిస్ డెనా అనే యుద్ధనౌకపైపై సబ్‌ మెరైన్ అటాక్ జరిగింది. దీంతో నౌక ప్రమాదానికి గురై సముద్రంలోకి మునిగిపోయింది. అయితే ప్రమాద సమయంలో నౌక నుంచి ప్రమాద సంకేతాలు రావడంతో శ్రీలంక నావికాదళం వెంటనే అక్కడికి చేరుకుంది. తక్షణమే స్పందించి ప్రమాదంలో మునిగిపోతున్న దాదాపు 30 మందిని సురక్షితంగా కాపాడాయి. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 85 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు శ్రీలంక నేవీ ప్రకటించింది.  గల్లంతైన వారికోసం గాలింపులు చేపడుతున్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్ ప్రకటించారు. 

శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌక పై దాడి

అయితే ఈ నౌక ఐరిస్ డెనా నౌక గత నెల 17న విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్‌ ప్లీట్ రివ్యూలో (IFR)పాల్గొని తిరిగి ఇరాన్ వెళుతుండగా దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం అంతర్జాతీయ సముద్ర జలాల్లో జరిగినట్లు సమాచారం 

Advertisement
 
Advertisement
Advertisement