breaking news
Sri Lanka
-
ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. విధ్వంసకర బ్యాటర్ అరంగేట్రం
మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ జరుగనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 15న సౌతాంప్టన్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. విధ్వంసకర బ్యాటర్, ఓపెనర్ అనెరిన్ డొనాల్డ్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. ఫిల్ సాల్ట్ కుడి తొడ కండరాల గాయంతో సిరీస్‌కు దూరం కావడంతో అనెరిన్ డొనాల్డ్‌కు అవకాశం దక్కింది. జేకబ్ బేతెల్ స్థానంలో వచ్చిన జోర్డన్ కాక్స్‌కు కూడా తుది జట్టులో చోటు లభించింది. ఆల్రౌండర్లుగా జాక్స్, డాసన్, ఓవర్టన్ తమ స్థానాలను పదిలంగా ఉంచుకున్నారు. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో సోనీ బేకర్‌కు అవకాశం లభించింది. స్పిన్ విభాగంలో అనుభవజ్ఞుడైన ఆదిల్ రషీద్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పేస్ విభాగంలో జోష్ టంగ్ కూడా తుది జట్టులో ఉన్నాడు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది.శ్రీలంకతో తొలి టీ20కి ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్జోస్ బట్లర్ (వికెట్ కీపర్), అనెరిన్ డొనాల్డ్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోర్డాన్ కాక్స్, టామ్ బాంటన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్, సోనీ బేకర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్ఇదీ చదవండి: టీమిండియాకు ఊహించని షాక్ -
మహిళల ఆసియాకప్ ఫైనల్లో నేడు శ్రీలంకతో భారత్ ఢీ
దుబాయ్: మహిళల ఆసియాకప్ టి20 టోర్నమెంట్లో ఎదురులేకుండా సాగుతున్న భారత జట్టు... నేడు శ్రీలంకతో ఫైనల్‌కు సిద్ధమైంది. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు ఈ టోర్నీ నిర్వహించగా... అందులో ఏడుసార్లు ట్రోఫీ చేజిక్కించుకున్న టీమిండియా... ఎనిమిదో టైటిల్‌పై గురి పెట్టింది. గత ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్న టీమిండియా... ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి... సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మరోవైపు శ్రీలంక కూడా గ్రూప్ దశలో అన్నీ మ్యాచ్‌లు నెగ్గి సెమీస్‌లో పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్ చేరింది. ఫామ్‌పరంగా చూసుకుంటే ఈ టోర్నమెంట్లో తొలిసారి భారత జట్టుకు కాస్త ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలున్నాయి. స్మృతి మంధాన, షఫాలీ వర్మ రూపంలో భారత జట్టుకు బలమైన ఓపెనింగ్ జోడీ ఉంది. స్మృతి ఇప్పటికే ఈ టోర్నీలో ‘శత’క్కొట్టగా... షఫాలీ 168 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతోంది. స్పిన్‌కు సహకరిస్తున్న దుబాయ్ పిచ్‌పై ఈ జంట జట్టుకు ఎలాంటి ఆరంభం ఇస్తుందనేదే కీలకం కానుంది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేస్తున్న ప్రతీకా రావల్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉండగా... హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, భారతి ఫూల్మాలితో భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కీలకం కానుంది. ఈ టోర్నీలో 11 వికెట్లు తీసి శ్రీలంక సారథి చమరి ఆటపట్టుతో కలిసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్న దీప్తి ఫైనల్లోనూ రాణించాల్సిన అవసరముంది. ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి తన స్పిన్‌తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతుండగా... పేసర్లు నందని శర్మ, క్రాంతి గౌడ్ ఫర్వాలేదనిపిస్తున్నారు. అయితే భారత జట్టుకు ఫీల్డింగ్‌లోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు శ్రీలంక జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో సారథి చమరి ఆటపట్టుపైనే ఎక్కువ ఆధారపడుతోంది. -
శ్రీలంక ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచిన పాక్
మహిళల ఆసియా కప్ 2026లో ఇవాళ రెండో సెమీఫైనల్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులకే పరిమితమైంది.కెప్టెన్ ఫాతిమా సనా ఓ మోస్తరు ఇన్నింగ్స్ (47 నాటౌట్) ఆడటంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ప్లేయర్లలో షావాల్ జుల్ఫికర్ (24), గుల్ ఫెరోజా (21), తుబా హసన్ (12 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. మునీబా అలీ (2), అయేషా జాఫర్ (7), సదాఫ్ షమాస్ (8) సింగిల్ డిజట్ స్కోర్లకే పరిమితమయ్యారు. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ చమారీ ఆటపట్టు, చముడి ప్రబోదా తలో 2 వికెట్లు తీయగా.. సుగందిక కుమారి ఓ వికెట్ పడగొట్టింది.కాగా, నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో గెలిచి భారత్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. నేటి రెండో సెమీస్‌లో గెలిచిన జట్టు సెప్టెంబర్ 13న జరిగే ఫైనల్లో భారత్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఇదీ చదవండి: శతక్కొట్టిన కానర్.. సౌతాఫ్రికాదే సిరీస్ -
ప్రతిష్టాత్మక అవార్డు రేసులో టీమిండియాను ఇబ్బందిపెట్టిన ప్లేయర్
ఇటీవల భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన శ్రీలంక మిడిలార్డర్ బ్యాటర్ సోనల్ దినుషా ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ఆగస్ట్) అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ ఓల్లీ రాబిన్సన్, బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహ్ముద్తో కలిసి దినుషా ఈ అవార్డు కోసం పోటీ పడనున్నాడు.ప్రస్తుతం దినుషా పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. భారత్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో అతడు ఏకంగా 420 పరుగులు (140 సగటు) చేశాడు. భారత్‌తో సిరీస్‌కు ముందు దినుషా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. తన టెస్టు కెరీర్లో తొలి ఐదు ఇన్నింగ్స్‌ల్లో అతడి ఖాతాలో ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే ఉంది.అయితే భారత్‌తో సిరీస్‌లో మాత్రం దినుషా పూర్తిగా భిన్నమైన ఆటగాడిగా కనిపించాడు. గాలేలో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన దినుషా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 84 పరుగులతో రాణించాడు. అయితే ఆ మ్యాచ్‌లో శ్రీలంక 165 పరుగుల తేడాతో ఓడిపోయింది. సిరీస్‌లో 0-1తో వెనుకబడిన శ్రీలంకకు రెండో టెస్టులో దినుషా అండగా నిలిచాడు.ఒకే టెస్టులో రెండు సెంచరీలుకొలంబోలో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక టెస్టులో దినుషా మరోసారి చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 162 బంతుల్లో 103 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు గంటలకు పైగా క్రీజులో నిలిచి 264 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా శ్రీలంకను ఓటమి నుంచి కాపాడాడు.రాబిన్సన్ విషయానికొస్తే.. ఆగస్ట్ నెలలో పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్టుల్లో అతడు 16 వికెట్లు పడగొట్టాడు. రాబిన్సన్ ప్రదర్శనల కారణంగా ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది.మరోవైపు బంగ్లా ఫాస్ట్ బౌలర్ హసన్ మహ్ముద్ ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన చేశాడు. డార్విన్‌లో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లు తీసుకుని బంగ్లాదేశ్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.చదవండి: భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 వాయిదా..? -
శ్రీలంక హ్యాట్రిక్ విజయం
దుబాయ్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో శ్రీలంక జట్టుకిది ‘హ్యాట్రిక్’ విజయం. మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 114 పరుగులు చేసింది. శోభన (34; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. శ్రీలంక బౌలర్లలో ప్రబోద 3 వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 115 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్షిత (37 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడి జట్టును గెలిపించింది. నేడు జరిగే మ్యాచ్‌లో హాంకాంగ్‌తో పాకిస్తాన్ ఆడుతుంది. -
భారీ లంచం కేసులో మహింద రాజపక్సే కొడుకు అరెస్ట్
శ్రీలంక మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని మహింద రాజపక్సే కుటుంబానికి మరో భారీ షాక్ తగిలింది. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు.. అవినీతి కేసులు.. ఇప్పుడు అరెస్టుల దాకా వెళ్లాయి. ఆయన కుమారుడు, ప్రతిపక్ష ఎంపీ నమల్ రాజపక్సేను అవినీతి నిరోధక అధికారులు అరెస్టు చేశారు. ఎయిర్‌బస్ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీగా లంచంగా పొందారన్న అభియోగమే ఇందుకు కారణం.2013లో శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ కోసం జరిగిన 2.3 బిలియన్ డాలర్ల ఎయిర్‌బస్ డీల్‌పై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ ఒప్పందంలో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు ముడుపులు చెల్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నమల్ రాజపక్సేకు 8 లక్షల డాలర్లు (సుమారు రూ.7 కోట్లు) అందినట్లు శ్రీలంక అవినీతి నిరోధక కమిషన్ (CIABOC) కోర్టుకు తెలిపింది. రెండు సింగపూర్ ఖాతాల ద్వారా..దర్యాప్తు సంస్థల ప్రకారం.. శ్రీలంకకు చెందిన ఓ వ్యాపారి తన రెండు సింగపూర్ బ్యాంకు ఖాతాల ద్వారా నమల్ రాజపక్సేకు ఈ మొత్తాన్ని బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బు ఎయిర్‌బస్ డీల్‌లో ముడుపులుగా చెల్లించిన మొత్తంలో భాగమని అధికారులు కోర్టుకు వివరించారు. అయితే నమల్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నారు. ఐదు గంటలకు పైగా విచారణ..40 ఏళ్ల నమల్ రాజపక్సేను శుక్రవారం అవినీతి నిరోధక కమిషన్ ఐదు గంటలకు పైగా ప్రశ్నించింది. అనంతరం అరెస్టు చేసి కొలంబో చీఫ్ మేజిస్ట్రేట్ అసంగ బొదరగమ ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆయనను సెప్టెంబర్ 18 వరకు రిమాండ్‌కు పంపింది. నమల్ తరఫు న్యాయవాది బెయిల్ కోరినా కోర్టు నిరాకరించింది. మహింద రాజపక్సేను కూడా..ఈ ఎయిర్‌బస్ డీల్ వ్యవహారంలో నమల్ తండ్రి, మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను కూడా మే నెలలో అవినీతి నిరోధక అధికారులు ప్రశ్నించారు. ఆయన కూడా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపారు. అయితే రాజపక్సే కుటుంబం తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండిస్తూ.. ఇవన్నీ రాజకీయ కక్షతో చేస్తున్నవేనని చెబుతోంది. ఒకప్పుడు శ్రీలంక రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన రాజపక్సే కుటుంబానికి గత కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2022 ఆర్థిక సంక్షోభం సమయంలో ప్రజా ఆగ్రహం నేపథ్యంలో మహింద రాజపక్సే ప్రధాని పదవికి రాజీనామా చేయగా.. ఆయన సోదరుడు గోటబయ రాజపక్సే దేశం విడిచి వెళ్లి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో నమల్ రాజపక్సే కూడా మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు ఎయిర్‌బస్ ఒప్పందంలో రూ.7 కోట్ల లబ్ధి పొందారన్న ఆరోపణలపై నమల్ అరెస్టవ్వడం.. రాజపక్సే కుటుంబానికి మరో భారీ ఎదురుదెబ్బగా మారింది.ఇటు ఎయిర్‌బస్ సంస్థపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అధికారులు గతంలో జరిపిన దర్యాప్తులోనూ భారీ ముడుపుల వ్యవహారం వెలుగుచూసింది. 2020లో ఈ అవినీతి ఆరోపణల కేసును పరిష్కరించేందుకు ఎయిర్‌బస్ సుమారు 4 బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించేందుకు అంగీకరించింది. తాజా అరెస్టుతో శ్రీలంకలో రాజపక్సే కుటుంబానికి సంబంధించిన అవినీతి ఆరోపణలు మరోసారి రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.ఇదీ చదవండి: నా స్నేహితురాలికి అభినందనలు: మోదీ ట్వీట్ వైరల్ -
హ్యాట్రిక్ సహా 7 వికెట్లు.. చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్
మహిళల ఆసియా కప్‌లో శ్రీలంక మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇండోనేషియాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ చమారీ ఆటపట్టు బంతితో అసాధారణ ప్రదర్శన చేసి 5 పరుగులకే ఏకంగా 7 వికెట్లు పడగొట్టింది. అంతేకాకుండా చివరి మూడు వికెట్లను వరుస బంతుల్లో తీసి హ్యాట్రిక్ కూడా పూర్తి చేసింది.తద్వారా మహిళల టీ20ల్లో శ్రీలంక తరఫున తొలి హ్యాట్రిక్‌తో పాటు శ్రీలంక తరఫున మహిళల టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది. ఓవరాల్‌గా చూస్తే, మహిళల టీ20ల్లో ఇది ఐదో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (3.3-0-5-1)గా నిలిచింది. ఈ విభాగంలో అత్యుత్తమ రికార్డు బ్రెజిల్ బౌలర్ ఎల్ కార్డోసో (3-2-4-9) పేరిట ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. 125 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండోనేషియా చమారీ బౌలింగ్ దెబ్బకు కేవలం 49 పరుగులకే కుప్పకూలి, ఘోర పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆరో నంబర్ బ్యాటర్ నిలాక్షిక సిల్వ (50) అర్ద సెంచరీతో ఆదుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో అతి కష్టం మీద 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో నిలాక్షికతో పాటు సంజన కవిండి (15), కావ్యా కవిండి (15 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఇండోనేషియా బౌలర్లలో లూహ్ దేవి (3-32), సంగ్ మయ్ప్రియాణి (2-19) సత్తా చాటారు.అనంతరం స్వల్ప ఛేదనలో చమారీ ధాటికి ఇండోనేషియా విలవిలలాడింది. చమారీతో పాటు కావ్యా (1-14), సుగంధిక (3-1-3-1), కవష (3-0-2-1) వికెట్లు తీయడంతో ఇండోనేషియా ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు తరఫున కేవలం ఇద్దరు మాత్రమే 10 పరుగులకు మించి చేశారు. ఈ టోర్నీలో శ్రీలంక తమ తదుపరి, చివరి గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ గెలుపుతో శ్రీలంక గ్రూప్-బిలో టాపర్‌గా నిలిచింది. ఈ జట్టు తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో యూఏఈపై ఘన విజయం సాధించింది. చదవండి: భారత్ వేదికగా మహిళల చాంపియన్స్ ట్రోఫీ -
భారత్ వేదికగా మహిళల చాంపియన్స్ ట్రోఫీ
మహిళల క్రికెట్లో తొలిసారి నిర్వహించనున్న చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారత్‌కు ఆతిథ్య హక్కులను జారీ చేస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ముంబై, వడోదర వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీలో టాప్-6 టీమ్స్ తలపడనున్నాయి. అయితే తొలుత మహిళల తొలి చాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంక ఆతిథ్యమివ్వాల్సింది. కానీ ప్రస్తుతం శ్రీలంక పాలనా పరమైన సమస్యలతో సతమతమవుతున్న వేళ ఐసీసీ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక నుంచి భారత్‌కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో టోర్నీ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో జూలైలో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో లంకకు బదులుగా టోర్నీని బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, భారత్ రూపంలో మూడు ప్రతిపాదనలు చేసింది. తాజాగా ఐసీసీ బుధవారం భారత్‌కు ఆతిథ్య హక్కులు కట్టబెడుతూ తుది నిర్ణయం తీసుకుంది. జూలై 6 అర్హత కటాఫ్ తేదీ నాటికి ఐసీసీ మహిళల టీ20ఐ టీమ్ ర్యాంకింగ్స్‌లో తమ స్థానాల ప్రకారం అర్హత సాధించిన ఆ ఆరు జట్లు రౌండ్-రాబిన్ లీగ్‌లో పోటీపడతాయి. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్‌కు చేరుకుంటాయి. కటాఫ్ ర్యాంకింగ్స్ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంకలు తొలి చాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నాయి.India set to host the inaugural ICC Women's Champions Trophy 2027 from 14 to 28 February.The Cricket Club of India (CCI) in Mumbai and the Vadodara International Cricket Stadium will be the venues for the landmark tournament.More details here - https://t.co/PlDTCL9adC pic.twitter.com/NwM4zPrZk8— BCCI (@BCCI) September 2, 2026 A landmark moment for women’s cricket awaits. The dates and venues for the inaugural Women’s Champions Trophy in 2027 are now confirmed, as India prepares to welcome the world’s best teams from 14-28 February.Read more ➡️ https://t.co/QrY2iyDwyU pic.twitter.com/m7cWLxY8I8— ICC (@ICC) September 2, 2026Read: ఆసీస్‌తో సిరీస్‌కు పక్కనబెట్టారు.. కట్‌చేస్తే ట్రిపుల్ సెంచరీ -
శ్రీలంకకు అతి భారీ షాకిచ్చిన ఐసీసీ
శ్రీలంక క్రికెట్‌కు ఐసీసీ అతి భారీ షాకిచ్చింది. 2027 మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను ఆ దేశం నుంచి తొలగించింది. టోర్నీని మరో దేశానికి తరలించాలని ఐసీసీ నిర్ణయించినట్లు శ్రీలంక క్రికెట్ ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ కార్యదర్శి ప్రకాశ్ షాఫ్టర్ వెల్లడించారు.ఈ టోర్నీని 2027 ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు నిర్వహించాల్సి ఉండింది. ఇది తొలిసారిగా జరగనున్న మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి.శ్రీలంకపై చర్యలు ఎందుకు..?శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, బోర్డు పాలనలో సంస్కరణలు, ఎన్నికలు నిర్వహించడంలో ఆలస్యం వంటి అంశాలపై అసంతృప్తిగా ఉన్న ఐసీసీ, టోర్నీ ఆతిథ్య హక్కులను తొలగించింది. ఐసీసీ ఇటీవలే శ్రీలంక క్రికెట్ ప్రతినిధులను ఐసీసీ బోర్డు సమావేశానికి హాజరుకాకుండా ఆంక్షలు కూడా విధించింది.ఇదే తరహాలో 2024 అండర్-19 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను కూడా శ్రీలంక కోల్పోయింది. ఆ టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించారు.ఆడటం కూడా అనుమానమే..!ఆతిథ్య దేశ హోదాలో శ్రీలంకకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ లభించింది. ఇప్పుడు ఆతిథ్య హక్కులు కోల్పోవడంతో ఆ దేశ జట్టు టోర్నీలో పాల్గొనడం కూడా ప్రశ్నార్థకంగా మారింది.ప్రస్తుతం శ్రీలంక మహిళల జట్టు ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో ఉంది. టోర్నీలో టాప్-5 ర్యాంక్ జట్లతో పాటు ఆతిథ్య దేశం పాల్గొనే విధానం ఉంటే, శ్రీలంక ర్యాంకింగ్ ఆధారంగా అర్హత సాధించకపోవచ్చు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా టోర్నీకి అర్హత సాధించాయి. ఒకవేళ కొత్త ఆతిథ్య దేశం ఈ ఐదు జట్లలో ఒకటైతే, శ్రీలంక స్థానంలో ఆరో జట్టుగా వెస్టిండీస్‌కు అవకాశం దక్కవచ్చు. అదే టోర్నీకి ఆతిథ్యం వహించే దేశం టాప్-5లో లేని జట్టు అయితే, ఆ దేశానికి ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ లభిస్తుంది. చదవండి: 15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ -
Asia Cup 2026: రికార్డు విజయంతో శ్రీలంక బోణీ
మహిళల ఆసియా కప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక అద్భుత విజయంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో యూఏఈపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన శ్రీలంక, యూఏఈని కేవలం 79 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం 7.5 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల టీ20ల్లో బంతుల పరంగా శ్రీలంకకు ఇదే అతి భారీ విజయం. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు మరో 73 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి, రికార్డు విజయం నమోదు చేసింది.37 డాట్ బాల్స్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ.. మిథాలీ అయోధ్య (3.5-0-14-3), చేతన విముక్తి (4-0-16-3), సుగంధిక కుమారీ (4-0-18-2), చమారీ ఆటపట్టు (3-0-10-1), కవిష దిల్హరి (2-0-9-1) ధాటికి 19.5 ఓవర్లలో 79 పరుగులకే చాపచుట్టేసింది. యూఏఈ బ్యాటర్లు శ్రీలంక బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. తొలి 10 ఓవర్లలో ఏకంగా 37 డాట్ బాల్స్ పడ్డాయంటే పరిస్థితి ఎంత దారుణమో అర్దమవుతుంది.అరుదైన మైలురాయిని తాకిన లంక కెప్టెన్స్వల్ప లక్ష్యఛేదనలో శ్రీలంక మెరుపు వేగంతో ప్రారంభించింది. కెప్టెన్ చమారీ ఆటపట్టు 25 బంతుల్లో 48 పరుగులతో (7 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి, తన జట్టును గెలుపు తీరాలకు చేర్చింది. ఈ క్రమంలో చమారీ ఓ అరుదైన మైలురాయిని తాకింది. మహిళల ఆసియా కప్‌లో సిక్సర్‌తో 500 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది.నేడే భారత్ మ్యాచ్ఈ టోర్నీలో భారత్ ఇవాళ తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. చదవండి: నేడు బరిలోకి భారత మహిళలు -
గెలుపు చేజారె...
ప్రత్యర్థి ఆధిక్యం 16 పరుగులు మాత్రమే... మిగిలిన 4 వికెట్లు తీసేందుకు ఎంతో సమయం పట్టదు...ఆ తర్వాత ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించడమే మిగిలింది... సిరీస్‌ను 2–0తో క్లీన్ స్వీప్ చేయడం ఖాయం... రెండో టెస్టు చివరి రోజు మైదానంలోకి దిగే ముందు భారత టీమ్ మేనేజ్మెంట్తో పాటు సగటు అభిమాని కూడా బహుశా ఇదే తరహాలో అనుకొని ఉంటారు. కానీ శ్రీలంక మాత్రం భిన్నంగా ఆలోచించింది... యువ బ్యాటర్ సోనాల్ దినూషా అయితే అసాధారణ ఆటకు మారుపేరుగా నిలిచాడు. టీమిండియాకు విజయం దక్కకుండా అడ్డుగోడలా అతను మారగా... లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా పట్టుదలతో అండగా నిలిచారు. ఫలితంగా మ్యాచ్ ‘డ్రా’... సునాయాసంగా గెలుస్తుందనుకున్న టెస్టును బౌలింగ్ వైఫల్యం, వ్యూహాత్మక లోపాలతో చివరకు శుబ్‌మన్ గిల్ బృందం సమంగా ముగించాల్సి వచ్చింది. పేరుకు సిరీస్ 1–0తో భారత్ నెగ్గినా... వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) కోణంలో చూస్తే స్వయంకృతంతో విలువైన పాయింట్లు చేజార్చుకున్నట్లే!కొలంబో: తొలి రోజు నుంచి భారత్ ఆధిపత్యం ప్రదర్శించిన రెండో టెస్టు మ్యాచ్ చివరకు ‘డ్రా’గా ముగిసింది. గురువారం ముగిసిన ఈ పోరులో శ్రీలంక బ్యాటర్ల పోరాటంతో టీమిండియాకు విజయం చేజారింది. ఓవర్‌నైట్ స్కోరు 229/6తో చివరి రోజు ఆట కొనసాగించిన శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌ను 154 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 429 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సోనాల్ దినూషా (264 బంతుల్లో 133 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగగా, కెషారా నువాంతా (150 బంతుల్లో 46; 4 ఫోర్లు) రాణించాడు. 216 పరుగుల ఆధిక్యంతో లంక ఆట ముగించాక మిగిలిన 15 ఓవర్ల సమయంలో ఛేదన అసాధ్యం కాబట్టి ఇరు జట్ల ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’లతో మైదానం వీడారు. తొలి టెస్టు నెగ్గిన భారత్ 1–0తో సిరీస్ సొంతం చేసుకుంది. దినూషా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, మొత్తం 328 పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. లోయర్ ఆర్డర్ అండతో... 292 (48.4 ఓవర్లు)... శ్రీలంక 8, 9, 10, 11 స్థానాల బ్యాటర్లు కలిపి ఇన్ని బంతులు ఆడారంటే వారి ప్రతిఘటన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు! ఒకవైపు దినూషా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శనను కనబర్చగా, మరో ఎండ్‌నుంచి దక్కిన మద్దతు లంకను గట్టెక్కించింది. పిచ్ బాగా నెమ్మదించడంతో ఒక్కో వికెట్ కోసం భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దినూషా, నువాంతా ఏడో వికెట్‌కు 112 పరుగులు (246 బంతుల్లో) జోడించారు. ఆ తర్వాత ప్రభాత్ జయసూర్య (28 బంతుల్లో 2), లాహిరు కుమార (90 బంతుల్లో 12; 1 ఫోర్) భారత బౌలర్లను ఆటాడుకున్నాడు. టీ విరామం తర్వాత తొలి బంతికే దినూషా సెంచరీ (196 బంతుల్లో) పూర్తయింది. సిరీస్‌లో అతనికిది మూడో శతకం. ఎట్టకేలకు కుమారను కూడా భారత్ అవుట్ చేసినా... దినూషా, అసిత ఫెర్నాండో (24 బంతుల్లో 0 నాటౌట్) కలిసి అభేద్యంగా మరో 56 బంతులు ఆడి లాంఛనం ముగించారు.3 వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో (ఫాలోఆన్ ఆడుతూ) సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా దినూషా నిలిచాడు. గతంలో భారత ప్లేయర్ విజయ్ హజారే (1948లో అడిలైడ్‌లో ఆ్రస్టేలియాపై; 116, 145), జింబాబ్వే ప్లేయర్ ఆండీ ఫ్లవర్ (2001లో హరారేలో దక్షిణాఫ్రికాపై; 142, 199 నాటౌట్) ఈ ఫీట్ నమోదు చేశారు.1 శ్రీలంకను భారత్ 9 సార్లు ఫాలోఆన్ ఆడించగా... టీమిండియా గెలవకపోవడం ఇదే తొలిసారి.స్కోరు వివరాలు ; భారత్ తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్డ్; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 290; శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): ఉడారా (సి) సారాంశ్ (బి) సిరాజ్ 3; మిషారా (ఎల్బీ) (బి) జడేజా 32; సూర్యబండారా (స్టంప్డ్) పంత్ (బి) సుతార్ 92; కమిందు (సి) గిల్ (బి) ప్రసిధ్ 55; ధనంజయ (సి) పడిక్కల్ (బి) సుతార్ 23; దినూషా (నాటౌట్) 133; డిక్వెలా (ఎల్బీ) (బి) సారాంశ్ 6; నువాంతా (సి)జురేల్ (బి) సుతార్ 46; ప్రభాత్ (సి) జురేల్ (బి) జడేజా 2; లాహిరు కుమార (సి) జైస్వాల్ (బి) జడేజా 12; అసిత ఫెర్నాండో (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (154 ఓవర్లలో 9వికెట్లకు డిక్లేర్డ్) 429. వికెట్ల పతనం: 1–5, 2–63, 3–178, 4–209, 5–212, 6–218, 7–330, 8–355, 9–402. బౌలింగ్: ప్రసిధ్ 18.3–3–57–1, సిరాజ్ 15–7–26–1, సుతార్ 41–7–121–3, సారాంశ్ 37–4–98–1, జడేజా 38.3–4–94–3, గిల్ 2–0–8–0, జైస్వాల్ 1–0–9–0, జురేల్ 1–0–1–0. -
విజయానికి చేరువలో...
కొలంబో: శ్రీలంక పర్యటన ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్లు సాధించాలని పట్టుదలగా బరిలోకి దిగిన భారత జట్టు దాదాపుగా ఆ లక్ష్యాన్ని అందుకోవడం ఖాయమైంది. తొలి టెస్టులో గెలిచిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టులో కూడా విజయానికి చేరువైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం కోల్పోయి ‘ఫాలోఆన్’ ఆడిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో కొంత పట్టుదల కనబర్చింది. మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 72.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. పసిందు సూర్యబండారా (173 బంతుల్లో 92; 10 ఫోర్లు, 1 సిక్స్), కమిందు మెండిస్ (92 బంతుల్లో 55; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించారు.ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీ భాగస్వామ్యాలతో లంక కోలుకున్నట్లు కనిపించినా... కీలక సమయాల్లో భారత్ ఈ జోడీలను విడదీసి పట్టు సాధించింది. ప్రస్తుతం లంక 16 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. చివరి రోజు భారత బౌలర్లు చకచకా మిగిలిన నాలుగు వికెట్లు తీస్తే స్వల్ప లక్ష్య ఛేదన భారత్ ధనాధన్‌గా ముగించడం ఖాయం. వర్షం పడే అవకాశం ఉన్నా... గురువారం మొత్తం ఆ ప్రభావం ఉండకపోవచ్చు. దినూషా సెంచరీ... అంతకుముందు మరో 39 పరుగులు చేసి ఫాలోఆన్ తప్పించుకునే లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ఆ ప్రయత్నంలో సఫలం కాలేకపోయింది. ఓవర్‌నైట్ స్కోరు 265/8తో ఆట కొనసాగించిన లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 89.4 ఓవర్లలో 290 పరుగులకు ఆలౌటైంది. మొత్తం 6 ఓవర్లు ఎదుర్కొన్న జట్టు 25 పరుగులు జోడించి మిగిలిన 2 వికెట్లు కోల్పోయింది. సోనాల్ దినూషా (162 బంతుల్లో 103; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సిరీస్‌లో వరుసగా రెండో సెంచరీని పూర్తి చేసుకోగా... ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. 213 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన భారత్...ఆతిథ్య జట్టును ఫాలోఆన్ ఆడించింది. వర్షం ఇబ్బంది కలిగించడంతో నాలుగో రోజు మొత్తం 78.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. కీలక భాగస్వామ్యాలు... శ్రీలంక రెండో ఇన్నింగ్స్ కూడా తడబడుతూనే మొదలైంది. సిరాజ్ తన రెండో ఓవర్లోనే ఉడారా (3)ను అవుట్ చేసి తొలి వికెట్ అందించాడు. అయితే సూర్యబండార, కామిల్ మిషారా (39 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా స్వీప్, రివర్స్ స్వీప్‌లతో భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 68 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు. 17 పరుగుల వద్ద సూర్యబండారా ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను సిరాజ్ వదిలేయడం కూడా లంకకు కొంత కలిసొచ్చింది. మరోసారి స్వీప్ షాట్‌కు యత్నించి జడేజా బౌలింగ్‌లో మిషారా అవుట్ కాగా... కమిందు సహచరుడికి అండగా నిలిచాడు. 78 బంతుల్లో బండారా హాఫ్ సెంచరీ పూర్తయింది. సుతార్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్స్‌లు బాదిన కమిందు... ప్రసిధ్ ఓవర్లోనూ ఫోర్, సిక్స్ కొట్టి దూకుడు ప్రదర్శించాడు. 87 బంతుల్లో అతను అర్ధ సెంచరీను అందుకున్నాడు. ఎట్టకేలకు ప్రసిధ్ బౌలింగ్‌లోనే గిల్ అద్భుత క్యాచ్‌తో కమిందు వెనుదిరగడంతో ఈ శతక భాగస్వామ్యం ముగిసింది. టీ విరామానికి లంక 199/3తో మెరుగైన స్థితిలోనే కనిపించింది. అయితే మూడో సెషన్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 9 పరుగుల వ్యవధిలో జట్టు 3 వికెట్లు కోల్పోయింది. సుతార్ తన వరుస ఓవర్లలో కెపె్టన్ ధనంజయ (23), సూర్యబండారాలను అవుట్ చేసి దెబ్బ కొట్టగా, డిక్వెలా (6)ను సారాంశ్ జైన్ పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత వర్షం కూడా ఆదుకోవడంతో లంక జాగ్రత్తగా మరో 8.2 ఓవర్లు ఆడి వికెట్ కోల్పోకుండా రోజును ముగించింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్డ్; శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 290; శ్రీలంక రెండో ఇన్నింగ్స్: ఉడారా (సి) సారాంశ్ (బి) సిరాజ్ 3; మిషారా (ఎల్బీ) (బి) జడేజా 32; సూర్యబండారా (స్టంప్డ్) పంత్ (బి) సుతార్ 92; కమిందు (సి) గిల్ (బి) ప్రసిధ్ 55; ధనంజయ (సి) పడిక్కల్ (బి) సుతార్ 23; దినూషా (బ్యాటింగ్) 7; డిక్వెలా (ఎల్బీ) (బి) సారాంశ్ 6; నువాంతా (బ్యాటింగ్) 3; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (72.4 ఓవర్లలో 6 వికెట్లకు) 229. వికెట్ల పతనం: 1–5, 2–63, 3–178, 4–209, 5–212, 6–218. బౌలింగ్: ప్రసిధ్ 10–1–31–1, సిరాజ్ 9–4–11–1, సుతార్ 18–2–81–2, సారాంశ్ 17.4–3–55–1, జడేజా 18–2–48–1. -
శాసించేది మనమే!
కొలంబో: ఆహ్వానం లేని అతిథిగా వరుణుడు వస్తూ పోతున్నా... భారత బౌలర్లు సహనం కోల్పోకుండా సత్తా చాటారు. కీలకదశలో శ్రీలంక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించి రెండో టెస్టును శాసించే స్థితిలో టీమిండియాను నిలిపారు. వర్షం, వెలుతురు లేమి కారణంగా వరుసగా మూడో రోజు కూడా పూర్తి ఓవర్లు సాధ్యపడలేదు. ఓవర్‌నైట్ స్కోరు 8/2తో మంగళవారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన శ్రీలంక జట్టు వర్షం కారణంగా ఆటను నిలిపి వేసే సమయానికి 83.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు సాధించింది. పసిందు సూరియబండారా (80; 9 ఫోర్లు), తొలి టెస్టు సెంచరీ హీరో సోనాల్ దినుషా (85 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో శ్రీలంక జట్టును ఆదుకున్నారు. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే శ్రీలంక మరో 39 పరుగులు సాధించాలి. దినుషాతో కలిసి లాహిరు (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. నాలుగో రోజు ఆరంభంలోనే శ్రీలంకను ఆలౌట్ చేస్తే భారత్ ఈ మ్యాచ్‌పై పూర్తి పట్టుబిగించవచ్చు. ఆ తర్వాత భారత్ చకచకా పరుగులు సాధించి లంకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంటుంది.ధాటిగా ఆడి...మూడో రోజు తొలి సెషన్ ఆరంభంలోనే శ్రీలంకకు దెబ్బ పడింది. ఇన్నింగ్స్ పదో ఓవర్లో ఓపెనర్ మిషారాను ప్రసిధ్ అవుట్ చేశాడు. 35/3తో ఎదురీదుతున్న లంకను పసిందు సూరియబండారా, కామిందు మెండిస్ (58 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నారు. వీరిద్దరు ధాటిగా ఆడుతూ నిలకడగా పరుగులు సాధించారు. నాలుగో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. క్రీజులో నిలదొక్కుకుంటున్న కామిందును ప్రసిధ్ అవుట్ చేసి మళ్లీ లంకను కష్టాల్లోకి నెట్టాడు. గాయపడ్డ రిషబ్ పంత్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చన సర్ఫరాజ్ ఖాన్, బౌలర్ సిరాజ్‌లతో శ్రీలంక బ్యాటర్లు వాగ్వాదం చేశారు. లంచ్ సెషన్లో 122 పరుగులు చేసిన శ్రీలంక రెండో సెషన్లో తడబడింది. కెప్టెన్ ధనంజయ డిసిల్వా (8) విఫలంకాగా ... సెంచరీపై కన్నేసిన పసిందును జడేజా బౌల్డ్ చేశాడు. డిక్వెలాను సిరాజ్ ఖాతా తెరవనివ్వలేదు. దాంతో 122/3తో కోలుకున్నట్లు కనిపించిన శ్రీలంక 173/7తో మళ్లీ కష్టాల్లో పడింది. శ్రీలంక ఇన్నింగ్స్ ముగియడానికి ఎక్కువ సమయం పట్టదేమోనని అనుకున్నా... నువాంతా (74 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్), దినుషా మొండిపట్టుదలతో ఆడారు. ఒకవైపు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ మరోవైపు పరుగులు సాధించారు. ఈ క్రమంలో దినుషా 82 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ విరామానికి లంక స్కోరు 216/7. చివరి సెషన్లో నువాంతాను సుతార్ అవుట్ చేసినా... లాహిరు కుమారతో కలిసి దినుషా తొమ్మిదో వికెట్‌కు 35 పరుగులు జత చేసి శ్రీలంక స్కోరును 250 పరుగులు దాటించాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్డ్; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: ఉడారా (సి) జైస్వాల్ (బి) ప్రసిధ్ కృష్ణ 1; కమిల్ (సి) జురేల్ (బి) ప్రసిధ్ కృష్ణ 19; ప్రభాత్ జయసూరియ (ఎల్బీడబ్ల్యూ) (బి) సుతార్ 2; పసిందు సూరియబండారా (బి) జడేజా 80; కామిందు మెండిస్ (సి) జడేజా (బి) ప్రసిధ్ కృష్ణ 32; ధనంజయ డిసిల్వా (సి) కేఎల్ రాహుల్ (బి) మానవ్ సుతార్ 8; సోనాల్ దినుషా (బ్యాటింగ్) 85; డిక్వెల్లా (సి) జురేల్ (బి) సిరాజ్ 0; కేషారా నువాంతా (సి) సారాంశ్ జైన్ (బి) మానవ్ సుతార్ 18; లాహిరు కుమార (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (83.4 ఓవర్లలో 8 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–35, 4–122, 5–137, 6–171, 7–173, 8–230. బౌలింగ్: సిరాజ్ 11–0– 33–1, ప్రసిధ్ కృష్ణ 14–1–47–3, మానవ్ సుతార్ 21–1–83–3, సారాంశ్ జైన్ 18–5– 51–0, రవీంద్ర జడేజా 19.4–4–45–1. -
IND VS SL: టీమిండియాకు బ్యాడ్ న్యూస్
టీమిండియాకు చేదు వార్త. కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆటకు వర్షం ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రెండో రోజు మ్యాచ్‌కు పలుమార్లు వర్షం, మేఘావృత వాతావరణం అంతరాయం కలిగించింది.మంగళవారం ఉదయం కొలంబోలో ఆకాశం మేఘావృతంగా ఉండటంతో పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఉష్ణోగ్రత సుమారు 31 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుండగా, ఉదయం వర్షం పడే అవకాశం 82 శాతంగా ఉంది. మధ్యాహ్నం కూడా వర్ష సూచనలు కొనసాగనున్నాయి. ఆ సమయంలో వర్షం పడే అవకాశం 56 శాతంగా అంచనా వేశారు.సాయంత్రం పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం 86 శాతంగా ఉండటంతో పాటు మేఘావృతం 98 శాతం, తేమ 79 శాతం వరకు ఉండొచ్చని అంచనాలు చెబుతున్నాయి.జురెల్ శతకంతో భారత్ భారీ స్కోరుమ్యాచ్ విషయానికొస్తే భారత్ పూర్తి ఆధిపత్యంలో ఉంది. రెండో రోజు ధ్రువ్ జురెల్ అద్భుత శతకంతో భారత్ 503/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జురెల్ 171 బంతుల్లో 9 ఫోర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.రిషభ్ పంత్ 63 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, జురెల్‌తో కలిసి ఏడో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి 8/2తో రెండో రోజు ఆటను ముగించింది.ప్రస్తుతం శ్రీలంక 495 పరుగుల భారీ లోటుతో ఉంది. భారత్ ఇప్పటికే మ్యాచ్‌పై పట్టు సాధించిన నేపథ్యంలో మూడో రోజు వర్షం ఎంత మేరకు ఆటను ప్రభావితం చేస్తుందన్నది కీలకంగా మారింది.పడిక్కల్ శతకంవన్డౌన్ బ్యాటర్ పడిక్కల్ వరుసగా రెండో టెస్ట్‌లోనూ సెంచరీ చేశాడు. తొలి టెస్ట్‌లో భారీ శతకం చేసిన అతడు.. రెండో మ్యాచ్ తొలి రోజే సెంచరీ (117) పూర్తి చేశాడు. జురెల్, పడిక్కల్ సెంచరీలతో కదంతొక్కగా.. పంత్‌తో పాటు కెప్టెన్ గిల్ (50) కూడా అర్ద సెంచరీతో రాణించాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45), రవీంద్ర జడేజా (43) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.ఆధిక్యంలో భారత్‌కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత్ తొలి టెస్ట్‌లో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
జురేల్ జిగేల్...
కొలంబో: శ్రీలంకతో సిరీస్‌కు ముందు వరుసగా విఫలమవుతూ ఒత్తిడిని ఎదుర్కొన్న ధ్రువ్ జురేల్ ఇప్పుడు ఆరో స్థానంలో బ్యాటర్‌గా తన సమర్థతను చూపించాడు. తొలి టెస్టులో అర్ధ సెంచరీతో రాణించిన అతను ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ శతకంతో కదం తొక్కాడు. అతనికి రిషభ్ పంత్ మెరుపులు తోడవడంతో భారీ స్కోరు నమోదు చేసిన భారత్... 11 బంతుల వ్యవధిలో 2 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ కొట్టింది. రెండో రోజు వెలుతురులేమితో ఆట నిలిపివేసే సమయానికి శ్రీలంక 3 ఓవర్లలో 2 వికెట్లకు 8 పరుగులు చేసింది. మ్యాచ్‌కు రెండో రోజు వర్షం పదే పదే అంతరాయం కలిగించడంతో మొత్తం 56 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 300/5తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 138 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ధ్రువ్ జురేల్ (177 బంతుల్లో 115 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్లో రెండో టెస్టు సెంచరీ సాధించగా, రిషభ్ పంత్ (89 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 112 పరుగులు జోడించారు. లంక పేసర్ అసిత ఫెర్నాండోకు 4 వికెట్లు దక్కాయి. పంత్ హాఫ్ సెంచరీ... సోమవారం ఆట మొదలయ్యాక రెండో ఓవర్లోనే సారాంశ్ జైన్ (6) వెనుదిరిగాడు. ముందు రోజు మణికట్టు గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన పంత్ మళ్లీ బరిలోకి దిగి జురేల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చక్కటి సమన్వయంతో ఆడుతూ పరుగులు రాబట్టిన వీరిద్దరిని నిలువరించడంలో లంక బౌలర్లు విఫలమయ్యారు. ఈ క్రమంలో తనదైన శైలిలో దూకుడుగా ఆడిన పంత్ ముందుగా 81 బంతుల్లో, తర్వాతి ఓవర్లో జురేల్ 97 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. అయితే లంచ్ తర్వాత తొలి బంతికే పంత్ అవుట్ కాగా, మానవ్ సుతార్ (18) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో జాగ్రత్తగా ఆడుతూ జురేల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వానతో సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఆట మళ్లీ మొదలయ్యాక ఫెర్నాండో బౌలింగ్‌లో మిడాఫ్ దిశగా సింగిల్ తీయడంతో 171 బంతుల్లో జురేల్ శతకం పూర్తయింది. మరో ఎండ్‌లో సిరాజ్ (3) అవుట్ కాగా, స్కోరు 500 దాటిన తర్వాత భారత్ డిక్లేర్ చేసింది.వెలుతురుపై వివాదంతో... శ్రీలంక ఇన్నింగ్స్ మొదలైన రెండు బంతులకే వర్షం వచ్చింది. అయితే దాదాపు అరగంట తర్వాత మళ్లీ ఆట మొదలు కాగా, ప్రసిధ్ కృష్ణ తన రెండో బంతికే ఉడారా (1)ను వెనక్కి పంపించాడు. వెలుతురు తగ్గడంతో లైట్ మీటర్‌తో పరీక్షించిన అంపైర్లు పేసర్లు బౌలింగ్ వేయరాదని, స్పిన్‌తో కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఆటను నిలిపివేయాలంటూ లంక బ్యాటర్లు పదే పదే అంపైర్లతో వాదించినా వారు పట్టించుకోలేదు. సుతార్ తన తొలి ఓవర్ చివరి బంతికి ప్రభాత్ జయసూర్య (2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లంక బ్యాటర్ రివ్యూ చేసినా లాభం లేకపోగా, డ్రెస్సింగ్ రూమ్‌లో అతను తన ఆగ్రహాన్ని ప్రదర్శించడం కనిపించింది. వెలుతురు తగ్గిన స్థితిలో సుతార్ వేసిన ఈ బంతి సిరీస్‌లో స్పిన్నర్లు వేసిన 1958 బంతుల్లో అన్నింటికంటే వేగవంతమైంది (98.85 కిమీ./గం.) కావడం విశేషం!స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఫెర్నాండో 45; రాహుల్ (సి) డిక్వెలా (బి) కుమార 18; పడిక్కల్ (బి) నువాంతా 117; గిల్ (సి) డిక్వెలా (బి) ఫెర్నాండో 50; పంత్ (సి) ఉడారా (బి) నువాంతా 63; జడేజా (బి) ఫెర్నాండో 43; జురేల్ (నాటౌట్) 115; సారాంశ్ (సి) మిషారా (బి) ఫెర్నాండో 6; సుతార్ (సి) డిక్వెలా (బి) జయసూర్య 18; సిరాజ్ (ఎల్బీ) (బి) జయసూర్య 3; ప్రసిధ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (138 ఓవర్లలో 9 వికెట్లకు డిక్లేర్డ్) 503. వికెట్ల పతనం: 1–37, 2–66, 3–207, 4–281, 5–296, 6–307, 7–419, 8–458, 9–489. బౌలింగ్: అసిత ఫెర్నాండో 29–5–106–4, లాహిరు కుమార 20–4–68–1, ప్రభాత్ 42–7–132–2, నువాంతా 38–3–154–2, దినూషా 3–0–8–0, ధనంజయ 2–0–8–0, మిషారా 4–0–16–0. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: ఉడారా (సి) జైస్వాల్ (బి) ప్రసిధ్ 1; మిషారా (బ్యాటింగ్) 5; జయసూర్య (ఎల్బీ) (బి) సుతార్ 2; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (3 ఓవర్లలో 2 వికెట్లకు) 8. వికెట్ల పతనం: 1–1, 2–8. బౌలింగ్: సిరాజ్ 1–0–1–0, ప్రసిధ్ 1–0–1–1, సుతార్ 1–0–6–1.జైస్వాల్, ఫెర్నాండోలపై చర్యటెస్టు మ్యాచ్ తొలి రోజు గొడవకు దిగిన భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్, లంక పేసర్ అసిత ఫెర్నాండోలపై ఐసీసీ చర్య తీసుకుంది. జైస్వాల్‌ను అవుట్ చేసిన ఫెర్నాండో ఏదో అనడంలో జైస్వాల్ తగ్గకుండా వెనక్కి వచ్చి అతనిపైకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో జైస్వాల్ హెల్మెట్ ఫెర్నాండో తలను తాకింది. ఈ ఘటనను లెవల్ 1 తప్పిదంగా గుర్తించిన ఐసీసీ... ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతాన్ని జరిమానాగా విధించింది. దీంతో పాటు ఇద్దరు ఆటగాళ్ల ఖాతాలో ఒక్కో డీమెరిట్ పాయింట్ కూడా చేరింది. -
పడిక్కల్ పరుగుల ప్రవాహం
వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ వరుసగా రెండో సెంచరీతో విజృంభించడంతో... శ్రీలంకతో రెండో టెస్టులో భారత జట్టు మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది. పడిక్కల్ ప్రతాపానికి శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ సహకారం తోడవడంతో తొలిరోజు టీమిండియా ఆధిపత్యం కనబర్చగా... సంప్రదాయానికి విరుద్ధంగా పేస్ పిచ్‌ను సిద్ధం చేసిన శ్రీలంక తొలి రోజు ఐదు వికెట్లు పడగొట్టింది. మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ వికెట్ స్పిన్‌కు సహకరించనున్న నేపథ్యంలో టీమిండియా ఎంత స్కోరు చూస్తుందో చూడాలి! కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ అదే దూకుడు కనబరిచింది. ఆదివారం ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు... తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (193 బంతుల్లో 117; 12 ఫోర్లు) మరో సెంచరీతో కదంతొక్కాడు. గిల్ (108 బంతుల్లో 50; 6 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45; 9 ఫోర్లు), రవీంద్ర జడేజా (43; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కేఎల్ రాహుల్ (18) విఫలం కాగా... వికెట్ కీపర్ రిషబ్ పంత్ (3) గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే భిన్నమైన పిచ్‌ను సిద్ధం చేసిన శ్రీలంక... దాన్ని కాస్త సద్వినియోగం చేసుకోగలిగింది. గాయం నుంచి కోలుకున్న పంత్ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండగా... జురేల్ (7 బ్యాటింగ్), సారాంశ్ జైన్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వరుసగా రెండో శతకం... రెండేళ్ల విరామం తర్వాత భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకొని... గత టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న పడిక్కల్ ఈ మ్యాచ్‌లోనూ దుమ్మురేపాడు. గాలేలో ఎక్కడ ఆపాడో... కొలంబోలో అక్కడి నుంచే ప్రారంభించాడు. శ్రీలంక ఫీల్డర్ల తప్పిదాలతో రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆచితూచి ఆడుతూ ముందుకు సాగాడు. అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్ తరహాలో వీలుచిక్కినప్పుడు బౌండరీలు బాదుతూ స్ట్రయిక్ రొటేషన్‌పై ప్రధానంగా దృష్టి పెట్టాడు.ఒక దశలో గిల్ వేగంగా పరుగులు చేస్తుంటే మరో ఎండ్‌లో సంయమనం పాటించిన పడిక్కల్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. రాహుల్ ఎక్కువసేపు నిలవలేపోగా ... జైస్వాల్ మరోసారి మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఈ దశలో గిల్‌తో కలిసి పడిక్కల్ మూడో వికెట్‌కు 120 పరుగులు జోడించాడు.హాఫ్‌సెంచరీ పూర్తయ్యాక గిల్ అవుట్ కాగా... లహిరు బౌలింగ్‌లో పంత్ రిటైర్డ్ హర్ట్‌గా క్రీజు వీడాడు. పిచ్ బౌన్స్‌కు సహకరిస్తుండటంతో శ్రీలంక పేసర్లు షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పెట్టినా పడిక్కల్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. జడేజా సహకారంతో 168 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్ కాసేపటికి అవుటయ్యాడు. తొలి రోజు చివరి ఓవర్లో జడేజా కూడా అవుటవ్వడంతో లంక సంతృప్తికరంగా రోజును ముగించింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఫెర్నాండో 45; రాహుల్ (సి) డిక్వెలా (బి) లహిరు కుమారా 18; పడిక్కల్ (బి) కేషారా నువాంతా 117; గిల్ (సి) డిక్వెలా (బి) ఫెర్నాండో 50; పంత్ (రిటైర్డ్ హర్ట్) 3; జడేజా (బి) ఫెర్నాండో 43; జురేల్ (బ్యాటింగ్) 7; సారాంశ్ (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (85 ఓవర్లలో 5 వికెట్లకు) 300. వికెట్ల పతనం: 1–37, 2–66, 3–186, 4–281, 5–296. బౌలింగ్: ఫెర్నాండో 16–5–46–3; లహిరు 13–4–38–1; జయసూర్య 27–4–90–0; కేషారా 22–0–93–1; దినుషా సోనాల్ 1–0–2–0; ధనంజయ 2–0–8–0; కమిల్ 4–0–16–0. -
సిరీస్‌పై గురి
కొలంబో: సమష్టి ప్రదర్శనతో శ్రీలంకపై తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టు రెండో పోరుకు సిద్ధమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ప్రారంభం కానున్న చివరి టెస్టులోనూ గెలిచి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరువవ్వాలనే లక్ష్యంతో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరనుంది. 2023 జూలై తర్వాత భారత జట్టు విదేశీ గడ్డపై టెస్టు సిరీస్ విజయం సాధించలేదు. ఇక సొంతగడ్డపై కూడా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్‌లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో లంకపై మరోసారి సంపూర్ణ ఆధిపత్యం కనబర్చి మూడేళ్ల తర్వాత విదేశీ గడ్డపై సిరీస్ ముద్దాడాలని టీమిండియా భావిస్తోంది. తొలి టెస్టులో దేవదత్ పడిక్కల్ భారీ సెంచరీతో కదం తొక్కగా... కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, రిషభ్ పంత్ అర్ధ శతకాలతో రాణించారు. బ్యాటింగ్ ఆర్డర్లో కెపె్టన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు. ఈ నేపథ్యంలో వారిద్దరు కూడా ఈ మ్యాచ్‌లో రాణిస్తే భారత బెంగ తీరనుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న గిల్... ప్రాక్టీస్‌లో ఈ అంశంపై ప్రధానంగా దృష్టి సారించాడు. ఇక గత ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధ శతకం మాత్రమే చేసిన యశస్విపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కొలంబోలో పేస్ పిచ్! గత మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపని కుల్దీప్ యాదవ్ స్థానంలో సారాంశ్ జైన్‌కు తుది జట్టులో అవకాశం కల్పిస్తారా లేక... విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగిస్తారా చూడాలి. తొలి టెస్టులో 25 ఓవర్లు వేసి ఒక్క వికెట్ మాత్రమే తీసిన కుల్దీప్ నెట్స్‌లోనూ ఎక్కువ సాధన చేయకపోయినా... ఒక్క మ్యాచ్‌తో అతడి ప్రతిభను అంచనా వేయొద్దని టీమ్ మేనేజ్మెంట్ పేర్కొంది. గత మ్యాచ్‌లో 10 వికెట్లతో సత్తా చాటిన మానవ్ సుతార్ మరోసారి కీలకం కానుండగా... రవీంద్ర జడేజా అటు బ్యాట్‌తో, ఇటు బంతితో మరింతగా రాణించాల్సిన అవసరముంది.గాలేతో పోల్చుకుంటే కొలంబో పిచ్ ఆరంభంలో కాస్త పేస్‌కు సహకరించనున్న నేపథ్యంలో సిరాజ్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఆశించవచ్చు. మరోవైపు గత పదేళ్లలో టీమిండియాపై ఇంటా బయట సిరీస్ గెలవని శ్రీలంక జట్టు... ఈ సారైనా సిరీస్‌ను ‘డ్రా’ చేయాలని పట్టుదలగా ఉంది. గాలెలో స్పిన్ పిచ్‌ను సిద్ధం చేసి భంగపడ్డ ఆతిథ్య శ్రీలంక ఈ సారి కాస్త మెరుగైన పిచ్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. బ్యాటింగ్‌లో సొనాల్ దినుషా, నిరోషన్ డిక్వెలా, ధనంజయ డిసిల్వా, కమిల్ మిషారాపై ఆ జట్టు భారీ అశలు పెట్టుకుంది. గత మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయిన ప్రభాత్ జయసూర్య కొలంబోలో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేదానిపైనే లంక విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పిచ్ ఆరంభంలో పేసర్లకు ఆ తర్వాత స్పిన్నర్లకు సహకరించనుండగా... మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు తక్కువ. -
జలఖండన పర్వదినం
సంస్కృతి, ఆధ్యాత్మికతతో ముడిపడినటువంటి ‘కాండీ ఎసల పెరహెర వేడుకలు’ శ్రీలంకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 18 నుంచి 28 వరకు సాగే ఈ వేడుకలను మొత్తం 10 రాత్రులు, 11 రోజులు పాటు అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఊరేగింపులు, కళాకారుల ప్రదర్శనలు, అలంకరణలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో తుది ఘట్టమైన ‘రాందోళి పెరహెర’ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కాండీ ఎసల పెరహెర ఉత్సవాల తేదీలు ప్రతి సంవత్సరం మారుతున్నప్పటికీ, ఈ పండుగ నిర్వహణ ఎప్పుడూ ఒకేలా సాగుతుంది. ఈ సంబరాలు ప్రధానంగా మూడు ఘట్టాలుగా కొనసాగుతాయి. ఉత్సవాల్లో ప్రారంభ క్రతువు కప్ సిటువీమ. ఈ వేడుకలు శ్రీ దళదా మాలిగావా (బుద్ధుని పవిత్ర దంత అవశేషం ఉన్న దేవాలయం) ప్రాంగణంలో ప్రారంభమవుతాయి. ఉత్సవ ప్రారంభానికి సూచికగా ఆలయ ప్రాంగణంలో ఒక పవిత్ర వృక్షాన్ని నాటుతారు. ఇది ప్రధానంగా మతపరమైన ఆచారం అయినప్పటికీ, పెరహెర సీజ¯Œ కు ఇది అధికారిక ప్రారంభ ఘట్టంగా నిలుస్తుంది.ఉత్సవాల్లో రెండో ఘట్టం కుంభాల్ పెరహెర. పండుగ మొదటి ఐదు రాత్రులను ‘కుంభాల్ పెరహెర’ అని పిలుస్తారు. ఈ ప్రారంభ ఊరేగింపులు పరిమాణంలో కాస్త చిన్నవిగా, సంప్రదాయబద్ధంగా సాగుతాయి. ఎక్కువ రద్దీ లేకుండా పండుగ వాతావరణాన్ని ప్రశాంతంగా ఆస్వాదించడానికి ఇవి చక్కటి అవకాశం. ఈ రాత్రులలో సంప్రదాయ కాండియన్ నృత్యకారులు, కొరడా ఝళిపించే ప్రదర్శకులు, మేళతాళాల వాయిద్యకారులు, అలంకరించిన ఏనుగులు, దివిటీలు పట్టిన సేవకులు పాల్గొంటారు.మూడో ఘట్టం రాందోళి పెరహెర. అంటే మహా ఊరేగింపులు. ఆఖరి ఐదు రాత్రులను ‘రాందోళి పెరహెర’ అని పిలుస్తారు. పండుగ మొత్తంలోనే అత్యంత అద్భుతంగా, వైభవంగా సాగే రాత్రులు ఇవే! ఈ ఊరేగింపులు జరిగేటప్పుడు కాండీ నగర వీథులు వేలాదిమంది భక్తులతో, పర్యాటకులతో నిండిపోతాయి. వందలాది మంది నృత్యకారులు, కళాకారులు, వాద్యకారుల బృందాలు, రాత్రి ఆకాశాన్ని కాంతులతో నింపే అగ్ని విన్యాసకులు, విద్యుత్ దీపాలతో ప్రకాశించే వస్త్రాలు ధరించిన గజరాజులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి కాండీ పెరహెరకే అత్యంత ముఖ్యమైన ఘట్టాలు కావడంతో అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ఉత్సవాల్లో చివరి ఊరేగింపు రాత్రి వేకువ జామున జరిగే వేడుక దహవల్ పెరహెర. ఇందులో భాగంగా మహావలి నది ఒడ్డున జరిగే ‘దియా–కెపీమ’ అంటే ‘జలఖండన’ కార్యక్రమంతో ఎసల పెరహెర ముగుస్తుంది. ఇందులో భాగంగా నదీ జలాలను లాంఛనప్రాయంగా ఖండించినట్లు నీళ్లల్లో కత్తులను తాటిస్తారు. ఈ క్రతువును వీక్షించేందుకు సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు. శ్రీలంకలో జరిగే ప్రసిద్ధ ‘కాండీ ఎసల పెరహెర’ ఉత్సవం కేవలం ఒక సాంస్కృతిక ప్రదర్శన మాత్రమే కాదు. ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం. గౌతమ బుద్ధుని పవిత్ర దంత అవశేషానికి అత్యంత భక్తిశ్రద్ధలతో గౌరవం అర్పిస్తూ, దేశానికి సమృద్ధిగా, సమయానుకూల వర్షాలు, ప్రజలకు శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ చారిత్రాత్మక వేడుక శ్రీలంక బౌద్ధ సంస్కృతి విశిష్టతను ప్రపంచానికి చాటిచెబుతోంది. ∙ రమా జంబుల -
ముమ్మర సాధన.. ప్రాక్టీస్‌కు వాళ్లిద్దరు డుమ్మా!
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత క్రికెట్ జట్టు... రెండో మ్యాచ్ కోసం సాధన ప్రారంభించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలంటే ప్రతీ మ్యాచ్‌లో విజయం కీలకం కాగా... భారత ప్లేయర్లు లోపాలను సరిదిద్దుకునే పనిలో పడ్డారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలేలో జరిగిన తొలి టెస్టులో సంపూర్ణ ఆధిపత్యంతో గెలుపొందిన టీమిండియా... ఆదివారం నుంచి లంకతో రెండో టెస్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే పర్యవేక్షణలో జట్టు సభ్యులు ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ లెఫ్టార్మ్ స్పిన్నర్లలను ఎదుర్కోవడంపై ప్రధాన దృష్టి పెట్టాడు. తొలి టెస్టులో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 16, 8 పరుగులతో నిరాశ పరిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఎడంచేతివాటం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లోనే అతడు అవుటయ్యాడు. దీంతో లోపాలను అధిగమించేందుకు నెట్స్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంపై గిల్ ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. ఇప్పటి వరకు ఆడిన 42 టెస్టుల్లో గిల్ 11 సార్లు లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో అవుటయ్యాడు.శుక్రవారం సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ నెట్స్‌లో మానవ్ సుతార్, రవీంద్ర జడేజాతో పాటు పలువురు స్థానిక లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో గిల్ సాధన చేశాడు. గిల్ ప్రాక్టీస్‌ను సాయిరాజ్ బహుతులే ప్రత్యేకంగా పర్యవేక్షించాడు. ‘గిల్ నిరంతరం పరుగులు రాబట్టడాన్ని ఇష్టపడతాడు. గత మ్యాచ్‌లో అది సాధ్యపడలేదు. దీంతో వెంటనే ఆ లోపాన్ని అధిగమించేందుకు సిద్ధమయ్యాడు. పరిస్థితులకు తగ్గట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు’ అని బహుతులే వెల్లడించాడు. ఇక కుడిచేతివాటం ఆఫ్ స్పిన్నర్లపై గిల్‌కు మంచి రికార్డు ఉంది. కేఎల్ రాహుల్, కుల్దీప్ గైర్హాజరు తొలి టెస్టులో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శుక్రవారం ప్రాక్టీస్‌కు దూరంగా ఉండిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కండరాలు పట్టేసి ఇబ్బంది పడిన రాహుల్... రెండో టెస్టులో భారీ ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తున్నాడు. లంకతో మొదటి టెస్టులో అతడు వరుసగా 82, 35 పరుగులు చేశాడు. గతంలోనే శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులో సభ్యుడైన రాహుల్... తన అనుభవాన్నంతా రంగరించి స్పిన్ ఉచ్చును చేధించడంతోనే భారత్ తొలి మ్యాచ్‌లో సులువుగా గెలుపొందింది. అతడితో పాటు తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్రాక్టీస్ చేయలేదు. ఆటగాళ్లు కసరత్తులు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న కుల్దీప్... అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయకుండానే మైదానాన్ని వీడాడు. సారాంశ్ జైన్ కొన్ని ఓవర్లు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతడి బౌలింగ్‌లో పంత్, గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ‘రాహుల్, కుల్దీప్ విశ్రాంతి తీసుకుంటున్నారు’ అని బహుతులే పేర్కొన్నాడు. -
పాకిస్తాన్ పర్యటనకు శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు.. షెడ్యూల్ విడుదల
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సొంత గడ్డపై వరుస సిరీస్‌లను నిర్వహించేందుకు సిద్ధమైంది. శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు ఈ ఏడాది అక్టోబర్‌లో పాక్ పర్యటనకు రానున్నాయి. ఆతిథ్య పాకిస్తాన్ శ్రీలంక, ఇంగ్లండ్‌లతో టీ20, వన్డే త్రైపాక్షిక సిరీస్‌లలో తలపడనుంది. అంతేకాకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగమైన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కూడా పాక్-శ్రీలంక మధ్య జరగనుంది.ఈ హోమ్ సీజన్ షెడ్యూల్లో భాగంగా తొలుత అక్టోబర్ 9 నుంచి 13వరకు పాక్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను నిర్వహించనున్నారు. ఈ సిరీస్ మొత్తానికి రావల్పిండి క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెడుతోంది.శ్రీలంక-పాక్-ఇంగ్లండ్ మధ్య వన్డే ట్రై-సిరీస్ అక్టోబర్ 18 నుండి 31 వరకు రావల్పిండి , లాహోర్ వేదికల్లో జరగనుంది. లీగ్ దశలో ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక ట్రై-సిరీస్ ముగిసిన తర్వాత శ్రీలంక జట్టు పాకిస్తాన్‌లోనే ఉండి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.ఈ సిరీస్ నవంబర్ 9న రావల్పిండి వేదికగా ప్రారంభం కానుంది. దాదాపు నెలన్నర రోజుల పాటు జరగనున్న ఈ మ్యాచ్‌లతో పాక్ క్రికెట్ అభిమానులు పండగ చేసుకోన్నారు. పాక్ జట్టు ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది.పాక్ హోమ్ సీజన్ షెడ్యూల్ ఇదేశ్రీలంకతో టీ20 సిరీస్అక్టోబర్ 9: మొదటి టీ20 (రావల్పిండి )అక్టోబర్ 11: రెండవ టీ20 ( రావల్పిండి )అక్టోబర్ 13: మూడవ టీ20 ( రావల్పిండి )అక్టోబర్ 18: పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక (రావల్పిండి క్రికెట్ స్టేడియం)అక్టోబర్ 20: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం)అక్టోబర్ 22: శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్ (రావల్పిండి క్రికెట్ స్టేడియం)అక్టోబర్ 25: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ (గడ్డాఫీ స్టేడియం, లాహోర్)అక్టోబర్ 27: పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక (గడ్డాఫీ స్టేడియం, లాహోర్)అక్టోబర్ 29: శ్రీలంక వర్సెస్ ఇంగ్లండ్ (గడ్డాఫీ స్టేడియం, లాహోర్)ఫైనల్ మ్యాచ్:అక్టోబర్ 31: ట్రై-సిరీస్ ఫైనల్ (గడ్డాఫీ స్టేడియం, లాహోర్)పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక టెస్టు సిరీస్ నవంబర్ 4 - 6: 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ (ఇస్లామాబాద్)నవంబర్ 9 - 13: మొదటి టెస్టు (రావల్పిండి)నవంబర్ 17 - 21: రెండవ టెస్టు (లాహోర్) -
గెలుపు బాటలో భారత్
గాలే: శ్రీలంకతో తొలి టెస్టులో భారత జట్టు విజయానికి చేరువైంది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై 372 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య శ్రీలంక జట్టు నాలుగో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి 34 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. వరుసగా నాలుగో రోజు కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఫెర్నాండో (6), ఉడారా (16), సూర్యబండారా (0), కమిందు (2) విఫలమయ్యారు. దీంతో ఒకదశలో 47/4తో తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ లంకను కెపె్టన్ ధనంజయ డిసిల్వా (31 బ్యాటింగ్; 3 ఫోర్లు), సోనాల్ దినుషా (25 బ్యాటింగ్; 4 ఫోర్లు) ఆదుకున్నారు. చండిమాల్ గాయపడటంతో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన సూర్యబండారా తొలి బంతికే అవుటయ్యాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 2 వికెట్లు పడగొట్టగా... సిరాజ్, ప్రసిధ్ చెరో వికెట్ తీశారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 6 వికెట్లు ఉన్న లంక విజయానికి ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 48.5 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. పంత్ (69 బంతుల్లో 66; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ (44; 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (35; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. జైస్వాల్ (0), కెపె్టన్ గిల్ (8), జురేల్ (7), జడేజా (9) విఫలమయ్యారు. ఒక దశలో 174/5తో పటిష్టంగా కనిపించిన టీమిండియా 19 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. లంక బౌలర్లలో అషిత ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య మూడు వికెట్లు పడగొట్టారు.స్కోరు వివరాలుభారత్ తొలి ఇన్నింగ్స్: 462; శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 284; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) డిక్వెలా (బి) ఫెర్నాండో 0; రాహుల్ (సి) (సబ్) రత్నాయక (బి) జయసూర్య 35; పడిక్కల్ (ఎల్బీ) (బి) నువాంతా 44; గిల్ (ఎల్బీ) (బి) జయసూర్య 8; పంత్ (సి) డిక్వెలా (బి) లహిరు 66; జురేల్ (సి) డిక్వెలా (బి) ఫెర్నాండో 7; జడేజా (సి) (సబ్) సూర్యబండారా (బి) లహిరు 9; సుతార్ (సి) డిక్వెలా (బి) ఫెర్నాండో 9; కుల్దీప్ (సి) ధనంజయ (బి) జయసూర్య 5; సిరాజ్ (నాటౌట్) 2; ప్రసిధ్ (సి) లహిరు (బి) ఫెర్నాండో 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 193. వికెట్ల పతనం: 1–0, 2–65, 3–81, 4–111, 5–120, 6–174, 7–179, 8–188, 9–190, 10–193. బౌలింగ్: ఫెర్నాండో 8.5–0–31–4; నువాంతా 23–3–86–1; జయసూర్య 11–0–43–3; ధనంజయ 1–0–4–0; లహిరు 5–0–28–2.శ్రీలంక రెండో ఇన్నింగ్స్: మధుషంక (సి) ప్రసిధ్ (బి) సిరాజ్ 6; ఉడారా (సి) జురేల్ (బి) సుతార్ 16; సూర్యబండారా (ఎల్బీ) (బి) సుతార్ 0; కమిందు (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 2; ధనంజయ (బ్యాటింగ్) 31; దినుషా (బ్యాటింగ్) 25; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (34 ఓవర్లలో 4 వికెట్లకు) 84. వికెట్ల పతనం: 1–13, 2–14, 3–21, 4–47. బౌలింగ్: సిరాజ్ 5–1–11–1; సుతార్ 11–0–30–2; ప్రసిధ్ 8–2–13–1; జడేజా 6–0–16–0; కుల్దీప్ 3–0–8–0; పడిక్కల్ 1–0–5–0.పంత్ @100 టెస్టుల్లో 100 సిక్స్‌లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా పంత్ చరిత్రకెక్కాడు. ఓవరాల్‌గా స్టోక్స్ (138; ఇంగ్లండ్), మెకల్లమ్ (107; న్యూజిలాండ్), గిల్‌క్రిస్ట్ (100; ఆ్రస్టేలియా) తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్ పంత్. స్టోక్స్ 82 మ్యాచ్‌ల్లో 100 సిక్స్‌ల మార్క్ అందుకోగా... పంత్ అత్యంత వేగంగా కేవలం 51 టెస్టుల్లోనే సిక్స్‌ల సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్ (91), రోహిత్ శర్మ (88) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
మ్యాచ్ మధ్యలో అరంగేట్రం చేయనున్న శ్రీలంక ప్లేయర్
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సీనియర్ బ్యాటర్ దినేశ్ చండిమల్ గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ బ్యాటర్ పసిందు సూరియబండారాను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.నాలుగో రోజు ఆటలో నాలుగో ఓవర్ ముగిసే సమయంలో చండిమల్ గాయపడ్డాడు. బౌండరీని అడ్డుకునే ప్రయత్నంలో డైవ్ చేసిన అతడు ప్రమాదకరంగా కిందపడటంతో కుడి భుజం, మెడ ప్రాంతంలో గాయమైంది. నొప్పితో అతడు మైదానంలోనే మెడను పట్టుకుని కొంతసేపు పడుకున్నాడు.వెంటనే జట్టు ఫిజియో, వైద్యుడు అతడిని పరీక్షించారు. అనంతరం స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో ఎలాంటి అంతర్గత గాయం కనిపించలేదని శ్రీలంక క్రికెట్ వెల్లడించింది. అయితే కంకషన్ కారణంగా మిగిలిన టెస్టుకు చండిమల్ అందుబాటులో ఉండడని తెలిపింది.సూరియబండారా అరంగేట్రంచండిమల్ స్థానంలో వచ్చిన 26 ఏళ్ల పసిందు సూరియబండారాకు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతడికి మంచి రికార్డు ఉంది. 68 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 54.36 సగటుతో 14 సెంచరీలు సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పంత్ (66) అర్ద సెంచరీతో రాణించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఓ మోస్తరు స్కోర్ (193 ఆలౌట్) చేసి, శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.ఈ ఇన్నింగ్స్‌లో పంత్‌తో పాటు కేఎల్ రాహుల్ (35), దేవదత్ పడిక్కల్ (44) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. లంక బౌలర్లలో అశిత ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య 3, లహీరు కుమార 2, కేశర నువంత ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. సోనల్ దినుష (100) అద్భుత సెంచరీతో కదంతొక్కడంతో ఆ జట్టు ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. దినుషకు నిరోషన్ డిక్వెల్లా (80) సహకరించాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4, రవీంద్ర జడేజా 3 వికెట్లతో సత్తా చాటారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ (167) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. కేఎల్ రాహుల్ (82), ధృవ్ జురెల్ (51) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో జయసూర్య 4, నువంత 3, అశిత ఫెర్నాండో 2 వికెట్లు తీశారు. -
భారత్‌కు భారీ ఆధిక్యం
గాలే: శ్రీలంకతో తొలి టెస్టులో భారత జట్టు విజయావకాశాన్ని సృష్టించుకుంది. అయితే మూడు రోజుల పాటు మ్యాచ్‌ను వెంటాడుతూ ప్రభావం చూపించిన వర్షం మరో రెండు రోజులు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. గరిష్టంగా 196 ఓవర్లు పడే అవకాశం ఉండగా, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఎన్ని పరుగులు చేసి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందనేది ఆసక్తికరం. మ్యాచ్ మూడో రోజు సోమవారం శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. సోనాల్ దినుషా (168 బంతుల్లో 100; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, నిరోషన్ డిక్వెలా (115 బంతుల్లో 80; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఒకదశలో లంక 90/5 వద్ద కష్టాల్లో ఉండగా వీరిద్దరు ఆరో వికెట్‌కు 36.1 ఓవర్లలో 146 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్‌కు 4, జడేజాకు 3 వికెట్లు దక్కాయి. భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు ఆడాల్సి ఉన్నా... వెలుతురులేమి వల్ల ఆట సాధ్యం కాలేదు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 460/9తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 4 బంతులాడి తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. భారీ భాగస్వామ్యం...తొలి సెషన్లోనే శ్రీలంకపై భారత్ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శిస్తూ ఐదు వికెట్లతో దెబ్బ కొట్టింది. లంక ఇన్నింగ్స్‌లో రెండో బంతికే మదుషంక (0)ను అవుట్ చేసి సిరాజ్ శుభారంభం అందించాడు. సుతార్ తన తొలి బంతికే చండీమల్ (4)ను వెనక్కి పంపించాడు. కొద్దిసేపు క్రీజ్‌లో నిలిచిన ఉడారా (44 బంతుల్లో 27; 6 ఫోర్లు) వికెట్ కూడా సుతార్ ఖాతాలోకే చేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కమిందు మెండిస్ (14)ను కుల్దీప్, ధనంజయ డిసిల్వా (21)లను జడేజా పెవిలియన్ పంపించి తామూ వికెట్ల ఖాతా తెరిచారు. భారత బౌలర్ల జోరు చూస్తూ లంక కుప్పకూలడానికి ఎంతోసేపు పట్టదనిపించింది. లంచ్ సమయానికి స్కోరు 99/5 కాగా, ఆ తర్వాత డిక్వెలా, దినుషా ద్వయం ఆతిథ్య జట్టును గట్టెక్కించింది. 20 పరుగుల వద్ద డిక్వెలా ఇచి్చన క్యాచ్‌ను స్లిప్‌ను రాహుల్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. అనంతరం డిక్వెలా, దినుషా అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. టీ విరామానంతరం ఎట్టకేలకు ఈ జోడీని విడదీయడంలో భారత్ సఫలమైంది. ప్రసిధ్ బౌలింగ్‌లో డిక్వెలా వెనుదిరగ్గా, తక్కువ వ్యవధిలో లంక మరో రెండు వికెట్లు చేజార్చుకుంది. మరోవైపు పట్టుదలగా ఆడిన దినుషా 167 బంతుల్లో తన తొలి శతకాన్ని అందుకున్నాడు. అయితే అదే స్కోరు వద్ద దినుషా ఆట ముగియగా, మరో పది పరుగులకు లంక ఆలౌటైంది.స్కోరు వివరాలుభారత్ తొలి ఇన్నింగ్స్: 462; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: మదుషంక (సి) పడిక్కల్ (బి) సిరాజ్ 0; ఉడారా (సి) జైస్వాల్ (బి) సుతార్ 27; చండీమల్ (సి) పంత్ (బి) సుతార్ 4; కమిందు (సి) గిల్ (బి) కుల్దీప్ 14; ధనంజయ (సి) రాహుల్ (బి) జడేజా 21; దినుషా (ఎల్బీ) (బి) జడేజా 100; డిక్వెలా (సి) పంత్ (బి) ప్రసిధ్ 80; నువాంతా (సి) గిల్ (బి) జడేజా 2; జయసూర్య (సి) జురేల్ (బి) సుతార్ 10; కుమార (స్టంప్డ్) పంత్ (బి) సుతార్ 10; ఫెర్నాండో (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (79.4 ఓవర్లలో ఆలౌట్) 284. వికెట్ల పతనం: 1–0, 2–27, 3–53, 4–59, 5–90, 6–236, 7–243, 8–274, 9–274, 10–284. బౌలింగ్: సిరాజ్ 9–3–29–1, ప్రసిధ్ 14–0–47–1, సుతార్ 21.4–1–76–4, కుల్దీప్ 14–0–65–1, జడేజా 21–5–57–3.350: జడేజా 350 వికెట్ల మైలురాయిని దాటాడు. భారత్ తరఫున కుంబ్లే, అశ్విన్, కపిల్, హర్భజన్ తర్వాత ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా జడేజా నిలిచాడు. బోథమ్, కపిల్, వెటోరి తర్వాత టెస్టుల్లో 350కి పైగా వికెట్లు, 4 వేలకు పైగా పరుగులు చేసిన నాలుగో ఆల్‌రౌండర్‌గా జడేజా నిలవడం విశేషం. -
సుదీర్ఘ సమరానికి సై
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత జట్టు... శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. సొంతగడ్డపై వరుస సిరీస్ పరాజయాల నుంచి కోలుకొని టీమిండియా సత్తా చాటాలని భావిస్తుంటే... శ్రీలంక స్పిన్‌తో ప్రత్యరి్థని దెబ్బతీయాలని ప్రణాళికలు రచిస్తోంది. భారత జట్టుకు ఇది 600వ టెస్టు మ్యాచ్ కావడం మరో విశేషం. గాలె: సుదీర్ఘ విరామం అనంతరం భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. 1932లో తొలి టెస్టు ఆడిన టీమిండియాకు ఇది 600వ మ్యాచ్ కానుండగా... మైలురాయి మ్యాచ్‌లో విజయం సాధించాలని శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు టీమిండియా 9 టెస్టులు ఆడనుంది. ఇందులో ఏడింట గెలిస్తే భారత్ నేరుగా తుదిపోరుకు అర్హత సాధించనుంది. దీంతో విజయమే లక్ష్యంగా గిల్ సేన బరిలోకి దిగనుంది. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టి20 ప్రపంచకప్, ఆసియాకప్, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా... సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. దీంతో గంభీర్‌పై కూడా అదనపు ఒత్తిడి ఉంది. స్పిన్‌కు ఎదురొడ్డితేనే... 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలో లంకలో పర్యటించిన భారత జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. ఆ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్లతో దట్టంగా ఉండగా... ఇప్పుడు అలాంటి అనుభవజు్ఞలు కరువయ్యారు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా... దేవదత్ పడిక్కల్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. కెపె్టన్ గిల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనుండగా... ఆ తర్వాత పంత్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తారు. సర్ఫరాజ్ ఖాన్‌కు తుది జట్టులో చోటు కష్టమే. ఒకప్పుడు స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటారనే పేరున్న భారత ప్లేయర్లు... ఇటీవలి కాలంలో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. లంక జట్టులో ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగడం ఖాయమే కాగా... సిరాజ్‌తో పాటు ప్రసిధ్ కొత్త బంతిని పంచుకోనున్నాడు. జడేజా, కుల్దీప్, మానవ్ స్పిన్ భారం మోస్తారు. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రాహుల్, జైస్వాల్, పడిక్కల్, పంత్, జురేల్, జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్, సిరాజ్, ప్రసిధ్. శ్రీలంక: ధనంజయ డిసిల్వా (కెపె్టన్), లహిరు, నిషాన్, దినేశ్, కమిందు, డిక్వెల్లా, సోనల్, ప్రభాత్, రమేశ్, అషిత ఫెర్నాండో, లహిరు కుమార.పిచ్, వాతావరణం గాలె పిచ్ గతంలో మాదిరిగా పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించకపోవచ్చని శ్రీలంక కెప్టెన్ ధనంజయ్ పేర్కన్నాడు. పిచ్‌పై తేమ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లకు లబ్ది చేకూరే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్‌కే మొగ్గుచూపనుంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి. -
పెళ్లి బాజాలు ఇక లంకలో..
భారతీయుల డెస్టినేషన్ వెడ్డింగ్ మార్కెట్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు దుబాయ్, ఒమన్, టర్కీ వంటి పశ్చిమాసియా దేశాలు సంపన్న భారతీయ కుటుంబాల పెళ్లిళ్లకు ప్రధాన వేదికలుగా ఉండగా. ఇప్పుడు ఆ స్థానాన్ని శ్రీలంక, వియత్నాం,థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాలు వేగంగా ఆక్రమిస్తున్నాయి. భారత్‌కు దగ్గరగా ఉండడం, ప్రయాణ సౌలభ్యం, విలాసవంతమైన హోటళ్లు, తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ అనుభూతి లభించడం వంటి కారణాలతో 2025లో భారతీయుల పెళ్లిళ్లకు ఆగ్నేయాసియా దేశాలు అత్యంత వేగంగా ఎదుగుతున్న విదేశీ వెడ్డింగ్ డెస్టినేషన్ల గమ్య స్థానంగా మారినట్లు వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థ ’వెడ్ మి గుడ్’ నివేదిక వెల్లడించింది. 2025లో ఒక్క శ్రీలంకలో భారతీయ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు డిమాండ్ 25% పెరిగిందని వచ్చే కొన్నేళ్ల పాటు ప్రతి ఏడాది 20–25% వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. మరోవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధవాతావరణం కారణంగా అక్కడి వెడ్డింగ్ మార్కెట్‌పై కొంత ప్రభావం కనిపించినప్పటికి విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనే భారతీయుల ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కి శ్రీలంక, ఇతర దేశాలు వేగంగా ఎదుగుతున్నప్పటికీ పర్యాటకంగా భారతీయుల తొలి ఎంపిక మాత్రం థాయ్‌లాండే. 2025లో దాదాపు 25 లక్షల మంది భారతీయులు థాయ్‌లాండ్‌ను సందర్శించారు. ఏడాది ప్రాతిపదికన 16% పెరుగుదల నమోదైంది. పెళ్లితోపాటు అనుభవం కూడా ముఖ్యం. ఇప్పటి తరం జంటలు పెళ్లి కేవలం వేడుక కోసం కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మరుపురాని అనుభవాన్ని సృష్టించేందుకు డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే పెళ్లి వేడుకులు కూడా గతంతో పోలిస్తే ఎక్కువ రోజులు కొనసాగుతున్నాయి. కరోనాకు ముందు సగటున 1–2 రోజులు జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇప్పుడు మూడు, నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. భారీగా పెరిగిన బడ్జెట్ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు భారతీయులు చేసే ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. దేశీ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు సగటు బడ్జెట్ రూ.58 లక్షలు అయితే విదేశీ డెస్టినేషన్ వెడ్డింగ్ సగటు బడ్జెట్ రూ.1.5 కోట్లు పైమాటే. అయినా లగ్జరీ పెళ్లిళ్ల మార్కెట్ మరింత విస్తరిస్తోందని ముందు ముందు ఇది మరింత పెరుగుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది.సంక్షోభంతో మారుతున్న ఎంపిక పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నెలకొన్న భద్రతా పరిస్థితులు, విమాన చార్జీలు పెరుగుదల, హోటళ్ల టారిఫ్‌లు అమాంతం పెరిగిపోవడం కూడా భారతీయుల పెళ్ళి ప్రణాళికలను ప్రభావితం చేశాయి. అయితే విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని మాత్రం భారతీయ సంపన్న కుటుంబాలు మార్చుకోవడం లేదని కేవలం దేశాన్నే మార్చుకుంటున్నాయి. భద్రత, ప్రయాణ సౌలభ్యం, అతి«థులకు కూడా సులభమైన వీసా విధానం ఉన్న శ్రీలంక, ఇండోనేíÙయా దేశాలపై ఇప్పుడు ఎక్కువ మంది దృష్టి పెడుతున్నాయి.టాప్ విదేశీ వెడ్డింగ్ గమ్యస్థానాలు థాయ్‌లాండ్, బాలి (ఇండోనేషియా) వియత్నాం, మలేషియా ఇటలీ, ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్, పోర్చుగల్ భారత్‌లో ఇవీ... దేశీ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌లో డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్, సిమ్లా, జిమ్ కార్బెట్ తొలి ఐదు స్థానాల్లో ఉండగా, ఉదయ్‌పూర్,జైపూర్,జైసల్మేర్,జో«ద్‌పూర్, గోవా కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. శ్రీలంకకు భారతీయుల వెల్లువ శ్రీలంక టూరిజం డెవలప్మెంట్ అథారిటీ గణాంకాల ప్రకారం 2023లో 3 లక్షల మంది భారతీయ పర్యాటకులు ఆదేశాన్ని సందర్శించగా 2024లో 4.17 లక్షలు, 2025లో అది 5.30 లక్షలు దాటింది. భారత్ ప్రస్తుతం శ్రీలంకకు అతిపెద్ద విదేశీ పర్యాటక మార్కెట్. ఈ పెరుగుతున్న పర్యాటక ప్రవాహమే డెస్టినేషన్ వెడ్డింగ్ రంగానికి ఊతమిస్తోంది. ఇది లగ్జరీ హోటళ్లు, విమానయాన సంస్థలు, ట్రావెల్ కంపెనీలు, డెకరేషన్, ఫొటోగ్రఫీ, ఫ్యాషన్, క్యాటరింగ్, టూరిజం రంగాలకు కూడా కోట్లాది వ్యాపారాన్ని సృష్టిస్తున్న భారీ పరిశ్రమగా మారుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పిలుపు ఊహించాం
గాలె: నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తే ఏదో ఒక రోజు భారత జట్టు నుంచి పిలుపు వస్తుందని ఆశించినట్లు... జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ పేర్కొన్నాడు. దేశవాళీల్లో దుమ్మురేపిన ఆకిబ్ గత రెండు రంజీ సీజన్లలో ఏకంగా 104 వికెట్లు పడగొట్టాడు. 2025–26 సీజన్లో జమ్మూకశ్మీర్ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్ నెగ్గడంలో నబీ కీలకపాత్ర పోషించాడు. అతడి నిలకడైన పేస్ బౌలింగ్ వల్లే ఆ జట్టు సుదీర్ఘ చరిత్ర గల టోర్నమెంట్లో మొదటిసారి చాంపియన్‌గా అవతరించింది. దీంతో చాన్నాళ్లుగా అతడికి భారత జట్టులో చోటు దక్కుతుందని భావించగా... తాజాగా శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు అతడు ఎంపికయ్యాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో ఆకిబ్‌కు జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘దేశవాళీల్లో నిలకడగా రాణించడంతో ఏదో ఒక రోజు టీమిండియాకు ఎంపికవుతానని బలంగా విశ్వసించాను. నా కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని నమ్మకంగా ఉన్నా. మొత్తానికి ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. సరైన స్థానంలో బంతులు వేస్తూ వికెట్లు పడగొట్టడమే నా కర్తవ్యం. జట్టు ఎంపిక అనేది నా చేతుల్లో లేని పని. తొలిసారి భారత జట్టుకు ఎంపికైనట్లు తెలియగానే చాలా సంతోషించా. కుటుంబ సభ్యులు ఎంతో గర్వించారు. దీని కన్నా గొప్పది మరొకటి ఉండదు’ అని బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఆకిబ్ పేర్కొన్నాడు. శ్రీలంకతో పర్యటనకు తొలుత ఎంపిక చేసిన భారత జట్టులో నబీకి చోటు దక్కలేదు. దీంతో అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రత్యేక శిబిరానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో ఆకిబ్‌కు టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఈ సమాచారం అందింది. ‘బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న సమయంలో నాకు ఫోన్ వచ్చింది. ఎక్కడున్నావు అని అడిగారు... ప్రాక్టీస్ కోసం బెంగళూరు వెళ్తున్నానని సమాధానమిచ్చా... ఆ అవసరం లేదు నేరుగా శ్రీలంకకు వచ్చేయ్. నువ్వు భారత జట్టుకు ఎంపికయ్యావు’ అని చెప్పారు. దీంతో మొదట నమ్మలేకపోయా. కానీ బుమ్రా స్థానంలో తీసుకున్నారని ఆ తర్వాత తెలిసిందని నబీ వివరించాడు.సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం మరోవైపు 33 ఏళ్ల వయసులో టీమిండియాకు ఎంపికైన స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ కూడా తన ప్రదర్శనకు దక్కిన ఫలితమిదని పేర్కొన్నాడు. 2021–22 సీజన్లో రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టులో సభ్యుడైన సారాంశ్... దశాబ్దానికి పైగా దేశవాళీల్లో రాణిస్తున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో శ్రీలంకతో తొలి టెస్టుకు దూరం కాగా... అతడి స్థానంలో సారాంశ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ‘టెస్టు క్రికెట్ ఆడాలంటే ఓపిక కావాలి. అందులోనూ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవాలంటే అది మరింత ఎక్కువ ఉండాలి. నేను 2014–15 సీజన్లో రంజీ ట్రోపీలో అరంగేట్రం చేశాను. ఎన్నో త్యాగాలు, మరెంతో శ్రమతో ఇన్నాళ్లుగా ఆటలో కొనసాగుతున్నా. ఏదో ఒక రోజు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాననే నమ్మకం మాత్రం కోల్పోలేదు. మా నాన్న కూడా రంజీ ఆటగాడే. ఓపికతో ఎదురుచూస్తే తప్పక అవకాశం వస్తుందని చెప్పారు. అదే నిజమైంది. గుడికి వెళ్తున్న సమయంలో భారత జట్టుకు ఎంపికయ్యాననే వార్త తెలిసి చాలా సంతోషించా’ అని సారాంశ్ చెప్పాడు. ప్రస్తుతం భారత జట్టులోని ఆటగాళ్లతో గతంలో దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండటంతో అందరితో త్వరగానే కలిసిపోయానని సారాంశ్ వెల్లడించాడు. -
జురేల్‌కు పరీక్ష!
గాలే: శ్రీలంకతో తొలి టెస్టులో భారత తుది జట్టు విషయంలో దాదాపుగా అన్ని పేర్లు ఖాయమైనా...ఆరో స్థానం విషయంలోనే కాస్త చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ధ్రువ్ జురేల్ ఆడుతుండగా, ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ నుంచి అతడికి పోటీ ఎదురవుతోంది. రెగ్యులర్ వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ ఇప్పటికే టీమ్‌లో ఉండగా, జురేల్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడుతున్నాడు. అయితే ఇటీవలి తన ప్రదర్శనతో అతను తగిన న్యాయం చేయలేకపోతున్నాడు. వెస్టిండీస్‌పై సెంచరీ తర్వాత ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో జురేల్ వరుసగా 44, 6 నాటౌట్, 14, 13, 0, 2, 19 పరుగులు చేశాడు. వీటిలో ఐదుసార్లు అతను స్పిన్నర్ల బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరోవైపు సర్ఫరాజ్‌కు స్పిన్‌ను అద్భుతంగా ఆడగలడనే పేరుంది. లంక గడ్డపై స్పిన్నర్లు తీవ్రంగా ప్రభావం చూపనున్న నేపథ్యంలో జురేల్ తన ఆటను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాడు. అందుకోసం అతను కేఎల్ రాహుల్ వద్ద తగిన సూచనలు తీసుకున్నాడు. రాహుల్‌తో కలిసి ప్రాక్టీస్ చేస్తూ మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. భారత బ్యాటర్లలో శ్రీలంకలో టెస్టులు ఆడిన అనుభవం ఒక్క రాహుల్‌కే ఉంది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ‘కేఎల్ రాహుల్ ఆట గురించి అందరికీ బాగా తెలుసు. అతని అనుభవం జట్టుకు ఎంతో కీలకం. గత రెండేళ్లుగా అతను ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. టీమ్‌లోని ఇతర సభ్యులకు సన్నాహకాల్లో అతను సహకరించాలనే మేం కోరుకుంటున్నాం. నెట్స్‌లో యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేయడం చాలా అవసరం’ అని మోర్కెల్ అన్నాడు. జురేల్ కూడా జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకోవాలంటే మరింత శ్రమించాల్సిందేనని అతను చెప్పాడు.కొన్నాళ్ల క్రితం ‘ఎ’ జట్టు తరఫున జురేల్ ఇక్కడ రాణించాడు ‘పది రోజుల ముందే ఇక్కడికి వచ్చి మేం సిరీస్ కోసం సిద్ధమవుతున్నాం. గాలేలాంటి చోట ఎలా పరుగులు చేయాలనేది స్వయంగా బ్యాటర్లే గుర్తించాలి’ అని మాజీ పేసర్ అభిప్రాయ పడ్డాడు. ఇలాంటి స్థితిలో జురేల్‌కు అవకాశం దక్కుతుందా...ఒక వేళ చాన్స్ లభిస్తే దానిని అతను వాడుకోగలడా అనేది చూడాలి. -
ముగ్గురు స్పిన్నర్లతో..!
గాలే: శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో భారత జట్టు ముగ్గురు స్పిన్ బౌలర్లతో బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైనట్లే. టీమ్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ గురువారం ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు. మనకు ముగ్గురు వైవిధ్యభరితమైన స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఎంత సమర్థంగా వాడుకోవాలనేది ముఖ్యమని అతను వ్యాఖ్యానించాడు. సీనియర్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజాతో పాటు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, మరో యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ ఆడే అవకాశం ఉంది. అఫ్గానిస్తాన్‌తో టెస్టులో అరంగేట్రం చేసిన సుతార్ 7 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ‘మా ముగ్గురు స్పిన్నర్లది భిన్నమైన శైలి. కుల్దీప్ ప్రధానంగా అటాకింగ్ బౌలర్. అతని అనుభవం, బౌలింగ్ బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుతార్ బంతిని ఎక్కువగా టర్న్ చేస్తే కచ్చితత్వంలో జడేజాను మించినవాడు లేడు. ముగ్గురూ ఎడంచేతి వాటం బౌలర్లే కావడంతో ఎలాంటి సమస్యా లేదు. 20 వికెట్లు తీయగల సామర్థ్యం వీరికి ఉంది. కెప్టెన్ గిల్ మ్యాచ్‌లో ఎలాంటి సమయాల్లో వీరిని ఎలా వాడుకుంటాడనేది మనం చూడాలి.మ్యాచ్ వేదిక గాలేలో గత రికార్డు చూసినా ముగ్గురు స్పిన్నర్లు ఉండటం సరైన నిర్ణయమే అవుతుంది. ఆట సాగుతున్నకొద్దీ పిచ్ మారే అవకాశం ఉంది’ అని మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఈ టెస్టులో పేస్ బౌలర్లకు కూడా తగిన ప్రాధాన్యత ఉందని అతను అన్నాడు. అయితే ఆరంభంలోనే వారు ప్రభావం చూపించడం అవసరమని మోర్కెల్ పేర్కొన్నాడు. ప్రధాన పేసర్‌గా సిరాజ్ బరిలోకి దిగనుండగా, రెండో పేసర్‌గా ప్రసిధ్ లేదా గుర్నూర్‌కు చాన్స్ లభించవచ్చు. ‘మన దగ్గర పేస్ బౌలింగ్‌లో కూడా మంచి పదును ఉంది. ప్రణాళికలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడి వాతావరణంలో కూకాబుర్రా బంతి తొందరగా 25–30 ఓవర్లకే మెత్తబడుతుంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత బంతిని ఎలా వాడాలనేది పేసర్ల మానసిక దృఢత్వానికి పరీక్ష. చిన్న చిన్న స్పెల్స్ వేస్తూ పూర్తి స్థాయిలో తమ శక్తి సామర్థ్యాలను వాడుతూ అదే తీవ్రతను కొనసాగించడం ముఖ్యం. క్రీజ్‌ను, లెంగ్త్‌ను సమర్థంగా వాడుకుంటూ ప్రభావం చూపించాల్సి ఉంటుంది’ అని మోర్కెల్ విశ్లేషించాడు. -
భారత్‌తో తొలి టెస్ట్.. శ్రీలంక జట్టు ప్రకటన
భారత్‌తో తొలి టెస్టుకు శ్రీలంక జట్టును ప్రకటించారు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆగస్టు 15న గాలే వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు.ధనంజయ డి సిల్వా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కమిందు మెండిస్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లకు చోటు లభించింది. వార్మప్ మ్యాచ్‌లో అదరగొట్టిన బ్యాటర్‌కు చోటుభారత్తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన నిశాన్ మధుష్కకు సెలెక్టర్లు తగిన గుర్తింపు ఇచ్చారు. అతని మంచి ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని తొలి టెస్టు జట్టులో చోటు కల్పించారు.భారత్‌తో టెస్టుకు ముందు మధుష్క చూపించిన ఫామ్ శ్రీలంకకు సానుకూల అంశంగా మారింది. భారత బౌలింగ్‌ను ఎదుర్కొనే బ్యాటింగ్ విభాగంలో అతడు కీలకంగా మారే అవకాశం ఉంది.బౌలింగ్ బాధ్యత ప్రభాత్ జయసూర్యదేశ్రీలంక బౌలింగ్ దళానికి ప్రభాత్ జయసూర్య నాయకత్వం వహించనున్నాడు. అతనితో పాటు రమేశ్ మెండిస్, అసిత ఫెర్నాండో, మిలన్ రత్నాయకే, విశ్వ ఫెర్నాండో వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.ఇక భారత్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆకట్టుకున్న కేశర నువంతకు కూడా తొలి టెస్టు జట్టులో చోటు దక్కింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంక కూడా జట్టులో ఉన్నాడు.తొలి టెస్టుకు శ్రీలంక జట్టుధనంజయ డి సిల్వా (కెప్టెన్), లహిరు ఉదారా, నిశాన్ మధుష్క, కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), దినేశ్ చండీమాల్, పసిందు సూరియబండారా, సోనాల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), రమేశ్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, కేశర నువంత, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక -
టీమిండియాపై సంచలన అస్త్రాలను ప్రయోగించనున్న శ్రీలంక
భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు శ్రీలంక సిద్ధమవుతోంది. ఆగస్టు 15న గాలే వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుండగా.. శ్రీలంక ఇంకా తుది జట్టును ప్రకటించలేదు. ఆటగాళ్ల గాయాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుతో తలపడేందుకు శ్రీలంక ఆటగాళ్లు ఇప్పటికే గాలేలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ సమయంలో ఆతిథ్య జట్టు ఇద్దరు ఆసక్తికరమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.రోహిత్ శర్మను బోల్తా కొట్టించిన బౌలర్ మళ్లీ వస్తున్నాడా..?భారత్‌తో టెస్ట్ సిరీస్ కోసం లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంకను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశముంది. రేవ్స్పోర్ట్జ్ నివేదిక ప్రకారం.. మధుశంకకు రీకాల్ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.మధుశంకకు భారత్‌పై ప్రత్యేకమైన జ్ఞాపకం ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక తరఫున అద్భుతంగా రాణించిన అతడు.. రోహిత్ శర్మను మ్యాచ్ రెండో బంతికే ఔట్ చేశాడు.ఆ మ్యాచ్‌లో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావించిన సమయంలో మధుశంక అతడిని పెవిలియన్‌కు పంపించాడు. ఇప్పుడు మరోసారి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు అతడు సిద్ధమవుతున్నాడు. మధుశంక ఇప్పటివరకు శ్రీలంక తరఫున ఒక టెస్ట్, 28 వన్డేలు, 20 టీ20లు ఆడాడు.గిల్, పంత్‌ను పడగొట్టిన కొత్త అస్త్రంమధుశంకతో పాటు ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ కేశర నువంతకు తొలిసారి శ్రీలంక టెస్ట్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.ఇటీవల భారత్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో నువంత తన సత్తా చూపించాడు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు రిషభ్ పంత్ వికెట్లను పడగొట్టాడు.అంతేకాదు.. భారత్-ఏ, శ్రీలంక-ఏ మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్టులో నువంత ఏకంగా ఐదు వికెట్లు తీసుకున్నాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన నువంత 64 వికెట్లు పడగొట్టాడు. అతని స్ట్రైక్‌రేట్ 39గా ఉంది. దీంతో భారత బ్యాటర్లకు అతడు మరో సవాలుగా మారే అవకాశం ఉంది.ఇద్దరు కీలక బ్యాటర్లు దూరంమరోవైపు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పథుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం లేదు.దీంతో బ్యాటింగ్ విభాగంలో శ్రీలంకకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాను తిరిగి టెస్ట్ జట్టులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిక్వెల్లా చివరిసారిగా 2023 మార్చిలో శ్రీలంక తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడాడు.అదే సమయంలో అన్క్యాప్డ్ వికెట్ కీపర్ అంజలా బండారాను కూడా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. డిక్వెల్లా, బండారా ఇద్దరూ ప్రస్తుతం గాలేలో శ్రీలంక జట్టుతో కలిసి ఉన్నట్లు సమాచారం.WTC ఫైనల్‌కు వెళ్లాలంటే భారత్‌ను ఓడించాల్సిందే..!ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 పాయింట్ల పట్టికలో శ్రీలంక ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. రెండు సిరీస్‌ల తర్వాత 41.67 శాతం పాయింట్లతో భారత్‌కు వెనుకనే ఉంది. శ్రీలంక ఇంకా ఎనిమిది టెస్టులు ఆడాల్సి ఉంది. WTC ఫైనల్‌కు చేరాలంటే భారత్‌పై సిరీస్ విజయం వారికి అత్యంత కీలకం. -
గుర్నూర్... గేమ్ చేంజర్!
కోల్‌కతా: స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో... శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత కొత్త పేసర్ గుర్నూర్ బ్రార్ కీలకం అవుతాడని శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వేజ్ మహరూఫ్ అభిప్రాయపడ్డాడు. భారత్, శ్రీలంక మధ్య ఈ నెల 15 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. దానికి ముందు జరిగిన ప్రాకీస్ట్ మ్యాచ్‌లో గుర్నూర్ తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన బ్రార్... బుమ్రా అందుబాటులో లేకపోవడంతో లంకతో టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లు ఓడిన టీమిండియా... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలంటే లంకపై సత్తా చాటాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో మహరూఫ్ మాట్లాడుతూ... ‘బుమ్రా అద్భుతమైన బౌలర్. అతడు బంతిని రివర్స్ స్వింగ్ చేయగలడు. ముఖ్యంగా పాత బంతితో అయితే అతడు మరింత ప్రమాదకరం. కానీ గాయం కారణంగా అతడు ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. అది భారత జట్టుకు అతి పెద్ద లోటు. మొహమ్మద్ సిరాజ్ మంచి బౌలరే... కానీ బుమ్రాతో పోల్చుకుంటే మాత్రం ఇద్దరి మధ్య చాలా అంతరం ఉంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు కూడా గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో గుర్నూర్ బ్రార్‌కు తుది జట్టులో చోటు దక్కుతుంది అనుకుంటున్నా. ఈ సిరీస్‌లో బ్రార్ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ కావొచ్చు. అతడి బౌలింగ్‌లో మంచి వేగంతో పాటు అదనపు బౌన్స్ ఉంది. దానితో ఫలితాలు రాబట్టవచ్చు. అతడిలో పోరాట పటిమ ఉంది... అవసరమైతే దూకుడు ప్రదర్శించే స్వభావం గుర్నూర్ది’ అని వెల్లడించాడు. పంత్‌కు అరగంట చాలు.. ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆటకు వీడ్కోలు పలకగా... వాషింగ్టన్ సుందర్ గాయంతో అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు మానవ్ సుతార్‌ను మూడో స్పిన్నర్‌గా బరిలోకి దింపే అవకాశం ఉందని మహరూఫ్ అన్నాడు. ‘రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లతో పాటు మూడో స్పిన్నర్‌గా మానవ్ సుతార్‌కు అవకాశం దక్కొచ్చు. గాలె పిచ్ కుల్దీప్కు బాగా అనుకూలిస్తుంది. ఇక్కడి పిచ్‌లు కేవలం స్పిన్ మాత్రమే కావు... కాస్త బౌన్స్ కూడా అవుతాయి. ఈ నేపథ్యంలో మానవ్‌కు ఈ తరహా పిచ్ బాగా ఉపయోగపడుతుంది. రెండు జట్లు కూడా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగొచ్చు. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో లంక జట్టు జాగ్రత్తగా ఉండాలి. అతడు అరగంటలో ఆట స్వరూపాన్ని మార్చేయగలడు. గతంలో అతడి బ్యాట్ నుంచి అలాంటి ఎన్నో ప్రదర్శనలు వచ్చాయి. స్పిన్‌ను మెరుగ్గా ఎదుర్కొన్న వారే సిరీస్‌లో విజేతగా నిలుస్తారు. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య నుంచి టీమిండియా బ్యాటర్లకు ఇబ్బందులు ఎదురవొచ్చు. నా అంచనా ప్రకారం రెండు మ్యాచ్‌ల సిరీస్ 1–1తో ‘డ్రా’ అవుతుంది’ అని మహరూఫ్ వివరించాడు. బాడీలైన్ బౌలింగ్...శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తన పేస్‌తో ఆకట్టుకున్న గుర్నూర్... తుది జట్టులో మంచి వైవిధ్యం తీసుకొస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గుర్నూర్ కొన్నిసార్లు బాడీలైన్ బౌలింగ్ కూడా చేశాడని మహరూఫ్ గుర్తు చేశాడు. ‘మీరు ప్రాక్టీస్ మ్యాచ్‌ను సరిగ్గా గమనిస్తే... బ్రార్ విభిన్న బంతులు వేశాడు. అవసరమైన సమయంలో ప్రత్యర్థుల శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని కూడా బంతులు విసిరాడు. నేను భారత జట్టు సహాయక బృందంలో ఉంటే అతడికి తప్పక అవకాశం కల్పించే దిశగా ప్రయత్నించేవాడిని. అతడు కేవలం పరిమిత ఓవర్లలోనే ఆడాడని నాక్కూడా తెలుసు.అయితే సుదీర్ఘ ఫార్మాట్‌కు అవసరమైన నైపుణ్యం బ్రార్‌లో మెండుగా ఉంది. బ్యాటర్ లయను దెబ్బతీయాల్సిన సందర్భాల్లో అతడు వేసే చిన్నపాటి స్పెల్స్ అత్యంత ప్రమాదకర ఆయుధాలుగా మారవచ్చు’ అని మహరూఫ్ అన్నాడు. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌పై వన్డేల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రార్... ఇప్పటి వరకు టీమిండియా తరఫున 6 వన్డేలు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. 26 ఏళ్ల గుర్నూర్ బ్రార్‌కు ఐపీఎల్లో పెద్దగా అనుభవం లేకపోయినా... ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. గత నెలలో భారత ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక ‘ఎ’ జట్టుతో మ్యాచ్‌లో గుర్నూర్ 10 వికెట్లు పడగొట్టాడు. -
సిరాజ్ సిక్సర్ల జోరు
కొలంబో: శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత బ్యాటర్లకు చక్కటి ప్రాక్టీస్ లభించింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుండగా... దానికి ముందు నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఎలెవన్‌తో జరిగిన ఈ మూడు రోజుల పోరులో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫస్ట్‌క్లాస్ హోదా లేని ఈ మ్యాచ్‌లో చివరి రోజైన ఆదివారం ఇరు జట్లు చెరో 45 ఓవర్ల చొప్పున బ్యాటింగ్ చేశాయి. మొదట శ్రీలంక 45 ఓవర్లలో 200/6 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నిషాన్ ఫెర్నాండో (73 బంతుల్లో 63; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా ... భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, గుర్నూర్ బ్రార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రధాన పేసర్లు మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 6 పరుగులతో కలుపుకొని భారత జట్టు ముందు 207 పరుగుల లక్ష్యం నిలవగా... టీమిండియా 45 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (46 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరిశాడు. ఇక గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగని భారత రెగ్యులర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (44; 7 ఫోర్లు) చక్కటి షాట్లు ఆడాడు. రిషబ్ పంత్ (28; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ధ్రువ్ జురేల్ (17; 1 ఫోర్, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఆఖర్లో సిరాజ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) భారీ సిక్స్‌లతో విరుచుకుపడి జట్టును గెలిపించడం విశేషం. సిరాజ్ సిక్స్‌ల ‘హ్యాట్రిక్’ కేవలం ప్రాక్టీస్ కోసమే జరిగిన మ్యాచ్ కావడంతో... జట్టు విజయం కోసం పెద్దగా ప్రయత్నించలేదు. 44 ఓవర్లు ముగిసేసరికి భారత్ 191/4తో నిలిచింది. భారత్ విజయానికి ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం. అప్పటికే ఒక సిక్స్ కొట్టి క్రీజులో ఉన్న సిరాజ్... కేషారా నువాంతా వేసిన ఆఖరి ఓవర్ తొలి మూడు బంతులకు సిక్స్‌లు కొట్టడంతో భారత్ విజయం ఖరారైంది. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో లంక జట్టు మిగిలిన రెండు బంతులు కూడా వేసి నిర్ణీత 45 ఓవర్లు పూర్తి చేసింది. సుదర్శన్ స్థానంలో సర్ఫరాజ్గాయం కారణంగా శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమైన సాయి సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. 28 ఏళ్ల సర్ఫరాజ్ టీమిండియా తరఫున 6 టెస్టులు ఆడి 371 పరుగులు చేశాడు. -
టీమిండియా టార్గెట్ 207
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్‌తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆట ఇవాళ (మూడో రోజు) చివరి రోజు కావడంతో ఫలితం తేలే అవకాశం లేదు. ఆటలో మరో సెషన్ మాత్రమే మిగిలి ఉంది.లంక ఎలెవెన్ రెండో ఇన్నింగ్స్‌లో నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15 నుంచి మొదలుకానుంది. రెండో టెస్ట్ కొలంబో వేదికగా ఆగస్ట్ 23న ప్రారంభం కానుంది. -
పడిక్కల్ బ్యాటింగ్ జోరు
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (164 బంతుల్లో 142 నాటౌట్; 18 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా సాయి సుదర్శన్ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నుంచి తప్పుకోగా... తుది జట్టులో అతడి స్థానంలో పడిక్కల్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల వామప్ మ్యాచ్‌లో శనివారం రెండో రోజు ఆట ముగిస సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. పడిక్కల్ భారీ శతకంతో కదం తొక్కగా... రవీంద్ర జడేజా (117 బంతుల్లో 63; 7 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. గిల్ స్థానంలో ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ (40; 5 ఫోర్లు, 1 సిక్స్), మానవ్ సుతార్ (41; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో గుర్నూర్ బ్రార్ (18 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఐదు బంతుల వ్యవధిలో నాలుగు సిక్స్‌లు కొట్టడం విశేషం. లంక బౌలర్లలో రమేశ్ మెండిస్, అసాంక మనోజ్ చెరో రెండు వికెట్లు తీశారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... ఇరు జట్లు చెరో 45 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయనున్నాయి. జైస్వాల్, పంత్ విఫలం... ఓవర్‌నైట్ స్కోరు 363/8 వద్దే శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టు తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) రెండో బంతికే అవుటయ్యాడు. ఈ దశలో రాహుల్‌తో కలిసి పడిక్కల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. అనంతరం రాహుల్ అవుట్ కాగా... నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చక్కటి డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లు ఎంత ప్రయత్నించినా పడిక్కల్, జడ్డూ జోడీని విడదీయలేకపోయారు. హాఫ్ సెంచరీ అనంతరం జడేజా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా... రిషభ్ పంత్ (2) విఫలమయ్యాడు. ధ్రువ్ జురేల్ (1) కూడా త్వరగానే అవుట్ కాగా... మానవ్ సుతార్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పడిక్కల్ పకడ్బందీ డిఫెన్స్, పక్కా టైమింగ్‌తో షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.సుదర్శన్ అవుట్‌ఈ నెల 15 నుంచి శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు టీమిండియా బ్యాటర్ సాయి సుదర్శన్ దూరమయ్యాడు. జట్టు ఎంపిక సమయంలోనే బుమ్రా, సుదర్శన్ ఫిట్నెస్ సాధిస్తేనే సిరీస్‌లో ఆడించనున్నట్లు సెలక్టర్లు ప్రకటించగా... ఇప్పుడు ఆ ఇద్దరూ జట్టుకు దూరమయ్యారు. గత నెల భారత ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక ‘ఎ’ జట్టుతో ఆడుతున్న సమయంలో సుదర్శన్ కాలి వేలికి గాయమైంది. అప్పటి నుంచి సుదర్శన్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ)లో వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. ‘సుదర్శన్ లంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతడు పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని వైద్య బృందం తెలిపింది’ అని బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఆంధ్ర ఆటగాడు రషీద్ ఖాన్, మహారాష్ట్ర ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌లో ఒకరిని భారత జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. -
ఆకట్టుకోని మన బౌలర్లు
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా వామప్ మ్యాచ్‌లో భారత బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ పోరులో మన ప్రధాన పేసర్లు సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. మూడు రోజుల మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఎల్సీ ఎలెవన్ జట్టు శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. రవిందు రసంతా (143 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్), నిషాన్ ఫెర్నాండో (65 బంతుల్లో 66; 11 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ సొనాల్ దినుషా (72 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో రాణించారు. పసిండు సూర్యబండారా (35; 6 ఫోర్లు), పవన్ రత్నాయకే (39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), అహాన్ విక్రమసింఘే (31; 4 ఫోర్లు), రమేశ్ మెండిస్ (32; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించడంతో శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టు మంచి స్కోరు సాధించింది.ఓపెనర్లు నిషాన్, రవిందు తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించి జట్టుకు గట్టి పునాది వేశారు. భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ (13 ఓవర్లలో 0/44), ప్రసిధ్ కృష్ణ (8 ఓవర్లలో 0/32) పెద్దగా ప్రభావం చూపకపోవడంతో... లంక ఓపెనర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. తొలి సెషన్ పూర్తిగా లంక ఆధిపత్యం సాగగా... రనౌట్ రూపంలో భారత్‌కు మొదటి వికెట్ దక్కింది. అయితే ఆ తర్వాత కూడా ఎస్ఎల్సీ ఎలెవన్ జట్టు ఎక్కడా తగ్గలేదు. క్రీజులోకి వచ్చిన ప్రతీఒక్కరూ తమవంతు పరుగులు రాబట్టడంతో వాళ్ల ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లు ఓడిపోయిన భారత జట్టు... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మార్గాన్ని సుగమం చేసుకోవాలంటే లంకపై సిరీస్ విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఆడుతున్న ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు ఆకట్టుకోలేకపోగా... స్పిన్నర్లు ఫర్వాలేదనిపించారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సారాంశ్ జైన్ 11 ఓవర్లలో వికెట్ పడగొట్టకుండా 54 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌కు ఫస్ట్ క్లాస్ హోదా లేకపోవడంతో తొలి రోజంతా శ్రీలంక క్రికెట్ ఎలెవన్ బ్యాటింగ్ చేయగా... శనివారం మనవాళ్లు బ్యాటింగ్ చేయనున్నారు. చివరిదైన మూడో రోజు ఆదివారం చెరో 45 ఓవర్లు ఆడనున్నారు. గిల్‌కు గాయం గాయం కారణంగా భారత రెగ్యులర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఈ వామప్ మ్యాచ్ బరిలోకి దిగలేదు. గురువారం నెట్ ప్రాక్టీస్ సమయంలో గిల్ కుడి చేతి వేలికు గాయమైంది. దీంతో ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతినిచ్చారు. గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరిస్తున్నాడు. ‘గిల్ కుడి చేతి ఉంగరం వేలికి గాయమైంది. అందుకే వామప్ మ్యాచ్ తొలి రోజు అతడు మైదానంలోకి రాలేదు. బీసీసీఐ వైద్య బృందం అతడిని పరిశీలిస్తోంది. గిల్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ జట్టును నడిపిస్తాడు’ అని బీసీసీఐ ‘ఎక్స్’లో పేర్కొంది. గిల్ పూర్తిగా కోలుకుంటేనే బ్యాటింగ్‌కు రానున్నాడు. లేకపోతే... ఈ నెల 15 నుంచి శ్రీలంక జట్టుతో జరగనున్న తొలి టెస్టులోనే నేరుగా బరిలోకి దిగుతాడు. -
IND vs SL: స్పిన్ ప్రాక్టీస్‌పై దృష్టి
కొలంబో: సొంతగడ్డపై భారత జట్టు ఇటీవల రెండు టెస్టు సిరీస్‌లు కోల్పోయింది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిన ఈ సిరీస్‌లలో అనూహ్యంగా ప్రత్యర్థి స్పిన్నర్లు మనపై ఆధిపత్యం ప్రదర్శించారు. స్పిన్ బౌలింగ్‌ను ఆడటంలో తిరుగులేని రికార్డు ఉన్న టీమిండియా కూడా పూర్తిగా తడబడింది. ఇప్పుడు శ్రీలంకతో భారత్‌కు అదే తరహా సవాల్ ఎదురు కావచ్చు. లంక జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో పాటు సొంతగడ్డపై వారి బలం రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్‌కు ముందు స్పిన్‌లో మరింత సాధన అవసరమని జట్టు భావిస్తోంది. అందుకే నేటి నుంచి జరిగే వామప్ మ్యాచ్‌లో స్పిన్‌ను ఎదుర్కోవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ మూడు రోజుల పోరులో శ్రీలంక క్రికెట్ (ఎస్ఎస్సీ) ఎలెవన్‌లో భారత్ తలపడుతుంది. స్థానిక ఎన్సీసీ గ్రౌండ్లో జరిగే ఈ మ్యాచ్ శ్రీలంకలోని పరిస్థితులపై అలవాటు పడేందుకు కూడా ఉపయోగపడనుంది. భారత్ చివరిసారిగా 2017లో శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడింది. నాటి జట్టులో ఉన్న కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మాత్రమే ఇప్పుడు మళ్లీ ఆడుతున్నారు. మిగతా వారందరికీ లంకలో టెస్టు ఆడటం ఇదే మొదటిసారి కానుంది. వామప్ పోరులో భారత బ్యాటర్లంతా బరిలోకి దిగే అవకాశం ఉంది. బౌలింగ్‌లో ప్రధాన పేసర్ సిరాజ్‌తో పాటు ప్రసిధ్, గుర్నూర్, ఆకిబ్ నబీ ఉన్నారు. కొత్త స్పిన్నర్లు సుతార్, సారాంశ్లకు తమ స్పిన్ బలాన్ని ప్రదర్శించేందుకు ఇది మంచి అవకాశం. ఇటీవల భారత ‘ఎ’ జట్టు తరఫున బ్రార్, సారాంశ్ మెరుగైన ప్రదర్శన కనబర్చడం సానుకూలాంశం. మరోవైపు శ్రీలంక తరఫున 3 టెస్టులు ఆడిన సొనాల్ దినుష ఎస్ఎల్సీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. ఇషిత విజేసుందర్, రమేశ్ మెండిస్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. -
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియాకు తొలి సవాలుకే వాతావరణం అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండగా, రేపటి నుంచి (ఆగస్టు 7) కొలంబోలో శ్రీలంక ‘ఏ’తో భారత్ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.తొలి రోజు ఏకంగా 97 శాతం వర్షావకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఆకాశం 99 శాతం మేఘావృతమై ఉంటుందని అంచనా. ఉష్ణోగ్రత సుమారు 30 డిగ్రీలుగా ఉండనుంది.రెండో రోజు పరిస్థితి మరింత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 8న వర్షం పడే అవకాశం 99 శాతంగా ఉండటంతో పాటు 89 శాతం మేఘావృత వాతావరణం ఉండొచ్చని అంచనాలు చెబుతున్నాయి.మూడో రోజు కూడా వర్షం ముప్పు తప్పేలా లేదు. ఆగస్టు 9న వర్షం పడే అవకాశం 91 శాతంగా, మేఘావృతం 95 శాతంగా ఉండొచ్చని అంచనా.టీమిండియా ప్రాక్టీస్‌కు కీలక మ్యాచ్శ్రీలంకలో టెస్టు సిరీస్‌కు ముందు భారత ఆటగాళ్లకు ఈ వార్మప్ మ్యాచ్ చాలా కీలకం. ముఖ్యంగా శ్రీలంకలోని నెమ్మదైన, స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై బ్యాటర్లు, బౌలర్లు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం.కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మినహా ప్రస్తుత భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు శ్రీలంక గడ్డపై టెస్టు అనుభవం తక్కువ. సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లకు స్థానిక పరిస్థితులపై కొంత అనుభవం ఉన్నప్పటికీ, పూర్తి స్థాయి టెస్టు సిరీస్ అనుభవం లేదు.వార్మప్ రద్దయితే ఇబ్బందే!మూడు రోజులూ వర్షం ముప్పు అధికంగా ఉండటంతో వార్మప్ మ్యాచ్ పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ పూర్తిగా రద్దయితే శ్రీలంక పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత ఆటగాళ్లకు మరో అవకాశం ఉండదు.గతంలోనూ వర్షం కారణంగా ప్రాక్టీస్ మ్యాచ్‌లు రద్దై, విదేశీ పర్యటనల్లో టీమిండియా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కొలంబోలోనూ అదే పరిస్థితి ఎదురైతే, ఆగస్టు 15న గాలేలో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు భారత్‌కు ఇది ఎదురుదెబ్బగా మారొచ్చు. -
కొండలు కూలాయి.. ఊర్లు మునిగాయి!
అందమైన ప్రకృతి దృశ్యాలకు పేరుగాంచిన శ్రీలంక ఇప్పుడు ప్రకృతి విలయంతో వణికిపోతోంది. భారీ వర్షాలు, వరదలు, కొండచరియల విరిగిపడటంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. కొండలు కూలి ఇళ్లను మట్టిలో కలిపేయగా.. ఉప్పొంగిన వరదలు గ్రామాలను నీట ముంచాయి. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులై సురక్షిత ప్రాంతాలకు తరలాల్సి వచ్చింది.శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు పరిస్థితిని తీవ్రంగా మార్చాయి. శ్రీలంకలోని మధ్య కొండ ప్రాంతాలు ఈ విపత్తుకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా కాండీ (Kandy), నువర ఎలియా (Nuwara Eliya), బదుల్ల (Badulla), రత్నపుర (Ratnapura) వంటి జిల్లాల్లో భారీ వర్షాలు, కొండచరియల ప్రమాదం పరిస్థితిని మరింత తీవ్రం చేశాయి. పలు ప్రాంతాల్లో రహదారులు మూసుకుపోగా.. ఇళ్లలోకి మట్టి, వరద నీరు చేరింది. దీంతో సహాయక చర్యలకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి.இலங்கையில் வெளுத்து வாங்கிய கனமழை.. 2,300 பேர் பாதிப்பு, 6 பேர் மாயம்!#Srilanka | #Flood | #HeavyRain | #PolimerNews pic.twitter.com/3x6Hw1rK7z— Polimer News (@polimernews) August 4, 2026ఎందుకీ ప్రకృతి బీభత్సం?శ్రీలంక భౌగోళిక పరిస్థితులే ఇలాంటి విపత్తులకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. ఆ దేశంలోని మధ్య, పర్వత ప్రాంతాల్లో ఎత్తైన కొండలు, వాలు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు నేలలోకి అధికంగా నీరు చేరి బలహీనపడుతుంది. దీంతో కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడి దిగువ ప్రాంతాలను ముంచెత్తుతాయి.వాతావరణ మార్పుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుండటం కూడా ప్రమాద తీవ్రతను పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. అడవుల నరికివేత, కొండ ప్రాంతాల్లో నిర్మాణాలు కూడా ప్రమాదాన్ని మరింత పెంచే అంశాలుగా మారుతున్నాయి.మృత్యువాత.. నిరాశ్రయులుగా వేలాది మందితాజా విపత్తులో పలువురు మృతి చెందగా.. మరికొందరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఏడుగురు మృతి చెందినట్లు అధికారిక ప్రకటన వెలువడినా.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని పరిస్థితి చెబుతోంది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు శ్రీలంక సైన్యం, నేవీ, అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగాయి. పడవలు, ప్రత్యేక సహాయక బృందాల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్లపై పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు.ఒక్క వర్షం.. భారీ నష్టంశ్రీలంకకు వరదలు, కొండచరియలు కొత్త సమస్య కాదు. ప్రతి ఏటా వర్షాకాలంలో పర్వత ప్రాంతాలు ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటుంటాయి. అయితే ఈసారి వర్ష తీవ్రత ఎక్కువగా ఉండటంతో నష్టం కూడా భారీగా నమోదవుతోంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించేందుకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రమాద ప్రాంతాల్లో ప్రజల తరలింపు వంటి చర్యలు కీలకంగా మారాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజల భద్రతపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.మొత్తంగా.. ప్రకృతి కన్నెర్రతో శ్రీలంక మరోసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు కొండచరియలు.. మరోవైపు వరదలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
శ్రీలంక చేరిన భారత బృందం
కొలంబో: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు శుబ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు కొలంబోకు చేరుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. టాపార్డర్ బ్యాటర్ సాయి సుదర్శన్ మినహా మిగతా 14 మంది మంగళవారం శ్రీలంకలో అడుగు పెట్టారు. ఈ నెల 15 నుంచి గాలేలో తొలి టెస్టు, 23 నుంచి కొలంబోలో రెండో టెస్టు నిర్వహిస్తారు. వీటికి ముందు ఈ నెల 7 నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఆడుతుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ రెండు టెస్టుల్లో భారత్ గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు మెరుగుపడతాయి. చివరిసారిగా 2017లో శ్రీలంకలో మూడు టెస్టుల సిరీస్ కోసం పర్యటించిన భారత్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే గత ఏడాది నవంబర్‌లో సొంతగడ్డపై ఆఖరి టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా... దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో ఓటమి పాలైంది. మరోవైపు సాయి సుదర్శన్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ మరింత స్పష్టతను ఆశిస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో రీహాబిలిటేషన్ తర్వాత కూడా అతను పూర్తిగా కోలుకోలేదు. దాంతో జట్టుతో కలిసి అతను శ్రీలంకకు వెళ్లలేదు. ప్రస్తుతం సుదర్శన్ గాయం పరిస్థితిని బోర్డు వైద్యులు సమీక్షిస్తుండగా... అతను త్వరలోనే పూర్తి ఫిట్‌గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే శుక్రవారం నుంచి జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే సుదర్శన్ బరిలోకి దిగుతాడు.భారత ఫీల్డింగ్ కోచ్‌గా శుభదీప్...శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ నుంచి భారత జట్టుకు కొత్త ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు చేపడుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్ స్థానంలో బీసీసీఐ శుభదీప్ ఘోష్‌ను కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. 57 ఏళ్ల శుభదీప్ గతంలో రెండేళ్ల పాటు భారత మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశాడు. భారత ‘ఎ’, అస్సాం సీనియర్ టీమ్‌కు కూడా కోచింగ్ ఇచ్చిన అనుభవం అతనికి ఉంది. అస్సాంకు చెందిన శుభదీప్ 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 17 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లు ఆడాడు. భారత ఫీల్డింగ్ కోచ్‌గా 2021–2025 వరకు నాలుగేళ్ల పాటు పని చేసిన దిలీప్ ... ఆ తర్వాత కాంట్రాక్ట్ పొడిగింపుతో మరో ఏడాది పని చేశాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ తర్వాత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే కూడా తప్పుకున్నాడు. డస్కటే, దిలీప్‌ల సేవలను ప్రశంసిస్తూ మంగళవారం బీసీసీఐ సోషల్ మీడియాలో ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది. -
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరం
న్యూఢిల్లీ: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో... పనిభారం, భవిష్యత్తులో కీలక సిరీస్‌లను దృష్టిలో పెట్టుకొని అతడికి ఇంకొన్నాళ్లు విశ్రాంతి అవసరమని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ) వైద్యబృందం భావిస్తోంది. బుమ్రా స్థానంలో సెలక్టర్లు దేశవాళీల్లో రాణిస్తున్న జమ్మూకశ్మీర్ పేసర్ అఖీబ్ నబీని ఎంపిక చేయనున్నారు. -
పాక్‌ను మరోసారి చిత్తు చేసిన శ్రీలంక.. మరో సిరీస్ కైవసం
శ్రీలంక పర్యటనలో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టుకు వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. తొలుత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కోల్పోయిన (1-2తో) ఈ జట్టు.. తాజాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది.డంబుల్లా వేదికగా ఇవాళ జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు పాక్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రీలంక మరో 14 బంతులు (17.4 ఓవర్లు) మిగిలుండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ చమారీ ఆటపట్టు (40), సంజనా కవిండి (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడి లంక విజయంలో కీలకపాత్ర పోషించారు. విష్మి గుణరత్నే (31), హర్షిత సమరవిక్రమ (37 నాటౌట్) కూడా ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖర్లో కవిష దిల్హరి (14 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించింది. పాక్ బౌలర్లలో హనీ 2, వహీదా, అయేషా జాఫర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు పాక్ తరఫున ఓపెనర్లు మునీబా అలీ (45), షావాల్ జుల్ఫికర్ (48) రాణించారు. ఆఖర్లో ఫాతిమా (30 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. మిగతా ప్లేయర్లలో ఎమాన్ నసీర్ 21, అయేషా జాఫర్ 8, సైరా జబీన్ 16, హనీ 2 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో ప్రబోధ 2, సుగంధక కుమారి, చమారీ ఆటపట్టు, కవిష దిల్హరి తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో టీ20 ఆగస్ట్ 4న జరుగనుంది. -
సారాంశ్‌కు స్వాగతం
న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కింది. దశాబ్ద కాలానికి పైగా దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న ఆఫ్‌స్పిన్నర్ సారాంశ్ జైన్‌కు ఎట్టకేలకు భారత టెస్టు జట్టు నుంచి పిలుపు వచ్చింది. వచ్చే నెల శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 33 ఏళ్ల సారాంశ్ ఎంపికయ్యాడు. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలెలో... రెండో టెస్టు కొలంబోలో ఆగస్టు 23 నుంచి 27 వరకు జరుగుతాయి. ఈ సిరీస్ కోసం బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం శుబ్‌మన్ గిల్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గాయాలతో ఇబ్బంది పడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌ను కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే పర్యటన ప్రారంభానికి ముందు ఈ ఇద్దరూ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానాన్ని సారాంశ్‌తో భర్తీ చేశారు. మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఆల్‌రౌండర్... ఇటీవల శ్రీలంక ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ ‘ఎ’ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. జట్టులో ఉన్న రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ ముగ్గురూ లెఫ్టార్మ్ స్పిన్నర్లు కావడంతో... వైవిధ్యం కోసం కుడిచేతి వాటం స్పిన్నర్ సారాంశ్‌ను ఎంపిక చేశారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 54 మ్యాచ్‌లు ఆడిన సారాంశ్ 27.30 సగటుతో 188 వికెట్లు పడగొట్టాడు.భారత టెస్టు జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్‌పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, బుమ్రా, సిరాజ్, ప్రసిధ్, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్. -
మరోసారి పాక్ చిత్తు.. సిరీస్ శ్రీలంక వశం
శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పర్యాటక పాకిస్తాన్ జట్టు 1-2 తేడాతో కోల్పోయింది. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జులై 28) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 40 ఓవర్లలో 187 పరుగులకే చాపచుట్టేయగా.. శ్రీలంక 37.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ పాక్ గెలవగా.. రెండు, మూడు మ్యాచ్‌లను గెలిచిన శ్రీలంక సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య జులై 31, ఆగస్ట్ 2, 4 తేదీల్లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది.చెలరేగిన లంక బౌలర్లుటాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన శ్రీలంక పాక్‌ను స్వల్ప స్కోర్‌కే మట్టికరిపించింది. చేతన విముక్తి (3-36), కెప్టెన్ చమారీ (3-27), కవిష దిల్హరి (3-27) చెలరేగి బౌలింగ్ చేశారు. పాక ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసిన ఫాతిమా సనా టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా ప్లేయర్లలో గుల్ ఫెరోజా (40), మునీబా అలీ (34), నజిహా అల్వి (30) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు కూడా సత్తా చాటారు. చమారీ ఆటపట్టు (52), హాసిని పెరీరా (50 నాటౌట్), హర్షిత సమరవిక్రమ (71 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి, తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరి ఇన్నింగ్స్‌లో విష్మి గౌతమ్ (12) మాత్రమే తక్కువ స్కోర్‌కు ఔటైంది. -
సుందర్ సందేహమే!
న్యూఢిల్లీ: వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనున్న భారత టెస్టు జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందుకు కసరత్తులు చేస్తోంది. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయాలు సెలక్షన్ కమిటీని ఇబ్బంది పెడుతున్నాయి. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో చివరి వన్డేకు దూరమైన బుమ్రా... సుదీర్ఘ ఫార్మాట్లో బరిలోకి దిగడంపై సందేహాలున్నాయి. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా తొలి టెస్టు వరకు కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు... శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనుంది. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలెలో తొలి టెస్టు జరగనుండగా... 23 నుంచి 27 వరకు కొలంబోలో రెండో టెస్టు నిర్వహించనున్నారు. పేస్ ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా కండరాల గాయాలతో ఇబ్బంది పడుతుండగా... వీరిద్దరు లంక పర్యటనకు వరకు కోలుకునే అవకాశం లేదని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ) వెల్లడించింది. ‘సుందర్ రెండో టెస్టు వరకు ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. దీంతో సెలక్టర్లు అతడిని కేవలం ఒక్క టెస్టుకే పరిగణించవచ్చు. అది కూడా ఫిట్నెస్ సాధిస్తేనే. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్యాదవ్తో పాటు... నాలుగో స్పిన్నర్‌గా హర్‡్ష దూబేకు అవకాశం దక్కొచ్చు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. శ్రీలంక ‘ఎ’ జట్టుతో సిరీస్‌లో భారత్ ‘ఎ’ తరఫున ఆకట్టుకున్న ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్‌ను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. లోయర్ ఆర్డర్లో చక్కటి బ్యాటింగ్ చేయగల సామర్థ్యం సారాంశ్ సొంతం. జీషాన్ అన్సారీ, విప్రాజ్ నిగమ్‌ను కూడా పరిశీలించవచ్చు. బుమ్రా అందుబాటులో లేకుంటే... మొహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఆకట్టుకున్న ఆకాశ్‌దీప్ కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. హార్దిక్ ఆగస్టు తర్వాతే... మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వచ్చే నెల తర్వాతే సెలక్టర్ల పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బెంగళూరుకు మకాం మార్చిన పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ‘వన్డే, టి20 ఫార్మాట్లు ఆడేందుకు హార్దిక్ సిద్ధమవుతున్నాడు. ఈ నెలాఖరులోగా అతడు ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. వచ్చే నెలలో అతడు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ప్రస్తుతం బెంగళూరు సీఓఈలో అతడి సాధన సాగుతోంది. అటు ఫిట్నెస్ మెరుగు పరుచుకోవడానికి కృషి చేస్తూనే... పూర్తి స్థాయిలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. -
భారత జెన్-జీకి పాక్, శ్రీలంక, నేపాల్ సెల్యూట్.. రియాక్షన్లు ఇవే..
భారత జెన్-జీని తరచూ మొబైల్లో ఎక్కువ సమయం గడిపే తరం, ప్రతి విషయాన్నీ మీమ్స్‌గా మార్చే తరం, తీవ్రమైన అంశాలపై ఎక్కువసేపు దృష్టి పెట్టని తరంగా భావించేవారు. కానీ గత నెల రోజులుగా అదే బలహీనతలు వారి అతిపెద్ద బలంగా మారాయి. వరుసగా సాగిన విద్యార్థి ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేశాయి. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలో సంప్రదాయ రాజకీయ ప్రకటనల స్థానంలో మీమ్స్ వచ్చాయి. ఇన్‌స్టా రీల్స్ ప్రజలను సమీకరించే సాధనంగా మారాయి.ఈ ఉద్యమం ఇప్పుడు భారత్‌కే పరిమితం కాలేదు. పొరుగు దేశాల్లో కూడా దీని గురించి చర్చ సాగుతోంది. జెన్-జీ దృష్టి త్వరగా మళ్లిపోతుందని సాధారణంగా చెబుతుంటారు. కానీ భారత్‌లో జరిగిన ఈ ఉద్యమం శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్ యువత దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ దేశాల్లో గతంలో కూడా యువజన ఉద్యమాలు జరిగాయి. అందువల్ల భారత్‌లోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమంపై అక్కడ ప్రత్యేక ఆసక్తి కనిపించింది.దీనిపై పాకిస్థాన్ యువతి ఒకరు మాట్లాడుతూ.. "ఇలా చేస్తుంటే ప్రేమలో పడిపోతానేమో... మీరు ఇంత బాగా చేస్తుంటే నేను మిమ్మల్ని ఎలా ద్వేషిస్తాను?" అని అన్నారు. భారత జెన్-జీ చూపించిన ధైర్యం, ఐక్యత ఎవరినైనా ఆకట్టుకుంటాయి. సరిహద్దులు వేరు కావచ్చు. కానీ ఈ తరం ఆలోచనలు, ఉత్సాహం ఒక్కటేనని చెప్పారు. పాకిస్థాన్‌కు చెందిన పలువురు యువకులు అవకాశం వస్తే తామూ భారత విద్యార్థుల్లాగే వీధుల్లోకి వచ్చేవాళ్లమని అన్నారు. ఓ యువకుడు మాట్లాడుతూ.. "కాక్రోచ్ జనతా పార్టీ చాలా కూల్‌గా ఉంది. వారు అవసరానికి మించి సీరియస్‌గా ఉండరు. అదే నాకు నచ్చింది. జెన్-జీకి సాటి ఎవరూ లేరు" అని చెప్పాడు.ఒక ప్లేట్ బిర్యానీకే అమ్ముడుపోయేవాళ్లం ముంబైలో వైరల్ అయిన ఓ వీడియోను కూడా అతను ప్రస్తావించాడు. అందులో పోలీసులు విద్యార్థులను వాహనంలో తీసుకెళ్తుండగా, వెనుక నుంచి ఎవరో నిశ్శబ్దంగా తాళం తీసేయడంతో విద్యార్థులు బయటకు వచ్చి పరుగులు తీశారు. మరో పాకిస్థాన్ యువకుడు మాట్లాడుతూ.. భారత విద్యార్థులు మతం, కులానికి అతీతంగా ఐక్యంగా నిలిచారని, కానీ పాకిస్థాన్‌లో ప్రజలు పంజాబీ-పష్తూన్, సున్నీ-షియా వంటి విభజనల్లో ఉన్నారని అన్నాడు."అదే భారత్ జెన్-జెడ్ అతిపెద్ద బలం. పాకిస్థాన్ జెన్-జీ అంత సులభంగా ఒక్కటవుతుందని నాకు అనిపించడం లేదు." భారత్ ఉద్యమానికి పాకిస్థాన్ నుంచి నిధులు వస్తున్నాయన్న ఆరోపణలపై పాకిస్థాన్ కంటెంట్ క్రియేటర్ బిలాల్ హసన్ వ్యంగ్యంగా మాట్లాడుతూ.. "మా దేశాన్ని నడపడానికే మా దేశం వద్ద డబ్బు లేదు. భారత ఉద్యమానికి ఎలా నిధులు ఇస్తాం?" అని అన్నాడు.బిలాల్ హసన్ అనే యువకుడు మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్ జరగొచ్చు. కానీ పాకిస్థాన్‌లో చాలా సందర్భాల్లో ప్రజలను నేరుగా తీసుకెళ్లి అదృశ్యం చేస్తారు’’ అని చెప్పారు. పాకిస్థాన్‌లో చాలామందిని "ఒక ప్లేట్ బిర్యానీ"కే కొనుగోలు చేయవచ్చని వ్యాఖ్యానించారు.శ్రీలంక యువతపై ప్రభావంభారత విద్యార్థి ఉద్యమం శ్రీలంక యువతపై కూడా ప్రభావం చూపింది. 2022లో శ్రీలంక యువత ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత రాజపక్స ప్రభుత్వం అధికారాన్ని వీడింది. ఇప్పుడు శ్రీలంకలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపై కార్టూన్లు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా వచ్చాయి. ప్రముఖ కార్టూనిస్ట్ అవంతా ఆర్టిగాలా పంచుకున్న వ్యంగ్య చిత్రంలో ప్రభుత్వం "బొద్దింకలను" అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, భారత్ ఇళ్లలో వాడే "లక్ష్మణ రేఖ" కూడా వాటిని ఆపలేకపోయినట్టు చూపించారు.భారత్ ఉద్యమంలో ఎక్కువగా చర్చకు వచ్చిన చిత్రం ముంబైకి చెందిన రియా అహీర్ పోలీసు వాహనం ముందు చేతులు చాపి నిలిచిన ఫొటో. చాలామంది దీన్ని 1989 తియానన్మెన్ స్క్వేర్‌లోని ప్రసిద్ధ "ట్యాంక్ మ్యాన్" చిత్రంతో పోల్చారు. శ్రీలంక లా కాలేజీ విద్యార్థిని స్వస్థిక అరులింగం ఫేస్బుక్లో ఈ చిత్రాన్ని పంచుకుంటూ "వైబింగ్ ఎట్ అనదర్ లెవల్" అని రాశారు. 2022 శ్రీలంక ఉద్యమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త బువాంకా పెరేరా ఇన్‌స్టాగ్రామ్‌లో భారత యువతకు సందేశం పంపారు."శ్రీలంక నుంచి ప్రారంభమై ఆసియా అంతటా వ్యాపించిన యువజన ఉద్యమాల జ్వాల భారత్‌ను చాలాకాలం తాకలేదనిపించింది. కానీ ఇప్పుడు రాజ్యాంగం, దేశ వ్యవస్థాపకులు కలలు కన్న భారత్ కోసం భారత యువత పోరాడుతుండటం చూసి ఆనందంతో కళ్లలో నీళ్లు వస్తున్నాయి" అని ఆయన అన్నారు. నేపాల్ యువత మద్దతునేపాల్లో కూడా భారత్ జెన్-జీ ఉద్యమంపై సానుకూల స్పందనలు వచ్చాయి. కాఠ్మాండూ కంటెంట్ క్రియేటర్ అవినాశ్ మిశ్రా మాట్లాడుతూ.. భారత విద్యార్థుల ఆగ్రహం పూర్తిగా సమంజసమని, దాన్ని అతిగా స్పందించారని చెప్పలేమన్నారు. "వీధుల్లో విద్యార్థులను చూసినప్పుడు నా మనసు అప్పుడూ బాధపడింది. ఇప్పుడూ బాధపడుతోంది" అని చెప్పారు. 2025లో నేపాల్ జెన్-జీ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, అది కూడా యువత శక్తికి ఉదాహరణగా నిలిచి చివరకు కేపీ ఓలీ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేసిందని అన్నారు.జెన్-జీ నుంచి ప్రపంచం నేర్చుకుంటోంది..ఢిల్లీ జంతర్ మంతర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచం తొలిసారి భారత్ జెన్-జీ మీమ్స్, నినాదాలు, వైరల్ వీడియోలను చూసి నవ్వడమే కాదు, వాటి నుంచి నేర్చుకోవడం కూడా ప్రారంభించింది. పొరుగు దేశాల నుంచి వచ్చిన స్పందనలు చూస్తే, భారత్ విద్యార్థి ఉద్యమం సరిహద్దులు దాటి యువతకు స్ఫూర్తిగా మారిందని తెలుస్తోంది. శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్‌కు చెందిన పలువురు యువకులు భారత విద్యార్థుల ఐక్యత, ధైర్యం, సృజనాత్మక నిరసనను ప్రజాస్వామ్య ఉద్యమానికి కొత్త ఆదర్శంగా అభివర్ణించారు. -
సెంచరీలతో కదంతొక్కిన లంక ప్లేయర్లు.. చిత్తుగా ఓడిన పాక్
3 మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు తొలి ఓటమి చవిచూసింది. వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.హంబన్‌తోట వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. సిద్రా అమీన్ (100) అజేయ శతకంతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఏమాత్రం తడబడని శ్రీలంక విష్మి గుణరత్నే (123), హర్షిత సమరవిక్రమ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో 46.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.పాక్ ఇన్నింగ్స్‌లో సిద్రా సెంచరీతో సత్తా చాటగా.. మునీబా అలీ (45), అయేషా జాఫర్ (49), కెప్టెన్ ఫాతిమా సనా (25) విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు. శ్రీలంక తరఫున విష్మి గుణరేత్న ఔటయ్యాక.. హర్షితకు కవిష దిల్హరి (40 నాటౌట్) సహకరించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవడంతో సిరీస్ 1-1 వద్ద కొనసాగుతోంది. తొలి వన్డేలో శ్రీలంకపై పాక్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లోని నిర్ణయాత్మక మూడో వన్డే ఇదే హంబన్‌తోట వేదికగా జులై 28న జరుగనుంది. -
చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్
ఆంటిగ్వాలో వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు హైస్కోరింగ్ డ్రాగా ముగియడంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించిన విండీస్, రెండో టెస్టును డ్రాగా ముగించడంతో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 2023 ఫిబ్రవరి తర్వాత వెస్టిండీస్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. అలాగే శ్రీలంకపై 2003 తర్వాత ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం.రెండో టెస్ట్ చివరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 92/2తో ఆట ప్రారంభించిన శ్రీలంక వేగంగా పరుగులు సాధించింది. కెప్టెన్ ధనంజయ డి సిల్వా, సోనాల్ దినూష, మిలన్ రత్నాయకే వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడడంతో లంచ్ సమయానికి 281 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అనంతరం ఆధిక్యాన్ని 300 దాటించిన శ్రీలంక 251/9 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దినేశ్ చండిమల్ 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కమిందు మెండిస్ 44 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీశాడు.306 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ ఓపెనర్లు జాన్ క్యాంప్‌బెల్, బ్రాండన్ కింగ్ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా బ్యాటింగ్ చేశారు. మధ్యలో రెండు సార్లు చిరుజల్లులు ఆటకు అంతరాయం కలిగించినా ఫలితంపై ప్రభావం చూపలేదు. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో బ్రాండన్ కింగ్ ఎల్బీగా ఔటైనట్లు అంపైర్ ప్రకటించినా, డీఆర్ఎస్లో నిర్ణయం మారడంతో శ్రీలంకకు నిరాశ ఎదురైంది.చివరికి క్యాంప్‌బెల్ (51 నాటౌట్), బ్రాండన్ కింగ్ (51 నాటౌట్) అర్ధసెంచరీలతో జట్టును నిలబెట్టగా, ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 549/9 డిక్లేర్ చేయగా, లహిరు ఉదార 188, సోనాల్ దినూష 92, కమిందు మెండిస్ 84 పరుగులతో రాణించారు. ప్రత్యుత్తరంగా వెస్టిండీస్ 499 పరుగులు చేసింది. జస్టిన్ గ్రీవ్స్ 180, షాయ్ హోప్ 112 పరుగులతో ఆకట్టుకోగా, శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండో ఐదు వికెట్లు పడగొట్టాడు. కాగా, తొలి టెస్టులో సాధించిన ఘన విజయమే సిరీస్ ఫలితాన్ని వెస్టిండీస్‌కు అనుకూలంగా మలిచింది. -
డబుల్ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్.. హోప్ శతకం
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక మ్యాచ్‌పై పట్టు సాధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసి, ఓవరాల్‌గా 142 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకా ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో విజయానికి అవసరమైన లక్ష్యాన్ని నిర్దేశించేందుకు శ్రీలంక ప్రయత్నిస్తోంది.మూడో రోజు ప్రారంభమైన జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్ భాగస్వామ్యం నాలుగో రోజు కూడా కొనసాగింది. ఓపికగా బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరూ శతకాలు నమోదు చేశారు. హోప్ (112) తన కెరీర్లో ఐదో టెస్టు సెంచరీని, స్వదేశంలో తొలి టెస్టు శతకాన్ని నమోదు చేయగా.. గ్రీవ్స్ (180) తన మూడో టెస్టు సెంచరీని పూర్తి చేశాడు. గ్రీవ్స్ కెరీర్లో రెండో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.గ్రీవ్స్-హోప్ 76.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 242 పరుగుల భారీ భాగస్వామ్యానికి నెలకొల్పారు. వీరిద్దరూ ఔటైన తర్వాత విండీస్ ఇన్నింగ్స్ ఎంతో సేపు కొనసాగలేదు. ఓ దశలో 5 వికెట్లకు 438 పరుగులతో బలంగా కనిపించిన వెస్టిండీస్ చివరి ఐదు వికెట్లను కేవలం 61 పరుగులకే కోల్పోయి 499 పరుగులకు ఆలౌటైంది.దీంతో తొలి ఇన్నింగ్స్‌ను 549/9 వద్ద డిక్లేర్ చేసిన శ్రీలంకకు 50 పరుగుల ఆధిక్యం లభించింది. అసిత ఫెర్నాండో ఐదు వికెట్లతో రాణించాడు.రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే శ్రీలంకకు షమార్ జోసెఫ్, అల్జారీ జోసెఫ్ షాకిచ్చారు. లహిరు ఉదారా నాలుగు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే ఎల్బీగా వెనుదిరగగా, నిషాన్ మదుష్కను అల్జారీ ఔట్ చేశాడు. దీంతో శ్రీలంక 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.ఆ క్లిష్ట సమయంలో దినేశ్ చండిమల్, కమిందు మెండిస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 60 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించారు. చండిమల్ 66 బంతుల్లో 40 పరుగులతో, కమిందు మెండిస్ 35 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.సంక్షిప్త స్కోర్లు:శ్రీలంక: 549/9 డిక్లేర్ & 92/2 (దినేశ్ చండిమల్ 40*, కమిందు మెండిస్ 30*)వెస్టిండీస్: 499 (జస్టిన్ గ్రీవ్స్ 180, షాయ్ హోప్ 112; అసిత ఫెర్నాండో 5/130)శ్రీలంకకు మొత్తం 142 పరుగుల ఆధిక్యంకాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ నెగ్గిన వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
లంక జైల్లో గ్యాంగ్ వార్
కొలంబో (శ్రీలంక): శ్రీలంకలోని నెగొంబో జైల్లో ఆదివారం మొదలైన గ్యాంగ్ వార్ 26 మంది ప్రాణాలు తీసింది. వందమంది గాయపడ్డారు. మృతుల్లో శిక్ష అనుభవిస్తున్న నేరగాళ్లతోపాటు జైలు గార్డులు కూడా ఉన్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. నేరగాళ్ల గుంపులు మొదట ఆదివారం ఒకరితో ఒకరు తలపడటంతో ఈ గ్యాంగ్ వార్ మొదలైంది. అయితే సోమవారం వీరు జైల్లోని తుపాకులు కూడా లాక్కోవడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. అచ్చం సినిమాల్లో చూపినట్టుగానే మత్తుమందుల రవాణాకు సంబంధించి రెండు వైరి గ్రూపుల మధ్య వివాదంతో ఘర్షణ మొదలైనట్లు ప్రాథమిక విచారణ ద్వారా తెలిసింది. ఒక వర్గం మత్తుమందుల రవాణాకు పాల్పడతూండగా ఇంకో వర్గం దాన్ని వ్యతిరేకించింది.ఒక వర్గం సమాచారం ప్రత్యర్థి వర్గానికి ఎవరు అందించారన్న విషయమై ఘర్షణ మొదలైనట్లు తెలిసింది. ఆదివారం రెండు వర్గాల వారు కలబడటంతో 20మంది వరకూ మరణించారు. ఆ తరువాత కొందరు మహిళ ఖైదీలు ఆదివారం రాత్రి జైలు పైకప్పుపై నిరసన ప్రదర్శన నిర్వహిస్తూండగా అది పాక్షికంగా కూలిపోయింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా ఫలించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం కూడా జైల్లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగాయి.తొలి రోజు ఘటనలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగిన ఖైదీలు జైలు ఆయుధాగారంలోకి చొరబడి తుపాకులు స్వా«దీనం చేసుకున్నారు. కాల్పులు జరిపారు. ఫలితంగా నలుగురు గార్డులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు నెగొంబో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనల్లో సుమారు వంద మంది దాకా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఖైదీలతో పాటు గార్డుల్లో చాలామంది తుపాకీ కాల్పుల కారణంగా గాయపడ్డారని, పలువురు కత్తిగాటు గాయాలతో ఉన్నారని నెగెంబో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిలో కొందరిని కొలంబో జాతీయ ఆసుపత్రికి తరలించారు. -
ఘోరంగా తన్నుకున్నారు.. 25 మంది మృతి, 100 మందికి గాయాలు
కొలంబో: శ్రీలంకలోని నెగొంబో జైల్లో ఖైదీలు తీవ్ర ఘర్షణకు దిగారు. దీంతో 25 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 100 మందికి తీవ్రగాయాలయ్యాయి. అంతమంది ఖైదీలు ఘర్షణ పడుతున్న సమయంలో అక్కడి పోలీసులు ఏమీ చేయలేకపోయారు.మృతుల్లో నలుగురు గార్డులు ఉన్నారని అధికారులు తెలిపారు. గత ఐదేళ్లలో శ్రీకంలోని జైళ్లలో ఇంతటి ఘౌరమైన అల్లర్లు ఎన్నడూ జరగలేదని చెప్పారు. రాజధాని కొలంబోకు ఉత్తర దిశలో ఉన్న నెగొంబో ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు."కొంతమందికి తుపాకీ గాయాలు ఉన్నాయి. ఇంకొందరికి కత్తి కోతలు, తీవ్ర గాయాలు ఉన్నాయి" అని అధికారులు తెలిపారు. నెగొంబో జైలులో ఆదివారం సాయంత్రం ఘర్షణలు మొదలయ్యాయని అధికారులు తెలిపారు. ఆ జైలులో వేలాది మంది ఖైదీలు ఉన్నారు.ఘర్షణల వార్తలు జైలు అంతటా వ్యాపించడంతో పక్కనే ఉన్న విభాగంలోని మహిళా ఖైదీలు ఆదివారం రాత్రి భవనం పైకప్పుపైకి ఎక్కి తమను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పైకప్పులో ఓ భాగం కూలిపోవడంతో కొంతమంది మహిళలకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. సోమవారం పోలీసు కమాండోలను పిలిపించినా వారిని జైలు లోపలికి పంపలేదు.సోమవారం ఖైదీల బంధువులు పెద్ద సంఖ్యలో జైలు బయటకు చేరుకున్నారు. పరిస్థితిని గమనించేందుకు వైమానిక దళం డ్రోన్లు, హెలికాప్టర్‌ను వినియోగించింది. స్థానికులు తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నామని తెలిపారు. సోమవారం ఉదయం పరిస్థితి అదుపు తప్పిందని ఓ పోలీసు అధికారి ఏఎఫ్పీకి తెలిపారు.కాగా, గతంలోనూ శ్రీలంకలోని జైళ్లలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2020 డిసెంబరులో శ్రీలంకలోని మరో జైలులో జరిగిన అల్లర్లలో 11 మంది ఖైదీలు మరణించారు. 117 మంది గాయపడ్డారు. ఆ సమయంలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తుండటంతో రద్దీగా ఉన్న జైళ్ల నుంచి వందలాది మంది ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆదివారం నాటికి శ్రీలంక జైళ్లలో 41,250 మంది ఖైదీలు ఉన్నారని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇది ఆ జైళ్ల సామర్థ్యం కన్నా దాదాపు 4 రెట్లు ఎక్కువ. -
శ్రీలంక చిత్తు.. 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
గాలే వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన రెండో అనాధికారిక టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో భారత్-ఎ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో ఇండియా సొంతం చేసుకుంది. తొలి టెస్ట్ డ్రా అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక-ఎ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సహాన్ అరాచిగే శతక్కొట్టగా (127).. నువానిదు ఫెర్నాండో 44, అంజల బండారా 42 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, సారాన్ష్ జైన్ నాలుగేసి వికెట్లతో సత్తా చాటగా.. యశ్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 543 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియా ఓపెనర్ సాయి సుదర్శన్ (267 బంతుల్లో 168; 22 ఫోర్లు) భారీ సెంచరీ చేయగా... దేవదత్ పడిక్కల్ (94) , కెప్టెన్ ధ్రువ్ జురేల్ (88 బంతుల్లో 53; 6 ఫోర్లు), సారాన్ష్ జైన్ (137 బంతుల్లో 70; 3 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీలతో మెరిశారు.శ్రీలంక బౌలర్లలో కేశర నువాంత నాలుగు, సుదీరా తిలకరత్నే మూడు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత 177 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక 209 పరుగులకే కుప్పకూలింది. మరోసారి గుర్నూర్ బ్రార్ 6 వికెట్లు పడగొట్టి లంకేయుల పతనాన్ని శాసించాడు. దీంతో ఆతిథ్య శ్రీలంక భారత్ ముందు కేవలం 33 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. ఈ లక్ష్యాన్ని ఇండియా-ఎ జట్టు వికెట్ నష్టపోకుండా 6.2 ఓవర్లలో చేధించింది. -
దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (549-9 డిక్లేర్) చేసింది.అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోయి 58 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు ఇంకా 491 పరుగుల వెనుకబడి ఉంది.రెండో రోజు ఆటలో కుసాల్ మెండిస్ (69), సోనల్ దినుషా (92) విండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీరిద్దరూ వీలు చిక్కనప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఆరో వికెట్‌కు 143 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఆఖర్లో మిలన్ రత్నాయకే (15), ప్రభాత్ జయసూర్య (17 నాటౌట్), విజెసుందర (14) ఓ మోస్తరు పరుగులు చేయడంతో శ్రీలంక 500 పరుగుల మార్కును దాటింది. అంతకుముందు ఓపెనర్ లహీరు ఉదారా (188) భారీ శతకంతో కదంతొక్కగా.. కమిందు మెండిస్ (84) అర్ద సెంచరీతో రాణించాడు.549 పరుగుల భారీ లక్ష్యానికి స్పందనగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బ్రాండన్ కింగ్‌ను (17) అసిత ఫెర్నాండో ఔట్ చేశాడు. అనంతరం జాన్ క్యాంప్‌బెల్ (31), కావెమ్ హాడ్జ్ (6) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజు ఆటను ముగించారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఆతిథ్య వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
శ్రీలంక ఓపెనర్ సరికొత్త చరిత్ర
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఓపెనర్ లాహిరు ఉదారా సరికొత్త చరిత్ర సృష్టించాడు. నార్త్ సౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు బాదిన అతడు.. ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక ఓపెనర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లంక టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఉదారాకు ముందు ఏ ఓపెనర్ ఓ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు కొట్టలేదు. గతంలో ఆ దేశ దిగ్గజం సనత్ జయసూర్య రెండు సార్లు ఓ ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు కొట్టాడు.ఈ రికార్డుతో పాటు ఉదారా ఓ భారీ శతకం కూడా సాధించాడు. 248 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 188 పరుగులు చేసి ఔటయ్యాడు. కెరీర్లో కేవలం మూడో టెస్టు మాత్రమే ఆడుతున్న 32 ఏళ్ల ఉదారా ఈ ఇన్నింగ్స్‌తో మరో అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు.వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన శ్రీలంక ఓపెనర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు దిముత్ కరుణరత్నె పేరిట ఉండేది. 2015లో గాలే టెస్టులో కరుణరత్నె 186 పరుగులు చేశాడు. తాజగా ఉదారా ఈ రికార్డును బద్దలు కొట్టాడు.ఇక ఓవరాల్‌గా ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఓపెనర్ రికార్డు టీమిండియా యువ కెరటం యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. జైసూ 2024లో ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన టెస్టులో ఏకంగా 12 సిక్సర్లు (214 నాటౌట్) బాది ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ చెరో 11 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఉదారా భారీ శతకంతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఉదారాకు కమిందు మెండిస్ (84) కూడా సహకరించడంతో ఈ స్కోర్ సాధ్యపడింది. మిగతా ప్లేయర్లలో నిషన్ మధుష్క (6), దినేశ్ చండీమల్ (1), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (33) ఔట్ కాగా.. కుసాల్ మెండిస్ (0), సోనల్ దినుష (5) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో షమార్ జోసఫ్ 2, జేడన్ సీల్స్, అల్జరీ జోసఫ్, జస్టిన్ గ్రీవ్స్ తలో వికెట్ తీశారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో భారీ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
పుంజుకున్న టీమిండియా బౌలర్లు.. లంక బ్యాటర్లు కట్టడి
శ్రీలంక-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో భారత బౌలర్లు పుంజుకున్నారు. తొలి రోజు పెద్ద ప్రభావం చూపని వీరు, రెండో రోజు లంక బ్యాటర్లను కట్టడి చేశారు. ఫలితంగా ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక స్కోర్ 288-5గా ఉండింది. రెండో రోజు ఆట తొలి సెషన్లోనే గుర్నూర్ బ్రార్ (22-277-4), సరాన్ష్ జైన్ (30-2-92-4) చెలరేగడంతో ఆ జట్టు 61 పరుగుల వ్యవధిలో మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. 83 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రెండో రోజు బరిలోకి దిగిన లంక కెప్టెన్ సహన్ అరచ్చిగే (127) సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓవర్‌నైట్ బ్యాటర్ అంజల బండార (42) అదే స్కోర్ వద్ద ఔటయ్యాడు. లంక ఇన్నింగ్స్‌లో పవంత వీరసింఘే 39, సోహన్ డి లివెరా 28, నువనిదు ఫెర్నాండో 44, అషేన్ బండార 34, చమిక గుణశేఖర 13, కేశర నువంత 1, దిలుమ్ సుదీర 20, అసంక మనోజ్ 4, దులజ్ సముదిత 2 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బ్రార్, సరాన్ష్ కాకుండా యశ్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. -
నేటి నుంచి భారత్ ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ రెండో టెస్టు
గాలె: యువ ఆటగాళ్లతో నిండిన భారత ‘ఎ’ జట్టు... గురువారం నుంచి శ్రీలంక ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగియగా... భారత జట్టు నుంచి ఓపెనర్ సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్ సెంచరీలు చేశారు. ఈ పర్యటనలో ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత ‘ఎ’జట్టు... సుదీర్ఘ ఫార్మాట్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. తొలి టెస్టు ‘డ్రా’ కావడంతో... నేటి నుంచి ప్రారంభం కానున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో రాణించి సిరీస్ పట్టేయాలని చూస్తోంది.యువ పేసర్లను తీర్చిదిద్దాలని భావిస్తున్న మేనేజ్మెంట్... ఇటీవల టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన గుర్నూర్ బ్రార్‌ను శ్రీలంక పిచ్‌లపై పరీక్షించనుంది. అతడితో పాటు అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్పిన్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్... తొలి మ్యాచ్‌లోనూ 10 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం కౌంటీల్లో సైతం రాణించిన సుతార్... ఇప్పుడు భారత్ ‘ఎ’ తరఫున ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. హర్ష్ దూబేకు తుది జట్టులో చోటు కష్టమే. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ప్లేయర్లలో పలువురు ఆటగాళ్లు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో... ఆఖరి పోరులో జట్టు కూర్పు ఎలా ఉంటుందో చూడాలి. అమన్ మోఖడే, జీషన్ అన్సారీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. గత మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన టీమిండియా ప్లేయర్ సాయి సుదర్శన్ పూర్తిగా కోలుకోకపోతే అతడి స్థానంలో అమన్ మోఖడే ఇన్నింగ్స్ ఆరంభించవచ్చు. -
జురేల్ అజేయ శతకం
గాలె: శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టు భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 333/4తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ధ్రువ్ జురేల్ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు 111.4 ఓవర్లలో 452/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ ధ్రువ్ జురేల్ (215 బంతుల్లో 141 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో కదంతొక్కాడు. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు షేక్ రషీద్ (113 బంతుల్లో 63; 5 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో పది పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగాడు. దీంతో 136 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రషీద్ అవుటైనా... హర్ష్ దూబే (51 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో ధ్రువ్ జురేల్ దూకుడు కొనసాగించాడు. లంక బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న జురేల్... వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. లంక బౌలర్లలో చమిక గుణశేకర 3 వికెట్లు పడగొట్టగా... డిలుమ్ సుదీర రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ‘ఎ’ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. నువానీడు ఫెర్నాండో (103 బంతుల్లో 65 బ్యాటింగ్; 7 ఫోర్లు) అజేయ హాఫ్‌సెంచరీతో పోరాడుతున్నాడు. ఓపెనర్లు నిరోషన్ డిక్వెల్లా (10), పవంత వీరసింఘే (11) విఫలమవడంతో ఒక దశలో లంక 38/2తో కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో అషెన్ బండారా (51 బంతుల్లో 18 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో కలిసి ఫెర్నాండో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఒక్కో పరుగు జోడిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. వీరిద్దరూ అబేధ్యమైన మూడో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. చేతిలో 8 వికెట్లు ఉన్న శ్రీలంక ‘ఎ’ జట్టు... ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టు స్కోరుకు ఇంకా 339 పరుగులు వెనుకబడి ఉంది. ఫెర్నాండో, బండారా క్రీజులో ఉన్నారు. భారత ‘ఎ’ బౌలర్లలో అన్షుల్ కంబోజ్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. -
ఐటీ ఉద్యోగం పోయింది : నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్
ఉద్యోగం పోయిందని ఏ మాత్రం బెంబేలెత్తిపోలేదు. అస్సలు అధైర్యపడలేదు. నిరాశ అంతకన్నా పడలేదు. మొదట్లో కాస్త కంగారుగా అనిపించాన, వెంటనే తన జీవనం కోసం కొత్త మార్గాలు ఏమున్నాయా అని అన్వేషించాడు. ఆ అన్వేషణ ఫలితమే అతనికి కొండంత ధైర్యాన్నిచ్చింది. తన సొంత గ్రామంలోనే సూపర్ మార్కెట్ ప్రారంభించాడు. కేవలం మూడు నెలల్లోనే విజయం సాధించిన శ్రీలంకకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్ఫూర్తిదాయక స్టోరీ ఇది.శ్రీలంకకు చెందిన సమీత సులక్కన అనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లింక్డ్ఇన్ (LinkedIn) వేదికగా పంచుకున్న తన విజయగాథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది. కంపెనీలో జరిగిన లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకున్నాడు.ఐటీ ఉద్యోగం నుండి వ్యాపారం వైపు..సమీత సులక్కన తన విజయ గాథను లింక్డ్ఇన్ పోస్ట్‌లో వివరించారు. దీని ప్రకారం ఇటీవల కంపెనీలో జరిగిన భారీ లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు సమిత. మిగిలిన వారిలాగే భవిష్యత్తుపై ఒక్కసారిగా అనిశ్చితి ఏర్పడింది. టెకీలకు ఐటీ రంగంలోనే కెరీర్ ఉంటుందని భావించాడు. పైగా ఐటీ అనేది ప్యాషన్. కానీ, ఆ కష్టకాలంలో అవకాశాలు ఎప్పుడూ మనం అనుకున్న రూపంలోనే రావని చాలా తొందరగానే గ్రహించాడు. అందుకే మరో టెక్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా, తన గ్రామంలో ప్రజలకు అవసరమైన సరుకులు అందించే ఒక మినీ సూపర్ మార్కెట్ కూడా లేదని గమనించి, ఒక కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని స్వయంగా ఒక స్టోర్‌ను ప్రారంభించాడు.సంప్రదాయ వ్యాపారానికి టెక్నాలజీ హంగులుతాను చదువుకున్న చదువును, టెక్నాలజీ నేపథ్యాన్ని తన వ్యాపారంలో ఉపయోగించాలని సమిత నిర్ణయించుకున్నాడు. సాధారణ కిరాణా దుకాణంలా కాకుండా భిన్నంగా ఆలోచించాడు. కస్టమర్ల సౌకర్యం కోసం 'క్యాష్ ఆన్ డెలివరీ' (COD) సదుపాయంతో కూడిన ఒక సాధారణ ఆన్లైన్ ఆర్డరింగ్ విధానాన్ని ఆయనే స్వయంగా డెవలప్ చేసుకున్నాడు. దీనివల్ల కస్టమర్లు ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేసుకునే వీలు కలిగింది. అంతే ఆర్డర్లు భారీగా వచ్చాయి. వ్యాపారం చాలా వేగంగా పుంజుకుంది. కేవలం మూడు నెలల్లోనే రోజువారీ టర్నోవర్ రూ. 50,000 దాటింది. ఈ సూపర్ మార్కెట్‌తో పాటు, తన గ్రామంలో 'ప్యూరిఫైడ్ వాటర్' (శుద్ధి చేసిన తాగునీరు) సరఫరా చేసే మరో వ్యాపారాన్ని కూడా ప్రారంభించాలని సమిత యోచిస్తున్నాడు.ఇదీ చదవండి: ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు : సియా, తల్లి షాకింగ్ రియాక్షన్నిరుద్యోగులకు, యువతకు సమిత సలహా"ఈ అనుభవం నాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది: మనం మారడానికి, ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉంటే.. మనకు ఎదురయ్యే ఎదురుదెబ్బలే కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఉద్యోగ రంగంలో అనిశ్చితిని ఎదుర్కొంటున్న వారు ఎవరూ అందోళన పడకండి. ప్రణాళిక వేసుకోండి, అవసరమైతే చిన్నగా ప్రారంభించండి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. పరిస్థితులు అన్నీ అనుకూలంగా మారేవరకు వేచి చూస్తే విజయం రాదు. ఇతరులు అడుగు ముందుకు వేయడానికి భయపడు తున్నప్పుడు, మనం మొదటి అడుగు వేస్తేనే విజయం లభిస్తుంది." అంటూ తన లాంటివారికి సూచిస్తున్నారు సమిత.ఇదీ చదవండి: తండ్రి చివరి కోరిక : వీడియో కాల్‌లోనే పెళ్లి, అంతలోనే..!నెటిజన్ల ప్రశంసలుసమిత తీసుకున్న నిర్ణయం, సాధించిన విజయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అద్భుతం, నువ్వు నిజంగా ఒక స్ఫూర్తివి సమిత అని ఒకరంటే, "గతేడాది నాకూ ఇలాగే ఉద్యోగం పోయింది బ్రదర్. దాంతో నేను నా సొంత క్లాత్ బ్రాండ్ ప్రారంభించాను. నాణ్యత అనేది కేవలం సాఫ్ట్వేర్కే కాదు, మన చుట్టూ ఉన్న అన్నిటికీ వర్తిస్తుంది. ప్రస్తుతం నేను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్ని" అంటూ మరో యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ, సమితను అభినందించారు.(ఆపరేషన్ సింధూర్‌లో అసువులు బాసిన సైనికులు వీరే!) -
సాయి సుదర్శన్ శతకం
గాలె (శ్రీలంక): ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత ‘ఎ’ జట్టు... శ్రీలంక ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల తొలి అనధికారిక టెస్టులోనూ శుభారంభం చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ధ్రువ్ జురేల్ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. టీమిండియా ప్లేయర్ సాయి సుదర్శన్ (175 బంతుల్లో 132; 19 ఫోర్లు) సూపర్ సెంచరీతో చెలరేగాడు. సుదీర్ఘ ఫార్మాట్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న సుదర్శన్... లంక బౌలర్లపై అదే దూకుడు కొనసాగించాడు. కొలత వేసినట్లు బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పూర్తి నియంత్రణతో బ్యాటింగ్ చేస్తూ జట్టుకు గట్టి పునాది వేశాడు. కెప్టెన్ ధ్రువ్ జురేల్ (138 బంతుల్లో 68 బ్యాటింగ్; 5 ఫోర్లు), ఆంధ్రప్రదేశ్ ఆటగాడు షేక్ రషీద్ (92 బంతుల్లో 53 బ్యాటింగ్; 4 ఫోర్లు) అజేయ అర్ధశతకాలతో రాణించారు. ఈ జంట అబేధ్యమైన ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించింది. ఆయుశ్ పాండే (25), దేవదత్ పడిక్కల్ (12), రుతురాజ్ గైక్వాడ్ (22) ఎక్కువసేపు నిలవలేకపోయారు. లంక బౌలర్లలో డిలుమ్ సుదీరా 2 వికెట్లు పడగొట్టాడు. తొలి రోజు మనవాళ్లు 3.87 రన్‌రేట్‌తో పరుగులు సాధించారు. -
రేపటి నుంచి భారత్-శ్రీలంక తొలి టెస్ట్
శ్రీలంక పర్యటనలో వన్డే ట్రై-నేషన్ సిరీస్‌ను విజయవంతంగా ముగించిన భారత్-ఏ జట్టు ఇప్పుడు రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ రేపటి నుంచి (జూన్ 25) గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. భారత్-ఏ జట్టుకు వికెట్‌కీపర్-బ్యాటర్ ధృవ్ జురెల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న జురెల్‌కు ఇది కెప్టెన్‌గా కీలక అవకాశం. జట్టు వైస్ కెప్టెన్‌గా దేవదత్ పడిక్కల్ వ్యవహరించనున్నాడు. ఇటీవల ముగిసిన ట్రై-నేషన్ ‘ఏ’ సిరీస్‌లో భారత్-ఏ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్లో శ్రీలంక-ఏను 66 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు అదే జోరును నాలుగు రోజుల ఫార్మాట్లో కొనసాగించాలని భారత్-ఏ లక్ష్యంగా పెట్టుకుంది. గాలే పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో బ్యాటర్లకు ఇది కఠిన పరీక్షగా మారే అవకాశం ఉంది. మరోవైపు స్వదేశంలో ఆడుతున్న శ్రీలంక-ఏ జట్టు కూడా ప్రతిఘటన చూపేందుకు సిద్ధమవుతోంది.తొలి మ్యాచ్ రేపటి నుంచి 28 వరకు జరుగుతుండగా, రెండో మ్యాచ్ జూలై 2 నుంచి 5 వరకు గాలే వేదికగానే నిర్వహించబడుతుంది.జట్ల వివరాలు..భారత ఏ జట్టు: సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, అమన్ మోఖడే, ఆయుశ్ పాండే, షేక్ రషీద్, రుతురాజ్ గైక్వాడ్, హర్షిత్ దూబే, అన్షుల్ కంబోజ్, సరాన్ష్ జైన్, ఆకిబ్ నబీ దార్, ధృవ్ జురెల్, ఎన్ జగదీశన్, గుర్నూర్ బ్రార్, యశ్ ఠాకూర్, జీషన్ అన్సారీశ్రీలంక ఏ జట్టు: నువనిదు ఫెర్నాండో, అషెన్ బండార, అహాన్ విక్రమసింఘే, అసంక మనోజ్, పవంత వీరసింఘే, సహాన్ అరచ్చిగే (కెప్టెన్), రవిందు ఫెర్నాండో, దిలుమ్ సుదీర, ప్రవీణ్ మనీషా, కేషారా నువంత, సోహన్ డి లివేరా, నిరోషన్ డిక్వెల్లా, కవిందు పతిరత్నే, మొహమ్మద్ షిరాజ్, చమిక గుణశేఖర, దులాజ్ సముదిత, -
చమరి చమక్
శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు అజేయ సెంచరీతో విజృంభించింది. మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భాగంగా గత మూడు మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన లంక సారథి ఐర్లాండ్‌పై విరుచుకుపడింది. సాధించాల్సిన లక్ష్యం 131 పరుగులే ఉన్నా... అందులోనే అజేయ సెంచరీతో అదరగొట్టింది. మొదట లంక బౌలర్ల క్రమశిక్షణకు ఐర్లాండ్ స్వల్ప స్కోరుకే పరిమితం కాగా... చమరి మెరుపులతో శ్రీలంక సునాయాసంగా గెలుపు తీరం దాటింది. లంకకు ఇది రెండో విజయం కాగా... ఐర్లాండ్ ఆడిన నాలుగో మ్యాచ్‌లోనూ పరాజయం మూటగట్టుకుంది. బ్రిస్టల్: మహిళల టి20 ప్రపంచకప్‌లో శ్రీలంక రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్–2లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో లంక 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. కెప్టెన్ గాబీ లూయిస్ (50 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధశతకంతో మెరవగా... లీ పాల్ (27 బంతుల్లో 20; 1 ఫోర్), అలీస్ టెక్టర్ (21 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. లంక బౌలర్ల ధాటికి 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ జట్టును కెప్టెన్ గాబీ ఆదుకుంది. అయితే ఆమె ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన లంక బౌలర్లు ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. మిథాలీ అయోధ్య, సుగంధిక, చమరి, నీలాక్షిక తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 15.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 134 పరుగులు చేసి విజయం సాధించింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చమరి ఆటపట్టు (61 బంతుల్లో 106 నాటౌట్; 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో ఆకట్టుకుంది. మరో ఓపెనర్ ఇమేషా దులానీ (27 బంతుల్లో 20; 3 ఫోర్లు) కెప్టెన్‌కు సహకారం అందించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 12 ఓవర్లలో 98 పరుగులు జోడించడంతోనే లంక గెలుపు ఖాయమైంది. బౌండరీల వరద.. గత మ్యాచ్ అనంతరం సారథిగా విఫలమయ్యానని చెప్పిన చమరి... ఇన్నింగ్స్ తొలి బంతికే ఫోర్ కొట్టి తన ఉద్దేశాన్ని చాటింది. అక్కడి నుంచి మొదలుకొని మ్యాచ్ ముగిసే వరకు బౌండరీల వరద పారించింది. మూడో, నాలుగో ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన చమరి... ఐదో ఓవర్లో మూడు ఫోర్లు అరుసుకుంది. ఏడో ఓవర్లో మరో ఫోర్‌తో 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 2, 27, 4 పరుగులు చేసిన చమరి... ఈసారి పూర్తి సాధికారికతతో బ్యాటింగ్ చేసింది. బౌలర్‌తో సంబంధం లేకుండా తన ధాటిని కొనసాగించింది. హాఫ్‌సెంచరీ అనంతరం మరింత వేగంగా ఆడిన చమరి చూస్తుండగానే లక్ష్యాన్ని కరిగించింది. 13వ ఓవర్లో 4, 6, 4 కొట్టిన చమరి... అదే జోరులో 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. చమరికి ఇది నాలుగో అంతర్జాతీయ టి20 శతకం కావడం విశేషం. ఆమె దూకుడుతో లంక జట్టు మరో 27 బంతులుండగానే లక్ష్యాన్ని ఛేదించి రన్‌రేట్‌ను కాస్త మెరుగు పరుచుకుంది. గ్రూప్–2లో ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలతో చెరో 6 పాయింట్లు సాధించి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ (0.122 రన్‌రేట్) 2 విజయాలు, 2 పరాజయాలతో 4 పాయింట్లు సాధించి మూడో స్థానంలో కొనసాగుతుండగా... ఇప్పుడు రెండో విజయంతో లంక జట్టు కూడా 4 పాయింట్లు సాధించింది. అయితే నెట్ రన్‌రేట్ (–0.973)లో వెనుకబడి పట్టిక నాలుగో ‘ప్లేస్’లో నిలిచింది. తమ తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం స్కాట్లాండ్తో లంక తలపడనుంది. -
మాన్సూన్ మజిలీకి కేరాఫ్ అడ్రస్..
అక్కడి వర్షపు చినుకులు ప్రకృతి రంగులను మరింత గాఢంగా మార్చేస్తాయి. ప్రతి అడుగులో పచ్చని వనాలు, మేఘాల చాటున కనిపించే కొండలు, అలల మధ్య నవ్వే తీరాలు.. కల కలిసిన దేశం శ్రీలంక. భారత దేశానికి దగ్గరగా ఉన్న ఈ చిన్న ద్వీప దేశం, మాన్ సూన్ సీజన్ లో ఒక కొత్త రూపం ధరిస్తుంది. ఒక వైపు సముద్ర అలలు, మరో వైపు టీ ప్లాంటేషన్స్, ఇంకొక వైపు ప్రాచీన దేవాలయాలు, కొలనియల్ వీధులు అన్నీ కలిసి ప్రయాణాన్ని గుర్తిండిపోయే అనుభవంగా మారుస్తాయి..శ్రీలంక అనేది దక్షిణ ఆసియాలో హిందూ మహా సముద్రం మధ్య ఉన్న అందమైన ద్వీపదేశం. రాజధాని శ్రీ జయవర్ధనపుర కొట్టే కాగా, ఆ దేశ ఆర్థిక రాజధాని కొలంబో. వర్షాకాలంలో ముఖ్యంగా నైరుతీ, దేశ మధ్య భాగాలు పచ్చదనంతో మెరిసిపోతాయి. చిన్న దూరం ప్రయాణం చేస్తే బీచుల నుంచి హిల్ స్టేషన్ కి, అక్కడి నుంచి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ వరకు సీనరీ మారిపోవడం శ్రీలంక ప్రయాణంలో ఉన్న ప్రత్యేకత.గాలే ఫేస్ గ్రీన్..కొలంబోలో ప్రయాణం మొదలైతే సముద్ర గాలి, మోడరన్ సిటీ రిథమ్ రెండూ కలిసి ఒక ఆహ్లాదకరమైన ఆరంభాన్ని ఇస్తాయి. గాలే ఫేస్ గ్రీన్ ప్రాంతంలో సాయంత్రం సమయంలో అలల మధ్య నడుస్తుంటే సమయం మెల్లగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి గాలే ఫేస్ గ్రీన్ దిశలో వెళ్లినప్పుడు డచ్ ఫోర్ట్ మధ్య నడిచే ప్రతి వీధి చరిత్రని గుర్తుచేయడం మొదలు పెడుతుంది. ఓల్డ్ బిల్డింగ్స్, స్టోన్ రోడ్స్, సముద్ర అలల మధ్య ఈ ప్రదేశం ఒక పెయింటింగ్‌లా ఉంటుంది.కేండీ చేరిన వెంటనే పరిసరాలు పూర్తిగా మారిపోతాయి. కొండల మధ్య ఉన్న ఈ నగరంలో మేఘాలు దిగివచ్చినట్టు ఉంటాయి. టెంపుల్ ఆఫ్ టూత్ చుట్టూ ఉన్న ప్రశాంతత యాత్రకు మరో అర్థం ఇస్తుంది. సరస్సు పక్కన సాయంత్రం నడిచే సమయం చాలా మధురంగా అనిపిస్తుంది.నువారా ఎలియాకి చేరిన తరువాత టీ ప్లాంటేషన్స్ మధ్య వెళ్తున్న రైల్ జర్నీ ఒక సినిమా సీన్ లా ఉంటుంది. పచ్చని టీ తోటలు, చిన్న చిన్న జల΄ాతాలు, మేఘాల మధ్య కనిపించే స్టేషన్స్ ప్రతి నిమిషం కెమెరాలో కాకుండా మనసులో నిలిచిపోయే దృశ్యాలుగా మిగిలిపోతాయి.ఎల్లాలో నైన్ ఆర్చ్ బ్రిడ్జి దగ్గర రైలు మెల్లగా వెళ్తుంటే ఈ శబ్దం మధ్య ప్రకృతి ఒక సంగీతం వినిపిస్తున్నట్టు ఉంటుంది. లిటిల్ ఆడమ్స్ పీక్‌పై గాలి నిలబడి చూస్తే మేఘాల కింద ప్రపంచం వెలుగుతున్నట్టు కనిపిస్తుంది. యాలా నేషనల్ ΄ార్క్లో ప్రకృతి ఇంకో రూపం కనిపిస్తుంది. అడవి మధ్య సఫారీ చేస్తూ జింకలు, ఏనుగులు, పక్షులను చూడటం ప్రయాణానికి ఇంకో అనుభవం కలిగిస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి కొలంబోకి డైరెక్ట్ ఫ్లైట్స్, వన్ స్టాప్ ఫ్లైట్స్ రెగ్యులర్‌గా ఉంటాయి. సుమారు రెండు నుండి నాలుగు గంటల ప్రయాణం తరువాత సముద్రం మధ్య ఉన్న ఈ ఐలాండ్‌ని చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుండి బయటకి వచ్చిన వెంటనే తేమతో కూడుకున్న గాలి, కొబ్బరి చెట్లు, సముద్ర వాసనలు లంకకి స్వాగతం చెబుతాయి.విజయవాడ నుంచి ప్రయాణం చేయాలి అనుకునే వారు హైదరాబాద్ లేదా చెన్నై నుంచి కొలంబోకి విమానంలో చేరుకోవచ్చు. ఫ్లైట్ జర్నీ చిన్నదిగా ఉండటం వల్ల వీకెండ్ హాలిడేస్‌ని కలుపుకుని కూడా మంచి మాన్ సూన్ వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు.శ్రీలంకలో రైల్ జర్నీలు కూడా ఈ యాత్రలో ఒక ముఖ్యమైన భాగం. కేండీ నుంచి ఎల్లా వరకు వెళ్లే ట్రైన్ రూట్ ప్రపంచంలో అందమైన రైల్వే జర్నీస్‌లో ఒకటిగా అనిపిస్తుంది. విండో పక్కన కూర్చొని బయటి ప్రకృతిని చూస్తూ వెళ్తే దూరం అనేది పెద్ద భాగంగా అనిపించదు.ఎక్కడ ఉండాలి?కొలంబోలో బీచ్ ఫేసింగ్ హోటల్స్ నుంచి బోటీక్ స్టేస్ వరకు అనేక ఆప్షన్స్ ఉంటాయి. గాలేలో కాలనియల్ స్టైల్ హెరిటేజ్ హోటల్స్ అనేవి ఓల్డ్ వరల్డ్ చార్మ్‌ని అందిస్తాయి. కేండీలో లేక్ వ్యూ రిసార్ట్స్ ప్రశాంతతని కలిగిస్తాయి. నువారా ఎలియాలో బ్రిటిష్ స్టైల్ కాటేజీలు, టీ ఎస్టేట్ బంగ్లాల్లో ఉండటం ఒక నాస్టాల్జిక్ ఎక్స్‌పీరియెన్స్‌లా ఉంటుంది. ఎల్లాలో కొండల మధ్య ఉన్న ఎకో స్టేస్‌లో ప్రతి ఉదయం మేఘాల మధ్య కాఫీ తాగడం మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.ఏం తినాలి?శ్రీలంక రుచులు మన సౌత్ ఇండియా ఫ్లేవర్స్కి దగ్గరగా ఉన్నా వాటి స్పెషాలిటీ వాటిదే. రైస్, కర్రీ ప్రతి భోజనంలో ఒక కొత్త కాంబినేషన్ ఇస్తుంది. హాపర్స్, స్ట్రింగ్ హాపర్స్, కొట్టు రోటి, పోల్ సంభోల్, ఫిష్ కర్రీ, కోకోనట్ కర్రీస్ రుచులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సాయంత్రం ఒక హాట్ సిలోన్ టీతో మేఘాలు చూస్తూ గడిపే నిమిషాలు ప్రయాణంలో అత్యంత మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.ఆసక్తికరమైన విషయాలు..శ్రీలంకని పర్ల్ ఆఫ్ ది ఓషియన్, భారత దేశపు కన్నీటి బిందువు అని కూడా పిలుస్తారు.కేండీ నుంచి ఎల్లా రైల్వే జర్నీ ప్రపంచంలో అత్యంత అందమైన ట్రైన్ జర్నీ రూట్స్‌లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.సీలోన్ టీ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక టీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేక సంఖ్యలో ఉన్న దేశాల్లో శ్రీలంక కూడా ఒకటి.మాన్ సూన్ సీజన్ లో టీ ప్లాంటేషన్స్, వాటర్‌ఫాల్స్, అడవులు మరింత పచ్చగా కనిపిస్తాయి.యాత్ర బడ్జెట్ వివరాలు..హైదరాబాద్ నుండి 5 రోజుల శ్రీలంక మాన్ సూన్ ట్రిప్‌కి బడ్జెట్ ప్యాకేజీ సుమారు రూ.45,000 నుండి రూ.60 వేల మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ కంఫర్ట్ ట్రిప్ రూ.65 వేల నుండి రూ.90 వేల వరకు ఉంటుంది. ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ రిసార్టులు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కలిపి రూ.1.10 లక్షల వరకు పైకి వెళ్లవచ్చు.విజయవాడ నుండి ప్రయాణం చేస్తే హైదరాబాద్ లేదా చెన్నై కనెక్టింగ్ ఫ్లైట్ బట్టి కొంచెం ట్రావెల్ కాస్ట్ మారవచ్చు. స్టే చార్జీలు బడ్జెట్ హోటల్స్‌లో రాత్రికి రూ.2,500 నుండి మొదలై ప్రీమియం రిసార్టులు రూ.15 వేలు లేదా దానికన్నా ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ రోజుకు సుమారు రూ.1,000 నుంచి రూ.2,000 మధ్య సరిపోతుంది. లోకల్ సైట్ సీయింగ్ ప్యాకేజీలు, సీనిక్ ట్రైన్ జర్నీలు, వైల్డ్ లైఫ్ సఫారీ, టీ ఎస్టేట్స్ ఎక్స్‌పీరియెన్స్‌ని కలిపి కంప్లీట్ ప్లాన్ చేసుకోవచ్చు.ఇండియన్ ΄ాస్పోర్ట్ హోల్డర్స్‌కి శ్రీలంక ఎంట్రీ కోసం వీసా అవసరం లేదు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ద్వారా ముందుగా అప్లై చేసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవడం సులభం.ఏం చూడాలి?శ్రీలంకాలో ప్రతి రోజు ఒక కొత్త రంగులో ప్రారంభం అవుతుంది. ఒక రోజు సన్ రైజ్ బీచ్‌పై కనిపిస్తుంది. మరొక రోజు టీ ప్లాంటేషన్స్ మధ్య మేఘాలు దిగివస్తాయి. ఇంకొక రోజు పురాతన ఆలయాల గంటల నాదం వినిపిస్తుంది. సముద్రంపై సాయంత్రం సూర్యాస్తమయం చూస్తుంటే ఆ వెలుగు నీళ్లపై పడిన ప్రతి నిమిషం ఒక పెయింటింగ్‌లా మారిపోతుంది.వేల్ వాచింగ్ సీజన్ లో మిరిస్సా దగ్గర సముద్రంపై వెళ్తుంటే ప్రకృతి విస్తృత రూపం కనిపిస్తుంది. టీ ఫ్యాక్టరీ విజిట్‌లో ఒక కప్ సిలోన్ టీ వెనుక ఉన్న కష్టం తెలుస్తుంది.లోకల్ మార్కెట్లో రంగురంగుల పండ్లు, మసాలాలు, హ్యాండీక్రాఫ్ట్స్ మధ్య నడుస్తుంటే లంక జీవనశైలిని పూర్తిగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆయుర్వేద వెల్నెస్ ఎక్స్పీరియెన్సెస్, సీనిక్ ట్రైన్ రైడ్, బీచ్ వాక్స్, వైల్డ్ లైఫ్ సఫారీలు, టీ ఎస్టేట్ మార్నింగ్ వాక్స్ ఇవన్నీ ఈ యాత్రని పూర్తి చేస్తాయి. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
సూర్యవంశీ విధ్వసం.. 11బంతుల్లో హాఫ్ సెంచరీ
-
SL vs AFG: ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరంటే?
ముక్కోణపు సిరీస్‌లో అఫ్గానిస్తాన్- ‘ఎ’ ప్రయాణం ముగిసింది. శ్రీలంక- ‘ఎ’తో శుక్రవారం జరిగిన అనధికారిక వన్డేలో అఫ్గాన్ చిత్తుగా ఓడిపోయింది. శ్రీలంక వేదికగా భారత్, లంక, అఫ్గాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచిన భారత్.. తర్వాత అఫ్గాన్, శ్రీలంక చేతిలో ఓడిపోయింది. అయితే, లీగ్ దశలో చివరగా అఫ్గనిస్తాన్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఏకంగా 101 పరుగులతో గెలిచి.. ఫైనల్‌కు దూసుకువెళ్లింది.ఈ క్రమంలో దంబుల్లా వేదికగా మరో ఫైనల్ బెర్తు కోసం శ్రీలంక- అఫ్గాన్ తలపడ్డాయి. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో నిరోషన్ డిక్విల్లా అర్ధ శతకం (66)తో ఆకట్టుకోగా.. అవిష్క ఫెర్నాండో సెంచరీ (110)తో దుమ్ములేపాడు. వన్‌డౌన్ బ్యాటర్ నువానిదు ఫెర్నాండో 45 పరుగులతో రాణించగా.. లోయర్ ఆర్డర్లో రవిందు ఫెర్నాండో 25 రన్స్ రాబట్టాడు.ఫలితంగా శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 322 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ దావూద్జాయ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు, మహ్మద్ ఇబ్రహీం ఒక వికెట్ దక్కించుకున్నారు.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టుకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్, కెప్టెన్ ఇమ్రాన్ మిర్, వన్‌డౌన్ బ్యాటర్ నూర్ ఉల్ రహ్మాన్‌ను దులాజ్ సముదిత డకౌట్ చేశాడు. ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ హసన్ ఎసాఖిల్ ఒంటరి పోరాటం (74) చేయగా.. బహీర్ షా 35, ఫర్మానుల్లా సఫీ 43 పరుగులతో రాణించారు. అయితే, మిగతా వారి నుంచి వీరికి పెద్దగా సహకారం లభించలేదు. దీంతో 42.5 ఓవర్లలో కేవలం 219 పరుగుల చేసి అఫ్గాన్ ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో దులాజ్ సముదిత్ ఐదు వికెట్లతో చెలరేగి అఫ్గాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కుగాతస్ మతూలన్ మూడు, రవిందు ఫెర్నాండో, విజయకాంత్ వియస్కాంత్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో 103 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన శ్రీలంక- ‘ఎ’ జట్టు ఫైనల్‌కు దూసుకుపోయింది. భారత్- ‘ఎ’తో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇరుజట్ల మధ్య ఫైనల్‌కు దంబుల్లా వేదిక. -
శ్రీలంక మాజీ అధ్యక్షుడి కుమారుడు అరెస్ట్
అవినీతి కేసులో శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు యోషిత రాజపక్స బుధవారం అరెస్టయ్యాడు. 38 ఏళ్ల యోషిత నౌకాదళ అధికారిగా పనిచేసిన సమయంలో ప్రభుత్వ నిధులను ఉపయోగించి విదేశీ శిక్షణ పొందినట్లు అవినీతి నిరోధక కమిషన్ ఆరోపించింది.అవసరమైన అర్హతలు లేకపోయినా నౌకాదళంలో నియామకం పొందడం, అనంతరం ప్రభుత్వ ఖర్చుతో బ్రిటన్‌లో శిక్షణకు వెళ్లడంపై దర్యాప్తు జరుగుతోందని కమిషన్ వెల్లడించింది.యోషిత ఇప్పటికే రెండు మనీలాండరింగ్ కేసుల్లో నిందితుడిగా ఉండగా, విదేశీ ప్రయాణాలపై కూడా నిషేధం అమల్లో ఉంది. ఈ కేసుల్లో బెయిల్‌పై ఉన్న అతడిని తాజా ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు.మరోపక్క మహింద రాజపక్స సోదరుడు, మాజీ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స్ కూడా ఇటీవల న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 2019 ఈస్టర్ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి అరెస్టు అవకాశాలను నివారించాలని ఆయన కోర్టును ఆశ్రయించగా, ఈ నెల ప్రారంభంలో అతడి విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించబడింది. -
దోషిగా తేలిన శ్రీలంక ప్లేయర్.. మరో సీనియర్‌కు తప్పని శిక్ష..
-
వైభవ్ కోసం గంటసేపు వెయిట్ చేసిన శ్రీలంక ఫస్ట్ ODI కెప్టెన్ అనుర టెన్నెకూన్
-
టీ20 ప్రపంచకప్‌లో సంచలనం
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ న్యూజిలాండ్‌కు శ్రీలంక జట్టు ఊహించని షాకిచ్చింది. సౌతాంప్టన్ వేదికగా ఇవాళ (జూన్ 16) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. కెప్టెన్ అమేలియా కెర్ (45), సోఫీ డివైన్ (45) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. లంక బౌలర్లలో కవిష దిల్హరి 2 వికెట్లతో సత్తా చాటగా.. మిథాలీ అయోధ్య, సుగంధిక కుమారి, కెప్టెన్ చమారీ ఆటపట్టు, నిమష మీపగే తలో వికెట్ తీశారు.అనంతరం 151 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆదిలో తడబడినప్పటికీ (55 పరుగులకే 4 వికెట్లు).. నిలాక్షిక డిసిల్వ (54 నాటౌట్), కౌషని నుత్యాంగన (24 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లతో మెరిసి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ సత్తా చాటడంతో లంక జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే (19.4 ఓవర్లు) లక్ష్యాన్ని చేరుకుంది (5 వికెట్ల నష్టానికి). కివీస్ బౌలర్లలో నెన్సి పటేల్ (4-0-23-2), రోస్మేరి (4-1-28-0), బ్రీ ఇల్లింగ్ (4-0-33-1) రాణించినా నిలాక్షిక, కౌషని జోడీని నిలువరించలేకపోయారు.ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. శ్రీలంకకు ముందు ఈ జట్టు విండీస్ చేతిలో కూడా చిత్తైంది. లంక విషయానికొస్తే.. ఈ ఎడిషన్‌లో ఈ జట్టుకు ఇదే తొలి గెలుపు. దీనికి ముందు ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడింది. -
ఓటమితో లెక్కలు తారుమారు.. ఇండియా-ఏ ఫైనల్ చేరడం కష్టమే!
ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక వెళ్లిన ఇండియా-ఏ జట్టుకు శ్రీలంక-ఏ చేతిలో సూపర్ ఓవర్ ఓటమి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఓటమి కారణంగా ఇండియా-ఏ జట్టు ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి శుభారంభం చేసిన ఇండియా-ఏ ఆ తర్వాత అఫ్గానిస్తాన్-ఏతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసింది. ఇక సోమవారం లంకతో జరిగిన మ్యాచ్‌లో హైడ్రామా నడుమ సూపర్ ఓవర్లో ఓటమిపాలై రెండో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడి ఒక మ్యాచ్‌లో గెలిచి పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది.ఆఫ్గన్‌పై గెలిచినా..బుధవారం అఫ్గానిస్తాన్ జట్టుతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు తప్పక గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు మ్యాచ్‌లో గెలవడమే కాదు భారీ రన్‌రేట్ సమకూర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ ఆఫ్గన్ చేతిలో ఓడిపోతే మాత్రం ఇండియా-ఏ జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. అదే సమయంలో అఫ్గానిస్తాన్ జట్టు లంకతో జరిగే తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం సమీకరణాలు మారిపోనున్నాయి. ఎందుకంటే ఆఫ్గన్‌పై ఇండియా గెలిచి, శ్రీలంకపై ఆఫ్గన్ గెలిస్తే.. ఇరుజట్లు నాలుగు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలతో ఉంటాయి.కీలకం కానున్న నెట్ రన్‌రేట్ అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకం కానుంది. ఈ రెండు జట్లలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ఫైనల్లో అడుగుపెట్టనుంది. అయితే ప్రస్తుతం రన్‌రేట్ విషయంలో అఫ్గానిస్తాన్ (-1.392)తో పోలిస్తే ఇండియా-ఏ (+0.330)ది పైచేయిగా ఉంది. ఒకవేళ ఆఫ్గన్ లంకతో చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే మాత్రం మెరుగైన రన్‌రేట్‌తో ఫైనల్‌కు వెళ్లే అవకాశముంది. కాబట్టి ఆఫ్గన్‌కు అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే వారిపై భారీ తేడాతో గెలవడం ఇప్పుడు ఇండియా-ఏ జట్టు ముందున్న తక్షణ కర్తవ్యం. అయితే శ్రీలంకతో మ్యాచ్‌లో టాపార్డర్, మిడిలార్డర్ పూర్తిగా విఫలమవ్వడం జట్టు కొంపముంచింది. లోయర్ ఆర్డర్లో సూర్యాన్ష్ హెగ్డె, విప్రజ్ నిగమ్‌లు ఆడకపోయుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. శ్రీలంకతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు సూర్యాన్ష్ షెడ్గే (72 పరుగులు) ఇన్నింగ్స్‌కు తోడు విప్రాజ్ నిగమ్ (51) సంచలన అర్థసెంచరీ చేయడంతో 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో లంక జట్టు కూడా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో శ్రీలంక 16 పరుగులు చేయగా, భారత్ 9 పరుగులకే పరిమితమయ్యి ఓటమి చవిచూసింది.Read: లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై నిషేధం తప్పదా! -
లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై నిషేధం తప్పదా!
శ్రీలంక పర్యటనలో ఉన్న ఇండియా-ఏ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సోమవారం శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో భారత్ ఓటమి చవిచూసింది. అయితే ఈ ఓటమి కంటే వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ హైలైట్‌గా నిలిచింది. లంక ఆటగాళ్ల తప్పు అటుంచితే, వైభవ్ చేసిన తప్పులకు అతడికి శిక్ష తప్పేలా లేదు. మరి ఈ గొడవతో వైభవ్ సూర్యవంశీపై నిషేధం పడనుందా అనేది ఒకసారి తెలుసుకుందాం. నిజానికి ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒక ఆటగాడు ఇలా గొడవ పడితే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అది భారీ జరిమానా నుంచి నిషేధం వరకు ఉంటుంది. అయితే వైభవ్, లంక ఆటగాదళ్ల మధ్య జరిగిన గొడవ అనధికారిక మ్యాచ్ కిందకు రావడంతో ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం తక్కువగానే ఉంటుంది. కేవలం మ్యాచ్ రిఫరీ నుంచి జరిమానా ఎదుర్కొనేందుకు ఆస్కారముంది. అంతేకాదు బీసీసీఐ కూడా వైభవ్ సూర్యవంశీని మందలించడం లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.అసలేం జరిగింది?మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు స్వల్ప గొడవ జరిగింది. వైభవ్, సూర్యాంశ్లను ఉద్దేశించి లంక ఆటగాళ్లు ఏదో అనడంతో క్రికెటర్లు ఒకరిపై మరొకరు దూసుకొచ్చారు. సూర్యాంశ్ వైపు వెళుతున్న విశేన్ హలంబాగేను వైభవ్ అడ్డుకోగా... అతడిని కూడా లంక ఆటగాడు తోసేశాడు. సీనియర్ ఆటగాడు డిక్వెలా జోక్యం చేసుకొని ఇద్దరినీ విడిపించాల్సి వచ్చింది. తిరిగి వెళుతూ కూడా 15 ఏళ్ల వైభవ్ మీ సంగతి చూస్తా అన్నట్లుగా హెచ్చరిస్తూ సైగలు చేయడం కనిపించింది. జాతీయ జట్టులో చోటుఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ ఈ సీజన్లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ సెలెక్టర్లు వైభవ్‌ను ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన టీమిండియా జట్టుకు ఎంపిక చేసింది. తాజా ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రంకు ముందే వైభవ్ సూర్యవంశీ నిషేధం ఎదుర్కోనున్నాడా అనేది చూడాలి. శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్‌లోనూ వైభవ్ సూర్యవంశీ రాణించడంలో విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 69 పరుగులు మాత్రమే చేసిన వైభవ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. టీ20, వన్డే ఫార్మాట్లలో ఒకేలా ఆడుతానంటే కుదరదు.. కొంచెం ఓపిక వహించాల్సిన అవసరముందంటూ అభిమానులు పేర్కొంటున్నారు.Another heated moment between Vaibhav Sooryvanshi and Sri Lankan players. 🥶 https://t.co/iwmOQfMZwv pic.twitter.com/cUINMCFuJ5— Qamar. (@Qamar5618) June 15, 2026A heated moment between Tilak Verma and Umpire. 🤯 pic.twitter.com/pe67HdkoHK— Qamar. (@Qamar5618) June 15, 2026 -
సూర్యాన్ష్ మెరుపులు.. ఇండియా-ఏ భారీ స్కోరు
ముక్కోనఫు వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సూర్యాన్ష్ షెడ్గే (72 పరుగులు) ఇన్నింగ్స్‌కు తోడు విప్రాజ్ నిగమ్ (51) సంచలన అర్థసెంచరీ చేయడంతో ఇండియా-ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ (21) మరోసారి నిరాశపరచగా, రుతురాజ్ గైక్వాడ్ (37), కెప్టెన్ తిలక్ వర్మ (23) పర్వాలేదనిపించారు. ఒక దశలో 143 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇండియా-ఏ జట్టును సూర్యాన్ష్, విప్రజ్ ఆదుకున్నారు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట లోయర్ ఆర్డర్లో సూర్యాన్ష్, విప్రజ్ నిగమ్‌లు బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించారు. ఈ ఇద్దరు కలిసి ఎనిమిదో వికెట్‌కు 104 పరుగులు జోడించడం విశేషం. లంక బౌలర్లలో విజయ్‌కాంత్ వియస్కాంత్ 3 వికెట్లు తీయగా, మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు.చదవండి: పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలు.. గొంతుపట్టుకున్న హర్మన్! -
షనక మెరుపులు
కింగ్స్టన్: వెస్టిండీస్‌తో తొలి టి20లో ఓటమి పాలైన శ్రీలంక జట్టు... రెండో మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. మొదట లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కమిల్ మిషారా (40 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దసున్ షనక (24 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో విజృంభించారు. విండీస్ బౌలర్లలో షామార్ జోసెఫ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ 18.1 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. రావ్మన్ పావెల్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెట్‌మైర్ (26 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాస్త పోరాడగా... తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. లంక బౌలర్లలో హసరంగ, చమీర చెరో మూడు వికెట్లు పడగొట్టారు. -
ఇండియా-ఏకు భారీ షాక్.. వైభవ్ సూర్యవంశీకి గాయం!
ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టుకు భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి గాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం శ్రీలంకతో జరగనున్న వన్డే మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడేది అనుమానంగానే ఉంది. ఆదివారం ప్రాక్టీస్ సెషన్‌కు వచ్చిన వచ్చిన వైభవ్ సూర్యవంశీ గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో వైభవ్ ప్రాక్టీస్ మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే నివేదికలో వైభవ్ సూర్యవంశీ గాయం తీవ్రత ఎంత అనేది స్పష్టంగా తెలియరాలేదు. ఇక రేపు శ్రీలంక-ఏతో జరగనున్న మ్యాచ్‌కు వైభవ్ దూరమైతే అతడి స్థానంలో నిశాంత్ సింధును జట్టులోకి తీసుకునే అవకాశముంది. ఎలాగూ టాపార్డర్‌లో ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య, రుతురాజ్ ఉండడంతో వీరిలో ఇద్దరు ఓపెనర్లుగా వస్తే, ఒకరు వన్‌డౌన్‌లో రావడం ఖాయం. కెప్టెన్ తిలక్ వర్మ నాలుగో స్థానంలో ఆడుతాడు. ఇక వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ, రెండో మ్యాచ్‌లో మాత్రం 22 బంతుల్లో 44 పరుగులతో తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.అయితే వైభవ్ సూర్యవంశీ గాయం అప్డేట్పై ఎలాంటి సమాచారం లేనప్పటికీ రాబోయే ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్ ఆడే టీమిండియా జట్టులో వైభవ్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. వైభవ్‌కు గాయం తీవ్రత ఎక్కువగా లేకపోతే రాబోయే ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు ఆడే సువర్ణావకాశం లభిస్తుంది. ఐపీఎల్ 2026 సీజన్లో సంచలన బ్యాటింగ్‌తో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ అనూహ్యంగా టీమిండియాలోకి ఎంపిక చేసింది. ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్‌కు కూడా వైభవ్ సూర్యవంశీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఒకవేళ ఐర్లాండ్‌తో పర్యటనకు ముందే సూర్యవంశీ ఫిట్నెస్ నిరూపించుకుంటే, సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి అంతర్జాతీయ క్రికెట్లో భారతదేశం తరఫున అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా నిలిచే అవకాశముంది. -
భారత అండర్–19 జట్టులో ప్రతీక్ష
సాక్షి, హైదరాబాద్: శ్రీలంకతో జరిగే మహిళల అండర్–19 వన్డే సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో హైదరాబాద్‌కు చెందిన వి.ప్రతీక్ష ఎంపికైంది. భవికా అహిరే నేతృత్వంలో బరిలోకి దిగే 15 మంది సభ్యుల టీమ్‌లో ప్రతీక్షకు అవకాశం దక్కింది. నగరంలోని మీర్ అకాడమీలో కోచ్‌లు ముస్తఫా అలీ, వసీం అలీ వద్ద ప్రతీక్ష శిక్షణ పొందుతోంది. ఇటీవల దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడంతో ఆమె ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు జట్టులో స్థానం కల్పించారు. జూన్ 30, జులై 3, 6 తేదీల్లో భారత్, శ్రీలంక టీమ్‌ల మధ్య పుదుచ్చేరిలో మూడు వన్డేలు జరుగుతాయి. భారత అండర్–19 మహిళల జట్టు: భవికా అహిరే (కెప్టెన్), ఇరా జాదవ్, దియా యాదవ్, ఈశ్వరి, వి.ప్రతీక్ష, మహతో నిధి, పూర్వ సివాచ్, కుమారి పలక్, మహక్, కాశ్వీ, విధి పర్మార్, గౌరి గోయల్, జాన్వి వికార్, అనాది తగ్డే, కె.దీక్ష. -
ఆడేద్దాం... ధనాధన్
ఒకవైపు క్రీడా లోకమంతా సాకర్ ఫీవర్‌లో మునిగి తేలుతుంటే... మరోవైపు ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్‌నకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఇంగ్లండ్ వేదికగా 24 రోజుల పాటు జరగనున్న మహిళల మహా సంగ్రామంలో 12 జట్లు ట్రోఫీ కోసం కొట్లాడనున్నాయి. గతేడాది వన్డే ప్రపంచకప్ చేజిక్కించుకొని జోరుమీదున్న టీమిండియా... టి20 ఫార్మాట్లోనూ విశ్వ విజేత అనిపించుకోవాలని తహతహలాడుతుంటే... గత రెండు పర్యాయాలు తుది మెట్టుపై బోల్తాపడ్డ దక్షిణాఫ్రికా ఈసారైనా కప్పును ఒడిసిపట్టాలని కృతనిశ్చయంతో ఉంది!మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఆరుసార్లు టైటిల్ నెగ్గిన ఆ్రస్టేలియా ఏడో కప్పు ఖాతాలో వేసుకోవాలనుకుంటుంటే... డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ తమ పట్టు కొనసాగించాలని చూస్తోంది! సంచలన ప్రదర్శనతో రెండోసారి చాంపియన్‌గా నిలవాలని వెస్టిండీస్ భావిస్తుంటే... అప్పుడెప్పుడో ఈ ఫార్మాట్లో జరిగిన తొలి వరల్డ్‌కప్‌లో ట్రోఫీ నెగ్గిన ఇంగ్లండ్... ఇప్పుడు ఆతిథ్య హోదాలో రెండోసారి టైటిల్ హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది! మరెందుకు ఆలస్యం... అటు ‘ఫిఫా’ ప్రపంచకప్‌తో పాటు ఇటు... టి20 మెరుపులు చూసేందుకు సిద్ధమైపోదాం. –సాక్షి, క్రీడావిభాగంరెండేళ్లకోసారి జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్ మరోసారి సందడి చేసేందుకు మన ముందుకు వచ్చేసింది. తొలి ప్రపంచకప్ తర్వాత ఇప్పుడు పదో టోర్నీకి మరోసారి ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తుండగా... 7 వేదికల్లో మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. 12 జట్లు ట్రోఫీ కోసం అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటుండగా... వచ్చే నెల 5న విఖ్యాత లార్డ్స్ మైదానంలో విశ్వవిజేత ఎవరో తేలనుంది. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది వరల్డ్‌కప్‌లలో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా... తమ ఆధిపత్యం కనబర్చాలని చూస్తుంటే... ఇప్పటి వరకు ఒక్కోసారి ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్... రెండో టైటిల్ కోసం నిరీక్షిస్తున్నాయి. ఇక ఈ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా వరల్డ్‌కప్ గెలవని భారత్, దక్షిణాఫ్రికా తమ చిరకాల స్వప్నం సాకారం చేసుకోవాలని భావిస్తున్నాయి. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా... పొట్టి ఫార్మాట్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)తో రాటుదేలిన భారత అమ్మాయిలు... విశ్వ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ... ప్రధాన టోర్నీలో దూకుడే మంత్రంగా ఆడుతామని హర్మన్ వెల్లడించింది. ఇక గత రెండు (2023, 2024) వరల్డ్‌కప్‌లలో ఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా బలమైన బృందంతో బరిలోకి దిగనుంది. సొంతగడ్డ ఇంగ్లండ్‌కు అనుకూలం కానుండగా... డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్‌కు ఆల్‌రౌండర్ల బలగం దండిగా ఉంది. శుక్రవారం శ్రీలంక, ఇంగ్లండ్ మ్యాచ్‌తో ఈ టోర్నీకి తెరలేవనుండగా... టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఎంపిక ఇలా... బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చి న 2024 టి20 ప్రపంచకప్‌లో 10 జట్లు పాల్గొనగా... ఇప్పుడా సంఖ్యను 12కు పెంచారు. ఆతిథ్య హోదాలో ఇంగ్లండ్ నేరుగా వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించగా... 2024 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఐదు జట్లతో పాటు... ఐసీసీ మహిళల టి20 ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ రెండు జట్లను కూడా నేరుగా మెగా టోర్నీకి ఎంపిక చేశారు. ఇక మిగిలిన నాలుగు జట్లను క్వాలిఫయర్ టోర్నీల ద్వారా నిర్ణయించారు. మొత్తం 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి జట్టు గ్రూప్‌లోని మిగిలిన ఐదు జట్లతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడనుంది. గ్రూప్ దశ ముగిశాక రెండు గ్రూప్‌ల్లో టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ప్రైజ్‌మనీ ఎంతంటే... ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 8 లక్షల 76 వేల డాలర్లు (సుమారు రూ. 83 కోట్లు). విజేతకు 23 లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు) లభించనుండగా... రన్నరప్ జట్టుకు 11 లక్షల డాలర్లు (రూ. 11 కోట్లు) దక్కనున్నాయి. సెమీస్‌లో ఓడిన జట్లకు 6 లక్షల డాలర్ల (రూ. 6 కోట్లు) చొప్పున లభించనున్నాయి. 10 ఇది పదో మహిళల టి20 ప్రపంచకప్. 2009లో తొలిసారి ఇంగ్లండ్, వేల్స్ వేదికగా ఈ టోర్నమెంట్ జరగగా... మళ్లీ ఇప్పుడు పదో ఎడిషన్ వరల్డ్‌కప్‌నకు ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తోంది. తొలి టోర్నీలో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ ఆ తర్వాత ఎప్పుడూ ట్రోఫీని అందుకోలేదు. 6 ఆ్రస్టేలియా గెలిచిన టి20 వరల్డ్‌కప్ ట్రోఫీలు. 2010, 2012, 2014, 2018, 2020, 2023లో ఆ్రస్టేలియా చాంపియన్‌గా నిలవగా... ఇంగ్లండ్ (2009), వెస్టిండీస్ (2016), న్యూజిలాండ్ (2024) ఒక్కోసారి ట్రోఫీ దక్కించుకున్నాయి. భారత్ అత్యుత్తమంగా 2020లో రన్నరప్‌గా నిలిచింది. -
భారత్ – ఎ జట్టులో రషీద్‌కు చోటు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరుకు చెందిన యువ క్రికెటర్ షేక్ రషీద్ భారత్ –ఎ జట్టులో స్థానం సంపాదించినట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ త్రీ మెన్ కమిటీ సభ్యుడు టీవీ శివరామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి శ్రీలంకలో జరగనున్న టోరీ్నలో భారత్– ఏ జట్టు తరఫున రషీద్ ఆడనున్నారన్నారు.గతంలో రషీద్ భారత అండర్– 19 వరల్డ్ కప్ పోటీల్లో వైస్ కెపె్టన్‌గా వ్యవహరించడమే కాకుండా, వరల్డ్ కప్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. గతేడాది రంజీ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రతిభ కనబరచడం ద్వారా భారత్ –ఎ జట్టులో స్థానం సంపాదించాడు. రషీద్‌కు త్రీమెన్ కమిటీ సభ్యులు జీవీ శరత్‌బాబు, టీవీ శివరామకృష్ణ, సీహెచ్ నాగరాజు తదితరులు అభినందనలు తెలిపారు. -
బుడోడు కోసం శ్రీలంకలో ఎగబడుతున్న ఫ్యాన్స్..
-
ఎందుకు అలా చేశావు.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్!
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత తొలిసారి బ్యాట్ ఝుళిపించాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-ఎ తరపున వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంకపై విఫలమైనప్పటికి అఫ్గాన్‌పై మాత్రం అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు.15 ఏళ్ల సూర్యవంశీ తనదైన శైలిలో జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు ఒక్క సిక్స్ కూడా కొట్టకుండానే 200 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. అతడు దూకుడు చూసి సెంచరీ బాదడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్‌గా వైభవ్ మలుచుకోలేకపోయాడు.చెత్త షాట్ ఆడి..కాగా వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికి. తనకు ఉన్న ఏకైక వీక్నెస్ ఈ మ్యాచ్‌లోనూ బయటపడింది. 'షార్ట్ ఆఫ్ ఎ లెంగ్త్' బంతికి మరోసారి తన వికెట్‌ను కోల్పోయాడు. ఆఫ్ఘన్ బౌలర్ అబ్దుల్లా అహ్మద్జాయ్ టీమిండియా ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన అబ్దుల్లా అహ్మద్జాయ్.. తొలి బంతిని ఆఫ్ స్టంప్‌కు వెలుపలగా షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని అతడు రాంప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.కానీ ఎక్స్ట్రా బౌన్స్ కారణంగా బంతి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. అసలు ఆ బంతికి ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. కానీ అనవసరంగా లేని షాట్‌ను ఆడి తన హాఫ్ సెంచరీని కోల్పోయాడు. ఐపీఎల్-2026లోనూ చాలా మ్యాచ్‌లలో షార్ట్ లెంగ్త్ బంతికే వైభవ్ ఔటయ్యాడు. అతడి బలహీనతను పసిగట్టిన అఫ్గాన్ పేసర్.. ఒకే లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి బోల్తా కొట్టించాడు. -
ఓటమి అంచుల నుంచి...
దంబుల్లా: 278 పరుగుల లక్ష్యఛేదనలో 47 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక ‘ఎ’ జట్టు 261/6తో నిలిచింది. ఆ జట్టు విజయానికి 18 బంతుల్లో 17 పరుగులు కావాల్సి ఉండగా... చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. కెప్టెన్ సహాన్ (72 బంతుల్లో 74; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో జోరు మీదున్నాడు. ఇంకేముంది ముక్కోణపు వన్డే టోర్నీలో శ్రీలంక ‘ఎ’ జట్టు విజయం సాధించడం తథ్యమే అనుకుంటే... అక్కడే భారత ‘ఎ’ బౌలర్లు అద్భుతం చేశారు. 48వ ఓవర్లో 7 పరుగులు ఇ చ్చిన అన్షుల్ కంబోజ్... ప్రత్యర్థి కెప్టెన్‌ను అవుట్ చేయగా... అర్షద్ ఖాన్ వేసిన 49వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక ‘ఎ’ జట్టు 8 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ‘ఎ’ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (114 బంతుల్లో 101; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ తిలక్ వర్మ ( 97 బంతుల్లో 60; 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 14; 3 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) విఫలమయ్యారు. భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో వైభవ్... ఐపీఎల్ జోరు కనబర్చలేకపోయాడు. ప్రియాన్ష్ ఆర్య (32; 4 ఫోర్లు, 1 సిక్స్), ఆయుశ్ బదోనీ (24; 2 ఫోర్లు), సూర్యాన్ష్ షెడ్గె (26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. లంక బౌలర్లలో షిరాజ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో లంక 48.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. సహాన్‌తో పాటు డికెవెల్లా (47), అవిష్క(45), సదీరా సమరవిక్రమ (46) రాణించారు. అయితే చివర్లో ఒత్తిడిని అధిగమించడంలో సఫలమైన భారత జట్టును విజయం వరించింది. భారత ‘ఎ’ బౌలర్లలో అర్షద్ ఖాన్, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోనీ, విప్రాజ్ నిగమ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. గురువారం జరగనున్న రెండో లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడనుంది. -
ఇద్దరు ప్రపంచకప్ సభ్యులపై వేటు
జూన్ 11 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (జూన్ 9) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా షాయ్ హోప్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో ముగ్గురు టీ20 ప్రపంచకప్ 2026 సభ్యులకు చోటు దక్కలేదు. ఇందులో ఇద్దరిపై (జాన్సన్ ఛార్లెన్, క్వింటన్ సాంప్సన్) వేటు పడగా.. అల్జరీ జోసఫ్‌కు వర్క్‌లోడ్ కారణంగా విశ్రాంతినిచ్చారు. యువ ఆటగాళ్లు ఆకీమ్ ఆగస్టే, జువెల్ ఆండ్రూ, షమర్ స్ప్రింగర్‌లకు ఈ జట్టులో అవకాశం ఇచ్చారు. విధ్వంసకర వీరులు హెట్‌మైర్, రూథర్‌ఫోర్డ్, షెపర్డ్, పావెల్, హోల్డర్ తమ స్థానాలను నిలుపుకున్నారు. శ్రీలంకతో ఈ సిరీస్ జూన్ 12, 14, 15 తేదీల్లో జమైకాలోని సబీనా పార్క్ వేదికగా జరుగనుంది.శ్రీలంకతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం విండీస్ జట్టుషాయ్ హోప్ (సి), జువెల్ ఆండ్రూ, అకీమ్ అగస్టే, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్‌మైర్, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, షమార్ జోసఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, షమార్ స్ప్రింగర్కాగా, శ్రీలంక క్రికెట్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అంతకుముందు రెండో వన్డే కూడా వర్షార్పణం అయ్యింది. ఈ సిరీస్‌లో జరిగిన ఏకైక వన్డేలో గెలవడంతో శ్రీలంక సిరీస్‌ను కైవసం చేసుకుంది.స్వదేశంలో సిరీస్ కోల్పోవడంతో విండీస్ జట్టు 2027 వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. 2023-27 సైకిల్లో విండీస్ ప్రస్తుతం పదో స్థానంలో ఉంది. టాప్-8లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలు ఆటోమేటిక్‌గా టోర్నీలోకి అడుగుపెడతాయి. కాగా, 2027 వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబరు-నవంబరు మధ్య జరుగనున్న సంగతి తెలిసిందే. -
శ్రీలంక, వెస్టిండీస్ రెండో వన్డే వర్షార్పణం
శ్రీలంక, వెస్టిండీస్ మధ్య ఆదివారం జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణం అయింది. భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 41 పరుగులు తేడాతో విజయం సాధించింది.దీంతో ప్రస్తుతం లంక జట్టు సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టన్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం లంక జట్టుకు అదే తొలి విజయం. అలాగే కరీబియన్ దీవుల్లో శ్రీలంక జట్టుకు 13 ఏళ్ల తర్వాత ఇదే తొలి వన్డే గెలుపు. ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం అవుతుందనుకుంటే... భారీ వర్షం కారణంగా అది సాధ్యపడలేదు. ఇరు జట్ల మధ్య మంగళవారం ఇక్కడే చివరిదైన మూడో వన్డే జరగనుంది. ఆ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! కేవలం 10 బంతుల్లోనే -
మీకు దండం పెడతా? కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026 సీజన్లో మెరుపులు మెరిపించిన రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు భారత్-ఎ జట్టు తరపున సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. అఫ్గానిస్తాన్-ఎ, శ్రీలంక జట్లతో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో భారత బృందం శనివారం లంక గడ్డపై అడుగుపెట్టింది.ఇందులో వైభవ్ కూడా ఉన్నాడు. అయితే దంబుల్లా ఎయిర్ పోర్ట్ వెలుపుల సూర్యవంశీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టడంతో సూర్యవంశీ అసహనానికి గురయ్యాడు. ఈ యువ క్రికెటర్ తన లగేజ్‌తో పాటు బస్సు వైపు వెళ్తుండగా, ఫ్యాన్స్ 'సెల్ఫీ'ల కోసం ఎగబడ్డారు. దీంతో తన సహనం కోల్పోయిన వైభవ్.. చేతులు జోడించి ఓ అభిమానిని దయచేసి దూరంగా వెళ్లండని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ ట్రైసిరీస్‌లో భారత-ఎ జట్టు తిలక్ వర్మ కెప్టెన్సీలో ఆడనుంది. ఈ జట్టులో సూర్యవంశీతో పాటు ఐపీఎల్ స్టార్స్ ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, ఆయుష్ బదోని వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. మే 9న దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించనుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.As soon as Vaibhav Suryavanshi arrived in Sri Lanka, he looked a bit upset. There was sadness and slight frustration visible on his face. He also seemed bothered by the fans, and his disappointment was clearly noticeable while taking pictures with them.👀 pic.twitter.com/8H48R1VLld— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 5, 2026 -
రియల్ పెద్ది షాకింగ్ జర్నీ
ఒకప్పుడు క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలర్‌గా తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది!. ఇప్పుడు అదే అతన్ని మరో రంగంలో.. ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసే స్థాయికి చేరుకునేలా చేసింది. తాజాగా.. అంతర్జాతీయ వేదికలో అతని ప్రదర్శన చూసినవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారు. రీల్ లైఫ్‌లో పెద్ది రాంచరణ్‌లా.. రియల్ లైఫ్‌లోనూ ఈ ‘పెద్ది’ క్రాస్ అథ్లెటిక్స్‌తో క్రీడారంగంలో హాట్ టాపిక్‌గా మారాడు. తాజాగా.. రోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో శ్రీలంక జావెలిన్ త్రోయర్ రుమేష్ తరంగ పతిరగే(23) అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలోనే అతను 92.62 మీటర్ల జావెలిన్ విసిరి మీట్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ త్రోతో అతను కేవలం శ్రీలంక నేషనల్ రికార్డ్ మాత్రమే కాదు.. 2026 సీజన్లో ప్రపంచంలోనే బెస్ట్ త్రో కూడా నమోదు చేశాడు.ఈ అద్భుత ప్రదర్శనతో రుమేష్, పురుషుల జావెలిన్‌లో 90 మీటర్ల మార్క్ దాటిన కేవలం నాలుగు ఆసియా అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. తద్వారా భారత స్టార్ నీరజ్ చోప్రా, పాకిస్తాన్ అర్షద్ నదీమ్, చైనీస్ తైపీకి చెందిన చెంగ్ చావో-త్సున్ తర్వాత ఈ క్లబ్లో చేరిన నాలుగో ఆసియా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 21 ఏళ్ల చరిత్రలో.. జావెలిన్‌లో ఇది 21వ బెస్ట్ త్రోగా నమోదైంది. ప్రపంచ రికార్డు ఇప్పటికీ చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెజ్నీ పేరిట ఉంది.రుమేష్ ప్రయాణం ఆసక్తికరం.. పెద్దిలో హీరో రాంచరణ్.. క్రికెట్ నుంచి కుస్తీ.. అక్కడి నుంచి అథ్లెటిక్‌గా ప్రయాణం చేస్తాడు. అలాగే.. ఈ రియల్ లైఫ్ పెద్ది రుమేష్ ప్రయాణం కూడా క్రికెట్ తోనే ప్రారంభమైంది. అలాగని.. బ్యాట్స్‌మన్‌గా మాత్రం కాదు ఫాస్ట్ బౌలర్‌గా!. కొలంబోకు దక్షిణంగా ఉన్న చిన్న తీర పట్టణం కలుతరాకు చెందిన ఇతగాడు.. చాలా మంది పిల్లల్లాగే క్రికెట్‌పై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. అండర్-18 స్థాయిలో గంటకు 134 కి.మీ వేగంతో బంతులు వేసిన ప్రతిభావంతుడు అతను. కొలంబోలోని సెయింట్ పీటర్స్ కాలేజీ తరఫున తన ఏకైక పోటీ మ్యాచ్‌లోనూ అతను అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. అది అతని క్రికెట్ కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లే స్థాయి ప్రదర్శనగా నిలిచింది. అయితే తర్వాతి రోజుల్లో అతనికి అవకాశాలు పెద్దగా దక్కలేదు. టీ20 లీగ్‌ల ప్రభావం.. జాతీయ జట్టుకు చేరడంలో ఉన్న కఠిన పోటీ.. పైగా రాజకీయాల కారణంగా అతను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. ఆపై అథ్లెటిక్స్ వైపు మలుపు తీసుకున్నాడు.2017లో జావెలిన్ త్రో ప్రారంభించిన అతను మొదటిసారి 30 మీటర్లు మాత్రమే విసిరాడు. కానీ తండ్రి మార్గదర్శకత్వంలో వేగంగా ఎదిగి కొన్ని నెలల్లోనే 60 మీటర్లకు పైగా చేరుకున్నాడు. 2024 నాటికి 85 మీటర్ల మార్క్ దాటాడు. 2025లో నీరజ్ చోప్రా క్లాసిక్‌లో కూడా పోడియం ఫినిష్ సాధించి తన స్థాయిని నిరూపించుకున్నాడు.తాజాగా రోమ్‌లో నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ వంటి స్టార్లు లేకపోయినా, రుమేష్ మాత్రం తన త్రోతో అందరినీ వెనక్కి నెట్టాడు. అతని తర్వాతి ప్రయత్నాల్లో ఫౌల్స్ వచ్చినా, ఎవరూ అతని దూరానికి దగ్గర కాలేకపోయారు.క్రికెట్ నుంచి జావెలిన్‌కి మారిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు ఆసియా అథ్లెటిక్స్‌లో కొత్త స్టార్‌గా ఎదుగుతున్నాడు. రుమేష్ పతిరగే త్రో కేవలం రికార్డు కాదు… అది ఒక కొత్త “ఏషియన్ డామినెన్స్” ప్రారంభం అన్నట్టుగా క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. బిగ్ న్యూస్
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రభావం అంతర్జాతీయ స్థాయిలోనూ కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన వైభవ్, త్వరలో శ్రీలంకలో జరుగబోయే ముక్కోణపు టోర్నీకి (భారత-ఏ జట్టుకు) ఎంపికైన విషయం తెలిసిందే. వైభవ్ ఆడనుండటంతో ఈ టోర్నీకి ఊహించని ఆదరణ లభిస్తోంది.దీంతో నిర్వాహకులు (సోనీ నెట్వర్క్) ఈ టోర్నీని ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తమ సోషల్ మీడియా పోస్టులో "The Sooryavanshi Express is coming to light up the stage in a high-octane Tri-series" అంటూ ప్రచారం మొదలుపెట్టారు. వైభవ్ క్రేజ్‌కు ఓ సాధారణ టోర్నీ కూడా ప్రత్యక్ష ప్రసారానికి నోచుకుంది.వైభవ్ బ్రాండ్‌ను వినియోగించుకొని నిర్వహకులు తమ వ్యాపారాభివృద్దికి ప్రయత్నిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్ 2026 మరియు ఐపీఎల్ ప్రసార హక్కులు కోల్పోయిన సోని నెట్వర్క్, వైభవ్ క్రేజ్‌ను ఉపయోగించుకొని తిరిగి అభిమానులకు దగ్గర కావాలని భావిస్తోంది. ఈ మేరకు ఈ టోర్నీపై భారీ ఫోకస్ పెట్టింది. అన్ని మ్యాచ్‌లు సోని స్పోర్ట్స్, సోని లివ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.ఈ టోర్నీలో భారత-ఏ జట్టుతో పాటు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ జూన్ 9 నుంచి 21 వరకు డంబుల్లా వేదికగా జరుగనుంది.ఈ టోర్నీ కోసం భారత-ఏ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ, ప్రధాన ఆకర్షణ మాత్రం వైభవ్ సూర్యవంశీయే. ఐపీఎల్లో ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్.. అంతర్జాతీయ వేదికపై ఎలా రాణిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల కిందటే భారత-ఏ జట్టుకు సంబంధించి ఓ కీలక మార్పు జరిగింది. గాయంతో బాధపడుతున్నరియాన్ పరాగ్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేశారు.శ్రీలంక ముక్కోణపు టోర్నీకి భారత-ఏ జట్టు..తిలక్ వర్మ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, ప్రియాంశ్ ఆర్య, ఆయుశ్ బదోని, నిషాంత్ సింధు, సూర్యాంశ్ షేడ్గే, విప్రాజ్ నిగమ్, అన్షుల్ కంబోజ్, అనుకూల్ రాయ్, అర్షాద్ ఖాన్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, కుమార్ కుషాగ్రా, యశ్ ఠాకూర్, యుద్ద్‌వీర్ సింగ్ చరక్ -
శ్రీలంక క్రికెట్లో అనూహ్య పరిణామం.. కొత్త కెప్టెన్ ఎంపిక
శ్రీలంక క్రికెట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వైట్‌బాల్ (టీ20, వన్డే) కెప్టెన్‌గా కుసాల్ మెండిస్ ఎంపికైనట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటనే తరువాయి అని తెలుస్తోంది. దసున్ షనక టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని సమాచారం. ఈ మేరకు అతను బోర్డును రిసిగ్నేషన్ కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు చరిత్ అసలంకను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని సమాచారం. రెండు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కుసాల్ మెండిస్ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు టెస్ట్ కెప్టెన్‌గా ధనంజయ డిసిల్వ కొనసాగనున్నాడు.31 ఏళ్ల కుసాల్ మెండిస్ ఇటీవలికాలంలో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో పెషావర్ జల్మీ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 11 మ్యాచ్‌లు ఆడిన అతను.. 550 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 55, స్ట్రైక్‌రేట్ 160తో నమోదు చేశాడు.కుసాల్ గత ఐపీఎల్ సీజన్లోనూ ఆకట్టుకున్నాడు. ఆడింది ఒకటే మ్యాచ్ అయినా ప్రభావంతంగా కనిపించాడు. జోస్ బట్లర్ గాయపడటంతో అతనికి రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన మెండిస్.. ఓ మ్యాచ్‌లో 200 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు.కాగా, శ్రీలంక జట్టుకు మున్ముందు బిజీ షెడ్యూల్ ఉంది. త్వరలోనే వెస్టిండీస్ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్, భారత్ పర్యటనలు కూడా ఉన్నాయి. ఈ సిరీస్‌లతో కుసాల్ మెండిస్ కెప్టెన్సీకి అసలైన పరీక్ష మొదలుకానుంది. -
స్విమ్మింగ్‌లో చరిత్ర సృష్టించిన బెంగళూరు టెకీ దంపతులు
బెంగళూరుకు చెందిన టెకీ దంపతులు దనిష్ అబ్డి, వృశాలీ ప్రసాదే స్విమ్మంగ్‌లో అరుదైన సాహసం చేసి చరిత్ర సృష్టించారు. వీరు శ్రీలంక నుంచి భారత్ వరకు సముద్ర మార్గంలో ఈదుతూ సుమారు 32 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న రామసేతు మార్గం గండా ఈ ఫీట్ సాధించడం విశేషం.దనిష్-వృశాలీ జంట శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి ప్రయాణం ప్రారంభించి, తమిళనాడులోని ధనుష్కోడి వద్ద ముగించారు. ఇండియన్ ఓషియన్‌లో అలలు, బలమైన ప్రవాహాలను ఎదుర్కొంటూ వారు 10 గంటల 45 నిమిషాల్లో ఈ సాహస యాత్రను పూర్తి చేశారు.బెంగళూరు నివాసులైన డానిష్ అబ్ది మరియు వృషాలి ప్రసాద్, శ్రీలంకలోని తలైమన్నార్ నుండి భారతదేశంలోని ధనుష్కోడి వరకు సముద్రంలో 32 కిలోమీటర్లు ఈదారు.#SriLanka #Dhanushkodi #UANow pic.twitter.com/NylspcpXNi— UttarandhraNow (@UttarandhraNow) May 8, 2026ఈ ప్రయాణంలో కోస్ట్ గార్డులు, వైద్య సిబ్బంది, ఎస్కార్ట్ బోట్లు వారికి సహకరించాయి. సముద్రంలో కఠిన పరిస్థితులు ఎదురైనా ఇద్దరూ ధైర్యంగా ముందుకు సాగారు. ఈ ఫీట్‌ను సాధించికా దనిష్-వృశాలీ జంట సోషల్‌మీడియాలో ఇలా పోస్ట్ చేసింది. శ్రీలంక నుంచి భారత్ వరకు విజయవంతంగా ఈదాం. ఇది చాలా కఠినమైన ప్రయాణం అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోస్టు వైరల్‌గా మారగా, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.దనిష్-వృశాలీ దంపతులు గతంలో కూడా సముద్ర ఈత పోటీల్లో పాల్గొన్నారు. అయితే కలిసి చేసిన తొలి భారీ ఓపెన్ వాటర్ స్విమ్ ఇది. భారత్, శ్రీలంకల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని గుర్తుచేసే ప్రయత్నంగా కూడా ఈ సాహసాన్ని వారు చేపట్టినట్లు తెలుస్తోంది. -
భారత్ లేకుండా టోర్నీ.. పాక్ అభ్యర్ధనకు శ్రీలంక అంగీకారం
అంతర్జాతీయ వేదికపై భారత్‌కు వ్యతిరేకంగా శ్రీలంక క్రికెట్ బోర్డు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. టీమిండియా లేకుండా పాకిస్తాన్‌తో వన్డే ట్రై సిరీస్ ఆడేందుకు అంగీకారం తెలిపింది. శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌కు కాస్త కటువగా ఉండనుంది. ఎందుకంటే శ్రీలంక లాంటి మిత్రదేశం పాక్‌తో క్రికెట్ సంబంధాలు కొనసాగించడం బీసీసీఐకి ఇష్టం ఉండదు. పాక్ ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీలో మూడో జట్టుగా ఇంగ్లండ్ ఉండనుంది. ఈ టోర్నీ అక్టోబర్-నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నీకి వేదికలు ఖరారు కావాల్సి ఉంది. లాహోర్, కరాచీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.వచ్చే ఏడాది జరుగబోయే వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ టోర్నీని ప్లాన్ చేసుకున్నట్లు పాక్ క్రికెట్ వర్గాలు అంటున్నాయి. కాగా, 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, పాక్‌లో ట్రై సిరీస్ కంటే ముందే శ్రీలంకతో టీ20 సిరీస్ జరుగనుంది. ట్రై సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కూడా జరగాల్సి ఉంది. ఈ టెస్ట్ సిరీస్ నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న పాక్రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ మే 8 నుంచి ఢాకా వేదికగా జరుగనుంది. అనంతరం రెండో టెస్ట్ మే 16 నుంచి సిల్హెట్ వేదికగా జరుగనుంది.బంగ్లాదేశ్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు: షాన్ మసూద్ (సి), అబ్దుల్లా ఫజల్, అమద్ బట్, అజాన్ అవాయిస్, బాబర్ ఆజం, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షాజాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (wk), ముహమ్మద్ ఘాజీ ఘోరీ (wk), ముహమ్మద్ ఘాజీ ఘోరీ (wk), సాజిద్ ఖాన్, నౌమాన్ అలీ, సల్మాన అఘా, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది -
చారిత్రక సిరీస్‌ను ప్రకటించిన శ్రీలంక
శ్రీలంక క్రికెట్ బోర్డు చారిత్రక సిరీస్‌ను ప్రకటించింది. ఐదేళ్ల విరామం తర్వాత వారి జట్టు కరీబియన్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ పర్యటనలో వెస్టిండీస్ జట్టుతో పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. శ్రీలంక జట్టు చివరిసారిగా 2021లో వెస్టిండీస్‌లో పర్యటించింది. ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది జూన్-జూలై నెలల్లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం కరీబియన్‌కు వెళ్లనుంది.ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్వన్డేలు – సబీనా పార్క్, కింగ్స్టన్జూన్ 3 – తొలి వన్డేజూన్ 6 – రెండో వన్డేజూన్ 8 – మూడో వన్డేటీ20లు – సబీనా పార్క్జూన్ 11 – తొలి టీ20జూన్ 13 – రెండో టీ20జూన్ 14 – మూడో టీ20టెస్టులు – సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, ఆంటిగ్వాజూన్ 25 నుంచి తొలి టెస్టుజూలై 3 నుంచి రెండో టెస్టుఇరు జట్లకు కీలకంఇటీవలికాలంలో ఇరు జట్లు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ సిరీస్ వారిరువురి పునరుద్ధరణకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. 2021 పర్యటనలో జరిగిన టెస్టు సిరీస్ డ్రాగా ముగియగా.. వన్డేల్లో వెస్టిండీస్ శ్రీలంకను వైట్‌వాష్ చేసింది.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 డిజాస్టర్ తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డులో అంతర్గత సమస్యలు మొదలయ్యాయి. మెగా టోర్నీలో లంక జట్టు ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వ ఇటీవలే రాజీనామా చేశాడు. దీంతో ఇటీవలే కుమార సంగక్కర, రోషన్ మహానామా లాంటి మాజీలతో కొత్త కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ లంక క్రికెట్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేయనుంది. -
స్వదేశానికి వెళ్లిన సన్‌రైజర్స్ విదేశీ ప్లేయర్లు
ఐపీఎల్ 2026 మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు శ్రీలంక ప్లేయర్లు (దిల్షన్ మధుషంక, ఎషాన్ మలింగ, కమిందు మెండిస్) అర్దాంతరంగా స్వదేశానికి వెళ్లారు. ఏప్రిల్ 29న ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం తర్వాత ఇది జరిగింది. లంక క్రికెట్ బోర్డు మధుషంక, మలింగ, కమిందును అత్యవసరంగా స్వదేశానికి రావాలని సందేశం పంపింది.NEWS 🚨Sri Lankan cricketers Dilshan Madushanka, Eshan Malinga, and Kamindu Mendis, who are representing SRH in the IPL, arrived in Sri Lanka early this morning.#sportspavilionlk #ipl2026 #MIvsSRH #EshanMalinga #fypシ゚viralシfypシ゚viralシalシ pic.twitter.com/dMwWZJ74S8— DANUSHKA ARAVINDA (@DanuskaAravinda) April 30, 2026శ్రీలంక జట్టు త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. ఆ పర్యటనకు సంబంధించిన వీసా బయోమెట్రిక్స్ పూర్తి చేసుకోవడానికి పై ముగ్గురు స్వదేశానికి వెళ్లారు. ఈ త్రయం విండీస్‌లో పర్యటించబోయే లంక జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే.వీసా ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం, మధుషంక, మలింగ, కమిందు తిరిగి ఇవాళ ( మే 1) ఉదయం భారత్‌కు వచ్చి ఎస్ఆర్హెచ్ శిబిరంలో చేరారు. దీంతో మే 3న కేకేఆర్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు వీరు అందుబాటులో ఉండనున్నారు. ఈ విషయం తెలియక సోషల్‌మీడియాలో రకరకాల పుకార్లు వినిపించాయి.ఈ ముగ్గురు ఎస్ఆర్హెచ్ యాజమాన్యంతో గొడవపడి స్వదేశానికి వెళ్లిపోయారని కొందరు.. గాయాల కారణంగా జట్టును వీడారని ఇంకొందరు ప్రచారం చేశారు. చివరికి లంక బోర్డు చెందిన కీలక అధికారి ఒకరు వివరణ ఇవ్వడంతో ఈ ఫేక్ ప్రచారానికి పుల్‌స్టాప్ పడింది.దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకంటే, ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న వ్యక్తి (ఎషాన్ మలింగ) పై ముగ్గురిలో ఉన్నారు. మంచి లయలో ఉన్న ఎస్ఆర్హెచ్కు మలింగ లాంటి బౌలర్ ఒక్క మ్యాచ్‌కు దూరమైనా తీవ్ర పరిణామాలు ఉంటాయి.మలింగ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. మదుషంక ఒక మ్యాచ్‌లో ఆడి వికెట్ సాధించగా, కమిందు మెండిస్‌కు ఇంకా తుది జట్టులో అవకాశం రాలేదు.కాగా, సీజన్ ఆరంభంలో కాస్త అటుఇటుగా ఆడిన సన్‌రైజర్స్ కీలక దశ వచ్చే సరికి విజయాల బాట పట్టి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. పంజాబ్, ఆర్సీబీ టాప్-2లో ఉన్నాయి. -
టీ20 సిరీస్ కూడా లంకదే..!
మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు, తొలుత వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో.. తాజాగా టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.సిల్హెట్ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 30) జరిగిన రెండో టీ20లో శ్రీలంక 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. హర్షిత సమరవిక్రమ (49), కెప్టెన్ చమారీ ఆటపట్టు (42) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో ఇమేషా దులాని 27, నిలాక్షి డిసిల్వ 22 (నాటౌట్), హాసిని పెరీరా 9 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో ఫరిహా త్రిస్న, సుల్తానా ఖాతూన్, నహిద అక్తెర్, రితూ మోనీ తలో వికెట్ తీశారు.అనంతరం లక్ష్య ఛేదనలో తడబడిన బంగ్లా బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులకే పరిమితమయ్యారు. షర్మిన్ అక్తెర్ (44 నాటౌట్) బంగ్లాను గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఆమెకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ఓపెనర్లు దిలారా అక్తెర్ 23, జుయారియా ఫిర్దోస్ 29 పరుగులు చేసినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ నిగార్ సల్తానా 7, షోర్నా అక్తెర్ 12, శోభన మోస్త్రి డకౌటయ్యారు. రితూ మోనీ 9 పరుగులతో అజేయంగా నిలిచింది.లంక బౌలర్లలో కవిష దిల్హరి 2 వికెట్లు తీయగా.. మిథాలీ అయోధ్య మినహా మిగతా బౌలర్లంతా వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ సిరీస్‌లోని నామమాత్రపు మూడో టీ20 మే 2న ఇదే సిల్హెట్ వేదికగా జరుగనుంది. -
టీ20 సిరీస్‌లోనూ బోణీ కొట్టిన శ్రీలంక
మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్ తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాల్టి నుంచి (ఏప్రిల్ 28) నుంచి ప్రారంభమైన టీ20 సిరీస్‌లోనూ బోణీ కొట్టింది. సిల్హెట్ వేదికగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్‌లో శ్రీలంక ప్లేయర్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసిన లంకేయులు, ఆతర్వాత బౌలింగ్‌లోనూ సత్తా చాటి బంగ్లాదేశ్‌ను 136 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు.లంక బ్యాటర్లలో ఇమేషా దులని (55), హర్షిత సమరవిక్రమ (61) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ చమారీ 32 పరుగులతో పర్వాలేదనిపించింది. మిగతా ప్లేయర్లలో హాసిని పెరీరా 7, హన్సిమ కరుణరత్నే 2 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సల్తానా ఖాతూన్ 2, మరుఫా అక్తెర్, నహిద అక్తెర్ తలో వికెట్ తీశారు.బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో షోర్నా అక్తెర్ (60) అర్ద సెంచరీతో రాణించగా.. ఆమెకు మరో ఎండ్ నుండి ఎవరి సహకారం లభించలేదు. దిల్హర అక్తెర్ 23, జుయారియా ఫిర్దోస్ 16, షిర్మన్ అక్తెర్ 1, కెప్టెన్ నిగార్ సుల్తానా డకౌట్, శోభన మోస్తరి 16, రబేయా ఖాన్ 6, సుల్తానా ఖాతూన్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో మల్కి మదారా, మిథాలీ అయోధ్య, చమారీ తలో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. సుగంధిక, కవిష వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 ఇదే వేదికగా ఏప్రిల్ 30న జరుగనుంది. -
షాకింగ్: సన్యాసుల ముసుగులో భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్!
కొలంబో: శ్రీలంకలో కనీవినీ ఎరుగని ఒక ఉదంతం వెలుగుచూసింది. సన్యాస వస్త్రధారణలో ఉన్న 22 మంది వ్యక్తులు భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ కొలంబో విమానాశ్రయంలో పట్టుబడ్డారు. థాయ్‌లాండ్ నుండి తిరిగి వస్తున్న వీరి వద్ద 110 కిలోల గంజాయి (కుష్, హషీష్) లభించడం అధికార వర్గాలను సైతం నివ్వెరపరిచింది.సూట్‌కేసుల్లో రహస్య అరలుకొలంబో విమానాశ్రయానికి చేరుకున్న ఈ బృందాన్ని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా, అసలు బాగోతం బయటపడింది. స్వీట్లు, పాఠశాల సామగ్రితో పాటు సూట్‌కేసుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఫాల్స్ వాల్స్’ (రహస్య అరలు) వెనుక ఈ మత్తుపదార్థాలను దాచారు. ఒక్కొక్కరి వద్ద సుమారు 5 కిలోల చొప్పున అత్యంత ప్రమాదకరమైన కుష్, హషీష్ రకాలకు చెందిన గంజాయి ప్యాకెట్లు లభించాయి. సన్యాసుల ముసుగులో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడానికి యత్నించడం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు.ఉచిత థాయ్‌లాండ్ ట్రిప్ వెనుక మాస్టర్మైండ్పట్టుబడిన ఈ సన్యాసుల(వేషధారణ)లో ఎక్కువ మంది విద్యార్థులే. ఒక గుర్తుతెలియని స్పాన్సర్ వీరికి నాలుగు రోజుల థాయ్‌లాండ్ పర్యటనకు పూర్తి ఖర్చులు భరించినట్లు సమాచారం. ఈ ట్రిప్ ఆర్గనైజ్ చేసిన వ్యక్తిని పోలీసులు కొలంబో శివార్లలో అరెస్టు చేశారు. అతడు ఈ బృందంతో ప్రయాణించలేదు కానీ, వారు తీసుకొస్తున్న పార్శిల్స్ అన్నీ ‘విరాళాలు’ అని నమ్మించే ప్రయత్నం చేశాడు.7 రోజుల రిమాండ్పట్టుబడిన ఈ దొంగ సన్యాసుల మొబైల్ ఫోన్లను పోలీస్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు పరిశీలించగా, వారు థాయ్‌లాండ్ ట్రిప్‌లో సాధారణ దుస్తులు ధరించి, విలాసవంతంగా ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. వీరందరినీ ఆదివారం న్యాయస్థానం ముందు హాజరుపరచగా, తదుపరి విచారణ నిమిత్తం కోర్టు ఏడు రోజుల పాటు రిమాండ్‌కు ఆదేశించింది. -
ఆర్సీబీకి షాక్.. కేసు వెనక్కు తీసుకున్న బౌలర్
శ్రీలంక ఆటగాడు నువాన్ తుషార వ్యవహారం ప్రస్తుత ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఐపీఎల్ 2026లో పాల్గొనేందుకు తుషారకు అతని సొంత దేశ క్రికెట్ బోర్డు (శ్రీలంక క్రికెట్) అనుమతి నిరాకరించింది. ఫిట్నెస్ లేని కారణంగా తుషారకు ఎన్వోసీ జారీ చేయలేమని తెలిపింది.ఈ విషయమై కోర్టును ఆశ్రయించిన తుషార.. అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అకస్మాత్తుగా కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో కోర్టు శ్రీలంక క్రికెట్ బోర్డుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ పరిణామం తర్వాత తుషార ఇక ఐపీఎల్ ఆడటం కష్టమేనని తేలిపోయింది.తుషార వ్యవహారంలో కోర్టు తీర్పు ఆర్సీబీని ఇరకాటంలో పడేసింది. ఆ జట్టు ఈ సీజన్లో తుషారపై ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే, గత సీజన్లో అతను హాజిల్‌వుడ్ గైర్హాజరీలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని యార్కర్లు, స్లో బంతులు డెత్ ఓవర్లలో ఆర్సీబీకి కీలకంగా మారే అవకాశం ఉండింది.ప్రస్తుతం ఆర్సీబీకి హాజిల్‌వుడ్, డఫీ, ఎంగిడి వంటి విదేశీ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ.. తుషార లాంటి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ ఉంటే అదనపు బలంగా మారే అవకాశం ఉండింది. మొత్తంగా తుషార న్యాయపోరాటం చేస్తూ మధ్యలోనే యూ-టర్న్ తీసుకోవడం ఆర్సీబీకి వ్యూహాత్మక నష్టంగా పరిగణించాలి. ప్లే ఆఫ్స్ రేసులో పోటీ తీవ్రంగా ఉన్న దశలో ఇలాంటి మార్పులు జట్టు సమతుల్యతను దెబ్బతీస్తాయి.కాగా, తుషార లేకపోయినా ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగానే రాణిస్తుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 2 అపజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఏప్రిల్ 24న జరిగే తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. -
రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్‌పై నిషేధం
రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్, శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ షనకపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోని లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లఘించినందుకు ఒక సంవత్సరం నిషేధం విధించింది. దీంతో షనక వచ్చే పీఎస్ఎల్ సీజన్ (2027)లో పాల్గొనలేరు.పీసీబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, లాహోర్ ఖలందర్స్‌తో చేసుకున్న ఒప్పందాన్ని షనక ఉల్లఘించాడు. మార్చి 21న టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇందుకు అతను చూపించిన కారణాలు ఒప్పంద పరిధిలో చెల్లుబాటు కావు. కాబట్టి లీగ్ ప్రతిష్ఠను కాపాడేందుకు షనకపై ఏడాది నిషేధం విధించారు.పీసీబీ తనపై విధించిన నిషేధాన్ని షనక పరోక్షంగా అంగీకరించాడు. ఓ ప్రకటన విడుదల చేస్తూ, తన విచారాన్ని వ్యక్తం చేశాడు. "హెచ్‌బీఎల్ పీఎస్ఎల్ నుంచి తప్పుకోవడం నా తప్పు. పాకిస్థాన్ అభిమానులు, లాహోర్ ఖలందర్స్ అభిమానులను నిరాశపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నాను. ఆ సమయంలో మరో టోర్నమెంట్లో ఆడాలనే ఉద్దేశం నాకు లేదు. పాకిస్థాన్‌లో ఆడటం నాకు ఎప్పుడూ ఆనందమే" అని పేర్కొన్నాడు. భవిష్యత్తులో తిరిగి ఈ లీగ్‌లో పాల్గొనే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా, షనక పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న తర్వాత ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన రాజస్థాన్ రాయల్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు. సామ్ కర్రన్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం కావడంతో రాయల్స్ షనకను ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపిక చేసుకుంది. షనకకు రాయల్స్ బేస్ ధర రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.ఈ సీజన్లో షనక రాయల్స్ తరఫున ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. -
బొగ్గు దిగుమతుల్లో అక్రమాల ఆరోపణలు
కొలంబో: విద్యుదుత్పత్తిలో వాడే బొగ్గు దిగుమతుల్లో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలున్న శ్రీలంక ఇంధన శాఖ మంత్రి కుమార జయకోడి పదవికి రాజీనామా చేశారు. ఆ శాఖ కార్యదర్శి ఉదయాంగ హేమపాల కూడా బాధ్యతల నుంచి వైదొలిగారు. ప్రభుత్వ రంగ సంస్థ చేపట్టిన బొగ్గు దిగుమతుల్లో ఆరోపణలపై శ్రీలంక అధ్యక్ష కార్యాలయం స్పందించింది. అయితే, అవకతవకల కారణంగా ప్రభుత్వ ఖజానాకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. దీనిపై ఆరునెలల్లో ప్రత్యేక కమిటీతో దర్యాప్తు పూర్తి చేసి, వాస్తవాలను వెల్లడిస్తామని తెలిపింది. అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కుమార జయకోడి గతవారం పార్లమెంట్లో ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కారు. శ్రీలంక తన ఇంధన అవసరాలకు కావాల్సిన బొగ్గును ఏడాదికి 25 లక్షల టన్నుల చొప్పున ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియాలతోపాటు స్వల్ప పరిమాణంలో భారత్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటోంది. -
పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధర .. అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమల్లోకి..
కొలంబో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీలంక ప్రజలకు మరో బిగ్‌షాక్ తగిలింది. గ్లోబల్ మార్కెట్లో గ్యాస్ ధరలు పెరుగుతుండడంతో ఆ దేశ ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ ధరల్ని పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలో ఎల్పీజీ గ్యాస్ ధరల్ని మరోసారి పెంచుతున్నట్లు శ్రీలంక ప్రభుత్వ యాజమాన్యంలోని ఎల్పీజీ గ్యాస్ సంస్థ లిట్రో గ్యాస్ లంక ప్రకటించింది. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి (ఏప్రిల్5)నుంచి అమల్లోకి రానున్నాయి. లిట్రో గ్యాస్ తెలిపిన వివరాల మేరకు.. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు గణనీయంగా పెరగడం వల్ల దిగుమతి ఖర్చులు పెరిగాయి. వినియోగదారులపై పూర్తి భారాన్ని మోపకుండా, పరిమిత స్థాయిలో మాత్రమే ధరలు పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.ప్రస్తుతం కొలంబోలో కొత్త ధరలు ఇలా ఉన్నాయి 12.5 కిలోల సిలిండర్: రూ. 775 పెరిగి రూ. 4,7655 కిలోల సిలిండర్: రూ. 308 పెరిగి రూ. 1,9102.3 కిలోల సిలిండర్: రూ.140 పెరిగి రూ.840వినియోగదారులపై ప్రభావంఈ పెంపు వల్ల శ్రీలంక ప్రజలకు జీవన వ్యయాలు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా కొత్త సంవత్సరం (భారత్‌లో ఉగాది..శ్రీలంకలో పుత్తాండు) సీజన్లో గ్యాస్ ధరలు పెరగడం కుటుంబాలపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది. అయితే లిట్రో గ్యాస్ లంక వినియోగదారులపై పూర్తి భారాన్ని మోపకుండా, పరిమిత స్థాయిలో మాత్రమే ధరలు పెంచడం ద్వారా కొంత ఉపశమనం కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
తెలంగాణ అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి
నిజామాబాద్ రూరల్: ఆ ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఎల్లలు లేవని నిరూపించింది. శ్రీలంక అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శనివారం మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. నిజామాబాద్ రూరల్ మండలం లింగితండాకు చెందిన బొంత వెంకటేశ్ 2019లో దుబాయికి వెళ్లాడు. అక్కడ ఎల్టన్ ప్రాపర్టీ అనే కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీలంక దేశానికి చెందిన ఉమేక తారుషి వెంకటేశ్‌ల మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారు తల్లితండ్రుల సమక్షంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో తమ ప్రేమ విషయాన్ని వెంకటేశ్ శ్రీలంకకు వెళ్లి తారుషి తల్లితండ్రులకు చెప్పి ఒప్పించాడు. ఇటు వెంకటేశ్ తల్లితండ్రులు ఒప్పుకున్నారు. దీంతో తారుషి, ఆమె తల్లితండ్రులు సేనాదిపతిగే నిలంతి పెరీరా, గలాని గమగె జనక ప్రియదర్శన సిల్వా లింగి తండాకు పది రోజుల క్రితం చేరుకున్నారు. శుక్రవారం ఇరు కుటుంబాల సంతోషాల మధ్య హల్దీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం వీరి వివాహానికి లింగి తండా వేదికగా మారనుంది. తమ ప్రేమ వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెంకటేశ్ ‘సాక్షి’తో తెలిపారు. -
సినీ నటితో వివాదంలో శ్రీలంక విధ్వంసకర బ్యాటర్
శ్రీలంక విధ్వంసకర బ్యాటర్ భానుక రాజపక్స ఓ సినీ నటితో న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నాడు. ఈ కేసు ఓ బంగారు గొలుసు చుట్టూ తిరుగుతోంది. హర్షి రసంగా అనే స్థానిక యువ నటికి రాజపక్స ఓ బంగారు గొలుసు (రూ. 9 లక్షలు) ఇచ్చాడు. దీన్ని బహుమతిగా భావించిన ఆమె.. అవసరాల రిత్యా తాకట్టు పెట్టి డబ్బు చేసుకుంది. అయితే గొలుసును హర్షి తన వద్ద అరువు తీసుకొని, అనుమతి లేకుండా తాకట్టు పెట్టుకుందని రాజపక్స పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసుల విచారణ జరిపి హర్షిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు రూ. 5 లక్షల చొప్పున రెండు ష్యూరిటీలు పెట్టి బెయిల్ మంజూరు చేసింది. విచారణలో హర్షి న్యాయవాదులు గొలుసును తాకట్టు పెట్టిన విషయాన్ని అంగీకరించి, తిరిగి విడిపిస్తామని హామీ ఇచ్చారు. మాట మార్చిన హర్షిబెయిల్ లభించిన తర్వాత హర్షి మాట మార్చింది. మీడియా ముందుకు వచ్చి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. గొలుసు తనకు రాజపక్స వ్యక్తిగత సంబంధంలో గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలిపింది. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. రాజపక్స వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రాజపక్స ఇటీవల టీమిండియాపై నిరాధరమైన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కాడు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో భారత ఆటగాళ్లు ఉపయోగించే బ్యాట్లు అసాధారణంగా ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యల తర్వాత అతను టీమిండియా అభిమానుల నుంచి చీవాట్లు తిన్నాడు. -
శ్రీలంకలో విద్యుత్ షాక్
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకపై మరో భారం పడింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు 7.2%, పరిశ్రమలకు 8.7% మేర విద్యుత్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఐఎంఎఫ్ నిబంధనలే కారణమా?అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి పొందిన 2.9 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీలో భాగంగా శ్రీలంక కఠిన ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం కోసం కాస్ట్ రిఫ్లెక్టివ్(ఖర్చుకు అనుగుణంగా ధరలు) విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏడాదికి పలుమార్లు విద్యుత్ ధరలను సవరించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.మరింత పెరిగే అవకాశం ఉందా?‘యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు మరింత పెరిగితే, విద్యుత్ ఛార్జీలను మళ్లీ పెంచాలనే అభ్యర్థనను మేము పరిశీలిస్తాం’ అని శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.పి.ఎల్. చంద్రలాల్ స్పష్టం చేశారు. వాస్తవానికి సీఈబీ 13.56 పెంపును కోరినప్పటికీ ప్రస్తుతానికి దాన్ని నియంత్రించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.తీవ్ర స్థాయిలో ఇంధన కొరతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ముడి చమురు, ఫర్నేస్ ఆయిల్ కొరత తీవ్రంగా ఉంది. దీనిపై సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ జానక రాజకరుణ మాట్లాడుతూ కొన్ని విషయాలను వెల్లడించారు. ‘వినియోగాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఇంధన రేషనింగ్‌ను ప్రవేశపెట్టారు. విద్యుత్ ఆదా కోసం ప్రతి బుధవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. నిరంతరాయ సరఫరా కోసం రష్యా, భారత్, అమెరికా దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఏప్రిల్‌లో శుద్ధి చేసిన ఇంధనం కోసం 600 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
4 లీటర్ల పెట్రోలు దాచాడని... 21 రోజుల జైలు, జరిమానా!
కొలంబో: పశ్చిమాసియా కల్లోలం పుణ్యమా అని పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ ఇప్పుడు బంగారం కంటే ప్రియంగా మారాయి. ఈ నేపథ్యంలో కేవలం 4 లీటర్ల పెట్రోలును ఇంట్లో దాచిన పాపానికి ఓ వ్యక్తి ఏకంగా కటకటాలపాలు కావాల్సి వచ్చింది! ఈ వింత ఉదంతం శ్రీలంకలో చోటుచేసుకుంది. ఉత్తర శ్రీలంకలోని నికవెరతియా ప్రాంతానికి చెందిన లసంత కుమార బాలసూర్య (48) ఇంట్లో సోదాల్లో 4 లీటర్ల పెట్రోల్ దొరికింది. దాంతో పోలీసులు మనవాడిని అరెస్టు చేసి బోనెక్కించారు. తల్లిదండ్రుల శ్రాద్ధకర్మ నిమిత్తం ఇంటి పరిసరాల్లోని చెత్తను కాల్చేందుకు ఆ పెట్రోలు తెచ్చుకున్నానని మొత్తుకున్నా లాభం లేకపోయింది.అతనికి 21 రోజుల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన వెంటనే ఇంధన అక్రమ నిల్వలపై లంక కఠిన నిషేధం విధించింది. కనుక, దాచింది నాలుగు లీటర్లే అయినా నేరం నేరమే పొమ్మంటూ చట్టం ఇలా తన పని తాను చేసుకుపోయింది! పౌరుల పెట్రోల్, డీజిల్ వాడకంపై లంక ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. వాటి అమలుకు మార్చి 15 నుంచి క్యూఆర్ ఆధారిత విధానం తెచ్చింది. దాని ప్రకారం కార్లకు వారానికి 15 లీటర్లు, బస్సులకు 60 లీటర్లు మాత్రమే అనుమతిస్తారు. -
అమెరికా ఒత్తిడికి లొంగలేదు..: శ్రీలంక
అమెరికాకు దెబ్బ దెబ్బ మీద తగులుతోంది. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా హోర్మూజ్ జలసంధి భద్రతకు సహకరించాలన్న అభ్యర్థనను ఇప్పటికే పలు దేశాలు తిరస్కరించగా, అమెరికా నుంచి వచ్చిన రెండు యుద్ధ విమానాలకు శ్రీలంక సైతం అనుమతి ఇవ్వలేదట. మార్చి 4, 8 తేదీల్లో ఎర్ర సముద్రం నుంచి రెండు అమెరికా యుద్ధ విమానాలకు తమ భూభాగంలోకి అనుమతి ఇవ్వాలన్న అమెరికా విజ్ఞప్తిని శ్రీలంక తిరస్కరించినట్లు ఆ దేశ అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ తీవ్ర యుద్ధ పరిస్థితుల నడుమ తాము ఒత్తిడికి తలొగ్గకుండా అమెరికా యుద్ధ విమానాలకు తమ భూభాగంలోకి అనుమతికి నిరాకరించినట్లు ఆయన పేర్కొన్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఒత్తిడికి తలొగ్గమనే విషయాన్ని దిసనాయకే ఈ సందర్భంగా తెలిపారు. ‘యుద్ధం విషయంలో మేము తటస్థ వైఖరితో ఉన్నాం. మాకు చాలా ఒత్తిడులు వచ్చాయి. కానీ వాటికి తలొగ్గలేదు. అమెరికా యుద్ధ విమానాలకు శ్రీలంక మట్టల అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమతించాలనే రిక్వస్ట్ అమెరికా నుంచి వచ్చింది. అయినా మేము వాటిని సున్నితంగా తిరస్కరించాం. ఈ యుద్ధంలో మా భాగస్వామ్యం లేదు. అందుకే అమెరికా యుద్ధ విమానాలను మా భూభాగంలో నిలుపుదల చేస్తామంటే వద్దని కచ్చితంగా చెప్పేశాం. జిబౌటి బేస్ నుండి ఎనిమిది యాంటీ-షిప్ క్షిపణులతో రెండు యుద్ధ విమానాలను మట్టల అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకురావాలని అమెరికా కోరింది. కానీ మేము అనుమతించలేదు’ అని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో శ్రీలంకను లాగకుండా ఉండాలనే ఉద్దేశాన్ని అమెరికాకు స్సష్టంగా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి:ఇరాన్ ‘ఉండేలు’ దెబ్బ -
అర్థరాత్రి.. అమాంతంగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు
కొలంబియా: శ్రీలంక ప్రజలకు ప్రభుత్వ రంగ చమురు సంస్థ సియాలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీ) అర్థరాత్రి పెద్ద షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు మార్చి 9 అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.సీపీసీ లెక్కల ప్రకారం.. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు గత వారం 92–93 అమెరికన్ డాలర్ల వద్ద ఉండగా, కొన్ని రోజుల్లోనే 115 డాలర్లకు చేరాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయం వంటి అంశాలు ఈ పెరుగుదలకు కారణమయ్యాయి. ఈ పరిస్థితులు శ్రీలంకలో ఇంధన ధరలపై తక్షణ ప్రభావం చూపాయి.ఆక్టేన్ 92 అంటే పెట్రోల్‌లోని ఆక్టేన్ రేటింగ్ (Octane Rating) ను సూచిస్తుంది. ఇది ఇంధనం ఇంజిన్‌లో నాకింగ్ (knocking) లేకుండా ఎంత వరకు కంప్రెషన్‌ను తట్టుకోగలదో చూపించే ప్రమాణం. ఆక్టేన్ 92 అంటే ఇంధనం 92 స్థాయి కంప్రెషన్‌ను తట్టుకోగలదని అర్థం. వాటి ఆధారంగాఆక్టేన్ 92 -పెట్రోల్ లీటరుకు రూ.317ఆక్టేన్ 95- పెట్రోల్ రూ.365సాధారణ డీజిల్- రూ.303హై-పర్ఫార్మెన్స్ వాహనాలకు వినియోగించే డీజిల్- రూ.353కిరోసిన్ -రూ.195ప్రతి లీటరుకు సగటున రూ.22–25 వరకు పెరిగినట్లు తెలుస్తోంది.ఈ పరిణామం శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా, ఉత్పత్తి, వినియోగదారుల ఖర్చులు అన్నీ ప్రభావితమవుతాయి. ప్రభుత్వం తక్షణ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో అకస్మాత్తుగా వచ్చే ఇబ్బందులను తగ్గించవచ్చు. దీర్ఘకాలికంగా, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, శక్తి సామర్థ్య విధానాలు అమలు చేయడం ద్వారా స్థిరమైన పరిష్కారం సాధ్యమవుతుంది. -
శ్రీలంక హెడ్ కోచ్‌గా టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తి
తాము సంయుక్తంగా (భారత్‌తో పాటు) ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్-2026లో ఘోరంగా విఫలమైన (సూపర్-8 దశలో నిష్క్రమణ) తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టు ప్రక్షాళన చేపట్టింది. టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తిని హెడ్ కోచ్‌గా ఎంపిక చేసుకుంది. అతని పేరు గ్యారీ కిర్‌స్టన్. ఈ సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ 2011లో టీమిండియాను జగజ్జేతగా (హెడ్ కోచ్‌గా) నిలిపాడు.పొట్టి ప్రపంచకప్ వైఫల్యాల నేపథ్యంలో అప్పటివరకు హెడ్ కోచ్‌గా ఉండిన సనత్ జయసూర్య తన పదవికి రాజీనామా చేయడంతో లంక క్రికెట్ బోర్డు కిర్‌స్టన్‌ను ఎంపిక చేసింది. కిర్‌స్టన్ రెండేళ్ల ఒప్పందంలో భాగంగా ఏప్రిల్ 15న బాధ్యతలు చేపడతారు. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా లంక క్రికెట్ కిర్‌స్టన్ నియామకం చేపట్టింది.కిర్‌స్టన్‌ను హెడ్ కోచ్‌గా మంచి ట్రాక్ ఉంది. అంతర్జాతీయంగా, ఐపీఎల్లో అతను విజయవంతమైన జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. భారత్‌ను వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి కూడా చేర్చాడు. అలాగే తన సొంత జట్టు దక్షిణాఫ్రికాకు కూడా విజయవంతంగా సేవలందించాడు. అతని కెరీర్లో ఏదైనా ఫెయిల్యూర్ ఉందా అంటే అది పాకిస్తాన్ వైట్ బాల్ జట్టుకు కోచ్‌గా సేవలందించడమే. పాక్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన స్వల్ప కాలంలోనే అతను రాజీనామా చేశాడు (బోర్డు మరియు ఆటగాళ్లతో విభేదాల కారణంగా).ఐపీఎల్లో కిర్‌స్టన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలతో పని చేశారు. టైటాన్స్ 2022లో తొలి సీజన్లోనే టైటిల్ గెలిచినప్పుడు అతను బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌కు శ్రీలంకను నేరుగా అర్హత సాధించేలా చేయడమే కిర్‌స్టన్ ప్రధాన లక్ష్యం. లంక క్రికెట్ కొద్ది రోజుల క్రితమే తమ మహిళల జట్టు కోచ్‌ను ( జేమీ సిడ్డన్స్) కూడా మార్చింది. -
ప్రపంచకప్ సందర్భంగా పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన.. మహిళతో..!
పాకిస్తాన్ క్రికెటర్‌కు సంబంధించి ఆలస్యంగా వెలుగు చూసిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా ఓ పాక్ క్రికెటర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. సూపర్-8 దశలో శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఈ ఘటన జరిగిందని సమాచారం.పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్ జట్టు ఫిబ్రవరి 28న పల్లెకెలెలో శ్రీలంకతో తమ చివరి సూపర్-8 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌కు ముందు, కాండీ (శ్రీలంక)లోని గోల్డెన్ క్రౌన్ హోటల్లో ఓ పాక్ ఆటగాడు మహిళా హౌస్‌కీపింగ్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు మహిళ సాయం కోసం కేకలు వేయగా, ఇతర హోటల్ సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని తెలుస్తుంది. ఈ విషయం పాక్ మేనేజర్ నవీద్ చీమాకు తెలియజేయగా.. ఆయన హోటల్ మేనేజ్మెంట్కు క్షమాపణ చెప్పి సమస్యను అంతర్గతంగా పరిష్కరించాడని సమాచారం. మహిళను వేధించిన ఆ పాక్ ఆటగాడి పేరు బహిరంగంగా వెల్లడించకపోయినా, జట్టు మేనేజ్మెంట్ అతనిపై కఠన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా భారీ జరిమానా విధించినట్లు సమాచారం. ఈ ఘటనపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సదరు ఆటగాడిపై నక్వీ అదనపు చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.కాగా, పాక్ ఆటగాళ్లపై, సపోర్ట్ స్టాఫ్‌పై గతంలో ఇలాంటి ఆరోపణలు చాలానే వచ్చాయి. పాక్ బృందం దురుసు ప్రవర్తనకు మారు పేరని ప్రపంచ క్రికెట్ దేశాల హోటల్ యాజమాన్యాలన్నీ ముక్తకంఠంతో చెబుతాయి. పాక్ ఆటగాళ్లకు ఇలాంటి అనుభవాలు షరామామూలే.ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో పాక్ ఘోర ప్రదర్శనలు చేసి సూపర్-8 దశలోనే నిష్క్రమించింది. చివరి సూపర్-8 మ్యాచ్‌లో శ్రీలంకపై భారీ తేడాతో గెలుచుంటే, న్యూజిలాండ్ కంటే మెరుగైన రన్‌రేట్ సాధించి సెమీస్‌కు అర్హత సాధించి ఉండేది. అయితే లంక ఆటగాళ్లు అద్భుతంగా ప్రతిఘటించి పాక్‌కు సెమీస్ బెర్త్ దక్కనీయకుండా చేశారు. లంకపై భారీ స్కోర్ చేసినా గెలిచినా, పాక్ ఇంటిముఖం పట్టక తప్పలేదు. పాక్ కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్‌తో పాటు న్యూజిలాండ్ సెమీస్‌కు చేరింది. ఇదే న్యూజిలాండ్ జట్టు సెమీస్‌లో గ్రూప్-1 టాపర్ సౌతాఫ్రికాకు ఊహించని షాకిచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. -
ఇరాన్ షిప్‌ను కూల్చేసిన అమెరికా.. 85 మంది జలసమాధి
అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న ఇరాన్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక తీరంలో ఇరాన్‌కు చెందిన షిప్‌పై సబ్ మెరైన్ అటాక్‌తో అమెరికా కూల్చివేసింది. దీంతో నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమదాంలో ఇరాన్ సైనికులు మృతిచెందారు. ఇప్పటి వరకూ శ్రీలంక నావికా దళం 85 మృతదేహాలు స్వాధీనం చేసుకుంది. మరికొందరి జాడ తెలియాల్సి ఉందని ప్రకటించింది. కాగా నౌక మునిగిపోతుండగా 32 మందిని రక్షించినట్లు శ్రీలంక నేవీ ప్రకటించింది.ప్రస్తుతం పశ్చిమాసియాను యుద్ధం కమ్ముకుంది. టెహ్రాన్‌పై యుఎస్, ఇజ్రాయెల్ పెద్దఎత్తున దాడులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ నగరం విధ్వంసమైంది. ఆ దేశానికి చెందిన అనేక భవనాలు నేల కూలాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇరాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, రాడార్ సిస్టమ్స్ ఇలా అన్నింటిని నిర్వర్యం చేశామని తెలిపారు. ఇలా దాడులతో ఇప్పటికే పెద్దఎత్తున సైనికవ్యవస్థ దెబ్బతిన్న ఇరాన్‌కు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌కు చెందిన యుద్ధనౌకను శ్రీలంక తీరంలో యుఎస్ కూల్చివేసింది.శ్రీలంక గాలే నగర తీరంలో ఇరాన్‌కు చెందిన ఐరిస్ డెనా అనే యుద్ధనౌకపైపై సబ్ మెరైన్ అటాక్ జరిగింది. దీంతో నౌక ప్రమాదానికి గురై సముద్రంలోకి మునిగిపోయింది. అయితే ప్రమాద సమయంలో నౌక నుంచి ప్రమాద సంకేతాలు రావడంతో శ్రీలంక నావికాదళం వెంటనే అక్కడికి చేరుకుంది. తక్షణమే స్పందించి ప్రమాదంలో మునిగిపోతున్న దాదాపు 30 మందిని సురక్షితంగా కాపాడాయి. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 85 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు శ్రీలంక నేవీ ప్రకటించింది. గల్లంతైన వారికోసం గాలింపులు చేపడుతున్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్ ప్రకటించారు. అయితే ఈ నౌక ఐరిస్ డెనా నౌక గత నెల 17న విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూలో (IFR)పాల్గొని తిరిగి ఇరాన్ వెళుతుండగా దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం అంతర్జాతీయ సముద్ర జలాల్లో జరిగినట్లు సమాచారం -
కుమార సంగక్కర ఇంట తీవ్ర విషాదం
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార్ సంగక్కర ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి, ప్రముఖ న్యాయవాది ఎస్కే సంగక్కర వయోభారంతో నిన్న (మార్చి 3) సాయంత్రం తదిశ్వాస విడిచారు. ఎస్కే సంగక్కర మరణవార్త లంక క్రికెట్ సర్కిల్స్‌తో పాటు న్యాయ, రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. సోషల్‌మీడియా వేదికగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్కే సంగక్కర అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 6 గంటలకు క్యాండీలోని మహాయావా స్మశానంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఎస్కే సంగక్కరకు భార్య కుమారి, కుమార సంగక్కర సహా మరో ముగ్గురు తోబుట్టువులు (తుషారి, సురంగ, వెమింద్రా) ఉన్నారు.Saddened to hear the demise of Mr. Kshema Sangakkara, a well known Civil Lawyer, father and first coach of Kumar Sangakkara. RIP sir, your contribution to the law and cricket will not be forgotten🙏 pic.twitter.com/qJfIqNv6Zr— Akhila Seneviratne (@AkhilaSene97) March 3, 2026కాగా, కుమార సంగక్కరకు తొలి గురువు తండ్రే. సంగక్కర దిగ్గజ క్రికెటర్‌గా ఎదగడంలో ఎస్కే సంగక్కర పాత్ర చాలా కీలకం. ఎస్కే సంగక్కర వృత్తిరిత్యా బిజీ న్యాయవాది అయినప్పటికీ.. కొడుకు క్రికెట్ కెరీర్ కోసం సమయం వెచ్చించే వారు. ఈ విషయాన్ని సంగక్కర తన రిటైర్మెంట్ సందర్భంగా ప్రస్తావించాడు. కుమార సంగక్కర ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. -
విండీస్ గడ్డపై తిరుగులేని విజయం సాధించిన శ్రీలంక
వెస్టిండీస్ గడ్డపై శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు తిరుగులేని విజయాలు సాధించింది. 3 వన్డేలు, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌లో పర్యటించిన శ్రీలంక.. తొలుత వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా టీ20 సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది.నిన్న (మార్చి 4) గ్రెనడా వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లో ఆతిథ్య జట్టుపై శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేసింది.టాపార్డర్ బ్యాటర్లు హేలీ మాథ్యూస్ (8), ఎబోని బ్రాత్‌వైట్ (8), షవ్నిషా హెక్టార్ (5) దారుణంగా విఫలం కాగా.. మిడిలార్డర్ బ్యాటర్లు స్టెఫాలీ టేలర్ (24), డియాండ్రా డొట్టిన్ (28), చిన్నెల్ హెన్రీ (32 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో రణవీర (4-0-16-2), కవిష దిల్హరి (4-0-13-1), సుగంధిక కుమారి (4-0-32-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది.హాసిని పెరీరా (52 నాటౌట్), చమారీ ఆటపట్టు (32), ఇమేషా దులాని (34 నాటౌట్) రాణించడంతో 17.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అర్ద సెంచరీతో రాణించిన హాసినికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. సిరీస్ ఆధ్యాంతం రాణంచిన చమారికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. -
చక్క'టీ' లైఫ్ స్టైల్
శ్రీలంక లోని హపుటాలే అనే చిన్న కొండ పట్టణంలో టీ తోటల మధ్య సాగే జీవన విధానం ఒక నిశ్శబ్ద ప్రయాణ కథలా అనిపిస్తుంది. పొగమంచులో కమ్ముకున్న వెలుగు–నీడలు, టీ ఆకులు సేకరించే చేతులుం ఇవన్నీ ప్రతీ రోజు ప్రశాంతతకు చిహ్నాలుగా కనిపిస్తాయి. ఇక్కడ ప్రతీ ఉదయం హడావిడి లేకుండా మెల్లగా ప్రారంభమవుతుంది. లోయలో మేఘాలు సాఫీగా కదులుతూ ఉంటే, మనుషుల జీవితం కూడా అదే లయలో ముందుకు సాగుతుంది. సమయం ఇక్కడ పరుగెత్తదుం నడుస్తుంది. ఎలాంటి హడావిడి లేకుండా ఇక్కడ సమయం గడుస్తుంది.సందర్శనీయ స్థలాలుహపుటాలేలో పర్యాటకులు తప్పక వెళ్లే ప్రదేశాల్లో లిప్టన్ సీట్, డియాలుమా జలపాతం ముఖ్యమైనవి. ఇక్కడ కనిపించేది కేవలం ప్రకృతి అందం మాత్రమే కాదుం సాధారణంగా కొనసాగుతున్న జీవితం యొక్క ఒక నిశ్శబ్ద రాగంలా ఉంటుంది. దగ్గర్లోని తంగమాలే బర్డ్ శాంక్చువరి వద్ద పక్షుల సందడి ఒక స్వచ్ఛమైన సంగీతంలా అనిపిస్తుంది. ప్రతీ ఉదయం ఇక్కడ వినిపించే స్వరాలు హృదయాన్ని తాకుతాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి కొలంబోకి నేరుగా విమాన ప్రయాణం చేసి, అక్కడి నుంచి రైలు లేదా క్యాబ్ ద్వారా హపుటాలే చేరవచ్చు. కొలంబో నుంచి ఈ కొండ ప్రాంతానికి వెళ్లే రైలు ప్రయాణం అత్యంత అందమైన అనుభవంగా ఉంటుంది.(చదవండి: వెలుగులతో రంగులు మార్చే భూమి..!) -
సౌతాఫ్రికాపై పాకిస్తాన్.. వెస్టిండీస్‌పై శ్రీలంక..!
ఓ పక్క పురుషుల టీ20 ప్రపంచకప్ జరుగుతుండగా.. మహిళల విభాగంలో వన్డే, టీ20 సిరీస్‌లు జరుగుతున్నాయి. మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా.. పాకిస్తాన్ సౌతాఫ్రికాలో.. శ్రీలంక విండీస్‌లో పర్యటిస్తున్నాయి.క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్ఆసీస్ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. ఆతర్వాత వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడింది. వన్డే ప్రపంచ ఛాంపియన్ హోదాలో భారత జట్టు తమ తొలి సిరీస్‌లోనే ఆసీస్ చేతిలో 0-3 తేడాతో క్లీన్ స్వీప్ అయ్యింది. ఇరు జట్ల మధ్య మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.నామమాత్రపు విజయంసౌతాఫ్రికా పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన పాకిస్తాన్.. వన్డే సిరీస్‌లోనూ అదే ఫలితాన్ని (1-2) పునరావృతం చేసింది. నిన్న జరిగిన మూడో వన్డేలో పాక్ ఆతిథ్య జట్టుపై 119 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, కంటితుడుపు విజయాన్ని సాధించింది.చమారీ ఆల్‌రౌండ్ షోవిండీస్ పర్యటనలో తొలుత 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న శ్రీలంక.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లో తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. చివరి టీ20 మార్చి 3న జరుగనుంది. -
రూ. 3 లక్షల బంగారం కొంటే.. కోట్ల గోల్డ్ మెర్సిడెస్ వచ్చింది!
షాపింగ్ మాల్స్‌లో షాపింగ్ చేయడం, కూపన్స్ నింపడం, బంపర్ డ్రాలు కోసం ఎదురు చూడటం మనలో చాలామందికి అలవాటే. కానీ అదృష్టం వరించేది చాలా తక్కువ మందికే. కానీ కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి లక్షల్లో పెట్టుబడి పెట్టి 50రెట్ల లాభంతో గోల్డ్ లగ్జరీ మెర్సిడెస్ కారు దక్కించుకున్నాడు. ఎవరా లక్కీ ఫెలో? ఏమా కథ?ప్రతీ వేసవిలో దుబాయ్ 'షాప్ & విన్' (Shop & Win) ప్రమోషన్లు , షాపింగ్ ఫెస్టివల్స్ సర్వ సాధారణం. కానీ దుబాయ్‌లోని కాల్ సెంటర్లో పనిచేస్తున్న శ్రీలంక వాసి సుమిత్ అనే వ్యక్తి తనకు లగ్జరీ కారు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం సుమిత్ 15 వేల దీనార్లతో( సుమారు రూ.3 లక్షల 70వేల) బంగారు బిస్కెట్లు కొనుగోలు చేశాడు. ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌కు వెళ్లడం అదే తొలిసారి కూడా. కట్ చేస్తే ఈ పెట్టుబడి కంటే 50 రెట్లు ఎక్కువ విలువైన బహుమతి వరించింది.ఈ విషయాన్నిఇంకా నమ్మలేక పోతున్నాను అంటూ సంతోషంగా ఉబ్బితబ్బిబ్బవు తున్నాడు సుమిత్. View this post on Instagram A post shared by Dubai Gold District (@dubaigolddistrict)కారుతో సరదాగా ఫోటో కట్ చేస్తే20ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న సుమిత్ దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో పెట్టుబడిగా బంగారు బిస్కెట్‌ను కొనుగోలు చేశారు. ఖర్చు చేసిన ప్రతి 500 దిర్హామ్‌లకు ఒక వోచర్‌ను అందించే 'స్పెండ్ అండ్ విన్' ప్రచారం కింద అతనికి రాఫిల్ కూపన్లు 30 వచ్చాయి. డిసెంబర్ 11 - ఫిబ్రవరి 8 వరకు జరిగిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ 'షాప్ & విన్' ప్రచారంలో అతడిని అదృష్టం వరించింది. గోల్డ్ బిస్కట్లను కొనుగోలు చేసిన అక్కడున్న కారుతో సుమిత్ సరదాగా ఫోటో తీసుకున్నాడు. కానీ అదే కారు గెలుచుకుంటానని మాత్రం అస్సలు ఊహించలేదు. సర్ప్రైజ్ చేసిన కాల్ఒకరోజు నైట్ డ్యూటీనుంచి ఉదయం సుమిత్ ఇంటికొచ్చి నిద్రకు పక్రమించాడు. సరిగ్గా అప్పుడే అతని జీవితాన్నిఊహించని మలుపు తిప్పిన ఫోన్ కాల్ వచ్చింది. మెయిల్ చెక్ చేసుకోండి అని చెప్పారు. చెక్ చేశాక తన కళ్లను తానే నమ్మలేక పోయాడు. వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే ఆనందంలో మునిగి పోయాడు. చాలామంది ఆ కారు అమ్మేసి డబ్బులు వాడుకోవాలని సూచించారు. కానీ సుమిత్ మాత్రం తనకు ఆ కారు కావాలనే తన నిర్ణయాన్ని స్పష్టం చేశాడు. రెండు దశాబ్దాల తరువాత తనకు దేవుడిచ్చిన వరం అంటూ ఆనందాన్ని ప్రకటించాడు. (తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?) -
విండీస్‌కు కంటితుడుపు విజయం
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌కు కంటితుడుపు విజయం దక్కింది. ఈ సిరీస్‌ను ఇదివరకే 0-2తో కోల్పోయిన విండీస్.. నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన మూడో వన్డేలో గెలిచి పర్యాటక జట్టు ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. గ్రెనడా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించింది. తొలుత బౌలింగ్‌లో (10-2-33-2) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసిన హేలీ.. ఆతర్వాత బ్యాటింగ్‌లో సెంచరీ చేసి తన జట్టును గెలిపించింది. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. హేలీ (10-2-33-2), కరిశ్మ (10-0-39-2), ఫ్లెచర్ (10-1-39-1), ఆశ్మిని (10-0-42-1) లంక ప్లేయర్లను కట్టడి చేశారు. లంక ఇన్నింగ్స్‌లో హర్షిత సమరవిక్రమ (70) అర్ద సెంచరీతో రాణించగా.. కవిష దిల్హరి (45 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్ చేసింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ తొలి 5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హేలీ.. స్టెఫానీ టేలర్ (38) సహకారంతో విండీస్‌ను విజయతీరాల వరకు చేర్చింది. చిన్నెల్ హెన్రీ (32 నాటౌట్), డియాండ్రా డాట్టిన్ (24) విండీస్‌ను విజయతీరాలు దాటించారు. 46 ఓవర్లలో విండీస్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్లు మల్కి మదారా 2, రణవీర, కెప్టెన్ చమారీ చెరో వికెట్ తీశారు. -
పతనం అంచుల్లో శ్రీలంక క్రికెట్
స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక జట్టు సూపర్-8 దశలోనే నిష్క్రమించి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొని ఫ్యాన్స్‌ను ఉసూరుమనిపించింది. వాస్తవానికి టోర్నీ ప్రారంభానికి ముందు ఈ జట్టుపై ఓ మోస్తరు అంచనాలు ఉండేవి. హోం అడ్వాంటేజ్ కలిసొచ్చి ప్రత్యర్దులను ఇబ్బంది పెడుతుందని అంతా భావించారు. అయితే పరిస్థితి తిరగబడింది. గ్రూప్ దశలో పటిష్టమైన ఆస్ట్రేలియాకు షాకిచ్చినా.. సూపర్-8కు రాగానే తేలిపోయింది. వరుసగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతుల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొని టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఆసీస్‌పై గెలుపు మినహా శ్రీలంక గ్రూప్ దశలోనూ పెద్దగా చేసిందేమీ లేదు. ఇంకా చెప్పాలంటే తమకంటే చాలా బలహీనమైన జింబాబ్వే చేతిలో ఓటమిపాలై, సొంత అభిమానులచే చీవాట్లు తినింది. సూపర్-8 దశలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ను బౌలింగ్‌లో కట్టడి చేయగలిగినా.. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. ఓ మోస్తరు స్కోర్లను ఛేదించలేక చతికిలబడింది. తొలుత ఇంగ్లండ్, తాజాగా న్యూజిలాండ్ మ్యాచ్‌ల్లో ఇదే జరిగింది. ఇంగ్లండ్‌ను 146 పరుగులకు కట్టడి చేసి సంకలు గుద్దుకున్నా, ఆతర్వాత బ్యాటింగ్‌లో చేతులెత్తేసి 95 పరుగులకే కుప్పకూలింది.న్యూజిలాండ్ మ్యాచ్‌లోనూ బౌలర్లు సత్తా చాటి ప్రత్యర్దిని 168 పరుగులకే కట్టడి చేసినా.. ఇంగ్లండ్ మ్యాచ్ తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ లంక బ్యాటర్లు ఉసూరుమనిపించారు. కనీసం టార్గెట్‌కు దరిదాపుల్లోకి కూడా రాలేక 107 పరుగులకే పరిమితమయ్యారు. గ్రూప్ దశలో పసికూనలు ఐర్లాండ్, ఒమన్ మినహా ఈ మెగా టోర్నీలో శ్రీలంక సాధించింది ఏమీ లేదు. ఆసీస్‌పై దక్కిన విజయాన్ని లంక క్రెడిట్‌కు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఆ జట్టు స్టార్లు లేక బలహీనంగా ఉండింది.మొత్తంగా హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో సంచలనాలు సృష్టిస్తుందని భావించిన శ్రీలంక సూపర్-8 దశలోనే నిష్క్రమించి అభిమానుల ఆశలను అడియాశలు చేసింది. వాస్తవానికి శ్రీలంక పరిస్థితి గత కొంతకాలంగా ఏమంత ఆశాజనకంగా లేదు. గత పదేళ్లకాలంలో ఆ జట్టు అడపాదడపా విజయాలు మినహాయించి ఐసీసీ టోర్నీల్లో ఒక్కసారి కూడా కనీసం సెమీఫైనల్స్‌కు చేరుకోలేదు.ఆ జట్టు చివరిగా 2011 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్స్ వరకు చేరింది. ఫైనల్స్‌లో భారత్ చేతిలో చిత్తై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆతర్వాత వరుసగా జరిగిన 10 ఐసీసీ మెగా టోర్నీల్లో ఒక్కసారి కూడా సెమీస్‌కు చేరుకోలేదు. 2015 వన్డే ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్‌కప్, 2021 టీ20 వరల్డ్‌కప్, 2022 టీ20 వరల్డ్‌కప్, 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, తాజాగా టీ20 వరల్డ్‌కప్ 2026లో శ్రీలంక సెమీస్‌కు ముందే నిష్క్రమించింది.ప్రస్తుత శ్రీలంక జట్టు పరిస్థితి చూస్తే.. కొన్నేళ కిందటి వెస్టిండీస్ దుస్థితి గుర్తుకు వస్తుంది. విండీస్ జట్టు స్టార్లంతా రిటైరయ్యాక ఉనికి ప్రశ్నార్థకంగా మార్చుకుంది. ఆ జట్టు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. శ్రీలంకను చూస్తే.. విండీస్‌కు పట్టిన గతే పట్టేలా ఉందనిపిస్తుంది. లంక జట్టులో టాలెంట్‌కు కొదవ లేకున్నా, నిలకడలేమి పెద్ద సమస్యగా మారింది. నిస్సంక లాంటి ఒకరిద్దరు ఆటగాళ్లు క్రమం తప్పకుండా రాణిస్తున్నా, మిగతా వారి నుంచి వారికి మద్దతు లభించడం లేదు. హసరంగ, పతిరణ లాంటి స్టార్ బౌలర్లు తరుచూ గాయాల బారిన పడి కీలక మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవడం కూడా ఆ జట్టుకు తలనొప్పిగా మారింది. బౌలింగ్‌లో తీక్షణ, వెల్లాలగే పర్వాలేదనిపించినా, ఆ స్థాయి రాణింపు మ్యాచ్‌లకు గెలిపించదు. కుసాల్ మెండిస్, అసలంక, కమిందు మెండిస్, కెప్టెన్ షనక లాంటి వారు క్రమం తప్పకుండా రాణిస్తేనే శ్రీలంక ఫేట్ మారుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం సమీప భవిష్యత్తులోనే ఆ జట్టు పసికూన చేతిలో కూడా పరాభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శ్రీలంకతో నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఈ ఓటమితో ఆతిథ్య శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47), కోల్ మెక్‌కోంచి (31 నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 84 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.ఈ క్రమంలో సాంట్నర్-మెక్‌కోంచి జోడీ ఓ వరల్డ్‌కప్ రికార్డును బద్దలు కొట్టింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు మైక్ హస్సీ-స్టీవ్ స్మిత్ పేరిట ఉండేది. 2010 ఎడిషన్‌లో బంగ్లాదేశ్‌పై ఈ జోడీ ఏడో వికెట్‌కు 74 పరుగులు జోడించింది. తాజాగా సాంట్నర్-మెక్‌కోంచి జోడీ ఈ రికార్డును బద్దలు కొట్టింది.డెత్ ఓవర్లలో దూకుడుడెత్ ఓవర్లలో సాంట్నర్-మెక్‌కొంచి జోడీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. చివరి నాలుగు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు రాబట్టింది. 17వ ఓవర్లో 18, 18వ ఓవర్లో 21, చివరి రెండు ఓవర్లలో 19 మరియు 12 పరుగులు పిండుకుంది.అరుదైన మైలురాయిని తాకిన సాంట్నర్ఈ మ్యాచ్‌లో 47 పరుగులు చేయడంతో సాంట్నర్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేయడంతో పాటు 100 వికెట్లు తీసిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో మొహమ్మద్ నబీ, హార్దిక్ పాండ్యా, షకీబ్ అల్ హసన్ వంటి ప్రముఖులు ఉన్నారు.బెంబేలెత్తించిన హెన్రీ.. తిప్పేసిన స్పిన్నర్లు169 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్లు ఆది నుంచే రెచ్చిపోయారు. ముఖ్యంగా మ్యాట్ హెన్రీ (2-1-3-2) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ నిస్సంకను క్లీన్ బౌల్డ్ చేసిన హెన్రీ.. ఆతర్వాతి ఓవర్లో అసలంకను పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత స్పిన్నర్లు లైన్లోకి వచ్చి లంక ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. వీరిలో రచిన్ రవీంద్ర (4-0-27-4) లంక పతనాన్ని శాశించారు. సాంట్నర్ (4-0-19-1), గ్లెన్ ఫిలిప్స్ (4-0-21-1) పొదుపుగా బౌలింగ్ చేసి లంక ఆటగాళ్లను కట్టడి చేశారు. ఫలితంగా శ్రీలంక నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన కమిందు మెండిసే టాప్ స్కోరర్. -
శ్రీలంక ఖేల్ ఖతం
కొలంబో: టి20 ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక సొంతగడ్డపై కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తయిన లంక... ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలోనూ ఓడింది. ఫలితంగా రెండు పరాజయాలతో సెమీస్ అవకాశాలు కోల్పోయింది. బుధవారం జరిగిన ‘గ్రూప్–2’ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 61 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ చేరగా, తాజా విజయంతో కివీస్ అవకాశాలు మెరుగయ్యాయి. శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే కివీస్ కూడా సెమీస్‌లోకి అడుగు పెడుతుంది. ఓడితే శనివారం పాక్, లంక మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. పాక్ ఓడితే కివీస్‌కు చోటు ఖాయమవుతుంది. పాక్ గెలిస్తే అప్పుడు రన్‌రేట్‌లో పోటీ పడాల్సి ఉంటుంది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (26 బంతుల్లో 47; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), కోల్ మెక్‌కోన్‌కీ (23 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... ఫిన్ అలెన్ (13 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. 9.2 ఓవర్లు ముగిసేసరికి కివీస్ 75/2తో మెరుగైన స్థితిలోనే ఉంది. అయితే లంక బౌలర్లు చెలరేగడంతో 9 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 84/6కు చేరింది. ఈ దశలో సాంట్నర్, మెక్‌కోన్‌కీ ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 47 బంతుల్లో 84 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. చివరి 4 ఓవర్లలో న్యూజిలాండ్ 6 సిక్స్‌లు, 4 ఫోర్లతో 70 పరుగులు రాబట్టడం విశేషం. ఆరు వికెట్లు కోల్పోయే సమయానికి 84 పరుగులు చేసిన కివీస్... తర్వాతి వికెట్ భాగస్వామ్యంలో సరిగ్గా అన్నే పరుగులు చేయడం విశేషం. టి20 వరల్డ్ కప్‌లో గతంలో ఏడో వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం 74 పరుగులు (మైక్ హస్సీ, స్టీవ్ స్మిత్ మధ్య 2010లో) కాగా...సాంట్నర్, మెక్‌కోన్‌కీ దీనిని సవరించారు. మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో లంక పూర్తిగా తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులు చేసి ఓడిపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే నిసాంక (0) బౌల్డ్ కావడంతో మొదలైన పతనం వేగంగా సాగింది. అసలంక (5), కుశాల్ మెండిస్ (11), పవన్ రత్నాయకే (10), షనక (3) వరుస కట్టి పెవిలియన్‌కు చేరడంతో 10.3 ఓవర్లలో 46 పరుగులకే జట్టు సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కమిందు మెండిస్ (31; 4 ఫోర్లు), వెలలాగె (29; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా దాని ప్రభావం ఫలితంపై పడలేదు. రచిన్ రవీంద్ర (4/27) లంకను కుప్పకూల్చగా, హెన్రీకి 2 వికెట్లు దక్కాయి. రచిన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
టీ20 వరల్డ్ కప్: శ్రీలంకపై న్యూజిలాండ్ గెలుపు
టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం జరిగిన టీ20 వరల్డ్‌కప్ సూపర్ 8 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 61 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. సెమీఫైనల్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి పాలైంది.టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఒక దశలో వరుస వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. 75 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయిన కివీస్, కొద్ది సమయంలోనే 84/6కి కుప్పకూలింది. వరుసగా మూడు వికెట్లు పడిపోవడంతో మ్యాచ్ శ్రీలంక వైపు మళ్లినట్టే అనిపించింది.అయితే, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47), కోల్ మెక్కాంచీ (31 నాటౌట్) కీలకమైన 84 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును గట్టెక్కించారు. మిచెల్,కోల్ అద్భుతమైన ఆటతీరుతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 168/7 స్కోరు చేసింది.169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో శ్రీలంక బ్యాట్స్‌మెన్ ప్రారంభం నుంచే కష్టాల్లో పడ్డారు. న్యూజిలాండ్ బౌలర్ రచిన్ రవీంద్ర అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టి లంకన్ జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. చివరికి శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 107 పరుగులకే పరిమితమైంది.ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ల చక్కటి లైనప్, అలాగే సాంట్నర్-మెక్కాంచీ భాగస్వామ్యం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు, పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనతో శ్రీలంక ఓటమి చవిచూసింది. -
టీ20 ప్రపంచకప్‌లో నేడు మరో సూపర్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 25) మరో సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. ఆతిథ్య శ్రీలంకను న్యూజిలాండ్ కొలొంబో వేదికగా ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఇరు జట్లు సెమీస్ రేసులో ఉంటాయి. ఓడినా ఛాన్స్‌లు ఉంటాయి కానీ, అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారతాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈ మ్యాచ్ చాలా కీలకం.శ్రీలంక తొలి సూపర్ ఓవర్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడి సెమీస్ రేసులో చిట్టచివరి స్థానంలో ఉండగా.. పాక్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దై న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ఖరారు కావడంతో మిగిలిన బెర్త్ కోసం న్యూజిలాండ్-పాక్-శ్రీలంక మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది.న్యూజిలాండే ఫేవరెట్నేటి మ్యాచ్‌లో ఏ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయని పరిశీలిస్తే.. న్యూజిలాండే ఫేవరెట్ అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. గ్రూప్ దశలో ఈ జట్టు నాలుగింట మూడు మ్యాచ్‌ల్లో (సౌతాఫ్రికా మినహా) గెలిచింది. శ్రీలంక సైతం నాలుగింట మూడు మ్యాచ్‌ల్లోనే గెలిచినప్పటికీ (జింబాబ్వే మినహా).. బలాబలాల ప్రకారం న్యూజిలాండ్‌దే ఆధిక్యత కనిపిస్తుంది. గ్రూప్ దశలో ఆసీస్‌పై సంచలన విజయం సాధించినా, హోం అడ్వాంటేజ్ ఉన్నా.. బలాబలాలను పరిగణలోకి తీసుకుంటే న్యూజిలాండ్‌పై గెలవడం శ్రీలంకకు చాలా కష్టమనే చెప్పాలి.రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయిఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలించినా, న్యూజిలాండ్‌దే అధిపత్యమని చెబుతున్నాయి. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్‌లు జరగగా.. న్యూజిలాండ్ 16, శ్రీలంక 11 మ్యాచ్‌లు గెలిచాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. శ్రీలంకలో జరిగిన మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్ ఆధిపత్యమే కనిపిస్తుంది. లంకలో ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. న్యూజిలాండ్ 5, శ్రీలంక 3 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది.తుది జట్లు (అంచనా)న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్ శ్రీలంక: పతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుసల్ మెండిస్(w), పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(c), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక -
స్పిన్‌కు ఎదురొడ్డి... స్పిన్‌తోనే పడగొట్టి...
పల్లెకెలె: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఇంగ్లండ్ జట్టు టి20 ప్రపంచకప్ ‘సూపర్–8’లో శుభారంభం చేసింది. ఆదివారం గ్రూప్–2లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 51 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను బోల్తా కొట్టించింది. గ్రూప్ దశలో పడుతూ లేస్తూ సాగిన ఇంగ్లండ్... ‘సూపర్ ఎయిట్’లో సాధికారిక విజయం ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జోస్ బట్లర్ (7), జాకబ్ బెథెల్ (3), టామ్ బాంటన్ (6), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (14), స్యామ్ కరన్ (11), డాసన్ (6) విఫలమయ్యారు. స్పిన్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ (21; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. సొంతగడ్డపై శ్రీలంక బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ఒక్క సాల్ట్ తప్ప మిగిలిన వాళ్లెవరూ భారీ షాట్లు ఆడలేకపోయారు. లంక బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగె 3 వికెట్లు పడగొట్టగా... మధుషనక, తీక్షణ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక పూర్తిగా తడబడింది. 16.4 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ షనక (24 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఒక్కడే పోరాడగా... తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ 3 వికెట్లు తీయగా... ఆర్చర్, డాసన్, ఆదిల్ రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సాల్ట్ ఒక్కడే... ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సాల్ట్ ఒక్కడే దూకుడు కనబర్చాడు. లంక బౌలర్ల ధాటికి సహచర బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరుతున్నా... సాల్ట్ మాత్రం తనదైన శైలిలో షాట్లు ఆడాడు. వరల్డ్‌కప్ తొలి పోరులో నేపాల్ చేతిలో ‘చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు’ గెలిచిన ఇంగ్లండ్...‘సూపర్ –8’లోనూ అలాంటి అనుభవమే చవిచూసేలా కనిపించింది. అయితే సాల్ట్ మెరుపులకు బౌలర్ల సహకారం తోడవడంతో ... ఇంగ్లండ్ పని సులువైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 15 బౌండరీలు మాత్రమే నమోదైతే... శ్రీలంక కేవలం 12 బౌండరీలకే పరిమితమైంది. పవర్ ప్లేలోనే 34/5... ఓ మాదిరి లక్ష్యఛేదనలో లంక తడబడింది. ఇంగ్లండ్ బౌలర్లు ఆర్చర్, జాక్స్ ధాటికి... ఆరు ఓవర్లు ముగిసేసరికి 34/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. నిసాంక (9), కమిల్ (6), కుశాల్ మెండిస్ (4), పవన్ రత్నాయకే (0), దునిత్ వెల్లలాగె (10) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టారు. కెప్టెన్ షనక కాస్త పోరాడే ప్రయత్నం చేసినా... ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి వికెట్ల పతనం అలాగే కొనసాగింది. దీంతో శ్రీలంక లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. తదుపరి ‘సూపర్–8’ మ్యాచ్‌ల్లో మంగళవారం పాకిస్తాన్‌తో ఇంగ్లండ్; బుధవారం న్యూజిలాండ్‌తో శ్రీలంక తలపడతాయి. -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా... నేడు శ్రీలంక ‘ఎ’తో భారత్ ‘ఎ’ సెమీఫైనల్ పోరు
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం రెండు సెమీఫైనల్స్ ఉన్నాయి. తొలి సెమీఫైనల్లో శ్రీలంక ‘ఎ’ జట్టుతో భారత్ ‘ఎ’ జట్టు... రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ ‘ఎ’ జట్టుతో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం టీమిండియా మ్యాచ్ ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. రెండో సెమీఫైనల్‌ను మధ్యాహ్నం గం. 12:30 నుంచి నిర్వహిస్తారు. ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ టెన్1, సోనీ స్పోర్ట్స్ టెన్3, సోనీ స్పోర్ట్స్ టెన్4 చానెల్స్‌లో, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ టోర్నీలో రాధా యాదవ్ నాయకత్వంలో బరిలోకి దిగిన భారత ‘ఎ’ జట్టు తొలి లీగ్ మ్యాచ్‌లో యూఏఈ ‘ఎ’ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. ఈ పరాజయం నుంచి వెంటనే తేరుకున్న భారత ‘ఎ’ జట్టు తర్వాతి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, నేపాల్ జట్లను ఓడించింది. భారత్, పాక్, యూఏఈ జట్లు నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌తో భారత్, పాక్ సెమీఫైనల్ చేరుకున్నాయి. గ్రూప్ ‘బి’లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. -
శ్రీలంకకు జింబాబ్వే షాక్
కొలంబో: టి20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాను సంచలన రీతిలో ఓడించిన జింబాబ్వే ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఆసీస్‌పై గెలవడం గాలివాటం కాదని నిరూపిస్తూ ఆ జట్టు మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ్రస్టేలియాని చిత్తు చేసి సత్తా చాటిన ఆతిథ్య జట్టు శ్రీలంకను వారి సొంతగడ్డపైనే ఓడించి జింబాబ్వే షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘బి’లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటి రద్దు కాగా, మిగిలిన మూడూ నెగ్గి అజేయంగా, అగ్రస్థానంతో లీగ్ దశను ముగించింది. ‘సూపర్ ఎయిట్స్’లో తమను తక్కువగా అంచనా వేయవద్దంటూ హెచ్చరికను జారీ చేసింది. గురువారం జరిగిన పోరులో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేయగా...జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసి నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక ఇన్నింగ్స్‌లో నిసాంక (41 బంతుల్లో 62; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, పవన్ రత్నాయకే (25 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. నిసాంక, కుశాల్ పెరీరా (22; 4 ఫోర్లు) దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత జింబాబ్వే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యరి్థని నిలువరించింది. చివర్లో రత్నాయకే, వెలలాగె (15 నాటౌట్) కలిసి ధాటిగా ఆడారు. 19వ ఓవర్లో రత్నాయకే వరుసగా 4, 6, 4 బాదగా...ఆఖరి ఓవర్లలో వెలలాగె మూడు ఫోర్లు కొట్టాడు. ఛేదనలో జింబాబ్వేకు ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (48 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు), మరుమని (26 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించి శుభారంభం అందించారు. బెన్నెట్ జాగ్రత్తగా ఆడగా ఇతర సహచరులు దూకుడు ప్రదర్శించడంతో జింబాబ్వే లక్ష్యం దిశగా దూసుకుపోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (26 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), మరుమని, ర్యాన్ బర్ల్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 64 బంతుల్లో 102 పరుగులు సాధించడం విశేషం. 10 ఓవర్లలో 101 పరుగులు చేయాల్సి ఉండటంతో జింబాబ్వే విజయంపై సందేహాలు ఉన్నా...చివరకు జింబాబ్వే బ్యాటర్లు దానిని చేసి చూపించారు. ముఖ్యంగా హేమంత ఓవర్లో రజా వరుసగా 6, 6, 4 బాదడంతో పరిస్థితి మారిపోయింది. తీక్షణ వేసిన ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా ...తొలి బంతికి మున్యోంగా సిక్స్, మూడో బంతికి బెన్నెట్ ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించారు. -
T20 WC 2026: జింబాబ్వే మరో సంచలనం
టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే సంచలన విజయాల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో తొలుత టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జింబాబ్వెన్లు.. తాజాగా తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించిన షాకిచ్చారు. కొలొంబో వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే శ్రీలంకను 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా గ్రూప్-బిలో ఓటమెరుగని జట్టుగా నిలిచింది.ఈ గ్రూప్‌లో జింబాబ్వే.. ఒమన్, ఆస్ట్రేలియా, శ్రీలంకపై విజయాలు సాధించింది. ఐర్లాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ గ్రూప్ నుంచి జింబాబ్వే, శ్రీలంక ఇదివరకే సూపర్-8లోకి ప్రవేశించాయి. ఈ గ్రూప్‌లో శ్రీలంక సైతం ఆస్ట్రేలియాను ఓడించింది. ఇప్పుడు శ్రీలంకను జింబాబ్వే వారి సొంతగడ్డపై ఓడించి సంచలనం సృష్టించింది. పాయింట్ల పట్టికలోనూ జింబాబ్వే అగ్రస్థానంలో నిలిచింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఓపెనర్ పథుమ్ నిస్సంక (62), పవన్ రత్నాయకే (44) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో కుసాల్ పెరీరా 22, కుసాల్ మెండిస్ 14, కమిందు మెండిస్ 7, దసున్ షనక 6, వెల్లాలగే 15 (నాటౌట్) పరుగులు చేశారు. దుషన్ హేమంత డకౌటయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, బ్రాడ్ ఈవాన్స్, గ్రేమీ క్రీమర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ర్యాన్ బర్ల్ ఓ వికెట్ తీశాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బ్రియాన్ బెన్నెట్ (63) అజేయ అర్ద సెంచరీతో సత్తా చాటి జింబాబ్వేను విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ సికందర్ రజా (45) మెరుపు ఇన్నింగ్స్‌తో తన జట్టును విజయపు అంచుల వరకు తీసుకెళ్లాడు. మరో ఓపెనర్ మరుమణి (34), ర్యాన్ బర్ల్ (23) ఓ మోస్తరు స్కోర్లతో జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. లంక బౌలర్లలో హేమంత 2, వెల్లలగే, షనక చెరో వికెట్ తీశారు. -
క్రికెట్ మ్యాచ్‌కు ప్రత్యేక ఫ్లైట్లలో!
సాక్షి, అమరావతి: సామాన్యులు ఎర్రబస్సు ఎక్కిన మాదిరిగా చంద్రబాబు కుటుంబం ప్రత్యేక విమానాలను వినియోగించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. తాజాగా పాకిస్థాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు మంత్రి నారా లోకేశ్ బృందం ప్రత్యేక జెట్ విమానంలో శ్రీలంక వెళ్లి రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఉదయం అమరావతిలో ఉన్న లోకేశ్ సాయంత్రం కొలంబోలో ప్రత్యక్షమయ్యారు. మర్నాడు ఉదయం తిరిగి అమరావతి చేరుకుని బిల్‌గేట్స్‌తో ఫోటోలు దిగడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇక ఈ కార్యక్రమం పూర్తి కావడమే ఆలస్యం.. లోకేశ్ తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. క్రికెట్ మ్యాచ్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రత్యేక విమానాల వ్యయం ఎవరు భరిస్తున్నారన్నది కీలకంగా మారింది. ఈ ఖర్చుల వివరాలను అధికారికంగా వెల్లడించడం లేదు. ఒకపక్కన రాష్ట్రాన్ని అప్పులతో ముంచెత్తుతూ మరోపక్క విహార యాత్రల్లో గడపడంపై విస్తుపోతున్నారు.సమస్యలు గాలికి వదిలేసి...!ప్రస్తుతం మిడ్ సైజ్ ప్రైవేట్ జెట్ విమానం అద్దె గంటకు రూ.3.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉంది. దీనికి తోడు అంతర్జాతీయ ప్రయాణం కాబట్టి ల్యాండింగ్ చార్జీలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్, విదేశీ ఎయిర్ పోర్ట్ ట్యాక్స్‌లు అన్నీ కలిపి మరో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటాయి. వెరసి తాజాగా లోకేశ్ యాత్రలకు అయిన ఖర్చు అక్షరాలా రూ.కోటి పైమాటే అని వైమానిక వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి తనయుడు సాధారణ బైక్ రైడ్‌లా విమానాలను వాడుకోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీలు, నిరుద్యోగ సమస్యలను పట్టించుకోకుండా విదేశాల్లో మ్యాచ్‌లు చూడటానికి ఇంత సమయం, డబ్బులు వెచ్చించడం సబబేనా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇది వ్యక్తిగత పర్యటన అయితే అధికారిక హోదాను ఉపయోగించి పొందే ప్రోటోకాల్ సౌకర్యాల ఖర్చును ఎవరు చెల్లిస్తున్నారన్నది ముఖ్యం. -
‘శత’క్కొట్టిన నిసాంక
పల్లెకెలె: పాథుమ్ నిసాంక (52 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) ‘శతక’ విధ్వంసంతో ఆ్రస్టేలియా గల్లంతైంది. ఈ టి20 ప్రపంచ కప్‌లో తొలి సెంచరీని ఆతిథ్య శ్రీలంక బ్యాటర్ నిసాంక అజేయంగా లిఖించాడు. దీంతో ‘హ్యాట్రిక్’ విజయాలతో లంక జట్టు ‘సూపర్–8’కు అర్హత సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆ్రస్టేలియా ముందుకెళ్లే అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది. ఇప్పుడు జింబాబ్వే ‘వరుస ఓటమి’లపైనే ఆసీస్ ‘సూపర్–8’ భవితవ్యం ఆధార పడింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దాసున్ షనక నేతృత్వంలోని లంక 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా నిరీ్ణత 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు కెపె్టన్ మిచెల్ మార్‡్ష (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 56; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 104 పరుగులు జోడించారు. 8.2 ఓవర్ల వరకు వికెట్ కోల్పోలేదు. ఇంతవరకు జోరుగా సాగిన ఆసీస్ అనూహ్యంగా మిగతా 11.4 ఓవర్లలో మరో 77 పరుగులే చేసి 10 వికెట్లను కోల్పోయింది. ఇన్‌గ్లిస్ (27; 3 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (22; 1 ఫోర్, 1 సిక్స్) మాత్రమే రెండు పదుల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మ్యాక్స్‌వెల్ రివర్స్ స్వీప్‌తో బౌండరీకి యత్నించగా... బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద నిసాంక కళ్లు చెదిరే క్యాచ్‌తో అబ్బురపరిచాడు. లంక బౌలర్లలో హేమంత 3, చమీర 2 వికెట్లు తీశాడు. అనంతరం లంక 18 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి గెలిచింది. నిసాంక రెండో వికెట్‌కు కుశాల్ మెండిస్ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్)తో 97 పరుగులు, తర్వాత పవన్ రత్నాయకే (28 నాటౌట్; 6 ఫోర్లు)తో అబేధ్యమైన మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. ఆ్రస్టేలియా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 20న ఒమన్ జట్టుతో ఆడుతుంది. ఆసీస్ కంటే ముందే జింబాబ్వే మిగిలిన రెండు మ్యాచ్‌లు (నేడు ఐర్లాండ్‌తో; 19న శ్రీలంకతో) ఆడుతుంది. ఈ రెండింటిలో జింబాబ్వే ఒక్కటి గెలిచినా ‘సూపర్–8’కు అర్హత పొందుతుంది. ఒకవేళ జింబాబ్వే రెండింటిలో ఓడిపోయినా... రన్‌రేట్‌లో ఆ్రస్టేలియాకంటే మెరుగ్గా ఉంటేచాలు ‘సూపర్–8’ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. -
T20 WC 2026: భారీ లక్ష్య ఛేదన.. చరిత్ర సృష్టించిన ఒమన్ ప్లేయర్
టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) ఉదయం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక, ఒమన్ తలపడ్డాయి. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కుసాల్ మెండిస్ (45 బంతుల్లో 61; 7 ఫోర్లు), పవన్ రత్నాయకే (28 బంతుల్లో 60; 8 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ దసున్ షనక (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిగతా ఆటగాళ్లలో నిస్సంక 13, కమిల్ మిషారా 8, కమిందు మెండిస్ 19 (నాటౌట్), వెల్లాలగే 6 (నాటౌట్) పరుగులు చేశారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్ (4-0-28-0) మినహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జితేన్ రామనంది (4-0-41-2), సూఫ్యాన్ మెహమూద్ (4-0-60-1), జే ఒడేడ్రా (1-0-14-1) వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చారు. వసీం అలీ (3-0-38-0), నదీమ్ ఖాన్ (4-0-40-0)ను లంక బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఒమన్ ఆదిలోనే చేతులెత్తేసింది. వెల్లాలగే (4-0-17-1), తీక్షణ (4-0-11-2), చమీరా (2-0-19-2), కమిందు (2-0-10-1), హేమంత (4-0-45-1) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒమన్ ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో వచ్చిన వెటరన్ బ్యాటర్ మొహమ్మద్ నదీం (56 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు.నదీం కాకుండా వసీం అలీ (27) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆమిర్ కలీమ్ 6, కెప్టెన్ జతిందర్ సింగ్ 1, హమ్మద్ మీర్జా 9, వినాయక్ శుక్లా 1, నదీం ఖాన్ 2, సూఫ్యాన్ మెహమూద్ 1, షా ఫైసల్ 1, జే ఒడేడ్రా 4 (నాటౌట్), జితేన్ రామనంది డకౌటయ్యారు.నదీం ప్రపంచ రికార్డుఒమన్ తరఫున ఏకైక అర్ద సెంచరీ చేసిన మొహమ్మద్ నదీం ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో అర్ద సెంచరీ చేసిన అతి పెద్ద వయస్కుడైన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం నదీం వయసు 43 ఏళ్ల 161 రోజుల. గతంలో ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉండేది. జయసూర్య 2009 ప్రపంచకప్ ఎడిషన్‌లో వెస్టిండీస్‌పై 39 ఏళ్ల 345 రోజుల వయసులో అర్ద సెంచరీ చేశాడు.మరో ప్రపంచ రికార్డు కూడా సమంఈ మ్యాచ్‌లో నదీం మరో ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు. 52 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసిన నదీం.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో బంతుల పరంగా అతి నిదానంగా అర్ద సెంచరీ చేసిన ఆటగాడిగా పాక్ ప్లేయర్ మొహమ్మద్ రిజ్వాన్ రికార్డును సమం చేశాడు. రిజ్వాన్ 2024 ఎడిషన్‌లో కెనడాపై 52 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు. -
IND Vs PAK: పాక్‌తో ఐసీసీ కీలక సమావేశం.. స్పందించిన బీసీసీఐ
భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బృందంతో పీసీబీ చర్చలు జరుపుతోంది. లాహోర్‌లో ఈ సమావేశానికి ఐసీసీ, పీసీబీతో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తరఫున అమినుల్ ఇస్లాం హాజరయ్యాడు.డిమాండ్లు ఇవేనా?ఈ నేపథ్యంలో తాము టీమిండియాతో మ్యాచ్ ఆడాలంటే.. ఈ మ్యాచ్‌లో లభించే ఆదాయంలో తమకు అత్యధిక వాటా ఇవ్వాలని పీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అదే విధంగా.. బంగ్లాదేశ్‌కు నష్ట పరిహారం చెల్లించాలని, మ్యాచ్ ఫీజులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.అయితే, ఇందుకు ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా సానుకూలంగా లేనట్లు సమాచారం. గత్యంతరం లేకే తాము భారత్‌తో మ్యాచ్ బహిష్కరించామన్న పాక్ నిర్ణయంపై వివరణ కోరినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. బంగ్లాదేశ్‌కు అన్ని సభ్య దేశాల మాదిరి ఆదాయం మాత్రమే వస్తుందని తెలిపినట్లు సమాచారం.మాస్టర్ ప్లాన్!ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ తాము ఆర్థికంగా లబ్ది పొందేలా మాస్టర్ ప్లాన్ వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీతో పీసీబీ చర్చలు సఫలమైనా.. పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ నిర్ణయం మేరకే తాము ఆడేది లేనిది చెబుతామని పీసీబీ అంటోందని.. ఇంతకంటే విషయాన్ని పెద్దది చేస్తే పాక్ నష్టపోకతప్పదనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయిస్పందించిన బీసీసీఐఈ క్రమంలో భారత క్రికెట్ మండలి (BCCI) ఈ అంశంపై మరోసారి స్పందించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా చెప్పినట్లు ఐసీసీ నిర్ణయం మేరకే మేము నడుచుకుంటాము. ఇందులో బీసీసీఐ చెప్పాల్సిందేమీ లేదు’’ పునరుద్ఘాటించారు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది ఐసీసీ. అయితే, బంగ్లాదేశ్ సైతం తమకు భారత్‌లో భద్రత ఉండదని.. లంకకు తమ మ్యాచ్‌ల వేదికను మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఆరోపణలో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. అయినా సరే బంగ్లాదేశ్ పంతం వీడకపోవడంతో టోర్నీ నుంచి తప్పించింది.ఉగ్రదాడి జరిగినాఅప్పటి నుంచి బంగ్లాకు వంతపాడుతూ పాకిస్తాన్ డ్రామాలకు తెరలేపింది. తొలుత టోర్నీ నుంచి వైదొలుగుతామన్న పాక్.. తమకు తటస్థ వేదిక ఉన్నా ఇలా చేస్తే ఐసీసీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తుందన్న భయంతో వెనక్కి తగ్గింది. అయితే, టీమిండియాతో మ్యాచ్‌ను మాత్రం బహిష్కరిస్తామని పాక్ ప్రకటించింది. టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు లేని భద్రతా కారణాలు టీమిండియాతో మ్యాచ్‌కు మాత్రమే ఉంటాయని చెబుతూ నైజం బయటపెట్టుకుంది. ఇందుకు శ్రీలంక గట్టిగా బదులిచ్చింది. పాక్‌లో తమపై ఉగ్రదాడి జరిగినా మళ్లీ ఆ దేశంలో మ్యాచ్‌లు ఆడామని గుర్తు చేసింది.భారత్- పాక్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. మ్యాచ్ బహిష్కరిస్తే తాము ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుందని లంక లేఖ రాసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 15నాటి టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చిన పాక్.. అదనపు ఆదాయం కావాలంటూ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: ఛాయ్ తీసుకో.. వద్దండి!.. అంబానీకి నో చెప్పిన రోహిత్ శర్మ!#WATCH | Delhi | On Pakistan to boycott its match against India in the ICC Men’s T20 World Cup 2026, BCCI Vice-President Rajeev Shukla says, "We will follow whatever decision is taken by ICC... BCCI has no statement on this..." pic.twitter.com/gug8zToSic— ANI (@ANI) February 9, 2026 -
టీ20 ప్రపంచకప్: ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం
కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించింది. 20 పరుగులతో తేడాతో గెలిచేసింది. ఐర్లాండ్ జట్టు చివరివరకు పోరాడినప్పటికీ 143 పరుగులకే ఆలౌటైంది. దీంతో లంక గెలుపు లాంఛనమైంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 54, కమిందు మెండిస్ 44 పరుగులు చేశారు. ఐర్లాండ్ జట్టులో బ్యారీ,జార్జ్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఐర్లాండ్‌కి మంచి ఆరంభం దక్కింది. కానీ వరస విరామాల్లో వికెట్లు వరసగా పడిపోవడంతో 19.5 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది.హ్యారీ టెక్టర్ 40, రాస్ అడైర్ 34 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ, తీక్షణ తలో మూడు వికెట్లు తీయగా.. పతిరాణా 2 వికెట్లు తీశారు. -
శ్రీలంక కెప్టెన్ ప్రపంచ రికార్డు
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ షనక ఓ చెత్త రికార్డు విషయంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 8) ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటైన అతను.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక డకౌట్లైన (113 ఇన్నింగ్స్‌ల్లో 16 సార్లు) ఆటగాడిగా అవతరించాడు. షనకకు ముందు ఈ రికార్డు జప్పి బిమెన్యిమనా (62 ఇన్నింగ్స్‌ల్లో 15) పేరిట ఉండేది. షనక, జప్పి తర్వాతి స్థానాల్లో పాల్ స్టిర్లింగ్ (158 మ్యాచ్‌ల్లో 14) ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ ఆదిలో శ్రీలంక ఆటగాళ్లను బాగానే కట్టడి చేసింది. తొలి 10 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. 16 ఓవర్ల వరకు కూడా పరిస్థితి ఇలాగే కొనసాగింది. ఆ సమయానికి 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆ ఓవర్ తర్వాత ఐర్లాండ్ బౌలర్లు లయ తప్పారు. అనవసర వైడ్లు, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఫలితంగా చివరి 4 ఓవర్లలో లంక ఆటగాళ్లు 59 పరుగులు పిండుకున్నారు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్లలో జార్జియా డాక్రెల్ (4-0-17-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మార్క్ అదైర్ (4-0-33-1), గెరాత్ డెలానీ (4-0-24-1) కూడా పర్వాలేదనిపించారు. మాథ్యూ హంఫ్రేస్ (4-0-44-0), బ్యారీ మెక్ కార్తీ (3-0-40-2) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. లంక ఇన్నింగ్స్‌లో కుసాల్ మెండిస్ (56 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. ఆఖర్లో కుసాల్ మెండిస్ (44) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో నిస్సంక 24, కమిల్ మిషారా 14, పవన్ రత్నాయకే 5, వెల్లాలగే 10, హసరంగ ఒక్క పరుగు చేయగా.. షనక డకౌటయ్యాడు. -
శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ.. కీలక మార్పు
శ్రీలంక టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఫిబ్రవరి 1న ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో గాయపడిన ఈషాన్ మలింగ ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. మలింగ స్థానంలో ప్రమోద్ మదుశన్ జట్టులోకి వచ్చాడు. తొలుత ప్రకటించిన జట్టులో ప్రమోద్ స్థానాన్ని ఆశించి భంగపడ్డాడు. అయితే ఈషాన్ గాయపడటంతో ప్రమోద్‌కు బంపరాఫర్ దక్కింది. ఈషాన్, ప్రమోద్ ఇద్దరూ రైట్ ఆర్మ్ మీడియం పేసర్లే. ఈషాన్ లంక టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడు కాగా.. ప్రమోద్ లంక తరఫున టీ20 ఆడి దాదాపు మూడేళ్లవుతుంది. అతను చివరిగా 2023 ఏప్రిల్‌లో లంక తరఫున టీ20 ఆడాడు. ప్రమోద్ అంతర్జాతీయ టీ20 ఆడి చాలాకాలమే అయినా పొట్టి ఫార్మాట్‌తో మాత్రం అనునిత్యం టచ్‌లోనే ఉన్నాడు. 24 ఏళ్ల ప్రమోద్ ఇప్పటివరకు 8 అంతర్జాతీయ టీ20లు ఆడి 12 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్‌లో ప్రమోద్.. మతీష పతిరణ. దుష్మంత చమీరాతో కలిసి కొత్త బంతిని షేర్ చేసుకుంటాడు.స్వదేశంతో పాటు భారత్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఇవాల్టి నుంచే (ఫిబ్రవరి 7) ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో గ్రూప్-బిలో ఉన్న శ్రీలంక.. తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న ఐర్లాండ్‌తో ఆడనుంది. ఈ గ్రూప్‌లో శ్రీలంక, ఐర్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా, ఒమన్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.అప్డేటెడ్ శ్రీలంక జట్టు..- దసున్ షనక (కెప్టెన్) - పథుమ్ నిస్సంక - కమిల్ మిశారా - కుసల్ మెండిస్ - కమిందు మెండిస్ - కుసల్ జానిత్ పెరేరా - చరిత్ అసలంక - జానిత్ లియానగే - పవన్ రత్నాయకే - వనిందు హసరంగ - దునిత్ వెల్లలాగే - మహీష్ తీక్షణ - దుష్మంత చమీరా - మతీషా పథిరానా - ప్రమోద్ మదుశన్ -
T20 WC: జట్లు, మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య షెడ్యూల్ ఖరారైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను శ్రీలంక వేదికగా ఆడేలా షెడ్యూల్ రూపొందించారు.ఈ వరల్డ్‌కప్ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటుండగా.. వాటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి.గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ ఉండగా.. గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా పోటీలో పడుతున్నాయి. మరి టోర్నీకి ఖరారైన ఇరవై జట్లలో ఎవరెవరు ఉన్నారు? మ్యాచ్ టైమింగ్స్... ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ? తదితర విషయాలు తెలుసుకుందామా?!గ్రూప్-ఎభారత్సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్.యూఎస్ఏమోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, శుభం రంజానే.నమీబియాగెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్, బెర్నార్డ్ షాల్, రూబెన్ ట్రంపెల్మన్, జెజె స్మిత్, జాన్ ఫ్రైలింక్, లౌరెన్ స్టీన్‌క్యాంప్, మలన్ క్రుగర్, నికోల్ లాఫ్టీ-ఈటన్, జాక్ బ్రసెల్, బెన్ షికోంగో, జెసి బాల్ట్, డైలాన్ లీచర్, డబ్ల్యుపి మైబర్, మాక్స్ హీంగోరిజర్వు ప్లేయర్: అలెగ్జాండర్ వోల్షెంక్నెదర్లాండ్స్స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), కోలిన్ అకెర్మాన్, నోహ్ క్రోస్, బాస్ డి లీడ్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, కైల్ క్లైన్, మైఖేల్ లెవిట్, జాచ్ లయన్-కాచెట్, మాక్స్ ఓ'డౌడ్, లోగాన్ వాన్ బీక్, టిమ్మ్ వాన్ డెర్ గుగ్టెన్, రోల్ఫ్ వాన్‌డెర్ మెర్వే, పాల్ వాన్ మెకరెన్, సకీబ్ జుల్ఫికర్పాకిస్తాన్సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫే, మొహమ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీక్.గ్రూప్-బిఆస్ట్రేలియామిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాశ్రీలంకదసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, కుశాల్ జనిత్ పెరీరా, చరిత్ అసలంక, జనిత్ లియానాగే, పవన్ రత్నాయకే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఇషాన్ మలింగజింబాబ్వేసికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమెర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మడాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్ మేయర్స, రిచర్డ్ ఎంగరవ, బ్రెండన్ టేలర్ఐర్లాండ్పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.ఒమన్జతీందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మీర్జా, వసీం అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఒడెదర, జితేన్ రామనంది, అమీర్ కలీమ్గ్రూప్-సిఇంగ్లండ్హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్వెస్టిండీస్షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్.ఇటలీవేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపోపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్ కలుగమాగే, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్ప్రీత్ సింగ్, జెజె స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకానేపాల్రోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్స్కాట్లాండ్రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఒలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్నాన్-ట్రావెలింగ్ రిజర్వ్స్: మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్గ్రూప్-డిసౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, మార్కో యాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, జాసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్న్యూజిలాండ్మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.అఫ్గనిస్తాన్రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్జాయ్, సెదీఖుల్లా అటల్, ఫజల్హాక్ ఫరూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ ఇషాక్ రహీమి, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, డార్విష్ రసూలీ, ఇబ్రహీం జద్రాన్, జియా ఉర్ రెహమాన్ షరీఫీరిజర్వ్స్: AM గజన్ఫర్, ఇజాజ్ అహ్మద్జాయ్, ఫరీద్ అహ్మద్ మాలిక్కెనడాదిల్ప్రీత్ బజ్వా (కెప్టెన్), అజయ్‌వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ థాకర్, జస్కరన్‌దీప్ సింగ్, కలీమ్ సనా, కన్వర్పాల్ తత్గూర్, నవనీత్ ధలీవాల్, నికోలస్ కిర్టన్, రవీందర్‌పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్, శివమ్ శర్మ, శ్రేయాస్ మొవ్వా, యువ్‌రాజ్ సమ్రాయూఏఈముహమ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిక్, మయాంక్ కుమార్, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫరూక్, ముహమ్మద్ జవదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రోహిద్ ఖాన్, సోహైబ్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్.వేదికలు👉భారత్- కోల్‌కతా, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ 👉శ్రీలంక- కొలంబో, పల్లకెలె👉ఫైనల్- అహ్మదాబాద్మ్యాచ్ ఆరంభ సమయం👉ఉదయం మ్యాచ్‌లు: 11 గంటలకు ఆరంభం👉మధ్యాహ్నం మ్యాచ్‌లు: 3 గంటలకు ఆరంభం👉రాత్రి మ్యాచ్‌లు: 7 గంటలకు ఆరంభంలైవ్ స్ట్రీమింగ్ వివరాలు👉టీవీలో స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం👉డిజిటల్ మీడియాలో జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం👉తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లిష్, కన్నడ భాషల్లో జియో స్టార్ టీవీలో కామెంట్రీ👉జియోహాట్‌స్టార్‌లో పై భాషలతో పాటు బెంగాలీ, భోజ్‌పురి, హర్యాన్వీ భాషల్లోనూ వ్యాఖ్యానం.చదవండి: IND vs PAK: పాక్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్ -
T20 WC 2026: ‘భారత్- పాక్ మ్యాచ్ జరుగుతుంది’
భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాయాదులు తలపడుతుంటే ఇరు దేశాల అభిమానులే కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తం స్క్రీన్లకే అతుక్కుపోతుందనడంలో సందేహం లేదు. అయితే, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి దశాబ్దకాలానికి పైగా గడిచిపోయింది.ప్రస్తుతం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌లో మాత్రమే భారత్- పాక్ ముఖాముఖి తలపడుతున్నాయి. ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత నుంచి ఈ రెండు దేశాల్లో ఒకటి ఆతిథ్యం ఇస్తే.. తటస్థ వేదికపైనే మ్యాచ్‌లు జరిగేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ భారత్‌లో జరుగుతుండగా.. పాక్ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడనుంది.పాక్ ఓవరాక్షన్‌అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల పోరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ వందకు వంద శాతం జరిగితీరుందని అభిప్రాయపడ్డాడు.వందకు వంద శాతం జరుగుతుంది‘‘వచ్చే మూడు- నాలుగు రోజుల్లో పాక్ నిర్ణయం తారుమారు అవుతుంది. వందకు వంద శాతం భారత్- పాక్ మ్యాచ్ జరుగుతుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అందరిలాగే నేనూ దాయాదుల పోరును చూడాలని గట్టిగా అనుకుంటున్నాను.ఈ మ్యాచ్ కేంద్రంగా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. అంతేకాదు.. పాక్ ఇప్పుడు తప్పుకొంటే ఆర్థికంగా బాగా నష్టపోవాల్సి ఉంటుంది. తమ వల్ల కలిగిన నష్టాన్ని బ్రాడ్కాస్టర్లకు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఈ టోర్నీలో మిగతా దేశాలు కూడా ఉన్నాయి.ఇతర బోర్డులకూ నష్టమేపాక్ వల్ల తాము కూడా నష్టపోవాల్సి వస్తుందని ఐసీసీ సమావేశంలో ఆయా దేశాల బోర్డులు వాదిస్తాయి. త్వరలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా జరుగనుంది. ఈ ఈవెంట్‌కు తమ ఆటగాళ్లను వెళ్లకుండా నిలువరించే అవకాశాలు కూడా ఉన్నాయి.అయినా ఈసారి పాక్ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని చెప్పడం సమంజసమే కాదు. ఈసారి పాక్ తటస్థవేదిక మీదే పాక్ తమ మ్యాచ్‌లు ఆడబోతోంది. అయినా సరే టోర్నీలో ఒక్క జట్టుతో మాత్రమే ఆడము అని చెప్పడం ఏరకంగానూ ఆమోదయోగ్యనీయం కాదు. పూర్తిగా తప్పుకోకుండా ఒక్క జట్టుతో మ్యాచ్‌ను బహిష్కరించడం టెక్నికల్‌గా సరికాదు’’ అని అశూ పేర్కొన్నాడు.ఇప్పటికే బంగ్లా అవుట్‌కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. భద్రతా కారణాలు సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లాదేశ్ ఐసీసీని కోరింది. అయితే, బంగ్లా వాదనలో నిజం లేదంటూ ఐసీసీ ఇందుకు నిరాకరించింది. గడువు ఇచ్చినా బంగ్లా వైఖరి మారకపోడంతో టోర్నీ నుంచి ఆ జట్టును తప్పించింది. అయితే, పాక్ బంగ్లాదేశ్‌కు వంతపాడుతూ భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ అంటూ నాటకానికి తెరతీసింది. కాగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్- పాక్ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC 2026: పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ.. మేఘం కురిస్తే... -
T20 WC: పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి..
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే పాకిస్తాన్ క్రికెట్ జట్టు వార్తల్లో నిలుస్తోంది. తొలుత బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీ నుంచే వైదొలుగుతామని బీరాలు పలికిన పాక్.. తాజాగా భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తున్నామంటూ కొత్త నాటకానికి తెరతీసింది.భారత్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పాక్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఓవరాక్షన్ చేస్తూ వ్యవహారాన్ని తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తోంది.భారత్‌తో మ్యాచ్ రద్దు చేసుకుంటే..ఇక ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఒకవేళ పాక్.. టీమిండియాతో మ్యాచ్ రద్దు చేసుకుంటే.. ఐసీసీ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్ క్రికెట్ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ విషయం పక్కనపెడితే.. ప్రస్తుతానికి ఈ టోర్నీలో కనీసం సూపర్ 8 చేరే అవకాశాలను కూడా పాక్ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్‌కప్ టోర్నీలో పాక్.. భారత్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాతో కలిసి గ్రూప్-ఎలో ఉంది. ఇందులో భాగంగా టోర్నీ ఆరంభం రోజున అంటే శనివారం (ఫిబ్రవరి 7) పాక్.. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.వాన పడే అవకాశంఅయితే, ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వాన పడే అవకాశం 90 శాతం ఉంది. ఇక ఫిబ్రవరి 15న రెండో మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొట్టాల్సి ఉండగా.. పాక్ ఆ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని ప్రగల్భాలు పలుకుతోంది.ఇక లీగ్ దశలో ఆఖరిగా పాక్.. నమీబియాతో ఫిబ్రవరి 18న సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు కూడా వరణుడు అంతరాయం కలిగించే అవకాశాలు 25 శాతం ఉన్నాయి. కాగా టీమిండియాతో మ్యాచ్ ఆడకపోతే పాక్ రెండు పాయింట్లు కోల్పోతుంది. అదే సమయంలో సూర్య సేనకు రెండు పాయింట్లు ఉచితంగా వస్తాయి.నెట్‌రన్‌రేటుపై ప్రభావంమరోవైపు.. వర్షం వల్ల నెదర్లాండ్స్, నమీబియాలతో మ్యాచ్‌లకు ఆటంకం కలిగితే నెట్రన్ రేటుపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఫిబ్రవరి 10న అమెరికాతో మ్యాచ్‌లో పాక్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. గత ఎడిషన్‌లో పసికూన అయిన అమెరికా చేతిలో పాక్ ఓడిపోయి సూపర్-8 కూడా చేరకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే.తాజా ఎడిషన్‌లోనూ పాక్‌కు చిక్కులు తప్పేలా లేవు. టీమిండియాతో మ్యాచ్ రద్దు.. రెండు మ్యాచ్‌లకు వర్షం ఆటంక కలిగించే సూచనలు.. వెరసి ఈసారి కూడా పాక్ సూపర్-8 చేరడం కష్టమే అనిపిస్తోంది. చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు -
ఇంగ్లండ్ ‘క్లీన్‌స్వీప్’
పల్లెకెలె: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఇంగ్లండ్ జట్టు... శ్రీలంకపై టి20 సిరీస్‌ను ‘క్లీన్ స్వీప్’ చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఆఖరి టి20లో ఇంగ్లండ్ 12 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను చిత్తు చేసింది. ఈ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకున్న ఇంగ్లండ్... టి20 సిరీస్‌ను 3–0తో చేజిక్కించుకుంది. చివరి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. సామ్ కరన్ (48 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీతో రాణించగా... జోస్ బట్లర్ (25), లియామ్ డాసన్ (14) మాత్రమే రెండంకెల స్కరు చేశారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (4), బెన్ డకెట్ (0), జాకబ్ బెథెల్ (3), టామ్ బాంటన్ (7), విల్ జాక్స్ (3) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో దుశ్మంత చమీరా 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... పతిరణకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో లంక 19.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. నిషాంక (23), కుషాల్ మెండిస్ (26) కాస్తా పోరాడగా... తక్కినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెథెల్ 4, జాక్స్ 3 వికెట్లు పడగొట్టారు. సామ్ కరన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. -
శ్రీలంకకు ఊహించని షాక్
టీ20 ప్రపంచకప్-2026కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. స్టార్ బౌలర్ ఎషాన్ మలింగ భుజం గాయం కారణంగా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆదివారం పల్లెకెలె వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో మలింగ భుజానికి గాయమైంది. దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు.అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి 4 నుండి 6 వారాల సమయం పట్టనున్నట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. మలింగ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2025 సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున 13 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. జాతీయ జట్టు తరపున కూడా నిలకడగా రాణిస్తున్నాడు.ఈ క్రమంలోనే అతడికి వరల్డ్‌కప్ జట్టులో సెలెక్టర్లు చోటు ఇచ్చారు. కానీ ఇప్పుడు అనుహ్యంగా గాయపడడంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడి స్ధానంలో దిల్షాన్ మధుశంక జట్టులోకి వచ్చే అవకాశముంది.టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టుపాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానగే, దసున్ షనక (కెప్టెన్), కమిందు మెండిస్, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఎషాన్ మలింగ, వణిందు హసరంగా, మహేశ్ వెల్లలగే, మహేష్ తీక్షణ -
టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి శ్రీలంక జట్టు ప్రకటన
టీ20 ప్రపంచకప్ 2026 కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ దసున్ షనక సారథ్యం వహించనున్నాడు. లంక వరల్డ్‌కప్ జట్టులో పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, వానిందు హసరంగ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.అదేవిధంగా యువ పేసర్ ఈషాన్ మలింగకు కూడా జట్టులో చోటు దక్కింది. దుష్మంత చమీర, మతీష పతిరణ, ప్రమోద్ మదుషన్‌లతో కలిసి మలింగ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో సత్తాచాటిన యువ బ్యాటర్ పవన్ రత్నాయకేకు కూడా సెలెక్టర్లు అవకాశమిచ్చారు. ఇక స్పిన్ విభాగంలో హసరంగ, తీక్షణ, వెల్లలాగే వంటి ఉన్నారు. సొంతగడ్డపై మ్యాచ్‌లు జరగనుండడంతో ఈ స్పిన్ త్రయం శ్రీలంకకు కీలకం కానుంది.అసలంకపై వేటు..కాగా ఈ మెగా టోర్నీ కోసం లంక సెలెక్టర్లు గత డిసెంబర్లో 25 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా చరిత్ అసలంకను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. అతని స్థానంలో అనుభవజ్ఞుడైన దాసున్ శనకను తిరిగి కెప్టెన్‌గా ఎంపిక చేశారు.షనక కెప్టెన్‌గా గతంలో లంకకు ఆసియాకప్‌ను అందించారు. ఇప్పుడు మరోసారి తన అనుభవంతో జట్టును నడిపించేందుకు సిద్దమయ్యాడు. ఈ మెగా టోర్నీలో శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 8న కొలంబో వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. లంకేయులు ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతున్నారు.టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టుపాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానగే, దసున్ షనక (కెప్టెన్), కమిందు మెండిస్, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఎషాన్ మలింగ, వణిందు హసరంగా, మహేశ్ వెల్లలగే, మహేష్ తీక్షణ -
ముగ్గురు భారత అంపైర్లకు చోటు
దుబాయ్: ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరిగే టి20 ప్రపంచ కప్‌లో పని చేయనున్న అంపైర్లు, రిఫరీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 24 మంది అంపైర్లతో పాటు ఆరుగురు మ్యాచ్ రిఫరీలు ఈ జాబితాలో ఉన్నారు. భారత మాజీ పేసర్, సీనియర్లలో ఒకడైన జవగల్ శ్రీనాథ్ రిఫరీగా కొనసాగనుండగా...అతనితో పాటు డీన్ కోస్కర్, డేవిడ్ గిల్బర్ట్, రంజన్ మదుగలే, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్ రిఫరీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అంపైర్లలో భారత్ నుంచి నితిన్ మేనన్, అనంత పద్మనాభన్, జె.మదన్ గోపాల్‌లకు అవకాశం దక్కింది. ఐసీసీ ఎలీట్ ప్యానెల్ అంపైర్ల జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడైన నితిన్ మేనన్‌కు ఇది నాలుగో టి20 వరల్డ్ కప్ కానుంది. గతంలో అతను 2021, 2022, 2024లలో కూడా అంపైర్‌గా వ్యవహరించాడు. భారత్, న్యూజిలాండ్ సిరీస్‌లో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌లో అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించనున్న 42 ఏళ్ల మేనన్‌కు ఇది మూడు ఫార్మాట్లలో కలిపి 150 అంతర్జాతీయ (పురుషుల) మ్యాచ్ కానుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత అంపైర్‌గా అతను నిలవనున్నాడు. మదన్‌గోపాల్‌కు ఇది రెండో టి20 వరల్డ్ కప్ కాగా, పద్మనాభన్‌కు తొలిసారి ప్రపంచ కప్ చాన్స్ లభించింది. రోలండ్ బ్లాక్, క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిసన్ గాఫ్నీ, ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, వేన్ నైట్స్, డొనొవాన్ కాచ్, స్యామన్ నొగాస్కీ, అల్లావుద్దీన్ పలేకర్, అహ్సాన్ రజా, లెస్లీ రీఫర్, పాల్ రీఫెల్, లాంగ్టన్ రూసెర్, షర్ఫుద్దౌలా షాహిద్, గాజీ సొహెల్, రాడ్నీ టకర్, అలెక్స్ వార్స్, రవీంద్ర విమలసిరి, ఆసిఫ్ యాఖూబ్ కూడా అంపైర్లుగా టి20 వరల్డ్ కప్‌లో పని చేయనున్నారు. -
టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే అన్ని జట్ల పూర్తి వివరాలు
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సర్వం సిద్దమయ్యాయి. ఈ మెగా టోర్నీలో 20 దేశాలు పాల్గొంటుండగా.. అన్నీ దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఆ జట్ల పూర్తి వివరాలను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూద్దాం.ఆఫ్ఘనిస్తాన్: రషీద్ ఖాన్ (సి), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్జాయ్, సెదిఖుల్లా అటల్, ఫజల్హాక్ ఫరూకీ, రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్ ఉల్ హక్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదీన్ నయీబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, దర్విష్ రసూల్, ఇబ్రహీం జద్రాన్. రిజర్వ్‌లు: AM ఘజన్ఫర్, ఇజాజ్ అహ్మద్జాయ్ మరియు జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ.ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (సి), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.కెనడా: దిల్‌ప్రీత్ బజ్వా (సి), అజయ్‌వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ థాకర్, జస్కరన్‌దీప్ బుట్టర్, కలీమ్ సనా, కన్వర్పాల్ తాత్‌గూర్, నవనీత్ ధాలివాల్, నికోలస్ కిర్టన్, రవీందర్‌పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్, శివమ్ శర్మ, శ్రేయాస్ మొవ్వ, యువ్‌రాజ్ సమ్రా.ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (సి), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.భారత్: సూర్యకుమార్ యాదవ్ (సి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.ఇటలీ: వేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్ప్రీత్ సింగ్, JJ స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా.నమీబియా: గెర్హార్డ్ ఎరాస్మస్ (సి), జేన్ గ్రీన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, రూబెన్ ట్రంపెల్మన్, జెజె స్మిత్, జాన్ ఫ్రైలింక్, లౌరెన్ స్టీన్‌క్యాంప్, మలన్ క్రుగర్, నికోల్ లాఫ్టీ-ఈటన్, జాక్ బ్రాసెల్, బెన్ షికోంగో, జెసి బాల్ట్, డైలాన్ లీచర్, డబ్యూపీ మైబుర్గ్, మ్యాక్స్ హెయింగో రిజర్వ్: అలెగ్జాండర్ వోల్స్చెంక్.నేపాల్: రోహిత్ పౌడెల్ (సి), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, షేర్ మల్లా, లోకేశ్ బామ్.నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (సి), కోలిన్ అకెర్మాన్, నోహ్ క్రోస్, బాస్ డి లీడ్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, కైల్ క్లైన్, మైఖేల్ లెవిట్, జాక్ లయన్-కాచెట్, మాక్స్ ఓ'డౌడ్, లోగాన్ వాన్ బీక్, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్, రోల్ఫ్ వాన్‌డర్ మెర్వ్, పాల్ వాన్ మీకెరెన్, సాకిబ్ జుల్ఫికర్.న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, కైల్ జామిసన్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి, బెన్ సియర్స్ (రిజర్వ్).ఒమన్: జతీందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, మొహమ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మీర్జా, వసీం అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఒడెదర, జితెన్ రామనంది, హస్నైన్ అలీ షా.పాకిస్తాన్: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మొహమ్మద్ నఫాయ్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిక్.స్కాట్లాండ్: రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఆలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్. రిజర్వ్‌లు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్, మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్.దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహారాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి న్గిడి, అన్రిచ్ నార్ట్జే, కగిసో రబాడా, ర్యాన్ రికెల్టన్, జాసన్ స్మిత్ మరియు ట్రిస్టన్ స్టబ్స్.శ్రీలంక: దసున్ షనక (సి), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కమిల్ మిషార, కుసల్ పెరీరా, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా, జనిత్ లియానగే, చరిత్ అసలంక, కమిందు మెండిస్, పవన్ రత్ననాయక్, సహన్ అరాచిత్వెల్లంగా, రాంత్నిలంగా, రవాణి వాన్గే, నువాన్ తుషార, ఎషాన్ మలింగ, దుష్మంత చమీర, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, విజయ్‌కాంత్ వియాస్కాంత్, ట్రవీన్ మాథ్యూయూఏఈ: ముహమ్మద్ వసీమ్ (సి), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిక్, మయాంక్ కుమార్, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫరూక్, మహ్మద్ జవదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రోహిత్ ఖాన్, సోహైబ్ సింగ్, సిమ్రాన్‌జీత్ ఖాన్, సిమ్రాన్‌జీత్.యూఎస్ఏ: మోనాంక్ పటేల్ (సి), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్క్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మొహమ్మద్ మొహిసిన్, శుభమ్ రంజనే.వెస్టిండీస్: షాయ్ హోప్ (సి), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, జేడన్ సీల్స్, రొమారియో షెపర్డ్.జింబాబ్వే: సికందర్ రజా (సి), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, రిచార్డాన్ మైగర్రాబనీ, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్ మేయర్స్, రిచర్డ్ నగరవ, బ్రెండన్ టేలర్ -
వరల్డ్‌కప్‌కు సంబంధించి బిగ్ అప్డేట్
త్వరలో భారత్, శ్రీలంక వేదికలుగా జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి ఓ ముఖ్య సమాచారం అందుతోంది. ఈ మెగా టోర్నీ ఓపెనింగ్ సెర్మనీ ఖరారు కావడంతో పాటు వేడుక జరిగే తేదీ మరియు సమయాన్ని ప్రకటించారు. టోర్నీ ప్రారంభమయ్యే ఫిబ్రవరి 7వ తేదీనే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి.ఆ రోజు వేర్వేరు వేదికల్లో మొత్తం మూడు మ్యాచ్‌లు జరుగనుండగా.. మూడో మ్యాచ్‌కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. మూడో మ్యాచ్‌లో భారత్, యూఎస్ఏ జట్లు ముంబైలోని వాంఖడే మైదానంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. దీనికి ముందే ఓపెనింగ్ సెర్మనీ జరుగుతుంది.అదే రోజు టోర్నీ ఓపెనర్‌లో పాకిస్తాన్, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కొలొంబో వేదికగా ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ వెస్టిండీస్, స్కాట్లాండ్ మధ్య కోల్‌కతా వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లలన్నీ గ్రూప్‌కు ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్‌లుగా విడిపోయాయి. గ్రూప్-సి నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. భారత్, పాక్ గ్రూప్-ఏలో పోటీపడనున్నాయి. పాక్ తమ మ్యాచ్‌లన్నీ (భారత్ మ్యాచ్‌తో సహా) శ్రీలంకలో ఆడనుంది. భారత్-పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలొంబోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.గ్రూప్ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఈ దశలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు.. సెమీస్‌లో గెలిచే జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్.. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. -
ICC: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగేలా మరో షాక్
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మొండి వైఖరి కారణంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండుసార్లు అవకాశం ఇచ్చినా తీరు మార్చుకోని కారణంగా.. బంగ్లా జట్టును టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి తప్పించారు.ఆటగాళ్లతో పాటు వారికీ సెగబంగ్లాదేశ్ ప్రభుత్వం, బీసీబీ నిర్ణయాల కారణంగా ప్రపంచకప్ ఆడాలన్న ఆటగాళ్ల కల ఈసారికి దూరమైంది. అంతేకాదు.. ఆ సెగ బంగ్లాదేశ్ జర్నలిస్టులకు కూడా తగిలినట్లు తెలుస్తోంది. భారత్- శ్రీలంక (India- Sri Lanka)వేదికలుగా జరిగే వరల్డ్‌కప్ టోర్నీ కవరేజ్ కోసం వంద మందికి పైగా జర్నలిస్టులు అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.అయితే, ఐసీసీ మాత్రం వీరి దరఖాస్తులు, అభ్యర్థనలను తిరస్కరించినట్లు (Were Denied visa and Accreditation) సమాచారం. దీంతో ఈసారి బంగ్లా జర్నలిస్టులు ఈ టోర్నీని ప్రత్యక్షంగా కవర్ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయం గురించి ఆజ్‌కర్ ప్రతిక స్పోర్ట్స్ ఎడిటర్ రానా అబ్బాస్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.చాలా బాధగా ఉంది‘‘బంగ్లాదేశ్‌లో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఘటన జరుగలేదు. 1999లో బంగ్లా జట్టు తొలిసారి ప్రపంచకప్ ఆడేకంటే ముందు నుంచే బంగ్లాదేశీ జర్నలిస్టులు ఈ ఈవెంట్‌ను కవర్ చేస్తున్నారు. భారత్- పాకిస్తాన్ వంటి కీలక మ్యాచ్‌లు.. ముఖ్యంగా భారత్‌లో జరిగిన మ్యాచ్‌లను కూడా కవర్ చేశారు.గతంలో ఎప్పుడూ ఇలా అందరు కరస్పాండెంట్ల దరఖాస్తులను తిరస్కరించిన దాఖలాలు లేవు. ఇదొక దురదృష్టకర ఘటన. నాకైతే చాలా బాధగా ఉంది’’ అని రానా అబ్బాస్ విచారం వ్యక్తం చేశాడు.దెబ్బ అదుర్స్ కదూ!ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ ఐసీసీ అధికారి స్పందన కోరగా.. బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ‘‘భారత్‌లో తమ వాళ్లకు రక్షణ ఉండదని బంగ్లాదేశ్ ప్రభుత్వం పదే పదే వాదించింది. అందుకే వాళ్లకు వీసాలు, అక్రిడేషన్లు ఇవ్వలేదు’’ అంటూ ఇచ్చిపడేశారు సదరు అధికారి. అయితే, నిబంధనల ప్రకారం నలభై మందికి మించకుండా అక్రిడేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.చెప్పినా వినలేదుకాగా తమ ఆటగాళ్లకు భారత్ సురక్షితం కాదని.. వేదికను శ్రీలంకకు మార్చాలంటూ బీసీబీ.. ఐసీసీని ఆశ్రయించింది. అయితే, పరిశీలనా బృందం నివేదిక మేరకు భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని తేల్చింది ఐసీసీ. అయితే, బీసీబీ మాత్రం పట్టువీడలేదు. వేదిక మార్చకుంటే టోర్నీ నుంచి వైదొలుగుతామని బెదిరించింది.ఈ నేపథ్యంలో ఆఖరి అవకాశం ఇచ్చినా బీసీబీ తీరు మారకపోవడంతో.. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించింది ఐసీసీ. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను చేర్చించింది. తాజాగా బీసీబీ చెప్పిన సాకునే కారణంగా చూపుతూ జర్నలిస్టులకు వీసాలు నిరాకరించినట్లు సమాచారం.చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్! -
ఐసీసీపై ‘ఫిర్యాదు’.. బంగ్లాదేశ్‌కు మరో షాక్ తప్పదు!
టీ20 ప్రపంచకప్-2026లో తమ మ్యాచ్‌ల వేదిక మార్పు విషయంలో బంగ్లాదేశ్ ఆఖరి ప్రయత్నం కూడా బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇప్పటికే ఈ విషయంలో తమ వైఖరి ఏమిటో తెలిపింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లు, సిబ్బందికి ఎలాంటి ముప్పు లేదని.. ఇక్కడే తమ మ్యాచ్‌లు ఆడాలని స్పష్టం చేసింది.అయినప్పటికీ పంతం వీడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తమ విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ మండలి పట్టించుకోకపోవడంతో వివాద పరిష్కారాల కమిటీ (DRC)ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆశ్రయించింది. తాము భారత్‌లో ఆడాల్సిందేనంటూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ డీఆర్సీని బీసీబీ కోరింది.అది కుదరని పనిఅయితే ఐసీసీ ఆధ్వర్యంలోనే పని చేసే డీఆర్సీ వారి విజ్ఞప్తికి స్పందించే అవకాశం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం బోర్డు డైరెక్టర్లు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే అధికారం డీఆర్సీకి లేదు. ఇక్కడా తమకు సానుకూల స్పందన లభించకపోతే చివరగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (సీఏఎస్)కు వెళ్లాలని కూడా బంగ్లాదేశ్ యోచిస్తోంది.మరోవైపు.. తమ జట్టు భారత్‌లో మ్యాచ్ ఆడదంటూ తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా ఐసీసీకీ చెప్పకుండా బీసీబీ చైర్మన్ అమీనుల్ ఇస్లామ్ మీడియా ముందు ప్రకటించడం కూడా ఐసీసీకి ఆగ్రహం కలిగించింది. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే బంగ్లాదేశ్‌ను తప్పించడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. అండర్–19 వరల్డ్ కప్ జరుగుతున్న నమీబియాలో ఉన్న ఐసీసీ చైర్మన్ జై షా బంగ్లాదేశ్‌ను వరల్డ్ కప్ నుంచి తప్పిస్తూ స్కాట్లాండ్కు అవకాశం ఇస్తున్నట్లుగా శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్ -
నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్.. 58 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఐర్లాండ్, జపాన్‌పై ఘన విజయాలు సాధించిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 23) జరుగుతున్న తమ చివరి గ్రూప్ (ఏ) మ్యాచ్‌లో శ్రీలంకను 58 పరుగులకే కుప్పకూలిచ్చి సగం విజయాన్ని సొంతం చేసింది.విండ్హోక్లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. పేసర్ విల్ బైరోమ్ (6.4-0-14-5) చెలరేగడంతో 18.5 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. బైరోమ్‌కు జతగా ఛార్లెస్ లచ్మండ్ (5-1-19-2), కేసీ బార్టన్ (4-0-13-2), హేడెన్ ష్కిల్లర్ (3-0-11-1) కూడా రాణించారు. ఆసీస్ బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్‌లో కవిజ గమగే (10), చమిక హీనతగల (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఓపెనర్ దిమంత మహావితన డకౌట్ కాగా.. మరో ఓపెనర్ విరాన్ చముదిత, దుల్నిత్ సిగెరా, ఆడమ్ హిల్మి తలా ఒక్క పరుగు.. కెప్టెన్ విమత్ దిన్నరా 7, సెనెవిరత్నే 5, రసిత్ రింసర, కుగథాస్ మథులాన్ తలో 6 పరుగులు చేశారు. కాగా, ఈ టోర్నీలో శ్రీలంక తమ తొలి రెండు గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ల్లో జపాన్, ఐర్లాండ్‌పై ఘన విజయాలు సాధించి తదుపరి దశకు అర్హత సాధించింది. -
బంగ్లాదేశ్ ఆడకపోతే స్కాట్లాండ్కు అవకాశం!
టి20 ప్రపంచ కప్‌లో తాము ఆడే మ్యాచ్‌లను భద్రతాకారణాలతో భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చేస్తున్న డిమాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో మ్యాచ్‌ల వేదిక మార్పు సాధ్యం కాదని ఐసీసీ పదేపదే చెబుతున్నా... బీసీబీ మాత్రం తమ మంకు పట్టును వీడటం లేదు. దీంతో ఈ విషయంపై కఠినంగా వ్యవహరించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నెల 21న దీనిపై ఐసీసీ స్పష్టమైన ప్రకటన ఇవ్వనుంది. తాము వరల్డ్ కప్ ఆడాలా లేదా అనేది బంగ్లాదేశ్ ఆలోపు నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ హెచ్చరించింది. లేదంటే టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్కు అవకాశం ఇస్తామని కూడా చెప్పేసింది. తమ గ్రూప్‌ను మార్చి ఐర్లాండ్ మ్యాచ్‌ల స్థానంలో శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడించాలని బీసీబీ చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనకు కూడా అంగీకరించేది లేదని ఐసీసీ జవాబిచి్చంది. భారత్–శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. -
ప్రపంచంలోనే అతిపెద్ద నీలమణి.. ‘రత్నపుర’లో దొరికిన రత్నం
ప్రపంచ రత్నాల చరిత్రలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. శ్రీలంక రాజధాని కొలంబోలో ప్రపంచంలోనే అతిపెద్ద నీలమణి వజ్రాన్ని ఇటీవల ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఊదా వర్ణంలో మెరిసే ఈ అద్భుతమైన రత్నం పేరు ‘పర్పుల్ స్టార్’. దీని బరువు 3,563 క్యారెట్లు. ఇదే ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద నీలమణి రాయి కావడం విశేషం.వజ్రం కంటే ఎక్కువ మెరుపు, ఆకర్షణ కలిగిన ఈ నక్షత్ర నీలమణి త్వరలోనే వేలానికి రానుంది. యజమానులు దీని విలువను సుమారు 300 మిలియన్ డాలర్లుగా (భారత కరెన్సీలో సుమారు రూ. 2,728 కోట్లు)గా నిర్ణయించారు.ఈ అరుదైన నీలమణిని ‘స్టార్ ఆఫ్ ప్యూర్ ల్యాండ్’ అనే పేరుతో కూడా పిలుస్తారు. ప్రముఖ రత్నాల నిపుణుడు ఆశాన్ అమరసింఘే మాట్లాడుతూ.. “ఇది చరిత్రలో ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద ఊదా నక్షత్ర నీలమణి. ఇది నక్షత్రంలా కనిపిస్తూ, ఏడు విభిన్న రంగుల కిరణాలను వెలువరిస్తుంది. ఇతర రత్నాలకంటే ఇది పూర్తిగా భిన్నమైన ప్రత్యేకతను కలిగి ఉంది” అని తెలిపారు.2023లో లభించిన అపురూప రత్నంఈ విలువైన రత్నానికి సంబంధించిన యజమానులు తమ గుర్తింపును బహిర్గతం చేయలేదు. భద్రతాపరమైన కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. అయితే యజమానుల్లో ఒకరి ప్రకారం.. 2023లో ఈ నీలమణి వారి చేతికి వచ్చింది.శ్రీలంకలోని ‘రత్నపుర’ ప్రాంతాన్ని ‘రత్నాల నగరం’గా పిలుస్తారు. అక్కడ జరిగిన తవ్వకాల సమయంలో ఈ రాయి బయటపడింది. అప్పట్లో ఇతర రత్నాలతో పాటు దీన్నీ కొనుగోలు చేశారు. దాదాపు రెండేళ్లపాటు అలాగే ఉంచిన తర్వాత, గత సంవత్సరం దీనిని ధ్రువీకరణ కోసం ప్రయోగశాలకు పంపారు.రూ.కోట్లలో ధరఅంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. ఈ నీలమణి విలువ 300 నుంచి 400 మిలియన్ డాలర్లు (రూ.2,728 – 3,638 కోట్లు) వరకు ఉండొచ్చని ఆశాన్ అమరసింఘే వెల్లడించారు. ప్రపంచ రత్నాల మార్కెట్లో ఈ ‘పర్పుల్ స్టార్’ త్వరలోనే కొత్త చరిత్ర సృష్టించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
అతి పెద్ద నీలమణి!
ఊదా రంగులో మెరిసిపోతున్న ఈ నీలమణిని చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు కదా! ఇది అలాంటిలాంటి నీలం కాదు. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నీలమణిగా రికార్డులకెక్కింది! అత్యంత అరుదైనదిగా చెబుతున్న ఈ నీలాన్ని శ్రీలంక రాజధాని కొలంబోలో శనివారం తొలిసారి ప్రదర్శనకు ఉంచారు. ఇది ఏకంగా 3,536 క్యారెట్ల బరువుందట! అంటే 700 గ్రాములన్నమాట!! దీనికి స్టార్ ఆఫ్ ప్యూర్ లాండ్ అని నామకరణం చేశారు. ఇది నకిలీది కాదని, సిసలైన నీలమణేనని జెమాలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా (జీఐఏ) కూడా ధ్రువీకరించింది. అంతేగాక ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సహజ నీలం ఇదేననీ పేర్కొంది. ఇంత భారీ పరిమాణంలో కూడా ఈ నీలమణి పూర్తిస్థాయి సౌష్టవంతో కూడుకుని ఉండటం విశేషమని నిపుణులు చెబుతున్నారు. దానికితోడు సహజంగా అమరిన చూడచక్కని గుండ్రనైన రూపు దీని ప్రత్యేకతను ఎన్నో రెట్లు పెంచింది. వీటన్నింటికీ మించి ఇది ఆరు రకాల కాంతి కిరణాలను వెదజల్లుతుందట కూడా! ఇక నీలమణికి అతి ముఖ్యమైన స్వచ్ఛత విషయంలో కూడా సాటి లేని నాణ్యత స్టార్ ఆఫ్ ప్యూర్ లాండ్ సొంతమని ప్రదర్శకులు వివరించారు. దీని విలువ కనీసం 30 కోట్ల నుంచి 40 కోట్ల డాలర్లు (రూ.3,628 కోట్లు) ఉంటుందని అంతర్జాతీయ రత్నాల నిపుణులు చెప్పారు. వేలంలో దీనికి అంతకు మించే పలుకుతుందని అంచనా వేస్తున్నారు. భద్రతా కారణాల రీత్యా దీని యజమానుల వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ నీలమణి 2023లో శ్రీలంక మారుమూల ప్రాంతంలో వజ్రాల నగరంగా పేరొందిన రత్నపురలో దొరికినట్టు దాని యజమానుల్లో ఒకరు వెల్లడించారు. సాటిలేని నాణ్యతతో కూడిన నీలమణులకు శ్రీలంక అనాది కాలం నుంచీ ప్రసిద్ధి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తిప్పేసిన హసరంగ.. బెంబేలెత్తిపోయిన పాక్
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను శ్రీలంక 1-1తో డ్రా చేసుకుంది. డంబుల్లా వేదికగా నిన్న (జనవరి 11) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో పాక్‌ను 14 పరుగుల తేడాతో చిత్తు చేసింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 6 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బ్యాటర్లు తలో చేయి వేసి ఈ స్కోర్‌ను అందించారు. కమిల్ మిషారా 20, కుసాల్ మెండిస్ 30, ధనంజయ డిసిల్వ 22, చరిత్ అసలంక 21, దసున్ షనక 34, జనిత్ లియనాగే 22 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ వసీం జూనియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ పడగొట్టారు.తిప్పేసిన హసరంగఅనంతరం భారీ లక్ష్య ఛేదనలో హసరంగ ధాటికి పాక్ బెంబేలెత్తిపోయింది. 12 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకు మాత్రమే పరిమితమైంది. హసరంగ 3 ఓవర్లలో 35 పరుగులకు 4 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టాడు. మతీష పతిరణ (3-0-34-2) రాణించాడు. ఎషాన్ మలింగకు ఓ వికెట్ దక్కింది. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సల్మాన్ అఘా (45) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మరో ఇద్దరు (నవాజ్ (28), ఖ్వాజా నఫే (26)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో పాక్ గెలువగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. -
శ్రీలంక మాస్టర్ మైండ్.. వరల్డ్‌కప్ విన్నింగ్ కోచ్‌తో ఒప్పందం
టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోర్‌ను ఎస్ఎల్సీ నియమించింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి శ్రీలంక జట్టును సన్నద్దం చేసేందుకు విక్రమ్ రాథోర్‌ను కన్సల్టెన్సీ ప్రాతిపదికన బ్యాటింగ్ కోచ్‌గా నియమించాము అని లంక క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.రాథోర్ జనవరి 18న లంకతో జట్టుతో కలవనున్నాడు. ప్రపంచ కప్ ముగిసే వరకు జట్టుతోనే ఉండనున్నాడు. విక్రమ్‌కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. . 2019 సెప్టెంబర్ నుంచి 2024 జూలై వరకు భారత బ్యాటింగ్ కోచ్‌గా చేశారు. భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ గెలవడంలోఅతడు కీలక పాత్ర పోషించాడు. బీసీసీఐ లెవల్ 3 కోచ్‌గా కొనసాగాడు.అతడు ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు లీడ్ అసిస్టెంట్ కోచ్‌గా కూడా పనిచేస్తున్నాడు. కాగా శ్రీలంక ఇప్పటికే భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రామకృష్ణన్ శ్రీధర్‌ను తమ ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. రాథోర్ భారత బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధర్ పనిచేశాడు.శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రపంచ కప్ లక్ష్యంగా భారత కోచింగ్ అనుభవాన్ని ఉపయోంచుకుంటుంది. అదేవిధంగా లెజెండరీ బౌలర్ లసిత్ మలింగ కూడా ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా సేవలందించనున్నాడు. కాగా ఈ పొట్టి ప్రపంచకప్‌కు శ్రీలంక, భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. శ్రీలంక తమ లీగ్ మ్యాచ్‌లన్నింటని స్వదేశంలోనే ఆడనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. -
బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ?!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026లో బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించేందుకు ఐసీసీ సుముఖంగా లేనట్లు సమాచారం. క్రిక్‌బజ్ అందించిన వివరాల ప్రకారం.. బీసీబీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మధ్య ఉన్న ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని ఐసీసీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.ముస్తఫిజుర్ రహమాన్ అవుట్‌ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా మెజారిటీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న బీసీసీఐకే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తిన్న నేపథ్యంలో క్రికెట్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్న కారణంగా ఆ దేశపు పేస్ బౌలర్ ముస్తఫిజుర్ రహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో బీసీసీఐ ఆదేశాల మేరకు శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్ దీనిని అంగీకరిస్తూ ముస్తఫిజుర్‌ను తమ జట్టునుంచి తొలగించింది. అనంతరం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.మ్యాచ్‌లను తరలించాలంటూ ఐసీసీకి విజ్ఞప్తిభారత్లో మ్యాచ్‌లు ఆడితే తమ ఆటగాళ్లకు భద్రతా సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత స్థితిలో తాము భారత్‌లో ప్రయాణించలేమని స్పష్టం చేసింది. కాబట్టి టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లా ఆడాల్సిన 4 లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్ తమ తొలి మూడు లీగ్ మ్యాచ్‌లను కోల్‌కతాలో, చివరి మ్యాచ్‌ను ముంబైలో ఆడాల్సి ఉంది.‘బంగ్లాదేశ్ ప్రభుత్వం సూచన మేరకు మా క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించరాదని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల మధ్య అన్నింటికంటే ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం. కాబట్టి ఇక్కడ మేం ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరుతున్నాం. బీసీసీఐ ఒక్క ఆటగాడికే భద్రత కల్పించలేకపోతోంది. ఇక మొత్తం జట్టుకు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తుంది. ఒక్క క్రికెటర్ల గురించే కాకుండా మేం అభిమానులు, సహాయక సిబ్బంది, మీడియా గురించి కూడా ఆలోచిస్తున్నాం’ అని బీసీబీ ప్రకటన జారీ చేసింది. తరలింపు కష్టమే! బంగ్లా బోర్డు ఎన్ని డిమాండ్లు చేసినా ఇప్పటికిప్పుడు మ్యాచ్‌లను తరలించడం సాధ్యం కాదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. టోర్నమెంట్ ప్రారంభానికి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇలాంటి స్థితిలో బీసీబీ వాదన సహేతుకం కాదని భారత బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఎవరో ఒకరి ఇష్టానుసారం మ్యాచ్‌లను మార్చడం సాధ్యం కాదు. ఏర్పాట్లపరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. బంగ్లాతో ఆడే ప్రత్యర్థి జట్లు ఇప్పటికే విమాన టికెట్లు, హోటల్ బుక్ చేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఒక్కో రోజు మూడు మ్యాచ్‌లు ఉండే వాటిలో ఒకటి శ్రీలంకలో జరుగుతుంది. ప్రసారకర్తలు మ్యాచ్‌లకు ఎలా సిద్ధమవుతారు. కాబట్టి మాటలు చెప్పినంత సులువు కాదు చేసి చూపించడం’ అని ఆయన అన్నారు. మరో వైపు.. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయరాదని తమ దేశ ప్రభుత్వానికి బంగ్లా మాజీ క్రికెటర్లు విజ్ఞప్తి చేశారు. చదవండి: ఆ రియల్ హీరోల కోసం.. చప్పట్లతో మారుమోగిన స్టేడియం -
ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
నమీబియా, జింబాబ్వే వేదికలుగా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరుగబోయే 2026 అండర్ 19 క్రికెట్ వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (జనవరి 1) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా విమత్ దిన్సరా ఎంపిక కాగా.. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) కవిజ గమగే నియమితుడయ్యాడు.ప్రపంచకప్‌లో శ్రీలంక.. జపాన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియాతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడుతుంది. ఈ మెగా టోర్నీ కోసం లంక జట్టు ఇవాళే నమీబియాకు బయల్దేరనుంది. ముందుగా వెళితే అక్కడి పరిస్థితులకు అలవాటు పడవచ్చని లంక బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.ప్రపంచకప్‌లో శ్రీలంక ప్రయాణం జనవరి 17న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో జపాన్‌తో తలపడుతుంది. అనంతరం జనవరి 19న ఐర్లాండ్‌తో, 23న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది.గతేడాది బంగ్లాదేశ్, వెస్టిండీస్ వన్డే సిరీస్‌ల్లో ఓటమిపాలైనప్పటికీ, ఆసియా కప్‌లో సెమీఫైనల్ వరకు చేరిన లంక యువ జట్టు.. మొదటి వరల్డ్‌కప్ టైటిల్ కోసం బలంగా పోరాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. జట్టు వివరాలు- విమత్ దిన్సరా (కెప్టెన్) - కవిజ గమగే (వైస్ కెప్టెన్) - దిమంత మహవితాన - విరాన్ చముదిత - దుల్నిత్ సిగేరా - చమిక హీంటిగల - ఆడమ్ హిల్మీ - చమరిందు నెత్సరా - సేత్మిక సెనేవిరత్నె - కుగథాస్ మాథులన్ - రసిత్ నిమ్సరా - విగ్నేశ్వరన్ ఆకాష్ - జీవంత శ్రీరామ్ - సెనుజ వెకునగొడ - మలింత సిల్వా -
భారత్ 5.. శ్రీలంక 0
ఫార్మాటే మారింది. కానీ జోరు ఏమాత్రం మారలేదు. తొలిసారి వన్డే ప్రపంచకప్ సాధించిన ఊపుమీదున్న భారత మహిళల జట్టు ఇదే ఉత్సాహంతో పొట్టి ఫార్మాట్లో శ్రీలంకను గట్టిదెబ్బ కొట్టింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని భారత్ 5–0తో వైట్‌వాష్ చేసింది. ఆడినవన్నీ ఓడిన చమరి ఆటపట్టు సేన నిరాశగా వెనుదిరుగుతోంది.తిరువనంతపురం: ఆఖరి పోరులోనూ భారత అమ్మాయిలే హోరెత్తించారు. ఫలితంగా ఐదు టి20ల సిరీస్‌ను 5–0తో హర్మన్ సేన చేజిక్కించుకుంది. మంగళవారం జరిగిన చివరి సమరంలో భారత్ 15 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేసింది. హైదరాబాదీ ఆల్‌రౌండర్ అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) డెత్ ఓవర్లలో దంచేసింది. ప్రత్యర్థి బౌలర్లలో కవీశా దిల్హరి, రష్మిక, చమరి తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడింది. హాసిని (42 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్), ఇమిషా దులాని (39 బంతుల్లో 50; 8 ఫోర్లు) రాణించారు. ఈ టోర్నీలో నిలకడగా రాణించి 241 పరుగులు చేసిన షఫాలీ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.ఆదుకున్న హర్మన్ మొదట బ్యాటింగ్‌కు దిగగానే భారత్ దెబ్బమీద దెబ్బతో కుదేలైంది. షఫాలీ (5), తొలి మ్యాచ్ ఆడుతుతన్న కమలిని (12), హర్లీన్ డియోల్ (13), రిచా ఘోష్ (5), దీప్తిశర్మ (7) ఇలా ప్రధాన బ్యాటింగ్ బలగాన్ని కోల్పోయి 77/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఈ దశలో హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. అమన్‌జోత్ (21)తో కలిసి వికెట్ కాపాడుకుంటూనే పరుగుల వేగం పెంచింది. దీంతో 14.2 ఓవర్లో భారత్ స్కోరు 100కు చేరింది. హర్మన్ 35 బంతుల్లో ఫిఫ్టీని పూర్తిచేసుకుంది. సిక్స్, ఫోర్ కొట్టిన ఉత్సాహంలో ఉన్న అమన్‌ను రష్మిక అవుట్ చేయడంతో ఆరో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 4 పరుగుల వ్యవధిలో 142 స్కోరు వద్ద హర్మన్ ఏడో వికెట్‌గా వెనుదిరిగింది. హాసిని, ఇమిషా ఫిఫ్టీ–ఫిఫ్టీ లంక లక్ష్యఛేదన ఆరంభంలోనే చమరి (2) వికెట్‌ను కోల్పోయినప్పటికీ హాసిని, ఇమిషా రాణించడంతో 11 ఓవర్ల వరకు మరో వికెట్‌ను కోల్పోలేదు. 86/1 స్కోరు వద్ద శ్రీలంక గెలిచేలా కనిపించింది. కానీ అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే ఇమిషా అవుటయ్యాక లంక తిరోగమించింది. నీలాక్షిక (3), కవీశా (5), హర్షిత (8), కౌశిని (1) విఫలమయ్యారు. దీంతో శ్రీలంక లక్ష్యానికి దూరమైంది. 89వ మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ హాసిని ఎట్టకేలకు ఒక ఫిఫ్టీని ఈ మ్యాచ్ ద్వారా సాధించగలిగింది. దీప్తి, అరుంధతీ, స్నేహ్, వైష్ణవి, శ్రీచరణి, అమన్‌జోత్‌లు తలా ఒక వికెట్ తీశారు. తమిళనాడుకు చెందిన గుణాలన్ కమలిని ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. భారత్ తరఫున టి20 మ్యాచ్‌లు ఆడిన 90వ క్రీడాకారిణిగా కమలిని గుర్తింపు పొందింది. 17 ఏళ్ల కమలిని ఈ ఏడాది ఆరంభంలో అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది. సీనియర్ మహిళల టి20 టోర్నీలో తమిళనాడు తరఫున టాప్‌స్కోరర్ (297 పరుగులు)గా నిలవడంతో ఆమెకు భారత జట్టులో అవకాశం లభించింది. చివరి టి20లో కమలిని, రేణుకా ఠాకూర్లను తుది జట్టులోకి తీసుకున్న టీమ్ మేనేజ్మెంట్...స్మృతి మంధానకు విశ్రాంతినిచ్చి స్నేహ్ రాణాను తప్పించింది.20వ ఓవర్లో 20హైదరాబాదీ క్రికెటర్ అరుంధతీ డెత్ ఓవర్లలో చేసిన పరుగులే మ్యాచ్ విజయంలో కీలకమయ్యాయి. హర్మన్ అవుటయ్యే సమయానికి జట్టు స్కోరు 150ని కూడా చేరుకోలేదు. ఈ దశలో స్నేహ్ రాణా అండతో అరుంధతి ఆఖర్లో చెలరేగింది. 19వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 155/7 కాగా... మదర వేసిన ఆఖరి ఓవర్లో అరుంధతి విరుచుకుపడింది. మొదటి 5 బంతులాడిన ఆమె వరుసగా 4, 1(వైడ్), 6, 4, 4, 1లతో 19 పరుగులు పిండుకుంది. చివరి బంతికి స్నేహ్ రాణా పరుగు చేయలేదు. వైడ్ సహా 20వ ఓవర్లో 20 పరుగులొచ్చాయి.152 భారత బౌలర్ దీప్తిశర్మ తీసిన వికెట్లు. అంతర్జాతీయ టి20లో అత్యధిక వికెట్లు (152) తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కింది.స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ (సి) ఇమిషా (బి) నిమషా 5; కమలిని (ఎల్బీడబ్ల్యూ) (బి) కవీశా 12; హర్లీన్ (బి) రష్మిక 13; హర్మన్‌ప్రీత్ (బి) కవీశా 68; రిచా ఘోష్ (సి) కౌశిని (బి) చమరి 5; దీప్తిశర్మ (సి) నిమషా (బి) చమరి 7; అమన్‌జోత్ (సి) కవీశా (బి) రష్మిక 21; అరుంధతీ (నాటౌట్) 27; స్నేహ్ రాణా (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–5, 2–27, 3–41, 4–64, 5–77, 6–138, 7–142. బౌలింగ్: మాల్కి మదర 4–0–37–0, నిమషా మీపగె 3–0–25–1, కవీశా దిల్హరి 2–0–11–2, ఇనొక 4–0–39–0, రష్మిక 4–0–42–2, చమరి 3–0–21–2. శ్రీలంక మహిళల ఇన్నింగ్స్: హాసిని (బి) శ్రీచరణి 65; చమరి (సి) వైష్ణవి (బి) అరుంధతీ 2; ఇమిషా (సి) షఫాలీ (బి) అమన్‌జోత్ 50; నీలాక్షిక (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 3; కవీశా (బి) వైష్ణవి 5; హర్షిత (సి) హర్లీన్ (బి) స్నేహ్ రాణా 8; కౌశిని రనౌట్ 1; రష్మిక (నాటౌట్) 14; మదర (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–7, 2–86, 3–100, 4–107, 5–132, 6–140, 7–140. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–28–1, అరుంధతీ 2–0–16–1, స్నేహ్ రాణా 4–0–31–1, వైష్ణవి 4–0–33–1, శ్రీచరణి 4–0–31–1, అమన్‌జోత్ 2–0–17–1. -
శ్రీలంక క్రికెటర్ కన్నుమూత
శ్రీలంక మాజీ అండర్-19 క్రికెటర్ అక్షు ఫెర్నాండో కన్నుమూశాడు. 2018 డిసెంబర్లో జరిగిన రైల్వే ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన.. ఏడేళ్లు అపస్మారక స్థితిలో ఉండి ఇవాళ (డిసెంబర్ 30) ఉదయం తుదిశ్వాస విడిచాడు. కొలొంబోకు సమీపంలో గల మౌంట్ లవినియా బీచ్ వద్ద రక్షణలేని ట్రాక్ దాటుతుండగా ఆక్షుని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. శరీరంలో చాలా చోట్ల ఫ్రాక్చర్లు కావడంతో లైఫ్ సపోర్ట్‌పై ఉంచారు. ప్రమాదం జరిగిన నాటికి అక్షు వయసు 27 ఏళ్లు. ప్రమాదానికి కొన్ని రోజుల ముందు అక్షు ఓ స్థానిక టోర్నీ ఆడాడు. అందులో రగామా క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అక్షు మరణం శ్రీలంక క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలచివేసింది. బంగారు భవిష్యత్తు కలిగిన అక్షు దురదృష్టకర రీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్నే బాధిస్తుంది.అక్షు న్యూజిలాండ్‌లో జరిగిన 2010 అండర్-19 వరల్డ్‌కప్‌లో శ్రీలంక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ టోర్నీలో కెనడాతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో కీలక పరుగులు చేశాడు. అనంతరం దక్షిణాఫ్రికాపై క్వార్టర్ ఫైనల్లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆతర్వాత ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో 52 పరుగులు (88 బంతుల్లో) చేశాడు. ఆ టోర్నీలో అక్షు వ్యక్తిగతంగా రాణించినా, శ్రీలంక నాలుగో స్థానంలో ముగించింది. -
శ్రీలంకతో చివరి టీ20.. టీమిండియా బ్యాటింగ్.. స్టార్ ప్లేయర్‌కు రెస్ట్
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకొని, క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తుంది.ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్ 30) నామమాత్రపు ఐదో మ్యాచ్ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్ తరఫున స్టార్ ప్లేయర్ స్మృతి మంధన, రేణుక సింగ్‌కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో స్నేహ్ రాణా, కమిలిని జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌తోనే కమిలిని అరంగేట్రం చేస్తుంది.శ్రీలంక విషయానికొస్తే.. మల్షా శేషని, కావ్యా కవిండి స్థానాల్లో ఇనోకా రణవీరా, మల్కి మదారా తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), ఇనోకా రణవీరా, మల్కి మదారా, రష్మిక సెవ్వంది, నిమేషా మదుషానిభారత్: షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, కమిలిని, శ్రీ చరణి -
క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి... నేడు శ్రీలంకతో ఐదో టి20 మ్యాచ్
తిరువనంతపురం: ఈ ఏడాదిని క్లీన్‌స్వీప్‌తో ముగించేందుకు భారత మహిళల టి20 క్రికెట్ జట్టు విజయం దూరంలో ఉంది. శ్రీలంక జట్టుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి టి20 మ్యాచ్ ఈరోజు జరగనుంది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదుంది. మరోవైపు క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలని, ఒక్క విజయంతోనైనా పరువు దక్కించుకోవాలని శ్రీలంక భావిస్తోంది. అయితే అన్ని రంగాల్లో విఫలమవుతున్న చమరి ఆటపట్టు సారథ్యంలోని శ్రీలంక ఆఖరి మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో వేచి చూడాలి. వచ్చే ఏడాది జూన్–జూలైలో ఇంగ్లండ్ వేదికగా జరిగే టి20 ప్రపంచకప్ టోరీ్నకి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టిన టీమిండియా త్వరలో మరో రెండు టి20 సిరీస్‌లు (ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌లతో) ఆడనుంది. -
అదే జోరు... అదే ఫలితం
తిరువనంతపురం: బౌలింగ్ ప్రతాపం... ‘హ్యాట్రిక్’ విజయాలతో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు... తాజాగా బ్యాటింగ్ విధ్వంసంతో ఆధిక్యాన్ని 4–0కు పెంచుకుంది. ఆదివారం జరిగిన నాలుగో టి20లో హర్మన్‌ప్రీత్ బృందం 30 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (48 బంతుల్లో 80; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), షఫాలీ వర్మ (46 బంతుల్లో 79; 12 ఫోర్లు, 1 సిక్స్)లతో పాటు ఆఖర్లో రిచా ఘోష్ (16 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి పోరాడి ఓడింది. భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. జెమీమా రోడ్రిగ్స్ అస్వస్థత కారణంగా హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్ స్థానంలో అరుంధతి రెడ్డి తుది జట్టుకు ఆడారు. మంగళవారం ఇదే వేదికపై ఆఖరి పోరు జరుగుతుంది. సెంచరీ భాగస్వామ్యం ఈ సిరీస్‌లో ఆశించిన దూకుడు కనబర్చలేకపోయిన స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో తన శైలీ ఆటతీరుతో అలరించింది. ఓ వైపు షఫాలీ, మరోవైపు మంధాన లంక బౌలర్ల భరతం పట్టారు. దీంతో పవర్‌ప్లేలో 61/0 స్కోరు చేసింది. దూకుడు అంతకంతకూ పెరగడంతో 10.5 ఓవర్లలోనే భారత్ స్కోరు 100కు చేరింది. షఫాలీ 30 బంతుల్లో, మంధాన 35 బంతుల్లో అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి ధనాధన్ కొనసాగడంతో 14.2 ఓవర్లలోనే భారత్ 150 మార్క్ దాటింది. ఈ క్రమంలో 2019లో వెస్టిండీస్‌పై చేసిన 143 పరుగుల భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకున్నారు. తర్వాత 162 స్కోరు వద్ద షఫాలీ, 6 పరుగుల వ్యవధిలో స్మృతి అవుటయ్యారు. తర్వాత వచ్చిన రిచా ఘోష్ భారీ సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడింది. రిచా, హర్మన్‌ప్రీత్ (16 నాటౌట్) అబేధ్యమైన మూడో వికెట్‌కు 23 బంతుల్లోనే 53 పరుగులు జోడించారు. రిచా మెరుపుల వల్లే భారత్ టి20 ఫార్మాట్లో తమ అత్యధిక స్కోరు (221/2) నమోదు చేసింది. ఈసారి పోరాడి... గత మూడు మ్యాచ్‌లతో పోలిస్తే లంక బ్యాటింగ్ తీరు పూర్తిగా మారింది. పెద్ద లక్ష్యం ముందు మోకరిల్లుతుందనుకుంటే ఆఖరి దాకా పోరాడి ఓడింది. కెపె్టన్ చమరి ఆటపట్టు (37 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హాసిని (33; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించారు. తర్వాత ఇమిషా దులాని (29; 3 ఫోర్లు), హర్షిత (20; 1 ఫోర్, 1 సిక్స్), నీలాక్షిక (11 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు) భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో లంక ఓటమి అంతరాన్ని తగ్గించింది. స్కోరు వివరాలు భారత ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) దులానీ (బి) శెహని 80; షఫాలీ (సి అండ్ బి) నిమషా 79; రిచా ఘోష్ (నాటౌట్) 40; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–162, 2–168. బౌలింగ్: మల్షా శెహని 4–0–32–1, కావ్య 4–0–43–0, కవిషా 4–0–47–0, రష్మిక 2–0–25–0, చమరి 2–0–30–0, నిమష 4–0–40–1. శ్రీలంక ఇన్నింగ్స్: హాసిని (సి) హర్మన్ (బి) అరుంధతి 33; చమరి (సి) స్మృతి (బి) వైష్ణవి 52; ఇమిషా (రనౌట్) 29; హర్షిత (స్టంప్డ్) రిచా (బి) వైష్ణవి 20; కవిషా (సి) సబ్–కమలిని (బి) అరుంధతి 13; నీలాక్షిక (నాటౌట్) 23; రష్మిక (బి) శ్రీచరణి 5; కౌశిని (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–59, 2–116, 3–140, 4–147, 5–170, 6–185. బౌలింగ్: రేణుక 3–0–32–0, అరుంధతి 4–0–42–2, దీప్తి 4–0–31–0, వైష్ణవి 4–0–24–2, అమన్‌జోత్ 1–0–10–0, శ్రీచరణి 4–0–46–1. 1 శ్రీలంక తరఫున 150 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా చమరి ఆటపట్టు నిలిచింది. నీలాక్షిక సిల్వా (107), ఉదేíÙక ప్రబోధిని (106) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా మహిళల క్రికెట్లో 150 టి20లు ఎనిమిదో ప్లేయర్‌గా చమరి గుర్తింపు పొందింది.80 మహిళల అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా స్మృతి గుర్తింపు పొందింది. 78 సిక్స్‌లతో హర్మన్‌ప్రీత్ పేరిట ఉన్న రికార్డును స్మృతి సవరించింది.1703 ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో స్మృతి చేసిన పరుగులు. ఒకే ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును స్మృతి (2024లో 1659 పరుగులు) బద్దలు కొట్టింది.4 తొలి వికెట్‌కు స్మృతి, షఫాలీ 100 కంటే ఎక్కువ పరుగులు జత చేయడం ఇది నాలుగోసారి.221 టి20ల్లో భారత జట్టు తమ అత్యధిక స్కోరు సాధించింది. గత ఏడాది వెస్టిండీస్‌పై సాధించిన 217/4 స్కోరును భారత్ అధిగమించింది. టి20ల్లో భారత్ 200 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది నాలుగోసారి.162 ఓపెనర్లు స్మృతి, షఫాలీ తొలి వికెట్‌కు జోడించిన పరుగులు. టి20ల్లో ఏ వికెట్‌కైనా భారత్‌కిదే అతిపెద్ద భాగస్వామ్యం.4 మహిళా క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగుల క్లబ్లో చేరిన నాలుగో బ్యాటర్ స్మృతి. ఈమె కంటే ముందు మిథాలీ, సుజీ బేట్స్ (న్యూజిలాండ్), చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) ఈ ఘనత సాధించారు.


