రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
తిరువనంతపురం: ఈ ఏడాదిని క్లీన్‌స్వీప్‌తో ముగించేందుకు భారత మహిళల టి20 క్రికెట్ జట్టు విజయం దూరంలో ఉంది. శ్రీలంక జట్టుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి టి20 మ్యాచ్ ఈరోజు జరగనుంది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదుంది.
మరోవైపు క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలని, ఒక్క విజయంతోనైనా పరువు దక్కించుకోవాలని శ్రీలంక భావిస్తోంది. అయితే అన్ని రంగాల్లో విఫలమవుతున్న చమరి ఆటపట్టు సారథ్యంలోని శ్రీలంక ఆఖరి మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో వేచి చూడాలి. వచ్చే ఏడాది జూన్–జూలైలో ఇంగ్లండ్ వేదికగా జరిగే టి20 ప్రపంచకప్ టోరీ్నకి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టిన టీమిండియా త్వరలో మరో రెండు టి20 సిరీస్‌లు (ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌లతో) ఆడనుంది.


