టీ20 ప్రపంచకప్: ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం | Sri Lanka Won Against Ireland T20 World Cup | Sakshi
Sakshi News home page

IRE Vs SL: శ్రీలంకపై పోరాడి ఓడిపోయిన ఐర్లాండ్

Feb 8 2026 11:07 PM | Updated on Feb 8 2026 11:07 PM

Sri Lanka Won Against Ireland T20 World Cup

కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించింది. 20 పరుగులతో తేడాతో గెలిచేసింది. ఐర్లాండ్ జట్టు చివరివరకు పోరాడినప్పటికీ 143 పరుగులకే ఆలౌటైంది. దీంతో లంక గెలుపు లాంఛనమైంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 54, కమిందు మెండిస్ 44 పరుగులు చేశారు. ఐర్లాండ్ జట్టులో బ్యారీ,జార్జ్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఐర్లాండ్‌కి మంచి ఆరంభం దక్కింది. కానీ వరస విరామాల్లో వికెట్లు వరసగా పడిపోవడంతో 19.5 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది.హ్యారీ టెక్టర్ 40, రాస్ అడైర్ 34 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ, తీక్షణ తలో మూడు వికెట్లు తీయగా.. పతిరాణా 2 వికెట్లు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement