శ్రీలంకతో చివరి టీ20.. టీమిండియా బ్యాటింగ్‌.. స్టార్‌ ప్లేయర్‌కు రెస్ట్‌ | INDW VS SLW 5th T20I: Sri Lanka Won the Toss and choose to Bowl | Sakshi
Sakshi News home page

శ్రీలంకతో చివరి టీ20.. టీమిండియా బ్యాటింగ్‌.. స్టార్‌ ప్లేయర్‌కు రెస్ట్‌

Dec 30 2025 6:46 PM | Updated on Dec 30 2025 8:02 PM

INDW VS SLW 5th T20I: Sri Lanka Won the Toss and choose to Bowl

స్వదేశంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకొని, క్లీన్‌ స్వీప్‌ దిశగా అడుగులు వేస్తుంది.

ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్‌ 30) నామమాత్రపు ఐదో మ్యాచ్‌ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్‌ తరఫున స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధన, రేణుక సింగ్‌కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో స్నేహ్‌ రాణా, కమిలిని జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌తోనే కమిలిని అరంగేట్రం చేస్తుంది.

శ్రీలంక విషయానికొస్తే.. మల్షా శేషని, కావ్యా కవిండి స్థానాల్లో ఇనోకా రణవీరా, మల్కి మదారా తుది జట్టులోకి వచ్చారు.

తుది జట్లు..
శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), ఇనోకా రణవీరా, మల్కి మదారా, రష్మిక సెవ్వంది, నిమేషా మదుషాని

భారత్‌: షఫాలీ వర్మ, స్నేహ్‌ రాణా, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, కమిలిని, శ్రీ చరణి

Advertisement
 
Advertisement
Advertisement