గెలిచి నిలిచిన అఫ్గానిస్తాన్‌  | Azmatullah Omarzai stars as Afghanistan beat UAE to keep Super Eight hopes alive | Sakshi
Sakshi News home page

గెలిచి నిలిచిన అఫ్గానిస్తాన్‌ 

Feb 17 2026 5:31 AM | Updated on Feb 17 2026 9:19 AM

Azmatullah Omarzai stars as Afghanistan beat UAE to keep Super Eight hopes alive

న్యూఢిల్లీ: గ్రూప్‌లోని గట్టి ప్రత్యర్థులు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిపోయిన అఫ్గానిస్తాన్‌ టి20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో గెలుపు బోణీ కొట్టింది. ‘సూపర్‌–8’ చేరే అవకాశాలను నిలబెట్టుకుంది. సోమవారం గ్రూప్‌ ‘డి’లో జరిగిన మ్యాచ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (4 వికెట్లు; 21 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అఫ్గానిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో యూఏఈపై గెలుపొందింది.

 మొదట యూఏఈ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. సోహైబ్‌ ఖాన్‌ (48 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచేశాడు. అజ్మతుల్లా  (4–0–15–4) నిప్పులు చెరిగే స్పెల్‌తో యూఏఈ బ్యాటర్లను కట్టడి చేశాడు. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో అఫ్గానిస్తాన్‌ కెపె్టన్, లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అర్ఫాన్‌ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. దాంతో టి20 క్రికెట్‌ చరిత్రలో 700 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా రషీద్‌ ఖాన్‌ గుర్తింపు పొందాడు. 

అంతర్జాతీయ టి20ల్లోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్‌ ఖానే (191) అగ్రస్థానంలో ఉన్నాడు. అనంతరం అఫ్గానిస్తాన్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి గెలిచింది.  ఇబ్రహీం జద్రాన్‌ (41 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్‌), అజ్మతుల్లా రాణించారు. ఈ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా ఆడిన మూడూ గెలిచి 6 పాయింట్లతో ఇప్పటికే ‘సూపర్‌–8’కు చేరింది. రెండు మ్యాచ్‌లు నెగ్గిన న్యూజిలాండ్‌ 4 పాయింట్లతో అఫ్గానిస్తాన్‌ కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఈరోజు కెనడాతో జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే అఫ్గానిస్తాన్‌ టోర్నీ నుంచి ని్రష్కమిస్తుంది. న్యూజిలాండ్‌ ‘సూపర్‌–8’కు చేరుతుంది.    
 

Advertisement
 
Advertisement
Advertisement