
కొలంబో: శ్రీలంకలో (Sri Lanka) పెను విషాదం చోటు చేసుకుంది. కోట్మాలేలోని కరండీ ఎల్లా ప్రాంతం నుంచి 78 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయ పడ్డారు.
Over 20 people have been killed after a bus fell down a precipice in Kotmale in the Gerandi Ella area on Sunday.
Deputy Minister of Transport Dr. Prasanna Gunasena said that at least 77 people were in the bus at the time of the accident.#Srilanka #lka #accident pic.twitter.com/8V6jEBKByD— Easwaran Christian Rutnam (@easwaranrutnam) May 11, 2025
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు,రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు,పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణించ వల్లే ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండడం, కోట్మాలే ప్రాంతంలో బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లు సమాచారం. దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు.