
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. మహరాష్ట్ర,కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేస్తోందంటూ ఆరోపించారు. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ మహదేవ్‌పూర్ అసెంబ్లీ స్థానంలో సుమారు లక్షకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపణలు చేశారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని ప్రకటించారు.
ఓట్ చోరీ పేరిట గురువారం ఢిల్లీ ఇందిరా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ సుదీర్ఘంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్‌లో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
LIVE: Press Conference - #VoteChori | Indira Bhawan, New Delhi https://t.co/BlZwacZpto
— Rahul Gandhi (@RahulGandhi) August 7, 2025
- ఒకే ఇంట్లో 80 ఓట్లు ఉన్నట్లు చూపించారు
- కొన్ని ఓటర్ ఐడీ కార్డ్‌లలో ఇంటి నెంబర్ జీరో ఉంది
- నాలుగు పోలింగ్ బూత్‌లలో ఒకరి పేరు ఎలా వస్తుంది
- ఎన్నికల ఎలక్షన్ డేటాను ఈసీ మాకు ఎందుకు ఇవ్వడం లేదు
- మహరాష్ట్ర ఎన్నికల పరిణామాలతో బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని మాకు అర్ధమైంది
- కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామని అంచనా వేశాం. మా అంచనాలు తప్పాయి. కాంగ్రెస్ 9 సీట్లలో గెలిచింది.
- అసలేం జరిగిందో తెలుసుకునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేశాం
- సింగిల్ బెడ్రూం ఇంట్లో 48 ఓట్లు ఎలా వచ్చాయి
- ఇంటి నెంబర్ ‘0’ తో వంద ఓట్లున్నాయి
- బెంగళూరు సెంట్రల్ సహా ఏడు ఎంపీ స్థానాల్ని అనూహ్యంగా ఓడిపోయాం
మహదేవ్‌పూర్‌లో లక్ష ఓట్ల చోరీ జరిగింది
- ఎన్నికల్లో చోరీ జరిగిందని మహారాష్ట్ర ఎన్నికలతో మాకు క్లారిటీ వచ్చింది
- బెంగళూరు సెంట్రల్ మహదేవ్‌పూర్ అసెంబ్లీ స్థానంపై పరిశోధన చేశాం
- మహదేవ్‌పూర్‌లో లక్ష ఓట్ల చోరీ జరిగింది
- మహదేవ్ పూర్‌లో ఒకే అడ్రస్‌తో 10వేలకు పైగా ఓటరు కార్డులున్నాయి.
- ఓటరు కార్డు మీద పదివేల ఓట్లు పడ్డాయి
- మహదేవ్‌పూర్‌లో బీజేపీ 1,14,046 మెజారిటీ వచ్చింది
- మహదేవ్‌పూర్‌లో 40వేలకు పైగా ఓటర్లకు ఫేక్ ఐడీ కార్డులున్నాయి
అలాంటి ఓట్లు వేలల్లోనే..
- బీహార్ ఓట్ల తొలగింపుపై ఈసీ సమాధానం చెప్పాలి
- కర్ణాటకలోనూ అక్రమాలు జరిగాయి
- ఒకే పేరు, ఒకే పొటో, ఒకే అడ్రస్ ఉన్న వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంది
- ఇలాంటి ఓట్లు వేలల్లో ఉన్నాయి
- ఇంటి నెంబర్ 0తోనూ వందల ఓట్లు ఉన్నాయి
- సింగిల్ బెడ్రూల్ ఇంటికి 48 ఓట్లు ఉన్నాయి
- ఈసీకి వ్యతిరేకంగా మా దగ్గర ఆటంబాంబ్ లాంటి ఆధారాలున్నాయి

మహారాష్ట్ర ఫలితాలపైనా అనుమానాలు
- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయి
- మహరాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడింది
- జనాభా కంటే ఓట్లు ఎక్కువగా ఉన్నాయి
- పోలింగ్‌నాడు సాయంత్రం 5 గంటల తర్వాత మహారాష్ట్రలో భారీగా ఓటింగ్ జరిగింది
- పోలింగ్ కేంద్రాల్లో జనం లేరు.. అయినా ఎలా సాధ్యమైంది?
- మహారాష్ట్ర ఓటర్ జాబితాలో ఫేక్ ఓటర్లను చేర్చారా?
- కాంగ్రెస్ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదు
- ఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ వద్ద ఆటం బాంబ్ లాంటి ఆధారాలు ఉన్నాయి
అంచనాలకు అందని ఫలితాలు.. ఎలా?
- బీహార్‌లో లక్షల మంది ఓటర్లను తొలగించారు.
- ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు ఉన్నాయి
- ఇటీవల జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశాం
- హర్యానా, మధ్యప్రదేశ్‌లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనా అనుమానాలు ఉన్నాయి
- ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి మాత్రమే ఇమ్యూనిటీ వస్తోంది
- ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పుతున్నాయి
- అంచనాలకు అందని ఫలితాలు వస్తున్నాయి
- కాంగ్రెస్ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది. అయితే, ఈ ప్రక్రియను ముందు నుంచీ వ్యతిరేకిస్తోన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
రాష్ట్ర స్థాయి నుంచి ఓట్ల చౌర్యం జరుగుతోందని మేం ఎప్పటినుంచో అనుమానిస్తున్నాం. మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు లోక్‌సభలో ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి. ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే.. ఈసీ గురించి బయటపడింది. ఆరు నెలల పాటు మేం సొంతంగా దర్యాప్తు జరిపి ఆటమ్ బాంబు లాంటి ఆధారాలను గుర్తించాం. ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి అవకాశమే ఉండదు
ఇది దేశ ద్రోహం కంటే తక్కువేం కాదు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఒక్కరినీ మేం వదిలిపెట్టేది లేదు. అధికారులు రిటైర్ అయినా.. ఎక్కడ దాక్కొన్నా మేం కనిపెడతాం అని హెచ్చరించారాయన. అయితే ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండిస్తోంది.