సుప్రీంకోర్టుకు ముగ్గురు అడిషనల్ సొలిసిటర్ జనరల్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ న్యాయవాది దవీందర్ పాల్ సింగ్, అనిల్ కౌశిక్, రవీంద్ర కనకమేడలలను ఏఎస్‌జీలుగా నియమిస్తూ కేంద్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ముగ్గురు మూడేళ్ల పాటు ఈ బాధ్యతలో కొనసాగనున్నారు.
దవీందర్ పాల్ సింగ్ గతంలో పంజాబ్, హర్యాణాకు అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. అనిల్ కౌశిక్, కనకమేడల రవీంద్ర కుమార్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు. అడిషనల్ సొలిసటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు, హైకోర్టులలో సివిల్, క్రిమినల్ కేసులు వాదిస్తారు. రాజ్యాంగం అంశాలతో పాటు ఇతర న్యాయ అంశాలలో ప్రభుత్వానికి వీరు సలహా ఇస్తారు. వీరు అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్‌కు సహాయకారిగా ఉంటారు.


