ఛత్తీస్‌గఢ్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు | 51 Maoists Surrender in Chhattisgarh Bastar Division | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

Feb 7 2026 7:28 PM | Updated on Feb 7 2026 7:54 PM

51 Maoists Surrender in Chhattisgarh Bastar Division

ఛత్తీస్‌గఢ్: మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ డివిజన్‌ పరిధిలోని బీజాపూర్‌లో 30, సుక్మా జిల్లాలో 21 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. సరెండర్‌ అయిన మావోయిస్టులపై రూ.1.59 కోట్ల రివార్డు ఉంది.. బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్, ఎస్పీ కిరణ్ చవాన్, సీఆర్పీఎఫ్ డీఐజీ ఆనంద్ సింగ్ రాజ్ పురోహిత్ ఎదుట వీరంతా లొంగిపోయారు.

వీరు తమ వద్ద ఉన్న ఏకే-47 (AK-47) రైఫిళ్లు, ఎస్ఎల్ఆర్ (SLR)లు, మరియు బారెల్ గ్రెనేడ్ లాంచర్ల వంటి అత్యాధునిక ఆయుధాలను అధికారులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో 20  మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానం కింద.. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తక్షణ ఆర్థిక సాయంగా రూ. 50 వేల రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేశారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement