బీజాపూర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌.. మావోయిస్ట్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ | Encounter In Chhattisgarh's Bijapur Feb 05 News Updates | Sakshi
Sakshi News home page

బీజాపూర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌.. మావోయిస్ట్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ

Feb 5 2026 10:19 AM | Updated on Feb 5 2026 10:43 AM

Encounter In Chhattisgarh's Bijapur Feb 05 News Updates

ప్రతీకాత్మక చిత్రం

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. గురువారం ఉదయం పెద్దగెలూర్‌ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్‌ చేపట్టగా.. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు దళ కమాండర్‌ ఉధమ్‌ సింగ్‌ హతమైనట్లు సమాచారం. 

మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో భద్రతాల బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగగా.. భద్రతా బలగాలు కౌంటర్‌ ఎటాక్‌కు దిగాయి. కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా.. ఘటనా స్థలం నుంచి ఓ ఏకే47ను స్వాధీనం  చేసుకున్నారు. మృతి చెందిన వ్యక్తిని నక్సలైట్‌ కమాండర్‌ ఉధమ్‌ సింగ్‌గా తర్వాత అధికారికంగా ప్రకటించారు.  ​ప్రస్తుతం అక్కడ కూంంబింగ్‌ కొనసాగుతోంది. 

ఆపరేషన్‌ కగార్‌ ఎఫెక్ట్‌తో.. బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కిందటి ఏడాది.. ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో జరిగిన భారీ ఆపరేషన్‌లో 31 మంది నక్సలైట్లు హతమయ్యారు. ఈ ఏడాదిలో జనవరిలో బీజాపూర్–సుక్మా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 14 మంది నక్సలైట్లు హతమయ్యారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్‌కౌంటర్ నక్సలైట్లకు మరో పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement