లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద
ఆధార్‌తో మోసాలను అరికట్టేందుకేనని వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ డేటాబేస్‌ను మరింత సురక్షింతంగా, విశ్వసనీయంగా ఉంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరణించిన 2.5 కోట్లకుపైగా ప్రజల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడిచింది. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద లిఖితపూర్వంగా సమాధానం ఇచ్చారు.
ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థగా నిలిచిన ఆధార్‌లో ప్రస్తుతం సుమారు 134 కోట్ల మందికి సంబంధించిన వినియోగదారులు ఉన్నారని తెలిపారు. అయితే వ్యక్తి మరణించిన తర్వాత ఆధార్ నంబర్ క్రియాశీలకంగా ఉంటే, సంక్షేమ పథకాల దురి్వనియోగం, గుర్తింపు సంబంధ మోసాలు జరిగే ఆస్కారం ఉండటంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు, సంస్కరణ కార్యక్రమం చేపట్టిందని మంత్రి తెలిపారు.
ఆధార్ వినియోగదారుడి చిరునామాలో నమోదైన రాష్ట్రం, మరణం నమోదైన రాష్ట్రం వేరుగా ఉంటే అలాంటి వ్యక్తుల వివరాలు సమీకరించి మరణాలను ధృవీకరించుకుంటామని వెల్లడించారు. ఆ తర్వాత ఆయా వ్యక్తుల ఆధార్ నంబర్లను నిలిపిస్తున్నట్లు స్పష్టం చేశారు. గుర్తింపు మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా వినియోగదారులు తమ బయోమెట్రిక్స్‌ను లాక్/అన్‌లాక్ చేసుకునే సదుపాయం కలి్పస్తున్నట్లు పేర్కొన్నారు.
లావాదేవీల సమయంలో లబి్ధదారు భౌతికంగా ఉన్నట్లు నిర్ధారించే ’లైవ్‌నెస్ డిటెక్షన్’ ఫీచర్‌తో కూడిన ఫేస్ అథెంటికేషన్, ఆధార్ సెక్యూర్ క్యూఆర్ కోడ్, ఆఫ్‌లైన్ ఈ–కేవైసీ వంటివి అందుబాటులోకి తెచి్చనట్లు వివరించారు. వినియోగదారుల ప్రధాన బయోమెట్రిక్ సమాచారాన్ని యూఐడీఏఐ ఎవరితోనూ పంచుకోదని, డేటాను ఎన్‌క్రిపె్టడ్ ఫార్మాట్‌లో భద్రపరచడం తప్పనిసరి చేశామని జితిన్ ప్రసాద స్పష్టం చేశారు.


