పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ విలీనం | Govt considering merger of state-run entities PFC and REC | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ విలీనం

Feb 3 2026 5:22 AM | Updated on Feb 3 2026 8:45 AM

Govt considering merger of state-run entities PFC and REC

న్యూఢిల్లీ: విద్యుత్‌ రంగ ఫైనాన్షియల్‌ నవరత్నాలు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ), ఆర్‌ఈసీ(గతంలో రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌) మధ్య విలీన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ రెండు పీఎస్‌యూలను విలీనం చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ ప్రాజెక్టులకు రుణాలు సమకూర్చడంలో రెండు సంస్థలు కీలక పాత్ర పోషించే సంగతి తెలిసిందే.

 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టిన తాజా(2026–27) బడ్జెట్‌లో ఈ రెండు ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్‌ సంస్థల పునర్వ్యవస్థీకరణకు ప్రతిపాదించారు. తద్వారా వీటికి మరింత బలాన్ని చేకూర్చే యోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. కాగా.. ఆర్‌ఈసీలో మెజారిటీ వాటాను 2019 మార్చిలో పీఎఫ్‌సీ కొనుగోలు చేసింది. దీంతో 2019–20లో వీటి మధ్య విలీనానికి తెరతీయనున్నట్లు అంచనాలు వెలువడినప్పటికీ ఆచరణలోకి రాకపోవడం గమనార్హం!  

 

Advertisement
 
Advertisement
Advertisement