సాక్షి,న్యూఢిల్లీ: తన హయాంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంస్కరణలను కేంద్ర ఆర్థిక శాఖ కొనియాడింది. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకేలు)పై కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసల వర్షం కురిపించింది.
రైతులను, వర్తకులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఆర్‌బీకేల ద్వారా ఈ-ఫార్మ్ మార్కెట్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారని సర్వే పేర్కొంది. రైతులకు అండగా నిలిచిన ఆర్‌బీకేలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని స్పష్టంగా తేల్చింది.
అంతేకాకుండా, మహిళా సాధికారత కోసం జగన్ చేపట్టిన సంస్కరణలకూ సర్వే ప్రత్యేకంగా ప్రశంసలు తెలిపింది. 2023-24లో ఉత్పాదక రంగంలో మహిళల యాజమాన్యంలో ఉన్న సంస్థల వాటా గణనీయంగా పెరిగిందని, మహిళా కార్మిక భాగస్వామ్య రేటు కూడా అధికంగా నమోదైందని ఆర్థిక సర్వే వెల్లడించింది.
ఇదీ చదవండి:
ఏపీలో భూ రీసర్వే జగన్ విజనే.. భేష్


