సాక్షి, ఢిల్లీ: తప్పుడు ప్రచారాలతో కాలం వెల్లదీస్తున్న కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడు పడని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆర్థిక సర్వేలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విజన్‌ను కేంద్రం కొనియాడింది.
వ్యవసాయ రంగంలో.. 2021లో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. ‘‘2021లో అప్పటి ఏపీ ప్రభుత్వం భూ రీసర్వే ప్రాజెక్టును చేపట్టింది. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి జీఐఎస్ సహాయంతో ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ ఇచ్చారు.

మొత్తం 6,901 గ్రామాల్లో ఈ రీసర్వే జరిపారు. మొత్తంగా 81 లక్షల భూముల పునః సర్వే జరిగింది. దాదాపు 86 వేల భూ సరిహద్దు వివాదాలు పరిష్కారం అయ్యాయి’’ అని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతో.. చంద్రబాబు అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా మరోసారి పటాపంచలు అయ్యాయి. భూ సర్వే జగన్ విజనేనంటూ కేంద్రం కూడా బాబుకి షాకిచ్చినట్లైంది.


