తల్లి కావడం అనేది ఎంత అపురూపమైన క్షణమో చెప్పాల్సిన పనిలేదు. ఆమె తల్లి అవ్వడంతోనే కుటుంబ సభ్యులకు అమ్మమ్మ, నానమ్మలుగా ప్రమోషన్లు వచ్చేస్తుంటాయి. అలాంటిది ఒకే ఇంట్లో తల్లి కూతుళ్లు ఇద్దరూ ఒకేసారి తల్లికావడం అంటే మాములు వింత కాదు కదా ఇది. అస్సలు ఇదెలా సాధ్యం అని అనుకోకండి.
ఈ అద్భుతమైన ఘటన ఇటలీలోని నేపుల్స్‌లోని కారద్రాల్లి ఆస్పత్రిలో జరిగింది. అక్కడ ఆ తల్లి మారా బారోన్, కూతురు పాలోలకు ఈ అరుదైన సందర్భం ఎందురైంది. నిజానికి మారా బారోన్‌కి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కూతురు పాలా జన్మించింది. అయితే ఆ సమయంలో ఆమె గర్భస్రావం చేయించుకోవడానికి బదులుగా గర్భాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. విచిత్రం ఏంటంటే మారా మళ్లీ తల్లి అయ్యిన అదే రోజున ప్రస్తుతం 21 ఏళ్ల వయసున్న తన కూతురు కూడా తల్లి అయ్యింది.
వారిద్దరు ఒకరోజున బిడ్డలకు జన్మనిచ్చారు. మారా 3.8 కిలోల బరువున్న 'Futura' అనే పాపకు జన్మనివ్వగా, కూతురు పోలాకి 3.4 కిలోల బరువున్న 'Giovanni' అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక తల్లి మారా జీవశాస్త్రవేత్త, ఆమెకు ఇది రెండో ప్రసవం. ఆస్పత్రి గైనకాలజీ విభాగం డైరెక్టర్ సైతం ఈ సంఘటనను ఒక అద్భుతం కంటే తక్కువ కాదని అభివర్ణించారు.
తల్లీ కూతుళ్లిద్దరికీ సాధారణ ప్రసవాలే జరగాయని అన్నారు. ప్రస్తుతం ఇద్దరు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు వైద్యులు. సాధారణంగా ఒక కొత్త బిడ్డ రాకతోనే కుటుంబం ఆనందంతో మునిగిపోతుంది. అలాంటిది ఇద్దరు నవజాత శిశువుల రాకతో ఆ కుటుంబానికి ఇది పండుగ వాతావరణంలా మారిపోయింది.
(చదవండి: గ్యాస్ కొరతకు..వంటగది వ్యర్థాలతో చెక్!)


