Viveka Case: ‘సునీత కీలక అంశాలను పక్కదారి పట్టించారు’ | YSRCP MP Avinash Reddy Addresses Media on Viveka Case | Sakshi
Sakshi News home page

Viveka Case: ‘ఆ కోణంలో విచారణ ఎందుకు కోరలేదు?’

Mar 16 2026 5:17 PM | Updated on Mar 16 2026 5:33 PM

YSRCP MP Avinash Reddy Addresses Media on Viveka Case

న్యూఢిల్లీ:  వివేకా కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత అనేక కీలకాంశాలను పక్కదారి పట్టించారన్నారు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి. తనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని కొందరిపై సునీత ఒత్తిడి చేశారన్నారు.  ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, సీబీఐ కూడా దీనికి సమాధానం చెప్పాలన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని సృష్టించిందే సునీత అని అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. 

ఈరోజు(సోమవారం, మార్చి 16వ తేదీ) న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన అవినాష్‌రెడ్డి.. వివేకాది గుండెపోటు అని సృష్టించింది సునీతతో పాటు నర్రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తులు అని తెలిపారు. అసలు వివేకాది మర్డర్‌ ఫర్‌ గెయిన్‌ దిశగా సునీత ఎందుకు విచారణ కోరలేదని అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. వివేకా హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది తానేనని అవినాష్‌ పేర్కొన్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు అవినాష్‌. 

సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసింది..
వివేకా హత్య కేసులో నాపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని సునీత కొందరిపై ఒత్తిడి చేశారు. వారు చెప్పినట్లే సీబీఐకి చెప్పాలని కొందరని సునీత బెదిరించారు. రామ్‌సింగ్‌ విచారణ అధికారిగా వచ్చాక కేసు పక్కదారి పట్టింది. సీబీఐ డైరెక్టర్‌కు అనేక సాక్ష్యాలు సమర్పించి విచారణ చేయాలని మొరపెట్టుకున్నా. గతంలో సీబీఐకి నచ్చిన వారిని మాత్రమే పిలిచి మాట్లాడారు. సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసింది’ అని స్పష్టం చేశారు.

చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారు
ఈ కేసును చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారు. చంద్రబాబు హయాంలోనే వివేకా హత్య జరిగింది. వచ్చే ఎన్నికల వరకూ వివేకా కేసు సాగదీయాలనేది సునీత, చంద్రబాబు ఉద్దేశం. చంద్రబాబుకు రాజకీయంగా అవసరం ఉన్న సమయంలో సునీత బయటకొస్తారు. టాపిక్‌ డైవర్షన్‌ కోసం మీడియా ముందుకొచ్చి ఈ కేసు అంశాన్ని లేవనెత్తుతారు.

వాటికి సునీత సమాధానం చెప్పలేదు..
సీబీఐ స్టేట్‌మెంట్‌ తీసుకునే సమయంలో సునీతను లెటర్‌ గురించి అడిగారు. లెటర్‌ గురించి సీబీఐ అడిగిన ప్రశ్నలకు సునీత సమాధానం చెప్పలేదు.గతంలో సునీత మాటలను నేను కోర్టుకు సమర్పించాను. సునీత కీలక అంశాలను పక్కదారి పట్టించారు. చట్టం, ధర్మం, దేవుడిపై నాకు నమ్మకం ఉంది

దస్తగిరి బెయిల్‌ రద్దు కాకుండా అడ్డుకుంటున్నారు
సునీతకు దస్తగిరి అత్యంత ఆప్తుడు. దస్తగిరి బెయిల్‌ రద్దు కాకుండా సునీత అడ్డుకుంటున్నారు. దస్తగిరి తరఫున లూథ్రాను పెట్టి కేసు వాదనలు వినిపిస్తున్నారు.  దస్తగిరి సీబీఐకి చెప్పిన స్టేట్‌మెంట్‌లో అనేక కీలక అంశాలున్నాయి. విచారణ సక్రమంగా చేయాలని సీబీఐ డైరెక్టర్‌కు చాలాసార్లు మొరపెట్టుకున్నా. మూడేళ్లుగా విచారణ సక్రమంగా జరగకుండా సునీత అడ్డుకుంటున్నారు. ఏదో ఒక రోజు నిజం నిగ్గు తేలుతుంది. ఈ కేసును సీబీఐ, న్యాయస్థానం త్వరగా విచారణ పూర్తి చేయాలి’ అని కోరారు.

రాజశేఖర్ ను వివేకా హత్యకు ముందు రోజున ఎందుకు కాణిపాకం పంపించారు

రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటం..
ఈ కేసుకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాటపడుతున్నారన్నారు అవినాష్‌.  ‘రాజకీయ లబ్ధి కోసమే సునీత ఆరాట పడుతున్నారు. దస్తగిరి, డ్రైవర్‌ ప్రసాద్‌, రాజశేఖ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ను సునీత చదివారా?, హత్యకు ముందు రోజు రాజశేఖర్‌ను ఎందుకు శ్రీకాళహస్తికి పంపించారు. స్టేట్‌మెంట్‌లో రాజశేఖర్‌ అనేక విషయాలు చెప్పారు. చివరి రోజుల్లో వివేకానందరెడ్డిని మానసికంగా వేధించారు. డాక్యుమెంట్స్‌ కోసమే వివేకానందరెడ్డిన హత్య చేశామని దస్తగిరి చెప్పాడు. పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన లెటర్‌ను సునీత పోలీసులకు ఎందుకు ఇవ్వలేదు. దస్తగిరి బెయిల్‌ రద్దు చేయాలని మేం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాం’ అని స్సష్టం చేశారు. 

ఆ కోణంలో ఎందుకు విచారణ చేయలేదు..?
సిబిఐ వన్ సైడ్ గా దర్యాప్తు జరిపింది. హత్య జరిగిన రోజు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. సాక్షులకు శిక్షణ ఇచ్చి నాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇప్పించారు. శివ ప్రకాష్ రెడ్డి తనకి ఫోన్ చేసి.. వివేకా కు గుండె పోటు అని చెప్పారు. గుండె పోటు వచ్చిందని థియరీ సృష్టించింది సునీతక్క, రాజశేఖర్ రెడ్డినే. దీనిపై ఎందుకు విచారణ అడగడం లేదు. వివేకాను ఆయన కుటుంబం వదిలేసింది. ఆయన చెక్ పవర్ తీసేశారు. షమీమ్, ఆమె కొడుకుకు ఆస్తులు పోవద్దనే వివేకాను హత్య చేసి ఉండవచ్చే కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదు. వివేకాది మర్డర్‌ ఫర్‌ ది గెయిన్‌ అనే కోణంలో ఎందుకు విచారణ చేయలేదు. ఈ అంశాలపై ప్రధాన మంత్రి, హోమ్ మంత్రికి  లేఖ రాశాను’ అని అవినాష్‌ స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement