తిరుపతిలో ఉద్రిక్తత.. బీఆర్‌ నాయుడు రాజీనామాకు డిమాండ్‌.. | Tension In Tirupati As YSRCP Leaders Arrested During Protest Against TTD Chairman BR Naidu | Sakshi
Sakshi News home page

తిరుపతిలో ఉద్రిక్తత.. బీఆర్‌ నాయుడు రాజీనామాకు డిమాండ్‌..

Mar 16 2026 9:27 AM | Updated on Mar 16 2026 10:40 AM

YSRCP Supporters Arrest At Tirupati

సాక్షి, తిరుపతి: తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు.. తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ ఉన్నారు. ఈ సందర్బంగా బీఆర్‌ నాయుడు రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నేతలు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహంతో వైఎస్సార​్‌సీపీ నేతలను అరెస్ట్‌ చేశారు.

వివరాల ప్రకారం.. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఉన్న గ్రాండ్ రిడ్జ్ హోటల్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నేతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం నిరసనలకు దిగారు. బీఆర్‌ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకురాలు గీత యాదవ్, సాయి కుమారి, పద్మజ, విజయ లక్ష్మీలను తిరుచానూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అంతకుముందు హోటల్‌ ఎదుట నిరసనల్లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టీడీపీ నేత జేబీ అనుచరులు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్బంగా తిరుపతి వైఎస్సార్‌సీపీ నార్త్ క్లస్టర్ అధ్యక్షుడు నవీన్‌పై దాడి చేయడంతో అతను గాయపడినట్టు సమాచారం. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement