ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ | RGV says industry is waiting for Aditya Dhar Yami Gautam Down fall | Sakshi
Sakshi News home page

RGV: ఆ దంపతుల పతనం కోసం అందరి ఎదురుచూపులు: ఆర్జీవీ కామెంట్స్

Mar 14 2026 3:14 PM | Updated on Mar 14 2026 3:22 PM

RGV says industry is waiting for Aditya Dhar Yami Gautam Down fall

టాలీవుడ్ డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దురంధర్ మూవీ హిట్ కావడం చాలామందిని భయపెట్టిందన్నారు. ఆదిత్య ధర్‌కు ఆదరణ పెరగడం కొందరికీ నచ్చడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతన్ని చూసి చాలామంది అసూయ పడుతున్నారని అన్నారు. ఆదిత్య ధర్‌, ఆయన సతీమణి యామీ గౌతమ్ పతనం కోసం సినీ పరిశ్రమలో ఎంతోమంది ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్జీవీ దురంధర్ డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ భారతీయ సినిమా గతిని మార్చిందని అన్నారు. ఆయన వల్ల సినీ ఇండస్ట్రీలో మిగిలిన వాళ్లంతా పునరాలోంచించేలా చేసిందని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆదిత్య ధర్, యామి గౌతమ్ మరింత జాగ్రత్తగా ముందడుగు వేయాలని సూచించారు.

ఆర్జీవీ మాట్లాడుతూ..' తెరపై కథ చెప్పే విధానం, మేకింగ్ స్టైల్‌ ఆదిత్య ధర్ పూర్తిగా మార్చేశారు. మన సినిమాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు. ఇక్కడ నేను హిందీ మాత్రమే కాకుండా అన్ని భాషల గురించి మాట్లాడుతున్నా. తెలుగులో రాబోయే అనేక పెద్ద-బడ్జెట్ యాక్షన్ చిత్రాలు భారీ రీ షూటింగ్‌కు రెడీ అవుతున్నాయి. దీనివల్ల నిర్మాతలపై ‍అదనపు భారం తప్పదు. ఆదిత్య ధర్‌ వల్లే ఇలా చేయాల్సి రావడం పరిశ్రమలోని కొందరికి నచ్చడం లేదు. అందుకే వారంతా అతన్ని ద్వేషిస్తారు. ఆయన అందరిని కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు తీసుకొచ్చేలా చేశాడు. అందుకే ఆదిత్య ధర్ ఫెయిల్యూర్ కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారని' అన్నారు. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తోన్న దురంధర్-2 ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement