Aditya Dhar
-
ధురందర్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఇదే! హీరో ఎవరో తెలుసా ?
-
ధురంధర్-3 కాదు.. కొత్త కాన్సెప్ట్‌తో రణ్వీర్–ఆదిత్య ధర్ ?
దురంధర్ నుంచి వచ్చిన రెండు భాగాలూ ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. అయితే దానికి కొనసాగింపుగా దురంధర్-3 వుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ రణ్వీర్ సింగ్, దర్శకుడు ధర్ ఇద్ధరూ మాత్రం కలుస్తున్నారు.అవును.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ వెంటనే మరో చిత్నాన్ని చేయబోతున్నాడని సమాచారం. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇది దురంధర్-3 మాత్రం కాదట. మరో కొత్త సబ్జెక్ట్‌తో వీరిద్దరూ మరోసారి మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమైయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నెలలో సెట్స్‌పైకి వెల్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఇటీవల ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్ ఇద్దరూ కలిశారు. ఆదిత్య తన దగ్గర ఉన్న కథను రణ్‌వీర్‌కు చెప్పాడట. కథ నచ్చడంతో రణ్వీర్ వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. దీంతో దర్శకుడు ఈ పాయింట్‌ను ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్‌గా తయారు చేసే పనిలో ఉన్నాడు. ఆదిత్య ధర్ దగ్గర ఇప్పటికే ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’, ఒక స్పోర్ట్స్ డ్రామా కథలు రెడీగా ఉన్నాయి. కానీ వీటిని పక్కన పెట్టి మరో కొత్త కథతో రణ్వీర్తో సినిమా చేయాలని నిర్ణయించారు. -
ధురంధర్ దర్శకుడి కొత్త సినిమా.. బిగ్ ప్లాన్‌తో ఆదిత్య ధర్
‘ధురంధర్’ ప్రాంఛైజీ చిత్రాలతో రణ్వీర్ సింగ్- దర్శకుడు ఆదిత్య ధర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు. సుమారు రూ. 3వేల కోట్లకు పైగా ఈ రెండు సినిమాలు కలెక్షన్స్ రాబట్టాయి. ఇండియన్ మూవీ మార్కెట్లోనే అనేక సంచలనాలను క్రియేట్ చేసిన వీరిద్దరూ మరో సినిమా కోసం పనిచేయనున్నారు. ఈమేరకు బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి.రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ మరో కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్లో వస్తున్న కథనాల ప్రకారం దర్శకుడికి ఒక కొత్త ఆలోచన తట్టిందని ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌ను మరింత బలంగా ఉండేలా తన పనిని ప్రారంభించారని సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్ 2027లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుపుతున్నారు. భారతదేశ భద్రత, నిఘా, అంతర్గత/బాహ్య వ్యవహారాలను పర్యవేక్షించేందుకు పలు ఇంటలిజెన్స్ (నిఘా) సంస్థలు దేశం కోసం పనిచేస్తున్నాయి. మరోసారి దేశం కోసం పనిచేసే సైనికుడి పాత్రతోనే ఒక బలమైన స్టోరీని ఆయన ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.వాస్తవ ప్రపంచానికి దూరంగా.. ఒక భారీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రణవీర్ సింగ్ దాదాపు నటించనున్నారని టాక్ ఉంది. ప్రస్తుతానికి పూర్తి నటీనటుల ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. త్వరలో ఆయన మరిన్ని విషయాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. -
బ్లాక్‌బస్టర్ సక్సెస్.. 'ధురంధర్' నటుడికి కోటి రూపాయల గిఫ్ట్
గత నెలలో రిలీజైన 'ధురంధర్ 2' సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డులని బద్దలు కొట్టేసింది. ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఈ మూవీ గురించి మెల్లగా అందరూ మర్చిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందులో నటించిన రాకేశ్ బేడీ.. నిర్మాతల నుంచి రూ.కోటి గిఫ్ట్ అందుకోవడమే దీనికి కారణం. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ‘రాకా’ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె.. టీమ్ క్లారిటీ)'ధురంధర్' మొదటి భాగంలో అక్షయ్ ఖన్నా తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకోగా.. గత నెలలో రిలీజైన రెండో భాగంలో హీరో రణ్వీర్ సింగ్ ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. అయితే చివరలో రాకేశ్ బేడీ చేసిన జమీల్ జమాలీ పాత్రతో ఇచ్చిన ట్విస్ట్ అయితే ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేసింది. అప్పటివరకు పాక్ రాజకీయ నాయకుడి పాత్రనే అని అంతా అనుకున్నారు. కానీ ఇతడు కూడా భారతదేశ్ గూఢచారి అనేది సర్ప్రైజింగ్గా అనిపించింది. హీరో, విలన్ తదితరులని ఎంతలా మెచ్చుకున్నారో.. రాకేశ్ బేడీకి కూడా అంతకంటే ఎక్కువ ప్రశంసలు దక్కాయి.రెండు భాగాల్లోనూ అద్భుతంగా నటించి మెప్పించిన రాకేశ్ బేడీకి రూ.50 లక్షల రెమ్యునరేషన్ అని ముందే మాట్లాడుకున్నారు. అది చెల్లించేశారు కూడా. కానీ ఇప్పుడు సినిమా ఘనవిజయం సాధించడంతో దర్శకనిర్మాత ఆదిత్యధర్.. ఈయనకు అదనంగా రూ.కోటి రూపాయల చెక్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. 'ధురంధర్ 2' కలెక్షన్స్ ప్రస్తుతం రూ.1800 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: నా ఓటు టీవీకే పార్టీకే వేశా.. విజయ్ సీఎం అవుతాడు) -
చరణ్ సినిమా.. ఆదిత్య ధర్–భన్సాలీ పేర్ల హడావిడి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లైనప్‌పై బాలీవుడ్ నుంచి వరుసగా లీకులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందనే క్లారిటీ ఉండగా, తాజాగా ఆదిత్య ధర్ – సంజయ్ లీలా భన్సాలీ పేర్లు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ధురంధర్-2 వంటి సూపర్ హిట్ తర్వాత ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నాడని, అందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అయితే ఇప్పుడు చరణ్ పేరు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ – చరణ్ కాంబోపై కూడా వార్తలు వస్తున్నాయి. అటవీ నేపథ్యంలో హిస్టారికల్ అడ్వెంచర్ కథను భన్సాలీ తెరకెక్కించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. గతంలో ‘మహారాజా సుహేల్ దేవ్’ అనే ప్రాజెక్ట్‌పై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోపై చర్చ మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే దర్శకుడు సుకుమార్, చరణ్‌తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం వల్లే ఈ గాసిప్పులు ఎక్కువయ్యాయి. చరణ్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దాంతో బాలీవుడ్ వైపు నుంచి వరుసగా ఇలాంటి లీకులు వస్తున్నాయి. -
దురంధర్-2 వసూళ్లు.. 22 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 హవా ఇంకా కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా మూడు వారాలైనా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 1500 కోట్లు మార్క్ దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దురంధర్ సీక్వెల్‌గా తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే సీక్వెల్ రిలీజ్ చేశారు.ఈ మూవీ విడుదలైన 22 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1680 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే రూ.1276 కోట్లు రాబట్టగా.. ఓవర్సీస్లో దాదాపు రూ.404 కోట్లు కలెక్ట్ చేసింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ.1081 కోట్లు వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా చూస్తే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అమిర్ ఖాన్ మూవీ దంగల్ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బాహుబలి-2, పుష్ప-2 చిత్రాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరి దురంధర్-2 ఈ చిత్రాల రికార్డులు బద్దలు కొడుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. Duniya mein ek ka hi raj - DHU…RAN…DHAR 🔥⁰Day-wise break-up | IndiaWeek 1: ₹690 Cr* Week 2: ₹271 Cr* DAY 16: ₹23 Cr* DAY 17: ₹27 Cr* DAY 18: ₹30 Cr* DAY 19: ₹11 Cr* DAY 20: ₹11 Cr* DAY 21: ₹10 Cr* DAY 22: ₹8 Cr* India: ₹1081 Cr* Worldwide GBOC (3… pic.twitter.com/pw6lPwb4nV— Jio Studios (@jiostudios) April 10, 2026 -
ట్రెండింగ్‌లో 'లెజెండ్' ప్రభాస్
బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని అల్లు సినిమాలో చూశారు. ఈ క్రమంలో వారిద్దరి ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ కూడా స్పందించారు. ప్రభాస్, సందీప్ రెడ్డివంగాకు ధన్యవాదాలు తెలిపారు.ధురంధర్-2 చిత్రాన్ని చూసి మెచ్చుకున్న ప్రభాస్‌పై అదిత్య ధర్ ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ ఒక లెజెండ్ అంటూ కొనియాడారు. ఈ వ్యాఖ్యలను ఫ్యాన్స్ త్వరగా వైరల్ చేశారు. సినిమాలో ఎక్కువగా కల్పిత అంశాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటు విమర్శలు వస్తున్న సమయంలో 'ధురందర్ 2'కు మద్దతు ఇచ్చినందుకు సందీప్ రెడ్డి వంగాను కూడా ఆదిత్య ధర్ అభినందించారు. ప్రభాస్‌ను "లెజెండ్" అని సంబోధిస్తూ ధర్ చేసిన వ్యాఖ్యలు ఆన్లైన్లో సంచలనం సృష్టించాయి. అప్పటి నుండి ఈ పదం అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. 'బాహుబలి' నుండి తన ఇటీవలి ప్రాజెక్టుల వరకు, ప్రభాస్ పాన్-ఇండియా స్థాయిలో ఎవరికీ అందనంత ఆదరణను సంపాదించుకున్నారు. -
'ఎండు మిర్చి ఒక్కటే సరిపోదు.. మొత్తం తగలబెట్టేయాల్సిందే'.. సందీప్ రెడ్డి కౌంటర్
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న దురంధర్ మూవీపై టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. నిన్న రాత్రి ఈ సినిమా చూశానని.. చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. అదే సమయంలో విమర్శకులపై తన స్టైల్లో ఇచ్చిపడేశారు. రచయితలు, నటులు అనేవాళ్లు ప్రాపగండతోనే తమ కెరీర్ నిర్మించుకున్నారని.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ మాత్రం పిల్లుల్లా సైలెంట్ అయిపోయిందన్నారు.ఇప్పుడదే వర్గం దురంధర్‌ను ఎగతాళి చేస్తోందని సందీప్ రెడ్డి వంగా విమర్శించారు. మీ మొదటి ప్రవృత్తి ఎగతాళి చేయడమే అయితే.. మిమ్మల్ని మీరు ఉదారవాదులు అని పిలిపించుకోలేరని రాసుకొచ్చారు. నిజానికి ప్రాపగండ అనే ముద్ర ఎప్పుడు పడిందో తెలియదన్నారు. ఈ విషయంలో ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్‌కు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. దురంధర్ మూవీకి ఈ నల్ల దృష్టి ఇలా వెళ్లదు... గుప్పెడు మిరపకాయలతో పని జరగదు.... మొత్తం పొలం తగలబెట్టాల్సిందే అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.కాగా.. కొందరు దురంధర్ రిలీజైనప్పటి నుంచి ప్రాపగండ ముద్ర వేస్తూ విమర్శలు చేస్తున్నారు. వారికి తన ట్వీట్‌తో ఇచ్చిపడేశారు యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో స్పిరిట్ అనే మూవీ చేయనున్నారు. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. Writers & actors built careers on propaganda, and the industry stayed quiet like cats. Now the same clan mock Dhurandhar. You don’t get to call yourself liberal if your first instinct is to Mock. Don’t know when truth started getting labeled as propaganda...... strange times.…— Sandeep Reddy Vanga (@imvangasandeep) April 9, 2026 -
అశ్వత్థామగా రామ్ చరణ్.. ఆదిత్య ధర్ తో చర్చలు
-
'దురంధర్-2 స్క్రిప్ట్ కాపీ కొట్టారు'.. డైరెక్టర్‌కు బిగ్ రిలీఫ్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన దురంధర్ ది రివెంజ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. రిలీజైన వారం రోజుల్లోనే రూ.1000 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. రూ.1600 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ రెండు సినిమాలకు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.స్క్రిప్ట్ కాపీ కొట్టారు..దురంధర్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ప్రముఖ డైరెక్టర్ సంతోశ్ కుమార్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దురంధర్ స్క్రిప్ట్ తనదేనని.. ఆదిత్య ధర్ నా స్క్రిప్ట్‌ను దొంగిలించారంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ ఆదిత్య ధర్ బాంబే హైకోర్టు ఆశ్రయించారు. సంతోశ్ కమార్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. పరువు నష్టంతో పాటు, తన ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆదిత్య ధర్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సంతోశ్ కుమార్‌ను హెచ్చరించింది. ఇకపై ఆదిత్య ధర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని చిత్రనిర్మాత సంతోష్ కుమార్‌కు సూచించింది. ఇలాంటివీ పునరావృతం కాకుండా చూసుకోవాలని బాంబే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16న జరగనుంది. దీంతో ఈ కేసులో దర్శకుడు ఆదిత్య ధర్‌కు ఉపశమనం లభించింది.కాగా.. 'ధురందర్ 2' రిలీజ్ తర్వాత తన రిజిస్టర్డ్ స్క్రిప్ట్ 'డి సాహెబ్' నుండి కాపీ కొట్టారని ఫిల్మ్ మేకర్ సంతోశ్ కుమార్ ఆరోపణలు చేశారు. తన స్క్రిప్ట్ స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SWA)లో రిజిస్టర్ చేశానని సంతోశ్ తెలిపారు. ఆదిత్య ధర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో దర్శకుడు సంతోశ్ కుమార్ వ్యాఖ్యలను ఆదిత్య ధర్ తప్పుబట్టారు. ఇకపై ఇలాంటి ఆరోపణలు చేయవద్దని కోరుతూ కుమార్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. వాటికి ఆయన స్పందించకపోవడంతో దురంధర్ డైరెక్టర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పదేపదే తనపై చేస్తున్న ఆరోపణలు.. ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆదిత్య ధర్ తరఫు న్యాయవాది బీరేంద్ర సరఫ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
అల్లు అర్జున్‌కి నో చెప్పిన ఆదిత్య ధార్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ
-
ధురంధర్-2పై విరాట్ కోహ్లి రివ్యూ.. ఆశ్చర్యమంటూ దర్శకుడు పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ధరంధర్-2 చిత్రంపై టీమిండియా క్రికెటర్ కోహ్లీ, అనుష్క శర్మ స్పందించారు. ఈ క్రమంలో డైరెక్టర్ ఆదిత్య ధర్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా సినిమా చూసిన వారిద్దరూ రివ్యూ ఇచ్చారు. దీంతో వారు చేసిన పోస్ట్‌ను ఆదిత్య ధర్ షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.1600 కోట్లకు పైగానే వసూళ్లు చేసింది.ధురంధర్ 2 మూవీ తనకు మంచి అనుభూతిని ఇచ్చిందని విరాట్ దంపతులు తెలిపారు. ఈ మూవీ ఒక అద్భుతం అంటూ రివ్యూ ఇచ్చారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి అనుభవం తనకు ఎప్పుడూ కలగలేదని వారు అన్నారు. సినిమా దాదాపు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయలేకపోయానన్నారు. ప్రతి సన్నివేశం ఎంతో భావోద్వేగంతో ఉందని తెలిపారు. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరు బాగా నటించారని తెలిపిన విరాట్.. ప్రత్యేకంగా రణ్వీర్ను అభినందించారు. అతనొక శిఖరాన్ని చేరుకున్నారని కొనియాడారు. ఆపై మూవీ దర్శకుడు ఆదిత్య ధర్ ఒక జీనియస్ అంటూ మెచ్చుకున్నారు. అనుష్క శర్మ కూడా ధురంధర్‌పై అభినందనలు కురిపించారు. సినిమా అదిరిపోయిందని పోస్ట్ చేశారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే పాత్రను దక్కించుకుని, అద్భుతమైన నటనతో ప్రతిభ కనబరిచారని రణ్వీర్ను ప్రశంసించారు.అయితే, విరాట్ దంపతులు చేసిన పోస్ట్‌లపై ఆదిత్య ధర్ ధన్యవాదాలు చెబుతూ స్పందించారు. విరాట్ సినిమా చూసి అభినందించారని తెలిసి నమ్మలేకపోతున్నానంటూ తన సంతోషాన్ని వ్యక్తంచేశారు. విరాట్ మాటలు ఎంతో విలువైనవి అని ఆయన అన్నారు. తాను విరాట్‌కు వీరాభిమానిని ఆదిత్య ధర్ తెలిపారు. దేశం గర్వించేలా గ్రౌండ్లో ఆయన చేసే పోరాటం తమకు ఎంతో స్ఫూర్తి అని కొనియాడారు. అనుష్క ప్రశంసలు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
ధురంధర్: ది రివెంజ్ @ 1622 కోట్లు
‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రంగా ‘ధురంధర్: ది రివెంజ్’ నిలిచింది. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ధురంధర్’. ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ పతాకాలపై ఆదిత్యధర్, జ్యోతిదేశ్ పాండే, లోకేష్ థర్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా (ధురంధర్, ధురంధర్: ది రివెంజ్) విడుదలైంది.గత ఏడాది డిసెంబరు 5న విడుదలైన ‘ధురంధర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ ఏడాది మార్చి 19న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1622 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టిందని యూనిట్ పేర్కొంది. ఇండియాలో రూ.1228 కోట్లు, ఓవర్సీలో రూ.394 కోట్లు తమ సినిమాకు వచ్చాయని ‘ఎక్స్’ వేదికగా జియో స్టూడియోస్ సంస్థ తెలిపింది.ఇండియాలో రూ.1041 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయని, ఇక్కడ వెయ్యికోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించిన రికార్డును ‘ధురంధర్: ది రివెంజ్’ క్రియేట్ చేసిందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవలే నార్త్ అమెరికాలో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ వసూళ్ల రికార్డును అధిగమించిన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా తాజాగా నార్త్ అమెరికాలో పాతిక మిలియన్ డాలర్లు(దాదాపు 232 కోట్లు) సాధించి, అక్కడ అత్యధిక కలెక్షన్స్‌ను సాధించిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచిందని మేకర్స్ పేర్కొన్నారు. అలాగే జర్మనీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వన్ మిలియన్ యూరోలు సాధించి సత్తా చాటింది. -
'అశ్వత్థామ'గా రామ్‌చరణ్.. ఆదిత్య ధర్‌తో చర్చలు?
బాలీవుడ్లో రాబోయే భారీ ప్రాజెక్టులపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్’తో బిగ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు ఆదిత్య ధర్. కొంతకాలం క్రితం ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే కథను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో జియో స్టూడియోస్‌తో ఒప్పందం కుదుర్చుకుని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. అయితే ఆ సమయంలో కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఆ ప్రాజెక్టుకు రామ్‌చరణ్ పేరు బలంగా వినిపించింది. అప్పుడే ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో ఆయనపై బాలీవుడ్ దృష్టి పడింది. అశ్వత్థామ పాత్రకు చరణ్ సరైన ఎంపిక అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ కథపై చర్చలు మొదలయ్యాయి. దానికి కారణం.. ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ. ధురంధర్ చిత్రం రెండు భాగాలతో భారీ విజయాన్ని సాధించిన ఆదిత్య ధర్‌పై నిర్మాణ సంస్థలు నమ్మకం పెంచుకున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మెగా ఫ్యాన్స్ మాత్రం అప్పటి పుకారు ఇప్పుడు నిజమవ్వాలని కోరుకుంటున్నారు. రామ్‌చరణ్ ఈ ప్రాజెక్టులో భాగమైతే, బాలీవుడ్లో మరో భారీ అడుగు వేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. -
ధురంధర్ పై కాపీ ఆరోపణలు.. నా స్టోరీనే అంటోన్న కన్నడ డైరెక్టర్
-
సోషల్ మీడియాలో ధురంధర్-3.. కథ-స్క్రీన్ ప్లే రెడీ
గత నెల రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్-2 దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగం (ధురంధర్-2) ఎలా ముగిసిందో సినిమా చూసిన వాళ్లందరికీ తెలిసే ఉంటుంది. భార్య, కొడుకును వదిలి ఇండియా వచ్చేస్తాడు హీరో. ఆ తర్వాత ‘RAW’ కనుసన్నల నుంచి తప్పించుకొని నేరుగా తన ఇంటికి వెళ్తాడు. అయితే దూరం నుంచే తన తల్లిని, చెల్లిని చూసి తిరిగి వెనుదిరుగుతాడు. ఇలా సాగిన ధురంధర్-2 క్లయిమాక్స్ నుంచి ధురంధర్-3 కథను అల్లేస్తున్నారు సోషల్ మీడియాలోని కొంతమంది జనం. అయితే హీరో మరోసారి రా ఏజెంట్‌గా పాకిస్థాన్‌లో అడుగుపెడతాడని, కొత్త గెటప్‌లో పాకిస్టాన్‌లో మరోసారి అడుగుపెట్టి తన భార్య, కొడుకును కలుస్తాడంటూ ఎవరికివారు కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా అల్లేస్తున్నారు. ఇలా ధురంధర్ ఫ్రాంచైజీపై ఓ కొత్త చర్చ జరుగుతోంది. అయితే నిజానికి ధురంధర్-3పై దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల ఇదే ప్రశ్న ఆదిత్య ధర్కి ఎదురైంది. దానికి 'ఏమో చెప్పలేం' అన్నట్టు మాత్రమే ఆయన స్పందించాడు. అంతేకానీ ధురంధర్-3 తప్పకుండా తీస్తానని ఆదిత్య ధర్ అనలేదు.కానీ సోషల్ మీడియాలో వస్తున్న కథలని నిజానికి ఓసారి పరిశీలిస్తే ఈ దర్శకుడికి కచ్చితంగా పార్ట్-3కి ఓ లైన్ దొరికే అవకాశం ఉందనే అంటున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. -
థియేటర్లలోకి ఏడున్నర గంటల 'ధురంధర్'
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'ధురంధర్' హవా నడుస్తోంది. దక్షిణాదిలోని తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ఇదలా ఉండగానే మూవీ టీమ్ మరో సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. రెండు భాగాలని కలిపి ఒక్కటిగా చేసి ఆ సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఈ మేరకు ఆ విషయం వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: దురంధర్-2 కలెక్షన్స్.. తెలుగులోనే ఎందుకిలా?)దాదాపు మూడున్నర గంటల నిడివితో 'ధురంధర్' తొలి భాగం గతేడాది డిసెంబరులో రిలీజైంది. రూ.1300 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకుంది. అప్పుడే సీక్వెల్ ఎప్పుడొస్తుందో వెల్లడించారు. చెప్పినట్లుగానే రెండు వారాల క్రితం ధురంధర్ 2ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇది 3 గంటల 50 నిమిషాల నిడివితో రిలీజ్ చేశారు. దీనికి బీభత్సమైన హైప్ ఉన్నప్పటికీ వాటిని అందుకుని, సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. చూస్తుంటే బాహుబలి 2, పుష్ప 2 నెలకొల్పిన ఘనతలు గల్లంతు అయిపోయేలానే ఉన్నాయి.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఇదలా ఉండగానే ఇప్పుడు డైరెక్టర్స్ కట్ పేరిట 'ధురంధర్' చిత్రాన్ని ఏడున్నర గంటల నిడివితో థియేటర్లలోకి తీసుకురాబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది. మంగళవారం(మార్చి 31)న ఈ మేరకు సదరు భారీ నిడివి మూవీకి సెన్సార్ జరిగినట్లు ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 5 నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఐమాక్స్, DC, HDR, EPIQ వంటి ప్రీమియం స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.సుధీర్ఘ నిడివితో రాబోతున్న ఈ సినిమాలో దర్శకుడు తీసిన ప్రతి సీన్ ఉండనుందని, సెన్సార్‌లో తొలగించిన కొన్ని అదనపు సన్నివేశాలు కూడా ఉండనున్నట్లు సమాచారం. నేడో రేపో నిర్మాణ సంస్థ నుంచి ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఏడున్నర గంటల నిడివితో రిలీజైనా కనీసం మూడు ఇంటర్వెల్స్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రేక్షకులు కూడా అంత ఓపికతో చూస్తారా అనేది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ఒకవేళ ఇది నిజమై, థియేటర్లలోకి వస్తే మాత్రం అత్యంత సుధీర్ఘ నిడివితో వచ్చే చిత్రంగా రికార్డ్ సృష్టించడం గ్యారంటీ.(ఇదీ చదవండి: 9 ఏళ్ల ‘బాహుబలి’ రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’) -
దురంధర్-2ను వదలని పైరసీ.. యూట్యూబ్‌లో ప్రింట్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈనెల 19న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే దురంధర్ వసూళ్లను క్రాస్ చేసింది. కేవలం 11 రోజుల్లోనే రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజ్ కావడంతో రెండు వేల కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాకిస్తాన్‌కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా తెరకెక్కించారు.బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న ఈ చిత్రానికి పైరసీ గండం తప్పింది. అయితే పైరసీ కేటుగాళ్లు ఈ మూవీని యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఇది గమనించిన దురంధర్ అభిమానులు వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై వెంటనే అప్రమత్తమై దురంధర్ టీమ్ పైరసీ కంటెంట్‌ను తొలగించాలని యూట్యూబ్‌ను కోరింది. దీంతో వెంటనే స్పందించిన యూట్యూబ్ ఆ వీడియోను తొలగించింది. త్వరగా రెస్పాండ్ కావడంతో పైరసీ గండం నుంచి తప్పించుకున్నారు మేకర్స్. లేకపోతే దురంధర్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడేదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పైరసీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సోషల్ మీడియాలో ఆదిత్య ధర్‌ను ట్యాగ్ చేశారు.కాగా.. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీలో అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. -
ధురంధర్ ను ఫాలో అవుతున్న టాలీవుడ్ దర్శకుడు
-
ధురంధర్- 2లో దర్శకుడి సతీమణి.. అండర్ కవర్ ఏజెంట్‌గా ఎంట్రీ
రణవీర్ సింగ్- దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ధురంధర్-2.. గతేడాది విడుదలైన పార్ట్-1కు సీక్వెల్‌గా తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. అయితే, దర్శకుడు ఆదిత్య ధర్ సతీమణి యామీ గౌతమ్ తాజాగా ఈ మూవీని చూశారు. ఇందులో ఆమె అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తన సోదరితో రహస్యంగా ప్రేక్షకులతో పాటుగా మూవీని చూశారు.గౌరవం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యామీ గౌతమ్.. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో భారీగా పాపులర్ అయింది. దర్శకుడు ఆదిత్య ధర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది. 'ఉరి' మూవీ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో ఇది రెండో చిత్రం కావడం విశేషం.ధురంధర్-2లో యామీ గౌతమ్ నర్స్ కమ్ అండర్ కవర్ ఏజెంట్ 'షాజియా బానో'గా నటించారు. తెరపై ఆమె కనిపించగానే కాస్త సిగ్గుగా చూస్తూ, చిరునవ్వుతో నిశ్శబ్దంగా ఉండమని తన సోదరి సురిలీ గౌతమ్‌ని సైగ చేసింది. ఈ ముచ్చటైన క్షణాన్ని సురిలీ కెమెరాతో వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో "మూవీ టైమ్" అనే క్యాప్షన్‌తో అప్లోడ్ చేసింది. ఆ క్లిప్‌లో 'ధురందర్ 2'లో నర్సుగా యామీ చేసిన అతిథి పాత్రను చూపిస్తుంది. ఆ తర్వాత ఆమె కెమెరాను ఆ నటి వైపు తిప్పుతుంది. థియేటర్లో ఆ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు యామీ నవ్వుతూ, సిగ్గుపడుతూ కనిపించింది. ఆ తర్వాత ఆమె తన సోదరిని నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసింది. Yami Gautam blushing watching herself on *Dhurandhar* screen , how cute!❤️❤️❤️Yami Gautam Dhar ☆ Aditya Dhar #Dhurandhar2TheRevenge https://t.co/L0Zoy6GQ9K pic.twitter.com/mEh2vvlgtl— JyotiKarma🚩🇮🇳 (@JyotiKarma7) March 27, 2026Spotted! ❤️ Yami Gautam enjoying #Dhurandhar2 like a true fan in a packed theatre—supporting hubby Aditya Dhar & even cheering her own cameo! 🔥 #DhurandharTheRevenge pic.twitter.com/2b0sXIGRnk— Smita Patil (@patil45802) March 27, 2026 -
ఆదిత్య ధర్‌కు పాకిస్తాన్ ప్రజల వింత డిమాండ్
రణ్వీర్ సింగ్- ఆదిత్యధర్ కాంబినేషన్ సినిమా ‘ధురంధర్2’ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. గతేడాది విడుదలైన ‘ధురంధర్-1’ సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. అయితే, ఈ కలెక్షన్స్ గురించి పాక్స్తాన్లోని ల్యారీ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశంపై ఒక వీడియో వైరల్ అవుతుంది.ధురంధర్-2 కలెక్షన్స్‌పై నెటిజన్లకు నవ్వు పుట్టించేలా ఈ వీడియో ఆసక్తిగా ఉంది. ఈ మూవీలో ఎక్కువగా కరాచీలోని ల్యారీ ప్రాంత నివాసుల జీవితం గురించి చూపించారు. ఇప్పుడు ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో అక్కడి ప్రజలు సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. ధురంధర్-2 రూ. 1000 కోట్లు వసూలు చేసింది కాబట్టి, దర్శకుడు ఆదిత్య ధర్ అందులో నుంచి రూ. 500 కోట్లు తిరిగి తమకు ఇచ్చేయాలని, ఆ డబ్బుతో తమ ల్యారీ ప్రాంతంలో మంచి రోడ్లు నిర్మించుకుంటామని వారు కోరడం విశేషం.ఎంతో చమత్కారంగా ఉన్న ఈ వ్యాఖ్యలు నెటిజన్ల మనసులను తాకింది. దీంతో వారు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ల్యారీ ప్రజల నిజ జీవిత సమస్యలను సినిమాలో చాలా చక్కగా చూపించారని కూడా వారు అంటున్నారు. తమ జీవితాలు ఎలా ఉంటాయో ఈ మూవీ ద్వారా ప్రపంచానికి చూపించారని దర్శకుడిపై వారు ప్రశంసలు కూడా కురిపించడం విశేషం.Pakistani delulu aawam is saying that Aditya Dhar will earn 1000 Crore from #Dhurandhar2TheRevenge , he should return back 500 crore to Lyari because we don't have good roads here 😭😭😭😂😂😂😂 pic.twitter.com/kBdtGYvPla— Chota Don (@choga_don) March 27, 2026 -
'ధురంధర్ 2'.. టాలీవుడ్ ఏం నేర్చుకోవాలి?
'ధురంధర్ 2' వచ్చింది. దేశంలో ప్రతిచోట బాక్సాఫీస్ కళకళలాడిపోయేలా చేస్తోంది. ఇప్పటికే రూ.1000 కోట్ల కలెక్షన్స్‌కి చేరువలో ఉంది. కొన్ని సినిమాలు కేవలం వచ్చి వెళ్లడం మాత్రమే కాదు. ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేస్తాయి. 'ధురంధర్ 2' ఆ రేంజ్ మూవీలానే అనిపిస్తోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో అన్ని ఇండస్ట్రీలపై దీని ప్రభావం గట్టిగానే ఉండబోతుందనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' కోసం రణవీర్ సింగ్ ఆరు వారాల్లోనే)ఎందుకంటే ఏదైనా సినిమా హిట్టయి, వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తే చాలు.. టాలీవుడ్లో కావొచ్చు బాలీవుడ్లో కావొచ్చు అదే తరహాలో మూవీస్ తీసే ప్రయత్నం చేస్తుంటారు. రాబోయే కొన్నేళ్లలో 'ధురంధర్' తరహా మూవీస్ ఎక్కువగా రావడం గ్యారంటీ. గతంలో బాహుబలి, కేజీఎఫ్ వచ్చినప్పుడు ఇలానే చాలామంది డైరెక్టర్స్ వాటిని అనుకరించి సినిమాలు తీశారు. అడ్డంగా బోల్తా కొట్టారు. టాలీవుడ్, 'ధురంధర్' మాయలో పడకపోతేనే బెటర్. లేదు మేం కూడా ఇలాంటి మూవీసే తీస్తాం, హిట్ కొడతాం అనుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది.టాలీవుడ్లో చాలామంది దర్శకులు.. స్టోరీ కంటే హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వాలి, అవసరం లేకపోయినా కామెడీ పెట్టాలి, ఐటమ్ సాంగ్స్ ఇరికించాలి అనే ఆలోచనలతోనే ఉంటారు. ఇలాంటివన్నీ చూసి బోర్ కొట్టడం వల్లే 'ధురంధర్'కి అదే తెలుగు ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. కాబట్టి 'ధురంధర్' లాంటి సినిమాలు తీయాలంటే హీరోలని అనుకుని స్టోరీలు రాయడం కాకుండా స్టోరీ రాసి, దానికి తగ్గ నటీనటుల్ని వెతుక్కోవాలి. అప్పుడే సరైన ఫలితం దక్కే అవకాశముంటుంది.ఏదైనా సినిమాకు సీక్వెల్ అంటే చాలు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాలనేలా టాలీవుడ్‌ని భ్రష్టుపట్టించారు. ఆ ట్రెండ్ బ్రేక్ చేసిన ఆదిత్య ధర్.. తొలి పార్ట్ వచ్చిన మూడంటే మూడు నెలల్లో సీక్వెల్ తీసుకొచ్చాడు. ప్రేక్షకుల అంచనాలని అందుకోవడమే కాదు వాటిని దాటేసి మెప్పించాడు. ఒకవేళ తెలుగులో ఈ తరహా ప్రయత్నాలు ఎవరైనా చేద్దామనుకుంటే ఇదే ట్రెండ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.టాలీవుడ్లో ఉన్న ఇంకో సమస్య టికెట్ రేట్స్. సినిమాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టికెట్ ధరలు పెంచేయాలని తాపత్రయపడుతుంటారు. దీని కారణంగానే థియేటర్లకు వచ్చే చాలామంది ప్రేక్షకులని ఓటీటీలు, పైరసీలకు అలవాటు పడేలా చేశారు. ఈ విషయంలో 'ధురంధర్' టీమ్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. తొలి పార్ట్ గానీ రెండో పార్ట్‌కి గానీ టికెట్ రేట్లు పెంచలేదు. ఆయా థియేటర్ లేదా మల్టీప్లెక్స్‌ల్లో ఎంత రేటు అయితే ఉందో దానితోనే సినిమా చూసే అవకాశం కల్పించారు. ఇలా చేయడం వల్లే అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. టాలీవుడ్ దీన్నిచూసి చాలా నేర్చుకోవాలి.'ధురంధర్' రెండు భాగాలని కలిపి రూ.300 కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌తోనే పూర్తి చేశారని టాక్. ఈ విషయంలో టాలీవుడ్ ఎంత నేర్చుకుంటే అంత బెటర్. స్టార్ హీరోలకు వందల కోట్లు గుమ్మరించడం లాంటివి కాకుండా కంటెంట్‌కి ఏం కావాలి? దేనికి ఎంత ఖర్చుపెట్టాలి అనే విషయాలపై కాస్త దృష్టిపెట్టాలి అప్పుడే తెలుగు ఇండస్ట్రీలో కొంతైనా మార్పు వస్తుంది. లేదు మేం ఇలానే రొటీన్, మూస స్టోరీలు తీస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రేక్షకులు అలాంటి వాటిని చూడటం మానేశారు. మానేస్తున్నారు. నిర్మాతలు ఈ విషయం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత బెటర్.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'అవతార్ 3' సినిమా) -
ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్
-
ధురంధర్ 2పై తలైవా రివ్యూ.. సంతోషంలో డైరెక్టర్
గత ఆరునెలలుగా బాక్సాఫీస్ వద్ద ధురంధర్ పేరు మారుమోగిపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 1 ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. మూడు నెలలు కూడా తిరగకముందే దర్శకుడు ఆదిత్య ధర్ దానికి సీక్వెల్ తీసుకొచ్చాడు. మార్చి 19న ధురంధర్: ది రివేంజ్ విడుదలైంది. ఈ సినిమాపై నార్త్ నుంచి సౌత్ వరకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తలైవా రివ్యూతాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ ధురంధర్ 2 చూసి రివ్యూ ఇచ్చాడు. ఆదిత్య ధర్‌ను బాక్సాఫీస్ కా బాప్ అని అభివర్ణించాడు. రణ్వీర్ సహా చిత్రయూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రమని ఎక్స్ (ట్విటర్)లో కితాబిచ్చాడు. తలైవా పోస్ట్‌పై దర్శకుడు ఆదిత్య ధర్ సంతోషం వ్యక్తం చేశాడు. గర్వంగా ఉందిసర్, వినోదం అనే పదానికి మిమ్మల్నే బెంచ్‌మార్క్‌గా చూస్తూ పెరిగాం. ఎన్నో దశాబ్దాలుగా మీరు మమ్మల్ని ఏడిపించారు, నవ్వించారు, విజిల్స్ కొట్టేలా చేశారు. ఇప్పటికీ అదే గ్రేస్, స్వాగ్తో మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు. అలాంటి మీరు ధురంధర్ 2 తప్పక చూడాల్సిన మూవీ అని చెప్పడం నా జీవితంలో అతిపెద్ద సూపర్‌స్టార్ మూమెంట్‌గా అనిపిస్తోంది. పెద్ద కలలను కనమని ప్రోత్సహించిన వ్యక్తి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది. ఎంతో గర్వంగా ఉంది సర్. మీ మాటలు నా మనసును తాకాయి అని ఆదిత్య ధర్ రాసుకొచ్చాడు. Sir, we’ve all grown up measuring “entertainment” with just one benchmark, YOU. ❤️⁰Making us whistle, laugh, cry and feel larger than life for decades and still doing it with the same swag and grace, that’s pure magic.So for you to call Dhurandhar 2 a “must watch” feels like…— Aditya Dhar (@AdityaDharFilms) March 23, 2026 చదవండి: బ్యాండ్‌మేళం కోసం ఆస్తులమ్ముకున్న కోన వెంకట్.. నేనైతే ఆ పనిచేయను: బండ్ల గణేశ్ -
'ధురంధర్ 2'.. ఇంత పొరపాటు ఎలా చేశారు?
ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' హవా కనిపిస్తోంది. పేరుకే హిందీ సినిమా అయినప్పటికీ డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తోంది. దీని ప్రభావమో ఏమో గానీ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్స్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయాయి. అయితే 'ధురంధర్ 2' చూసి చాలామంది ఎంజాయ్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రొపగాండా మూవీ అని విమర్శిస్తున్నారు. వీటి సంగతి కాసేపు పక్కనబెడితే మూవీలో ఓ పొరపాటు మాత్రం అలానే వదిలేశారు. దీన్ని ఇప్పుడు నెటిజన్లు కనిపెట్టారు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)గతేడాది డిసెంబరులో 'ధురంధర్' తొలి భాగం రిలీజ్ కాగా.. ఈ శుక్రవారం(మార్చి 19) సీక్వెల్ విడుదలైంది. ప్రమోషన్స్ ఏం లేకపోయేసరికి వాయిదా పడుతుందేమో అని చాలామంది అనుకున్నారు. కానీ చెప్పిన తేదీకే థియేటర్లలోకి వచ్చారు. కాకపోతే తెలుగు వెర్షన్ మాత్రం రెండు రోజులు ఆలస్యంగా అంటే నిన్నటి(మార్చి 21) నుంచి అందుబాటులోకి తెచ్చారు.అసలు విషయానికొస్తే ఈ మూవీ ఇంటర్వెల్ సీన్లో హీరో, పిండా అనే పాత్రధారి మధ్య బాత్రూమ్లో చిన్నపాటి ఫైట్ సీన్ జరుగుతుంది. మూవీలో ఈ సన్నివేశం చాలామందికి ఆకట్టుకున్నప్పటికీ.. అద్దంలో కెమెరామ్యాన్ కూడా కనిపిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విటర్లో వైరల్ అవుతోంది. ఈ పొరపాటు అసలు మేకర్స్ చూసుకోలేదా అని మాట్లాడుకుంటున్నారు. అయితే చెప్పిన తేదీన రిలీజ్ చేయాలనే హడావుడిలో దీన్ని మర్చిపోయింటారేమో అని మాట్లాడుకుంటున్నారు.'ధురంధర్ 2' కలెక్షన్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం రూ.500 కోట్ల మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. అలానే ఓవర్సీస్లోనూ 16 మిలియన్ డాలర్లు సాధించినట్లు టాక్. తొలి భాగంలానే ఇది కూడా లాంగ్ రన్లో మరిన్ని వందల కోట్లు సొంతం చేసుకునేలా కనిపిస్తుంది. మరి 'ధురంధర్ 2' రచ్చ.. ఎన్ని వందల కోట్ల దగ్గర ఆగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు)A Cameraman showing in this scene.Peak Detailing by Aditya Dhar Damm 🤣#Dhurandhar2 #DhurandherTheRevenge pic.twitter.com/LDjDG8nReP— Sunil Goriya (@Sunil_Goriya) March 21, 2026 -
దురంధర్-2లో టీమిండియా క్రికెటర్స్.. ఈ వీడియో చూశారా?
ఇప్పుడు ఎక్కడ చూసినా దురంధర్ ఫీవర్ కనిపిస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే వసూళ్లు సునామీ మొదలెట్టిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటేసింది. ఆదిత్య ధర డైరెక్షన్లో వచ్చిన ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదలైంది. ఈ మూవీపై టాలీవుడ్ స్టార్స్‌తో పాటు పలువురు సినీ నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం దురంధర్-2 మూవీని పొగిడారు.దురంధర్-2 రిలీజ్ వేళ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తోంది. దురంధర్-2 మూవీపై రీల్స్, వీడియోలు పెద్దఎత్తున వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో టీమిండియా క్రికెటర్స్ నటిస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఓ వీడియోను రూపొందించారు. రణ్‌వీర్‌సింగ్ పాత్రలో విరాట్ కోహ్లీ కనిపించగా.. జమీల్ జమాలీ పాత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ఉండేలా క్రియేట్ చేశారు. ఈ వీడియో చేసిన ఫన్నీ కోసమే అయినా.. క్రికెటర్స్ ఈ మూవీలో ఎలా కనిపిస్తారో చూస్తే మాత్రం అద్భుతంగా అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి. pic.twitter.com/GalcyV6WIe ఇండియన్ క్రికెటర్లు దురంధర్‌లో నటిస్తే? 💀🔥— Tupaki (@tupaki_official) March 21, 2026 -
క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు
'డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను'.. ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ మాట వినిపిస్తూ ఉంటుంది. నటుడు లేదా దర్శకుడు అవ్వాలని ఆలోచనతో ఇండస్ట్రీలో అడుగుపెట్టేవాళ్లు కొందరైతే.. అనుకోని విధంగా ఇక్కడొచ్చి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకునేవాళ్లు మరికొందరు. అలాంటి వాళ్లలో 'ధురంధర్' డైరెక్టర్ ఆదిత్య ధర్ ఒకడు. క్రికెటర్ కావాల్సిన ఇతడు పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడు. అసలు ఆదిత్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)ఢిల్లీలో పుట్టిన ఆదిత్య ధర్, కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన కుర్రాడు. టీమిండియాకి ఎలాగైనా ఆడాలని అనుకునేవాడు. అందుకు తగ్గట్లే ఢిల్లీ అండర్-19 టీమ్ తరఫున కూడా ఆడేవాడు. అయితే 2002లోని భారత అండర్-19 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. క్రికెట్లోని రాజకీయాలే దీనికి కారణమని భావించి తను ఎంతగానే నమ్మిన క్రికెట్‌ని పక్కనబెట్టేశాడు. రైటర్‌గా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలుత 2006లో వచ్చిన కాబుల్ ఎక్స్‌ప్రెస్ పాటల రచయితగా పనిచేశాడు. తర్వాత హల్ ఏ దిల్, ఆక్రోష్, తేజ్ తదితర చిత్రాలకు కూడా రచయితగా చేశాడు. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దగ్గర సహాయకుడిగానూ వర్క్ చేశాడు. అయితే 2019లో వచ్చిన 'ఉరి' ఇతడిని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసిపడేసింది. ఇదే దర్శకుడిగా తొలి చిత్రం. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు దేశవ్యాప్తంగా ఆదిత్య పేరు మార్మోగిపోయేలా చేసింది. ఈ మూవీలో 'హౌ ఈజ్ ద జోష్' డైలాగ్ అయితే తెగ వైరల్ అయిపోయింది. ఇదే చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డ్ కూడా తొలి సినిమాకే సొంతం చేసుకున్నాడు.ఇక అదే ఏడాది తన సోదరుడితో కలిసి బీ62 స్టూడియోస్ స్థాపించిన ఆదిత్య ధర్.. తన భార్య, నటి యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆర్టికల్ 370'ని నిర్మించి, రచయితగానూ పనిచేసి హిట్ కొట్టాడు. తొలి మూవీ వచ్చిన దాదాపు ఆరేళ్లకు అంటే గతేడాది డిసెంబరులో 'ధురంధర్'తో వచ్చాడు. సర్ప్రైజింగ్ హిట్ కొట్టాడు. 50 రోజులకు పైనే ఇది థియేటర్లలో ప్రదర్శితమైంది. రెండు రోజుల క్రితం రిలీజైన ధురంధర్ 2 అయితే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. వందల కోట్ల వసూళ్లు సాధిస్తోంది. క్రికెటర్ కావాల్సిన వాడు ఇప్పుడు బాక్సాఫీస్ మొనగాడు అయిపోయాడు.ఆదిత్య తల్లి సునీత ధర్.. ఢిల్లీ యూనివర్సిటీలో డీన్‌గా పనిచేయగా, తండ్రి గురించిన సమాచారం అయితే దొరకలేదు. 'ఉరి' తీస్తున్న టైంలోనే అందులో నటించిన యామీ గౌతమ్‌తో ప్రేమలో పడ్డ ఆదిత్య.. 2021లో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. 2024లో వీళ్లకు కొడుకు పుట్టాడు. ప్రస్తుతం 'ధురంధర్ 2' విజయాన్ని ఈ భార్యభర్తలిద్దరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా మూడంటే మూడే సినిమాలు తీసి దేశవ్యాప్తంగా అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేయడం విశేషం.(ఇదీ చదవండి: డూప్, VFX కాదు.. నిజంగా ధురంధర్ హీరోనే!) -
తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?
ప్రస్తుతం దేశంలో 'ధురంధర్ 2' గురించి చర్చ గట్టిగానే నడుస్తోంది. సీక్వెల్ అయిన ఈ చిత్రం.. రెండు రోజుల క్రితం ప్రీమియర్లతో థియేటర్లోకి వచ్చింది. రిలీజ్‌కి ముందు బీభత్సమైన హైప్ ఏర్పడింది. దర్శకుడు ఆదిత్య ధర్ దాన్ని నిలబెట్టుకున్నాడు. 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఏ మాత్రం బోర్ కొట్టకుండా మ్యాజిక్ చేశాడు. ఈ చిత్రానికి మూడో భాగం ఉంటుందనే రూమర్ కొన్నిరోజుల ముందు వరకు వినిపించింది. కానీ 'ధురంధర్ 2' రిలీజైన తర్వాత అలాంటిదేం లేదని అందరికీ క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు)అయితే 'ధురంధర్' ఫ్రాంచైజీని పూర్తి చేసిన దర్శకుడు ఆదిత్య ధర్.. తర్వాత ఏ సినిమా చేస్తాడు? ఎవరితో చేస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. కొన్నాళ్ల క్రితం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'అశ్వద్ధామ' గురించి అల్లు అర్జున్‌తో ఆదిత్య చర్చలు జరిపాడనే టాక్ బయటకొచ్చింది. తర్వాత దీని అప్డేట్ ఏం లేదు. అయితే 'ధురంధర్ 2' ప్రీమియర్ చూసిన వెంటనే అల్లు అర్జున్.. సినిమాని పొగుడుతూ ట్వీట్ చేయడం, ఆదిత్యని ఆకాశానికెత్తేయడం చూస్తుంటే త్వరలో కలిసి పనిచేస్తారా అనే సందేహం వస్తోంది.ఇందులో అల్లు అర్జున్ మెయిన్ హీరో అయినప్పటికీ ఎన్టీఆర్ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తాడని రూమర్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం టాలీవుడ్లో వచ్చే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇది నిజమా కాదా అనేది తెలియడానికైనా మరికొన్నేళ్లు పట్టొచ్చు. ఎందుకంటే 2019లో 'ఉరి' రిలీజ్ చేసిన ఆదిత్య ధర్.. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత 'ధురంధర్' రెండు భాగాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి తర్వాత మూవీ ఎన్నేళ్లకు వస్తుందనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్.ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో చూసుకుంటే 'పుష్ప'తో బన్నీ, 'ఆర్ఆర్ఆర్' తారక్ రేంజ్ చాలా పెరిగింది. ప్రస్తుతం వీళ్లు చేస్తున్న ప్రాజెక్టుల స్పాన్ కూడా పెద్దదే. ఒకవేళ కాలం కలిసొచ్చి ఆదిత్య.. అల్లు అర్జున్-ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ తీస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ గ్యారంటీ.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?
తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్. 'ధురంధర్ 2' మేకర్స్ హ్యాండ్ ఇచ్చేశారు. రిలీజ్ నాడు పడాల్సిన తెలుగు వెర్షన్ షోలన్నీ రద్దయిపోయాయి. ఈ మేరకు టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ మెసేజులు వెళ్తున్నాయి. టికెట్ డబ్బులని తిరిగి ఇచ్చేస్తామని అందులో పేర్కొన్నారు. ఇంతకీ అసలేం జరుగుతోంది? తెలుగు షోలు ఎప్పటి నుంచి ఉండొచ్చు?(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)గతేడాది డిసెంబరు తొలివారంలో వచ్చిన 'ధురంధర్'.. 50 రోజులకు పైనే థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైంది. తర్వాత ఓటీటీలోకి వస్తే అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తొలి పార్ట్ రిలీజైనప్పుడే సీక్వెల్.. మార్చి 19న థియేటర్లలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ కూడా ఈసారి ఉంటాయని మాటిచ్చారు. కానీ ఇప్పుడది తప్పారు.18వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి తెలుగు షోలు ఉంటాయని చెప్పినప్పటికీ వాటిని రద్దు చేశారు. ఈ క్రమంలోనే దర్శకుడు ఆదిత్య ధర్.. రాత్రి 9 గంటల నుంచి ఉంటాయని పోస్ట్ పెట్టాడు. రాత్రి సంగతి పక్కనబెడితే తర్వాత అంటే 19వ తేదీ అయిన ఈ రోజు కూడా హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్ షోలు రద్దయ్యాయి. డబ్బింగ్ ఇంకా పూర్తిగా జరగకపోవడం, చివరి నిమిషంలో హడావుడి లాంటివి సమస్యలుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి బుక్ మై షోలో 20వ తేదీకి తెలుగు షోలు ఉన్నప్పటికీ.. అవి అయినా వేస్తారా లేదా అనేది సందేహమే?'ధురంధర్ 2' విషయానికొస్తే.. రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు.అసలు భారత్‌పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. సహనానికి పరీక్ష) -
టాలీవుడ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తెలుగులోనూ ప్రీమియర్స్
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా దురంధర్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్ పడగా.. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇవాళ సాయంత్రం కేవలం హిందీలో మాత్రమే ప్రీమియర్స్ ప్రదర్శించారు. అయితే తెలుగు ఆడియన్స్ కూడా ప్రీమియర్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దురంధర్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.ఈ రోజు రాత్రి 9 గంటల నుంచే తెలుగుతో పాటు తమిళంలోనూ ప్రీమియర్స్ ప్రారంభం అవుతాయని ప్రకటించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆదిత్య ధర్ వెల్లడించారు. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం రేపటి నుంచి మాత్రమే ప్రదర్శిస్తామని తెలిపారు. సాంకేతిక సమస్యల వల్లే ప్రీమియర్స్ ఆలస్యమైనట్లు పేర్కొన్నారు.గతేడాది రిలీజైన దురంధర్ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో సీక్వెల్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. -
'ధురంధర్ 2' రెమ్యునరేషన్ డీటైల్స్.. ఎవరికి ఎన్ని కోట్లు?
స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ట్రెండ్ సెట్ చేసిన 'ధురంధర్' నుంచి ఇప్పుడు సీక్వెల్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రింట్స్ టైంకి రాకపోవడంతో తెలుగు వెర్షన్ ప్రీమియర్స్ మాత్రం రద్దయ్యాయి. గురువారం ఉదయం నుంచి తెలుగు షోలు యధావిధిగా స్క్రీనింగ్ కానున్నాయి. ఇప్పటికైతే మూవీపై ఓ రేంజ్ బజ్ ఉంది. దానికి తోడు దర్శకుడు కూడా చివరివరకు కూర్చోండి, ట్విస్టులు బయటపెట్టొద్దని చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. మరోవైపు సీక్వెల్ కోసం నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)మిగతా పాన్ ఇండియా సినిమాల్లా 'ధురంధర్' రెండు భాగాల షూటింగ్స్ వేర్వేరుగా చేయలేదు. మొత్తం ఒకేసారి కలిపి తీసేశారు. గత నెలలో ప్యాచ్ వర్క్స్ లాంటివి చేశారు. అయితే రెండు భాగాలకు కలిపి నటీనటులకు ఒకేసారి రెమ్యునరేషన్స్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. హమ్జా అలీ, జస్కీరాత్ సింగ్ అనే రెండు పాత్రలు చేసిన రణ్వీర్ సింగ్‌కి అత్యధికంగా రూ.40-50 కోట్ల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.రణ్వీర్ కంటే ఎక్కువగా మూవీలో హైలైట్ అయింది అక్షయ్ ఖన్నా చేసిన రహమాన్ డకాయిట్ పాత్ర. తొలి భాగంలోనే రహమాన్ రోల్ ముగిసింది. కానీ సీక్వెల్లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఈ పాత్ర కనిపించనుందట. మొత్తంగా దీనికోసం అక్షయ్ ఖన్నాకు రూ.5 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.ఎస్పీ అస్లాం చౌదరిగా అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన సంజయ్ దత్.. మొత్తంగా రూ.10 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడట. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ పాత్ర చేసినందుకుగానూ మాధవన్కి రూ.9 కోట్లు, మేజర్ ఇక్బాల్ అనే విలనీ పాత్రలో నటించిన అర్జున్ రాంపాల్, హీరోయిన్గా చేసిన సారా అర్జున్ తలో రూ.కోటి రెమ్యునరేషన్‌గా అందుకున్నారట. ఇక దర్శకుడు, నిర్మాత అయిన ఆదిత్య ధర్ పారితోషికం గురించి అయితే ఎక్కడా వివరాలు లేవు. కానీ ఈ మూవీ వల్ల ఆదిత్య ధర్ బ్రాండ్ ఇమేజ్ చాలా పెరిగిపోయింది. తర్వాత చేయబోయే చిత్రం ఏంటో తెలియనప్పటికీ.. ఒకవేళ ఏ నిర్మాత అప్రోచ్ అయినా సరే భారీ రెమ్యునరేషన్ అయితే డిమాండ్ చేయడం గ్యారంటీ.'ధురంధర్' విషయానికొస్తే.. మన దేశంపై పాకిస్తాన్ చేస్తున్న వరస దాడులు ఆగాలంటే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) భావిస్తాడు. ఆపరేషన్ ధురంధర్కి శ్రీకారం చుడతాడు. ఇందులో భాగంగా జైలుజీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్)ని మారుపేరుతో పాకిస్తాన్‌కి పంపిస్తాడు. జ్యూస్ షాపులో పనిచేసే దగ్గర నుంచి రహమాన్ డకాయిట్ అనే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌కి ఆత్మీయుడు అయ్యేంతవరకు ఎలా ఎదిగాడు? ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. రహమాన్ డకాయిట్‌ని హమ్జా చంపడంతో తొలి భాగం ముగిసింది. రెండో పార్ట్‌లో హమ్జా.. లయారీకి ఎలా డాన్ అయ్యాడు? భారత్‌ని దాడులు చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడనేది చూపించబోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్) -
'ధురంధర్' తెలుగు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్
'ధురంధర్' సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత అదే రేంజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తొలి భాగం విడుదలైన మూడు నెలలకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిపోయింది. ముందే చెప్పినట్లు మార్చి 19నే అంటే రేపటి నుంచే మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే తెలుగు సినీ ప్రేక్షకులకు అనుకోని చేదువార్త ఎదురైంది.(ఇదీ చదవండి: నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు)'ధురంధర్ 2' చిత్రం లెక్క ప్రకారం గురువారం(మార్చి 19) రిలీజ్ అవుతున్నప్పటికీ.. ముందు రోజు సాయంత్రం 5 గంటల నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఉంటుందని ప్రకటించారు. అందుకు తగ్గట్లే టికెట్స్ కూడా విక్రయించారు. కానీ చివరి నిమిషంలో హడావుడి వల్ల తెలుగు, తమిళ ప్రింట్స్ టైంకి డెలివరీ కాలేదు. దీంతో బుధవారానికి సంబంధించి హిందీ వెర్షన్ మాత్రమే ప్రీమియర్స్ వేస్తున్నారు.తెలుగు, తమిళ వెర్షన్స్.. బుధవారానికి సంబంధించిన షోలు రద్దయ్యాయి. డబ్బులు కూడా రీఫండ్ చేసేశారు. ఇకపోతే గురువారం ఉదయం నుంచి యధావిధిగా తెలుగు వెర్షన్ షోలు పడనున్నాయి. మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్.. మూవీ గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ట్విస్టులు బయటపెట్టొద్దని చెబుతూనే చివరి వరకు థియేటర్లలోనే ఉండాలని రాసుకొచ్చాడు. దీంతో మూడో భాగం గురించి హింట్ ఇస్తున్నాడా అని మాట్లాడుకుంటున్నారు.'ప్రియమైన 'ధురంధర్' ఫ్యామిలీ.. సినిమాని మీరెంతో ప్రేమించారు. ప్రతి చిన్న అంశాన్ని గుర్తించి మెచ్చుకున్నారు. మళ్లీ మళ్లీ చూసి ఎవరూ గుర్తించలేరనుకునే వాటిని కూడా గుర్తించారు. ఈ ప్రయాణంలో సినిమా మీది అయింది. తర్వాత ప్రపంచానిది కూడా అయింది. 'ధురంధర్: ద రివేంజ్'తో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాం. భావోద్వేగానికి గురిచేస్తాం. రెడీగా ఉండండి. అందరితో కలిసి ప్రతి ట్విస్ట్, ఎమోషన్ థియేటర్ లోనే అనుభూతి చెందండి. దయచేసి సినిమా చూసిన తర్వాత ట్విస్టులని చెప్పేయకండి. ఎండ్ క్రెడిట్స్ అయ్యేంతవరకు సీట్ల నుంచి లేచి వెళ్లిపోకండి' అని డైరెక్టర్ ఆదిత్య ధర్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)🙏🧿♥️#DhurandharTheRevenge releases worldwide on 19 March, on Gudi Padwa, Ugadi, and Eid.Hindi | Telugu | Tamil | Kannada | Malayalam @ranveersingh @rampal72 @duttsanjay @actormaddy #AkshayeKhanna @saraarjunn @therakeshbedi @adityadharfilms #JyotiDeshpande @dhar_lokesh… pic.twitter.com/wgO61vrUUQ— Aditya Dhar (@AdityaDharFilms) March 18, 2026 -
'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి
కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తాయి. అలాంటి వాటిలో 'ధురంధర్' ఒకటి. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. గతేడాది డిసెంబరులో రిలీజయ్యేంత వరకు ఇదో చిత్రం ఉందని కూడా చాలామందికి తెలీదు. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మూడు నెలలు తిరిగేసరికల్లా సీక్వెల్ రెడీ చేశారు. ఈ రోజే(మార్చి 18) ప్రీమియర్ షోలు పడనుండగా.. రేపటి నుంచి రెగ్యులర్ షోలు వేయనున్నారు. ఈ సందర్భంగా అసలు తొలి భాగంలో ఏం జరిగింది? సీక్వెల్లో ఏం జరగొచ్చనేది చూద్దాం.'ధురంధర్' పూర్తి స్టోరీ30 డిసెంబరు 1999, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ ఎయిర్‌పోర్ట్‌లో భారతదేశానికి చెందిన విమానాన్ని హైజాక్ చేసిన ఐఎస్ఐ వాళ్లు.. ప్రయాణికుల్ని బందీలుగా చేశారు. మన దగ్గర బందీగా ఉన్న 36 మంది టెర్రరిస్టులు రిలీజ్ చేస్తే గానీ జనాల్ని వదలం అనే దగ్గర నుంచి కేవలం ముగ్గురిని విడుదల చేస్తే చాలు అనేంత వరకు వస్తారు. అప్పుడు విదేశాంగ శాఖ మంత్రి దేవరత కపూర్, ఇంటెలిజన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్).. విమానంలో ఉన్న జనాలకు ధైర్యం ఇచ్చేందుకు వస్తారు. అయితే ఐఎస్ఐ వాళ్లలో ఒకడు.. మన దేశాన్ని కించపరుస్తూ అజయ్ సన్యాల్‌తో దారుణంగా మాట్లాడుతాడు. కానీ మనోడు ఒకడు పాకిస్తాన్లోకి వెళ్లి అక్కడున్న గ్యాంగ్స్ ని మట్టుబెట్టేందుకు 'ధురంధర్' అనే మిషన్ ఉందని అజయ్ సన్యాల్.. విదేశాంగ శాఖమంత్రితో చెబుతాడు. కానీ అదంతా చాలా టైమ్ తీసుకునే మిషన్ అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు.కట్ చేస్తే 13 డిసెంబరు 2001లో పార్లమెంట్‌పై దాడి జరుగుతుంది. కాందహార్ హైజాక్‌లో భాగమైన ఓ టెరర్రిస్ట్.. దీనికి నాయకత్వం వహిస్తాడు. కొందరు పోలీస్ ఆఫీసర్లని చంపేస్తారు. దొరికిపోయే టైంకి ఆత్మాహుతి దాడి చేసుకుని వాళ్లంతా చనిపోతారు. ఈ దెబ్బకు ప్రభుత్వం షేక్ అయింది. సహనం కోల్పోయింది. అందుకే అజయ్ సన్యాల్ చెప్పిన 'ధురంధర్' ఐడియాకు ఓకే చెబుతారు. కట్ చేస్తే 2004లో మన దేశ ఏజెంట్ హంజా అలీ మజారీ(రణ్వీర్ సింగ్) తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. నేరుగా పాకిస్తాన్‌కి వెళ్లకుండా ఆఫ్గానిస్తాన్ మీదుగా పాక్‌లోని లయారీకి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లిన తర్వాత హంజా.. ఆలం జ్యూస్ సెంటర్ నడుపుతున్న మన దేశానికి చెందిన మరో ఏజెంట్ ఆలం భాయ్ షాపులో పనికి చేరతాడు. ఓ రోజు సాల్ట్ ఛాయ్ తాగుతూ.. లయారీ టౌన్ జియో పాలిటిక్స్ అంతా వివరిస్తాడు.లయరీని ఏలుతున్న బాబు డకాయిట్ అక్రమ సంతానం రహమాన్ డకాయిట్ (అక్షయ్ ఖన్నా). ఈ విషయం చిన్నప్పుడే రహమాన్‌కి తెలియడంతో సొంత తల్లిని చంపేసి సవతి తండ్రికి దూరంగా ఉంటాడు. తన సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. తన కజిన్ ఉజైర్ బలూచ్ తో కలిసి ఆయుధాల అక్రమ రవాణా, రమ్మీ క్లబ్, కిడ్నాపులు, రాజకీయ హత్యలు.. ఇలా అన్ని దారుణాలు చేస్తూ కరాచీ అండర్ వరల్డ్ కి డాన్ లా తయారయ్యాడు. రహమాన్ కి ఇద్దరు కొడుకు నయిమ్, ఫైజల్. రహమాన్ అండతో స్థానిక ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన పాకిస్తానీ అవామీ పార్టీ నాయకుడు జమీల్. కానీ రహమాన్ గ్యాంగ్ కి వ్యతిరేకంగా ముస్లిం మూమెంట్ పార్టీ.. బాబు డకాయిట్, అర్షద్ పప్పు చేతిలో ఉంటుంది. బాబు డకాయిట్ కి పక్షవాతం రావడంతో రహమాన్ ని ఎదుర్కొనేందుకు అర్షద్ తో చేతులు కలుపుతాడు. హంజా.. అక్కడే పనిచేసుకుంటూ ఉంటే కుదరదు కాబట్టి ఈ రెండు గ్యాంగ్స్ లో ఏదో ఒకదానిలో చేరేందుకు ప్లాన్ వేస్తాడు. వీళ్లకు బాబు డకాయిట్ గ్యాంగ్ లో ఉన్న మరో ఏజెంట్ సాయం చేస్తాడు. ఓ పెళ్లిలో రహమాన్ కొడుకులపై బాబు డకాయిట్ గ్యాంగ్ దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారాన్ని సదరు ఏజెంట్.. హంజాకి చెబుతాడు.అనుకున్నట్లే ఆ పెళ్లిలో రహమాన్ కొడుకులపై బాబు-అర్షద్ గ్యాంగ్ దాడి చేస్తారు. ఇందులో రహమాన్ పెద్ద కొడుకు నయిమ్ చనిపోతాడు. ఇతడిని కాపాడి, రహమాన్ గ్యాంగ్‌లో హంజా చేరాలనేది ప్లాన్. కానీ పిల్లాడు చనిపోయినా సరే దాన్ని కూడా తనకు అవకాశంగా మార్చుకుని రమమాన్కి హంజా దగ్గరవుతాడు. డబ్బులు ఇస్తానని చెబితే వద్దని.. తనని గ్యాంగ్‌లో చేర్చుకోమంటాడు. అలా రహమాన్ గ్యాంగ్‌లో హంజా జాయిన్ అవుతాడు. ఎన్నికల వరకు ఎలాంటి ప్రతీకారాలు వద్దని జమీల్.. రహమాన్‌కి చెప్పడంతో అంతా సైలెంట్ అవుతాడు. కానీ ఓ రోజు హంజా.. ప్రతీకారం గురించి మాట్లాడటంతో బాబు డకాయిట్‌ని నడిరోడ్డుపై రహమాన్ దారుణంగా చంపుతాడు.2007లో పీఏపీ పార్టీ 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది. రహమాన్ ఫాలోయింగ్ జనాల్లో చాలా పెరిగిపోయింది. ఓ రోజు పార్టీ ఫంక్షన్ లో ఖనానీ బ్రదర్స్.. రహమాన్ ని కలుస్తారు. వీళ్లలో ఒకడు కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని రహమాన్ కి సలహా ఇస్తాడు. మరోవైపు హంజా.. జమీల్ కూతురు యలీనాని ప్రేమలో పడేస్తాడు. ఈలోపు ఖనానీ బ్రదర్స్, మన రూ.500,రూ.1000 నోట్లని ప్రింట్ చేసే ప్లేట్లు సంపాదించారని అజయ్ సన్యాల్ కి తెలుస్తోంది. ఇది ఎలా జరిగిందో కనుక్కోమని అజయ్ సన్యాల్ తన తోటి అధికారికి చెబుతాడు. మరోవైపు ఐఎస్ఐ చీఫ్ మేజర్ ఇక్బాల్, రహమాన్ కలిసేలా ఖనానీ బ్రదర్స్ ఏర్పాటు చేస్తారు. తనకు గన్స్ కావాలని, కానీ వాటిపై మేడిన్ అమెరికా, మేడిన్ రష్యా అని ఉండాలని చెబుతాడు. ఇలానే ఎందుకంటే రేప్పొద్దున ఎవరైనా దొరికిపోతే పాకిస్తాన్‌ని ఎవరూ పాయింట్ అవుట్ చేయకూడదనేది మేజర్ ఇక్బాల్ ప్లాన్. అలానే రహమాన్‌కి రాజకీయంగానూ సాయం చేస్తానని చెప్పడంతో డీల్‌కి ఓకే చెబుతాడు.ఆ తర్వాత రహమాన్.. ఇక్బాల్‌కి గన్స్ అందజేస్తాడు. తర్వాత కొన్నిరోజులకు ముంబైలోని తాజ్ హోటల్లో దాడులు జరుగుతాయి. దీనికి కారణం తానే అనుకున్న హంజా.. రహమాన్ ని చంపే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. మరోవైపు తను అధికారం ఎక్కడ కోల్పోతానో అని భయపడిన జమీల్.. రహమాన్ని కట్టడి చేసేందుకు ఎస్పీ అస్లాం చౌదరిని రంగంలోకి దింపుతాడు. రహమాన్ కి నమ్మకస్తుడిగా ఉన్న హంజా.. జమీల్, ఎస్పీ అస్లాం చౌదరిలతో చేతులు కలిపి చివరకు రహమాన్‌నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు.రెండో భాగంలో స్టోరీ ఏం ఉండనుంది?మరి రహమాన్ చనిపోయిన తర్వాత లయారీని హమ్జా ఎలా శాసించాడు? రహమన్ సోదరుడు ఉజైర్ బలూర్ ఏమయ్యాడు? అతడిని హమ్జా ఏం చేశాడు?అసలు హమ్జా అలియాస్.. జస్కీరాత్ సింగ్ రంగీ.. మన దేశంలో ఉన్నప్పుడు ఎందుకు జైలుకెళ్లాడు? ఏం నేరం చేశాడు? ఇతడినే ఎందుకు గూఢచారిగా పంపించారు?తొలి భాగంలో హమ్జాని ఎవరు గుర్తుపట్టలేదు. కానీ రెండో భాగంలో అది బయటపడుతుందా? ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న యలీనాకి ఈ విషయం తెలిసిందా?ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్‌కి హమ్జా దొరికేస్తాడా? రహమాన్ని చంపేందుకు హమ్జాతో చేతులు కలిపిన ఎస్పీ అస్లాం చౌదరి.. హమ్జాని ఏమైనా అడ్డుకున్నాడా?స్వయానా అల్లుడే.. భారతీయ గూఢచారి అని జమీల్ కి ఏమైనా తెలిసిందా? ఒకవేళ తెలిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు?తొలి భాగంలో ఎక్కువగా వినిపించిన బడే సాహెబ్.. సీక్వెల్లో కనిపిస్తాడా? లేదంటే దీన్ని మూడో భాగం కోసం ఏమైనా దాస్తారా? ఇలా చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. వీటన్నింటికి 'ధురంధర్ 2'లో సమాధానాలు దొరుకుతాయా అనేది చూడాలి? -
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దురంధర్ మూవీ హిట్ కావడం చాలామందిని భయపెట్టిందన్నారు. ఆదిత్య ధర్‌కు ఆదరణ పెరగడం కొందరికీ నచ్చడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతన్ని చూసి చాలామంది అసూయ పడుతున్నారని అన్నారు. ఆదిత్య ధర్, ఆయన సతీమణి యామీ గౌతమ్ పతనం కోసం సినీ పరిశ్రమలో ఎంతోమంది ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్జీవీ దురంధర్ డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ భారతీయ సినిమా గతిని మార్చిందని అన్నారు. ఆయన వల్ల సినీ ఇండస్ట్రీలో మిగిలిన వాళ్లంతా పునరాలోంచించేలా చేసిందని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆదిత్య ధర్, యామి గౌతమ్ మరింత జాగ్రత్తగా ముందడుగు వేయాలని సూచించారు.ఆర్జీవీ మాట్లాడుతూ..' తెరపై కథ చెప్పే విధానం, మేకింగ్ స్టైల్ ఆదిత్య ధర్ పూర్తిగా మార్చేశారు. మన సినిమాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు. ఇక్కడ నేను హిందీ మాత్రమే కాకుండా అన్ని భాషల గురించి మాట్లాడుతున్నా. తెలుగులో రాబోయే అనేక పెద్ద-బడ్జెట్ యాక్షన్ చిత్రాలు భారీ రీ షూటింగ్‌కు రెడీ అవుతున్నాయి. దీనివల్ల నిర్మాతలపై అదనపు భారం తప్పదు. ఆదిత్య ధర్ వల్లే ఇలా చేయాల్సి రావడం పరిశ్రమలోని కొందరికి నచ్చడం లేదు. అందుకే వారంతా అతన్ని ద్వేషిస్తారు. ఆయన అందరిని కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు తీసుకొచ్చేలా చేశాడు. అందుకే ఆదిత్య ధర్ ఫెయిల్యూర్ కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారని' అన్నారు. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తోన్న దురంధర్-2 ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది. -
ధురంధర్ 2 ఛాన్స్ వస్తే వదిలేసుకున్నా: నటుడు
గతేడాది చివర్లో వచ్చిన ధురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆదిత్య ధర్ డైరెక్టర్ చేసిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సారా అర్జున్ కథానాయిక. ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు.ధురంధర్: రివేంజ్‌లో ఛాన్స్అయితే మూడు నెలలు కూడా తిరగకముందే ధురంధర్ పార్ట్ 2 వచ్చేస్తోంది. మార్చి 19న 'ధురంధర్: రివేంజ్' రిలీజ్ కానుంది. మొదటి భాగం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కాబట్టి ఎవరైనా సరే సీక్వెల్లో ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. కానీ ఈ బాలీవుడ్ నటుడు మాత్రం తనకు ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేశాడట!డేట్స్ లేవని..ఆయన మరెవరో కాదు, అనిల్ కపూర్. తాజాగా ఆయన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. ధురంధర్ 2 సినిమాలో యాక్ట్ చేయమని దర్శకుడు ఆదిత్య నన్ను సంప్రదించాడు. అతిథి పాత్ర ఉంది, చేస్తావా? అని అడిగాడు. కానీ అప్పటికే నా డేట్స్ ఖాళీగా లేవు. వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. నీ సినిమాలో చేయాలనుంది, కానీ నేను ఖాళీగా లేను అని చెప్పి తిరస్కరించాను. ఆ మూవీ కోసం అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులను నేను పక్కనపెట్టలేను. కుదర్లేదుఆ నిబద్ధత వల్లే నేను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నాను. కేవలం టాలెంట్ ఒక్కటే మన స్థాయిని నిర్ణయించదు. కాకపోతే ధురంధర్ మూవీ అనేది మంచి ఆఫర్.. కానీ, ఏం చేద్దాం.. చేయడం కుదర్లేదు. భవిష్యత్తులో ఆదిత్యతో కలిసి పని చేస్తాననుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. అనిల్ కపూర్ చివరగా 'సుబేదార్' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. -
'ధురంధర్-2' పవర్ఫుల్ సాంగ్ విడుదల
'ధురంధర్-2' నుంచి పవర్ఫుల్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 19న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా 'ధురంధర్: ది రెవెంజ్ ఆరి ఆరి..' సాంగ్‌ను షేర్ చేశారు. శాశ్వత్ సచ్దేవ్ అందించిన సంగీతం ఈ పాటకు ప్రధాన బలంగా నిలుస్తుంది. -
రిలీజ్‌కు ముందే రికార్డులు.. దురంధర్-2 ప్రభంజనం..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్ ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లో రెండు లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడు కావడం చూస్తుంటే ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థమవుతోంది. అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ. 18.11 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వెబ్సైట్ సాక్నిల్క్ తెలిపింది.ఈనెల 19న దురంధర్ ది రివెంజ్ థియేటర్లలోనే సందడి చేయనుంది. అంతకుముందు రోజే ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఈ షోల కోసం మేకర్స్ ముందుగానే బుకింగ్‌లు ప్రారంభించడంతో చాలా థియేటర్లలో టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హిందీలో మొదటి రోజే టికెట్ ధర ప్రస్తుతం రూ. 450-500 మధ్య ఉంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. -
'ధురంధర్' మేకర్స్‌కు తెలుగు ప్రేక్షకుల రిక్వెస్ట్
బాలీవుడ్ మూవీ ‘ధురంధర్: ది రెవెంజ్’ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో తెలుగు ప్రేక్షకులు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో గతేడాది వచ్చిన చిత్రం ‘ధురంధర్’. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా పార్ట్-2 రానుంది. దేశభక్తి కాన్సెప్ట్‌తో భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా హిందీలో మాత్రమే విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకులను మెప్పించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రూపొందించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మార్చి 19న విడుదల చేస్తున్నారు. తెలుగు ట్రైలర్ విడుదల తర్వాత టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి దర్శకుడికి ఒక విన్నపం అంటూ వైరల్ అవుతుంది.ధురంధర్ -2 నిర్మాతలు తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరించిన తర్వాత డబ్బింగ్, సంభాషణల పట్ల తెలుగు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన వచ్చింది. తెలుగు డబ్బింగ్ పనులను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహించినట్లు సమాచారం. అయితే, తెలుగు ప్రేక్షకులకు నుంచి దర్శకుడు ఆదిత్య ధర్‌కు ఒక స్పష్టమైన అభ్యర్థన వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని పాన్-ఇండియ రేంజ్లో విడుదల చేస్తున్నందున, అభిమానులు పాటలను తెలుగులోకి డబ్ చేయకుండా వాటి అసలు హిందీ వెర్షన్లోనే ఉంచమని మేకర్స్‌ను అడుగుతున్నారు.ఈ అభ్యర్థన వెనుక కారణం గతంలో అనేక డబ్ చేసిన సినిమా పాటలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. అనువాదంలో విడుదలైన పాటలు బలహీనమైన మిక్సింగ్‌తో పాటు తప్పుడు అర్థాలు రావడం గమనించారు. డబ్ చేసిన వెర్షన్లలో వచ్చే పాటలు సినిమా ప్రభావాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. దీని కారణంగా, పాటలు హిందీలోనే ఉంచాలని తెలుగు ప్రేక్షకులు కోరుతున్నారు. మూవీలో డైలాగ్‌లను మాత్రమే తెలుగులోకి డబ్ చేస్తే మంచిదని చాలామంది భావిస్తున్నారు. నిర్మాతలు ఈ అభ్యర్థనను పరిశీలిస్తారా లేదా తెలుగు-డబ్ చేసిన పాటలతో ముందుకు వెళ్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాని ఆదిత్య, జ్యోతీదేశ్ పాండే, లోకేశ్ ధర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. -
'ధురంధర్-2' తెలుగు ట్రైలర్ వచ్చేసింది
'ధురంధర్-2' తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. మొదట హిందీ వర్షన్ మాత్రమే మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గతేడాదిలో విడుదలైన ధురంధర్‌కు సీక్వెల్‌గా ‘ధురంధర్: ది రెవెంజ్’ మూవీని దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, సారా అర్జున్, సంజయ్ దత్, ఆర్.మాధవన్ తదితరులు నటిస్తున్నారు. అయితే, ఈ సీక్వెల్లో యంగ్ రణ్వీర్ సింగ్‌ని జస్కిరాత్ సింగ్ రాంగీ అనే పాత్రను ట్రైలర్లో పరిచయం చేశారు. రెహమాన్ మరణం తర్వాత అక్కడి వీధుల్లో ఏర్పడిన వాతావరణాన్ని చూపించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 19న విడుదల చేస్తున్నారు. -
'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!
'ధురంధర్' సినిమాని చూసి తెలుగు దర్శకనిర్మాతలు చాలా అంటే చాలా నేర్చుకోవాలి. కేవలం కంటెంట్ అనే కాదు మిగతా విషయాల్లోనూ ఈ మూవీ ఓ గైడ్ లాంటిది అని చెప్పొచ్చు. తాజాగా సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ విషయం మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఏంటా విషయాలు? టాలీవుడ్ దీనిని చూసి ఏమేం నేర్చుకోవాలి?(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)గత కొన్నాళ్ల నుంచి పాన్ ఇండియా, సీక్వెల్ అనే ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగులోనే చిన్నపెద్ద అనే తేడా లేకుండా ప్రతి దర్శకుడు ఓ సినిమా తీసేయడం, సీక్వెల్ ఉంటుంది అన్నట్లు చివరలో స్టోరీని అర్థంతరంగా వదిలేయడం లాంటివి చాలానే చూశాం. వీటన్నింటికి భిన్నంగా కంటెంట్‌పై నమ్మకంతో 'ధురంధర్' టీమ్ రెండు భాగాల షూటింగ్ ఒకేసారి పూర్తి చేసింది. తొలి భాగం హిట్టయితేనే రెండో పార్ట్ తీస్తాం అనే ట్రెండ్‌ని బ్రేక్ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ల కంటెంట్‌పై వాళ్లకు అంత బలమైన నమ్మకం ఉండటమే దీనికి కారణం.టాలీవుడ్ ఓ సినిమాకు సీక్వెల్ అంటే అది ఎన్నేళ్ల తర్వాత వస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిది 'ధురంధర్' టీమ్ ఎంత ఫెర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వచ్చారంటే.. తొలి పార్ట్ రిలీజైన మూడు నెలల్లో రెండో పార్ట్ రిలీజ్ చేస్తామని మాటిచ్చారు. ఇప్పుడు దానికే కట్టుబడ్డారు. ఈ నెల 19న 'ధురంధర్ 2'ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. చాలామంది తెలుగు దర్శకనిర్మాతలు.. తమ సినిమాలో కంటెంట్ అంతంత మాత్రంగానే ఉన్నా ఏదో ఉంది అనేంత హడావుడి చేస్తుంటారు. 'ధురంధర్' టీమ్ మాత్రం ఎక్కువ హడావుడి చేయలేదు. ప్రమోషన్స్ లాంటివి కూడా పెద్దగా చేయలేదు. కేవలం ప్రేక్షకుల్ని మాత్రమే నమ్ముకుంది.(ఇదీ చదవండి: ‘ధురంధర్2’కి పెయిడ్ ప్రీమియర్స్.. రన్‌టైమ్ ఎంతంటే?)తెలుగులో చాలా సినిమాల పాటలు, టీజర్, ట్రైలర్స్ లాంటివి నేరుగా రిలీజ్ చేయకుండా.. మొదట ఓ అప్డేట్ అంటారు. తర్వాత సాంగ్‌కి టీజర్ అంటారు. తీరా రిలీజ్ టైంకి వచ్చేసరికి సాంకేతిక కారణాలు చెప్పి వాయిదా వేస్తుంటారు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంటారు. ఈ విషయంలోనూ 'ధురంధర్' టీమ్‌ని మెచ్చుకోవాలి. ఓ టైమ్ చెప్పారు. సరిగ్గా అదే సమయానికి ట్రైలర్ రిలీజ్ చేసేశారు.తొలి భాగం దేశవ్యాప్తంగా అద్భుతమైన హిట్ అయినా సరే ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్ల పెంపులాంటివి అడగలేదు. మూవీ రిలీజ్‌కి 10-12 రోజులు ముందుగానే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసేశారు. అదీ సాధారణ ధరలతోనే. టికెట్‌పై రూ.50-100 అదనం చెప్పి ప్రేక్షకుడి నుంచి దోచుకునే ప్రయత్నం చేయలేదు. పైన చెప్పిన విషయాల్లో చాలావరకు టాలీవుడ్లో చాలామంది పాటించరు.తీసిన సినిమాకు పెట్టిన బడ్జెట్‌కి టికెట్ ధరలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఒకవేళ ఏమైనా అంటే వింత వింత కారణాలు చెబుతారు. థియేటర్లకు జనాలు రావట్లేదని బాధపడతారు. చెప్పాలంటే ప్రేక్షకులని గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. ఏం తీసినా సరే చూస్తారులే అని అనుకుంటున్నారు. అందుకే తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు సైతం డిజాస్టర్ టాక్‌లు తప్పట్లేదు.(ఇదీ చదవండి: మరింత వైలెంట్‌గా ధురంధర్ 2 ట్రైలర్) -
‘ధురంధర్2’కి పెయిడ్ ప్రీమియర్స్.. రన్‌టైమ్ ఎంతంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్2: ది రివెంజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలు డబుల్ చేసింది. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ డ్రామాకు కూడా పెద్ద పీట వేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మార్చి 19న బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయమని రణ్వీర్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే చిత్రబృందం మాత్రం ఒక రోజు ముందే బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. మార్చి 18న పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఆ రోజు సాయంత్రం ఫస్ట్ షో నుంచే ‘ధురంధర్2: ది రివెంజ్’ మూవీని ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే బుక్‌మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌ల ద్వారా టికెట్ బుకింగ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ పెయిడ్ ప్రీమియర్స్‌కి మాత్రం కేవలం హిందీ భాషలో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హైదరాబాద్‌లోని వివిధ మల్టీప్లెక్స్‌లలో ఇప్పటికే టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. మామలుగా అయితే పెయిడ్ ప్రీమియర్స్‌కి టికెట్ ధరలను పెంచుతారు. కానీ ధురంధర్ 2కి మాత్రం ప్రీమియర్స్‌కి కూడా నార్మల్ ధరలే ఉండడం గమనార్హం. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్స్‌కి రావడం కోసమే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీ రన్‌టైమ్..ధురంధర్ 2 మూవీ రన్‌టైమ్‌పై మొన్నటి వరకు సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. ఈ మూవీ నిడివి 3 గంటల 55 నిమిషాలు. మొదటి భాగం 3 గంటలా 34 నిమిషాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. బ్రేక్ టైమ్‌తో కలిపితే నాలుగు గంటలకు పైనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంత నిడివితో ఏ చిత్రం రాలేదు. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే కంటెంట్ ఉంది కాబట్టే.. రన్‌టైమ్ విషయంలో మేకర్స్ భయపడడం లేదట. మరి ధురంధర్ 2 ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
మరింత వైలెంట్‌గా 'ధురంధర్ 2' ట్రైలర్
‘ధురంధర్ 2’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్యధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. దీంతో సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ధురంధర్: ది రివెంజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ విడుదల కానుంది. -
‘ధురంధర్ 2’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఒక్క మాటతో అంచనాలు రెట్టింపు
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ క్రియేట్ చేసిన రికార్డుల గురించి అందరికి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ధురంధర్ 2 చిత్రం కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేసింది. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు ఆదిత్యధర్ సతీమణి యామీ గౌతమ్ ధురంధర్ 2పై తన రివ్యూని ఇచ్చేసింది.భారత్ సమ్మిట్ 2026లో పాల్గొన్న యామీ గౌతమ్.. తాను ఇప్పటికే ‘ధురంధర్ 2’ చూశానని చెబుతూ..భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. ‘ధురంధర్ 2 నేను చూసేశాను. నా భర్త గొప్ప సినిమాలను తీస్తున్నారు. ధురంధర్ 2 చాలా అసాధరణమైన సినిమా. ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ఓ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మూవీ చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను.ఆ రోజు నేను విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. దీంతో ఆదిత్య ధర్‌తో ఏమీ చెప్పలేకపోయాను. ఆ తర్వాత నేను దేనిపైనా దృష్టి పెట్టలేకపోయాను. విమానం దిగిన తర్వాత ఆదిత్యకు ఏం చెప్పాలా? అని ఆలోచిస్తున్నాను. సినిమాపై నా ఒపీనియన్ చాలా చెప్పాలనుకున్నా. ఆదిత్య తన ఆడియన్స్, దేశాన్ని ఎప్పటికీ ప్రేమిస్తాడు. ఈ మూవీ తెరకెక్కించేందుకు ఆయన ఎంతో శ్రమించారు. ధురంధర్ 2 ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ఓ అద్భుతం. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ఇది. ఈ విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను’ అని యామీ గౌతమ్ అన్నారు.ఇక ధురంధర్ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆర్టికల్ 370’ షూటింగ్లో ఉన్నప్పుడే ‘ధురంధర్’ స్క్రిప్ట్ చదివాను. అది కేవలం 40 పేజీలు మాత్రమే ఉంది. కానీ చదువుతున్నంత సేపు నా కళ్లు చెమర్చాయి. అప్పుడు కూడా ఆదిత్యకు ఏం చెప్పాల్లో అర్థం కాలేదు. కానీ నా స్పందన ఏంటో ఆయను అర్థమైపోయింది. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. హిస్టరీ క్రియేట్ చేసే సినిమా అవుతుందని ముందే ఊహించా. ధురంధర్ 2 అంతకు మించి ఉంటుంది’ అంటూ అంచనాలను రెట్టింపు చేసింది. మరి ధురంధర్ 2 ఎన్ని రికార్డులకు బద్దలు కొడుతుందో చూడాలి. -
రిలీజ్‌కి ముందే షాక్.. బ్లాక్ లిస్టులో 'ధురంధర్' నిర్మాత
రణ్వీర్ సింగ్ లేటెస్ట్ సినిమా 'ధురంధర్'. రెండు నెలల క్రితం థియేటర్లలో కొన్నిరోజుల క్రితం ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరో నెలరోజుల్లో సీక్వెల్ కూడా విడుదల చేయనున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో మూవీ టీమ్‌కి షాక్ తగిలింది. ముంబైలో ఇకపై షూటింగ్ చేయడానికి అనుమతి లేకుండా బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశముంది. ఇంతకీ అసలేమైంది?'ధురంధర్' చిత్రాన్ని తీసిన దర్శకుడు ఆదిత్య ధర్.. జియో స్టూడియోస్‌తో కలిసి నిర్మాణంలో భాగమయ్యాడు. 'బీ62 స్టూడియోస్' ఆదిత్యదే. ఈ నిర్మాణ సంస్థ పలుమార్లు నియమనిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఇకపై ముంబైలో షూటింగ్ కి అనుమతించకూడదని, ఈ మేరకు బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.(ఇదీ చదవండి: నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుదితీర్పు)కొన్నిరోజుల క్రితం ముంబైలోని చారిత్రక పోర్ట్ ఏరియాలో షూటింగ్ చేస్తున్నప్పుడు డ్రోస్ ఎగరవేయడంతో నిర్మాణ సంస్థకు చెందిన మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. రీసెంట్గా ముంబైలోని పలు వీధుల్లో షూటింగ్ జరగ్గా.. ఆ సమయంలో క్రాకర్స్, మండే పదార్థాలు ఉపయోగించారు. ఇది కండీషన్స్ ఉల్లంఘించడమేనని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అంటున్నారు. ఇలా వరసగా ఉల్లంఘనలని తీవ్రంగా పరిగణించిన బీఎమ్సీ.. ఆదిత్య ధర్కి చెందిన బీ62 స్టూడియోస్‌ని బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రతిపాదించింది. ఒకవేళ ఇదే జరిగితే ఇకపై ఆదిత్య ధర్ నిర్మాణ సంస్థ.. ముంబైలో షూటింగ్ చేయడం కుదరదు.అలానే రీసెంట్ టైంలో అనుతి లేకుండా బిల్డింగ్‌లపై షూటింగ్ చేసినందుకు, అక్రమంగా జనరేటర్లు వాడినందుకుగానూ లక్ష రూపాయల జరిమానా విధించడంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్‌ని కూడా అధికారులు రద్దు చేశారు. మరి ఈ విషయంపై నిర్మాణ సంస్థ ఏమని స్పందిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా) -
ఆ హీరోయిన్‌కు ఫోన్ చేసి సారీ చెప్పా: రవీనా టండన్
అటు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన "ధురంధర్" ప్రస్తుతం ఓటీటీలోనూ చెలరేగుతోంది. మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీపై హీరోయిన్ రవీనా టండన్ ప్రశంసలు కురిపించింది. దానికంటే ముందు హీరోయిన్ యామీ గౌతమ్‌కు క్షమాపణలు చెప్పింది.హీరోయిన్‌కు సారీజూమ్ పాడ్‌కాస్ట్‌లో రవీనా టండన్ మాట్లాడుతూ.. ధురంధర్ సినిమా చూశాక హీరోయిన్ యామీ గౌతమ్‌కు ఫోన్ చేశాను. ఐయామ్ సారీ, నేను నీ భర్త (దర్శకుడు ఆదిత్య ధర్)కు వీరాభిమానిని అని మాట్లాడాను. ఈ విషయం ఆమె భర్తతో చెప్పమన్నాను. మన సినిమాల్లో ఏదైతే మిస్ అవుతుందో దాన్ని ఆయన తిరిగి తీసుకొచ్చాడు. పుష్ప, కేజీఎఫ్, ధురంధర్ వంటి సినిమాలు చూశాక జనాల్లో సంతృప్తి కలిగింది. ఎంత ఎదిగిపోయాడో!ఇప్పుడు హీరోలు నిజమైన హీరోల్లా కనిపిస్తున్నారని ఫీలవుతున్నారు. ధురంధర్ హీరో రణ్వీర్ సింగ్ 10 ఏళ్ల వయసులో నేను ఓ సాంగ్ చేస్తుండగా చూడటానికి వచ్చాడు. ఇప్పుడు ఎంత ఎదిగిపోయాడో! సినిమాలో అద్భుతంగా నటించాడు. సంజయ్, అక్షయ్ కూడా చించేశారు. సారా అర్జున్, రాకేశ్ బేడీ, గౌరవ్ కూడా బాగా యాక్ట్ చేశారు అని రవీనా టండన్ చెప్పుకొచ్చింది.సినిమాధురంధర్ గతేడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా రూ.1300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. దీనికి సీక్వెల్‌గా ధురంధర్ 2 మార్చి 19న రాబోతోంది.చదవండి: టాలీవుడ్లో సీక్వెల్ ట్రెండ్‌కు బ్రేక్? -
దురంధర్‌పై ప్రశంసలు.. నన్ను కావాలనే టార్గెట్ చేశారు: అనురాగ్ కశ్యప్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 2025లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనతను సొంతం చేసుకుంది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.పాకిస్తాన్ గూడఛార నేపథ్యంలో వచ్చిన ఈ మూవీపై చాలామంది ప్రశంసలు కురిపించారు. వారిలో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత తనతోతో పాటు చాలామంది సినీ క్రిటిక్స్‌పై సోషల్ మీడియాలో వేధింపులు మొదలయ్యాయని అన్నారు. ఇలాంటివీ కావాలనే కొందరు పనిగట్టుకుని చేస్తారని విమర్శించారు. ఈ వేధింపులకు గురైన వారిలో తాను ఒకడినని అనురాగ్ పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కశ్యప్ ఈ విషయాన్ని వెల్లడించారు.అయితే ఈ చిత్రంలో కొన్ని సమస్యాత్మక అంశాలు ఉన్నప్పటికీ.. సినిమాను నిర్మించేటప్పుడు ఆదిత్య ధర్ ధైర్యాన్ని కూడా తాను గుర్తించానని తెలిపారు. ఒక ప్రాజెక్ట్ పట్ల తనకున్న అభిమానం.. దాని లోపాలను విస్మరించినట్లు కాదని స్పష్టం చేశారు. నాకు ఏదైనా నచ్చితే నా అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దే అలవాటు తనకు లేదన్నారు. దురంధర్‌ను ప్రశంసించినందుకు తనను కూడా ప్రశ్నించారని అన్నారు. ఒక చిత్రనిర్మాతగా ఈ మూవీతో ఆదిత్య ధర్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని తెలిపారు. అర్జున్ రాంపాల్ నటించిన సీన్ చూసి ఓ డైరెక్టర్‌గా తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.కాగా.. రణ్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ చిత్రంలో సారా అర్జున్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
'ధురంధర్-2'లో దర్శకుడి సతీమణి..
బాలీవుడ్ సినిమా 'ధురంధర్' భారీ హిట్ అందుకుంది. దీంతో దర్శకుడు ఆదిత్య ధర్ సీక్వెల్‌ను ప్లాన్ చేశారు. పార్ట్-2 మార్చి 19న విడుదల కానుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో జియో స్టూడియోస్ నిర్మిస్తుంది. తాజాగా సీక్వెల్ టీజర్‌ను విడుదల చేశారు. అయితే, ధురంధర్-2లో ప్రముఖ నటి యామి గౌతమ్ నటిస్తుందని తెలుస్తోంది. గౌరవం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో కూడా భారీగా పాపులర్ అయింది. దర్శకుడితో పెళ్లి తర్వాత కూడా హిందీలో వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంటున్న యామి ఇప్పుడు ధురంధర్-2లో కీలకమైన పాత్రలో కనిపించనుంది.'ధురంధర్' దర్శకుడు ఆదిత్య ధర్‌ను నటి యామి గౌతమ్ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రణ్వీర్ సింగ్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’లో ఒక కీలకమైన పాత్రలో యామి గౌతమి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్లో కూడా ఆమె వారం రోజుల పాటు పాల్గొన్నారట. సినిమాలో ఆమె కనిపించేది కొన్ని నిమిషాలే అయినప్పటికీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా యామి పాత్ర ఉండబోతుందని బాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. కాగా యామీ గౌతమ్ తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో రీసెంట్గా ఆమె నటించిన హక్ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. -
నీయవ్వ తగ్గేదేలే..! పుష్ప & ధురంధర్ డైరెక్టర్ మూవీ..!
-
ధురంధర్ డైరక్టర్ తో అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్..!
-
'ధురంధర్ 2' టీజర్.. ఇలా మోసం చేశారేంటి?
'ధురంధర్ 2' టీజర్ వచ్చింది. దీన్ని చూసి మూవీ లవర్స్ ఒక్కసారిగా షాకయ్యారు. మమ్మల్ని ఇలా మోసం చేశారేంటి? అని విమర్శిస్తున్నారు. తమకు కొత్త టీజర్ కావాల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిదే విషయం హాట్ టాపిక్ అయింది. వచ్చిన టీజర్ కంటే మేకర్స్ చేసిన మోసం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?గత డిసెంబరులో 'ధురంధర్' సినిమా, థియేటర్లలో రిలీజైంది. దాదాపు 60 రోజుల కావొస్తున్నా, ఓటీటీలోకి వచ్చేసినా సరే బిగ్ స్క్రీన్‌పై ఇంకా ఆడుతోంది. ఈ మూవీ చివర్లో ఎండ్ క్రెడిట్స్ సీన్స్ కొన్ని వేశారు. సీక్వెల్ ఎలా ఉండబోతుంది అనేలా చిన్న గ్లింప్స్ చూపించారు. ఇప్పుడు అదే వీడియోని టీజర్లా విడుదల చేశారు. టీజర్ అనగానే కొత్త కంటెంట్ ఉండబోతుందని చాలామంది ఎగ్జైట్ అయ్యారు. కానీ థియేటర్లలో, ఓటీటీలో సినిమా చూసిన వాళ్లకు టీజర్ పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ విజువల్స్ అన్నీ చూసేశారు కాబట్టి. అయితే ఇలా చేయడానికి కారణముందని బాలీవుడ్ మీడియా అంటోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)'ధురంధర్ 2' కంటెంట్ ఇంకా పూర్తిస్థాయిలో రెడీ కాలేదట. ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని.. దర్శకుడు ఆదిత్య ధర్ ఆ పనుల్లో బిజీగా ఉన్నారట. మార్చి 19నే థియేటర్లలోకి మూవీ రానుందని మరోసారి క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ టీజర్ వదిలారని మాట్లాడుకుంటున్నారు. తొలి భాగం కేవలం హిందీలోనే రిలీజ్ కాగా.. సీక్వెల్ మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా.'ధురంధర్' విషయానికొస్తే.. కాందహార్ హైజాక్, పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత భారతదేశానికి చెందిన ఓ స్పై ఏజెంట్ హంజా అలీ అలియాస్ జస్క్రీత్ సింగ్.. పాకిస్థాన్‌లో అడుగుపెడతాడు. కరాచీ లయరీలోని రహమాన్ డకాయిట్ గ్యాంగ్‌లో చేరతాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ రహమాన్‌కి నమ్మకస్తుడిగా మారతాడు. చివరకు రహమాన్‌నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు. రహమాన్ చనిపోవడంతో అతడి స్థానంలోకి హంజా ఎలా వెళ్లాడు? లయరీలో అతిపెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా అవతరించాడు? భారత్‌పై దాడి చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాలని సీక్వెల్లో చూపించబోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ) -
'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది
గతేడాది డిసెంబరులో రిలీజై సెన్సేషన్ సృష్టించిన హిందీ సినిమా 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకుడు. ఈ చిత్ర సీక్వెల్.. వచ్చే నెల 19న థియేటర్లలోకి రానుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)విలన్ రహమాన్ డకాయిట్‌ని హంజా అలీ చంపడంతో తొలి పార్ట్‌ని ముగించారు. హంజా అలీ.. లయరీ ప్రాంతానికి డాన్ ఎలా అయ్యాడు? భారత్ వ్యతిరేకంగా పనిచేస్తున్న మిగతా విలన్స్‌ని ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాలతో సీక్వెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తొలి పార్ట్ చివరలో వేసిన విజువల్స్ నే ఇప్పుడు టీజర్ గా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?) -
'ధురంధర్-2' టీజర్ ప్రకటన వచ్చేసింది
బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, థియేటర్ వర్షన్ ఒక భాషలో మాత్రమే విడుదలై దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ధురంధర్ రికార్డ్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్ల మేరకు రాబట్టింది. సినిమాకు మంచి ఆదరణ రావడంతో పార్ట్-2పై దర్శకుడు ఆదిత్యధర్ ప్రకటించారు. ఈ క్రమంలో నేడు (ఫిబ్రవరి 3)న టీజర్‌ను విడుదల చేయనున్నారు. ధురంధర్ సీక్వెల్ కోసం పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 12:12 గంటలకు టీజర్ విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ధురంధర్ 2 మూవీ మ్యూజిక్ సంగీత హక్కులను సారెగామా నుండి టి-సిరీస్‌కు మార్చారు. ఇది ఈ మూవీ ఫ్రాంచైజీకి గణనీయమైన క్రేజ్‌ను తెచ్చింది. ఈ మూవీ ఆడియో హక్కుల కోసం భూషణ్ కుమార్ భారీ ఆఫర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని సమాచారం. ధురంధర్-2 టీజర్ ప్రకటన కూడా టి-సిరీస్ నుండి రావడం విశేషం. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్‌తో పాటు ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ తిరిగి రానున్నారు. మార్చి 19, 2026న ఒకేసారి పాన్-ఇండియా రేంజ్లో ఈ మూవీ విడుదల కానుంది. -
'టాక్సిక్' కోసం 'ధురంధర్ 2' వాయిదా? డైరెక్టర్ క్లారిటీ...
ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీ 2025 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మౌత్ టాక్‌తోనే బ్లాక్‌బస్టర్ కొట్టేసిన ఈ మూవీ ఇప్పటికీ థియేటర్లలలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీనికి సీక్వెల్‌గా ధురంధర్ 2 రాబోతున్నట్లు ప్రకటించారు.అదేరోజు టాక్సిక్ రిలీజ్ఇది మార్చి 19న విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే యష్ టాక్సిక్ సినిమా కూడా అదే రోజు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ సినిమాతో పోటీకి వెనకడుగు వేస్తూ ధురంధర్ 2 వాయిదా పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఆదిత్య ధర్ ఫుల్స్టాప్ పెట్టాడు. అనుకున్న సమయానికే వస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. డైరెక్టర్ క్లారిటీధురంధర్ సినిమాపై ఓ అభిమాని ప్రశంసలు కురిపిస్తూ మెసేజ్ చేశాడు. నిజం చెప్తున్నా.. ధురంధర్ మేనియా నుంచి బయటపడలేకపోతున్నా.. ఇప్పుడు రెండోసారి సినిమా చూశా.. మీరుర నిజంగా GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) డైరెక్టర్, ధురంధర్ 2 కోసం ఎదురుచూస్తున్నా.. మీలాంటి దర్శకులు ఉండటం భారత్‌కు గర్వకారణం అని రాసుకొచ్చాడు. ఆదిత్య ఆ మెసేజ్‌కు రిప్లై ఇస్తూ.. థాంక్యూ.. మార్చి 19న మళ్లీ కలుద్దాం అన్నాడు.చదవండి: మల్టీస్టారర్ మూవీ.. నెలరోజుల్లో ఓటీటీలోకి.. -
సౌత్ సినిమాలను వణికిస్తున్న 'ధురంధర్'.. ఎడమ కాలితో తన్నేశాడు: ఆర్జీవీ
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ధురంధర్.. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 1100 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఆపై 2025లో భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగానూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కూడా చాలాచోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మూవీ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌పై సౌత్ సినిమాల ఆధిపత్యానికి ఈ సినిమా గట్టి సమాధానం ఇచ్చిందని వర్మ అన్నారు. 2026 మార్చిలో రాబోయే 'ధురంధర్ 2' దక్షిణాదిని వణికించేలా ఉందని వర్మ అన్నాడు.దర్శకుడు ఆర్జీవీ తాజాగా ధురంధర్ సినిమా క్రేజ్ గురించి మరోసారి కామెంట్ చేశారు. వచ్చే ఏడాది రానున్న ధురంధర్ 2 దక్షిణాది సినిమాను భయపెడుతుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు బాలీవుడ్లో పుష్ప, కల్కి, కేజీఎఫ్, కాంతార వంటి దక్షిణాది చిత్రాల ప్రభావాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు.దక్షిణాదిలో ధురంధర్ ప్రభావం ఎలా ఉందో వర్మ ఇలా అన్నారు. 'బాలీవుడ్ మీదకు సడెన్‌గా దూసుకొచ్చిన సౌత్ సినిమాల ఫైర్‌ను ధురంధర్ మూవీతో దర్శకుడు ఆదిత్య ధర్ తన ఎడమ కాలితో వెనక్కి తన్నాడు. ఇప్పుడు తన కుడి కాలుతో 'ధురంధర్ 2' ని రెడీ చేస్తున్నాడు. పార్ట్-2 గురించి నాకు తెలిసినంతవరకు మరింత పవర్‌ఫుల్‌గా ఉండనుంది. పార్ట్-1 మిమ్మల్ని భయపెట్టి ఉంటే.., పార్ట్-2 మిమ్మల్ని వణికించేస్తుంది.' అని వర్మ ట్వీట్ చేశాడు.‘ధురంధర్ 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2026 మార్చి 19న సీక్వెల్ విడుదల కానుంది. హిందీతో పాటు, దక్షిణాది అన్ని భాషల్లోనూ ఈ సినిమాను విడుదల కానుంది. ప్రస్తుతం సీక్వెల్‌కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. -
'ధురంధర్' కలెక్షన్స్‌లో మాకు వాటా ఇవ్వాలి: పాక్ ప్రజలు
'ధురంధర్' సినిమాని పాకిస్థాన్ కరాచీలోని లయరీ అనే ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో తీశారు. 1990ల్లో అక్కడ జరిగిన గ్యాంగ్ వార్స్‌కి ఓ కల్పిత కథ జోడించి దర్శకుడు ఆదిత్య ధర్ ఈ మూవీ తెరకెక్కించాడు. ప్రస్తుతం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌కి చేరువలో ఉంది. అయితే వసూళ్లలో తమకు షేర్ ఇవ్వాలని ఇప్పుడు లయరీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరోయిన్లకు సలహా సరే.. ఈ 'సామాను' కామెంట్ అవసరమా శివాజీ?)ఈ వీడియోలో లయరీకి చెందిన పలువురు వ్యక్తులు మాట్లాడారు. తమ ప్రాంతాన్ని సినిమాలో చూపించారు కాబట్టి వసూళ్లలో ఎందుకు వాటా ఇవ్వకూడదు? అని అన్నాడు. మరో వ్యక్తి అయితే ఏకంగా 80 శాతం కలెక్షన్స్ తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ మొత్తం ఇవ్వడం వల్ల దర్శకుడికి పెద్దగా పోయేదేం ఉండదని, తర్వాత కూడా ఎలానూ సినిమాల చేస్తాడు కదా అని చెప్పుకొచ్చాడు.మరో వ్యక్తి మాట్లాడుతూ.. 'ధురంధర్' వసూళ్లలో కనీసం సగానికి సగమైనా సరే లయరీ ప్రజలకు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరికొందరైతే రూ.5 కోట్లు, రూ.20 కోట్లు అని నోటికొచ్చినట్లు మొత్తాన్ని చెప్పారు. మరోవ్యక్తి మాత్రం కలెక్షన్స్‌లో కొంత మొత్తంతో ఆస్పత్రి కట్టించి ఇవ్వాలని అన్నాడు. ఇంకో వ్యక్తి అయితే ఒకవేళ దర్శకుడు ఇవ్వాలనుకున్నా సరే తమకు ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి ఉండదని తమ ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెప్పాడు.(ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?)ఈ సినిమాని పాకిస్థాన్‌లో బ్యాన్ చేశారు. అయినా సరే అక్కడి ప్రజలు పైరసీ వెర్షన్ డౌన్లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారు. అలా ఏకంగా 2 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. సినిమాలోని పాటలకు రీల్స్ చేస్తూ, పెళ్లిళ్లలో వీటినే ప్లే చేస్తూ పాక్ ప్రజలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలా దాయాది దేశంలోనూ ఈ మూవీ హాట్ టాపిక్ అయిపోయిందనే చెప్పొచ్చు.రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాని.. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తీశారు. మన దేశానికి చెందిన ఓ ఏజెంట్.. రహస్యంగా పాక్ వెళ్లి అక్కడి గ్యాంగ్‌లో చేరి వాళ్లనే ఎలా తుదముట్టించాడు అనే కాన్సెప్ట్‌తో తీశారు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్స్ ఇందులో యాక్టింగ్ అదరగొట్టేశారు. మ్యూజిక్, సాంగ్స్ కూడా సూపర్ ఉండటంతో సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)BREAKING: Pakistanis want @AdityaDharFilms to give Lyari a portion of Dhurandhar's profits"Kam se kam yeh toh theek karwa lein"🤣🤣🤣🤣 pic.twitter.com/djlvJrLaJi— Sensei Kraken Zero (@YearOfTheKraken) December 22, 2025 -
'ధురంధర్' సినిమా రివ్యూ
గత కొన్నిరోజుల నుంచి సినీ ప్రేమికులు ఓ సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అదే 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ.. సౌత్‌లోనూ దీని సౌండ్ గట్టిగానే ఉంది. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ ఇందులో నటించారు. పదిరోజుల క్రితం థియేటర్లలో రిలీజైంది. కలెక్షన్స్ కూడా ఇప్పటికే రూ.500 కోట్లు దాటేశాయి. మరి అంతలా ఈ సినిమాలో ఏముంది? ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)కథేంటి?1999లో కాందహార్ హైజాక్, 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత మన దేశ ఏజెంట్.. పాకిస్థాన్‌లో ఓ హై పొజిషన్లో ఉండాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (ఆర్.మాధవన్) భావిస్తారు. వెంటనే 'ఆపరేషన్ ధురంధర్' ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా హంజా అలీ (రణ్వీర్ సింగ్) పాక్‌లోని కరాచీకి స్పై ఏజెంట్‌గా వెళ్తాడు. తర్వాత లయరీ అనే ప్రాంతంలో రెహమాన్ బలోచ్(అక్షయ్ ఖన్నా) నడిపిస్తున్న లోకల్ గ్యాంగ్‌లో చేరతాడు. తర్వాత ఐఎస్ఐ లీడర్‌తోనూ స్నేహం చేసే స్థాయికి వెళ్తాడు. తర్వాత ఏమైంది? ఇందులో ఎస్పీ చౌదరి (సంజయ్ దత్) పాత్ర ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇప్పటివరకు చాలా స్పై థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. అవన్నీ కూడా దాదాపు ఒకే టైపులో ఉంటాయి. కానీ 'ధురంధర్' మాత్రం పేరుకే స్పై జానర్ గానీ కేజీఎఫ్ స్టైల్లో ఉంటుంది. అంటే ఊరమాస్ అనమాట. కాందహార్ హైజాక్ సీన్‌తో మొదలయ్యే ఈ మూవీని మొత్తం ఎనిమిది ఛాప్టర్లుగా చూపిస్తారు. 214 నిమిషాల నిడివి అంటే మూడున్నర గంటలపైనే ఉంటుంది. చూస్తున్నంతసేపు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది.ఈ సినిమా అంతా పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్లోనే ఉంటుంది. 1990ల్లో కరాచీలోని లయరీ అనే ప్రాంతం, అక్కడి గ్యాంగ్ వార్స్‌ని కళ్లకు కట్టినట్లు చూపించారు. షూటింగ్ అంతా ఎక్కడ చేశారో గానీ మూవీ చూస్తున్నంతసేపు నిజంగా మనం పాకిస్థాన్‌లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ప్రతి సీన్, ప్రతి పాత్ర, ప్రతి డైలాగ్.. చాలా డీటైల్డ్‌గా చూపించారు. లయరీ ప్రాంతానికి చెందిన గ్యాంగ్స్టర్స్ రెహమాన్ బలోచ్, అర్షద్ అప్పు నిజ జీవిత పాత్రలే. రెహమాన్ పాత్రలో అక్షయ్ ఖన్నా జీవించేశాడు. పేరుకే రణ్వీర్ సింగ్ హీరో గానీ మూవీలో రెహమాన్ పాత్ర వేరే లెవల్లో ఉంటుంది.సినిమా నిడివి విషయంలో ఇబ్బంది అనిపించొచ్చు గానీ ఒక్కసారి మీరు మూవీలోలో లీనమైతే మాత్రం అదిరిపోయే సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ గ్యారంటీ. ఎందుకంటే ఓవైపు విజువల్స్, మరోవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు.. ఇలా దేనికవే టాప్ నాచ్ ఉంటాయి. హీరోయిన్ పాత్ర అసలెందుకు ఉందా అని ప్రారంభంలో అనిపిస్తుంది గానీ ఆమె పాత్రని ఉపయోగించిన విధానం చూస్తే ఈమె క్యారెక్టర్ అవసరమే అనిపిస్తుంది. కాకపోతే రణ్వీర్ పక్కన హీరోయిన్ సారా చిన్నపిల్లలానే కనిపిస్తుంది. ఇది కాస్త మైనస్.ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా రియలస్టిక్‌గా ఉంటాయి. సున్నిత మనస్కులు ఎవరైనా ఉంటే ఓ మూడు నాలుగు సన్నివేశాలు ఉంటాయి. వీటిని చూడకపోవడమే బెటర్. అంత దారుణంగా ఉంటాయి. ఈ సినిమాలో హీరోతో పాటు కొన్ని కల్పిత పాత్రలు ఉంటయి గానీ మిగిలినవి మాత్రం నిజ జీవిత సంఘటనల నుంచి తీసుకున్నవే. మాధవన్ చేసిన అజయ్ సన్యాల్ పాత్ర చూస్తున్నంతసేపు అజిత్ ఢోబాల్ గుర్తొస్తారు.క్లైమాక్స్‌లో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. అది కూడా మరో మూడు నెలల్లో అంటే మార్చి 19నే థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించారు. తొలిభాగంలో గ్యాంగ్‌స్టర్ గ్రూప్‌లో ఒకడిగా కనిపించిన భారత స్పై హంజా అలీ(రణ్వీర్).. సీక్వెల్లో మాత్రం ఏకంగా లయరీలోని గ్యాంగ్‌స్టర్స్‌లో ఒకడు అయిపోతాడు. మిగిలిన గ్యాంగ్‌స్టర్స్‌ని చంపేస్తాడు. ఇదంతా ఎండ్ క్రెడిట్స్‌లో చిన్నపాటి ట్రైలర్‌లా చూపించారు. తద్వారా సీక్వెల్‌పై ఆసక్తి పెంచారు.ఈ సినిమా ప్రస్తుతానికి హిందీలో మాత్రం థియేటర్లలో రన్ అవుతోంది. ఈ వీకెండ్ తెలుగులోనూ రిలీజ్ చేయొచ్చని అంటున్నారు గానీ దానిపై స్పష్టత లేదు. ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. డీల్ ప్రకారం 8 వారాల తర్వాత అంటే ఫిబ్రవరి తొలి వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. ఒకవేళ అప్పటివరకు వెయిట్ చేయలేం అనుకుంటే మాత్రం 'ధురంధర్'ని థియేటర్లో ఎక్స్‌పీరియెన్స్ చేయండి. వర్త్ వర్మ వర్త్ అనిపిస్తుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో రొమాంటిక్ కామెడీ ఫీల్ గుడ్ సినిమా.. తెలుగు రివ్యూ) -
బాక్సాఫీస్ వద్ద దురంధర్ దూకుడు.. మూడు రోజుల్లోనే సెంచరీ!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఈ మూవీకి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే దాదాపు రూ.30 కోట్లకు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే సెంచరీ దాటేసింది. ఈ సినిమా ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా రూ. 103 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. ఒక్క రోజే ఏకంగా రూ.43 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే రూ.123.5 కోట్లు వసూలు చేసింది.ఇక ప్రపంచవ్యాప్తంగా దురంధర్ హవా కొనసాగుతోంది. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.152 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే టైగర్ ష్రాఫ్ బాఘి 3 (రూ.137 కోట్లు), హృతిక్ రోషన్ విక్రమ్ వేద (రూ.135 కోట్లు), సన్నీ డియోల్ జాట్ (రూ.110 కోట్లు) చిత్రాలను అధిగమించింది. ఇదే జోరు కొనసాగితే తొలి వారంలోనే ధురంధర్ రూ.250 కోట్ దాటేలా కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. దాదాపు రూ.140 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ నటించారు. ఈ చిత్రం పార్ట్-2 మార్చి 19, 2026న విడుదల కానుంది. -
రణవీర్ సింగ్ ‘దురంధర్’ మూవీ ట్విటర్ రివ్యూ
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దురంధర్’. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5)ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ డిసెంబర్ 4న తేది రాత్రే పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. దురంధర్ ఎలా ఉంది? రణ్వీర్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి.ఎక్స్‌లో దురంధర్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బాగుందని, రణ్వీర్ వన్‌మ్యాన్ షో అంటూ అని పలువురు నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.Dhurandhar is a decent patriotic actiondrama with solid thrills. Ranveer Singh impresses as Major Mohit, and the action + BGM work well. Story familiar hai, par presentation engaging banati hai.⭐️⭐️⭐️/5 — Massy,emotional & good one-time watch.#Dhurandhar #DhurandharReview pic.twitter.com/RkGCCeOIur— Critixpro (@CritixPro999) December 5, 2025‘దురంధర్’ దేశభక్తిని రేకెత్తించే డీసెండ్ యాక్షన్ డ్రామా. అద్భుతమైన థ్రిల్లింగ్స్ అంశాలు ఉన్నాయి. మేజర్ మోహిత్ పాత్రలో రణవీర్ సింగ్ ఆకట్టుకున్నాడు. పోరాట ఘట్టాలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తెలిసిన కథే అయినా కథనం ఎంగేజింగ్‌గా ఉంటుందంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు. What a magnificent first half!🔥 Aditya Dhar has cooked with the intense scenes,Akshay Khanna is out of the box,R Madhavan delivers his best,trust me there are hardly action sequences in first half,still Dhar has managed to keep gripping screenplay just with convos #Dhurandhar https://t.co/6rfOSlsX7p pic.twitter.com/s0REydeUQp— Shahid (@CinephileScribe) December 5, 2025 ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. ఆదిత్య ధార్ కొన్నీ సీన్లను అద్భుతంగా తీర్చిదిద్దాడు. అక్షయ్ ఖన్నా, మాధవన్ కెరీర్ బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చారు. ఫస్టాఫ్‌లో యాక్షన్ సన్నివేశాలు తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ ఆదిత్య ధార్ కేవలం డైలాగ్స్‌తోనే స్క్రీన్ ప్లేను అసక్తికరంగా మార్చాడు అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#Dhurandhar Interval: It was good, not Great, but theek hai 1st half Takes time to buildup & film lengthy feel hoti hai Bcoz of The film has been presented till now but let's see hoping for the better 2nd half 🫡I have fate in Aditya Dhar Hoping for the Best!🫡 pic.twitter.com/UmbzoQ7u5B— DEV KA REVIEW (@DEVKAREVIEW3180) December 5, 2025#Dhurandhar It’s INTERVAL🔥Mass Cinema + Solid Content = Mr.DHARPure Cinema Peaks Here @AdityaDharFilms Stay Away From Social Media Freaks, Book Seats & Enjoy Gripping Spy Thriller🇮🇳Stay Tuned For Full Review….#RanveerSingh @yamigautam #Madhvan— Bollywood Legacy Channel (@LegacyChannel_) December 5, 2025 -
Ranveer Singh : గూఢచారిగా ‘రణ్వీర్ సింగ్?
హీరో రణ్వీర్ సింగ్, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్యాథార్ కాంబినేషన్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ప్రస్తుతం అజయ్ దేవగన్ హీరోగా చేస్తున్న ‘సింగమ్ ఎగైన్ ’ సినిమాలో ఓ లీడ్ రోల్ చేస్తున్నారు రణ్వీర్ సింగ్. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ‘సింగమ్ ఎగైన్’ లో తన పాత్ర షూటింగ్ పూర్తి కాగానే ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్లో ‘డాన్ 3’ సెట్స్‌లో రణ్వీర్ జాయిన్ అవుతారు. ఆ సినిమా చిత్రీకరణ ఓ కొలిక్కి రాగానే సూపర్ హీరో ఫిల్మ్ ‘శక్తిమాన్ ’ను రణ్వీర్ ప్రాంరంభించాలనుకున్నారు. కానీ ‘డాన్3’ సెట్స్‌కి వెళ్లేందుకు సమయం పడుతుందట. దీంతో ఈ లోపు ఆదిత్యాథార్ చెప్పిన ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట రణ్వీర్. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రణ్వీర్ రోల్ కొత్తగా ఉంటుందని బీ టౌన్ టాక్. ఈ చిత్రంలో రణ్వీర్ గూఢచారిగా కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. వేసవి నుంచి చిత్రీకరణను ప్లాన్ చేస్తున్నారట.


