ధురంధర్-3 కాదు.. కొత్త కాన్సెప్ట్‌తో రణ్‌వీర్‌–ఆదిత్య ధర్ ? | Ranveer Singh with Adityadhar once again | Sakshi
Sakshi News home page

ధురంధర్-3 కాదు.. కొత్త కాన్సెప్ట్‌తో రణ్‌వీర్‌–ఆదిత్య ధర్ ?

Apr 29 2026 11:48 PM | Updated on Apr 30 2026 5:23 AM

Ranveer Singh with Adityadhar once again

దురంధర్‌ నుంచి వచ్చిన రెండు భాగాలూ ఇండియాలోనే బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. అయితే దానికి కొనసాగింపుగా దురంధర్‌-3 వుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ రణ్‌వీర్‌ సింగ్‌, దర్శకుడు ధర్‌ ఇద్ధరూ మాత్రం కలుస్తున్నారు.

అవును.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్‌ వెంటనే మరో చిత్నాన్ని చేయబోతున్నాడని సమాచారం. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇది దురంధర్‌-3 మాత్రం కాదట. మరో కొత్త సబ్జెక్ట్‌తో వీరిద్దరూ మరోసారి మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు కూడా ప్రారంభమైయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నెలలో సెట్స్‌పైకి వెల్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఇటీవల ఆదిత్య ధర్, రణ్‌వీర్‌ సింగ్‌ ఇద్దరూ కలిశారు. ఆదిత్య తన దగ్గర ఉన్న కథను రణ్‌వీర్‌కు చెప్పాడట. కథ నచ్చడంతో రణ్‌వీర్‌ వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. దీంతో దర్శకుడు ఈ పాయింట్‌ను ఫుల్‌ లెంగ్త్‌ స్క్రిప్ట్‌గా తయారు చేసే పనిలో ఉన్నాడు. ఆదిత్య ధర్ దగ్గర ఇప్పటికే ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’, ఒక స్పోర్ట్స్ డ్రామా కథలు రెడీగా ఉన్నాయి. కానీ వీటిని పక్కన పెట్టి మరో కొత్త కథతో రణ్‌వీర్‌తో సినిమా చేయాలని నిర్ణయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement