కొంపముంచిన అర్జున్ టెండూల్క‌ర్‌ | T20 Mumbai 2026: Arks Andheri lost due to Arjun Tendulkars slow Knock | Sakshi
Sakshi News home page

T20 Mumbai 2026: కొంపముంచిన అర్జున్ టెండూల్క‌ర్‌

Jun 14 2026 12:44 PM | Updated on Jun 14 2026 3:36 PM

T20 Mumbai 2026: Arks Andheri lost due to Arjun Tendulkars slow Knock

ముంబై లీగ్ టీ20 లీగ్‌-2026 విజేత‌గా ఎమ్‌ఎస్‌సి మరాఠా రాయల్స్ నిలిచింది. శ‌నివారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో ఆర్క్స్ అంధేరిపై 8 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన మ‌రాఠా రాయ‌ల్స్‌.. వ‌రుస‌గా రెండో ఎంటీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన మ‌రాఠా జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి కేవ‌లం 154 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఎమ్‌ఎస్‌సి బ్యాట‌ర్ల‌లో చిన్మయ్ రాజేష్ సుతార్(61) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. కెప్టెన్ సిద్దేశ్ లాడ్‌(33) కాస్త దూకుడుగా ఆడాడు.  వీరిద్ద‌రూ మిన‌హా మిగితా ప్లేయ‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. అంధేరి బౌల‌ర్ల‌లో అర్జున్ టెండూల్క‌ర్ రెండు, శివ‌మ్ దూబే, ముషీర్ ఖాన్ త‌లా వికెట్ సాధించారు.

కొంప‌ముంచిన అర్జున్‌
అయితే 155 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఆర్క్స్ అంధేరి సునాయ‌సంగా ఛేదిస్తుంద‌ని అంతా అనుకున్నారు. కానా మ‌రాఠా రాయ‌ల్స్ కంటే అంధేరి బ్యాట‌ర్లు దారుణమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. ఆరంభంలోనే స్టార్ ఓపెన‌ర్ ముషీర్ ఖాన్(0) వికెట్‌ను ఆర్క్స్ జ‌ట్టు కోల్పోయింది. ఈ క్ర‌మంలో ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన అర్జున్ టెండూల్క‌ర్ అంధేరి కొంప‌ముంచాడు. జిడ్డు బ్యాటింగ్ చేస్తూ త‌ర్వాత వ‌చ్చిన బ్యాట‌ర్ల‌పై ఒత్తిడి పెంచాడు.

క‌నీసం స్ట్రైక్ కూడా రోటేట్ చేయ‌లేక‌పోయాడు. అత‌డు 12 బంతులు ఎదుర్కొని కేవ‌లం 2 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో అంధేరి విజ‌యానికి కావాల్సిన ర‌న్‌రేట్ పెరిగిపోయింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ ప్ర‌సాద్ ప‌వార్ అవుటైన‌ప్ప‌టికి, ఓపెన‌ర్‌ దివ్యాన్ష్ సక్సేనా( 38 బంతుల్లో 50 పరుగులు) నిల‌కడ‌గా ఆడుతూ గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. 

అయితే దివ్యాన్ష్ ఔట‌య్య‌క అంధేరి వికెట్ల ప‌త‌నం మొద‌లైంది. ప్రగ్నేష్ కన్పిల్లెవార్(21 బంతుల్లో 28), కెప్టెన్ శివ‌మ్ దూబే(15) వెంట‌వెంట‌నే ఔట‌య్యారు. చివరిలో వేగంగా ఆడిన గౌరవ్ జాతర్ కూడా (17 బంతుల్లో 23 పరుగులు)  కూడా 19 ఓవ‌ర్‌లో పెవిలియ‌న్‌కు చెరాడు.

ఈ క్రమంలో ఆఖరి ఓవర్‌లో అంధేరి విజయానికి 14 పరుగులు అవసరమవ్వగా.. మరాఠా బౌలర్‌ రాజే కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో మరాఠా రాయల్స్‌ ఛాంపియన్స్‌గా నిలవగా.. అంధేరి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
చదవండి: IND vs AFG: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ రికార్డు బ్రేక్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement