breaking news
T20 Mumbai League
-
శ్రేయస్ అయ్యర్‌కు మరో చేదు అనుభవం
కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఒకే నెలలో వరుసగా రెండు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. జూన్ 3న అతని సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైంది. పది రోజులు తిరక్కుండానే జూన్ 12న అతని కెప్టెన్సీలోని మరో జట్టు ఫైనల్లో ఓటమిని ఎదుర్కొంది.నిన్న జరిగిన ముంబై టీ20 లీగ్ ఫైనల్లో శ్రేయస్ నేతృత్వం వహించిన సోబో ముంబై ఫాల్కన్స్.. ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ప్రత్యర్ధి టీమ్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఈ మ్యాచ్‌లో శ్రేయస్ ఆటగాడిగానూ విఫలమయ్యాడు. 17 బంతులు ఆడి బౌండరీలు, సిక్సర్లు లేకుండా 12 పరుగులు మాత్రమే చేశాడు. అతని జట్టులో మయూరేశ్ తండేల్ (50) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. హర్ష్ గర్వ్ (28 బంతుల్లో 45 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంగ్క్రిష్ రఘువంశీ 7, ఇషాన్ ముల్చందని 20, అమోఘ్ భత్కల్ 16 పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో వైభవ్ మాలీ 2, ఆదిత్య ధుమాల్, మ్యాక్స్‌వెల్ స్వామినాథన్ తలో వికెట్ పడగొట్టారు.రాయల్స్ ఇన్నింగ్స్‌లో చిన్మయ్ రాజేశ్ సుతార్ (53) అర్ద సెంచరీతో రాణించగా.. అవైస్ ఖాన్ నౌషద్ 38, సాహిల్ భగవంతా జాదవ్ 22, సిద్దేశ్ లాడ్ 15, సచిన్ యాదవ్ 19, రోహన్ రాజే 8 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రేయస్ జట్టు బౌలర్లలో కార్తీక్ మిశ్రా, యశ్ దిచోల్కర్ తలో రెండు వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా చిన్మయ్ రాజేశ్ సుతార్ ఎంపిక కాగా.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును సాయిరాజ్ పాటిల్ గెలుచుకున్నాడు. కెప్టెన్‌గా శ్రేయస్ రికార్డుఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను విజేతగా నిలిపాడు2024లో ముంబైకి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడుఐపీఎల్ 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు (రన్నరప్)ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు (రన్నరప్)ముంబై టీ20 లీగ్ 2025లో సోబో ముంబై ఫాల్కన్స్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు (రన్నరప్) -
పది రోజులు తిరక్కుండానే మరో జట్టును ఫైనల్‌కు చేర్చిన శ్రేయస్ అయ్యర్
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌కు తాను కెప్టెన్సీ వహించే జట్లను అలవోకగా ఫైనల్‌కు చేర్చడం అలవాటుగా మారింది. జూన్ 1న ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్స్‌కు చేర్చిన శ్రేయస్.. పది రోజులు కూడా తిరక్కుండానే మరో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ముంబై టీ20 లీగ్ 2025లో నిన్న (జూన్ 10) జరిగిన రెండో సెమీఫైనల్లో శ్రేయస్ సారథ్యం వహించిన సోబో ముంబై ఫాల్కన్స్ నమో బాంద్రా బ్లాస్టర్స్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది.ఏడాది కాలంలో శ్రేయస్ తాను సారథ్యం వహించిన జట్లను ఫైనల్స్‌కు చేర్చడం ఇది నాలుగో సారి. 2024 ఐపీఎల్‌తో మొదలైన శ్రేయస్ కెప్టెన్సీ జైత్రయాత్ర ప్రస్తుతం జరుగుతున్న ముంబై టీ20 లీగ్ వరకు కొనసాగింది. 2024 ఐపీఎల్లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్.. ఆతర్వాత ముంబైకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో పంజాబ్‌ను ఫైనల్స్‌కు చేర్చిన శ్రేయస్ తృటిలో టైటిల్ మిస్ కావడంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లోనే పంజాబ్ కింగ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ ఆ జట్టును 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేర్చాడు.శ్రేయస్ తన జట్లను ఫైనల్స్‌కు చేర్చిన గత నాలుగు సందర్భాల్లో వ్యక్తిగతంగానూ రాణించాడు. ఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన సందర్భంలో 15 మ్యాచ్‌ల్లో 39 సగటున, 146.86 స్ట్రయిక్‌రేట్‌తో 2 హాఫ్ సెంచరీల సాయంతో 351 పరుగులు చేశాడు.అనంతరం ముంబైకు ముస్తాక్ అలీ ట్రోఫీ అందించిన సందర్భంలో 188.52 స్ట్రయిక్‌రేట్‌తో 345 పరుగులు సాధించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో 175.07 స్ట్రయిక్‌రేట్‌తో 604 పరుగులు సాధించాడు. ముంబై టీ20 లీగ్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టిన శ్రేయస్ ఈ లీగ్‌లో ఫామ్‌ను ప్రదర్శించాల్సి ఉంది.చరిత్ర సృష్టించాడుతాజాగా ముగిసిన ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్స్‌కు చేర్చడం ద్వారా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లను ఫైనల్స్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. శ్రేయస్ తన సారథ్యంలో 2019లో ఢిల్లీని, 2024లో కేకేఆర్‌ను, 2025లో పంజాబ్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు.ముంబై టీ20 లీగ్ సెమీఫైనల్ విషయానికొస్తే.. నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ సారథ్యంలోని సోబో ముంబై ఫాల్కన్స్ నమో బాంద్రా బ్లాస్టర్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాస్టర్స్ 130 పరుగులకు ఆలౌట్ కాగా.. శ్రేయస్ జట్టు 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ వ్యక్తిగతంగా రాణించనప్పటికీ (1) తన జట్టును విజయవంతంగా ఫైనల్స్‌కు చేర్చాడు. రేపు జరుగబోయే ఫైనల్స్‌లో శ్రేయస్ జట్టు సిద్దేశ్ లాడ్ నేతృత్వంలోని ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. శ్రేయస్ ఈ టైటిల్‌ను కూడా సాధిస్తే కెప్టెన్‌గా అతనికి తిరుగే ఉండదు. -
పృథ్వీ షా సునామీ ఇన్నింగ్స్.. కేవలం 23 బంతుల్లోనే..!
ముంబై టీ20 లీగ్‌లో నార్త్ ముంబై పాంథర్స్ ఆటగాడు పృథ్వీ షా ఇరగదీశాడు. లీగ్‌లో భాగంగా ట్రయంప్ నైట్స్‌తో నిన్న (జూన్ 8) జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో షా కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. షా సునామీ హాఫ్ సెంచరీతో పాటు హర్షల్ జాదవ్ (30 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), గౌరవ్ జాథర్ (10 బంతుల్లో 18 నాటౌట్; ఫోర్, సిక్స్), రాహుల్ సావంత్ (9 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాంథర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. నైట్స్ బౌలర్లలో శ్రేయస్ గౌరవ్ 2, మినాద్ మంజ్రేకర్, పరిక్షిత్, సుర్యాంశ్ షేడ్గే తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్స్.. ప్రతిక్ మిశ్రా (3.5-0-30-4) రెచ్చిపోవడంతో 19.5 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌటై 38 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. పాంథర్స్ బౌలర్లలో రాహుల్ సావంత్ 2, ముజమ్మిల్ ఖాద్రి, గౌరవ్ జాథర్ తలో వికెట్ తీశారు. నైట్స్ ఇన్నింగ్స్‌లో సిద్దాంత్ ఆధత్రావ్ (76) ఒంటరిపోరాటం చేసి 45 బంతుల్లో 76 పరుగులు చేయగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (29), పరిక్షిత్ (20), శిఖర్ ఠాకూర్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండా పాంథర్స్, నైట్స్ ఇదివరకే లీగ్ నుంచి నిష్క్రమించాయి.ఇదిలా ఉంటే, పృథ్వీ షా ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025లో ఏ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించలేదు. ఈ సీజన్ మెగా వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గత కొంతకాలంగా షా ఓవర్ వెయిట్ కారణంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటూ తన దేశవాలీ జట్టు ముంబైలో కూడా స్థానం కోల్పోయాడు. తాజా ప్రదర్శన తర్వాత షా తిరిగి ముంబై జట్టులో చోటు ఆశిస్తున్నాడు. 2024-25 సీజన్లో షా రెండు సార్లు ముంబై జట్టులో స్థానం కోల్పోయాడు. రంజీ జట్టుతో పాటు విజయ్ హజారే టీమ్ నుంచి డ్రాప్ అయ్యాడు. 2018లో టీమిండియా తరఫున ఘనంగా (తొలి టెస్ట్‌లోనే సెంచరీ) అరంగేట్రం చేసిన షా.. అతి కొద్ది కాలంలోనే ఫిట్నెస్ సమస్యలు, వ్యక్తిగత ప్రవర్తన కారణంగా కనుమరుగయ్యాడు. షా చివరిగా 2021లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. -
ఐపీఎల్ తర్వాత తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్ యాదవ్
ఐపీఎల్ 2025 తర్వాత తొలి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. నిన్న (జూన్ 4) మొదలైన టీ20 ముంబై లీగ్‌లో ట్రయంప్ నైట్స్ ఫ్రాంచైజీకి సారథ్యం వహిస్తున్న స్కై.. ఈగల్ థానే స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లోనే 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన అర్ద సెంచరీతో అలరించాడు. ఈ మ్యాచ్‌లో స్కై సత్తా చాటినా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ట్రయంప్ నైట్స్ ఓటమిపాలైంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్స్.. స్కై రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నైట్స్ ఇన్నింగ్స్‌లో సురేంద్ర రాణా (53) కూడా అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లలో పరిక్షిత్ 29, సంజయ్ జైన్ 24, సూర్యాంశ్ షేడ్గే 8, సిద్దాంత్ 4 పరుగులు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో అమిత్ పాండే, హర్ష్ తన్నా, శశాంక్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన స్ట్రయికర్స్.. సాయిరాజ్ పాటిల్ (22 బంతుల్లో 47 నాటౌట్), వరుణ్ లవండే (38 బంతుల్లో 57) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో అనిష్ ముకుంద్ (37) కూడా రాణించాడు. నైట్స్ బౌలర్లలో మినాద్ మంజ్రేకర్ 2,సూర్యకాంత్ పవార్, భరత్ పాటిల్, పరిక్షిత్ తలో వికెట్ తీశారు.కాగా, తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025లో సూర్యకుమార్ యాదవ్ అత్యంత విలువైన ఆటగాడి అవార్డు (ప్లేయర్ ఆఫ్ ద సిరీస్) గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో స్కై 16 మ్యాచ్‌ల్లో 65.18 సగటున 5 అర్ద సెంచరీల సాయంతో 717 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో స్కై ప్రాతినిథ్యం వహించిన ముంబై ఇండియన్స్ ఆరంభంలో పరాజయాలు ఎదుర్కొన్నా, ఆతర్వాత అనూహ్య రీతిలో పుంజుకొని క్వాలిఫయర్-2 వరకు చేరింది. అయితే ఆ మ్యాచ్‌లో ముంబై పంజాబ్ చేతిలో ఓటమిపాలై లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో ముంబై పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. -
BCCI: ఫిక్సింగ్ యత్నం.. బీసీసీఐ ఆగ్రహం.. అతడిపై నిషేధం
ఫిక్సింగ్‌కు యత్నించిన గుర్మీత్ సింగ్ భమ్రా అనే వ్యక్తిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిషేధం విధించింది. భమ్రా ముంబై టీ20 లీగ్‌లో సొబో సూపర్ సానిక్స్ అనే ఫ్రాంచైజీ కలిగి ఉన్నాడు. ఐదేళ్ల క్రితం అతడు ఆ లీగ్‌లో ఫిక్సింగ్‌కు యత్నించినట్లు తేలడంతో బోర్డు అంబుడ్స్‌మన్ రిటైర్డ్ జస్టిస్ అరుణ్ మిశ్రా నిషేధం విధించారు. అయితే, భమ్రాపై ఐదేళ్లా లేదంటే జీవితకాల నిషేధమా అనేది తెలియాల్సి ఉంది. కాగా 2019 సీజన్లో సొబో సూపర్ సానిక్స్ ప్లేయర్లు ధవళ్ కులకర్ణి, భవిన్ ఠక్కర్‌లతో ఫిక్సింగ్ కోసం సంప్రదింపులు జరిపారు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన కులకర్ణి సహా ఠక్కర్‌లు ఫిక్సింగ్‌కు నిరాకరించారు. తదనంతరం ఈ విషయాన్ని బోర్డు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ)కు తెలిపారు. సోనూ వాసన్ అనే వ్యక్తి ద్వారా గుర్మీత్ సింగ్ ఫిక్సింగ్ ప్రయత్నాలు చేశారు. సోనూ వాసన్ డబ్బు ఆశ చూపినా భవిన్ తలొగ్గలేదు. ఇద్దరు ఫిక్సింగ్‌కు ససేమిరా అనడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. విచారణలో గుర్మీత్ దోషి అని తేలడంతో శిక్ష ఖరారు చేశారు.ఇక భమ్రా జీటీ20 కెనడా లీగ్ (ప్రస్తుతం మనుగడలో లేదు)లోనూ భాగమయ్యాడు. కాగా కోవిడ్‌కు ముందు అతడు ముంబై టీ20 లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్‌గా ఉండగా.. ప్రస్తుతం అతడిని లీగ్ నుంచి తొలగించారు.ఐపీఎల్‌లోనూ ఫిక్సింగ్ కలకలంకాగా ఐపీఎల్-2025లోనూ ఫిక్సింగ్‌కు అవకాశముందంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీసీసీఐ జట్ల యజమానులు, ఆటగాళ్లు, సిబ్బందికి కీలక సూచనలు చేసింది.హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త గట్టిగానే ఫిక్సింగ్ యత్నాలు చేస్తున్నాడని.. ఆ వ్యక్తి గనుక సంప్రదిస్తే వెంటనే అవినీతి నిరోధక భద్రతా విభాగం దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. ప్లేయర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఖరీదైన బహుమతుల పేరిట వల వేసే అవకాశం ఉందని.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సదరు వ్యాపారవేత్త గతంలోనూ ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడని.. అతడికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఒకవేళ అతడు ఏ రకంగానైనా సంప్రదింపులు జరపాలని చూస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని ఆటగాళ్లను అప్రమత్తం చేసింది.చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన పాటిదార్.. ఐపీఎల్ చరిత్రలో భారత తొలి బ్యాటర్‌గా -
సూర్య, శ్రేయస్, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!.. అదనంగా రూ. 15 లక్షలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆవిర్భావం తర్వాత దేశంలో ఎన్నో స్థానిక టీ20 లీగ్‌లు పుట్టుకొచ్చాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TPL), ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL), కర్ణాటక ప్రీమియర్ లీగ్, పంజాబ్ ప్రీమియర్ లీగ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్, ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఇందులో భాగం.ఇక ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) కూడా గత రెండు సీజన్లుగా టీ20 ముంబై లీగ్‌ను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మే 26- జూన్ 5 వరకు మూడో ఎడిషన్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే, ఈ సీజన్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపేందుకు ఎంసీఏ మాస్టర్ ప్లాన్ వేసింది. దేశవాళీ క్రికెట్లో ముంబైకి టీమిండియా స్టార్లందరినీ రంగంలోకి దింపాలని నిర్ణయించుకుంది.సూర్య, శ్రేయస్, పృథ్వీ షా.. అందరూ ఆడాల్సిందే!టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సహా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానే, శివం దూబే, పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్ తదితరులకు టీ20 ముంబై లీగ్‌లో తప్పనిసరిగా పాల్గొనాల్సిందిగా ఎంసీఏ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.కాగా ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత టీమిండియా టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ టూర్‌కి ఎంపిక కాని ముంబై సభ్యులంతా స్థానిక టీ20 లీగ్‌లో పాల్గొనాలని ఎంసీఏ వారికి స్పష్టం చేసినట్లు సమాచారం.అదనంగా రూ. 15 లక్షలు ఈ విషయం గురించి ఎంసీఏ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘ముంబైకి ఆడే టీమిండియా ఆటగాళ్లందరూ ముంబై టీ20 లీగ్‌లో ఆడాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ లీగ్ మొదలవుతుంది. కాబట్టి.. టీమిండియా తరఫున విధుల్లో లేని వారు తప్పకుండా ఇందులో పాల్గొనాలి.ఒకవేళ గాయాల బెడదతో బాధపడుతూ ఉంటే వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ లీగ్‌లో పాల్గొనే భారత జట్టు ఆటగాళ్లకు వేలం ఫీజుకు అదనంగా రూ. 15 లక్షలు ఇవ్వాలని ఎంసీఏ నిర్ణయించింది. త్వరలోనే ఆటగాళ్ల కనీస ధరను నిర్ణయిస్తాం.ఈ సీజన్లో ముంబై టీ20 లీగ్‌కు అనూహ్య స్పందన వస్తోంది. 2800కి పైగా ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ముంబైకర్లకు క్రికెట్ అంటే ఎంత మక్కువో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. టీమిండియాకు భవిష్యత్ తారలను అందించేందుకు మేము చేసే ప్రయత్నం తప్పక ఫలిస్తుంది’’ అని సదరు ఎంసీఏ అధికారి పేర్కొన్నారు. కాగా.. వీలైతే రోహిత్ శర్మను కూడా రంగంలోకి దింపి ఈ లీగ్‌కు మరింత ప్రాచుర్యం కల్పించాలనే యోచనలో ఎంసీఏ ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: Rohit Sharma: కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం