దురంధర్-2 వసూళ్లు.. 22 రోజుల్లో ఎన్ని కోట్లంటే? | Ranveer Singh Dhurandhar 2 Collections after 22 days world wide | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Collections: దురంధర్-2 కలెక్షన్స్.. 22 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Apr 10 2026 5:35 PM | Updated on Apr 10 2026 5:38 PM

Ranveer Singh Dhurandhar 2 Collections after 22 days world wide

రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్-2 హవా ఇంకా కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా మూడు వారాలైనా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 1500 కోట్లు మార్క్ దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దురంధర్‌ సీక్వెల్‌గా తీసుకొచ్చారు. కేవలం  మూడు నెలల గ్యాప్‌లోనే సీక్వెల్‌ రిలీజ్ చేశారు.

ఈ మూవీ విడుదలైన 22 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1680 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది. కేవలం ఇండియాలోనే రూ.1276 కోట్లు రాబట్టగా.. ఓవర్‌సీస్‌లో దాదాపు రూ.404 కోట్లు కలెక్ట్ చేసింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ.1081 కోట్లు వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా చూస్తే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అమిర్ ఖాన్ మూవీ దంగల్ రూ.2 వేల కోట్లకు పైగా వసూళ్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బాహుబలి-2, పుష్ప-2 చిత్రాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరి దురంధర్‌-2 ఈ చిత్రాల రికార్డులు బద్దలు కొడుతుందో.. లేదో వేచి చూడాల్సిందే.

 

 

Advertisement
 
Advertisement
Advertisement