ధురంధర్- 2లో దర్శకుడి సతీమణి.. అండర్ కవర్ ఏజెంట్‌గా ఎంట్రీ | Actress Yami Gautam Blushes While Secretly Watching Her Own Cameo In Dhurandhar 2, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

ధురంధర్- 2లో దర్శకుడి సతీమణి.. సిగ్గుపడుతూ ఫన్నీ రియాక్షన్‌

Mar 28 2026 8:00 AM | Updated on Mar 28 2026 10:05 AM

Actress Yami Gautam Blushes While Secretly Watching Her Dhurandhar 2

రణవీర్‌ సింగ్‌- దర్శకుడు ఆదిత్య ధర్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ధురంధర్‌-2.. గతేడాది విడుదలైన పార్ట్‌-1కు సీక్వెల్‌గా తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతుంది. అయితే, దర్శకుడు ఆదిత్య ధర్‌ సతీమణి యామీ గౌతమ్‌ తాజాగా ఈ మూవీని చూశారు. ఇందులో ఆమె అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.  తన సోదరితో రహస్యంగా ప్రేక్షకులతో పాటుగా మూవీని చూశారు.

గౌరవం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యామీ గౌతమ్.. ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్‌తో  భారీగా పాపులర్‌ అయింది.  దర్శకుడు ఆదిత్య ధర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది. 'ఉరి' మూవీ తర్వాత వారిద్దరి కాంబినేషన్‌లో ఇది రెండో చిత్రం కావడం విశేషం.

ధురంధర్‌-2లో యామీ గౌతమ్ నర్స్ కమ్ అండర్ కవర్ ఏజెంట్ 'షాజియా బానో'గా నటించారు. తెరపై ఆమె కనిపించగానే కాస్త సిగ్గుగా చూస్తూ, చిరునవ్వుతో నిశ్శబ్దంగా ఉండమని తన సోదరి సురిలీ గౌతమ్‌ని సైగ చేసింది. ఈ ముచ్చటైన క్షణాన్ని సురిలీ  కెమెరాతో వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో "మూవీ టైమ్" అనే క్యాప్షన్‌తో   అప్‌లోడ్ చేసింది. ఆ క్లిప్‌లో 'ధురందర్ 2'లో నర్సుగా యామీ చేసిన అతిథి పాత్రను చూపిస్తుంది. ఆ తర్వాత ఆమె కెమెరాను ఆ నటి వైపు తిప్పుతుంది. థియేటర్‌లో ఆ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు యామీ నవ్వుతూ, సిగ్గుపడుతూ కనిపించింది. ఆ తర్వాత ఆమె తన సోదరిని నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement