సీఎం విజయ్‌కి ‘ఇండియా’ కూటమి షాక్‌! | Vijay's TVK Uninvited, DMK Skips Over Congress Betrayal | Sakshi
Sakshi News home page

సీఎం విజయ్‌కి ‘ఇండియా’ కూటమి షాక్‌!

Jun 8 2026 9:30 AM | Updated on Jun 8 2026 11:10 AM

Vijay's TVK Uninvited, DMK Skips Over Congress Betrayal

న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోలీవుడ్ స్టార్, సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉమ్మడి వ్యూహాన్ని రచించేందుకు నేడు (జూన్ 8) ఢిల్లీలో జరుగుతున్న కీలక ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశానికి సీఎం విజయ్‌కు ఆహ్వానం దక్కలేదు. తమిళనాడులో కాంగ్రెస్‌కు అత్యంత ఆప్తుడిగా మారిన విజయ్ ఈ భేటీకి హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సమావేశానికి విజయ్‌ను పిలవకపోవడానికి గల కారణాలను కాంగ్రెస్ వర్గాలు  తెలియజేశాయి. ప్రస్తుతం లోక్‌సభ లేదా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పార్టీలను మాత్రమే ఈ భేటీకి ఆహ్వానించామని కూటమి నేతలు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుతానికి టీవీకే పార్టీ ఇంకా అధికారికంగా ఇండియా కూటమిలో భాగస్వామి కాలేదనే నెపంతోనే ఆయనకు ఈ మొండిచేయి ఎదురైనట్లు తెలుస్తోంది.

అయితే లోపల సఖ్యతగా కనిపిస్తున్న ఈ కూటమిలో విజయ్ అంశం తీవ్ర కలకలానికి దారితీసింది. తమిళనాడు ఎన్నికల అనంతరం దశాబ్దాల మిత్రపక్షమైన డీఎంకేను పక్కనబెట్టి, విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై స్టాలిన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంతర్గత విభేదాల నేపథ్యంలో, అటు డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించడం, ఇటు సీఎం విజయ్‌కు ఆహ్వానం దక్కకపోవడంతో కూటమిలో సరికొత్త రాజకీయ సమీకరణలు చర్చనీయాంశంగా మారాయి.

ఇది కూడా చదవండి: మిడిల్ ఈస్ట్ వీసా షాక్: ఆందోళనలో కేరళ నర్సులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement