breaking news
INDIA bloc
-
తొలి రోజే దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజు సమావేశాలు విపక్షాల నినాదాల హోరులో కొట్టుకుపోయాయి. ఎలాంటి చర్చలు జరగకుండానే లోక్‌సభ, రాజ్యసభలు సోమవారం అర్ధా్ధంతరంగా ముగిసి మంగళవారానికి వాయిదాపడ్డాయి. ప్రతిష్టాత్మక నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, అయోధ్య రామ మందిరంలో కోట్ల రూపాయల విరాళాల చోరీ, జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ తదితర కీలకాంశాలపై చర్చ చేపట్టాలంటూ విపక్ష పార్టీల నేతలు పట్టుబట్టడంతో పార్లమెంట్ ఉభయసభల్లో తొలిరోజే ప్రతిష్టంభన నెలకొంది. ‘ఇండియా’కూటమి నేతల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఉభయసభలు హోరెత్తిపోయాయి. తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ కు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ సమయం వృథాగా ఖర్చయిపో యాయి. సభాకార్యకలాపాలకు విపక్ష సభ్యులు అడ్డుతగలడంతో లోక్‌సభ, రాజ్యసభలు తలో ఆరుసార్లు వాయిదాపడ్డాయి. ఉభయ సభాపతులు ఇరుసభలను మంగళవారానికి వాయిదావేశారు. ఆరంభం నుంచే అట్టుడికిన లోక్‌సభ.. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన వెంటనే మరణించిన మాజీ ఎంపీలకు నివాళులు అర్పించారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వివిధ అంశాలపై చర్చ కోరుతూ వెంటనే నినాదాలు చేశారు. సభ నినాదాలతో నడవదని, సభ్యులు తమ స్థానాల్లో కూర్చొని సభా కార్యక్రమాలకు సహకరించాలని స్పీకర్ బిర్లా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీసహా పలు ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లోంచి లేచి ముందుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. నినాదాలతో లోక్‌సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభ్యులను శాంతించాలని మరోమారు కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు కొనసాగడంతో మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభం అయ్యాక విపక్షాల ఆందోళన కొనసాగడంతో వాయిదాల పర్వం కొనసాగి, చివరికి సభ మంగళవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ వాయిదాల పర్వం.. రాజ్యసభలో పత్రాల సమర్పణ, నూతన సభ్యుల ప్రమాణస్వీకారం, మృతిచెందిన సభ్యులకు సంబంధించిన సంతాప తీర్మానాల అనంతరం సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వెంటనే రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘జంతర్‌మంతర్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థుల గొంతు ప్రభుత్వం నొక్కేస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన సమస్యపై చర్చ జరగాల్సిందే. జంతర్‌మంతర్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ప్రభుత్వం బలప్రయోగం, లాఠీఛార్జి చేస్తోంది. వారి గొంతును అణచివేస్తోంది’’అని ఖర్గే అన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై అధికార కూటమి ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా పరిస్థితి అలాగే కొనసాగింది. జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయోధ్యలోని రామమందిరంలో కోట్ల రూపాయల విరాళాలను చోరీచేసిన ఉదంతంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. ఈ డిమాండ్లు, నినాదాల నడుమ సభ మంగళవారానికి వాయిదా పడింది. లోక్‌సభ ముందుకు జడ్జీల బిల్లు.. ఇంతటి నినాదాల హోరులోనూ ప్రభుత్వం లోక్‌సభలో ఒక బిల్లును విజయవంతంగా ప్రవేశపెట్టింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు గతంలో జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లును లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. -
నేటి నుంచి వర్షాకాల సమరం
సాక్షి, న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు, ఎంపీల ఫిరాయింపులు, ప్రభుత్వ అనుకూల కూటముల్లో చేరికల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న విభేదాల కారణంగా అధికార ఎన్డీయే బలం పెరగడం, అనైక్యతతో కొట్టుమిట్టాడుతున్న విపక్షాల ‘ఇండియా’ కూటమి కొంత బలహీనపడిన నేపథ్యంలో ఈ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశాల్లో ఐదు కొత్త బిల్లులు, రెండు పెండింగ్ బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. అయోధ్యలోని రామాలయంలో కోట్ల కొలది విరాళాల చోరీ, నీట్ వంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, మోదీ సర్కార్ విదేశాంగ విధానంపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు అస్త్రశ్రస్తాలతో సిద్ధమయ్యాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తగిన సంఖ్యాబలం లేక వీగిపోయిన మహిళా రిజర్వేషన్ల బిల్లు, లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లులను ఈసారి అజెండాలో లేకపోయినా వీటిపై ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దేశంలో పన్నుల వ్యవస్థను మరింత సరళీకృతం చేయడం, కొన్ని నిబంధనలను సవరించడం, పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఆదాయపు పన్ను(సవరణ) బిల్లు–2026ను వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. విదేశీ నిధులు స్వీకరించే సంస్థలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు, పారదర్శకత పెంపు, పర్యవేక్షణను బలోపేతం కోసం విదేశీ విరాళాల నియంత్రణ(సవరణ) బిల్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రుణ సౌలభ్యం, వ్యాపార నిర్వహణలో సరళీకరణ, పెట్టుబడుల ప్రోత్సాహం కోసం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్కరణ బిల్లు, పుట్టిన తేదీ నమోదు, డిజిటల్ రికార్డులు, పరిపాలనా ప్రక్రియలను మరింత సమర్థవంతంగా మార్చే ప్రతిపాదనతో జనన నమోదు చట్ట సవరణ బిల్లుతోపాటు జాతీయ పతాకం, జాతీయ గీతం, రాజ్యాంగ విలువలకు సంబంధించిన చట్టాలను నవీకరించేందుకు జాతీయ గౌరవ అవమాన నివారణ(సవరణ) బిల్లు–2026ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. రెండు పెండింగ్ బిల్లులను తదుపరి ఆమోదం కోసం పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది. ఇందులో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు వీలుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య(సవరణ) బిల్లు ఉంది. పెరుగుతున్న కేసుల భారం తగ్గించి, పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే ధ్యేయంగా ఈ బిల్లును రూపొందించారు. ఉన్నత విద్యా రంగంలో సంస్కరణల కోసం వికసిత్ భారత్ విద్యా అధిష్టాన్ బిల్లు–2025ను సైతం కేంద్రం ప్రవేశపెట్టనుంది. అవినీతి, ధరల పెరుగుదల.. వర్షాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వం విధానాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. విద్యా వ్యవస్థలో పెరుగుతున్న అవినీతి, రాజ్యాంగబద్ధ సంస్థల దురి్వనియోగం, విపక్షాలను విచ్ఛిన్నం చేయడం, ధరల పెరుగుదల, విదేశాంగ విధానంలో వైఫల్యాలు, వ్యూహాత్మక తప్పిదాలు, ఇథనాల్ బ్లెండింగ్ విధానాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలపై దాడులు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైంది. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను భగ్నం చేయడంపైనా ఆందోళన చేపట్టాలని ప్రతిపక్షాల నిర్ణయించాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉభయ సభల్లో డిమాండ్ చేయబోతున్నాయి. 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీయేకు మద్దతు పలకడం, శివసేన(యూబీటీ)లో చీలికలు, డీఎంకే దూరం జరగడం వంటి పరిణామాల నేపథ్యంలో విపక్షాల ఐక్యత, బలం కాస్తంత తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని విపక్ష నాయకులు ఎంతమేరకు ఎదుర్కొంటారన్నది చూడాల్సి ఉంది. సమావేశాలు వాడీవేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ‘వందేమాతరం’ను అవమానిస్తే మూడేళ్ల జైలుసవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా జాతీయ గేయం ‘వందేమాతరం’ను అవమానించడం, ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం నేరంగా పరిగణించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ (సవరణ) బిల్లు–2026’ను నేడు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సవరణ చట్టం అమల్లోకి వస్తే, ఇప్పటివరకు జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణ ‘వందేమాతరం’కూ వర్తించనుంది. కొత్త బిల్లు ప్రకారం ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వందేమాతరం గానాన్ని అడ్డుకున్నా, ఆలాపిస్తుండగా అంతరాయం కలిగించినా వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించేలా చట్టం చేయనున్నారు. ఈ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం లభించి, రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టంగా అమల్లోకి వస్తుంది. దేశభక్తి భావనను మరింత బలోపేతం చేయడం, స్వాతంత్య్ర సమరంలో వందేమాతరం పోషించిన చారిత్రక పాత్రకు తగిన గుర్తింపు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ సవరణను తీసుకొస్తోంది. -
అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్ గేమ్!
మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తెర వెనుక కదలికలు మొదలయ్యాయా? కొంతకాలంగా దూరంగా ఉన్న రాజకీయ శిబిరాల మధ్య పెరుగుతున్న రాకపోకలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న నేతలు అధికార కూటమి పెద్దలను కలుస్తుండటం.. కీలక నాయకుల మధ్య జరుగుతున్న భేటీలు.. భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలను దశాబ్దాలుగా ప్రభావితం చేస్తున్న పవార్ కుటుంబం చుట్టూ చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఢిల్లీ నుంచి ముంబై వరకు హాట్‌టాపిక్‌గా మారాయి.ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో శరద్ పవార్ వర్గానికి చెందిన నేతల భేటీలు, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో శరద్ పవార్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ సమావేశాలు అధికారికంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసమేనని నేతలు చెబుతున్నప్పటికీ.. తెర వెనుక రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు మాత్రం జోరందుకున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలోని NCP (శరద్చంద్ర పవార్) ఎన్డీఏ వైపు అడుగులు వేయబోతోందా? అనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఈ పరిణామాల వెనుక బీజేపీ ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోందన్న చర్చ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.బీజేపీ వ్యూహం ప్రకారం.. ముందుగా విడిపోయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వర్గాలను మళ్లీ దగ్గర చేయడం, ఆ తర్వాతే ఎన్డీఏతో సంబంధాలపై ముందుకు వెళ్లడం లక్ష్యంగా కనిపిస్తోంది. అంటే కేవలం శరద్ పవార్ వర్గాన్ని కూటమిలోకి తీసుకోవడం కాకుండా.. మొత్తం ఎన్సీపీని ఒకే రాజకీయ శక్తిగా మార్చి ఎన్డీఏలోకి తీసుకురావాలన్న ఆలోచన ఉన్నట్లు సమాచారం.2023 జూలైలో అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీ-శివసేన (షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించి పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కేటాయించింది. శరద్ పవార్ వర్గం మాత్రం ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) పేరుతో కొనసాగుతోంది.ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ వర్గం అధికారంలో భాగస్వాములుగా ఉన్నాయి. మరోవైపు శరద్ పవార్ వర్గం ప్రతిపక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు దగ్గరవడం జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులకు అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.బీజేపీ వ్యూహంలో మూడు దశలు?రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. బీజేపీ వ్యూహం మూడు దశల్లో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మొదట పవార్ వర్గాల మధ్య సయోధ్యకు మార్గం సుగమం చేయడం, రెండో దశలో ఎన్సీపీ పునరేకీకరణ, మూడో దశలో ఎన్డీఏతో అధికారిక అనుబంధం వంటి అంశాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శరద్ పవార్ వర్గాన్ని నేరుగా ఎన్డీఏలోకి తీసుకోవడంపై బీజేపీలో కొంత సంకోచం ఉందని సమాచారం. ముందుగా పార్టీ అంతర్గత విభేదాలు పరిష్కారమైతేనే దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.బీజేపీకి అసలు లాభం ఏంటి?ఈ మొత్తం పరిణామాల్లో బీజేపీకి ఉన్న ప్రధాన రాజకీయ లాభం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో శరద్ పవార్‌కు దశాబ్దాలుగా ఉన్న రాజకీయ ప్రభావం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు ఉన్న పట్టు బీజేపీకి కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీకి అధికార బలం ఉన్నప్పటికీ.. మరాఠా రాజకీయాల్లో పవార్ కుటుంబ ప్రభావాన్ని పూర్తిగా పక్కన పెట్టడం అంత సులువు కాదు. శరద్ పవార్ వర్గం ఎన్డీఏకు దగ్గరైతే.. ప్రతిపక్ష శక్తులను బలహీనపరచడంతో పాటు, భవిష్యత్ ఎన్నికల్లో కూటమికి అదనపు బలం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ముఖ్యంగా 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చూస్తే.. మహారాష్ట్రలో ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయడం బీజేపీకి కీలక వ్యూహంగా మారనుంది. ప్రస్తుతం శరద్ పవార్ వర్గం ఇండియా కూటమిలో భాగంగా ఉండటం వల్ల ప్రతిపక్షాలకు ఓ రాజకీయ ఆధారం లభిస్తోంది. ఆ వర్గం ఎన్డీఏ వైపు వస్తే.. ఇండియా కూటమికి ఇది గట్టి ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా పార్లమెంట్లో కీలక బిల్లులపై సంఖ్యాబలం కూడా బీజేపీకి ఉపయోగపడుతుంది. లోక్‌సభలో ఎనిమిది మంది సభ్యులు ఉన్న NCP(SP) మద్దతు లేదా అనుకూల వైఖరి కేంద్రానికి రాజకీయంగా ప్రాధాన్యత కలిగించవచ్చు.మరోవైపు మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ రాజకీయాల్లో కూడా పవార్ వర్గాల కలయిక బీజేపీ-షిండే-అజిత్ కూటమికి అదనపు బలం ఇవ్వగలదన్న అంచనాలు ఉన్నాయి.అయితే దీనికి మరో వైపు కూడా ఉంది. శరద్ పవార్ వంటి సీనియర్ నేతను ఎన్డీఏలోకి తీసుకురావడం వల్ల కూటమిలో అంతర్గత సమతుల్యత ఎలా ఉంటుందన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గాల మధ్య సయోధ్య సాధ్యమవుతుందా? అన్నదే అసలు సవాల్‌గా మారనుంది.కేంద్ర కేబినెట్ ఆశలు.. అజిత్ వర్గం ఎదురుచూపులుఇదిలా ఉండగా.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేంద్ర స్థాయిలో మరింత ప్రాధాన్యత కోసం ఎదురుచూస్తోంది. భవిష్యత్ కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తమ పార్టీకి ప్రాతినిధ్యం రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు పార్థ్ పవార్‌కు కేంద్ర కేబినెట్లో అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే తుది నిర్ణయం మాత్రం ఢిల్లీ బీజేపీ పెద్దల చేతుల్లోనే ఉందని తెలుస్తోంది.ఆమె ఖండించినా.. కొనసాగుతున్న ప్రచారంమరోవైపు శరద్ పవార్ వర్గం మాత్రం ఎన్డీఏలో చేరే ప్రచారాన్ని ఖండిస్తోంది. NCP(SP) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కూడా ఇలాంటి వార్తలను పలుమార్లు తోసిపుచ్చారు. తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోందని, అలాంటి ఊహాగానాల్లో వాస్తవం లేదని ఆమె వ్యాఖ్యానించారు.అయితే పార్లమెంట్ లెక్కలు, రాబోయే రాజకీయ పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్ వర్గం ప్రాధాన్యతను కొట్టిపారేయలేమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. లోక్‌సభలో NCP(SP)కు ఉన్న ఎనిమిది మంది ఎంపీల సంఖ్య కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.మొత్తంగా చూస్తే.. మహారాష్ట్రలో బీజేపీ రాజకీయ లెక్కలు కొత్త దిశలో సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. పవార్ కుటుంబంలో మళ్లీ ఐక్యత వస్తుందా? ఎన్సీపీ పునరేకీకరణ జరుగుతుందా? లేక ఇవన్నీ కేవలం రాజకీయ వ్యూహంలో భాగమా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. -
మమతకు కాంగ్రెస్ బిగ్ షాక్.. ఇదేం ఫిట్టింగ్?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీ నుంచి అనూహ్య ఆహ్వానం వచ్చింది. అయితే ఈ ఆహ్వానంతో పాటు కాంగ్రెస్ ఓ కీలక షరతును కూడా విధించింది. కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేయడం తన రాజకీయ జీవితంలో చేసిన తప్పేనని మమతా బెనర్జీ అంగీకరిస్తేనే జూలై 21న జరిగే కార్యక్రమానికి రావాలని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేతలు సూచించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.కోల్‌కతాలోని షహీద్ మినార్ వద్ద జూలై 21న కాంగ్రెస్ నిర్వహించే కార్యక్రమానికి మమతా బెనర్జీని ఆహ్వానిస్తున్నామని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ తెలిపారు. అయితే 1998లో కాంగ్రెస్‌ను వీడి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించడం మమత తీసుకున్న రాజకీయంగా తప్పు నిర్ణయమని ఆమె అంగీకరించాలని ఆయన పేర్కొన్నారు.‘షహీద్ దివస్’..జూలై 21 రోజు మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో కూడా ప్రత్యేక ప్రాధాన్యత కలిగినది. 1993 జూలై 21న ఓటరు గుర్తింపు కార్డులను తప్పనిసరి చేయాలనే డిమాండ్‌తో అప్పటి యువ కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్న మమతా బెనర్జీ ఆధ్వర్యంలో కోల్‌కతాలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ ఆందోళన సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది కార్యకర్తలు మరణించారు. ఆ ఘటనకు గుర్తుగా మమతా బెనర్జీ ప్రతి ఏడాది జూలై 21ను ‘షహీద్ దివస్’గా నిర్వహిస్తూ వస్తున్నారు.అయితే ఈ ఘటన జరిగిన సమయంలో మమతా బెనర్జీ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాలు రావడంతో 1998లో పార్టీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. అనంతరం బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ క్రమంగా బలమైన శక్తిగా ఎదిగింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభావం రాష్ట్రంలో తగ్గుతూ వచ్చింది. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేతలు, మమతా బెనర్జీ కాంగ్రెస్‌ను వీడటం వల్ల రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారిపోయాయని అంటున్నారు. కాంగ్రెస్ బలహీనపడటం వల్లే బెంగాల్లో బీజేపీకి ఎదగడానికి అవకాశం లభించిందని వారు వాదిస్తున్నారు.కూటమి బీటలు.. శుభంకర్ సర్కార్ మాట్లాడుతూ, మమతా బెనర్జీ కాంగ్రెస్‌ను వీడకపోయి ఉంటే పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిస్థితులు మరోలా ఉండేవని వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి విడిపోవడం చారిత్రక తప్పిదమని ఆమె అంగీకరించాలని కోరారు. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ రెండూ ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో భాగస్వాములుగా ఉన్నప్పటికీ, పశ్చిమ బెంగాల్లో మాత్రం ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులుగానే కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో పరస్పర విమర్శలు, ఆరోపణలు తరచుగా వినిపిస్తుంటాయి. కాంగ్రెస్ ఆహ్వానం, విధించిన షరతుపై ఇప్పటివరకు మమతా బెనర్జీ లేదా తృణమూల్ కాంగ్రెస్ అధికారికంగా స్పందించలేదు. అయితే జూలై 21 కార్యక్రమానికి ముందు మమత స్పందన ఎలా ఉంటుందన్నది బెంగాల్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
తమిళ రాజకీయాల్లో భూకంపం.. తలుపులు మూసేసిన డీఎంకే
చెన్నై: తమిళనాడులో ఇండియా కూటమిలో పెరుగుతున్న విభేదాలు మరింత స్పష్టమయ్యాయి. మాజీ మిత్రపక్షమైన వీసీకే చేసిన విజ్ఞప్తిని డీఎంకే గట్టిగా తిరస్కరించింది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే కలిసి జాతీయ ప్రతిపక్ష కూటమి ‘‘ఇండియా’’లో చేరి బీజేపీని ఎదుర్కోవాలని వీసీకే కోరింది.తాజా వివాదానికి కారణం వీసీకే అధినేత తొల్ తిరుమావళవన్ చేసిన ప్రతిపాదన. కేరళ, పశ్చిమ బెంగాల్ తరహాలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా కొనసాగవచ్చని ఆయన సూచించారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పేర్కొంది. అయితే, డీఎంకే ఈ సూచనను తోసిపుచ్చింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమికి ద్రోహం చేసిందని ఆరోపించింది.డీఎంకేకు వెన్నుపోటు! డీఎంకే ఎంపీ గణపతి పి.రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత మంత్రి పదవులు దక్కించుకోవడానికే టీవీకేతో కాంగ్రెస్ చేతులు కలిపి డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. ఇండియా కూటమి విస్తృత ప్రయోజనాల కోణంలో కాంగ్రెస్ పరిస్థితిని చూడలేదని, ఇప్పుడు డీఎంకేను ఒప్పించేందుకు వీసీకేను "దూత"గా ఉపయోగిస్తోందని చెప్పారు. "వీసీకే ప్రతిపాదనను డీఎంకే నాయకత్వం అంగీకరిస్తుందని నేను అనుకోవడం లేదు. కేరళ, పశ్చిమ బెంగాల్ మోడల్ తమిళనాడులో పని చేయదు" అని ఆయన అన్నారు. టీవీకే మూడో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నా రాష్ట్రంలో ప్రత్యర్థులుగానే కొనసాగుతున్నాయని వివరించారు. తమిళనాడులో మాత్రం అధికారంలో ఉన్న కొత్త రాజకీయ శక్తి రంగంలోకి వచ్చిందని తెలిపారు.పార్లమెంట్లో ఒక్క ఎంపీ కూడా లేని టీవీకేను ఇండియా కూటమిలో భాగంగా పరిగణించాలా అనే అంశంపై కూడా ఆయన ప్రశ్నించారు. దీనిపై లోతైన ఆలోచన అవసరమని చెప్పారు. అదే సమయంలో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చాలన్న ప్రయత్నం చేస్తుండడంతో బీజేపీనే డీఎంకేకు ప్రధాన సైద్ధాంతిక ప్రత్యర్థి అని పేర్కొన్నారు. -
ఓట్ల లూటీపై సీజేఐకి విపక్షాల ఉమ్మడి ఫిర్యాదు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ (సర్) ప్రక్రియ, ఇతర ఎన్నికల అవకతవకలపై ఇండియా కూటమి నేతలు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌కు ఒక ఉమ్మడి లేఖను పంపారు. జూన్ 8న జరిగిన ఇండియా కూటమి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ద్వారా వెల్లడించారు. 21 political parties plus one Independent attended the INDIA janbandhan meeting on June 8, 2026 where a decision was taken to address a joint letter to the Hon’ble Chief Justice of India on the SIR process of the Election Commission of India and other election-related issues.…— Jairam Ramesh (@Jairam_Ramesh) June 30, 2026ఈ ఉమ్మడి లేఖపై మొత్తం 23 ప్రతిపక్ష పార్టీలతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి సంతకాలు చేశారు. ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగం కానప్పటికీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీలు కూడా ఈ లేఖకు మద్దతు తెలిపి, సంతకాలు చేసినట్లు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. ఎన్నికల్లో ఓట్ల లూటీ, అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ లేఖను చీఫ్ జస్టిస్‌కు అందజేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.Good going from INDIA. And yes, @AamAadmiParty @arivalayam DMK also signed the joint letter to CJI https://t.co/MtIpS7GdC4— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) June 30, 2026మరోవైపు దేశంలో లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ‘నీట్’, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరీక్షల వివాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఇండియా కూటమి నేతలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. తామంతా కలిసికట్టుగా ఈ సమస్యలపై పోరాడుతూ ముందుకు సాగుతామని ఖర్గే స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: విరాళాల వివాదం: కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ గృహ నిర్బంధం -
పొలిటికల్ హైడ్రామా.. హోటల్లో ఎన్డీయే ఎమ్మెల్యేల లాక్డౌన్!
రాంచీ: జార్ఖండ్‌లో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేపు (జూన్ 18న) జరగనున్న ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తమ ఎమ్మెల్యేలను రాంచీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు తరలించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. క్రాస్ ఓటింగ్, ఫిరాయింపుల భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.జార్ఖండ్ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు రేపు ఎన్నిక జరగనుంది. అధికార ఇండియా కూటమి తరఫున జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేత బైజ్నాథ్ రామ్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా బరిలో ఉండగా.. ఎన్డీయే మద్దతుతో ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో రెండో సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. జార్ఖండ్ అసెంబ్లీలో ప్రస్తుతం ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యసభ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారింది. ఓటింగ్ ఓపెన్ బ్యాలెట్ విధానంలో జరిగినప్పటికీ, కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించే అవకాశం ఉందనే అనుమానాలు ఇరు కూటముల్లోనూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే తమ ఎమ్మెల్యేలందరినీ ఒకేచోట ఉంచి, ఎన్నిక పూర్తయ్యే వరకు పర్యవేక్షించాలని నిర్ణయించింది.ఇండియా కూటమి అలర్ట్.. సమాచారం మేరకు.. బీజేపీ, ఏజేఎస్‌యూ (AJSU), లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) తదితర ఎన్డీయే భాగస్వామ్య పార్టీల ఎమ్మెల్యేలు రాంచీలోని విలాసవంతమైన హోటల్లో బస చేస్తున్నారు. అక్కడే సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియ, బ్యాలెట్ నిర్వహణ, పార్టీ విప్‌కు అనుగుణంగా ఓటు వేయాల్సిన విధానంపై ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా సూచనలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార ఇండియా కూటమి కూడా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) తదితర పార్టీల ఎమ్మెల్యేలను ఒకే వేదికపై ఉంచి ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఓటింగ్ విధానంపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం.సంఖ్యా బలమే..ఈ ఎన్నికలో పరిమల్ నత్వానీ అభ్యర్థిత్వం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కూడా జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయనకు అధికార, ప్రతిపక్ష శిబిరాల్లోనూ మంచి పరిచయాలు ఉండటంతో ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. దీంతో ఏ ఒక్క ఓటు కూడా వృథా కాకుండా చూసుకోవడానికి కూటములు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రాజ్యసభ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలను రిసార్ట్లు, హోటళ్లకు తరలించడం దేశ రాజకీయాల్లో కొత్త విషయం కాకపోయినా, జార్ఖండ్‌లో ఈసారి జరుగుతున్న పరిణామాలు ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార ఇండియా కూటమి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జూన్ 18న జరిగే ఓటింగ్‌తో ఈ రాజకీయ హైడ్రామాకు తెరపడనుంది. -
అమృతం బదులు విషం.. ఆయనో 'పెద్ద జోక్'!
ఒకప్పుడు కలిసి ఎన్నికలు పోరాడిన మిత్రపక్షాలు.. ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ప్రతిపక్ష ఐక్యతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపుతుండగా.. మాజీ మిత్రపక్షం డీఎంకే ఊహించని స్థాయిలో ఎదురుదాడికి దిగింది. అలాంటి పాఠాలు చెప్పే హక్కు అసలు రాహుల్‌కు ఉందా?" అంటూ ప్రశ్నించిన డీఎంకే.. 'ఇండియా' కూటమిలో ఏర్పడిన విభేదాలకు కాంగ్రెస్‌నే బాధ్యురాలిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది.డీఎంకే-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. రాహుల్ గాంధీపై ఆ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇటు డీఎంకే సోషల్ మీడియా విభాగం.. అటు అధికార పత్రిక మురసొలిలో వచ్చిన సంపాదకీయం కాంగ్రెస్ అగ్రనేతను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేసింది. రాజకీయంగా బలహీన స్థితిలో ఉన్నప్పుడు తమ పార్టీ కాంగ్రెస్‌కు అండగా నిలిచిందని, కానీ అవకాశం దొరకగానే కాంగ్రెస్ తమను వదిలేసిందని డీఎంకే సోషల్ మీడియా పేజీలు వరుస పోస్టులు పెడుతున్నాయి. అంతేకాకుండా రాహుల్ గాంధీని "పెద్ద జోక్.. రాజకీయ అపరిపక్వుడు"గా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేసింది.ఇక డీఎంకే అధికార పత్రిక మురసొలి సంపాదకీయంలో ఆ డోస్ మరింత ఎక్కువే కనిపించింది. ఇటీవల ఇండియా కూటమి సమావేశం అనంతరం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్ష ఐక్యత గురించి మాట్లాడే ముందు వివిధ రాష్ట్రాల్లో ఆ ఐక్యతను దెబ్బతీసింది ఎవరో ఆలోచించాలని సూచించింది. ముఖ్యంగా కేరళలో వామపక్షాలపై కాంగ్రెస్ వైఖరిని ప్రస్తావిస్తూ.. అక్కడి నేతలు గతంలో రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన విషయాన్ని గుర్తు చేసింది. అలాగే.. తమిళనాడులో ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలను కూడా డీఎంకే ప్రస్తావించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్.. అనంతరం ఆ కూటమి నుంచి బయటకు వచ్చి నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో భాగస్వామి కావడాన్ని డీఎంకే "ద్రోహం"గా అభివర్ణించింది. ఈ నిర్ణయానికి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కూడా ఆమోదం తెలిపిందని ఆరోపించింది. అలాగే ప్రస్తుతం ఇండియా కూటమిలో ఏర్పడుతున్న విభేదాలకు బీజేపీ కంటే కాంగ్రెస్ వైఖరే ఎక్కువ కారణమని మురసొలి సంపాదకీయం పేర్కొంది. రాహుల్ గాంధీ రాజకీయ పరిపక్వత లోపం, స్థిరమైన వ్యూహం లేకపోవడమే ప్రతిపక్ష శిబిరంలో అసంతృప్తికి దారితీస్తోందని డీఎంకే విమర్శించింది. ప్రతిపక్ష కూటమిలో అమృతం బదులు విషం కలిపింది ఎవరు? అంటూ ఆ వ్యాసాన్ని ముగించింది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ వర్గాలు ఖండించాయి. తమిళనాడులో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే విధంగానే పార్టీ నిర్ణయాలు తీసుకుందని, డీఎంకేను గానీ, ఇండియా కూటమిని గానీ బలహీనపరిచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాయి.ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కలిసిన మిత్రపక్షాలు ఇప్పుడు పరస్పరం విమర్శలు చేసుకోవడం.. ఇండియా కూటమి భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలను తెరపైకి తెస్తోంది. ప్రస్తుతం డీఎంకే-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ఎంత దూరం వెళ్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
మాట జారిన రాహుల్.. ఇండియా కూటమిలో దుమారం
తిరువనంతపురం: ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలపై విజయన్‌తో పాటు సీపీఎం అగ్రనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇండియా కూటమిలో ఐక్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఇంతకీ రాహుల్ ఏమన్నారంటే..ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో మిత్రపక్షాల మధ్య సంబంధాలపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కేరళ రాజకీయాలను ప్రస్తావిస్తూ..‘కేరళలో మేము సీపీఎంతో రాజకీయంగా పోరాడుతున్నాం. అక్కడ పినరాయి విజయన్ మా ప్రధాన ప్రత్యర్థి. అందుకే నేను వెళ్లి ఆయనను హగ్ చేసుకోలేను, చేయను కూడా’ అని కామెంట్స్. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.పినరాయి ఘాటు స్పందన..రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన పినరాయి విజయన్.. తనకు హగ్ చేయడం లేదా చేయకపోవడం అసలు సమస్య కాదన్నారు. అయితే ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశమే ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు.‘నన్ను హగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రాహుల్ గాంధీ గతంలో పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హగ్ చేసిన విషయం దేశం మొత్తం చూసింది. ఇప్పుడు నన్ను హగ్ చేయలేనని చెప్పడం ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. అంతేకాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పే కాంగ్రెస్ నాయకత్వం, అదే సమయంలో మిత్రపక్షాలపై దాడి చేయడం సరైన రాజకీయ విధానం కాదని విమర్శించారు.సీపీఎం నుంచి తీవ్ర ప్రతిస్పందన..రాహుల్ వ్యాఖ్యలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేజీ కూడా తీవ్రంగా స్పందించారు. ‘పినరాయి విజయన్ను హగ్ చేయమని ఎవరూ రాహుల్ గాంధీని అడగలేదు. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న ఆరోపణలను బలపరిచేలా మాట్లాడటం మాత్రం మానుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడులు బీజేపీకి రాజకీయంగా లాభం చేకూర్చేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు అనవసర వివాదాలకు దారితీస్తాయని అన్నారు.Mr Rahul Gandhi said in INDIA alliance meeting that he cannot hug his alliance partner CPM’s ex-CM Mr Pinarayi Vijayan because he has an ongoing political fight with him. pic.twitter.com/8G9OE0npcm— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) June 14, 2026కేరళలో కాంగ్రెస్-సీపీఎం ప్రత్యర్థులేఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఎం జాతీయ స్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ, కేరళలో మాత్రం రెండు పార్టీలు దశాబ్దాలుగా ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి. కేరళలో ఎల్డీఎఫ్కు సీపీఎం నాయకత్వం వహిస్తుండగా, యూడీఎఫ్‌కు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది. ప్రతి ఎన్నికలోనూ ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ జరుగుతుంది. అందువల్ల జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తున్నప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లో పరస్పరం విమర్శించుకోవడం కొనసాగుతోంది.కూటమికి కొత్త తలనొప్పి..ఇప్పటికే ఇండియా కూటమిలోని పలు మిత్రపక్షాల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ మధ్య, పంజాబ్‌లో కాంగ్రెస్-ఆప్ మధ్య, కేరళలో కాంగ్రెస్-సీపీఎం మధ్య రాజకీయ పోటీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూటమి ఐక్యతపై కొత్త సందేహాలకు తావిచ్చాయి. 2029 లోక్‌సభ ఎన్నికల దిశగా ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయాల్సిన సమయంలో మిత్రపక్షాల మధ్య బహిరంగ విమర్శలు కూటమికి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఇండియా కూటమి నాయకుల మధ్య పరస్పర విమర్శలు అధికార బీజేపీఒకి రాజకీయ అస్త్రంగా మారే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు వేదికలపై ఐక్యంగా ఉన్నామని చెబుతూనే, మరోవైపు పరస్పరం విమర్శించుకోవడం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుందని అభిప్రాయపడుతున్నారు. కాగా రాహుల్ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం కాంగ్రెస్-సీపీఎం మధ్య మాటల యుద్ధానికి దారితీయగా, ఇండియా కూటమి భవిష్యత్తుపై కూడా కొత్త చర్చకు తెరలేపింది. -
కాంగ్రెస్‌కు చెక్.. వ్యూహం మార్చిన స్టాలిన్!
సాక్షి, చెన్నై: జాతీయ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకోనుంది. ప్రస్తుత విపక్షాల ఇండియా కూటమి స్థానంలో, జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలతో ఒక సరికొత్త ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడానికి ద్రావిడ మున్నేట్ర కళగం(డీఎంకే) అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ ఈ మేరకు సరికొత్త వ్యూహానికి అమలు చేసే దిశగా పార్టీ కీలక నేతలైన సీనియర్ ఎంపీలను రంగంలోకి దించనున్నట్టు సమాచారం.ఈ జాతీయ కూటమి ఏర్పాటుకు సంబంధించి చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో సీనియర్లుగా ఉన్న ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కీలక ఎంపీలకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం గమనార్హం. ఈ ప్రతిపాదిత కూటమిలో భాగస్వామ్యం కావాల్సిందిగా ప్రాంతీయ పార్టీలకు డీఎంకే ఆహ్వానాలు పంపబోతున్నట్టు చర్చ జరుగుతోంది. నిన్నటి ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్, రాహుల్ తీరును అనేక పార్టీల నేతలు తీవ్రంగా దుయ్యబట్టి ఉండటాన్ని పరిగణించి ప్రాంతీయ పార్టీలకు చెందిన ఎంపీలు, ముఖ్య ప్రతినిధులతో తన ఎంపీల ద్వారా మాట్లాడించే దిశగా స్టాలిన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు తమిళనాట చర్చ ఊపందుకుంది. కాంగ్రెస్‌కు స్థానం లేదు.. ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కానున్న జట్టులో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టాలన్న నిర్ణయానికి స్టాలిన్ రావడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా కొత్త జట్టును ఏర్పాటు చేయడంలో భాగంగా పలు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉంటూ, కాంగ్రెస్ రూపంలో నష్టపోయిన పార్టీ నేతలతో సంప్రదింపునకు సన్నద్దం అవుతుండటం గమనార్హం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకం చేయడమే లక్ష్యంగా ఎంకె గ్రూప్ (డీఎంకే) అడుగుల వేగాన్ని మున్ముందు పెంచనున్నట్టు చర్చ జరుగుతున్నది. ‘ఇండియా’ కూటమి ఏర్పడినప్పటి నుండి కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే తాజాగా కాంగ్రెస్‌కు చెక్ పెట్టడం లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయనున్నడంతో మున్ముందు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో అన్న ఆసక్తి పెరిగినట్లయ్యింది. -
కేంద్రంపై సమరమే
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్ష ‘ఇండియా’కూటమి సమరశంఖం పూరించింది. మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను గట్టిగా తిప్పికొట్టాలని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం సాగించాలని నిర్ణయించింది. నీట్, సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కూటమి నేతలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముసుగులో సాగుతున్న ఓట్ల లూటీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు.ఇండియా కూటమి సమావేశం రెండేళ్ల విరామం తర్వాత సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్విని యోగం, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలపై భవిష్యత్ పోరాట కార్యాచరణపై రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. విపక్షాల ఐక్యతను చాటుతూ ఇకపై ప్రతి రెండు నెలలకోసారి సమావేశం కావాలని నిర్ణయానికి వచ్చారు. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్‌లో జరుగనుంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమా వేశాల్లో సమన్వయంతో పనిచేయాలని తీర్మానించారు. ఐక్యతను బలోపేతం చేసుకోవాలి మోదీ ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధాన సవాళ్లను ఎదుర్కొనేందుకు కూటమి ఐక్యతను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని మల్లికార్జున ఖర్గే చెప్పారు. దేశంలో రాజ్యాంగంపై దాడి కొనసాగు తోందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి పాల కులు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని ధ్వజమె త్తారు. కూటమి సమావేశంలో ఆయన ప్రారంభోపన్యా సం చేశారు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని, కొత్త పెట్టుబడులు రావడం లేదని, నూతన ఉద్యోగాల కల్పన జరగడం లేదని చెప్పారు.పరీక్షల వ్యవస్థలో అక్రమాలు లక్షలాది మంది యువత ఆశలను, ఆకాంక్షలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2026 ఏప్రిల్ 17న డీలిమిటేషన్‌పై మోడీ ప్రభుత్వ బిల్లులను ఓడించడానికి లోక్‌సభలో ప్రతిపక్షాలు గొప్ప ఐక్యతను ప్రదర్శించాయని గుర్తుచేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ పేరిట కోట్లాది మంది పౌరుల నుంచి ఓటు హక్కును లాగేసుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలపై కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.విదేశాంగ విధానంలో ప్రభుత్వం రాజీ నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, కొత్త పెట్టుబడులు రాకపోవడంతో ఆర్థిక వ్యవస్థ మందగించిందని కూటమి నేతలు పేర్కొన్నారు. కొన్ని రంగాల్లో ప్రైవేట్ గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పరీక్షల వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శించారు.కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని కూటమి పక్షాలు పట్టుబట్టాయి. దశాబ్దాలుగా దేశం పటిష్టంగా పాటిస్తున్న సంప్రదాయ విలువల నుంచి మోదీ సర్కార్ పక్కకు జరిగిందని, విదేశాంగ విధానంలో పూర్తిగా రాజీ పడిందని విపక్షాలు ఆక్షేపించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలహీన వర్గాలపై దాడులు ఆగడం లేదని మండిపడ్డాయి.హాజరైన 23 పార్టీల నేతలు విపక్ష కూటమి భేటీకి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ నేత సుప్రియా సూలే, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, సీపీఐ అగ్రనేత డి.రాజా, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ తదితరులు హాజరయ్యారు.శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ వర్చువల్‌గా పాల్గొన్నారు. మొత్తం 23 పార్టీల నాయకులు ఈ సమావేశంలో భాగస్వాములయ్యారు. 2024 జూన్ 1న ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి ఆరో సమావేశం జరిగింది. ఆ తర్వాత సోమవారం అగ్రనేతలంతా ఒకే వేదికపైకి వచ్చారు. విపక్షాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగడమే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఎన్సీపీ(ఎప్పీ) అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు.డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ గైర్హాజరు సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా సమావేశమైన విపక్ష కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ కీలక భేటీకి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ హాజరు కాకపోవడం గమనార్హం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, డీఎంకేల మధ్య దూరం పెరిగింది. ఇకపై తాము ఇండియా కూటమిలో భాగస్వామి కాదని డీఎంకే తాజాగా ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ గతంలోనే ఇండియా కూటమికి దూరమైంది. కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేతలు కూడా ఈ భేటీకి హాజరుకాలేదు.రాహుల్‌కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో సోమవారం ఉదయం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. రాహుల్ గాంధీకి నిలకడ లేదంటూ శరద్ పవార్ అన్నట్లుగా ఆ పోస్టర్లలో ముద్రించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని పోస్టర్లను చించివేశారు. వీటిని ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత రాలేదు.ఐదు అంశాలపై అంగీకారం: ఖర్గే దేశంలో అస్థిర ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, ప్రజా సంబంధిత అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేశారు. సోమవారం ఇండియా కూటమి భేటీ అనంతరం రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీతోపాటు ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు అంశాలపై తాము అంగీకారానికి వచ్చిననట్లు తెలిపారు. ఎస్ఐఆర్లో అక్రమాలు, ఓట్ల లూటీ, ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయయూర్తికి లేఖ రాయబోతున్నట్లు చెప్పారు.విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి కేంద్రం వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించాలని తేల్చిచెప్పారు. ఇకపై ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను లేవనెత్తబోతున్నామని, దీనికి కూటమి పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించాయని ఖర్గే పేర్కొన్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో సమన్వయంతో పనిచేస్తామని, ప్రతిరోజూ ఉదయం విపక్ష నేత చాంబర్లో తమ భేటీ జరుగుతుందని వెల్లడించారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ 2029 లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరును ప్రకటించాలని శివసేన(ఉద్ధవ్) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సోమవారం సూచించారు. బీజేపీ వ్యతి రేక కూటమి ఐక్యంగా ఉందని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించుకుంటామని తెలి పారు. ప్రధానమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించి రాబోయే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పారు. అవినీతిపరులను, దోపిడీదార్లను అధికారం నుంచి దించేయడమే ప్రజల ఎజెండా అని స్పష్టంచేశారు. -
రాహుల్ గాంధీ ప్రసంగం.. కూటమికి హెచ్చరిక!
ఇండియా కూటమి సమావేశంలో.. ప్రతిపక్షాల ఐక్యత అవసరాన్ని కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తావించారు. 'ఐక్యంగా ఉంటే బలం, విడిపోతే పతనం' అనే సందేశాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. బీజేపీని ఎదుర్కోవాలంటే కూటమిలోని అన్ని పార్టీలు పరస్పర విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని సూచించారు.కూటమి భాగస్వాములు ఒకరినొకరు విమర్శించుకోవడం లేదా బలహీనపరచుకోవడం మానుకోవాలని రాహుల్ గాంధీ హెచ్చరించారు. దేశం, రాజ్యాంగం రక్షణ కోసం ప్రతిపక్షాలు సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కొందరు మిత్రపక్షాలు ఎన్నికల ఓటర్ల జాబితాలపై కాంగ్రెస్ లేవనెత్తిన 'ఓటు చోరీ' ఆరోపణలకు తగిన మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ తరచుగా కాంగ్రెస్ పార్టీని విమర్శించే మమతా బెనర్జీకి చెందిన తృణమూల్, వామపక్షాల వంటి కూడా ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.ఈ సమావేశంలో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)పై ఉన్న అనుమానాలు, అక్రమాల ఆరోపణల అంశాన్ని కూడా చర్చించారు. ఈ విషయంపై దేశ ప్రధాన న్యాయమూర్తికి అధికారికంగా లేఖ రాయాలని కూటమి నిర్ణయించింది.బీజేపీని ఓడించడం అంత కష్టమైన విషయం కాదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ 240 స్థానాలను కైవసం చేసుకుంది, ఇది 2019లో గెలుచుకున్న 303 స్థానాల కన్నా చాలా తక్కువ. 2024లో కాంగ్రెస్ 99 స్థానాలకు ఎగబాకిందని తమ బలాన్ని గుర్తు చేశారు. అయితే.. ప్రతిపక్షాలు పరస్పరం పోట్లాడుకుంటూ తమ బలమే తగ్గిపోతుందని ఆయన హెచ్చరించారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ సమావేశంలో ఐక్యత ప్రాముఖ్యతను వివరించారు. 2026 ఏప్రిల్‌లో లోక్‌సభలో ప్రతిపక్షాలు కలిసి కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ బిల్లును ఓడించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అదే ఐక్యతను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశం ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ రంగాల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తర్వాత ఈ సమావేశం జరగడం విశేషం. ఆ ఎన్నికల్లో బీజేపీ అస్సాం, పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ కేరళలో విజయం సాధించింది. తమిళనాడులో నటుడు - రాజకీయ నాయకుడు విజయ్ భారీ విజయం సాధించారు. మూడేళ్ల క్రితం ఏర్పడిన ఇండియా కూటమి ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించింది. తదుపరి సమావేశం ఆగస్టులో హైదరాబాద్‌లో జరగనుంది. -
విద్యాశాఖ మంత్రి రాజీనామా?.. ఇండి కూటమి కీలక నిర్ణయం
సాక్షి, ఢిల్లీ: నీట్ పరీక్షపత్రాల లీకేజ్‌కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఈరోజు (సోమవారం) ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కూటమి నేతలు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిర్వహించే Sirపై త్వరలోనే భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు.కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం కోసం విపక్ష ఇండియా కూటమి ఈ రోజు ఢిల్లీలో సమావేశమైంది. ఈ మీటింగ్‌లో ఎన్డీఏపై పోరాటానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి 1 ఎన్నికల్లో ఓటు చోరీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం. 2 విద్యామంత్రి వెంటనే రాజీనామా చేయాలి . NEET, CBSE పరీక్షలు రాసిన లక్షలాది యువకులను మోసం చేశారు. 3 దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ఇతర సమస్యలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని పార్టీల సమావేశం పిలవాలి. 4 అన్ని పార్టీలు ప్రతి రెండు నెలలకొకసారి సమావేశం.తదుపరి సమావేశం ఆగస్టు నెలలో హైదరాబాద్‌లో జరుగుతుందని తెలిపారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో ఇండియా కూటమి ఐక్యత కొనసాగించాలని కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
‘ఇండియా’ను ముంచేసింది ఆ ఇద్దరే..’
న్యూఢిల్లీ: రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతూ, విపక్షాల ‘ఇండియా’ (INDIA) కూటమి విచ్ఛిన్నానికి గల అసలు కారణాలను జనతాదళ్ (యునైటెడ్) వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా బహిర్గతం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరే ఈ కూటమిని సర్వనాశనం చేశారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. నితీష్ కుమార్‌కు అత్యంత ఆప్తుడిగా పేరొందిన సంజయ్ ఝా, ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూటమి అంతర్గత సమావేశాల్లో జరిగిన రాజకీయ కుట్రలను బట్టబయలు చేశారు.‘ఆ ఇద్దరే కూటమిని ముంచేశారు’బీజేపీని ఎదుర్కొనేందుకు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏర్పడిన ఇండియా కూటమిలో తీవ్రమైన విభేదాలు ఉన్నాయని సంజయ్ ఝా అన్నారు. ‘ఇండియా కూటమిని ఇద్దరు వ్యక్తులు నాశనం చేశారు, నేను రికార్డు పరంగా చెబుతున్నాను: వారి పేర్లు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్’ అని ఆయన ఆరోపించారు. కూటమిలో ఎటువంటి స్పష్టమైన ప్రణాళిక, దార్శనికత లేదా ఐక్యత లేవని, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న తరుణంలో ఈ ఇద్దరు నాయకులు స్వార్థ రాజకీయాలతో కూటమిని దెబ్బతీశారని ఆయన మండిపడ్డారు.‘పక్కా ప్లాన్‌తోనే విధ్వంసం’2023 జూన్‌లో పట్నాలో జరిగిన ఇండియా కూటమి మొదటి కీలక సమావేశంలో నితీష్ కుమార్‌ను కూటమి కన్వీనర్‌గా నియమించేందుకు విస్తృతమైన అంగీకారం కుదిరిందని ఝా వెల్లడించారు. అయితే, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ముందస్తు వ్యూహంతోనే ఆ ప్రతిపాదనను అడ్డుకున్నారని తెలిపారు. దళిత నేతను కన్వీనర్‌గా చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తూ మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారని, దీనితో కాంగ్రెస్ వెనకడుగు వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నితీష్ కుమార్ కన్వీనర్ పదవి కోసం ఎప్పుడూ ఆశపడలేదని, అందరినీ ఒకే వేదికపైకి తేవడమే ఆయన లక్ష్యమని, కానీ ఆ ప్రయత్నాన్ని వారు పక్కా ప్లాన్‌తో దెబ్బకొట్టారని ఆరోపించారు.మారిన రాజకీయ సమీకరణలుఈ పరిణామాల తర్వాతే నితీష్ కుమార్ 2024 జనవరిలో ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే లోకి తిరిగి వెళ్లారని సంజయ్ ఝా గుర్తుచేశారు. ఇటీవల బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. కాగా, తాజాగా ఢిల్లీలో విపక్షాల వ్యూహాల పునఃసమీక్ష కోసం 23 రాజకీయ పార్టీల కీలక సమావేశం జరగనున్న తరుణంలో సంజయ్ ఝా చేసిన ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి.ఇది కూడా చదవండి: ‘దీదీ’కి మరో షాక్: ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా -
సీఎం విజయ్‌కి ‘ఇండియా’ కూటమి షాక్!
న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోలీవుడ్ స్టార్, సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉమ్మడి వ్యూహాన్ని రచించేందుకు నేడు (జూన్ 8) ఢిల్లీలో జరుగుతున్న కీలక ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశానికి సీఎం విజయ్‌కు ఆహ్వానం దక్కలేదు. తమిళనాడులో కాంగ్రెస్‌కు అత్యంత ఆప్తుడిగా మారిన విజయ్ ఈ భేటీకి హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ సమావేశానికి విజయ్ను పిలవకపోవడానికి గల కారణాలను కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం లోక్‌సభ లేదా రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పార్టీలను మాత్రమే ఈ భేటీకి ఆహ్వానించామని కూటమి నేతలు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుతానికి టీవీకే పార్టీ ఇంకా అధికారికంగా ఇండియా కూటమిలో భాగస్వామి కాలేదనే నెపంతోనే ఆయనకు ఈ మొండిచేయి ఎదురైనట్లు తెలుస్తోంది.అయితే లోపల సఖ్యతగా కనిపిస్తున్న ఈ కూటమిలో విజయ్ అంశం తీవ్ర కలకలానికి దారితీసింది. తమిళనాడు ఎన్నికల అనంతరం దశాబ్దాల మిత్రపక్షమైన డీఎంకేను పక్కనబెట్టి, విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై స్టాలిన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంతర్గత విభేదాల నేపథ్యంలో, అటు డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించడం, ఇటు సీఎం విజయ్‌కు ఆహ్వానం దక్కకపోవడంతో కూటమిలో సరికొత్త రాజకీయ సమీకరణలు చర్చనీయాంశంగా మారాయి.ఇది కూడా చదవండి: మిడిల్ ఈస్ట్ వీసా షాక్: ఆందోళనలో కేరళ నర్సులు! -
నేడే ఇండియా జనబంధన్
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో అధికార ఎన్డీయేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తమ కార్యాచరణను వేగవంతం చేస్తోంది. సోమవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో ‘ఇండియా జనబంధన్’ పేరిట కూటమి సమావేశం జరుగనుంది. ఈ భేటీకి 23 పార్టీల నేతలు హాజరు కాబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వెల్లడించారు. తమ కూటమిలో వైవిధ్యం ఉన్నప్పటికీ ఐక్యంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. కొన్ని పార్టీలు అనివార్య కారణాల వల్ల ఈ ప్రత్యేక సమావేశానికి హాజరుకాలేమని తెలియజేశాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ‘ఇండియా జనబంధన్’ భేటీ ప్రారంభమవుతుందని, 23 పార్టీల నాయకులు పాల్గొనబోతున్నట్లు నిర్ధారణ అయ్యిందని స్పష్టంచేశారు. ఉమ్మడి లక్ష్యం, స్పష్టమైన ఉద్దేశంతో ఈ సమావేశం జరుగనుందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. ఇండియా కూటమి ఐక్యంగా ఉందన్నారు. అనేక పార్టీలు ఈ సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని ఉద్ఘాటించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశి్చమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, సీపీఎం పార్టీ తదితరులు సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షమైన తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేతలు సైతం భేటీకి వస్తున్నట్లు వార్తలొచ్చాయి . కూటమిలో రచ్చరచ్చ 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. సోమవారం నాటి భేటీలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ప్రజా సమస్యలపై నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. కూటమిలో కొన్ని భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాలు దిగజారిన నేపథ్యంలో సమావేశం జరుగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ భేటీకి తాము హాజరు కావడంలోని డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. తమిళనాడులో కాంగ్రెస్ తమకు ద్రోహం చేసిందని, పదవుల కోసం తమిళగ వెట్రి కళగంతో చేతులు కలిపిందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు కేరళలో వామపక్షాలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ తదితరులు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణల పట్ల సీపీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. ఇండియా కూటమి సమావేశానికి సీపీఎం నుంచి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ హాజరు కానున్నట్లు సమాచారం. ఐక్యతపై అనుమానాలు: బీజేపీ సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాయడం చూస్తే ఇండియా కూటమి ఐక్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పేర్కొన్నారు. ఆ కూటమిలో విభేదాలు నానాటికీ పెరుగుతున్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. బేబీ రాసిన లేఖ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టిందని ఆయన చెప్పారు. విపక్ష కూటమికి ఒక లక్ష్యం, దార్శనికత లేవని ఆరోపించారు. కేవలం గందరగోళం, అనుమానాలు, ఆరోపణలు, పదవుల కోసం ఆరాటం మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కూటమిలోని పార్టీలు వేర్వేరు రాష్ట్రాల్లో పరస్పరం తలపడుతున్నాయని, ఇక ఐక్యత ఎక్కడుందని ప్రశ్నించారు.ప్రతిపక్షాల మధ్యసమన్వయం కోసమే..ఇండియా కూటమిలో కీలక పార్టీలైన డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్‌లు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, ప్రతిపక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నంగా ‘ఇండియా జనబంధన్’ సమావేశాన్ని పరిగణిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కొంతకాలంగా ‘ఇండియా’ కూటమికి దూరంగా ఉంటోంది. గతంలో పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇండియా కూటమి సమావేశమైంది. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం గురించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు.కేజ్రీవాల్‌తో మమత భేటీ భేటీ కోసం మమతా బెనర్జీ ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసినట్లు ప్రకటించిన ఆప్ చీఫ్‌తో టీఎంసీ చీఫ్ మమత భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం ఆతీ్మయంగా జరిగిందని టీఎంసీ వర్గాలు తెలిపాయి. తాజా రాజకీయ పరిణామాలతోపాటు తదుపరి కార్యాచరణపై వారిద్దరూ విస్తృతంగా చర్చించుకున్నారని వెల్లడించాయి. ఈ సందర్భంగా మమతా బెనర్జీ వెంట ఆమె మేనల్లుడు అభిõÙక్ బెనర్జీ వచ్చారు. -
డీఎంకే అవుట్.. టీవీకే ఇన్: రౌత్ వ్యాఖ్యలు
ముంబై: ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఎటువంటి విభేదాలు లేవని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. కూటమి నుంచి డీఎంకే బయటకు వెళ్లిపోవడంతో ఏర్పడిన ఖాళీ టీవీకే చేరికతో భర్తీ అయ్యిందన్నారు. ఈ నెల 8వ ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ హాజరవుతున్నందున తాము రాలేమని డీఎంకే ప్రకటించడంపై ఆయన ఈ మేరకు స్పందించారు.ఈ సందర్భంగా రౌత్.. ‘ఇండియా కూటమిలో చీలిక ఉందనడం తప్పు. తమిళనాడు ఎన్నికల తర్వాతే డీఎంకే కొంత దూరం పాటించడం ప్రారంభించింది. బదులుగా, కూటమిలోకి టీవీకే వచ్చింది. కూటమిలో చీలిక ఉందని అనకండి. ఇండియా కూటమికి ప్రత్యామ్నాయ మిత్రుడు ఉన్నాడని చెప్పండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబీ ఎన్నికల్లో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ఓటమి పాలై, సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే అధికారంలోకి రావడం తెల్సిందే. దీంతో, డీఎంకే కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. విజయ్ ప్రభుత్వానికి మద్దతు పలకడం తెల్సిందే. ఈ పరిణామం పట్ల డీఎంకే గుర్రుగా ఉంది. -
‘ఇండియా’ కూటమికి బీటలు
సాక్షి, చెన్నై: కేంద్రంలో అధికార ఎన్డీయేకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన విపక్ష ‘ఇండియా’కూటమి క్రమంగా విచ్చిన్నమవుతోంది. కూటమి నుంచి కీలక పార్టీ డీఎంకే దూరం జరుగుతోంది. ఢిల్లీలో ఈ నెల 8న జరగబోయే కూటమి కీలక సమావేశాన్ని తాము బహిష్కరిస్తున్నామని గురువారం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ పాల్గొనే ఏ సమావేశంలోనూ డీఎంకే భాగస్వామి కాబోదని తేల్చిచెప్పింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత కాంగ్రెస్ తమకు చేసిన నమ్మక ద్రోహం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన లక్షలాది మంది కార్యకర్తల భావోద్వేగాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంకే అధిష్టానం తేల్చిచెప్పింది. ఈ మేరకు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’ప్రత్యేక ప్రకటనను విడుదల చేసింది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జూన్ 8న జరగనున్న విపక్షాల సమావేశానికి తమకు ఆహా్వనం అందినట్టు వెల్లడించింది. అయితే, ఆ భేటీకి హాజరయ్యే ఆలోచన లేదని పేర్కొంది. ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీలు దేశ శ్రేయస్సు కోసం లేవనెత్తే సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంటామని ప్రకటించింది. విపక్ష కూటమి ఏర్పడిన నాటి నుంచి దానికి కేంద్ర బిందువుగా డీఎంకే పని చేసినట్లు గుర్తుచేసింది. లోక్‌సభలో ఇక వేర్వేరుగానే... లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుల నుంచి విడిగా కూర్చోవడానికి డీఎంకే ఎంపీలకు బుధవారం అనుమతి లభించింది. కాంగ్రెస్‌తో తమ పొత్తు ముగిసిందని, తమ సభ్యులు కాంగ్రెస్ సభ్యులతో కలిసి కూర్చోలేరని డీఎంకే గత నెలలో తేల్చిచెప్పింది. లోక్‌సభలో తమ ఎంపీల సీటింగ్ ఆరేంజ్‌మెంట్‌లో మార్పు చేయాలని కోరింది. కాంగ్రెస్ సభ్యులకు దూరంగా తమకు సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. దీనిపై లోక్‌సభ సెక్రెటేరియట్ సానుకూలంగా స్పందించి, అనుమతి ఇచి్చనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అందుకే కూటమికి దూరం.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో భాగంగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెల్చుకుంది. అయితే, ఎన్నికల ఫలితాల అనంతరం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. విజయ్ ప్రభుత్వ మంత్రివర్గంలోనూ చేరింది. ఎన్నికల ప్రచార సమయంలోనే డీఎంకే, కాంగ్రెస్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. డీఎంకే అధినేత స్టాలిన్‌తో ఒకే వేదికను పంచుకోవడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరాకరించారు. ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొన్నారు. దీంతో డీఎంకే, కాంగ్రెస్ బంధం పూర్తిగా తెగిపోయినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ఆ కూటమిలో డీఎంకే కీలక భాగస్వామిగా ఉండేది. తమ కూటమి తరఫున ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ అభ్యరి్థత్వాన్ని స్టాలిన్ ప్రతిపాదించారు. -
కేంద్రంపై పోరుకు ఉమ్మడి కార్యాచరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, కూటమిలో నెలకొన్న అభిప్రాయ భేదాల నేపథ్యంలో మరోమరు విపక్షాల ఐక్యత చాటేందుకు, కేంద్ర ప్రభుత్వంపై పోరుకు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించేందుకు విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు 8వ తేదీన హస్తినలో భేటీకానున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సహా మొత్తం 15 పార్టీల అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం, ప్రతిపక్ష ఐక్యతను మరింత బలోపేతం చేయడం భేటీ ప్రధాన లక్ష్యాలుగా తెలుస్తోంది. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు, నిరుద్యోగం, ప్రతిష్టాత్మక పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, అంతర్జాతీయ పరిస్థితులు వంటి ప్రజా సమస్యలపై సంయుక్త పోరాటానికి భేటీలో వ్యూహాలు ఖరారు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతర పరిణామాలు, వివిధ రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశముంది. అయితే ‘ఇండియా’ కూటమిలోని కొన్ని పార్టీల మధ్య ఇటీవల అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు వార్తలు రావడం కూటమిలో గందరోగళం నెలకొంది. ‘ఇండియా’ కూటమితో తెగదెంపులు చేసుకున్న ఆప్ పార్టీ ప్రతి పక్షాల కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. తమిళనాడు ఎన్నికల అనంతరం పరిణాల నేపథ్యంలో కాంగ్రెస్‌తో తన బంధాన్ని తెంచుకుంటున్నట్లు డీఎంకే ప్రకటించింది. తమిళనాడులో కాంగ్రెస్‌తో పొత్తు తెగిపోయిన నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీలకు దూరంగా కూర్చోవాలని డీఎంకే నిర్ణయించింది. డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి కొద్ది రోజుల కిందటే లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసి తమ ఎంపీలకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో డీఎంకే సమావేశానికి దూరంగా ఉండే అవకాశమున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో డీఎంకే స్థానంలో విజయ్ జోసెఫ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి ప్రాధాన్యం లభించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
ఇండియా కూటమిపై మమత కీలక ప్రకటన
కోల్‌కతా: ప్రతిపక్ష ఇండియా కూటమిపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి భేటీ జూన్ మొదటి వారంలోనే జరిగే అవకాశాలున్నాయని మమతా బెనర్జీ చెప్పారు. ఈ భేటీలో ఉమ్మడి వ్యూహాన్ని చర్చిస్తామని చెప్పారు. అధికార బీజేపీతో సుదీర్ఘ రాజకీయ పోరాటానికి తమ కూటమి సిద్ధంగా ఉందని ఆమె ప్రకటించారు.ఈ సందర్భంగా ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలకు బీజేపీ పాల్పడిందన్నారు. కనీసం 150 నియోజకవర్గాల్లో టీఎంసీకి దక్కాల్సిన ఓట్లను తారుమారు చేశారని ఆరోపించారు. ఓడిపోయే సీట్లను గెల్చుకుని, గెలవాల్సిన చోట్ల ఓడిపోయామన్నారు. లేకుంటే టీఎంసీకి 220 నుంచి 230 సీట్లు దక్కి ఉండేవని చెప్పారు.మమత వాదనను బీజేపీ నాయకురాలు కీయా ఘోష్ ఖండించారు. ప్రజల తీర్పును అంగీకరించేందుకు నిరాకరిస్తున్న మమతా బెనర్జీ, బదులుగా కుట్ర సిద్ధాంతాలతో ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. 2011, 2016, 2021 ఎన్నికల ఫలితాలను చట్టబద్ధమైనవిగా అంగీకరించి, ఇప్పుడెందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారంటూ మమతను నిలదీశారు. మమత దృష్టిలో గెలుపంటే.. బూత్‌లను ఆక్రమించుకోవడం, రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడటం, హింసను ప్రేరేపించడమేనని ఆమె వ్యాఖ్యానించారు. -
ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై
సాక్షి,చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో, డీఎంకే ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పింది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసి, డీఎంకే ఎంపీలకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చోబోమని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ లేఖతో డీఎంకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి.కాంగ్రెస్ ఇటీవల టీవీకేకు మద్దతు ప్రకటించడం డీఎంకేకు పెద్ద షాక్‌గా మారింది. డీఎంకే నేతృత్వం దీనిని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌కు ద్రోహంగా అభివర్ణించింది. దీంతో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే-కాంగ్రెస్ పొత్తు ఒక్కసారిగా ముగిసింది.డీఎంకే ఈ నిర్ణయం వల్ల ఇండియా కూటమి బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, టీవీకే-కాంగ్రెస్ కూటమి బలపడుతుందని అంచనా. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు,కొత్త వ్యూహాలు రూపుదిద్దుకునే అవకాశం ఉంది. -
రాహుల్‌పై లాలూ పెద్ద కొడుకు కీలక వ్యాఖ్యలు
పట్నా: కేంద్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమిని నడిపించే సత్తా రాహుల్ గాంధీకి లేదని లాలూ ప్రసాద్ పెద్ద కొడుకు, జనశక్తి జనతా దళ్ వ్యవస్థాపకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీ వాద్రాను ఇండియా కూటమి ఫేస్‌గా ఆయన వర్ణించారు. ప్రియాంక మాత్రమే సమర్థవంతంగా విపక్ష కూటమిని నడపగలరని అభిప్రాయపడ్డారు. పట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకను ఇందిరా గాంధీతో పోల్చారు.''కేంద్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమిని ప్రియాంక గాంధీ మాత్రమే నడపగలరు. ఆమె ఇందిరా గాంధీ లాంటివారు. యాత్రకు వెళ్లడం, బుల్లెట్‌పై కూర్చోవడం ద్వారా రాహుల్ గాంధీ కూటమిని నడపలేరు. బిహార్ నుంచి నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, మరొకరు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఉద్దేశ్యం ఏమిటి?" అని తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రశ్నించారు.ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడం ద్వారా నితీశ్ కుమార్ రాజీపడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో తేజ్ ప్రతాప్ స్పందించారు. ''రాహుల్ గాంధీ ఇప్పుడు నితీశ్ కుమార్ గురించి మాట్లాడుతున్నారు. నితీశ్ తన పదవిని వదులుకున్నారు. ఇప్పుడు మరొకరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన (రాహుల్ గాంధీ) మరో రాష్ట్రంలో ఉన్నారు. అలాంటప్పుడు బిహార్ సీటు విషయంలో ఎందుకు అత్యాశ పడుతున్నారు?” అని తేజ్ ప్రతాప్ యాదవ్ నిలదీశారు.యాదవ్‌పై రాజ్ ఫైర్తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉదిత్ రాజ్ స్పందించారు. లాలూ కుమారుడికి రాజకీయ పరిజ్ఞానం లేదని, ఆయన మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరని అన్నారు. అనవసరపు మాటలు కట్టిపెట్టి తన సొంత పనిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కాగా, ఇండియా కూటమిని నడిపే సత్తా రాహుల్‌కు లేదని గతంలోనూ పలువురు నాయకులు వ్యాఖ్యానించారు. చదవండి: హమ్మయ్య! అమిషాను నవ్వించాం.. రాహుల్ సరదా వ్యాఖ్యలురాహుల్ గాంధీ ఏమన్నారంటే..తమిళనాడు ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ''బిహార్ తరహా రాజకీయాలు తమిళనాట కుదరవని అన్నారు. కొద్ది రోజుల క్రితం బిహార్‌లో ఏం జరిగిందో చూడండి. బిహార్ ముఖ్యమంత్రిని తొలగించి బీజేపీ నాయకుడిని సీఎం సీటులో కూర్చొబెట్టారు. ఎందుకంటే సీఎం రాజీపడ్డారు. పదవి నుంచి ఎందుకు తొలగించారని ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మౌనంగా రాజ్యసభకు వెళ్లిపోయారు. బీజేపీ ఆయనను కంట్రోల్ చేసింది. ఇదే విధానం తమిళనాడులో అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. కాషాయ పార్టీ కలలను ఇండియా కూటమి భగ్నం చేస్తుంద''ని అన్నారు. -
‘పునర్వీభజన’కు వ్యతిరేకంగా ఓటేస్తాం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లులోని నియోజకవర్గాల పునర్వీభజన నిబంధనలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని వెల్లడించాయి. సంబంధిత బిల్లును తీసుకొస్తున్న విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇది రాజకీయ ప్రేరేపిత బిల్లు అని ఆరోపించారు. విపక్ష ‘ఇండియా’కూటమి పార్టీల నేతలు బుధవారం ఢిల్లీలో ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. భేటీ అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. మహిళ రిజర్వేషన్ల బిల్లును తీసుకొస్తున్న విధానం పట్ల తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షాలను అణచివేసి బిల్లును నెగ్గించుకోవాలన్నదే ప్రభుత్వ ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్లకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. గతంలో ఆమోదించిన సవరణ బిల్లును అమలు చేయాలని కోరుతున్నామని, ప్రభుత్వం మాత్రం డీలిమిటేషన్ పేరిట డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో డీలిమిటేషన్ వ్యవహారాన్ని వ్యతిరేకించాలని ఉమ్మడిగా నిర్ణయించినట్లు స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. స్పష్టత లేని జనగణన, భవిష్యత్తు డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్లను ముడిపెట్టొద్దని కోరారు. పార్లమెంట్ వద్ద ఉండాల్సిన అధికారాలను కార్యనిర్వాహక వర్గానికి కల్పిస్తూ, రాజకీయంగా అనుకూలమైనప్పుడల్లా నియోజకవర్గాలను మార్చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అస్సాం, జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి మోసం చూశామని ఖర్గే తెలిపారు. అందుకే నియోజకవర్గాల పునర్వీభజనను కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. అధికారం కోసమే ఈ కుతంత్రం: రాహుల్ మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తోందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఈ బిల్లును 2023లో పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్లు ఇప్పటికే రాజ్యాంగంలో భాగమేనని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదిస్తున్న దానికి మహిళా రిజర్వేషన్లతో ఎలాంటి సంబంధం లేదన్నారు. డీలిమిటేషన్‌తో అధికారం దక్కించుకోవాలన్న కుతంత్రం తప్ప ఇందులో ఇంకేముందని ప్రశ్నించారు. విపక్షాల భేటీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కుల గణన డేటాను విస్మరించి ఓబీసీ, దళిత, ఆదివాసీల హక్కులను చోరీ చేస్తే సహించబోమని హెచ్చరించారు. అలాగే దక్షిణ, ఈశాన్య, వాయువ్య, చిన్న రాష్ట్రాల పట్ల అన్యాయంగా వ్యవహరించడాన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ప్రమాదకరం: కె.సి.వేణుగోపాల్మోదీ ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన చర్య ప్రమాదకరమైనదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై, ముఖ్యంగా రాష్ట్రాలకు సమాన అధికారాన్ని కల్పించే సమాఖ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. విపక్ష నేతల సమావేశంలో డీఎంకే నాయకుడు టి.ఆర్.బాలు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సాగరికా ఘోష్, శివసేన(ఉద్ధవ్) నాయకులు సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు. -
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానానికి నోటీసు?
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్‌పై అభిశంసన తీర్మానానికి నోటీసు ఇవ్వాలని విపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌తో పాటు ఇతర భాగస్వామ్య పార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ (ఓటరు ప్రత్యేక సవరణ)కు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీతో పాటు ఇండియా కూటమి విపక్షాలు ఈ తీర్మానాన్ని ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ అభిశంసన తీర్మానంపై మొత్తం 193 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో 130 మంది లోక్‌సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ (సర్) పేరుతో ఎన్నికల సంఘం ఏకపక్షంగా విపక్ష పార్టీల ఓటర్లను తొలగిస్తోందని. ఈ చర్య ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తోందని ఇండియా కూటమి నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌పై అభిశంసన తీర్మానం విపక్షాల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచింది. ఈ తీర్మానం ద్వారా విపక్షాలు ఎన్నికల సంఘం తీరుపై తమ అసంతృప్తిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇకపై ఈ అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ఎలా ముందుకు సాగుతుందో, ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
మోదీ మార్క్ రాజకీయం.. ఇండియా కూటమికి బిగ్ షాక్
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభంజనం కొనసాగుతోంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై తాజాగా ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని సర్వేలో పేర్కొంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 182 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. దీంతో, రానున్న ఎన్నికల్లో కూడా కేంద్రంలో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో, కాషాయ పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నెలకొంది.ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ప్రకారం.. ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించే అవకాశం ఉందని తేలింది. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి 41 శాతం(287 సీట్లు), కాంగ్రెస్ పార్టీకి 20 శాతం(80సీట్లు), మిగతా పార్టీలకు 39 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55 శాతం మంది భావించినట్లు సర్వే వెల్లడించింది. కాగా, ఆరు నెలల కిందటితో పోల్చితే మూడు శాతం ఓటింగ్ పెరిగినట్లు స్పష్టం చేసింది. ప్రధాని మోదీ పనితీరుపై 57 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాహుల్ గాంధీ 27 శాతం మంది మొగ్గు చూపినట్లు సమాచారం.#MoodOfTheNation | BJP at 41% vote share, Congress at 20% if polls are held todayProjected seat shareBJP - 287 Congress - 80 BJP national spokesperson @Sanju_Verma_ decodes the findings of the #MOTN survey.@BJP4India | @SardesaiRajdeep @maryashakil pic.twitter.com/luJIoaCpER— IndiaToday (@IndiaToday) January 29, 2026ఇక, ఆగస్టు 2025లో నిర్వహించిన ఇండియా టుడే సర్వేలో ఎన్డీయేకి 324 సీట్లు, ఇండియా బ్లాక్‌కు 208 సీట్లు వస్తాయని అంచనా వేశారు. తాజా సర్వేలో ఎన్డీయే సీట్ల సంఖ్య మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 293 సీట్లు, ఇండియా బ్లాక్ 234 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. మరోవైపు.. తాజా సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అలాగే, ఇండియా బ్లాక్ ఈ సర్వేలను జాగ్రత్తగా తీసుకోవాలని, అసలు పోరు ఎన్నికల సమయంలోనే తేలుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. మోదీ వేవ్‌లో భాగంగా 2025లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి.. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 2026 కూడా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో విజయాలతో శుభారంభం చేసింది. ప్రస్తుతానికి ఎన్డీయే కూటమి ఫోకస్ మొత్తం రానున్న బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. ఆయా రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో మోదీ ముందుకు సాగుతున్నారు. -
డ్రామాలొద్దు..!
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కొద్దిసేపటిముందు పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షసభ్యులకు హితబోధచేస్తూ ప్రధాని మోదీ పలు విమర్శనాత్మక, వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ‘‘ పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కసరత్తు చేసే వ్యాయామశాలగా పార్లమెంట్‌ను మార్చొద్దు. ఇటీవల ముగిసిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన విపక్షపార్టీలు ఆ నైరాశ్యాన్ని పార్లమెంట్లో ప్రదర్శించాలనుకుంటున్నాయి. పార్లమెంట్ పవిత్రమైంది. ఇది నాటకాలు వేసే రంగస్థలం కాదు. పార్లమెంట్ అనేది నిర్మాణాత్మకమైన, ఫలవంతమైన చర్చలు, సద్విమర్శలకు పట్టుగొమ్మ. బలమైన ఆధారాలతో ప్రభుత్వంపై విమర్శలకు విపక్షాలు దిగుతాయంటే నేను సైతం వారికి కొన్ని చిట్కాలు చెబుతా’’ అని మోదీ చురకలంటించారు.డ్రామాలకు వేరే స్థలాలున్నాయ్..‘‘నాటకాలు ప్రదర్శించడానికి పార్లమెంట్ వేదిక కాదు. వాటికి వేరే వేదికలున్నాయి. అక్కడ వేసుకోండి మీ డ్రామాలు. ఇది ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ చట్టాలుచేసే పవిత్ర స్థలి. డ్రామాలొద్దు.. పనిచూడండి. అయినాసరే నినాదాలు చేస్తామంటే మీరు దేశంలో ఎక్కడైనా చేసుకోండి. గతంలో ఓడిపోయిన రాష్ట్రాల్లోనూ పెద్దపెద్ద ప్రసంగాలిచ్చారు. భవిష్యత్తులో ఓటమిని చవిచూడబోయే నియోజకవర్గాలకు వెళ్లి ప్రసంగాలివ్వండి. పార్లమెంట్ విషయానికొచ్చేసరికి మీ దృష్టంతా కేవలం విధానపర నిర్ణయాలపై జరపాల్సిన విస్తృతస్థాయి చర్చల మీదనే ఉండాలి. నినాదాల మీద కాదు. బిహార్‌లో మా అద్వితీయమైన విజయాన్ని చూశాకైనా విపక్ష సభ్యులు బాధ్యతతో వారి నియోజకవర్గాల్లో పనులు నిర్వర్తించాలని తెలుసుకోవాలి. అంతేగానీ రాబోయే ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు కసరత్తు క్రీడాస్థలిగా పార్లమెంట్‌ను దుర్వినియోగం చేయొద్దు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు‘‘బిహార్‌లో ఎదురైన ఘోర పరాభవాన్ని విపక్షపార్టీలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ ఓటమి నుంచి పుట్టుకొచ్చిన ఆక్రోశంతో పార్లమెంట్ వంటి వేదికలపై గందరగోళం సృష్టించకూడదు. మా విజయం కూడా దురహంకారంగా ఏమీ మార బోదు. సమాచారాత్మక సద్విమర్శను మేం కోరుకుంటున్నాం. సభ్యులందరూ నిర్మాణాత్మక, కచ్చితత్వంతో కూడిన సద్విమర్శలకే పెద్దపీట వేయాలి. అప్పుడే పౌరులకు సైతం మన నుంచి సరైన సందేశం వెళ్తుంది. ఇలాంటి సంస్కృతినే పార్లమెంట్ సమావేశాల నుంచి పౌరులు కోరుకుంటున్నారు. దేశానికి ఇదే అత్యావశ్యకం’’ అని మోదీ అన్నారు. ‘‘పార్లమెంట్ కార్యకలాపాలపై విపక్షాల ఓటమి నీడ పడకుండా చూసుకోవాలి. ఈసారి శీతాకాల సమావేశాల్లో అన్ని పార్టీల సభ్యుల నుంచి బాధ్యత, సమతుల్యత, సమగౌరవాన్ని ఆశిస్తున్నా. బిహార్ ఎన్నికల్లో నమోదైన అత్యధిక పోలింగ్ శాతం అనేది ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని చాటుతోంది. ఈ ఎన్నికల ఓటమి నుంచి విపక్షాలు వెనువెంటనే తేరుకొని తమ విపక్షపాత్రను సమర్థవంతంగా పోషిస్తాయని ఆశిస్తున్నా’’అని అన్నారు.వాళ్ల పదేళ్ల ఆటను జనం మెచ్చలేదు‘‘విపక్ష పార్టీలు గత దశాబ్దాకాలంగా ఆడుతున్న రాజకీయ క్రీడలను ఇప్పటికీ పౌరులు మెచ్చట్లేరు. ఇకనైనా ఆట తీరును విపక్షాలు మార్చుకోవాలి. ఈ విషయంలో ఏమైనా సలహాలు ఇచ్చేందుకు నేను సిద్ధం. కావాలంటే కొన్ని చిట్కాలు చెప్తా’’ అని మోదీ వెటకారంగా మాట్లాడారు. ‘‘ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు నెరవేర్చాల్సిన విధ్యుక్తధర్మాన్ని గుర్తెరగాలి. ఓటమి నుంచి వాళ్లింకా తేరుకోలేదని నిన్న వాళ్ల నేతలు చేసిన ప్రసంగాలు వింటే అర్థమవుతోంది. ఓటమి అనేది వాళ్లను ఎంతగా చిత్రవధ చేస్తోందో తెలుస్తోంది’’ అని అన్నారు. ‘‘సభలో చర్చల వేళ కొత్త తరం సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పించాలి. అనుభవజ్ఞుల అనుభవసారాన్ని పార్లమెంట్ గ్రహిస్తూనే భావినేతల తాజా ఆలోచనలకూ పార్లమెంట్ తగు ప్రాతినిధ్యం కల్పిస్తుంది’’ అని మోదీ అన్నారు. Speaking at the start of the Winter Session of Parliament. May the session witness productive discussions. https://t.co/7e6UuclIoz— Narendra Modi (@narendramodi) December 1, 2025 ఇదీ చదవండి: పార్లమెంట్లో ఏపీ గళం వినిపించండి -
ఇండియా కూటమికి టాటా చెప్పే యోచనలో..
తీవ్ర సంక్షోభం దిశగా ఇండియా కూటమి రాజకీయం నడుస్తోంది. బిహార్ ఓటమికి కారణం కాంగ్రెస్ పార్టీ వైఖరేనంటూ ప్రధాన మిత్రపక్షాలు వెలేత్తి చూపిస్తున్నాయి. ప్రధానంగా ఆ పార్టీ వ్యూహాలను, నాయకత్వ లోపాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటిదాకా అంతర్గతంగా ఉన్న అసంతృప్తిని ఆ ఒక్క ఫలితం ఇప్పుడు విమర్శల రూపంలో బహిరంగ సంక్షోభంగా మార్చింది. కూటమిలోనే కొనసాగాలా? స్వతంత్ర మార్గం ఎంచుకోవాలా?.. అనే డైలామాలో ఇండియా కూటమి పార్టీలను పడేసింది. బిహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాల్లో అలిగిన జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM).. స్వతంత్రంగా కూడా పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయింది. కూటమి పెద్దన్న తమను మోసం చేసిందని.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఓపెన్‌గా కాంగ్రెస్‌పైనే ఆరోపణలు గుప్పించింది. తమను జూనియర్ పార్ట్నర్లా అవమానకర రీతిలో చూస్తున్న కూటమిలో కొనసాగాలా.. వద్దా? అనేది త్వరలో నిర్ణయిస్తామని ప్రకటించింది కూడా.మరో ఇండియా కూటమి పార్టీ.. శివసేన (UBT) బీహార్ ఫలితాన్ని ‘‘వేకప్ కాల్’’గా అభివర్ణించింది. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమిష్టి వ్యూహం దెబ్బతిందని ఆరోపించింది. మిత్రపక్షాలతో జాతీయ పార్టీ సంప్రదింపులు లేకుండా ముందుకు వెళితే కూటమి నిలవదని హెచ్చరిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేశ్ యాదవ్ బీహార్ ఎన్నికల్లో మిత్రపక్ష కూటమి వ్యవహరించిన తీరు నుంచి లోపాల్ని ఎత్తిచూపారు. ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. భవిష్యత్తులో ఇలాంటి జోక్యాలు జరగకుండా చూసుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్‌కు హితవు పలికారు. ఈ క్రమంలో ఇండియా కూటమి బాధ్యతల నుంచి కాంగ్రెస్ తప్పుకుని.. ఆ బాధ్యతల్ని అఖిలేష్‌కు అప్పగించాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తుండడం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ది మరో పంథా. కూటమిలో మొదటి నుంచి ఆ పార్టీ స్వతంత్ర ధోరణి అవలంభిస్తోంది. రాష్ట్ర స్థాయి విస్తరణను జాతీయ వేదిక కోసం త్యాగం చేయలేమని ఇప్పటికే స్పష్టం చేసింది. అంతెందుకు బీహార్‌లో స్వతంత్రంగా పోటీ చేసిన ఆప్ నిర్ణయం ఓ ముందస్తు హెచ్చరిక అని.. ఈ స్వతంత్ర ధోరణి ఇతర మిత్రపక్షాలకు కూడా ఆదర్శంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. డీఎంకే ఏమందంటే.. బిహార్‌లో ఎన్డీయే విజయం కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి ఓ పాఠం అని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అన్నారు. కూటమి వ్యూహం, నాయకత్వం, సమన్వయంపై పునరాలోచన అవసరమని సూచించారు.అబ్బే.. అలాంటిదేం లేదుబిహార్లో బలహీన ప్రదర్శనతో కాంగ్రెస్ పైనే విమర్శలు ఎక్కువగా వినవస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కార్నర్ చేస్తూ ప్రత్యర్థులూ సెటైర్లు సంధిస్తున్నారు. ఈ తరుణంలో ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక, సంస్థాగత విధానాల్లో మార్పులు చేయకపోతే కూటమి నిలవబోదంటూ మిత్రపక్షాలు హెచ్చరిస్తున్నాయి. అయితే కూటమి భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ భిన్నంగా స్పందించింది. మిత్రపక్షాలు నిష్క్రమించే యోచనలో ఉన్నాయన్న ప్రచారాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కొట్టిపారేశారు. ‘‘ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది. ఏ ఓటమి కూడా కూటమిని ప్రభావితం చేయలేదు. తమిళనాడు ఎన్నికలకు డీఎంకేతో.. అసోం ఎన్నికల కోసం అక్కడి మిత్రపక్షాలతో వెళ్లబోతున్నాం. రాబోయే రోజుల్లో కూటమిని మరింత బలోపేతం చేస్తాం. ప్రాంతీయ పార్టీలతో చిన్న చిన్న సమస్యలున్నా.. జాతీయ స్థాయిలో బీజేపీ రాజకీయాలను ఎదుర్కోవడానికి మిత్రపక్షాలతో కలిసి పనిచేసి తీరతాం’’ అని ప్రకటించారాయన. అలా అయితే కష్టమే!ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు ఆచితూచి ఉండాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిత్రపక్షాల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు తక్షణ సంప్రదింపులు జరపాలని, సీట్ల పంపకాల విషయంలోనూ జాగ్రత్తగా కాంగ్రెస్‌కు సూచిస్తున్నారు. నాయకత్వ లోపాలను సవరించుకోకపోతే.. మార్పును కోరుకునే గళాలు రాబోయే రోజుల్లో పెరగొచ్చని, అది కూటమి విచ్ఛిన్నానికి దారి తీయక తప్పదని హెచ్చరిస్తున్నారు. -
ఇండియా కూటమి సారథిగా అఖిలేష్ యాదవ్!?
ప్రతిపక్ష ఇండియా కూటమికి వరుస ఎన్నికల్లో ఓటములతో ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఈ తరుణంలో నాయకత్వ మార్పు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిందేననే ప్రత్యక్షంగా.. పరోక్షంగా పలువురు అంటున్నారు. ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు చేపట్టాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. 2023 జులై 17వ తేదీన బెంగళూరులో జరిగిన సమావేశంలో 26 పార్టీలు ఇండియ కూటమి ఏర్పాటు ప్రకటన చేశాయి. అప్పటి నుంచి కాంగ్రెస్ సారథ్యంలోనే ఈ కూటమి ముందుకు నడుస్తోంది. అయితే.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో.. నాయకత్వ మార్పు గురించి చర్చలు మొదలయ్యాయి. సమాజ్‌వాది పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే తాజాగా.. ఆ పార్టీ అధినేత, కన్నౌజ్ ఎంపీ అయిన అఖిలేశ్ యాదవ్ ప్రతిపక్ష కూటమిని నడిపించాలని కోరారు. అంతేకాదు దేశ రాజకీయాల్లో అత్యంత రాజకీయ ప్రాధాన్యం కలిగిన సమాజ్‌వాదికి.. యూపీలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సామర్థ్యం ఉందని కూడా వ్యాఖ్యానించారు.గత సంవత్సరం జరిగిన లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో 37 స్థానాలు గెలుచుకున్న సమాజ్‌వాది పార్టీ.. లోక్‌సభలో కాంగ్రెస్ తర్వాత రెండవ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉంది. బిహార్ ఫలితంపై లక్నో సెంట్రల్ ఎమ్మెల్యే రవీదాస్ మాట్లాడుతూ.. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగి ఉంటే ఇండియా కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేసేదన్నారు. ‘‘ఈవీఎంల పని తీరును మా అధినేత అఖిలేష్ యాదవ్ మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలని.. ఆ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కోరుతున్నారు కూడా. ఇందుకోసమైనా ఇండియా కూటమికి సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ నాయకత్వం వహించాలి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సామర్థ్యం కలిగి ఉందనే విషయం గుర్తించాలి’’ అని అన్నారు.గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్న ప్రధాన ప్రతిపక్షం.. ఆ తర్వాత జరిగిన వరుస రాష్ట్ర ఎన్నికల్లో ఘోరమైన ఫలితాల్ని ఇస్తోంది. గత ఏడాది కాలంలో.. ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఆరింటిలోబీజేపీ, దాని మిత్రపక్షాలు విజయం సాధించాయి, అందులో హర్యానా, మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాలు కూడా ఉన్నాయి.ఇండియా కూటమిలో నాయకత్వ చర్చ కొత్తదేం కాదు. ఎన్నికల్లో ప్లాఫ్ షో ప్రదర్శించినప్పుడల్లా ఇది చర్చకు వస్తూనే ఉంది. గతంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ బలంగా వినిపించింది. ఇండియా కూటమికి స్పష్టమైన నాయకత్వం లేదు. కాంగ్రెస్ ఆ బాధ్యతల్లో విఫలమవుతూ వస్తోంది. కాబట్టి.. స్పష్టమైన ఎన్నిక జరగాలి అని టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ గతంలో అన్నారు. కాంగ్రెస్‌పై తాము విశ్వాసం ఉంచామని.. కానీ ఈ విషయంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమవుతోందంటూ మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలపై ఆయన పై వ్యాఖ్య చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇండియా కూటమి నాయకత్వం మార్పు అవసరమని గతంలో సూచించారు. మమతా బెనర్జీకి ఆ బాధ్యతలు అప్పగించాలని కోరారు. ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్సే ఉంటుంది. అందులో ఎలాంటి తేడా ఉండబోదు కదా. అలాంటప్పుడు ఆమెకు(మమతా బెనర్జీని ఉద్దేశించి) ఇండియా కూటమికి నాయకత్వం వహించే అవకాశం ఇవ్వాలి అని లాలూ అప్పట్లో అన్నారు. -
చిన్న పార్టీలకు పెద్ద పరీక్ష..!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో మంగళవారం జరు గనున్న రెండో దశ ఎన్నికల్లో చిన్న పార్టీలు పెద్ద పరీక్షను ఎదుర్కోనున్నాయి. ఎన్నికలు జరుగ నున్న 122 స్థానాలకు గాను చాలాచోట్ల వివిధ కూటముల్లోని చిన్న పార్టీలు సహా స్వతంత్రంగా పోటీ చేస్తున్న పార్టీలు తమ బలాన్ని నిరూపించుకోనున్నాయి. చివరి దశ ఎన్నికల్లో చిన్న పార్టీలు ఏమాత్రం సత్తా చాటుతాయన్న దానిపైనే గెలుపోటములు ప్రభావితమై ఉన్నాయి. అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠరెండో దశలోని 122 నియోజకవర్గాలు 20 జిల్లాల్లో విస్తరించి ఉండగా, ఇందులో 101 జనరల్, 19 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వ్ స్థానాలున్నాయి. గత 2020 ఎన్నికల్లో 122 స్థానాల్లో బీజేపీ 42 గెలుచుకోగా, ఆర్జేడీ 28, జేడీయూ 20, కాంగ్రెస్ 11, వామపక్షాలు 5, ఎంఐఎం 5 సీట్లను గెలుచుకున్నాయి. ఈ స్థానాల్లో ఎంఐఎం మినహా మిగతా చిన్న పార్టీలేవీ పెద్దగా గెలవలేదు. ఈసారి పరిస్థితి వేరేగా ఉంది. ఇండియా, మహాగఠ్‌బంధన్ కూటముల్లోని చిన్న పార్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించారు. ముఖ్యంగా ఎన్డీయేలో భాగస్వామ్య పక్షమైన చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ మొత్తంగా 28 స్థానాల్లో పోటీ చేస్తుండగా, రెండో దశ పోలింగ్ జరిగేవి అందులో 15 ఉన్నాయి. వీటిలో ఆరు ఎస్సీ రిజర్వుడు సీట్లు. ఇక్కడ బీజేపీకి బలంగా ఉన్న రాజ్‌పుత్‌లు, జేడీయూకు మద్దతుగా నిలుస్తున్న ఓబీసీ. ఈబీసీ వర్గాలతో పాశ్వాన్ వర్గాన్ని కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే బీసీ వర్గాల్లో వచ్చిన చీలిక పాశ్వాన్‌కు ఏమాత్రం మద్దతిస్తాయన్నది స్పష్టం కావాల్సి ఉంది. ఇక జతిన్‌రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తానీ ఆవామ్ మోర్చా (హెచ్ఏఎం) సైతం 6 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో 4 రిజర్వుడ్ స్థానాలే ఉన్నాయి. ఇందులోనూ టెకారీ స్థానం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ తన భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఈ స్థానంలో గెలిస్తే అనిల్‌కుమార్ మంత్రి పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. హెచ్ఏఎం పోటీచేస్తున్న అనేక స్థానాల్లో ఆయనకు పోటీగా మహాగఠ్బంధన్లోని రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. మాంఝీ వర్గాన్ని ఎదుర్కొనేందుకు ఆర్ఎల్ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహా అన్ని రకాల ప్రణాళికలు వేశారు. ఆ పార్టీ పోటీ చేస్తున్న నాలుగు స్థానాల్లో ఆయన భార్య స్నేహలతను సైతం పోటీలో ఉంచారు. ఇక మహాగఠ్‌బంధన్‌లో ఉన్న వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) సైతం మొత్తం 12 సీట్లలో పోటీ చేస్తుండగా, రెండో దశలో 7 స్థానాలున్నాయి. ఇందులో 5 నియోజకవర్గాల్లో ‘మల్లా’కమ్యూనిటీకి చెందిన వారే అధికంగా ఉండటంతో ఇందులో కనీసంగా 5 స్థానాలు గెలుస్తామని కూటమి బలంగా నమ్ముతోంది. ఆర్జేడీ నమ్ముకున్న ముస్లిం–యాదవ్ ఫార్ములాకు మల్లాలు తోడైతే ఇక్కడ విజయం ఖాయమని భావిస్తోంది. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి రెండో దశలో 100 చోట్ల పోటీలో నిలవగా, ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌కు సరిహద్దుగా ఉన్న 32 నియోజకవర్గాలనే ఆమె లక్ష్యంగా పెట్టుకొని ప్రచారం చేశారు. కనీసంగా 2 నుంచి 5 స్థానాలు గెలుస్తామని బీఎస్పీ చెబుతోంది. ఇక సీమాంచల్‌లోని 24 స్థానాలకు గానూ గత ఎన్నికల్లో 5 స్థానాల్లో పోటీ చేసి, అన్నింటా విజయం సాధించిన ఎంఐఎం ఈసారి 11 స్థానాల్లో పోటీకి దిగింది. ఇక్కడ అర డజను సీట్లు గెలుస్తామని పార్టీ ధీమాతో ఉంది. ప్రశాంత్‌కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ సైతం 110 చోట్ల పోటీలో ఉంది. ఆయన పార్టీ వైపు ఎక్కువగా యువత, మహిళలు ఆకర్షితులు కావడంతో చాలా నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. -
నేడు బిహార్‌లో రెండో దశ పోలింగ్
పట్నా: బిహార్ అసెంబ్లీకి రెండో విడత పోలింగ్ మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంలోని డజను వరకు మంత్రులు సహా 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 122 నియోజకవర్గాల పరిధిలో ఉన్న 3.70 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో 1.75 కోట్ల మంది మహిళలున్నారు. నేపాల్‌తో సరిహద్దులు కలిగిన పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామర్హి, మధుబని, సుపౌల్, అరారియా, కిషన్‌గంజ్ జిల్లాల్లో జరిగే ఈ క్రతువు కోసం యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో అత్యధిక జిల్లాలు ముస్లింల ప్రాబల్యమున్న సీమాంచల్ ప్రాంతంలోనివి కావడం గమనార్హం. సంక్లిష్ట కుల, వర్గ సమీకరణాలతో తుది విడత పోలింగ్ అధికార ఎన్డీయేతోపాటు ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారులు 45, 399 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోనివే 40,073 ఉన్నాయి. 3.67 లక్షల ఓటర్లతో అతిపెద్ద నియోజకవర్గం నవాడా జిల్లాలోని హిసువా కాగా, లౌరియా, చన్‌పటియా, రక్జౌల్, త్రివేణిగంజ్, సుగౌలి, బన్మఖిల్లో అత్యధికంగా 22 మంది చొప్పున బరిలో ఉన్నారు. మొదటి దశ పోలింగ్‌లో అత్యధికంగా 65 శాతం మంది ఓటేయడం విశేషం.అత్యంత సమస్యాత్మకం.. 8,491రెండో దశ పోలింగ్‌ను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 4 లక్షల మంది భద్రతా సిబ్బందిని బందోబస్తు కోసం రంగంలోకి దించారు. 45, 399 పోలింగ్ స్టేషన్లలో 8,491 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటి వద్ద అదనంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే 50 వేల మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించిన అధికారులు, ఎన్నికల రోజున మరో 50 వేల మందిని రప్పిస్తున్నారు. ఇప్పటికే 60వేల మంది బిహార్ పోలీసులు ఎన్నికల విదుల్లో ఉన్నారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. గయాజీలో అత్యధికంగా అత్యంత సమస్యా త్మకమైన 1,084 పోలింగ్ స్టేషన్లు ఉన్నా యని వివరించారు. కిషన్‌గంజ్, పుర్నియా, సీతామర్హి, మోతిహరీల్లో అత్యంత సమస్యా త్మకమైన పోలింగ్ బూత్ ఒక్కటీ లేదన్నారు. అదేవిధంగా, 122 నియోజ కవర్గాల పరిధిలోని 13,651 శివారు గ్రామా లను సమస్యాత్మకంగా గుర్తించినట్లు వివరించారు. -
నేడే బిహార్ తొలి దశ పోలింగ్
పట్నా: బిహార్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలి దశలో 121 నియోజకవర్గాల్లో హోరాహోరీగా ప్రచారం జరగ్గా నేడు పోలింగ్ అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మొదలుకానుంది. అధికార ఎన్డీఏ, విపక్షాల మహాగఠ్‌బంధన్ కూటమి అభ్యర్థులు సహా మొత్తం 1,314 అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు తొలి దశలో 3.75 కోట్ల మంది ఓటర్లు సిద్ధమయ్యారు. గురువారం మొత్తంగా 45,241 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. వీటిల్లో 36,733 కేంద్రాలు గ్రామీణప్రాంతాల్లో ఉండటం గమనార్హం. గురువారం ఓటేస్తున్న వారిలో 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. విపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, బీజేపీ నేత, ప్రస్తుత డెప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పోటీచేస్తున్న నియో జకవ ర్గాల్లోనూ గురువారం తొలిదశలోనే పోలింగ్ జరగనుంది. రాఘోపూర్‌లో హ్యాట్రిక్ కోసం తేజస్వీ కన్నేయగా, 2010లో రబ్రీ దేవిని ఓడించిన బీజేపీ నేత సతీశ్ కుమార్ ఈసారి తేజస్వీని ఓడించాలని తహతహలా డుతున్నా రు. రాఘోపూర్‌లో ఎలాగైనా తేజస్వీని ఓడించాలని జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కంకణం కట్టుకున్నారు. పొరుగు నియోజకవర్గంలో తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ సైతం సొంతంగా జశక్తి జనతాదళ్ పార్టీ పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రి అయిన విజయ్ కుమార్ సిన్హా సైతం లఖీసరాయ్‌లో నాలుగోసారి గెలుపుపై గంపెడాశలు పెట్టుకు న్నారు. జనసురాజ్ పార్టీ కార్యకర్త హత్య కేసులో అరెస్టయిన జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ పోటీచేస్తున్న మొఖానాలోనూ గురువారమే పోలింగ్ జరగనుంది. ఇక్కడ ఆర్జేడీ తరఫున వీణాదేవి పోటీచేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘట నలు జరక్కుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు, పోలీసులు తెలిపారు. -
పేరు వీఐపీ.. ‘ఇండియా’లో వీవీఐపీ
బిహార్ రాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై విపక్షాల ‘ఇండియా’ కూటమిలో చర్చల తర్వాత ఒక చిన్న పార్టీకి చెందిన నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలన్న నిర్ణయం యావత్ దేశాన్ని అతని వైపు చూసేలా చేసింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) సహా ఇతర కమ్యూనిస్టు పార్టీలు ‘ఇండియా’ కూటమిలో ఉన్నప్పటికీ 44 ఏళ్ల యువనేతను ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మునుపటి ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాల్లో గెలిచి ప్రస్తుతం 15 సీట్లలో మాత్రమే పోటీపడుతున్న పార్టీ నేత ఇప్పుడు ‘ఇండియా’ కూటమి ప్రచార కార్యాక్రమాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఆయనే వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అధినేత ముఖేశ్ సహానీ. మల్లా (మత్య్సకార) వర్గానికి చెందిన సహానీ ప్రస్తుతం మిథిలాంచల్, సీమాంచల్ సహా అనేక ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడమే లక్ష్యంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ‘మల్లా’లే అత్యంత కీలకం.. బిహార్‌లో మల్లా వర్గం వాళ్లు ప్రధానంగా పడవ నడిపడం, చేపలు పట్టడం వృత్తిలో కొనసాగుతారు. వీరినే నిషాద్, కేవత్ అని కూడా పిలుస్తారు. మిథిలాంచల్, సీమాంచల్, ముజఫర్‌పూర్, దర్భంగా, సుపాల్, వైశాలి, సీతామర్హి, షెయోహర్, కిషన్‌గంజ్, సహర్సా, ఖగారియా, తూర్పు చంపారన్, పశి్చమ చంపారన్ జిల్లాల్లో ఈ వర్గం మత్స్యకారులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. జనాభాలో వీరు ఐదారు శాతం దాకా ఉంటారు. అత్యత వెనుకబడిన కులాల (ఈబీసీ) సమూహంలో వీరు అతి ముఖ్యమైన ఓటు బ్యాంక్‌గా ఎదిగారు. ముజఫర్‌పూర్ వంటి కొన్ని జిల్లాల్లో దశాబ్దాలుగా ఈ వర్గం నేతలే ఎంపీలుగా గెలుస్తున్నారు. కీలక నేత జై నారాయణ్ ప్రసాద్ సైతం ఈ వర్గంవారు. ఆయన తర్వాత ఆ స్థాయిలో పేరు, పలుకుబడి సాధించింది ముఖేశ్ సహానీ మాత్రమే. సహానీ తనను తాను ‘మల్లా కుమారుడు’గా ప్రకటించుకొని ఈ వర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు. సేల్స్‌మ్యాన్ నుంచి నుంచి డిప్యూటీ సీఎం అభ్యర్థి దాకా.. 1981లో దర్భంగా>లో ఒక మత్స్యకారుల కుటుంబంలో ముఖేష్ సహానీ జన్మించారు. ‘సన్ ఆఫ్ మల్లా’ అనే పేరుతో కొత్త క్రేజ్ సంపాదించుకున్నారు. 19 ఏళ్ల వయసులో బిహార్‌ను విడిచిపెట్టి, ముంబైలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేశాడు. అనంతరం బాలీవుడ్‌లోకి సెట్ డిజైనర్‌గా అడుగుపెట్టాడు. షారుఖ్ ఖాన్ నటించిన దేవదాస్, సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’ వంటి హిట్ చిత్రాలకు పనిచేశాడు . ముంబైలో ముఖేష్ సినీ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని నడిపాడు. 2013లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, బిహార్æ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న, దివంగత కర్పూరీ ఠాకూర్ వంటి ప్రముఖుల నుండి ప్రేరణ పొందారు. బిహార్ జనాభాలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఉన్న అత్యంత వెనుకబడిన తరగతుల (ఈబీసీ) కోసం పోరాడటానికి సహానీ తిరిగి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. రాజకీయ కారణాలతో బీజేపీని వదిలి 2015లో నిషాద్ వికాస్ సంఘ్‌ను స్థాపించారు. ఇదే తర్వాత 2018లో వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీగా రూపాంతరం చెందింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖేశ్ సమానీ నాటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు మద్దతు ఇచ్చాడు. కానీ తర్వాత అతనితో విడిపోయాడు. మల్లా సమాజానికి రిజర్వేషన్లు, సౌకర్యాలు ఇస్తానని హామీ ఇచ్చి తర్వాత మోసం చేశారని ఆరోపణలు గుప్పిస్తూ నితీశ్ నుంచి తెగతెంపులు చేసుకున్నారు. కొంత కాలానికి మళ్లీ ఎన్డీఏలో చేరిన ఆయన ఆ ఎన్నికల్లో 11 సీట్లలో పోటీ చేసి 4 సీట్లలో గెలిచారు. స్వయంగా సహానీ ఓటమిని చవిచూసినప్పటికీ నితీష్ కుమార్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఒక ఏడాది తర్వాత ఆయన ఎమ్మెల్యేల్లో ఒకరు మరణించగా, మరో ముగ్గురు బీజేపీలో చేరారు. తర్వాత ఈయన 2024లో ఇండియా కూటమిలో చేరారు. కూటమిలో తనకు 40 స్థానాలు ఇవ్వాలని కోరినప్పటికీ అది సాధ్యపడకపోవడంతో 15 సీట్లు కేటాయించింది. అయితే ఆయన వర్గానికి ఉన్న ప్రాధాన్యత దష్ట్యా ఆయన్ను ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.50–60 నియోజకవర్గాలపై ప్రభావంఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన అనంతరం సహానీ తన దూకుడు పెంచారు. తనను రాజకీయంగా అణచివేసిన నితీశ్ కుమార్, బీజేపీలే లక్ష్యంగా ఆయన ప్రచారం సాగుతోంది. కేవలం 15 సీట్లలో పోటీ చేస్తున్న ఒక పార్టీ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవిని ‘ఆఫర్’చేయడం వెనుక ‘ఇండియా’ కూటమి పక్కా వ్యూహం కనిపిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆర్జేడీకి సంప్రదాయబద్ధంగా ఉన్న ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంక్ (సుమారు 31 శాతం)కు అదనంగా, నితీశ్ కుమార్‌కు వెన్నెముకగా ఉన్న ఈబీసీ (అత్యంత వెనుకబడిన తరగతులు) ఓటు బ్యాంకును చీల్చడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యం. రాష్ట్ర జనాభాలో 36% ఉన్న ఈబీసీలలో, 5–6% ఉన్న నిషాద్ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం ద్వారా, ఈబీసీలందరికీ ‘ఇండియా’ కూటమి బలమైన సందేశం పంపింది. సహానీ పోటీ చేస్తున్న 15 స్థానాల కంటే, ఆయన తన సామాజిక వర్గం బలంగా ఉన్న మిథిలాంచల్, సీమాంచల్, చంపారన్ ప్రాంతాల్లోని సుమారు 50–60 నియోజకవర్గాలపై చూపే ప్రభావమే కీలకం. ఆయన తన నిషాద్ ఓట్లను ‘ఇండియా’ కూటమి అభ్యర్థులకు బదిలీ చేయగలిగితే, అది ఎన్డీఏ, ముఖ్యంగా జేడీ(యూ) కోటను బద్దలు కొట్టగలదు. అందుకే ‘వీఐపీ’నేతగా ఉన్న సహానీ, ఇప్పుడు బిహార్ ఎన్నికల రాజకీయాల్లో ‘వీవీఐపీ’గా మారి, మొత్తం ఫలితాన్నే శాసించే కీలక నేతగా ఆవిర్భవించారు. -
ఎవరి తలరాత మారుస్తారో?
ఎన్నికల రణక్షేత్రంలో కులమే కేంద్ర బిందువైన బిహార్‌లో ముస్లిం ఓటర్లు సైతం పారీ్టల గెలుపోటముల్లో క్రియాశీలకంగా మారారు. రాష్ట్రంలోని మూడోవంతు నియోజకవర్గాల్లో శాసించే స్థాయిలో ఉన్న వీరే ఫలితాలను తారుమారు చేయగల స్థితిలో ఉన్నారు. ముస్లిం–యాదవ్ ఫార్ములానే నమ్ముకున్న ఇండియా కూటమి వీరంతా తమకే అనుకూలమని భావిస్తోంది. డిప్యూటీ సీఎం పదవిని తమ వర్గానికి ఇవ్వకపోవడంతో వారిలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలు ఏమాత్రం అగ్గిని రాజేయనున్నాయో తెలియాల్సి ఉంది. ముస్లిం ఓట్లు చీలకుండా చూసేందుకు తమను మహాగఠ్‌బంధన్‌లో చేర్చుకోవాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన విన్నపాన్ని పెడచెవిన పెట్టడం ఇండియా కూటమికి పరీక్షగా మారింది. అదే సమయంలో, ముస్లింలలోని వెనకబడిన కులాల ఓట్లను రాబట్టుకునేందుకు ఎన్డీయే కూటమి చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలిస్తాయో చూడాలి. మైనారిటీ వంతెన దాటాల్సిందే.. బిహార్‌లోని మొత్తం 10.41 కోట్లు జనాభాలో 1.75 కోట్ల ముంది ముస్లింలు అంటే 17.7 «శాతం మంది. మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 87 చోట్ల 20 శాతం కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉంది. మరో 47 స్థానాల్లో 15 నుంచి 20 శాతం మధ్య ముస్లింలున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో పార్టీ ఏదైనా గెలుపు గుర్రం ఎక్కాలంటే మైనారిటీ ఓట్ల వంతెన దాటాల్సి ఉంటుంది. బిహార్ రాజకీయాల్లో మైనారిటీల ప్రభావం గురించి మాట్లాడాలంటే మొదట ప్రస్తావించాల్సింది రాష్ట్ర ఈశాన్య మూలన ఉన్న ’సీమాంచల్’ప్రాంతం గురించే. కిషన్‌గంజ్, అరియా, కతిహార్, పూర్ణియా జిల్లాల పరిధిలోని సుమారు 24 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయం మొత్తం వీరి చుట్టూనే తిరుగుతుంది. కిషన్‌గంజ్ జిల్లాలో మైనారిటీల జనాభా ఏకంగా 70శాతం కాగా, అరియా, కతిహార్, పూరి్ణయా జిల్లాల్లో 30–45శాతం వరకు ఉంది. అమౌర్, బైసి, జోకిహాట్, కోచాధామన్ వంటి నియోజకవర్గాల్లో 50–60శాతం పైగా వీరే ఉన్నారు. గత ఎన్నికలే గుణపాఠం 2020 ఎన్నికలు ఇక్కడి సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. అసదుద్దీన్ ఒవైసీ నేతత్వంలోని ఎంఐఎం పార్టీ మహాగఠ్‌బంధన్ ఓట్లను చీలి్చంది. ఏకంగా 5 చోట్ల అమౌర్, బైసి, జోకిహాట్, బహదూర్‌గంజ్, కోచాధామన్‌లలో జెండా ఎగరేసింది. ఈ ఐదు స్థానాల నష్టమే తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి పీఠానికి కేవలం 12,000 ఓట్ల తేడాతో దూరం చేసిందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యమున్న ముస్లిం ఓట్లు చీలకుండా చూసేందుకు మహాగఠ్‌బంధన్‌లో చేర్చుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కోరినా ఆర్జేడీ స్పందించలేదు. దీంతో ఆయన తమ అభ్యర్థులను 8 చోట్ల నిలబెట్టారు. దీంతో, తమకున్న సొంత ముస్లిం ఓట్లతో పాటు యాదవ ఓట్లు దూరమవుతాయనే ఆందోళన ఆర్జేడీని వెంటాడుతోంది. ఎంఐఎంను చేర్చుకోవడంపై కాంగ్రెస్‌కు ఉన్న అయిష్టత మరో కారణం. ఏకీకరణను నమ్ముకున్న ఇండియా కూటమి సీమాంచల్ వెలుపల, మైనారిటీలు 15– 25 శాతం వరకు ఉండే అనేక ’స్వింగ్’నియోజకవర్గాలు ఉన్నాయి. దర్భంగా, మధుబని (మిథిలాంచల్), సివాన్, గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్, భగల్పూర్ వంటి ప్రాంతాల్లో వీరు ఒంటరిగా గెలిపించలేరు, కానీ వీరి ఓట్లు ఎవరికి పడితే వారే గెలుస్తారు. ఇక్కడే ఆర్జేడీ అజేయమైన ముస్లిం–యాదవ్ సమీకరణం బలంగా పనిచేస్తోంది. రాష్ట్రంలోని 17.7 శాతం ముస్లింలు, 14 శాతం యాదవులు కలిస్తే, అది దాదాపు 32 శాతం పటిష్టమైన ఓటు బ్యాంకుగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి 20 నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టారు. బీజేపీతో కలిసి ఉన్నందున ముస్లింలు తమతో కలిసిరారన్న కారణంతో జేడీయూ గతంలో 10 సీట్ల సంఖ్యను 6కు తగ్గించింది. చీలికపై నితీశ్ ఆశలు..! నితీశ్ కుమార్ ‘మహాగఠ్‌బంధన్’లో ఉన్నంత వరకు మైనారిటీ ఓటర్లకు అది సురక్షితమైన కూటమి. ఆర్జేడీ ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంకుకు, నితీశ్ ‘ఈబీసీ’ఓట్లు తోడై అది అజేయమైన కూటమిగా కనిపించింది. కానీ, నితీశ్ ఇప్పుడు బీజేపీ భాగస్వామిగా ఉండడంతో మైనారిటీ ఓటర్లు సందిగ్ధంలో పడ్డారు. నితీశ్ కుమార్, బీజేపీతో ఉన్నప్పటికీ, మైనారిటీలలోని అట్టడుగు వర్గా లైన ‘పస్మాందా’(వెనుకబడిన కులాలు) ముస్లింలను ఆకట్టుకునే ప్రయ త్నం దశాబ్దాలుగా చేస్తున్నారు. ‘ఆర్జేడీ కేవలం అగ్రవర్ణ (అష్రాఫ్) ముస్లింలకే పెద్ద పీట వేసింది, పస్మాందాల అభివృద్ధికి మేమే పాటుపడ్డాం’అనేది నితీశ్, బీజేపీల ఉమ్మడి ప్రచారాస్త్రం. ఈ ‘పస్మాందా’కార్డు ద్వారా మైనారిటీ ఓట్లలో 5–10శాతం చీల్చగలిగినా, అది అనేక నియోజకవర్గాల్లో మహాగఠ్‌బంధన్ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందిఎంఐఎం ఆత్మగౌరవ నినాదం ఒవైసీ పార్టీ ‘ఓటు బ్యాంకు’గా ఉండటానికి బదులు, ‘సొంత రాజకీయ నాయకత్వం’కోసం పిలుపునిస్తోంది. ‘మీరు ఎల్లప్పుడూ బీజేపీని ఓడించడానికే కాదు, మీ హక్కుల కోసం, మీ నాయకత్వం కోసం ఓటేయండి. ఆర్జేడీ, కాంగ్రెస్‌లు మిమ్మల్ని వాడుకున్నాయి’అనే అసదుద్దీన్ ఒవైసీ నినాదం సీమాంచల్‌లోని యువతను ఆకట్టుకుంటోంది. 2020 నాటి ప్రదర్శనను పునరావృతం చేసి, 10–15 శాతం ఓట్లు చీల్చగలిగితే..అది నేరుగా ఎన్డీయేకు లాభం చేకూరుస్తుంది. సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) -
రెబల్స్‌తో ట్రబుల్స్
అసంతృప్తుల బుజ్జగింపు బిహార్‌లో ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. తొలి దశ ఎన్నికలు జరిగే 121 స్థానాల్లో 24 చోట్ల ఓట్లను చీల్చగల తిరుగుబాటు అభ్యర్థులున్నారు. ఎన్డీయే, ఇండియా కూటములకు వీరు సవాలుగా మారారు. దీంతో, సంకీర్ణ పొత్తుల పోరాటంలో ఓట్ల బదలాయింపు ఏ మేరకు జరుగుతుందనే ఆందోళన పార్టీలను వెంటాడుతూనే ఉంది. పొత్తుల కారణంగా సీట్లు త్యాగాలు చేయాల్సిన పరిస్థితి అన్ని పార్టీల నేతలకు వచ్చింది. అయితే దీన్ని వారు సానుకూలంగా తీసుకోవడం లేదు. తాము చేస్తున్నది స్నేహ పూర్వక పోటీ మాత్రమేనని కొంతమంది రెబల్స్ చెబుతున్నారు. 2020 ఎన్నికల్లో కేవలం వెయ్యి ఓట్ల తేడాతో 11 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపు సాధ్యమైంది. ఈ 11 స్థానాల్లో నూ తిరుగుబాటు అభ్యర్థులు 40 నుంచి 50 వేల ఓట్లు సాధించారు. వీరంతా ప్రధాన పార్టీలు టికెట్ నిరాకరించడంతో పోటీకి దిగిన వారే. సత్తా చూపేందుకేనా?సంకీర్ణ రాజకీయాలే బిహార్‌లో తిరుగుబాటు అభ్యర్థులకు తెగింపు నిస్తున్నాయనేది పట్నాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు జగదీవ్ పూరీ అభిప్రాయం. ఎన్డీయేలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎస్పీ ఉన్నాయి. ఇండియా కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వీఐపీ, వామపక్ష పార్టీలున్నాయి. ఇవి కాకుండా జన్‌సురాజ్, బీఎస్పీ, ఏఐఎంఐఎం వంటి పార్టీలూ పోటీ చేస్తున్నాయి. కూటముల మధ్య పొత్తుల కారణంగా సీట్ల సర్ధుబాటు అనివార్యమైంది. దీంతో ఐదేళ్లుగా నియోజకవర్గంలో బలాన్ని పెంచుకున్న నేతలకు సీట్లు దక్కలేదు. మౌనంగా ఉండిపోతే రాజకీయ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని భావిస్తున్నారని ఎన్డీయే పక్షంలో సీటు రాని మధోల్ తెలిపారు. తమకు ప్రజాబలం ఉన్నప్పటికీ అగ్ర నేతలను ఆర్థికంగా లోబర్చుకున్నారనేది ఆయన ప్రత్యర్థులపై చేసే ఆరోపణ. అధిష్టానం బుజ్జగించినా రెబల్స్ వినేట్టు లేదని పలువురు నేతలు చెబుతున్నారు. బరి నుంచి తప్పుకున్నా, నష్టం చేయడానికి వారు మొగ్గు చూపడం పోటీ చేస్తున్న అభ్యర్థులను కలవర పెడుతోంది. రెబల్స్ తాకిడి ఉన్న స్థానాలు→ మాంఝీ స్థానంలో బీజేపీ రెబల్ రాణా ప్రతాప్ డబ్ల్యూ సవాల్‌గా మారారు. జేడీయూ అభ్యర్థి రణధీర్ సింగ్‌ను ఓడించడం లక్ష్యంగా చెబుతున్నారు. సీపీఎం ఎమ్మెల్యే సత్యేంద్ర యాదవ్ కూడా పోటీ చేస్తున్నారు.→ గరౌలిలో ఆర్జేడీ దిలీప్ సింగ్‌కు టికెట్ ఇచ్చింది. ఆర్జేడీ అభ్యర్థి రేయాజుల్ హక్ రాజు టికెట్ నిరాకరించడంతో తిరుగుబాటు స్వరం విన్పిస్తున్నారు. → సతావ్పూర్ కమల్ నుంచి ఎల్జేపీ అభ్యర్థి సురేంద్ర వివేక్‌పై జేడీయూ నేత శశికుమార్ అలియాస్ అమర్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ ఎమ్మెల్యే సంతానంద్ సంబుద్ధ పోటీలో ఉన్నారు.→ జమాల్‌పూర్‌లో మాజీ మంత్రి శైలేష్ కుమార్ జేడీయూను వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జేడీయూ నచికేత మండల్‌ను నామినేట్ చేసింది. వీఐపీకి చెందిన నరేంద్ర తంతి బరిలో ఉన్నారు.→ చరివవారియార్పూర్లో ఆర్జేడీ నేత రామ్సఖా మహతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీ అభ్యర్థి సుశీల్ కుష్వాహాను ఎదుర్కొంటున్నారు. జేడీయూ అభ్యర్థి అభిషేక్ కుమార్ పోటీ చేస్తున్నారు.→ జాలే స్థానం నుంచి రిషి మిశ్రా కాంగ్రెస్ అభ్యర్థి. చివరి నిమిషంలో ఆర్జేడీ నుంచి కాంగ్రెస్‌లో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. 2020లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న మక్సూద్ అహ్మద్ ఉస్మానీ తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మంత్రి, బీజేపీ నాయకుడు జీవేత్ ఇక్కడ పోటీ చేస్తున్నారు.→ బస్విధలో జేడీయూ ఎమ్మెల్యే సుదర్శన్ కుమార్ పార్టీ టికెట్ నిరాకరించడంతో తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. జేడీయూ డాక్టర్ పుష్పంజయ్ కుమార్‌ను, కాంగ్రెస్ త్రిశుల్ధారి సింగ్‌ను బరిలోకి దించాయి.→ మహ్నార్లో ఆర్జేడీ స్విందర్ సింగ్‌ను బరిలోకి దింపింది. ఆర్జేడీకి చెందిన సంజయ్ రాయ్ రెబల్‌గా మారారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అచ్యుతానంద సింగ్ (కాంగ్రెస్‌ను వీడి) పరాస్‌కు చెందిన ఆర్ఎల్ఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు.→ ఛప్రా నుంచి బీజేపీ అభ్యర్థి రాఖీ గుప్తా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఛోటీ కుమారికి పెద్ద సవాల్‌గా మారారు. ఆర్జేడీ నుంచి ఖేసరీ లాల్ యాదవ్ పోటీ చేస్తున్నారు.→ జగదీష్పూర్ ఆర్జేడీ ఎమ్మెల్యే రామ్ విష్ణు లోహియా కుమారుడు కిషోర్ కునాల్‌కు టికెట్ ఇచ్చారు. రాజీవ్ రంజన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.→ గోపాల్‌గంజ్‌లో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు అనూప్లాల్ శ్రీవాస్తవ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ సుభాష్ సింగ్‌ను నిలబెట్టింది. → బచ్వారలో బీజేపీ నేత శత్రుఘ్న కుమార్ ఆ పార్టీ అభ్యర్థి సురేంద్ర మెహతాపై తిరుగుబాటుదారు. అతను ఇప్పుడు పార్టీ ఇబ్బందులను మరింత పెంచుతున్నాడు.→ సూర్యగఢలో ఎల్జేపీ ఆర్జేడీకి చెందిన అశోక్ సింగ్ అని పిలిచే రవిశంకర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన జేడీయూకి చెందిన రామానంద్ మండల్‌ను ఎదుర్కొంటారు. ఆర్జేడీ నుంచి ప్రేమ్ సాగర్ చౌదరి పోటీ చేస్తున్నారు. వనం దుర్గా ప్రసాద్ (బిహార్ నుంచి సాక్షి ప్రతినిధి) -
‘ఇండియా కూటమి అలా నెగ్గాలనుకుంది..’ నడ్డా సంచలన ఆరోపణలు
బీహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన ఆరోపణలకు దిగారు. చొరబాటుదారుల ఓట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇండియా కూటమి భావిస్తోందని.. అయితే ఎన్డీయే ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు సాగనివ్వబోదని అన్నారు. శుక్రవారం వైశాలి జిల్లాలో జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొని జేపీ నడ్డా ప్రసంగించారు. ‘‘బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక పునఃసమీక్ష (special intensive revision)కు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే.. చొరబాటుదారుల ఓట్ల ఆధారంగానే వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించారు కాబట్టి. కానీ, ఎన్డీయే ప్రభుత్వం అలాంటి ప్రయత్నాన్ని ఎప్పటికీ సాగనివ్వబోదు.. .. ఓటు చోరీ ఆరోపణలపై అఫిడవిట్లు సమర్పించాలని ఎన్నికల కమిషన్ కోరిన తర్వాత ప్రతిపక్షాలు ఆ ఆరోపణలపై మాట్లాడటమే మానేశాయి. అక్కడే అసలు వాస్తవం బయటపడింది. తమ ఆరోపణలకు ఆధారాలు చూపలేకనే వాళ్లు తోకముడిచారు అని నడ్డా ఎద్దేవా చేశారు. ఆర్జేడీది జంగిల్ రాజ్లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీకి గూండా, రౌడీ పార్టీ అనే ముద్ర ఉందని నడ్డా ఆరోపించారు. 2005కి ముందు బీహార్‌లో శాంతి భద్రతలు ఎలా ఉండేవి?. డాక్టర్లు, వ్యాపారులు, న్యాయవాదులు అప్పట్లో కిడ్నాప్, హత్యలకు గురైన సంగతి ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ సమయంలో అప్పటి సీఎం లాలూ నివాసంలోనే ఫిర్యాదులపై చర్చలు జరిగేవి కదా.. నడ్డా ఆరోపించారు. కానీ.. నితీశ్ కుమార్‌లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం జంగిల్ రాజ్ నుంచి బీహార్ ప్రజలకు విముక్తి కలిగించిందని నడ్డా అన్నారు. గత 20 ఏళ్లుగా సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో బీహార్ గణనీయంగా పురోగతి సాధించిందని, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి గణనీయమైన నిధులూ బీహార్‌కు సమకూరుతున్నాయని నడ్డా అన్నారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించి ఆ అభివృద్ధిని కొనసాగించాలని ఈ సందర్భంగా మేధావులకు నడ్డా విజ్ఞప్తి చేశారు. -
వికాసానికి– వినాశానికి మధ్య పోరు
ఔరంగాబాద్/హాజీపూర్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అధికార ఎన్డీయే వికాసానికి, విపక్షాల ఇండియా కూటమి వినాశానికి మధ్య జరుగుతున్న పోరుగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అభివర్ణించారు. గురువారం ఆయన ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఔరంగాబాద్, వైశాలి జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. ఇరవయ్యేళ్ల పాలనలో సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను అంతం చేశారన్నారు. బిహార్ సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీయే పాటుపడుతోందని చెప్పారు. పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అందుకే ఈ ఎన్నికలు వికాసానికి, వినాశానికి మధ్య జరుగుతున్న పోరాటం వంటివని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నడ్డా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ఆ పార్టీని చిన్నవైన భాగస్వామ్య పక్షాలను అంతం చేసే పరాన్నభుక్కుగా ఆయన పేర్కొన్నారు. యువతకు ఉద్యోగావకాశాల కల్పనతోపాటు, వలసలకు చెక్ పెడతామంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇస్తున్న హామీలను ప్రస్తావిస్తూ నడ్డా.. గతంలో ఆ పార్టీ నేతలు పాల్పడిన ‘భూమికి బదులుగా ఉద్యోగాలు’కుంభకోణం గుర్తుకు వస్తోందని వ్యాఖ్యానించారు. భారీ ఉద్యోగాల కల్పన వట్టిదేనంటూ ఆయన వీరందరికీ వేతనాలను చెల్లించేందుకు నిధులెక్కడి నుంచి తీసుకువస్తారని ప్రశ్నించారు. -
సీఎం అభ్యర్థి తేజస్వీ
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో విపక్ష మహాగఠ్‌బంధన్ (మ హాకూటమి) తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఊహాగానాలకు తెరది ంచుతూ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి గా రాష్రీ్టయ జనతాదళ్(ఆర్జేడీ) యువనేత తేజస్వీ యాదవ్ పేరును కూటమి పక్షాలు ఏకగ్రీవంగా ఖరారు చేశాయి. తమ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వికాస్‌శీల్ ఇన్సాన్ పారీ్ట(వీఐపీ) అధినేత ముఖేష్ సహానీ పేరును ప్రకటించాయి. సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థుల ఎంపికపై కొన్నిరోజుపాటు జరిగిన చర్చోపచర్చలు ఎట్టకేలకు ముగిశాయి. కూటమి నేతలు గురువారం పటా్నలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిహార్‌లో మార్పు కోసం ఏడు పారీ్టల మహాగఠ్‌బంధన్ ఐక్యంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. తేజస్వీనే మా సీఎం: అశోక్ గహ్లోత్ కూటమి ముఖ్యమంత్రి అభ్యరి్థగా యువనేత తేజస్వీ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ చెప్పారు. ఆయన నవ యువకుడు అని, ఏది చెబితే అది చేస్తారని, ఇచ్చిన హా మీలకు కట్టుబడి ఉంటారని వెల్లడించారు. కూటమిలో కీలక నేత ముఖేష్ సహానీ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టకొని ఆయనను డిప్యూటీ సీఎం అభ్యరి్థగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బిహార్‌లో సామాజిక నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకొని సీఎం, డీప్యూటీ సీఎం అభ్యర్థులను ఖరారు చేశామని వెల్లడించారు. తమ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీతోపాటు కూటమి నేతలను సంప్రదించి తుది నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి కూడా మరికొందరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమిస్తామని స్పష్టంచేశారు. కొత్త రాష్ట్రాన్ని నిర్మిస్తాం: తేజస్వీ ఎన్డీఏ ప్రభుత్వంపై తేజస్వీ యాదవ్ నిప్పు లు చెరిగారు. బిహార్‌లో ఓ కొత్త రాష్ట్రాన్ని నిర్మించేందుకు తామంతా ఏకమయ్యామని చెప్పారు. పనికిమాలిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు సంకల్పం తీసుకున్నామని ఉద్ఘాటించారు ‘‘ఎన్డీఏ నేత లు నకలీ్చ(కాపీక్యాట్లు). మేం ఏ హామీ ఇ స్తే, వాళ్లు దాన్నే కాపీ కొడుతున్నారు. వాళ్ల కు సొంత ఏజెండా లేదు. బిహార్‌లో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తారో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికీ చెప్పలేదు. ఎన్డీఏ నేతలంతా అలసిపోయిన నేత లు. బిహార్‌ను మోసం చేయడంలో వారంతా నిమ గ్నమయ్యారు. సీఎం నితీశ్ కుమా ర్ పార్టీ జేడీ(యూ)ని ఖతం చేయడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోంది. గత ఎన్నికల్లో నితీశ్‌ను సీఎం అభ్యరి్థగా ప్రకటించిన బీజేపీ ఈసారి ఎందుకు ప్రకటించడం లేదు? దీని వెనుక అసలు కారణం ఏమిటి? ఇది నితీశ్ కుమార్‌కు జరుగుతున్న అన్యాయం’’ అని తేజస్వీ ధ్వజమెత్తారు. ఎన్డీఏ పాలనలో రా ష్ట్రంలో అవినీతి, నేరాలు విచ్చలవిడిగా పెరి గిపోయాయని ఆరోపించారు. ‘‘రూ.70 వే ల కోట్ల కాగ్ స్కామ్, సృజన్ కుంభకోణం, బాలికా గృహ్ ఘటనలపై చర్యల్లేవు. వంతెనలు కూలుతున్నాయి, ఎలుకలు మద్యం తాగుతున్నాయి, రోజూ కాల్పులు జరుగుతున్నాయి. అవినీతి, ఆఫీసర్ల దౌర్జన్యంతో ప్రజలు విసిగారు’’ అని పేర్కొన్నారు. హామీల వర్షం మహాకూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యో గం, మాయీ–బహిన్ మాన్ యోజన (మహిళలకు ఆర్థిక సాయం), గ్యాస్ సిలిండర్ రూ.500కే అందిస్తామని తేజస్వీ యా దవ్ హామీ ఇచ్చారు. జీవికా దీదీలకు(స్వ యం సహాయక బృందాల మహిళలు) నె లకు రూ.30 వేల జీతంతో శాశ్వత ఉద్యో గం కల్పిస్తామని, కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబదీ్ధకరిస్తామని వాగ్దానం చేశారు. బీజేపీని వదలం: ముఖేష్ సహానీ ఈ రోజు కోసం మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నామని డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్ సహానీ వ్యాఖ్యానించారు. బీజేపీని విచ్ఛిన్నం చేసే వరకు వదిలిపెట్టబోమని ప్రతిజ్ఞ చేశామని, ఆ సమయం ఇప్పుడు వచి్చందని స్పష్టంచేశారు. -
ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య గహ్లోత్ రాయబారం
పట్నా: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బిహార్‌లో ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీల మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ రంగంలోకి దిగారు. బుధవారం ఆయన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌తో సమావేశమయ్యారు. కూటమిలోని ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై ప్రతిష్టంభన ఏర్పడిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. లాలూతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఓడించాలంటే ఇండియా కూటమి పార్టీల్లో ఐక్యత ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అయితే, ఇండియా కూటమి సీఎం అభ్యరి్థగా ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ను ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ‘నా నుంచి అలాంటి ప్రకటనను మీరు ఎందుకు ఆశిస్తున్నారు?’అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. ‘రెండు నెలల క్రితం ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాం«దీ, తేజస్వీ కలిసి రాష్ట్రమంతా పర్యటించడాన్ని మీరంతా చూశారు. అన్ని విషయాలపై తగిన సమయంలో వారే తగిన నిర్ణయం తీసుకుంటారు’అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 143 సీట్లలో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 61 చోట్ల పోటీ పడుతోంది. అయితే, కొన్ని చోట్ల ఈ రెండు పార్టీలు స్నేహపూర్వక పోటీలోనూ ఉన్నాయి. ఆర్జేడీ నేతలు ఇటీవల ‘తేజస్వీ సర్కార్’నినాదం అందుకోవటంతో కాంగ్రెస్ కినుకు వహించినట్లు చెబుతున్నారు. -
బీహార్‌లో నువ్వా-నేనా?? పీపుల్ పల్స్ ఏమో ఇలా..
జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్‌గా ఉండే బీహార్‌లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే, ‘ఇండియా’ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. 2025 అక్టోబర్/నవంబర్‌లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 41 నుండి 44 శాతం, ‘ఇండియా’ కూటమికి 40 నుండి 42.5 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడ్ సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 30 నుండి 31 శాతం ఓట్లతో, బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ వారి కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఉండబోతున్న బీహార్ ఎన్నికల్లో.. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) 6 నుండి 8 శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. ఇతరులు 7.5 నుండి 9 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఈ గణాంకాల్లో 3 శాతం ప్లస్/మైనస్ ఉండే అవకాశాలున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్‌లో స్థానిక సమస్యలు, సంక్షేమ హామీలు, పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ-సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కోసం మూడ్ సర్వే నిర్వహించగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీయే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై స్వలంగా కేవలం ఒక్క శాతం ఓట్ల ఆధిపత్యం కనబరుస్తుందని వెల్లడయ్యింది. ఎన్నికల సమయానికి ఫలితం ఎటైనా మారవచ్చు.బీహార్‌లో 2020 శాసనసభ ఎన్నికల్లోనూ ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు పోటాపోటీగా తలపడి చెరో 37 శాతం ఓట్లు సాధించాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు 11 వేలు మాత్రమే. ఆర్జేడీ 75 స్థానాలతో మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ 74 స్థానాలతో ఒక్క సీటు తేడాతో రెండో స్థానంలో నిలిచింది. సంక్లిష్ట రాజకీయాలకు నెలవైన బీహార్ లో గతంలో వలే మరోసారి ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. బీజేపీ, జేడీ (యూ), హెచ్ఏఎమ్, ఎల్జేపి (ఆర్వీ), ఆర్ఎల్ఎమ్ పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే కూటమి రాష్ట్రంలోని అగ్రవర్ణాలు, ఈబీసీ, దళిత వర్గాల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిగా చెలామణి అవుతూ బీహార్‌లో మహాఘట్ బంధన్ పేరుతో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, వికశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) పార్టీలతో కూడిన ‘ఇండియా’ (మహాఘట్ బంధన్) కూటమి రాష్ట్రంలోని యాదవ, ముస్లిం సామాజిక వర్గాల్లో పటిష్టంగా ఉంది. వీరితో పాటు ఓబీసీ వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. గతంలో ‘మార్పు’ (2005), ‘సుశాసన్’ (2010),ఉద్యోగాలు (2020) నినాదాలతో రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా, ఈ సారి ఎలాంటి ప్రత్యేక నినాదం లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమ పథకాలు, కుల సమీకరణాలతో పాటు నూతన పార్టీ జేఎస్పీ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో ధరల పెరుగుదల, వలసలు, నిరుద్యోగం అంశాలపై ఉన్న వ్యతిరేకతను సంక్షేమం, అభివృద్ధి అంశాలు తగ్గించడం ఎన్డీయేకు కలిసివస్తోంది. ‘జీవికా’ పథకంలో భాగస్వాములైన మహిళలు మద్యనిషేధం, విడో పింఛన్లు, సబ్సీడీలతో నితీశ్ కుమార్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆశించిన ఉద్యోగాలు రాలేదని యువత విమర్శిస్తున్నా గత ‘జంగిల్ రాజ్’ కంటే నితీశ్ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని అంగీకరిస్తున్నారు. రైతులు కులాల ఆధారంగా చీలిపోయారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) వంటి జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయని మూడ్ సర్వేలో వెల్లడైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక అంశాలకే పెద్దపీట దక్కనుంది. తమ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు స్థానిక సమస్యల ఆధారంగానే ఓటు వేస్తామని చాలా మంది మూడ్ సర్వేలో చెప్పారు. బీహార్ ఎన్నికల్లో ఎప్పటిలా ఈ సారి కూడా సామాజిక కులాలే కీలకం కానున్నాయి. రెండు ప్రధాన కూటముల్లో పార్టీల మధ్య సీట్ల కేటాయింపులు, పార్టీల అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకే ప్రాధాన్యత ఉండనుంది. అభ్యర్థుల ఎంపిక తర్వాతే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తామని ఓటర్లు చెప్పారు. ఎన్డీయేకు మద్దతుగా ఉన్న ఈబీసీ ఓటర్లు తమ సామాజిక వర్గం వారికి మహాఘట్ బంధన్ టికెట్లిస్తే వారికి ఓటు వేయడానికి వెనుకాడమని చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ పీడీఏ (పిచ్చడ్, దళిత్, అల్పసంఖ్యాక్) వ్యూహం విజయవంతమైనా, బీహార్‌లో తేజస్వీ యాదవ్ ఎమ్-వై (ముస్లిం, యాదవ్) వ్యూహం విఫలమైంది. టికెట్ల కేటాయింపులో కీలకమైన సామాజిక సమీకరణలను విజయవంతంగా నిర్వహించలేకపోతే పార్టీల్లో అసంతృప్తి పెరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్ లో చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’ ప్రజాకర్షణగా నిలిచింది. అయితే ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో రెండు కూటములకు మద్దతిచ్చే సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పు కనిపించలేదు. సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 15.5 శాతం ఉన్న అగ్రవర్ణాల్లో 3 శాతం బ్రాహ్మణులు, 3.4 శాతం రాజ్‌పుత్‌లు, 2.8 శాతం భూమిహార్లు, 0.6 శాతం కాయస్తులు బీజేపీకి మద్దతిస్తున్నారు. బీహార్ లో 14.2 శాతం ఉన్న యాదవ్‌లు ఆర్జేడీ వెంట ఉన్నా మతం ఆధారంగా మిథిలా, సీమంచల్ లో బీజేపీకి కొంత యాదవ్‌ల మద్దతు లభిస్తోంది. 2.8 శాతం ఉన్న కుర్మీలు, 4.2 శాతం ఉన్న కుష్వాహాలు దక్షిణాన నితీశ్ వెంట ఉన్నా, ఉత్తరాదిన చీలిక కనిపిస్తోంది. రాష్ట్రంలో కీలకమైన 36 శాతం ఉన్న ఈబీసీలు జేడీ(యూ), బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. వీరిలో నిశాద్ సామాజికవర్గం ఉప కులాలు ప్రాంతాలవారీగా ఎన్డీయే, వీఐపీ వైపు ఉన్నారు. 19.65 శాతం ఉన్న షెడ్యుల్ కులాలు, 5 శాతం ఉన్న చమార్లు ఆర్జేడీ,కాంగ్రెస్,వామపక్షాల వైపు, 5 శాతమున్న పాశ్వాన్ లు ఎల్జీపీ (ఆర్వీ) వైపు ఉండగా 3 శాతం ఉన్న ముషార్లు ప్రాంతాల వారీగా చీలిపోయారు. 1.68 శాతం ఉన్న షెడ్యూల్ తెగల ఓట్లు రెండు కూటముల మధ్య చీలిపోతున్నాయి. బీహార్ లో 17.7 శాతం ఉన్న ముస్లింలు మహాఘట్ బంధన్ కు పటిష్టమైన ఓటు బ్యాంకుగా నిలుస్తున్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. సీమాంచల్ ప్రాంతంలో ఏఐఎంఐఎం పార్టీకి కొంత ముస్లింల మద్దతు లభిస్తోంది. బీహార్‌లో ఏఐఎంఐఎం కీలక పాత్ర పోషిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు స్థానాల్లో గెలిచినా కిషన్‌గంజ్ లోక్ సభ నియోజవర్గంతో పాటు సమీపంలో ఉన్న అరారియాకే పరిమితమైంది. గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు ఆర్జేడీలో చేరడంతో ఏఐఎంఐఎం బలహీనపడింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లుపై ఆ పార్టీ ఉద్యమంతో ఆ పార్టీ కొన్ని ప్రాంతాల్లో పట్టు సాధించింది. వక్ఫ్ చట్టంపై ఓవైసీ పోరాడుతున్నారనే అభిప్రాయం సీమంచల్ లో ముస్లిం యువత భావిస్తోంది. అయితే రాహుల్ గాంధీ యాత్రతో ఏఐఎంఐఎంకు ముస్లింలలో మద్దతు తగ్గుతోందని సర్వేలో తేలింది. ‘ఇండియా’ గ్రూపులో చేర్చుకోవాలని ఏఐఎంఐఎం కోరుతున్నా కాంగ్రెస్, ఆర్జేడీ నుండి ఆశించన స్పందన రాలేదు. కిషన్‌గంజ్‌తో పాటు పూర్ణియా, అరారియా వంటి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో మద్దతు లభిస్తుండడంతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసినా ఏఐఎంఐఎం 1 నుండి 3 స్థానాల్లో గెలవవచ్చని మూడ్ సర్వేలో తేలింది.రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలకంగా మారి ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా చేస్తున్నాయి. ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు బీహార్‌లో పోటాపోటీగా హామీలిస్తున్నాయి. నితీశ్ ప్రభుత్వం 1.67 కోట్ల కుటుంబాలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో గ్రామీణ ప్రాతాల్లో ఒక్కో కుటుంబానికి నెలకు రూ.200 నుండి 300 మేర విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. మహిళల కోసం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకం కింద రూ.10 వేలు ఉపాధి ప్రోత్సాహకం, మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రూ.2 లక్షల రుణాలిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ఎన్డీయే మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ట్రైబెల్స్ కు భూమి హక్కులు కల్పిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. ఎన్డీయే హామీలకు పోటీగా మహాఘట్ బంధన్ కూటమి కూడా బీహార్ ప్రజలకు భారీ హామీలిచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రాష్ట్రంలో వలసల నివారణకు స్థానికులకు 100 శాతం ఉద్యోగాలు, ప్రతి పంచాయతీలో ఐటీఐ ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ హామీలిచ్చింది. అన్ని రంగాల్లో మహిళా కోటా కల్పించి, వారికి భద్రత ఇస్తామని మహాఘట్ బంధన్ హామీ ఇచ్చింది. ఈ రెండు కూటములకు పోటీగా జేఎస్పీ పంచాయత్ స్కూల్స్, యువతకు ఉద్యోగాలు, వృద్ధులకు రూ.2000 పింఛన్, మహిళలకు రుణాలు హామీలిస్తూ, రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతోంది. శాంతి భద్రతల అంశానికి సంబంధించి బీహార్ లో ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ ‘జంగిల్ రాజ్’ వస్తుందని ఎన్డీయే మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా, నితీశ్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, నేరాలు పెరిగిపోయాయని మహాఘట్ బంధన్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు. చిన్నపార్టీలైన హెచ్ ఏఎమ్, ఆర్ ఎల్ ఎమ్ ఎన్డీయే కూటమిలో, వీఐపీ, వామపక్షాలు మహాఘట్ బంధన్ కూటమిలో కీలకపాత్ర పోషించనున్నాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్, క్షేత్రస్థాయిలో సంస్థగతంగా బలంగా ఉండడం, డిజిటల్ రంగంలో దూసుకుపోవడం అంశాలతో రాష్ట్రంలో బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో పటిష్టంగా కనిపిస్తున్నా, ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిపేరు వినిపించకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుందని క్షేత్రస్థాయిలో పర్యటించిన పీపుల్స్ పల్స్ బృందం పరిశీలనలో తేలింది. 30 నుండి 31 శాతం ఓట్లతో బలంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పలు హామీలతో ముందుకెళ్తున్నా అగ్రవర్ణాల్లో ఆ పార్టీపై వ్యతిరేకత ఉండడం వారికి అడ్డుగా మారుతోంది. కాంగ్రెస్ యాత్రలతో బలపడుతున్నట్టు కనిపిస్తున్నా, ఆ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జేడీ (యు) ఈబీసీ సామాజికవర్గంలో బలంగా ఉండి, మహిళల మద్దతు పొందుతోంది. అయితే 74 ఏండ్ల వయస్సు గల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జేపీ(ఆర్వీ) నేత చిరాగ్ పాశ్వాన్ కు దళిత సామాజిక వర్గంలో మంచి చరిష్మా ఉన్నా, ఎన్డీయేలో చీలిక భయాలున్నాయి. జేఎస్పీ పాదయాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు హామీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ లేకపోవడం బలహీనత.బహుముఖ పోటీలో కూటముల మధ్య సీట్ల కేటాయింపులు, ఓటర్లను ఆకర్షించడం, చివరి నిమిషం వరకు చేసే ప్రచారంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈబీసీలకు సరైన ప్రాధాన్యతిస్తూ టికెట్లు కేటాయిస్తే ప్రయోజనం ఉండే అవకాశాలున్నాయి. ఎన్డీయేలో బీజేపీ, నితీశ్, చిరాగ్ మధ్య విభేదాలొస్తే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. జేఎస్పీ ఎన్నికల్లో కింగ్‌మేకర్ పాత్ర పోషించనుంది. మొత్తం మీద బీహార్ ప్రజలు ఓటేస్తుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసమే కాదు. పార్టీలు హామీలిస్తున్న సంక్షేమాలు కుల రాజకీయాలను దాటగలవా? యువత ఆశలు విధేయతలను అధిగమించగలదా? ప్రశ్నలకు సమాధానం పోటా పోటీ ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రశాంత కిశోర్ సొంత రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తారో అని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బీహార్ అసెంబీ ఎన్నికలు కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి రేపుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించకపోవడంతో ఇతర పార్టీలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇతర పార్టీల్లో బీహార్ కు చెందిన జేడీ (యు), ఎల్జేపీ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయం. బీహార్ లో ఎన్డీయే మెజార్టీ సాధిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకవపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి మెజార్టీ రాకపోయినా లేదా ఏ కూటమిలోనైనా ముఖ్యమంత్రి పీఠంపై చిక్కుముడి పడినా జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. :::ఆర్.దిలీప్ రెడ్డి, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ -
బీహార్‌లో కూటమి పంచాయతీ.. సీట్ల పంపకాలపై కీలక భేటీ?
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్‌లోని ప్రతిపక్ష ఇండియా కూటమిలో నెలకొన్న సీట్ల పంపకాల పంచాయితీని ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ ఈ నెల 19న కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీలో ఉంటామన్న ప్రకటన నేపథ్యంలో కూటమిలో గందరగోళం పెరిగిన నేపథ్యంలో ఈ భేటీని తలపెట్టినట్లు తెలుస్తోంది.ఆరోగ్య సమస్యల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్న ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ ఈ సీట్ల చర్చల బాధ్యతను చేపట్టేందుకు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను సమర్పించాలని ఆయన కోరారని, ఆ పార్టీకి 50–52 సీట్లు కేటాయించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతో పాటు, పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు ఇచ్చే స్థానాలపై ఈ భేటీలో ఓ స్పష్టత తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది.ఆర్జేడీ కోరుకుంటున్న ఓ 25 స్థానాలపై కాంగ్రెస్ సైతం పట్టుబడుతుండటంతోనే సమస్య ఉత్పన్నమవుతోందని, దీనిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఏఐసీసీ నేత ఒకరు తెలిపారు. ఇక ప్రస్తుత కూటమిలో వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)తో పాటు, 2020లో 19 సీట్లలో పోటీ చేసి 12 గెలుచుకున్న సీపీఐ(ఎంఎల్)లు ఇప్పుడు 40–45 సీట్లను అడుగుతున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ సైతం ఆర్జేడీతో చర్చలు జరుపుతుండగా, ఎంఐఎం సైతం కూటమిలో చేర్చుకోవాలని ఆర్జేడీని సంప్రదించినట్లు తెలుస్తోంది. వీటన్నింటి దృష్ట్యా సీట్ల పంపకాలపై ఓ స్పష్టతకు రావాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
క్రాస్ ఓటింగ్‌పై అంతర్గత విచారణ?
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుకున్నదానికంటే ఎన్డీఏ అభ్యర్థికి రాధాకృష్ణన్‌కు అధిక మెజారిటీ సాధించడం వెనుక క్రాస్ ఓటింగ్ దాగిఉందన్న వాదన మరింత పెరిగింది. సొంత ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయకుండా రాధాకృష్ణన్ వైపు కొందరు విపక్ష ‘ఇండియా’కూటమి పార్టీల ఎంపీలు మొగ్గుచూపారని వార్తలు ఎక్కువయ్యాయి. ఇండియా కూటమి పక్షాల ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు రాజకీయ వివాదంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై అంతర్గత విచారణ చేయించాలని కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బిహార్ సహా ఇతర రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఈ అంశం పార్టీల ఐక్యతకు ప్రశి్నస్తోంది. దీంతో ఐక్యత పెద్ద సవాల్‌గా మారుతున్న నేపథ్యంలో కూటమిలోని లోటుపాట్లను గుర్తించి, వాటిని వీలైనంత త్వరగా సవరించుకోవాలనే అభిప్రాయంతో విపక్షపార్టీలు ముందుకెళ్తున్నట్లు సమాచారం. మంగళవారం వెల్లడైన ఉప రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో సుమారు 20 ఓట్లు రాధాకృష్ణన్‌కు పడినట్లు విశ్వసిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి 324 ఓట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ ఆయనకు కేవలం 300 ఓట్లు పడ్డాయి. రాధాకృష్ణన్ గరిష్టంగా 436 ఓట్లు సాధించవచ్చని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన 452 ఓట్లు సాధించారు. మరింత స్పష్టమైన మెజారిటీ ఒడిసిపట్టారు. పోలింగ్ పూర్తయిన వెంటనే తమ అనుకూల ఓట్లపై ఓ అంచనాకు వచి్చన కాంగ్రెస్ సైతం తమకు అనుకూలంగా 315 ఓట్లు వస్తాయని లెక్కగట్టింది. అయితే కాంగ్రెస్ పేర్కొన్నట్లుగానే 15 ఓట్లు ఇక్కడే క్రాస్ ఓటింగ్ అయ్యాయి. దీంతో పాటు చెల్లని ఓట్లు సైతం ఇండియా కూటమి పక్షాలవేనని ప్రచారం జరుగుతోంది. భారీ క్రాస్ ఓటింగ్ దృష్ట్యా ఈ అంశంపై కచ్చితంగా విచారణ జరగాలని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ డిమాండ్ చేశారు. దీనిని తీవ్రమైన విశ్వాస ఉల్లంఘనగానే పరిగణించాలని, ఇది విపక్షాల అంతర్గత ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తివారీతో పాటు కాంగ్రెస్ పార్టీలోని ఇతర నేతలు సైతం ఈ విషయంపై విచారణ కోరుకుంటున్నారని ఢిల్లీలోని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి రావాల్సిన 12 ఓట్లలో కనీసంగా 3 ఓట్లు, తమిళనాట డీఎంకే నుంచి రావాల్సిన 32 ఓట్లలో కనీసంగా 4 ఓట్లు, ఆర్జేడీ నుంచి రెండు ఓట్లు, శివసేన(ఉద్ధవ్) పార్టీ నుంచి కొన్ని ఓట్లు క్రాసింగ్ జరిగినట్లు అంచనాలు వేస్తున్నారు. మాకు సంబంధం లేదన్న పార్టీలుఅయితే క్రాస్ ఓటింగ్ వివాదంపై విపక్ష పార్టీల వాదన భిన్నంగా ఉంది. తమ సభ్యులెవరూ రాధాకృష్ణన్‌కు ఓటేయలేదని కాంగ్రెస్ మిత్రపక్షాలు కరాఖండీగా చెప్పాయి. దీనిపై ఇప్పటికే ఆర్జేడీ, డీఎంకే, ఎస్పీ పార్టీలు తమ ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని ప్రకటనలు సైతం ఇచ్చాయి. ఇక కాంగ్రెస్ సైతం తమ ఓట్లు నూటికి నూరు శాతం కూటమి అభ్యర్థికే బలంగా పడ్డాయని చెబుతున్నాయి. అయితే బిహార్, తమిళనాడు, పశి్చమబెంగాల్ ఎన్నికల దృష్ట్యా కూటమిలో ఐక్యత కొనసాగి ఎన్నికల్లో పోరాడాలంటే క్రాస్ ఓటింగ్‌పై విచారణ జరపాలని కాంగ్రెస్ నేతల నుంచి డిమాండ్ వస్తోంది. ఇదే సమయంలో విపక్షాల అభ్యర్థికి 40 శాతం ఓట్ల వాటాను ‘నైతిక విజయం‘గా కాంగ్రెస్ నాయకులు అభివరి్ణస్తున్నారు. 2022 ఎన్డీఏకు చెందిన జగదీప్ ధన్‌ఖడ్‌పై పోటి చేసిన విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాకు వచి్చన ఓట్లతో పోలిస్తే ఈసారి తమకుæ దాదాపు 14 శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. ఇక వీటిని తిప్పికొడుతున్న బీజేపీ 15 మంది ప్రతిపక్ష ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేశారని, మరో 15 మంది ఉద్దేశపూర్వకంగా చెల్లని ఓట్లు వేశారని కౌంటర్లు ఇస్తోంది. -
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయంఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం452 ఓట్లు సాధించిన సిపి రాధాకృష్ణ98.2 పోలింగ్ శాతం నమోదుచెల్లని ఓట్లు 15ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి పోటీఇందుకోసం పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాయంత్రం 6 గంటల తర్వాత ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ఫలితాలు ఈ రాత్రి ప్రకటించబడే అవకాశం ఉంది.ఓటింగ్‌కు దూరంగా ఉన్న పార్టీలుబీఆర్ఎస్, బీజేడీ,శిరోమణి అకాలీ దళ్లు ఓటింగ్‌కు దూరం వీరి నిర్ణయం వల్ల తగ్గిన ఓటింగ్ కానీ ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యం ఉందని అంచనాఓటేసిన లోక్‌సభ స్పీకర్ఉపరాష్ట్రపతి ఎన్నిక.. కొనసాగుతున్న పోలింగ్ఓటేసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాఇది బీజేపీకి ఎదురుదెబ్బే: సంజయ్ రౌత్ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌కు బీఆర్ఎస్, బీజేడీ, అకాలీదళ్ దూరంఈ మూడు బీజేపీతో గతంలో అంటకాగిన పార్టీలేనన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ఇప్పుడు దూరంగా ఉండడం ఆ పార్టీకి ఎదురుదెబ్బేనని వ్యాఖ్య96 శాతం పోలింగ్ నమోదుకొనసాగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్3గం. దాకా 96 శాతం పోలింగ్ నమోదు5 గం. దాకా జరగనున్న పోలింగ్6గం. కౌంటింగ్ మొదలు7.45గం. కి ఫలితం వెల్లడిఇండియా కూటమి వైపే ఒవైసీఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బీ సుదర్శన్రెడ్డిసుదర్శన్రెడ్డికి మద్దతు ప్రకటించిన ఎంఐఎంహైదరాబాద్వాసి, గౌరవనీయుడైన న్యాయకోవిదుడికి మద్దతంటూ ఒవైసీ ట్వీట్ఓటు హక్కు వినియోగించుకున్న ఒవైసీవిజయంపై ఎన్డీయే ధీమాఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్రాత్రికల్లా వెలువడనున్న ఫలితంసంఖ్యా బలం దృష్ట్యా.. విజయంపై ఎన్డీయే ధీమాముందస్తుగా.. విందు ఏర్పాట్లలో ముమ్మరంకేంద్ర మంత్రి ప్రహ్లాద్ ఇంట ఎన్టీయే కూటమి కీలక నేతలకు విందు ఏర్పాట్లుఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్సీపీ ఎంపీలుఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన వైఎస్సార్సీపీ ఎంపీలుఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కి మద్దతు ప్రకటించిన వైఎస్సార్‌సీపీపోలింగ్‌కు దూరంగా మరో పార్టీఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా శిరోమణి అకాలీదల్పార్లమెంట్లో ఎస్ఏడీ సంఖ్యా బలం.. మూడుఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించిన బీజేడీ, బీఆర్ఎస్ఓటు హక్కు వినియోగించుకోనున్న 769 మంది ఎంపీలుకొనసాగుతున్న ఉపరాష్ట్రపతి పోలింగ్ఒక్కొక్కరుగా ఓటు వేస్తున్న ఎంపీలుసాయంత్రం 6గంటల తర్వాత వెలువడనున్న ఫలితాలుతొలి ఓటు వేసిన ప్రధాని మోదీఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభంతొలి ఓటు వేసిన ప్రధాని మోదీఅనంతరం.. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గే తదితరులుఓటింగ్ వేళ ప్రత్యేక ఆకర్షణగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ఓటేశాక.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన రాహుల్ గాంధీసాయంత్రం ఐదు గంటల దాకా జరగనున్న పోలింగ్ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ నో విప్.. తమకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యం ప్రకారం ఓట్లేయనున్న ఎంపీలు నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా గడిలో 1 అంకెతదుపరి ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థి పేరు ఎదుటనున్న గడిలో 2 అంకె ఎన్నికల సంఘం సమకూర్చే పెన్నుతోనే మార్కింగ్ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధంమరికాసేపట్లో పార్లమెంటు భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ప్రారంభం కానున్న పోలింగ్ 6 గంటలకు ఓట్ల లెక్కింపు రాత్రికి విజేతను ప్రకటించే అవకాశంఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిల మధ్య పోరుమద్దతు ఇలా.. పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788 ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే పోలింగుకు దూరంగా బీఆర్ఎస్ (4 రాజ్యసభ), బీజేడీ(7) లెక్క ప్రకారం.. 386 ఓట్లు దక్కించుకున్నవారు విజేతబలాబలాలు.. ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం.. ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం ఇండియా కూటమికి 314 మంది ఎంపీల మద్దతు ! ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. ఎన్డీయే అభ్యర్థి గెలుపు లాంఛనమే! బ్యాలెట్ ఓటింగ్రహస్య బ్యాలెట్ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రాధాన్య ఓట్లు వేసే పద్ధతి కావడం వల్ల బ్యాలెట్లనే వాడకం. ఈవీఎంలలో ఈ సదుపాయం లేదు.తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఓట్లేయనున్న ఎంపీలు అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లువస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలో తీసుకుంటారు.నచ్చిన అభ్యర్థికే ఓటింగ్తమ సభ్యులకు విప్ జారీచేయకూడదని పార్టీలకు ఎన్నికలసంఘం స్పష్టీకరణ. ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా ప్రచారం చేసిన ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులు గత రెండ్రోజులుగా ఎంపీలందర్నీ ఢిల్లీకి రప్పించి ఓటింగుకు సమాయత్తం చేసిన ఇరు కూటములుఇప్పటికే ముగిసిన నమూనా(మాక్) పోలింగ్ గతంలో.. ఫస్ట్ టైం.. 2022 ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక ఓట్లేసిన 725 మంది ఎంపీలు ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌కు 528 (74.37%), ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాకు 182 (25.63%) దక్కిన ఓట్లు 15 ఓట్లు చెల్లలేదు. 55 మంది ఓటింగుకు గైర్హాజరు 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ.. తగ్గిన ఎన్డీయే సంఖ్యాబలం -
నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: దేశ తదుపరి ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ చేసింది. ఆరోగ్య కారణాలరీత్యా జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ పదవికి మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు భవనంలో పోలింగ్ ప్రక్రియ సాగనుండగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాల అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది. అభ్యర్థులిద్దరూ తమకు మద్దతు కోరుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా ఆయా పార్టీలు సోమవారం వేర్వేరుగా మాక్ పోలింగ్‌ను నిర్వహించాయి. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పార్లమెంట్ హౌస్ వసుధలోని రూమ్ నంబర్ ఎఫ్–101లో పోలింగ్ జరగనుంది. 6 గంటలకు కౌంటింగ్ అనంతరం ఫలితం వెల్లడి కానుంది. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు (ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి), రాజ్యసభకు నామినేటెడ్ అయిన 12 మంది, లోక్‌సభ ఎంపీలు 543 మంది (ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది) ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్నారు. ఎన్డీఏకు సొంతంగా 422 మంది సభ్యుల బలం ఎలక్టోరల్ కాలేజీలోని బలాబలాల పరంగా చూస్తే ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 781 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం 542 మంది సభ్యులున్న లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యుల బలం ఉంది. ఇక 239 మంది సభ్యులున్న రాజ్యసభలో పాలక కూటమికి 129 మంది సభ్యుల మద్దతు ఉంది. విజయానికి అవసరమైన ఓట్లు 391 కాగా, ఎన్డీఏకు సొంతంగానే 422 మంది సభ్యుల బలం ఉంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం తమ 11 మంది సభ్యుల మద్దతు ఎన్డీఏ అభ్యర్థికి ప్రకటించడంతో ఆ సంఖ్య 433కి చేరనుంది. ఇక విపక్ష ఇండియా కూటమికి రెండుసభల్లో కలిపి 311 ఓట్లు ఉండగా, ఈ కూటమికి ఆప్ మద్దతు ప్రకటించింది. దీంతో కూటమి బలం 320 మాత్రమే దాటుతోంది. అయితే రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలో ఎంపీలు తమ పార్టీల విప్‌ను పాటించాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీల మాక్ పోలింగ్.. పార్టీల బలాబలాలపై ఇరు పక్షాలకు స్పష్టత ఉన్నప్పటికీ ఓట్లు చెల్లుబాటు కాకుండా పోవడంపై ఆందోళన, క్రాస్ ఓటింగ్ భయం రెండు కూటముల్లోనూ కనిపిస్తోంది. 2022 ఎన్నికల్లో 15 ఓట్లు చెల్లకుండా పోవడంతో ఈసారి పార్టీలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ తమ ఎంపీల కోసం ఆది, సోమవారాల్లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ పాత పార్లమెంట్ భవనం సెంట్రల్హాల్లో మాక్ పోలింగ్ ద్వారా తమ ఎంపీలకు ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విపక్ష ఎంపీలకు విందు ఇచ్చారు. సంవిధాన్ సదన్‌లో జరిగిన సమావేశంలో ఖర్గేతో పాటు సోనియాగాం«దీ, శరద్‌పవార్, టీఆర్ బాలు, అఖిలేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సైతం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఎంపీలతో మాక్ పోలింగ్ నిర్వహించింది. ఎన్డీఏ ఎంపీలతో మోదీ సమావేశం మంగళవారం ప్రధాని మోదీ ఎన్డీయే ఎంపీలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం..‘రాధాకృష్ణన్ అద్భుతమైన ఉప రాష్ట్రపతి అవుతారని ప్రజలు విశ్వసిస్తున్నారు..’అంటూ ‘ఎక్స్’లో ఒక పోస్టు చేశారు. కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ మచ్చలేని నేతగా అభివరి్ణస్తోంది. రాజకీయ, పాలనాపరమైన ఆయన విశేష అనుభవం..రాజ్యసభ చైర్మన్‌గా విధులు నిర్వర్తించేందుకు ఉపకరిస్తుందని పేర్కొంటోంది. ఇక విపక్షాల అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి 2011లో సుప్రీంకోర్టులో పదవీ విరమణ పొందారు. నల్లధనం, సల్వాజుడుం తదితర కేసుల్లో కీలక తీర్పులు వెలువరించారు.బీఆర్ఎస్, బీజేడీ దూరంరెండు కూటములకు సమాన దూరాన్ని పాటిస్తూ వస్తున్న బీఆర్ఎస్, బీజేడీలు ప్రస్తుత ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించాయి. ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్కు నలుగురు, బీజేడీకి ఏడుగురు సభ్యుల బలం ఉంది. -
ఉప రాష్ట్రపతి పదవి రాజకీయ సంస్థ కాదు
గౌహతి: ఉప రాష్ట్రపతి పదవి అనేది దేశంలో అత్యున్నత రాజ్యాంగ విభాగమే తప్ప రాజకీయపరమైన సంస్థ కాదని జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి స్పష్టంచేశారు. త్వరలో జరుగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన విపక్ష ‘ఇండియా’కూటమి అభ్యర్థిగా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి శుక్రవారం అస్సాం రాజధాని గౌహతిలో మీడియాతో మాట్లాడారు. ఉప రాష్ట్రపతి పదవిలో కూర్చొనే వ్యక్తికి ఒక న్యాయమూర్తికి ఉండాల్సిన లక్షణాలు ఉండాలని చెప్పారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, మాటల్లో, చేతల్లో, ప్రవర్తనలో నిజాయతీ, పారదర్శకత ఉండాలని తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవికి సంబంధించి ఇవి తన అభిప్రాయాలని స్పష్టంచేశారు. మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పదవీ కాలం ముగియకముందే హఠాత్తుగా రాజీనామా చేయడంపై మీ అభిప్రాయం ఏమిటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... వ్యక్తుల గురించి తాను మాట్లాడబోనని బదులిచ్చారు. ఓటు హక్కును నిరాకరించొద్దు భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి చెప్పారు. దేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. అనుమానాలకు తావులేకుండా ఎన్నికల సంఘం పనిచేయాలన్నారు. ఓటు హక్కు వచ్చిన తర్వాతే దేశ పౌరులుగా మారినట్లు చాలామంది భావిస్తుంటారని గుర్తుచేశారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని పేర్కొన్నారు. ఓటు వేసే హక్కును నిరాకరించడానికి వీల్లేదన్నారు. ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులు సహజమేనని, రాజ్యాంగంలోనే ఆ అంశం పొందుపర్చారని గుర్తుచేశారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మధ్య ఎన్నో అంశాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ.. ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించే విషయంలో వారు ఏకాభిప్రాయం వ్యక్తంచేశారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పౌరులంతా కచ్చితంగా పాల్గొనాలని వారు సూచించారని చెప్పారు. ఎన్నికల నుంచి ఓ వర్గాన్ని లేదా కులాన్ని పక్కనపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాను భావించడం లేదన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) అంశం ఇప్పుడు కోర్టు పరిధిలో ఉందని, దానిపై మాట్లాడడం సరైంది కాదని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయా పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేసే సంప్రదాయం లేదన్నారు. నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవచ్చని చెప్పారు. పలు రాజకీయపార్టీలతోపాటు స్వతంత్య్ర ఎంపీలు సైతం తన అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతున్నారని వివరించారు. అస్సాం రాష్ట్రం ఒకప్పుడు తన కర్మభూమి అని చెప్పారు. -
వైఎస్ జగన్‌కు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టీస్ సుదర్శన్‌రెడ్డి ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఇండియా కూటమి అభ్యర్థి ప్రకటనకు ముందే ఎన్డీఏ నేతలు తమతో మాట్లాడారని బదులిచ్చారు. ఎన్డీఏ అభ్యర్థన మేరకు ముందుగానే వారికి మాట ఇచ్చినట్లు చెప్పారు. వ్యక్తిగతంగా సుదర్శన్‌రెడ్డి అంటే ఎంతో గౌరవం ఉందన్న జగన్..న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అపారమైన సేవలు అందించారని కితాబు ఇచ్చారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు అన్యధా భావించ వద్దని విజ్ఞప్తి చేశారు. -
షాకింగ్ సర్వే.. ఆ పార్టీ నెత్తిన పాలు పోసే పనిలో విజయ్!!
ఏ పార్టీతో పొత్తు ఉండదు. సింహం ఎప్పటికీ సింహమే!. సింగిల్‌గానే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతాం అంటూ తమిళగ వెట్రి కళగం (Tamilaga Vetri Kazhagam) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మధురైలో జరిగిన టీవీకే మానాడు సూపర్ సక్సెస్ కావడంతో విజయ్ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను ప్రముఖ పార్టీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో.. తమిళనాడులో జరిగిన ఓ సర్వే వెల్లడించిన విషయాలు టీవీకే సహా అక్కడి రాజకీయ పక్షాలకు ఝలక్ ఇచ్చాయి. తమిళనాడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. డీఎంకే అత్యధిక సీట్లు కైవసనం చేసుకుంటుందని తెలిపింది. ప్రతిపక్ష ఎన్డీయే కూటమికి 3 సీట్లు దక్కవచ్చని, అదే సమయంలో విజయ్ టీవీకేకు జీరో ఎదురుకావొచ్చని ఆ సర్వే పేర్కొంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి తమిళనాడులో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 39 స్థానాలను కూటమిలోనే పార్టీలోనే కైవసం చేసుకున్నాయి. అయితే ఇప్పటికిప్పడు జరిగితే మాత్రం 36 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. సంక్షేమ పథకాలతో పాటు హిందీ భాషా వ్యతిరేక ఉద్యమం, నీట్ పోరాటాలు డీఎంకే గెలుపును ప్రభావితం చేసే అంశాలుగా పేర్కొంది.ఇక.. బీజేపీ అన్నాడీఎంకే ఎన్డీయే కూటమికి మూడు స్థానాలు మాత్రమే దక్కవచ్చని పేర్కొంది. అయితే.. ఓటు శాతం మాత్రం 18% నుంచి 37%కి పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 2024లో ఈ కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. ఇక తమిళనాడులో రాబోయే కాలంలో జరిగే ఎన్నికలకు విజయ్ టీవీకే పార్టీ అదనపు ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పార్టీ ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. అయితే ఇప్పటికప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఏ స్థానం దక్కకపోవచ్చని(0 సీట్లు) ఆ సర్వే వెల్లడించింది. విజయ్ పార్టీ పెట్టి ఏడాది పైనే అవుతోంది. అయితే అందులో ముఖాలేవీ జనాలకు పెద్దగా తెలిసినవి కావు. జనాలకు తెలిసిన ముఖాలు టీవీకేలో చేరేందుకు ప్రయత్నిస్తున్నా.. విజయ్ అందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు జనాల్లోకి ఇంకా బలంగా ఆ పార్టీ చొచ్చుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే డీఎంకే వ్యతిరేకతను టీవీకే ఓట్ల రూపంలో మార్చుకోవాలని విజయ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. టీవీకే పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా డీఎంకేకే లాభం కలగించవచ్చని సర్వే పేర్కొంది. తద్వారా.. టీవీకేతో ఎన్డీయే కూటమికే భారీ నష్టం కలగవచ్చని స్పష్టం చేసింది. ఇండియా టుడే సీవోటర్ Mood of the Nation ఆగస్టు 2025 పేరిట నిర్వహించిన ఈ సర్వే నిర్వహించింది. జూలై 1 నుండి ఆగస్టు 14, 2025 మధ్య 2 లక్షల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను సేకరించి రూపొందించబడింది. సర్వే లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో జరిగినప్పటికీ మరో ఏడేనిమిది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకూ సమీకరణాలు ఇలాగే కొనసాగితే మాత్రం.. డీఎంకే నెత్తిన విజయ్ టీవీకే పాలు పోసినట్లే అవుతుందన్న చర్చ జోరుగా నడుస్తోందక్కడ. -
‘ఆ దమ్ముందా స్టాలిన్?’
బీహార్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్ పర్యటన వేళ.. రాజకీయ విమర్శలతో దుమారం చెలరేగింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే తరఫున రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రకు స్టాలిన్ మద్దతు ప్రకటించారు. అయితే ఒకప్పుడు బీహారీలను అవమానించినవారే.. ఇప్పుడు ఓట్ల కోసం అక్కడికి వెళ్తున్నారా? అంటూ అధికార జేడీయూ, బీజేపీ కూటమి విమర్శలు గుప్పించింది.తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీహార్ పర్యటనపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనడానికి స్టాలిన్ బీహార్ చేరుకున్నారు. అయితే, గతంలో డీఎంకే నేతలు చేసిన యాంటీ బీహారీ కామెంట్లతో పాటు సనాతన ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. బీజేపీ స్టాలిన్‌ను సవాల్ విసిరింది.బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ ఉంచారు. నోరు తెరిస్తే నీతి, ఆత్మగౌరవం కోసం నిలబడి మాట్లాడే వ్యక్తిని అంటారు కదా? ద్రవిడ మోడల్‌కు సింహం లాంటోడిని అంటారు కదా?. అదే నిజమైతే.. గతంలో మీ పార్టీ వాళ్లు చేసిన వ్యాఖ్యలు బీహార్‌లో మీరూ చెప్పండి చూద్దాం అంటూ సవాల్ చేశారాయన. రెండేళ్ల కిందట.. ఓ పబ్లిక్ మీటింగ్‌లో ఉదయ్‌నిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూలతో పోలుస్తూ.. నిర్మూలించాల్సిన అవసరం ఉందటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో జూనియర్ స్టాలిన్‌పై కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. అలాగే.. డీఎంకేకు చెందిన దయానిధి మారన్ బీహారీలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలనూ బీజేపీ లేవనెత్తుతోంది. బీహారీలు.. అశ్లీలంగా ఉంటారు. అజ్ఞానులు. పానిపూరి అమ్మేపనులు, టాయిలెట్లు శుభ్రం చేస్తుంటారు అని మారన్ అన్నట్లు బీజేపీ చెబుతోంది. ఇవే వ్యాఖ్యలను ఇప్పుడు స్టాలిన్ బీహార్‌లో మళ్లీ వినిపించాలంటూ సవాల్ చేస్తోంది. తిరుపతి మాత్రమే కాదు బీజేపీ నేత అన్నామలై కూడా ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. స్టాలిన్ బీహార్ వేదికపై వాటిని తిరిగి చెప్పాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.మరోవైపు బీహార్ జేడీయూ నేత అభిషేక్ ఝా కూడా స్టాలిన్ పర్యటనను తప్పుబడుతూ, "ఇలాంటి వ్యక్తులతో కలిసి బీహార్ ప్రజల మద్దతు ఆశించడం తేజస్వీ యాదవ్‌కు మైనస్ అవుతుంది" అన్నారు. ఇదిలా ఉంటే.. బీహార్ ఎన్నికల వేళ, ఈ వ్యాఖ్యలు ఇండియా కూటమిపై ఎంత ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే. -
రాజ్యాంగ రక్షణకు పాటుపడతా
సాక్షి, చెన్నై: తనను ఆదరించి గెలిపిస్తే ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషిచేస్తానని విపక్షాల ‘ఇండియా’ కూటమి ఉపరాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. తమిళనాడులోని ఎంపీల మద్దతును కూడగట్టుకునేందుకు చెన్నైలో ఆదివారం సాయంత్రం సుదర్శన్ రెడ్డి పర్యటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌తో సమావేశమయ్యారు. చెన్నై టీనగర్‌లోని ఓ హొటల్లో జరిగిన సమావేశంలో డీఎంకే కూటమిలోని కాంగ్రెస్, సీపీఎం, వీసీకే తదితర పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ‘‘ నేనిప్పుడు నా గురించి చెప్పుకోదల్చుకోలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నేనిచ్చిన తీర్పులనూ ప్రస్తావించదల్చుకోలేదు. నా తీర్పుల కంటే ఇప్పుడు మీరు నా విషయంలో ఇచ్చే తీర్పు(ఓటు వేయడం) అత్యంత కీలకం. నాకు అవకాశం ఇస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా’’ అని సుదర్శన్ రెడ్డి చెప్పారు. -
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ముఖాముఖి పోరు
న్యూఢిల్లీ: దేశ 17వ ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9వ తేదీన జరిగే ఎన్నిక బరిలో అధికార ఎన్డీయే బలపరిచిన సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మిగిలారు. ఈ ఇద్దరు అభ్యర్థులు అందజేసిన నాలుగేసి సెట్ల నామినేషన్ పత్రాలు సరిగ్గా ఉన్నాయని ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ తెలిపారు. వీటిని అంగీకరించామని చెప్పారు. శుక్రవారంతో నామినేషన్ల పరిశీలనకు గడువు ముగియడంతో, దక్షిణాదికే చెందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య ద్విముఖ పోటీ ఖరారైనట్లయింది. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు మొత్తం 46 మంది అభ్యర్థులు 68 నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సీపీ రాధాకృష్ణన్, సుదర్శన్‌రెడ్డిల నామినేషన్లు మినహా సరిగా లేని మిగతా అన్ని నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ వివరించారు. -
ఆయన నక్సలైట్ల మద్దతుదారుడు
కొచ్చి/తిరునల్వేలి: నక్సలైట్లకు గట్టి మద్దతుదారుడైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిని విపక్ష ‘ఇండియా’ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తప్పుపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లపై పోరాటానికి గిరిజన యువకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సల్వాజుడుం’ చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అంటూ 2011లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. శుక్రవారం కేరళలో ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. నక్సలైట్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి సుప్రీంకోర్టును జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వాడుకున్నారని ఆరోపించారు. ఆయన ఆ తీర్పు ఇవ్వకుంటే, సల్వాజుడుం అమల్లో ఉంటే నక్సలైట్ల ఉద్యమం 2020 నాటికే అంతమయ్యేదని అన్నారు. నక్సలైట్ల సిద్ధాంతంతో స్ఫూర్తి పొందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సల్వాజుడుంకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని మండిపడ్డారు. వామపక్షాల ఒత్తిడి మేరకే కాంగ్రెస్ పార్టీ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసుకుందని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉంటే... ఢిల్లీ మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉండగానే పదవికి రాజీనామా చేసి ఉంటే.. రాజ్యాంగ(130 సవరణ) బిల్లు–2025ను తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదని అమిత్ షా అన్నారు. 30 రోజులపాటు జైల్లో ఉన్న వారిని పదవుల నుంచి తొలగించే బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం సరైంది కాదని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను అన్ని రాజకీయ పారీ్టలూ పాటించాలని సూచించారు. ఏ ముఖ్యమంత్రి అయినా జైలులో ఉండి ప్రభుత్వాన్ని నడపాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. జైల్లో ఉంటూ కూడా పరిపాలన సాగిస్తారని మన రాజ్యాంగ రూపకర్తలు ఊహించలేదని, అందుకే ఈ అంశాన్ని రాజ్యాంగంలోని చేర్చలేదని స్పష్టంచేశారు. జైల్లో ఉన్న నేతలను పదవుల నుంచి తొలగించడంలో తప్పేమీ లేదన్నారు. సోనియా, స్టాలిన్ కలలు నెరవేరవు రాజ్యాంగ(130 సవరణ) బిల్లును ‘నల్ల బిల్లు’ అనే హక్కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేదని అమిత్ షా తేల్చిచెప్పారు. శుక్రవారం తమిళనాడులోని తిరునల్వేలిలో బీజేపీ బూత్ కమిటీల సమావేశంలో ప్రసంగించారు. చీకటి పనులు చేసిన చరిత్ర స్టాలిన్‌కు ఉందన్నారు. డీఎంకే ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆరోపించారు. స్టాలిన్ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం సోనియా గాంధీ ఎజెండా, కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడం స్టాలిన్ ఎజెండా అని దుయ్యబట్టారు. వారి కలలు నెరవేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 2026లో తమిళనాడులో ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాంను అప్పట్లో రాష్ట్రపతిని చేసింది, నేడు అదే తమిళనాడు బిడ్డ సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసింది ఎన్డీయే ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. -
అందుకే అడగ్గానే ఒప్పుకున్నా: జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి
ఢిల్లీ: స్వయంగా దేశ ప్రధానినే తమ అభ్యర్థికి ఓటేయాలని అడుగుతున్నారని.. అలాంటిది తాను ఎంపీలను అడగడంలో తప్పేమీ లేదని సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి(79) అంటున్నారు. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో.. ఓ తెలుగు ఛానెల్‌తో ఆయన మాట్లాడారు. ‘‘ఉత్తర, దక్షిణ భారత దేశం అనే తేడా లేదు. నేను తెలంగాణలో పుట్టా.. కానీ భారతదేశ పౌరుడినే. ఉపరాష్ట్రపతి పదవిని- దేశాన్ని దయచేసి వేరుగా చేసి చూడొద్దు. ప్రజాక్షేత్రంలోకి వచ్చాను. ఇందులో దాపరికం ఏం లేదు. పార్లమెంట్ సభ్యులందరూ విజ్ఞులు. స్వయంగా ప్రధాని తమ అభ్యర్థికి ఓటేయాలని ఎంపీలను అడుగుతున్నారు. అందుకే నేను కూడా నాకు ఓటు వేయాలని ఎంపీలను బహిరంగా కోరుతున్నా.... ఉపరాష్ట్రపతి పీఠం.. రాజకీయ వ్యవస్థేం కాదు. అదొక రాజ్యాంగబద్ధమైన పదవి. రాజకీయ వ్యవస్థ కాదనే ఉద్దేశంతోనే అడగ్గానే ఒప్పుకున్నా. రాజకీయ ప్రేరేపిత పరిస్థితుపై మాట్లాడను. ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. నేను పోటీ పడుతోంది ఉప రాష్ట్రపతి పదవి కోసమే. ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరు కాదు. ఆ పదవికి ఉన్న గౌరవం కాపాడాల్సి ఉంది.పార్లమెంట్ సభ్యుల్లో విభజన జరిగిందని నేను అనుకోవడం లేదు. నేను గెలవాలని ఎంపీలు కోరుకుంటున్నారు. నాకు మద్దతు ఇస్తున్న వాళ్లందరికీ కృతజ్ఞతలు. ఉపరాష్ట్రపతి పదవికి అర్హుడిని అనుకుంటే నాకు ఓటేయండి. భారతీయ రాజకీయ వ్యవస్థలో మార్పు జరగాలి. రాజ్యాంగ పరిరక్షకు కృషి చేస్తా. సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరుతున్నా’’ అని ఎంపీలకు విజ్ఞప్తి చేశారాయన. ఇదిలా ఉంటే.. ఉపరాష్ట్రపతి పదవికి నామినేన్ల దాఖలుకు రేపు ఆఖరి తేదీ. ఇవాళ ఇండియా ఎంపీల కూటమి సమావేశంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పాల్గొంటారని.. రేపు(గురువారం) తన నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. -
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేదానిపై ఊహాగానాలకు ఇండియా కూటమి తెర దించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి(79) పేరును ఖరారు చేసింది. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ప్రకటన చేశారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి స్వస్థలం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. వ్యవసాయం కుటుంబంలో జన్మించారీయన. ఉస్మానియా యూనివర్సిటీలో(1971లో) చదివారు. 1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2007 జనవరి 12న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాలుగున్నరేళ్లు సుప్రీం కోర్టులో పని చేశారు. నల్లధనం కేసులపై కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని విమర్శిస్తూ, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే.. సాల్వా జుడుమ్ (మావోయిస్టులపై చర్యల కోసం గిరిజన యువకులను నియమించడం) చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చారు. 2011 జూలై 8న సుప్రీం కోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశారు. రిటైర్డ్ అయ్యాక.. గోవాకు మొట్టమొదటి లోకాయుక్త చైర్మన్‌గా పని చేశారు. 2024 డిసెంబర్లో హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ & మీడియేషన్ సెంటర్ (IAMC) శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు.ఎన్డీయే కూటమి తరఫున బీజేపీకి చెందిన రాధాకృష్ణన్ పేరు ఖరారైన సంగతి తెలిసిందే. అయితే.. ఇండియా కూటమి తరఫున అభ్యర్థి ఎవరనే దానిపై గత మూడు రోజులుగా ఉత్కంఠ నెలకొంది. తెరపైకి తమిళనాడుకు చెందిన ఇద్దరి పేర్లతో(ఓ రాజకీయ నేత, ఓ పొలిటీషియన్) పాటు గాంధీ మనవడు తుషార్ గాంధీ పేర్లు కూడా వచ్చాయి. చివరకు ఆ ఉత్కంఠకు తెర దించుతూ న్యాయకోవిదుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఖరారు చేసింది. ఈ నెల 21వ తేదీన ఆయన నామినేషన్ వేయనున్నారు.జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ప్రొఫైల్..1946, జూలై 8న రంగారెడ్డి జిల్లా కందుకూరు రెవెన్యూ మండలం ఇబ్రహీంపట్నం తాలూకా ఆకుల మైలారం గ్రామంలో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. హైదరాబాద్‌లో చదువుకుని.. ఉస్మానియా వర్సిటీ నుంచి న్యాయ విద్య పూర్తి చేశారు. 1971లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది కె.ప్రతాప్‌రెడ్డి చాంబర్లో జూనియర్‌గా పనిచేశారు. సిటీ సివిల్ కోర్టు(హైదరాబాద్), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు కేసుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపించారు. 1988, ఆగస్టు 8న హైకోర్టులో రెవెన్యూ శాఖ ప్రభుత్వ న్యాయవాది(1988–1990)గా నియమితులయ్యారు.కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా స్వల్పకాలం విధులు నిర్వర్తించారు. ఏవీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలోని విద్యా సంస్థలకు కార్యదర్శిగా, కరస్పాండెంట్‌గా పనిచేశారు. 1993–94 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1993 జనవరి 8న ఉస్మానియా విశ్వవిద్యాలయం లీగల్ అడ్వైజర్, స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 1995, మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005, డిసెంబర్ 5న ప్రధాన న్యాయమూర్తిగా గౌహతి హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2007, జనవరి 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2011, జూలై 8న పదవీ విరమణ పొందారు. -
‘రాధాకృష్ణన్‌తో లాభం లేదు.. ఇండియాకు మనం గట్టి అభ్యర్థిని నిలబెడదాం’
సాక్షి, చెన్నై: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఇండియా కూటమిలో చర్చలు జరుగుతున్నాయి. కూటమి తరఫున ఎవరిని బరిలో నిలపాలి అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన వ్యక్తినే ఎంపిక చేయాలని డీఎంకే సీనియర్ నాయకుడు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సదరు నేత అంతటితో ఆగకుండా.. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌తో తమిళనాడుకు ప్రయోజనం లేదని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించే అంశంపై విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు సోమవారం సమావేశమయ్యారు. కూటమి పార్లమెంటరీ పక్ష నేతలు.. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో డీఎంకే సీనియర్ నాయకులు ఇళంగోవన్ స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది భారత ఉప రాష్ట్రపతి పదవి. రాధాకృష్ణన్ బీజేపీ అభ్యర్థి.. ఆర్ఎస్ఎస్ వ్యక్తి. ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినప్పటికీ మా రాష్ట్రానికి ప్రత్యేకంగా జరిగే మంచి ఏమీ ఉండదు. దీన్ని భాష ద్వారా మాత్రమే కాకుండా రాజకీయంగా చూడాలి.#WATCH | Chennai, Tamil Nadu: On Maharashtra Governor CP Radhakrishnan announced as NDA's Vice Presidential candidate, DMK Leader TKS Elangovan says, "He is an RSS man. He is a BJP candidate. You should view this politically, not as per language...I don't know why the poor man… pic.twitter.com/I1IxxxH2Ij— ANI (@ANI) August 18, 2025బీజేపీ నేతృత్వంలోని బీజేపీ.. ఇప్పటికే పలుమార్లు తమిళులను అవమానించింది. బీజేపీ.. తమిళుల కోసం పనిచేయలేదు. కేంద్రంలోని పెద్దలు.. తమిళనాడు విద్యార్థులకు ఎటువంటి సాయం అందించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా డీఎంకే నుంచే అభ్యర్థి ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అందుకే రాధాకృష్ణకు పోటీగా తమిళనాడు నుంచే.. అది కూడా డీఎంకే నుంచి అభ్యర్థి ఎంపిక చేయాలని కోరుతున్నాను అని అన్నారు. చివరగా.. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇండియా బ్లాక్ తీసుకున్న నిర్ణయానికే తమ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇండియా కూటమిలో కొంత మంది నేతలు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకూడదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బీహార్ ఎన్నికలు దగ్గరలో ఉన్నందున అధికార పక్షం క్రాస్ ఓటింగ్ ద్వారా తమ బలాన్ని పెంచుకుంటే.. అది బీహార్ ఓటర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వారు భావించారు.కూటమి మల్లగుల్లాలు..కాంగ్రెస్ వర్గాల సమాచారాల ప్రకారం.. విపక్ష అభ్యర్థి కాంగ్రెస్ నుంచే ఉండాలనే నిబంధన ఏమీ లేదు. మిత్రపక్షాలు తటస్థ, స్వచ్ఛమైన నేపథ్యం ఉన్న అభ్యర్థి పేరును సూచిస్తే, కాంగ్రెస్ కూడా దానికి అంగీకరించే అవకాశం ఉంది. అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని నిలబెట్టి, సిద్ధాంతపరమైన పోరాటాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ.. ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం అంటే బీజేపీకి స్వేచ్ఛగా మార్గం ఇవ్వడమేనని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ విషయంపై రాహుల్ గాంధీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ ఈ నెల 19న సాయంత్రం ఢిల్లీకి తిరిగి వచ్చి మళ్లీ 21న బీహార్ వెళ్లనున్నారు. ఈ సమయంలో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది. -
ఓట్ల చోరీపై పోరుబాట
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)తోపాటు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, ఓట్ల చోరీ, గత లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌పై విపక్ష ‘ఇండియా’ కూటమి పోరుబాట పట్టింది. ఓట్ల చోరీని వెంటనే ఆపాలని, ‘ఒక్కరికి ఒక ఓటు’ అనే విధానాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలు సోమవారం దేశ రాజధానిలో ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తెల్లటోపీలు ధరించి పార్లమెంట్ మకరద్వారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి బయలుదేరిన ‘ఇండియా’ కూటమి ఎంపీలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాలీకి అనుమతి లేదంటూ పీటీఐ భవనం ఎదుట పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను పక్కకు తొలగించేందుకు ఎంపీలు ప్రయత్నించారు. కేవలం 30 మందిని అనుమతిస్తామని పోలీసులు చెప్పగా, ఎంపీలు అంగీకరించలేదు. ఎన్నికల సంఘానికి విజ్ఞాపన పత్రం అందజేయడానికి శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమను అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. కొందరు రోడ్డుపై బైఠాయించి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చయడం ఆపాలన్నారు. మహిళా ఎంపీలు మహువా మొయిత్రా, సాగరికా ఘోష్, సుస్మితా దేవ్, సంజనా జాతవ్, జోతిమణితోపాటు సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు అఖిలేష్ యాదవ్ బారీకేడ్లపైకి ఎక్కారు. ఎన్నికల సంఘం తీరుపై నిప్పులు చెరిగారు. నినాదాలతో హోరెత్తించారు. ఈ గందరగోళం మధ్య మహిళా ఎంపీలు మహువా మొయిత్రా, మితాలీ బేగ్ స్పృహ తప్పిపడిపోగా, రాహుల్ గాంధీ వారికి సపర్యలు చేశారు. తర్వాత పోలీసులు నిరసనకారులను బస్సుల్లోకి ఎక్కించి, పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. రెండు గంటల తర్వాత వారందరినీ విడుదల చేశారు. రాజకీయ పోరాటం కాదు: రాహుల్ ఇది రాజకీయ పోరాటం కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పోరాటం ప్రారంభించామని స్పష్టంచేశారు. నిరసన ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్ట ప్రకారం ఒక్కరికి ఒక ఓటు మాత్రమే ఉండాలన్నారు. అక్రమాలు, అవకతవకలకు తావులేని స్వచ్ఛమైన, స్పష్టమైన ఓటర్ల జాబితా కోసం ఉద్యమిస్తున్నామని ఉద్ఘాటించారు. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల గురించి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఎన్నికల సంఘం దీనిపై స్పందించడం లేదని నిలదీశారు. గత ఎన్నికల్లో దేశమంతటా జరిగిన రిగ్గింగ్‌పై త్వరలో బాంబు పేలుస్తానని రాహుల్ మరోసారి వెల్లడించారు. ఎన్నికల సంఘం కోరుతున్నట్లుగా సంతకం చేసిన అఫిడవిట్ సమర్పించే ప్రసక్తే లేదన్నారు. ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి తీసుకున్న సమాచారాన్ని విశ్లేíÙంచి, ఓట్ల చోరీని బయటపెట్టానని, ఇంతకంటే సాక్ష్యాధారాలు ఇంకేం కావాలని ప్రశ్నించారు. అది తాను సృష్టించిన డేటా కాదని స్పష్టంచేశారు.బీజేపీ కుట్రలను అడ్డుకుంటాం: ఖర్గే ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. ఓట్ల చోరీని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఎస్ఐఆర్ పేరిట ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలను కచి్చతంగా అడ్డుకుంటామని అన్నారు. ఈ మేరకు ఖర్గే ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశంలో బీజేపీ నిరంకుశత్వం చెల్లదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సాక్షాత్తూ పార్లమెంట్ ఎదుటే ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ఎంపీలను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. తమ డిమాండ్లపై ఎన్నికల సంఘానికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం దొంగతనం చేసే సంఘంగా మారొద్దని జైరాం రామేశ్ హితవు పలికారు. నిరసన ర్యాలీలో శరద్ పవార్(ఎన్సీపీ–ఎస్పీ), టి.ఆర్.బాలు(డీఎంకే), సంజయ్ రౌత్(శివసేన–ఉద్ధవ్), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ)తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, నిరసన ర్యాలీ కోసం ఎవరూ అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం ఆఫీసు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారీకేడ్ దాటేసిన అఖిలేశ్ నిరసన ర్యాలీలో తమను అడ్డుకున్న పోలీసులపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బారీకేడ్లను తోసుకొని ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. బారీకేడ్ ఎక్కి అవతలికి దూకేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రజా ఉద్యమంలా మారింది: రాహుల్న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారం ఉధృతమై ప్రజా ఉద్యమంలా మారిందని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి మద్దతుగా 15 లక్షల సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని, 10 లక్షల వరకు మిస్డ్ కాల్స్ వచ్చాయన్నారు. -
EC Office: పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత.. రాహుల్ సహా ఎంపీలు అరెస్ట్
INDIA bloc leaders March Updates..ఎంపీలు అరెస్ట్.. పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష పార్టీ ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియా కూటమి ర్యాలీని అడ్డుకున్న పోలీసులుకూటమి ఎంపీలను అరెస్ట్ చేసి బస్సుల్లో తరలిస్తున్న పోలీసులు. కేంద్ర ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా ఎంపీల నినాదాలు. #WATCH | Delhi: Congress MP Priyanka Gandhi Vadra says, "Dare hue hai. Sarkaar kaayar hai."Delhi Police detained INDIA bloc MPs, including Rahul Gandhi, Priyanka Gandhi Vadra, Sanjay Raut, and Sagarika Ghose, among others, who were protesting against the SIR and staged a march… https://t.co/GPvb7VcoH4 pic.twitter.com/nnA2tpXC8T— ANI (@ANI) August 11, 2025రాహుల్ కామెంట్స్..అరెస్ట్ తర్వాత రాహుల్ మాట్లాడుతూ..నిజం దేశం ముందు ఉంది.కానీ, వాస్తవం ఏమిటంటే వారు మాట్లాడలేరు.ఈ పోరాటం రాజకీయమైనది కాదు.ఈ పోరాటం రాజ్యాంగాన్ని కాపాడటానికి చేస్తున్నాం.ఈ పోరాటం ఓటు కోసం.మాకు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కావాలి#WATCH | Delhi: Police detains INDIA bloc MPs, including Rahul Gandhi, Priyanka Gandhi, Sanjay Raut, and Sagarika Ghose, among others, who were protesting against the SIR and staged a march from Parliament to the Election Commission of India. pic.twitter.com/9pfRxTNS49— ANI (@ANI) August 11, 2025కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ కామెంట్స్..కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మాట్లాడుతూ..ఎన్నికల కమిషన్‌కు నేను రాసిన లేఖ ప్రత్యక్షంగా ఉంది.అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటు నుండి ఈసీ ఆఫీసుకు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తారని నేను స్పష్టంగా రాశాను.ఎంపీలందరూ SIR గురించి ఎన్నికల కమిషన్‌కు ఒక డాక్యుమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.ఇది మా డిమాండ్.నేను నిన్న సాయంత్రం ఈ లేఖ రాశాను.ఇప్పుడు వారు 30 మంది ఎంపీలు మాత్రమే రావాలని అంటున్నారు.ప్రతిపక్ష ఎంపీలందరూ సమిష్టిగా ఈసీకి ఒక డాక్యుమెంట్ ఇవ్వాలని మేము కోరుకున్నాం.మమ్మల్ని ఇక్కడే ఆపారు.ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లడానికి అనుమతించడం లేదు. శశి థరూర్ కామెంట్స్..కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ..ఈ విషయం చాలా సులభం.రాహుల్ గాంధీ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు.వాటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది.ఎన్నికల కమిషన్ దేశం పట్ల బాధ్యత వహించడమే కాదు. మన ఎన్నికల విశ్వసనీయత గురించి ప్రజల మనస్సులలో సందేహాలను నివృత్తి చేయాలి.ఈసీకి ఆ బాధ్యత ఉంది.ఎన్నికలు మొత్తం దేశానికి ముఖ్యమైనవి.నకిలీ ఓటింగ్ ఉందా, బహుళ చిరునామాలు ఉన్నాయా లేదా నకిలీ ఓట్లు ఉన్నాయా?.పలు సందేహాలతో మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.ప్రజల మనస్సులలో సందేహాలు ఉంటే వాటిని పరిష్కరించాలి.ఈ ప్రశ్నలకు సమాధానాలు అందుబాటులో ఉండవచ్చు, కానీ ఆ సమాధానాలను విశ్వసనీయంగా అందించాలి.ఎన్నికల కమిషన్ ప్రశ్నలను తీసుకొని వాటిని పరిష్కరించాలి. #WATCH | Congress MP Shashi Tharoor says, "For me, the issue is very simple. Rahul Gandhi has raised some serious questions; they deserve serious answers. The Election Commission not only has a responsibility to the nation, but it has a responsibility to itself that there should… https://t.co/BaEU00fr0Y pic.twitter.com/c39DQ5fSTu— ANI (@ANI) August 11, 2025పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత.. సంసద్ మార్గ్‌ను బ్లాక్ చేసిన పోలీసులు.ఈసీ ఆఫీసుకు వెళ్లకుండా విపక్ష ఎంపీలను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు.బారికేడ్డు పెట్టి విపక్ష ఎంపీలను నిలువరిస్తున్న ఢిల్లీ పోలీసులు.ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి సవాల్ చేసిన రాహుల్ గాంధీ. రోడ్డుపై బైఠాయించి ఎంపీల నిరసనలు.. #WATCH | Delhi Police stops INDIA bloc leaders marching from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound Bihar and allegations of "voter fraud" during the 2024 Lok Sabha elections. pic.twitter.com/4KcXEALWxY— ANI (@ANI) August 11, 2025ఢిల్లీలో హైటెన్షన్.. అఖిలేష్ యాదవ్ నిరసన..ఎంపీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.బారికేడ్ల దూకి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన అఖిలేష్.అఖిలేష్‌ను అడ్డుకున్న పోలీసులు..పార్లమెంట్ వద్ద రోడ్డుపై కూర్చుని అఖిలేష్, తృణముల్ ఎంపీలు నిరసనలు.నిరసనల్లో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, శశి థరూర్ పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతల నినాదాలు #WATCH | Delhi: "... They are using the police to stop us...," says Samajwadi Party Chief and MP Akhilesh Yadav as he sits down to protest as police stop the opposition MPs from marching towards the Election Commission of India. pic.twitter.com/u3ScvbxWiX— ANI (@ANI) August 11, 2025 #WATCH | Congress MP Priyanka Gandhi Vadra raises slogans as the INDIA bloc leaders march from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound Bihar and allegations of "voter fraud" during… pic.twitter.com/X9xgcPRVCV— ANI (@ANI) August 11, 2025 #WATCH | Delhi: Senior INDIA bloc leaders- Congress President Mallikarjun Kharge, NCP SCP chief Sharad Pawar join INDIA bloc leaders as they march from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in… pic.twitter.com/d0ExdSGTHH— ANI (@ANI) August 11, 2025పార్లమెంట్ వద్ద ఉద్రికత్త.. పార్లమెంట్ బయటే బారికేడ్ల ఏర్పాటు.బారికేడ్లపైకి ఎక్కిన మహిళా ఎంపీలు.ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు. #WATCH | Delhi Police stops INDIA bloc leaders marching from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound Bihar and allegations of "voter fraud" during the 2024 Lok Sabha elections. pic.twitter.com/4KcXEALWxY— ANI (@ANI) August 11, 2025ఎంపీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..ఈసీ అపాయింట్మెంట్ కోరిన ప్రతిపక్ష నేతలుపార్లమెంట్ టు ఈసీ.. విపక్ష ఎంపీల ర్యాలీబీహార్లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల ర్యాలీకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ర్యాలీగత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ నినాదాలుఈ ర్యాలీకి అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసులు30 మందే రావాలంటూ జైరాం రమేష్‌కు లేఖ రాసిన ఈసీ.ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ సవాల్. 300 మంది ఎంపీలతో ర్యాలీకి ఇండియా కూటమి ప్రయత్నం #WATCH | Delhi: INDIA bloc leaders gathered at the Makar Dwar of the Parliament. INDIA bloc leaders are set to stage a march from the Parliament to the Election Commission of India to protest against the Special Intensive Revision (SIR) of electoral rolls in poll-bound Bihar… pic.twitter.com/gc9hDgtqNB— ANI (@ANI) August 11, 2025👉విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. బీహార్‌లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ ర్యాలీ కొనసాగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఇండియా బ్లాక్ నేతలు, తదితరులు పాల్గొన్నారు. -
ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. విపక్షాలకు చెందిన ‘ఇండియా’కూటమి తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతు న్నారు. ఈ మేరకు గత గురువారం కూటమి నేతలతో ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కోసం నేతలతో విస్త్రృతం చర్చలు కొనసా గిస్తున్నారు. కాగా, నేడు సోమవారం రాత్రి ఢిల్లీ లోని హోటల్ తాజ్‌లో కూటమి పార్టీల పార్లమెంటు సభ్యులకు ఖర్గే విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించి వారి అభిప్రాయాలను తీసుకుంటారు. అయితే, ఎన్డీఏ తన అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే విపక్షాల అభర్థిని ప్రకటించాలని ఇండియా కూటమిలోని ఒక వర్గం ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఉభయసభల్లో 422 మంది, విపక్ష (ఇండియా) కూటమికి 313 మంది అనుకూలంగా ఉన్నారు. ఎన్డీఏ అభ్యర్థి విజయం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది. అయినా ఉభయ సభల్లో మెజారిటీ లేనప్పటికీ ఉప రాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేయాని, బలం లేకున్నా బరిలో ఉండాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఫలితంతో సంబంధం లేకుండా బలమైన సందేశాన్ని పంపే ఉద్దేశంతోనే ఇండియా కూటమి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి అభర్థిని నిలబెట్టడంపై సమష్టి నిర్ణయం కోసం ప్రయత్నా లు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. -
7న ‘ఇండియా’ కూటమి విందు భేటీ
సాక్షి, న్యూఢిలీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) విషయంలో విపక్ష ‘ఇండియా’కూటమి నేతలు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై వెంటనే చర్చించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సైతం స్తంభింపజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించేందుకు సమావేశం కావాలని విపక్ష కూటమి నేతలు నిర్ణయించారు. ఈ నెల 7వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో ఈ విందు భేటీ జరుగనుంది. ఎస్ఐఆర్ సహా పలు కీలక అంశాలపై చర్చించి, భవిష్యత్తు కార్యచరణను ఖరారు చేస్తారని సమాచారం. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 70–80 సీట్లు రిగ్గింగ్‌కు గురయ్యాయని రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు. నరేంద్ర మోదీ అత్యంత తక్కువ మెజారీ్టతో ఈసారి ప్రధానమంత్రి అయ్యారని, రిగ్గింగ్ జరగకపోయి ఉంటే ఆయన ఆ పదవిలో ఉండేవారే కాదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ అంశంతోపాటు ఆపరేషన్ సిందూర్, భారత్‌పై అమెరికా సుంకాలు, వాణిజ్య ఒప్పందం తదితర అంశాలు విందు భేటీ అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతోపాటు శరద్ పవార్, తేజస్వీ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా తదితరులు హాజరు కానున్నారు. ‘ఇండియా’కూటమి నేతలు చివరి సమావేశం జూలై 19న వర్చువల్‌గా జరిగింది. -
ఐదోరోజూ అదే తీరు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో గందరగోళానికి ఇంకా తెరపడలేదు. విపక్ష సభ్యు లు ఆందోళనలు, నిరసనలు, నినాదాల కారణంగా వరుసగా ఐదో రోజు శుక్రవారం సైతం ఉభయ సభలు స్తంభించాయి. పలుమార్లు వాయిదా పడ్డాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై పార్లమెంట్లో వెంటనే చర్చించాలని, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశాయి. నినాదాలతో హోరెత్తించాయి. ప్రతిపక్షాల ఆగ్రహావేశాల వల్ల పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో లోక్‌సభ, రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తుతన్నట్లు సభాపతులు ప్రకటించారు. చెప్పుకోదగ్గ కార్యకలాపాలేవీ జరగకుండానే వర్షాకాల సమావేశాల్లో తొలివారం ముగిసిపోవడం గమనార్హం. లోక్‌సభలో నినాదాల హోరు లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీనిపై చర్చకు విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. చేసేది లేక స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విపక్షాలు సహకరించాలని స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ కోరారు. అయినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. ఇప్పడే చర్చ ప్రారంభించాలని తేల్చిచెప్పారు. వారిపై జగదాంబికా పాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సి సభలో ఈ అలజడి ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని అన్నారు. సభ వాయిదా పడేలా చేయడం గొప్ప విషయం కాదని హితవు పలికారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోతే దేశమే నష్టపోతుందని చెప్పారు. చర్చించాల్సిన బిల్లులు చాలా ఉన్నాయని, సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. గోవాలో ఎస్టీలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు ఉద్దేశించిన కీలకమైన బిల్లుపై చర్చిద్దామని న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ చెప్పారు. అయినా విపక్షాల తీరులో మార్పు రాలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు జగదాంబికా పాల్ ప్రకటించారు. ‘కార్గిల్ విజయ్ దివస్’ నేపథ్యంలో కార్గిల్ అమర వీరులకు లోక్‌సభలో నివాళులర్పించారు. ఎంపీలంతా కొంతసేపు మౌనం పాటించారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ పార్లమెంట్ ఎగువ సభలోనూ విపక్షాల ఆందోళన యథాతథంగా కొనసాగింది. వివిధ అంశాలపై రూల్ 267 కింద చర్చను కోరుతూ విపక్షాలు ఇచ్చిన 28 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చెప్పారు. బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తారు. దీనిపై సభలో తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. ఉదయం రాజ్యసభ మొదలైన వెంటనే నినాదాలు మిన్నంటడడంతో రఘువంశ్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్‌పై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సమాధానం ఇస్తుండగా ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా కేకలు వేశారు. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణను ఆపాలని డిమాండ్ చేశారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ అంటూ నినదించారు. కొందరు ఎంపీలు వెల్‌లోకి ప్రవేశించారు. వెనక్కి వెళ్లిపోవాలని, సభకు సహకరించాలని సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ ఘన్‌శ్యామ్ తివారీ పదేపదే విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘన్‌శ్యామ్ తివారీ ప్రకటించారు. కమల్ హాసన్ ప్రమాణం ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌పీ) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు డీఎంకే నాయకులు రాజాత్తి, ఎస్.ఆర్.శివలింగం, పి.విల్సన్ సైతం ఎగువ సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. విపక్షాల నిరసన బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పా ర్లమెంట్ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. మకరద్వారం మెట్లపై వినూ త్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ అని రాసి ఉ న్న పత్రాలను చించివేసి, చెత్తకుండీలో విసి రేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఎస్ఐఆర్పై పార్లమెంట్లో చర్చించాలని తేల్చిచెప్పారు. సభకు సహకరించడానికి విపక్షాల అంగీకారం నిరసనలు, నినాదాలు పక్కనపెట్టి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇకపై సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రతిపక్ష నేతలు చెప్పారు. వర్షాకాల సమావేశాల్లో నిత్యం గందరగోళ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం అన్ని పార్టీల సీనియర్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సభా కార్యకలాపాలకు సహకరించాలని కోరగా, ప్రతిపక్ష నాయకులు అందుకు అంగీకరించినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి నిర్మాణాత్మక చర్చలు సాగిద్దామని స్పీకర్ సూచించారు. ప్రజలకు మేలు కలిగేలా సభలో అర్థవంతమైన చర్చలు జరగాలన్నదే తన ఉద్దేశమని ఆయన వివరించారు. ఆపరేషన్ సిందూర్‌పై సోమవారం పార్లమెంట్లో చర్చ ప్రారంభం కానుంది. -
‘ఇండియా’ కూటమి ఉమ్మడి అభ్యర్థి!
న్యూఢిల్లీ: జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి త్వరలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యరి్థపై తమ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని విపక్ష ‘ఇండియా’కూటమి నిర్ణయించినట్లు తెలిసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ పోటీ పడడమే సరైన వ్యూహమని భావిస్తున్నట్లు సమాచారం. ఫలితంతో సంబంధం లేకుండా అధికార కూటమికి బలమైన సందేశం ఇవ్వదలిచామని ఇండియా కూటమి నేతలు గురువారం వెల్లడించారు. పార్లమెంట్లో మొత్తం ఓట్లు 782 కాగా, ఉప రాష్ట్రపతి ఎన్నికలో నెగ్గాలంటే 392 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఎన్డీయేకు 423 ఓట్ల బలం ఉంది. ఇండియా కూటమికి సానుకూలంగా 313 ఓట్లు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు పాల్గొంటారు. -
Parliament: ‘విదేశాంగ విధానాల్లో ప్రభుత్వ వైఫల్యం?’.. చర్చకు ఇండియా కూటమి కసరత్తు
న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు తగిన వ్యూహాన్ని రూపొందించేందుకు 24 పార్టీల ఇండియా కూటమి నేతలు ఆన్లైన్లో సమావేశమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా, బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ, డీలిమిటేషన్ తదితర అంశాలపై అధికార ప్రభుత్వంతో చర్చించాలని వారు తీర్మానించారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారిని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. INDIA bloc parties discuss key issues ahead of monsoon session of ParliamentRead @ANI Story | https://t.co/83WAD84ikS#INDIABloc #Parliament #MonsoonSession pic.twitter.com/yDCinNKDFB— ANI Digital (@ani_digital) July 19, 2025ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ మధ్య శాంతికి మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేసిన వాదనలను ఘాటుగా తిప్పికొట్టకపోవడాన్ని ప్రతిపక్షం హైలైట్ చేస్తుందని ఇండియా కూటమి నేతలు తమ వర్చువల్ సమావేశంలో వెల్లడించారు. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందుగా ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని కూడా పార్టీలు నిర్ణయించాయి . అలాగే జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా డిమాండ్‌ను కూడా లేవనెత్తాలని ప్రతిపక్ష నేతలు యోచిస్తున్నారు.విలేకరులను ఉద్దేశించి కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ మాట్లాడుతూ తమ కూటమి నేతలు ఎనిమిది ప్రాధాన్యతా అంశాలను ఈ జాబితాలో చేర్చారని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ దాడిలో పాల్గొన్న ముష్కరులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. భారత్-పాక్ మధ్య శాంతి స్థాపన చేసేందుకు.. తమ వాణిజ్య ఒప్పందాన్ని చర్చల కార్డుగా ఉపయోగించుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నారని, దీనిపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని తాము సభలో ప్రశ్నిస్తామని తెలిపారు. ఈ అంశాలపై చర్చించే సమయంలో ప్రధాని హాజరవుతారని తాము ఆశిస్తున్నామని తివారీ పేర్కొన్నారు. ఈ ప్రతిపక్షాల సమావేశంలో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, శివసేన (యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఇండియా కూటమి పార్టీల పలువురు నేతలు పాల్గొన్నారు. -
కూటమి భేటీలకు మేమిక దూరం
సాక్షి, న్యూఢిల్లీ: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి భారీ షాక్ తగిలింది. ఈ నెల 21 నుంచి మొదలయ్యే వర్షాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా పక్షాలు ఏర్పాటు చేసిన ఆన్లైన్ భేటీకి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే శనివారం ఏర్పాటు చేసిన భేటీకి దూరంగా ఉండనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ‘‘ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చామని మా పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ కూటమి కేవలం గత లోక్‌సభ ఎన్నికల దాకానేనని కూడా ఆయన అప్పుడే చెప్పారు. కనుక ఇండియా కూటమిలో ఆప్ ఇంకెంత మాత్రమూ భాగం కాదు. టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు మాకు మద్దతిస్తున్నందున పార్లమెంటులో వారితో అంశాలవారీగా సమన్వయాన్ని కొనసాగిస్తాం’ అని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ తెలిపారు. బిహార్, యూపీ, పూర్వాంచల్‌లో బుల్డోజర్ రాజ్యం, ఢిల్లీలో పేదల ఇళ్ల కూల్చివేతలపై కేంద్రాన్ని ఆప్ నిలదీస్తుందన్నారు.కూటమి బలహీనంగత లోక్‌సభ ఎన్నికల అనంతరం హరియాణా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుంటుందని భావించినా సీట్ల పంపకాల్లో విభేదాలతో అది జరగలేదు. ఆ తర్వాత పంజాబ్, గుజరాత్ ఉప ఎన్నికల్లో కూడా ఆప్ ఒంటరిగానే పోటీ చేసింది. గుజరాత్లో విశావదర్ ఉప ఎన్నికల్లో ఆప్ విజ యం తర్వాత కేజ్రీ వాల్ మాట్లాడుతూ, ఇండియా కూటమి కేవలం గతేడాది లోక్‌సభ ఎన్నికలకు ఉద్దేశించినది మాత్రమే నన్నారు. ‘‘ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తు లేదు. బిహార్ సహా అన్ని ఎన్నికల్లోనూ ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుంది’’ అని ప్రకటించారు. దానిపై పార్టీ తాజాగా మరింత స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో విపక్షాల స్వరం నానాటికీ మరింత బలహీనపడుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆప్‌కు ప్రస్తుతం లోక్‌సభలో 3, రాజ్యసభలో 8 మంది ఎంపీలున్నారు. ఇండియా కూటమి నుంచి ఆ పార్టీ బయటకు రావడం విపక్ష ఐక్యతకు పెద్ద దెబ్బే కానుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, పాక్‌తో కాల్పుల విరమణలో అమెరికా జోక్యం, మనపై ఆ దేశ సుంకాలు, బిహార్‌లో ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి పలు అంశాలపై వర్షాకాల సమావేశాల్లో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలాంటి సమయంలో కీలక బిల్లులపై ఓటింగ్ జరిగే పక్షంలో ఆప్ లేకపోవడం ఇండియా కూటమికి సంఖ్యాపరంగా ఇబ్బందిగా మారనుంది. -
వక్ఫ్‌పై అపోహ మాత్రమే: లోక్‌సభలో అమిత్ షా
Waqf Bill In Lok sabha Updates..వక్ఫ్‌పై అపోహ మాత్రమే: లోక్‌సభలో అమిత్ షావక్ఫ్ సవరణ బిల్లు 2025 గురించి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. వక్ఫ్ చట్టం, బోర్డు 1995లో అమల్లోకి వచ్చింది.వక్ఫ్ బోర్డ్‌పై అనేక అపోహలున్నాయి.ముందుగా ముస్లిమేతరులు ఎవరూ వక్ఫ్ పరిధిలోకి రారు.వక్ఫ్ నిర్వహణలో ముస్లిమేతరులను చేర్చాలనే నిబంధనల లేదు.మేం ఆ పనిచేయాలనుకోవడం లేదు.ఈ చట్టం ముస్లింల మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకుంటుందని, వారు విరాళంగా ఇచ్చిన ఆస్తిల్లో జోక్యం చేసుకుంటుందనేది ఓ అపోహ.మైనారిటీలలో వారి ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఈ తరహా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదు: గౌరవ్ గొగొయ్దేశ ప్రజల్లోని సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయత్నమిదిరాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కొన్ని నియమాలను సృష్టించుకునే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉందిదానిని పూర్తిగా తొలగించాలని చూస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ ఎంపీ#WATCH | Deputy Leader of Congress in Lok Sabha, Gaurav Gogoi, speaks on the Waqf Amendment Bill He says, "Did the Minority Affairs Ministry make this bill, or did some other department make it? Where did this Bill come from?... Today, the condition of minorities in the country… pic.twitter.com/QJPNnwcpyI— ANI (@ANI) April 2, 2025 వక్ప్ భూములపై కిరణ్ రిజుజు కీలక వ్యాఖ్యలు..వక్ఫ్ సవరణ బిల్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో వివరిస్తున్న కిరణ్ రిజుజుఈ బిల్లులో ముస్లింలకు నష్టం చేసేదేమీ లేదు.బిల్లును వ్యతిరేకిస్తున్న వారు ఇది తెలుసుకోవాలి.మత విశ్వాసాల విషయంలో ఎలాంటి జోక్యం ఉండదు.వక్ఫ్ చట్టం లోపాలతో అనేక ఉల్లంఘనలకు అవకాశం ఏర్పడింది.పార్లమెంట్ భవనం కూడా తమ ఆస్తేనని వక్ఫ్ బోర్డు అన్నది.వక్ప్ వాదనను ప్రధాని మోదీ అడ్డుకున్నారు.యూపీఏ అధికారంలో ఉండి ఉంటే ఢిల్లీలో 23 కీలక స్థలాలు వక్ఫ్ సొంతం అయ్యేవి.123 విలువైన ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ వక్ఫ్‌కు కట్టబెట్టింది.2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌కు ఆస్తులు కట్టబెట్టారు.దేశంలో మూడో అత్యధిక ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్ దగ్గర ఉంది.భారతీయ రైల్వే దగ్గర అత్యధికంగా ల్యాండ్ ఉంది.ఆ భూమిని భారతీయులుంతా వినియోగించుకుంటున్నారు.రెండో స్థానం రక్షణ శాఖ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది.మూడో స్థానంలో ఉన్న వక్ఫ్ భూములను భారతీయులంతా వినియోగించుకోలేరు.ప్రపంచంలోనే అత్యధిక ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది.మసీదుల నిర్వహణపై ఈ చట్టం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు.కిరణ్ రిజుజు వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అభ్యంతరం.కేంద్రమంత్రి మాట్లాడేటప్పుడు అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను హెచ్చరించిన స్పీకర్ ఓం బిర్లా..#WATCH | After introducing the Waqf Amendment Bill in Lok Sabha, Parliamentary Affairs Minister Kiren Rijiju says "A case ongoing since 1970 in Delhi involved several properties, including the CGO Complex and the Parliament building. The Delhi Waqf Board had claimed these as Waqf… pic.twitter.com/qVXtDo2gK7— ANI (@ANI) April 2, 2025 అమిత్ షా కామెంట్స్..జేపీసీ నివేదికలో ఇచ్చిన సవరణలతో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టాం.జేపీసీ వేయాలని కాంగ్రెస్ సహా విఫక్షాలు కోరాయి.విపక్షాల డిమాండ్ మేరకే జేపీసీ వేశాం.ప్రభుత్వం తెచ్చిన బిల్లులో జేపీసీ సవరణలు సూచించింది.మేము కాంగ్రెస్ లాగా జేపీసీ సవరణలను పట్టించుకోకువడా బిల్లును యథాతథంగా తీసుకురాలేదు. #WATCH | Waqf (Amendment) Bill taken up for consideration and passing in Lok SabhaUnion Home Minister Amit Shah says, "...It was your (opposition) insistence that a Joint Parliamentary Committee should be formed. We do not have a committee like the Congress. We have a… pic.twitter.com/bbKRTuheft— ANI (@ANI) April 2, 2025 కిరణ్ రిజుజు కామెంట్స్..ఈ బిల్లులో ముస్లింలకు నష్టం చేసేదేమీ లేదు.అన్ని వర్గాల సలహాలను తీసుకున్నాం.మైనార్టీల్లో అనవసర భయాలను సృష్టిస్తున్నారు.బిల్లుపై విస్తృత చర్చ జరిపాం.గతేడాది వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం.జేపీసీ నివేదిక తర్వాత వక్ఫ్ బిల్లులో సవరణలు చేసిన ప్రభుత్వం లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో ప్రారంభమైన చర్చలోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిరణ్ రిజుజుచర్చ అనంతరం ఓటింగ్ చేపట్టే అవకాశం #WATCH | Parliamentary Affairs Minister Kiren Rijiju introduces Waqf Amendment Bill in Lok Sabha. pic.twitter.com/BukG8RSqBT— ANI (@ANI) April 2, 2025వక్ఫ్ బిల్లుకు ఢిల్లీ మహిళల మద్దతు..ఢిల్లీలో పలువురు ముస్లిం మహిళలు బయటకు వచ్చి బీజేపీకి మద్దతు.వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తూ ప్రకటన.మోదీకి మద్దతు తెలుపుతూ ఫ్లకార్డుల ప్రదర్శన #WATCH | Women in Delhi come out in support of Waqf (Amendment) Bill to be presented today in Lok Sabha https://t.co/Eo2X9nBo9s pic.twitter.com/HGWKHnRwLD— ANI (@ANI) April 2, 2025కేంద్రమంత్రి కిరణ్ రిజుజు కామెంట్స్..కొంతమంది మత పెద్దలు సహా కొందరు నాయకులు అమాయక ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారు. అలాంటి కొందరు వ్యక్తులే సీఏఏ.. ముస్లింల పౌరసత్వ హోదాను తొలగిస్తుందని చెప్పారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు అవసరమని వ్యక్తిగతంగా చెబుతున్నారు. కానీ, వారి ఓటు బ్యాంకు కోసం దానిని వ్యతిరేకిస్తున్నారు అని అన్నారు.#WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha today Union Minister of Minority Affairs, Kiren Rijiju says, "Union Minority Affairs Minister Kiren Rijiju says, "Some leaders, including some religious leaders, are misleading innocent Muslims... The same… pic.twitter.com/EfzC86vrAC— ANI (@ANI) April 2, 2025రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ కామెంట్స్..దేశంలో లౌకిక పార్టీ ఎవరో ఈరోజే నిర్ణయించబడుతుంది.బీహార్‌లో ఎన్నికలు ఉన్నాయి.జేడీయూ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే, వారు ఎన్నికల్లో ఓడిపోతారు.బీజేపీ దానిని ఆమోదించే అవకాశం పొందడానికి వారు వాకౌట్ చేసే అవకాశం ఉంది.చిరాగ్ పాస్వాన్ కూడా అదే చేయగలరు.ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఎవరు ఓటు వేస్తారో చూడాలి#WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha todayRajya Sabha MP Kapil Sibal says "...It will be decided today who is a secular party in this country. There are elections in Bihar, if JDU votes in favour of the Bill, they will lose the elections. It is… pic.twitter.com/F5YnPRmzYh— ANI (@ANI) April 2, 2025కాంగ్రెస్ ఎంపీ నిరసన.. లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢి నల్ల దుస్తులు ధరించి పార్లమెంటుకు వచ్చారు.Congress MP Imran Pratapgarhi arrives at the Parliament wearing black attire to protest against the Waqf Amendment Bill, which will be introduced in Lok Sabha today pic.twitter.com/5UdDhZedtH— ANI (@ANI) April 2, 2025 వైఎస్సార్సీపీ లోక్‌సభపక్ష నేత మిథున్ రెడ్డి కామెంట్స్..ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాంలోక్‌సభ, రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాంమైనారిటీ సమాజానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ ప్రకటించారుముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిస్తున్నారు చంద్రబాబు మరోసారి ముస్లింలను మోసం చేశారుఅన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలిముస్లింల ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరంవక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలను అణచివేసే విధంగా ఉందిఇదిలాగే కొనసాగితే దేశంలో అశాంతి పెరిగే ప్రమాదం ఉంది 👉నేడు లోక్‌సభలో కీలకమైన వక్ఫ్(సవరణ) బిల్లుపై చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.👉తాజాగా కాంగ్రెస్ ఎంపీ, జేపీసీ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ మేము నిజం చెప్పాలనుకుంటున్నాను. ముస్లింలకు ఏమీ జరగదని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ప్రభుత్వానికి వాటా ఉన్న ప్రభుత్వ ఆస్తి వివాదాస్పదమని, నియమించబడిన అధికారి దర్యాప్తు చేసే వరకు ఆ ఆస్తిని వక్ఫ్‌గా పరిగణించబోమని, వివాదాస్పద ఆస్తి ఇకపై వక్ఫ్‌గా ఉండదని వారు నిబంధన చేశారు’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha todayCongress MP and JPC member Imran Masood says, "We are ready for discussion. But I want to tell you the truth. The government is repeatedly saying that nothing will happen to Muslims, but they have made a… pic.twitter.com/ZULzEi1RzT— ANI (@ANI) April 2, 2025👉 ఇక, బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు.👉బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆయా పార్టీలు విప్ జారీ చేశాయి. వక్ఫ్ (సవరణ) బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు.👉ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయించారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 298 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి. ఏమిటీ వివాదం? 👉వక్ఫ్ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం.👉ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ పోర్టల్‌లో విధిగా నమోదు చేయించాలి.👉ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి. -
కూటమి ఇంకా ఉందా?.. తెలియదే!
కూటమి ఇంకా ఉందా?.. తెలియదే! -
ఇండియా కూటమిలో బిగ్ ట్విస్.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఆప్!
ఢిల్లీ: ఇండియా కూటమి రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఢిల్లీ ఎన్నికల వేళ ఆప్‌పై కాంగ్రెస్ ఆరోపణలే కారణమని తెలుస్తోంది.దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండియా కూటమిలో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. కూటమి నుంచి కాంగ్రెస్‌ను పంపించేలా ఇతర పార్టీలను ఒప్పించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఎన్నికల సందర్భంగా ఆచరణ సాధ్యం కాని హామీలు అమలు చేస్తామని కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించిన నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆప్ వర్గాల నుంచి ఇలాంటి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, భవిష్యత్‌లో కూటమి రాజకీయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో ఇండియా కూటమిలో కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమే ఇందుకు కారణం. ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం, ఓడిపోవడంతో కూటమి నేతలు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇండియా కూటమికి తాను చీఫ్‌గా ఉండాలనుకుంటున్నట్టు మమతా బెనర్జీ చెప్పడంతో మరింత ఉత్కంఠను పెంచింది. ఈ క్రమంలో కూటమిలో పలు పార్టీల నేతలు కూడా మమతకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి పరిణామాల మధ్య ఆప్ తాజా నిర్ణయం కూటమిలో చిచ్చు పెట్టిందని పొలిటికల్ సర్కిల్ చర్చ నడుస్తోంది.Congress can criticise Kejriwal & AAP, as there is not alliance in Delhi. but Congress leader @ajaymaken call Kejriwal as anti national. How to accept this arrogance.AAP is the part of INDIA bloc, INC should keep respect with alliance partnerspic.twitter.com/8ix7V9s4G7— Arshad MT (@ArshadMadathodi) December 26, 2024 -
ఇండియా కూటమి కథ కంచికేనా?
నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని 2029 వరకు సవాలు చేయగలిగే సుస్థిరమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంగా ఇండియా కూటమి పని చేయగలదని 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రారంభంలో సూచించాయి. అయితే, సంవత్సరాంతానికే ఇండియా కూటమి అకాల మరణం వైపు వెళుతున్నట్లు కనబడుతోంది. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ థాకరే), సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌తో సహా అనేక ఇండియా కూటమి పార్టీలకు ఒక విషయం అర్థం చేయించినట్లు కనిపి స్తోంది. అదేమిటంటే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ దేనికీ పనికిరాదు!కాంగ్రెస్‌కు పెద్ద సవాలుఎంతో ఆలోచించి తీసుకున్న వ్యూహంలా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీకి సీట్లు కల్పించేది లేదని ప్రక టిస్తూ ఆప్ మొదటగా బయటకు వచ్చింది. బిహార్‌లో 2025 అసెంబ్లీ ఎన్నికల కోసం ‘మహాగఠ్‌బంధన్’లో కాంగ్రెస్‌ను కోరుకోవడం లేదని లాలూ యాదవ్, ఆయన కుమారుడు తేజస్విల వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. 2026లో కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడులో వరుసగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే,అస్సాంను బీజేపీ నుండి, కేరళను ఎల్డీఎఫ్ నుండి కైవసం చేసుకోవడం, హిమాచల్‌ను నిలుపుకోవడంలో కాంగ్రెస్ అత్యంత కష్టసాధ్యమైన సవాలును ఎదుర్కోనుంది. మిగి లిన రాష్ట్రాల్లో, అంటే తమిళనాడులో డీఎంకే, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ వంటి మిత్రపక్షాల మీద భారీగా ఆధార పడటమో, లేక ప్రాసంగికత లేకుండా ఉండిపోవడమో మాత్రమే కాంగ్రెస్ చేయగలిగేది!కాంగ్రెస్‌ను ముంచే కేజ్రీవాల్ ఫార్ములాఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకం విషయంలో సింగిల్ డిజిట్ సీట్లకు కాంగ్రెస్ సిద్ధపడినప్పటికీ, అరవింద్ కేజ్రీవాల్ కఠినంగా వ్యవహరించారు. ఢిల్లీకి సంబంధించినంతవరకు మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ నుండి ఆప్‌కి మారడం ఖాయమని కేజ్రీవాల్ అంచనా. అలాంటప్పుడు కాంగ్రెస్ తనకు బరువుగా మారుతుంది. దీంతో దేశ రాజధానిలో రికార్డు స్థాయిలో మూడోసారి కూడా ఖాళీ సీట్లతో కాంగ్రెస్ మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయి పొత్తుల నుంచి కాంగ్రెస్‌ను తప్పించాలనే ‘కేజ్రీవాల్ ఫార్ములా’ తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే వంటి వారికి ధైర్యం కలిగిస్తోంది.దురదృష్టవశాత్తూ, 2026లో జరిగే అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌కు తన సత్తాను నిరూపించుకునే అవకాశం వస్తుంది. కూటమి నేతల వ్యాఖ్య లపై స్పందించవద్దని పార్టీ సీనియర్ నేతలకు, సహచరులకు రాహుల్ గాంధీ సూచించారు. కూటమిని కొనసాగించడానికి ఇది బలహీనమైన ప్రయత్నమనే చెప్పాలి.కూటముల వైఫల్యం వెనుక...కూటమిలోని అనేక ప్రాంతీయ పార్టీలు కూటమి నాయకత్వ సమస్యను నిరంతరం లేవనెత్తుతున్నాయి. వాస్తవానికి, కాంగ్రెస్ మినహా, కూటమిలోని దాదాపు అందరూ మమ తను అధిపతిగా సిఫార్సు చేశారు లేదా మద్దతు ఇచ్చారు. ఆమె కూడా బాధ్యతను ‘ఒప్పుకునే’ స్థాయిదాకా వెళ్లారు. కానీ కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం ఈ ఎత్తు గడను పురోగమించకుండా చేస్తోంది. ఇండియా కూటమి భాగస్వాములు ‘సహ– సమాన’ హోదాను కోరుకుంటున్నాయని బహుశా కాంగ్రెస్‌కు తెలుసు. కానీ ఒక ఆధిపత్య భాగస్వామి, అనేక మంది మైనర్ ప్లేయర్లు ఉన్నప్పుడల్లా పొత్తులు పని చేశాయి, వృద్ధి చెందాయి. ఉదాహ రణకు, కేరళలో వరుసగా కాంగ్రెస్, సీపీఎం నేతృత్వంలోని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ పొత్తులు లేదా బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే. 1977 నాటి జనతా పార్టీ ప్రయోగం, నేషనల్ ఫ్రంట్ (1989), యునైటెడ్ ఫ్రంట్ (1996) కేవలం ‘సహ–సమాన’ వంటకంపై ఆధార పడినందుకే నాశనమైనాయి. అయితే లోక్‌సభలో ఓ వంద స్థానాలు ఉన్న కారణంగా, కాంగ్రెస్ తనను సమానులలో మొదటి స్థానంలో ఉంచుకుంటోంది.ఆసక్తికరమైన విషయమేమిటంటే, గతంలో కూటమికి నాయకత్వ సమస్య అరుదుగానే ఉండేది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారంటే, ఆయన ఉత్తముడు లేదా గట్టి పోటీదారు కావడం వల్ల కాదు, చరణ్ సింగ్‌ను అదుపులో ఉంచడానికి. దేవీలాల్ నామినేషన్ వేసిన పదవికి పోటీదారు కాదు కాబట్టే 1988–89లో ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ అయ్యారు. తరువాత, ప్రతిష్ఠాత్మకమైన ఆ పదవిని వీపీ సింగ్‌కు కట్టబెట్టారు. హెచ్డి దేవెగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్ రోజులలో, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు స్వల్పకాలిక యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా, కింగ్‌మేకర్‌గా వ్యవహరించారు. అస్థిర కూటమి రాజకీయాల వాజ్‌పేయి కాలంలో, జార్జ్ ఫెర్నాండెజ్ ఎన్డీయే కన్వీనర్‌గా ఎంపికయ్యారు. రామారావుగానీ, నాయుడుగానీ, ఫెర్నాండెజ్గానీ తమకిచ్చిన పదవి కోసం తహతహలాడటం విన బడలేదు. మొరార్జీ, దేవీలాల్, గౌడ, గుజ్రాల్‌లకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ విషయాన్ని మమత కూడా తెలుసుకోవాలని కాంగ్రెస్ అనుకుంటుండవచ్చు.చదవండి: మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగేదెప్పుడు?కూటమిలో అందరితోనూ సమాచారం పంచుకోగల దిగ్గజం శరద్ పవార్. కానీ నవంబర్ 23 మహారాష్ట్ర తీర్పు తర్వాత, పవార్ రాజ్యం లేని రాజుగా ఒంటరివాడయ్యారు. మహారాష్ట్రలో తన పార్టీ ఘోర ప్రదర్శనకు ఆయన ఒక బలిపశువును వెతుకుతున్నారు. కాంగ్రెస్ దానికి సరిగ్గా సరిపోతుంది. అన్న కొడుకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో అవమానకరమైన విలీనం కోసం శరద్ పవార్ చూస్తుండటమే కాకుండా, కాంగ్రెస్‌పై నిందలు వేయడానికి మమత, కేజ్రీవాల్లతో కలిసి పన్నాగం పన్నుతున్నారు. ఎదురుదాడి లేదా గట్టి వ్యూహాన్ని ప్రారంభించడానికి అహ్మద్ పటేల్ వంటి సమర్థవంతమైన మేనేజర్‌ను కాంగ్రెస్ కోల్పోయింది. ముగ్గురు గాంధీలు, ఖర్గే శక్తిమంతంగా కని పించవచ్చు. కానీ మమత, కేజ్రీవాల్, లాలూ, పవార్ వంటి స్వతంత్ర ఆలోచనాపరులను చేరుకోలేని బలహీనులుగా వారు మిగిలిపోతున్నారు. కూటమి పుట్టుక ఆర్భాటంగా జరిగింది. కానీ దాని మరణం చడీచప్పుడు లేకుండా సంభ విస్తోంది. జనతా పార్టీ నుంచి యూపీఏ దాకా ఏనాడూ కూటముల ముగింపు గురించి బహిరంగ ప్రకటన రాలేదు.- రషీద్ కిద్వాయి సీనియర్ జర్నలిస్ట్, రచయిత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ముచ్చటగా మూడోసారి.. తేల్చేసిన కేజ్రీవాల్
ఢిల్లీ : ప్రతిపక్ష ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ (ఆప్) కన్వినర్ అర్వింద్ కేజ్రీవాల్ షాకిచ్చారు. వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోనుందని, ప్రస్తుతం సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతూ వస్తుంది.ఈ నేపథ్యంలో బుధవారం పొత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ఖండించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం లేదని, ఒంటరిగా తమ బలాన్ని నిరూపించుకుంటామని ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో పొత్తు గురించి జరుగుతున్న ప్రచారంపై ఢిల్లీ మాజీ సీఎం స్పందించారు. తాము ఇండియా కూటమిలో భాగమే అయినప్పటికీ మూడోసారి సైతం పొత్తు లేకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు.Aam aadmi party will be fighting this election on its own strength in Delhi. There is no possibility of any alliance with congress. https://t.co/NgDUgQ8RDo— Arvind Kejriwal (@ArvindKejriwal) December 11, 2024 లోక్‌సభ ఫలితాల ఎఫెక్ట్అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు ఆప్ దూరంగా ఉండటానికి కారణం ఈ ఏడాది జరిగిన ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలేనని తెలుస్తోంది.సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్- ఆప్ కలిసి పోటీ చేశాయి. ఏడు లోక్‌సభ స్థానాలకు గాను ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. అన్నీ స్థానాల్ని బీజేపీ కైవసం చేసుకుంది. కాబట్టే, అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు విషయంలో రెండు పార్టీలు పునరాలోచనలో పడ్డాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇండియా కూటమిలో చీలికలు మరోవైపు 26 ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని భావిస్తుంది. అయితే కేజ్రీవాల్ వైఖరితో ఇండియా కూటమిలో చీలిక దిశగా పయనిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆప్‌తో పొత్తు ‘పొరపాటే’ ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ సైతం ఆప్‌తో పొత్తు పెట్టుకుంటే పొరపాటే అవుతుందన్నారు. 70 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని నొక్కి చెప్పారు.‘లోక్‌సభ ఫలితాల తర్వాత ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వెల్లడించారు. త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిదో ఈ నిర్ణయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఏర్పడింది. అధికారం కోసం ఆప్, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. 2015 ఢిల్లీ 70 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆప్ 67 స్థానాలు, బీజేపీ మూడు స్థానాల్ని సొంతం చేసుకుంది. 2020లో ఆప్ 62 స్థానాల్ని కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ కాస్త పుంజుకుని ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. -
‘మహా’ ఎన్నికల్లో ట్యాంపరింగ్.. సుప్రీం కోర్టుకు ఇండియా కూటమి నేతలు
ముంబై : మహరాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగంపై సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఇండియా కూటమి పార్టీ ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అత్యున్నత న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశంపై చర్చలు జరిపేందుకు శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌లు మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇరువురి నేతల భేటీలో మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన తీరు, త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మహా ఎన్నికల తరహాలో ఫలితాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ దిశగా కార్యకర్తలకు, నేతలకు భవిష్యత్ కార్యచరణపై దిశానిర్ధేశం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో ఇండియా కూటమి తరుఫున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలపై శరద్ పవార్ సుప్రీం కోర్టు ఆశ్రయించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహా ఎన్నికల్లో ఘోర పరాజయంఈ నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన, బీజేపీ, ఎన్సీపీలతో కూడిన మహాయుతి 288 అసెంబ్లీ స్థానాల్లో 230 స్థానాల్లో విజయం సాధించగా, ప్రతిపక్ష మహావికాస్ అఘాడి కేవలం 46 సీట్లు మాత్రమే గెలుచుకుంది. Maharashtra: At the anti-EVM event at Markadwadi village in Solapur district, NCP-SCP chief Sharad Pawar says, "Elections happen...some win some lose...but in recently concluded election in Maharashtra, people have doubt over the election process and voters are not feeling… pic.twitter.com/QkmKK5XNQU— ANI (@ANI) December 8, 2024అయితే, ఈ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ విజయం సాధిస్తుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇదే కూటమిలో తమ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్సీపీ నేతలు అంచనా వేశారు. కానీ నేతల అంచనాలు తారుమారయ్యాయి. ఊహించని విధంగా ఎన్సీపీ కేవలం 10 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఫలితాలపై దేశంలో ఇంతకు ముందెన్నడూ చూడనివిధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో దుర్వినియోగం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈవీఎం ఓటింగ్‌పై సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నారు. -
టార్గెట్ కాంగ్రెస్.. మమత రాజకీయం ఫలించేనా?
ముంబై: ప్రతిపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. కూటమి పార్టీలకు పరస్పరం పొసగడం లేదు. ఈ నేపథ్యంలో కూటమి భవిష్యత్తు గురించి కొత్త చర్చ మొదలైంది. కూటమిలో అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ తీరు పట్ల మిత్రపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, కూటమి నాయకత్వం మార్చాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో బెంగాల్ సీఎం మమతపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు.ఎంపీ సుప్రియా సూలే తాజాగా మాట్లాడుతూ.. ఇండియా కూటమి బాధ్యతలు మమతా బెనర్జీ తీసుకుంటే మంచిదే. మమతా బెనర్జీ ఇండియా కూటమిలోనే ఉన్నారు. శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి పెద్ద పాత్ర ఉంది. అలాగే, బాధ్యత కూడా ఉంది. కాబట్టి మమత.. మరింత బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారు. ఇది మంచి పరిణామం అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బెంగాల్లో బీజేపీకి అధికారం ఇవ్వకుండా మమతా బెనర్జీ పాలన కొనసాగిస్తున్నారు. మంచి సంక్షేమ పథకాలను అమలు చేసిన విజయవంతమైన మోడల్‌ను చూపించారు. ఆమె ఎన్నికల అనుభవం, పోరాట పటిమతో మోదీ సైతం తేలిపోయారు. ఇండియా కూటమి బాధ్యతలు ఆమె తీసుకోవడం మంచి పరిణామమే అవుతుంది. మా సీనియర్ నాయకులు కలిసి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ వరుస పరాజయాలను చవిచూడటం, ఒంటరిగా పోటీ చేయడంపై పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మమత మాట్లాడుతూ..‘ఇండియా కూటమి తీరు సరిగా లేదు. కూటమి సారథ్య బాధ్యతలకు సిద్ధం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, కూటమి అధినేతగా కొనసాగడం కష్టమేమీ కాదు. ఆ సామర్థ్యం నాకుంది. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి కూటమి ఏర్పాటు చేశా. ప్రస్తుత సారథులు దాన్ని సమర్థంగా నడిపించగలరో లేదో వాళ్లే చెప్పాలి. లేదంటే ప్రత్యామ్నాయం చూడాలి. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలన్నదే నా సూచన అని చెప్పారు. అయితే, ఇండియా కూటమిలో మమతా బెనర్జీకి ఇప్పటికే పలు పార్టీల నేతలు మద్దతుగా నిలిచారు. దీంతో, మమతకే బాధ్యతలు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు.. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు నిలిచి మమత విజయాలు సాధించడం కూడా ఆమె నాయకత్వానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను టార్గెట్ చేసి.. ఇండియా కూటమిలో మమత రాజకీయం ఎలా ఉండనుంది అనేది ఆసక్తికరంగా మారింది. కూటమిలో మెజార్టీ నేతలు ఆమె నాయకత్వాన్ని అంగీకరిస్తారా అనే చర్చ నడుస్తోంది. -
ఇండియా కూటమి చీఫ్‌గా మమతా బెనర్జీ..?
జాతీయ స్థాయిలో విపక్ష ఇండియా కూటమికి నేతృత్వం వహించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. బెంగాలీ న్యూస్ ఛానల్ న్యూస్ 18 బంగ్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు. అవకాశం వస్తే తాను ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తానని తెలిపారు. అయితే బెంగాల్ సీఎం పదవిని మాత్రం వదులుకోనని ఆమె స్పష్టం చేశారు.రెండు పాత్రలకు న్యాయం చేస్తాబెంగాల్ సీఎంగా, విపక్ష కూటమి నాయకురాలిగా రెండు పాత్రలకు న్యాయం చేయగలనని మమతా బెనర్జీ దీమా వ్యక్తం చేశారు. ‘ఇండియా కూటమిని నేనే స్థాపించా. దాన్ని నడిపించాల్సిన బాధ్యత నాయకత్వ స్థానంలో ఉన్నవారిపై ఉంటుంది. వారలా చేయలేకపోతే నేనేం చేయగలను? ప్రతీ ఒక్కరిని కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది’ అని మమత అన్నారు. ‘దీదీ’ ప్రకటన దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.అందుకే కూటమికి దూరమయ్యారా?ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలవకుండా మమత ఒంటరిగా పోటీ చేశారు. మొదటి నుంచి విపక్ష కూటమిలో కీలకపాత్ర పోషించిన ఆమె చివరి నిమిషంలో పక్కకు తప్పుకోవడంపై అప్పట్లో హాట్‌టాపిక్ అయింది. ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలు తనకు అప్పగించడానికి కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఒప్పుకోకపోవడం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఒంటరిగా బరిలోకి దిగారన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే సీట్ల పంపకంలో తేడాలు రావడం వల్లే తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు తృణమూల్ కాంగ్రెస్ అప్పట్లో వివరణ ఇచ్చింది. మమతా బెనర్జీని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినప్పటికీ తాను అడిగినన్ని సీట్లు ఇవ్వలేదనే సాకుతో మమత సింగిల్‌గానే పోటీ చేశారు. ఇండియా కూటమి గెలిస్తే కచ్చితంగా మద్దతు ఇస్తానని ప్రకటించి తనదారి తాను చూసుకున్నారు. కాగా, బెంగాల్లో 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.మమతకు పగ్గాలు అప్పగిస్తారా?ఇండియా కూటమి నడిపించేందుకు సిద్ధమని మమతా బెనర్జీ తాజాగా తనకు తానుగా ప్రకటన చేయడం ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రస్తుతం ఇండియా కూటమి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 101 స్థానాలను దక్కించుకున్న హస్తం పార్టీ ఇండియా కూటమిలో అతి పెద్ద భాగస్వామిగా ఉంది. 37 ఎంపీలను కలిగిన సమాజ్‌వాదీ పార్టీ రెండో పెద్ద భాగస్వామిగా కొనసాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22, శివసేన (యూబీటీ) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. హరియాణాలో అనూహ్యంగా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది.చదవండి: మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్.. యూబీటీ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయంమమతకు సమాజ్‌వాదీ పార్టీ మద్దతుఈ నేపథ్యంలో ఇండియా కూటమిని బలోపేతం చేసే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు మమతా బెనర్జీకి సమాజ్‌వాదీ పార్టీ సూచనప్రాయంగా మద్దతు ప్రకటించింది. ‘ఇండియా కూటమి నాయకురాలిగా మమతా బెనర్జీ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆమెకు మద్దతు ఇవ్వాలి. కూటమి బలోపేతం కావడానికి ఇది దోహదపడుతుంది. బెంగాల్లో బీజేపీని నిలువరించడంలో మమత కీలకపాత్ర పోషించారు. ఆమె పట్ల మాకు సానుభూతి ఉంది. చాలా కాలం నుంచి ఆమెతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయ’ని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉదయ్ వీర్ సింగ్ మీడియాతో అన్నారు. కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.మమత వారసుడు అతడేనా?ఇదిలావుంటే తన రాజకీయ వారసుడి ఎంపికపై మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. పార్టీ నాయకత్వం అంతా కలిసి తన రాజకీయ వారసుడిని ఎంపిక చేస్తుందని ఆమె చెప్పారు. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మమత తర్వాత పార్టీ పగ్గాలు ఆయనకే అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఆయననే ఎక్కువగా టార్గెట్ చేయడంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్టయింది. -
జార్ఖండ్ సీఎంగా హేమంత్
రాంచీ: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు చెందిన గిరిజన నేత హేమంత్ సోరెన్(49) ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రాంచీలోని మొరాబాది మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. తెల్లని కుర్తా పైజామా, నెహ్రూ జాకెట్ ధరించిన హేమంత్ ముందుగా జేఎంఎం చీఫ్, తన తండ్రి శిబూ సోరెన్‌ను కలుసుకున్నారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్ర నేతలు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా రాంచీలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ దంపతులు ఉన్నారు. పంజాబ్ సీఎం మాన్, సీపీఐఎంఎల్ లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కూడా హాజరయ్యారు. కాగా, సీఎంగా హేమంత్ ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి.ఇది చారిత్రక దినంప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని హేమంత్ సోరెన్ ‘ఎక్స్’లో..‘ఇది చారిత్రక దినం..రాష్ట్ర ప్రజలు ఐకమత్యమే ఆయుధంగా చేసుకుని ఎన్నికల్లో తిరుగులేని తీర్పిచ్చారు. మా గొంతు నొక్కేందుకు వాళ్లు ప్రయత్నించిన ప్రతిసారీ ఉద్యమం మరింతగా తీవ్రతరమైంది. జార్ఖండ్ వాసులు ఎవరికీ తలొంచరు. తుది శ్వాస వరకు మా పోరాటం కొనసాగుతుంది’అని బీజేపీను ద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 81 సీట్లకు గాను జేఎంఎం సారథ్యంలోని కూటమి అత్యధికంగా 56 సీట్లను సొంతం చేసుకుంది. 43 స్థానాల్లో పోటీకి దిగిన జేఎంఎం మొదటిసారిగా ఏకంగా 34 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. #WATCH | JMM executive president Hemant Soren takes oath as the 14th Chief Minister of Jharkhand, in Ranchi.(Video: ANI/Jhargov TV) pic.twitter.com/30GxxK9CXe— ANI (@ANI) November 28, 2024 -
‘నటుడు విజయ్.. రాజకీయ ప్రవేశం ఇండియా కూటమికే లాభం’
చెన్నై: తమిళగ వెట్రి కజగం(టీవీకే)చీఫ్, నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావటంకాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రయోజనకరమని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ)అధ్యక్షుడు కె సెల్వపెరుంతగై అన్నారు. ఇండియా కూటమి మిత్రపక్షాలకు నటుడు విజయ్ అధికార భాగస్వామ్యం ఆఫర్ ఇవ్వటంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘విజయ్ రాజకీయ ప్రవేశం రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయ రంగంలో ఎటువంటి మార్పులు తీసుకురాదు. ఆయన రాజకీయ ప్రవేశం ఇండియా కూటమి విజయానికి ఉపయోగపడుతుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లను, ముఖ్యంగా ప్రతిపక్ష ఓట్లను విజయ్ పార్టీ చీల్చుతుంది. విజయ్ అధికార భాగస్వామ్యం ఆఫర్ ఇండియా కూటమి మిత్రపక్షలు ఎటువంటి అలజడికి గురికాలేదు. ఇండియా కూటమి బలంగానే ఉంది. కాంగ్రెస్ 2004-2014 మధ్య కేంద్రంలో అధికారాన్ని పంచుకుంది. దాని ఆధారంగా.. మేం అధికారం పంచుకునే ఆలోచనతో అంగీకరిస్తున్నాం. అయితే అధికారాన్ని పంచుకోవడంపై జాతీయ నాయకత్వందే తుది నిర్ణయం. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి సాధారణ మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ మద్దతుతో మాత్రమే ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో.. ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చింది. అధికారంలో వాటా కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి ఉంటే అప్పటి సీఎం కరుణానిధి ఇచ్చి ఉండేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలో వాటా కోరలేదు. అధికార భాగస్వామ్యం ప్రజల ఆదేశంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ అధికారం చేజిక్కించుకోవాలని కోరుకుంటుంది. మేం తమిళనాడులో కామరాజ్ పాలనను ప్రారంభిస్తాం’ అని అన్నారు. -
ధన్‌ఖర్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి తీర్మానం?
న్యూఢిల్లీ : భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ తీరును విమర్శిస్తూ విపక్ష పార్టీల 'ఇండియా' కూటమిలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఛైర్మన్ పదవి నుంచి ధన్‌ఖర్‌ను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బి) ప్రకారం.. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాజ్యసభ) తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ పదవి నుండి తొలగించవచ్చు అని ఇండియా కూటమి పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్టికల్ 67(బీ) అనుగుణంగా ధన్ఖర్పై చర్య తీసుకోవాలనే ప్రతిపాదనపై 87 మంది సభ్యులు సంతకం చేసినట్లు ప్రతిపక్ష పార్టీ నేతలు చెబుతున్నాయి. రెండ్రోజుల క్రితమే విపక్షాలు ధనఖర్‌ను తొలగించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాయని రాజ్యసభలో అధికార పక్ష నేత జేపీ నడ్డాకు సమాచారం అందిందని జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి.ప్రతిపక్ష నాయకులు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేయడం, అమర్యాదగా మాట్లాడడం వంటి అంశాలను ఎత్తి చూపుతూ ధన్‌ఖర్‌కు వ్యతిరేకంగా తీర్మానించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విపక్ష పార్టీ నేతలు మాత్రం సభను నిబంధనల ప్రకారం నడపాలని కోరుకుంటున్నాయని, సభ్యులపై వ్యక్తిగత వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆ వర్గాలు తెలిపాయి.రాజ్యసభ ఛైర్మన్ ధన్ఖర్ సభను ఏకపక్షంగా నడుపుతున్నారని, ప్రతిపక్షంపై పక్షపాత వైఖరని ప్రదర్శిస్తున్నారంటూ కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు శుక్రవారం సభలో ఆందోళన చేపట్టాయి. ఆమోదయోగ్యం కాని విధంగా సభలోని సభ్యుల్ని అగౌరపరుస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ.. ఎగువ సభలో ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ధన్ఖర్ ఇవ్వడం లేదని పేర్కొన్నాయి. ఈ తరుణంలో రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యారు. -
రాజ్యసభలో వినేశ్ ఫొగట్ అంశం .. విపక్షాలపై ధన్‌ఖడ్ ఆగ్రహం
న్యూఢిల్లీ: రాజ్యసభ్య నుంచి ఇండియా కూటమి సభ్యులు వాకౌట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయడంపై చర్చకు అనుమతించకపోవడంతో ఇండియా కూటమి సభ్యులు రాజ్యసభ్య నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం ఖాయమైన తర్వాత బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 50 కేజీల కేటగిరీ ఫైనల్లో తలపడాల్సిన మన రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. పోరుకు కొన్ని గంటల ముందు నిర్వహించే వెయింగ్‌లో ఆమె బరువు 50 కేజీల 100 గ్రాములుగా వచ్చింది. ఉండాల్సిన బరువు కన్నా 100 గ్రాములు ఎక్కువుంది. దాంతో నిబంధనల ప్రకారం ఆమెను డిస్క్వాలిఫై చేస్తు న్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో గురువారం రాజ్యసభలో వినేశ్ ఫొగాట్ డిస్క్వాలిఫై అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పట్టుబట్టారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఒక్కరికే (ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ) హృదయం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. దేశం మొత్తం ఆమె పరిస్థితి చూసి బాధపడుతోంది. మీరిలా ప్రతీ (ఒలింపిక్స్‌లో డిస్క్వాలిఫై) అంశాన్ని రాజకీయం చేస్తే ఆమెను అవమానించినట్లు కాదా అని వ్యాఖ్యానించారు. ప్రతి స్పందనగా విపక్షనేతలు నినాదాలు చేయడంతో.. ఆగ్రహించిన ధన్కర్ కుర్చీలోంచి లేచి వెళ్లిపోయారు. అనంతరం, సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ఇండియా కూటమి నేతలు ప్రకటించారు. #WATCH | Congress MP Deepender Hooda says, "Vinesh has not lost but she has won the hearts of crores of people. The sports system has lost. The government should give her all the facilities that are given to a gold medallist... Today a Rajya Sabha seat is vacant (in Haryana), we… pic.twitter.com/456mQEYea5— ANI (@ANI) August 8, 2024వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ అనర్హతకు సంబంధించిన అంశంపై చర్చించాలని మేము కోరాం. కానీ ప్రభుత్వం సిద్ధంగా లేదు అని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో డిస్క్వాలిఫై కావడంతో వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె రిటైర్మెంట్పై స్పందించిన తివారీ.. ఆశ కోల్పోవద్దని, దేశం మొత్తం ఆమెకు అండగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. -
INDIA bloc: విపక్షాల గొంతు నొక్కుతోంది
న్యూఢిల్లీ: బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విపక్షాల గొంతు నొక్కేస్తోందని ‘ఇండియా’ కూటమి నేతలు హస్తిన వేదికగా ధ్వజమెత్తారు. ఆప్ కనీ్వనర్ కేజ్రీవాల్‌ను అన్యాయంగా జైళ్లో పడేసి ఆరోగ్యపరిస్థితిని దారుణంగా దిగజార్చారని మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను విడుదలచేయాలంటూ కూటమి నేతలు మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. భారత్ మాతాకీ జై, నియంతృత్వం నశించాలి నినాదాలతో ధర్నాస్థలి హోరెత్తింది. ఆప్ పిలుపుమేరకు చేపట్టిన ఈ ధర్నాకు ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేత దీపాంకర్ భట్టాచార్య, లోక్‌సభలో కాంగ్రెస్ డెప్యూటీ లీడర్ గౌరవగొగోయ్, శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, కాంగ్రెస్, ఆప్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, భారీ సంఖ్యలో ఆప్ కార్యకర్తలు హాజరయ్యారు. -
ఉప ఎన్నికల్లో ఎన్డీయేకు షాక్.. ఇండియా కూటమి జోరు
ఢిల్లీ, న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా 10 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించగా.. కేవలం రెండు స్థానాల్లోనే ఎన్డీయే కూటమి విజయాన్ని అందుకుంది. మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. కాగా, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే ఇండియా కూటమి అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగారు. ఇక, బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. నాలుగు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగగా అన్ని స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు. బెంగాల్‌లోని రాయిగంజ్ (కృష్ణ కల్యాణి), రణఘాట్ సౌత్ (ముకుత్ మణి అధికారి), బాగ్ద (మధుపర్ణ ఠాకూర్), మాణిక్తలా(సప్తి పాండే) విజయం సాధించారు. ఇక్కడ బీజేపీకి గట్టి షాక్ తగింది. మరోవైపు.. హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్ర, నలగార నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. హమీర్పూర్ స్థానంలో బీజేపీ గెలుపొందింది. ఇక, మధ్యప్రదేశ్‌లోని అమర్వర అసెంబ్లీలో బీజేపీ అభ్యర్ధి కమలేష్ ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం అందుకున్నారు. తమిళనాడులోని విక్రవండి అసెంబ్లీ స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ ఘన విజయం సాధించారు. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ (లాక్ పత్ సింగ్), మంగళూర్(క్వాజి మొహమ్మద్ నిజాముద్దిన్) కాంగ్రెస్ విజయభేరి మోగించింది. కాగా, బీహార్‌లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ గెలుపొందడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా.. ఉప ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి బూస్ట్ ఇవ్వగా, ఎన్డీయే కూటమికి షాకిచ్చాయి.సీఎం సతీమణి విజయం..హిమాచల్ ప్రదేశ్‌లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి, కాంగ్రెస్ అభ్యర్థి కమలేశ్ ఠాకుర్ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థిపై 9వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బవా 8,990 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక, హమీర్పుర్ స్థానంలో భాజపా అభ్యర్థి ఆశీష్ శర్మ గెలుపొందారు.బెంగాల్లో తృణమూల్ క్లీన్‌స్వీప్..పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొంది జోరుమీదున్న తృణమూల్ కాంగ్రెస్.. తాజా ఉప ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. ఇక్కడ రాయ్‌గంజ్, రాణాఘాట్, బాగ్దా, మాణిక్తలా.. నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఉత్తరాఖండ్‌లో మంగలౌర్, బద్రీనాథ్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది.పంజాబ్ బైపోల్ ఆప్‌దే..పంజాబ్‌లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థి షీతల్‌పై 37వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తమిళనాడులోని విక్రావండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని అమర్వాడాలో భాజపా నేత కమలేశ్ షా గెలుపొందారు. బిహార్‌లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్ సింగ్ జయకేతనం ఎగురవేశారు. Assembly by-elections: Out of 13 Assembly seats, Congress won four seats. TMC won 4 seats. AAP won the Jalandhar West seat in Punjab. BJP won 2 seats, DMK won 1 seat. Independent candidate Shankar Singh won on Rupauli seat of Bihar. pic.twitter.com/lJWtsVWI46— ANI (@ANI) July 13, 2024 -
7 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు ముగిసిన పోలింగ్
Updates..👉ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 👉పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో ఉన్న ఓటర్లు మాత్రమే ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. 👉ఇక, సాయంత్రం ఐదు గంటల వరకు బెంగాల్ ఉప ఎన్నికల్లో 62.71 శాతం పోలింగ్ నమోదైంది. 👉ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు బుధవారం ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.👉బీహార్‌లోని రూపాలి, రాయ్‌గంజ్, రణఘాట్ దక్షిణ్, బాగ్ మానిక్తలా (పశ్చిమబెంగాల్లో), విక్రవాండి (తమిళనాడు), అమర్‌వార (మధ్యప్రదేశ్), బద్రీనాథ్, మంగ్లార్ (ఉత్తరాఖండ్‌లో), జలంధర్ వెస్ట్ (పంజాబ్)..డెహ్రా, హమీర్పూర్, నలాఘర్ (హిమాచల్ ప్రదేశ్)లో పోలింగ్ కొనసాగుతుంది.👉ఎమ్మెల్యేల మరణం, వివిధ పార్టీలకు రాజీనామాలు చేయడంతో ఖాళీ అయిన నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. జూలై 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. #WATCH | Uttar Dinajpur, West Bengal: BJP candidate from Raiganj assembly bypolls, Manas Kumar Ghosh casts his vote at a polling booth, in Raiganj.By-election is being held on 4 assembly seats of West Bengal including the Raiganj assembly seat. pic.twitter.com/uZEBJifcAK— ANI (@ANI) July 10, 2024 -
లోక్‌సభలో ‘నీట్’ రగడ.. మోదీ ప్రసంగంపై విపక్షాల ఆందోళన
సాక్షి,న్యూఢిల్లీ : రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా గందర గోళం నెలకొంది. మణిపూర్ అల్లరు,నీట్ లీకేజీపై స్పందించాలని డిమాండ్ చేస్తూ మోదీ ప్రసంగానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తున్నారు. అయినప్పటికీ మోదీ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 👉రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్ లక్ష్యాలను వివరించారు.👉దేశానికి మార్గదర్శకం చేసిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు.👉ఎన్ని కుట్రలు, ఆరోపణలు చేసినా విపక్షాలు ఓడిపోయాయి.👉ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో నిర్వహించిన ఎన్నికల్లో ప్రజలు తమకు మూడోసారి అధికారం కట్టబెట్టారు.👉మా పదేళ్ల ట్రాక్ రికార్డ్ చూసి ప్రజలు మమ్మల్ని గెలిపించారు.👉మాకు నేషన్ ఫస్ట్. మేం ఏ పనిచేసినా ఇదే అంశంపై కట్టుబడి ఉంటాం.👉కొంత మంది బాధని నేను అర్ధం చేసుకోగలను అసత్య ప్రచారం చేసినా ఓడిపోయారు.👉పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారు.👉పదేళ్లలో భారత్ ఖ్యాతిని మరింత పెంచాం.👉ఈ దేశంలో ఏదీ మారదని 2014ముందు ప్రజలు అనుకునే వారు.👉కాంగ్రెస్ హయాంలో ఎక్కడా చూసినా అంతా అవినీతి మయమే.. పత్రికల్లో ఎక్కడ చూసినా ఆ వార్తలే.👉స్కామ్‌లకు చెల్లింది.👉కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ నుంచి ఒక రూపాయి విడుదలైతే 15పైసలు మాత్రమే సామాన్యులకు అందేవి.👉2014కు ముందు ఉగ్రవాదులు భారత్‌లో ఎక్కడ పడితే అక్కడే దాడులు జరిగేవి. ప్రభుత్వాలు నోరుమెదిపేవి కావు.👉కానీ 2014 తర్వాత ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేశాం.👉దేశ భద్రతకోసం మేం ఎక్కడికైనా, ఎంత దూరమైనా వెళ్తాం. ఏ నిర్ణయమైనా తీసుకుంటాం.👉కాంగ్రెస్ హయాంలో బొగ్గు స్కాం జరిగితే.. మా హయాంలో రికార్డ్ స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది.👉కాంగ్రెస్ హయాంలో బ్యాంకుల్లో స్కాంలు జరిగితే 2014 తర్వాత డిజిటల్ బ్యాంకింగ్ అందుబాటులోకి తెచ్చాం.👉ఆర్టికల్ 370తో అక్కడి ప్రజలు హక్కుల్ని లాక్కున్నారు. జమ్ము కశ్మీర్లో రాజ్యాంగాన్ని అమలు చేయనిచ్చేవారు కాదు.👉ఆర్టికల్ 370 రద్దుతో రాళ్ల దాడులు ఆగిపోయాయి.👉స్మార్ట్ ఫోన్ తయారీలో భారత్ అగ్రస్థానంలో ఉంది.👉మా పాలనలో మహిళలలను లక్షాదికారులుగా మార్చాం.👉భారత్ ఐదో ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్‌ను మూడో స్థానానికి ఎదిగేందుకే మా కృషి.👉మూడో టర్మ్‌లో ట్రిపుల్ స్పీడుతో అత్యత్తమ ఫలితాలు సాధిస్తాం.👉చిల్లర రాజకీయాలతో దేశం నడవదు. అదే సమయంలో విపక్షాల ఆందోళనపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులను వెల్‌లోకి పంపించడంతో సరైన పద్దతి కాదని మండిపడ్డారు. అయినప్పటికీ నీట్ లీకేజీ, మణిపూర్ అల్లర్లపై స్పందించాలని విపక్షాలు నినాదాలు చేస్తున్నాయి. విపక్షాల నినాదాల మధ్య కొనసాగుతున్న మోదీ ప్రసంగం -
లోక్‌సభ నుంచి విపక్షాలు వాకౌట్
ఢిల్లీ: లోక్‌సభ సమావేశాల్లో సోమవారం ‘నీట్’ మంటలు పుట్టాయి. సభలో ఒకరోజు నీట్‌పై చర్చజరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. నీట్‌పై చర్చ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వకపోవటంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.లోక్‌సభ ప్రారంభం అయ్యాక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. సభ ప్రారంభమైన తర్వాతే గందరగోళం చోటు చేసుకుంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టుపట్టాయి. ఎన్టీఏ వైఫల్యాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ స్విచ్ ఆఫ్ చేయటంపై స్పీకర్ ఓం బిర్లా వివరణ ఇచ్చారు. విపక్షాల గొంతు నొక్కుతున్నారన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. రాజ్యాంగ ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. స్పీకర్‌పై ఆరోపణలు చేయటం సరికాదన్నారు.ఒకరోజు నీట్‌పై చర్చకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్‌ను కోరారు. ‘విద్యార్థులకు పార్లమెంట్ వేదికగా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు నీట్‌పై చర్చించాలి. ఇది 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం తర్వాత అయినా ఒక రోజు నీట్‌పై చర్చ జరపాలి’ అని రాహుల్ గాంధీ తెలిపారు. రాహుల్ గాంధి చెప్పిన అంశంపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. నీట్ అంశంపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నీట్‌పై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించకపోవటంతో విపక్షాలు వాకౌట్ చేశాయి.దీనికంటే ముందు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ముందు రాష్ట్రపతి ప్రసంగంపై తీర్మాణంపై చర్చించాలన్నరు. తర్వాత అన్ని అంశాలపై చర్చకు సిద్ధమేనని తెలిపారు. లోక్ సభ రూల్స్ ప్రకారం నడుస్తోందని, రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానం అడ్డుకోవటం సరికాదన్నారు. -
18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ స్పీకర్ ఎవరనేదానిపై ఉత్కంఠకు తెరపడింది. బుధవారం ఉదయం జరిగిన ఎన్నికలో.. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. వరుసగా మంత్రులు ఆ ప్రతిపాదనను బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్ చేపట్టా.. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు.విపక్ష కూటమి ఓటింగ్‌కు పట్టుబట్టకపోవడంతో.. ఓం బిర్లా ఎన్నిక సుగమమైంది. ఓం బిర్లా ఎన్నికపై ప్రధాని మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరస్పర కరచలనం ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ ఇద్దరితో పాటు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దగ్గరుండి ఓం బిర్లాను స్పీకర్ చెయిర్లో కూర్చోబెట్టారు. #WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d— ANI (@ANI) June 26, 2024ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభను నడిపించడంలో స్పీకర్ పాత్ర ఎంతో కీలకం. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు స్పీకర్ స్ఫూర్తిగా నిలుస్తారు. గత ఐదేళ్లుగా విజయవంతంగా సభను నడిపించారు. ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. 17వ లోక్‌సభను నిర్వహించడంలో ఆయన పాత్ర అమోఘం. ఆయన నేతృత్వంలోనే కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టాం. జీ-20 సమ్మిట్ ఆయన సలహాలు, సూచనలు అవసరం. మరో ఐదేళ్లు కూడా సభను విజయవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నా. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సభలో విపక్షాల సభ్యులు చర్చించేందుకు అవకాశం ఇవ్వలి. మా గొంతు నొక్కితే సభ సజావుగా నిర్వహించినట్లు కాదు. ప్రజల గొంతుక ఎంత సమర్థవంతంగా వినిపించామన్నదే ముఖ్యం. ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ అభినందనలులోక్ సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్ఆర్సీపీ అభినందనలు తెలిపింది. లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గడిచిన లోక్‌సభను ఓం బిర్లా ఎంతో హుందాగా నడిపారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.అదే తరహాలో ఈసారి కూడా విజయవంతంగా సభను నడపాలి’’ అని ఆకాంక్షించారు. ఇక.. రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. విజయవంతంగా స్పీకర్ పదవి నిర్వహించాలని కోరారాయన. స్పీకర్‌గా ఓం బిర్లా ట్రాక్ రికార్డు.. లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి సురేష్‌పై ఓం బిర్లా విజయం సాధించారు. ఓం బిర్లా(61) రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్‌సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్ పదవి చేపట్టారు. ఇప్పుడు.. తొలి నుంచి జరుగుతున్న ప్రచారం నడుమే రెండోసారి స్పీకర్ పదవి చేపట్టబోతున్నారు. లోక్‌సభ స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. ఆయనకంటే ముందు ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్.ధిల్లాన్, బలరాం ఝాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. -
లోక్‌సభలో ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ.. 20 ఏళ్ల తర్వాత అరుదైన
ఢిల్లీ : లోక్‌సభలో ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ ఎన్నికలయ్యారు. 20ఏళ్ల తర్వాత లోక్‌సభ విపక్షనేతగా గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ కుటుంబం నుంచి వచ్చి రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, పార్లమెంట్లో ఇండియా కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం వహించనున్నారు. -
Parliament Session: లోక్‌సభ ఎంపీల ప్రమాణ స్వీకారం
పార్లమెంట్ సమావేశాలు.. అప్డేట్స్ ఏపీ నుంచి వైఎస్సార్సీపీ నాయకురాలు గుమ్మా తనుజా రాణి హిందీలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.మీ అందరి ఆశీస్సులతో.. జగనన్న దీవెనలతో ఈరోజు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.. pic.twitter.com/DqRcsYMdc5— Dr Gumma Thanuja Rani (@ArakuPalguna) June 24, 2024 పార్లమెంట్ భవనం మెట్లు దిగుతూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. అక్కడే ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, కె.సురేష్‌ను ఆప్యాయంగా పలికరించారు.#WATCH | Delhi: Congress MPs KC Venugopal and K Suresh, and Union Minister-BJP MP Giriraj Singh share a candid moment on the staircase of the new Parliament building. pic.twitter.com/po1LQqqJLg— ANI (@ANI) June 24, 2024 తెలుగులో బండి సంజయ్ ప్రమాణంతెలంగాణ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలుగులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers Bandi Sanjay Kumar and Sukanta Majumdar take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/re8wf295RF— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, చిరాగ్ పాశ్వాన్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers G Kishan Reddy and Chirag Paswan take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/aUiSfimQyU— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, గజేంద్ర షెకావత్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers Bhupender Yadav and Gajendra Singh Shekhawat take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/BAXUduVIVt— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Union Minister and BJP MP Dharmendra Pradhan takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/9rcS4OSwkj— ANI (@ANI) June 24, 2024 ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Ram Mohan Naidu Kinjarapu takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/d3E1DC8Yjw— ANI (@ANI) June 24, 2024 లోక్‌సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister and BJP MP Piyush Goyal takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/Ls4hhIIDbb— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Shivraj Singh Chouhan takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/nZpQ0GGxmz— ANI (@ANI) June 24, 2024 కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 18 లోక్‌సభ పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Nitin Gadkari takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/XMLofSCdX8— ANI (@ANI) June 24, 2024 అమిత్ షా ఎంపీగా ప్రమాణంహోంమంత్రి అమిత్ షా ఎంపీగా లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Union Home Minister Amit Shah takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3rlhhGKLbJ— ANI (@ANI) June 24, 2024 రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Defence Minister Rajnath Singh takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/GDJFlyqkth— ANI (@ANI) June 24, 2024 ఎంపీగా మోదీ ప్రమాణంమొదటగా నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్ ఎంపీ ప్రమాణం చేయించారు.#WATCH | Prime Minister Narendra Modi takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3tjFrbOCJ0— ANI (@ANI) June 24, 2024 రాహుల్ గాంధీ వయనాడ్ స్థానం రాజీనామాను ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆమోదించారు.Pro-tem Speaker Bhartruhari Mahtab accepts the resignation of Congress leader Rahul Gandhi from Wayanad Lok Sabha seat.Rahul Gandhi kept the Raebareli Lok Sabha seat. pic.twitter.com/rFoya8nCJb— ANI (@ANI) June 24, 2024 పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ప్రారంభమైన 18వ లోక్సభప్రమాణం చేయనున్న ఎంపీలులోక్సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్మొదట ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీపార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో ప్రధాని మోదీఇది చాలా పవిత్రమైన రోజుఎంపీలందరికీ స్వాగతం పలుకుతున్నాఎంపీలు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలిమాకు మూడోసారి వరుసగా సేవ చేసేందుకు అవకాశం ఇచ్చారు10 ఏళ్లలో దేశాభివృద్ధికి కృషి చేశామూడోసారి ప్రధానిగా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు దక్కిందికొత్త లక్ష్యాలు చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలివికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి#WATCH | PM Narendra Modi says, "...The 18th Lok Sabha is starting today. The world's largest election was conducted in a very grand and glorious manner... This election has also become very important because for the second time after independence, the people of the country have… pic.twitter.com/bASHVtfh3S— ANI (@ANI) June 24, 2024 ఆ ఖర్మ నాకు పట్టలేదు: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డివైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, రాజంపేట ప్రజల మద్దతుతో మూడోసారి ఎంపీ ఎన్నికయ్యాహ్యాట్రిక్ విజయాలతో పార్లమెంట్లు అడుగుపెట్టడం సంతోషంగా ఉందిమా పార్టీ అధినేత వైయస్ జగన్‌కు ధన్యవాదాలురాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్లో పని చేస్తాజాతీయ, రాష్ట్ర ప్రయోజనాల ఉండే బిల్లులకు మద్దతిస్తాంరాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే వ్యతిరేకిస్తాం బీజేపీలో చేరాల్సిన కర్మ నాకు పట్టలేదుకూటమినేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారుగతంలో నేను విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే బీజేపీలో చేరుతారని ప్రచారం చేశారువైయస్ జగన్మోహన్ రెడ్డి నన్ను సొంత తమ్ముడిలా భావిస్తారువైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధించే వరకు కష్టపడతారాజంపేటలో అత్యధిక రోడ్లు వేయించిన ఘనత మాదేసాక్షి టీవీతో ఎంపీ మిథున్ రెడ్డి మరికాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంఎంపీలుగా ప్రమాణం చేయనున్న సభ్యులుప్రధాని మోదీ సహా 280 మంది ప్రమాణంమోదీ తర్వాత కేంద్ర మంత్రులుఆ తర్వాత ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఒక్కొక్కరుగా సభ్యుల ప్రమాణంనేడు ఏపీ, రేపు తెలంగాణ ఎంపీల ప్రమాణంప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణంలోక్సభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన భర్తృహరి మెహతాబ్భర్తృహరితో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము#WATCH | Delhi: BJP MP Bhartruhari Mahtab takes oath as pro-tem Speaker of the 18th Lok SabhaPresident Droupadi Murmu administers the oath pic.twitter.com/VGoL5PGEkT— ANI (@ANI) June 24, 2024ఎన్డీయే అలా ముందుకు..పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించాలని భావిస్తున్న ఎన్డీయేసభా కార్యకలాపాలకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరే అవకాశంస్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరనున్న బీజేపీ అగ్రనేతఅమిత్ షా లేదంటే రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యే ఛాన్స్ ఐక్యంగా ఇండియా కూటమిపార్లమెంట్ సమావేశాల తొలిరోజే ఐక్యత చాటాలని ఇండియా కూటమి నిర్ణయంగతంలో గాంధీ విగ్రహం ఉన్న గేట్-2 వద్ద భేటీఐక్యంగా పార్లమెంట్‌లోకి ఎంట్రీప్రొటెం స్పీకర్ ఎంపిక నిర్ణయంపై నిరసన తెలిపే అవకాశంనీట్పైనా కేంద్ర ప్రభుత్వాన్నినిలదీసే ఛాన్స్సంబంధిత వార్త: ప్రొటెం స్పీకర్‌కు ఇండియా కూటమి సహాయ నిరాకరణ?! కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణం18వ లోక్‌సభ తొలి సమావేశంనేడు, రేపు ఎంపీలుగా సభ్యుల ప్రమాణ స్వీకారంసభ్యులతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్ఎల్లుండి స్పీకర్ ఎన్నికడిప్యూటీ స్పీకర్ పోస్టు ఉంటుందా? ఉండదా?.. ఉంటే ఎవరికి వెళ్తుంది? అనే దానిపై చర్చ27న ఉభయ సభల సభ్యుల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం -
ప్రొటెం స్పీకర్‌కు ఇండియా కూటమి సహాయ నిరాకరణ?!
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. పద్దెనిమిదవ లోక్‌సభ ఇవాళ తొలిసారి భేటీ కానుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయడం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం.. నేపథ్యాలతో నాలుగు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే.. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి సహాయ నిరాకరణ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్లమెంట్లో ఇవాళ, రేపు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రొటెం స్పీకర్ ప్యానెల్లో ఇండియా కూటమి ఎంపీలు కూడా సభ్యులుగా ఉన్నారు. ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సీనియర్ ఎంపీలు కే సురేష్(కాంగ్రెస్), టీఆర్ బాలు(డీఎంకే), బీజేపీ ఎంపీలు రాధా మోహన్ సింగ్.. ఫగ్గాన్ సింగ్ కులాస్తే, సుదీప్ బంధోపాధ్యాయ(టీఎంసీ)లను ప్రొటెం స్పీకర్ సహాయ ప్యానెల్లో సభ్యులుగా నియమించారు.అయితే ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ నియామకాన్ని ఇండియా కూటమి తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. సభలో సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే భర్తృహరిని ఎంపిక చేశారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రొటెం స్పీకర్ ప్యానెల్‌లోని బీజేపీ ఎంపీలిద్దరు తప్ప మిగతా ముగ్గురు.. భర్తృహరికి సహకరించొద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక.. పార్లమెంట్‌సమావేశాలు ఈ ఉదయం 11గం. ప్రారంభం కానున్నాయి. అరగంట ముందుగానే పార్లమెంట్ కాంప్లెక్స్ గేట్ నంబర్ 2 వద్ద ఇండియా కూటమి ఎంపీలు చేరుకుంటారు. తమ ఐక్యతను ప్రదర్శిస్తూ ఒకేసారి పార్లమెంట్‌లోకి ప్రవేశించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ గేట్ వద్దే ఎంపీలు నిరసన తెలిపే గాంధీ విగ్రహం ఉండేది. ఆ తర్వాత గాంధీ విగ్రహంతో పాటు మిగతా వాటిని ‘ప్రేరణ స్థల్’ కి ఏర్పాటు చేశారు. లోక్‌సభ సమావేశాల్లో.. తొలుత భర్తృహరి మెహతాబ్‌తో ప్రోటెం స్పీకర్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత ఎంపీలంతా పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు. 18వ లోక్‌సభ ప్రారంభానికి ముందు.. కాసేపు ఎంపీలంతా మౌనం పాటించి కుర్చీల్లో కూర్చుంటారు.ముందుగా ఆనవాయితీ ప్రకారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు సహా మొత్తం 280 మంది ఎంపీలు ఇవాళ ప్రమాణం చేస్తారు. రేపు మిగతా ఎంపీలు ప్రమాణం చేస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. ఇవాళ ఏపీ, రేపు తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఇక.. స్పీకర్ ఎన్నిక 26వ తేదీన ఉండనుంది. ఇక 27వ తేదీన రాష్ట్రపతి ముర్ము లోక్‌సభ-రాజ్యసభ సభల సభ్యుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఇదిలా ఉంటే.. ఏకాభిప్రాయంతో స్పీకర్ ఎన్నికకు ప్రయత్నాలు సాగిస్తోంది ఎన్డీయే కూటమి. ఈ క్రమంలోనే ఓం బిర్లా కే మళ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని విపక్ష కూటమి కోరే అవకాశాలున్నాయి. సంప్రదాయంగా ప్రతిపక్షానికి, లేదంటే మిత్రపక్షాలకు డిప్యూటి స్పీకర్ పదవి కట్టబెట్టే అవకాశం లేకపోలేదు.డిప్యూటీ స్పీకర్ విషయంలో.. 2014లో అన్నా డీఎంకేకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చింది ఎన్డీయే కూటమి16 వ లోకసభ లో (2014లో) ఏఐఏడిఎంకే కి చెందిన తంబిదొరై డిప్యూటీ స్పీకర్‌గా నియమితులయ్యారుఅయితే 17 వ లోకసభ లో (2019 లో ) మాత్రం ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది -
ఆరుగురు ఇండియా కూటమి యూపీ ఎంపీలు సభ్యత్వం కోల్పోనున్నారా?
లక్నో: ఇటీవల కొత్తగా ఎంపికైన ఇండియా కూటమిలోని ఆరుగురు ఎంపీలు తమ పదవుల్ని కోల్పోనున్నారా? క్రిమినల్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఆరుగురు ఎంపీలకు రెండేళ్లకు పైగా జైలు శిక్ష పడనుందా? అదే జరిగితే వారు పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందా? అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. సాధారణ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన ఆరుగురు ఇండియా కూటమి ఎంపీలకు పదవీ గండం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆరుగురు క్రిమినల్ కేసులు ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. అదే జరిగితే ఈ ఎంపీలు పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని సమాచారం. ఇక ఆ ఆరుగురిలో ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన అఫ్జల్ అన్సారీ ఇప్పటికే గ్యాంగ్‌స్టర్ చట్టం కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించారు. అతని నేరారోపణపై అలహాబాద్ హైకోర్టు గత నెలలో స్టే విధించింది. దీంతో ఆయన సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే అప్జల్ అన్సారీ కేసును జులైలో కోర్టు విచారించనుంది. కోర్టు శిక్షను సమర్థిస్తే అన్సారీ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు.అజంగఢ్ సీటును గెలుచుకున్న ధర్మేంద్ర యాదవ్‌పై కూడా నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అతను దోషిగా తేలితే రెండేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంది. దీంతో ఆయన సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మాయావతి హయాంలో మంత్రిగా పనిచేసిన బాబు సింగ్ కుష్వాహా నేషనల్ రూరల్ హెల్త్ మెషిన్(ఎన్ఆర్హెచ్ఎం) స్కామ్‌కు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై నమోదైన 25 కేసుల్లో ఎనిమిదింటిపై అభియోగాలు నమోదయ్యాయి. సుల్తాన్పూర్ స్థానం నుంచి గెలుపొందిన రాంభూల్ నిషాద్పై గ్యాంగ్స్టర్స్ చట్టం కింద ఒక కేసుతో సహా ఎనిమిది కేసులు నమోదయ్యాయి. చందౌలీ లోక్‌సభ స్థానం నుంచి మాజీ మంత్రి మహేంద్ర నాథ్ పాండేపై విజయం సాధించిన వీరేంద్ర సింగ్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. సహరాన్పూర్ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌పై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. నగీనా రిజర్వ్డ్ స్థానంలో గెలిచిన సమాజ్ పార్టీకి చెందిన ఏడో అభ్యర్థి చంద్రశేఖర్ ఆజాద్‌పై 30కి పైగా కేసులు నమోదయ్యాయి. ఏదైనా ఒక కేసులో రెండేళ్లకు పైగా శిక్ష పడితే అతని రాజకీయ జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.అనేక మంది రాజకీయ నేతలు క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలి తమ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉండడం గమనార్హం. -
ఇండియా కూటమి కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ ముగిసింది. మిత్రపక్షాలతో కలిసి సుధీర్ఘ చర్చలు జరిపిన అనంతరం.. ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి తీర్మానం చేసుకుంది. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా ఇండియా భాగస్వామ్యం ఏకతాటిపై పోరాటం చేస్తాయని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్షానికి మద్దతిచ్చిన దేశ ప్రజలందరికీ కూటమి తరపున ధన్యవాదాలు తెలిపారు.లోక్‌సభ ఫలితాల అనంతరం ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశమైన సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, డీ రాజా, ఏచూరి హాజరయ్యారు. ఇండియా కూటమి సంయుక్త ప్రకటననరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాంబీజేపీని గద్దె దింపేందుకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాంఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ఈ ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయి. నైతికంగా ప్రధాని ఓడిపోయారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో కూటమి ఐక్యంగా పోరాడింది. రాజ్యాంగ విలువలను కాపాడాలనుకునే ఏ పార్టీ అయినా కూటమిలోకి రావొచ్చు. ఈ ఫలితాలు తనకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ.. మోదీ ప్రజల అభీష్టాన్ని మార్చాలని చూస్తున్నారు. :::ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే #WATCH | Delhi: Congress president Mallikarjun Kharge says "...The INDIA bloc will continue will fight against the fascist rule of the BJP led by PM Modi. We will take the appropriate steps at the appropriate time to realise the people's desire not to be ruled by the BJP's… pic.twitter.com/NhdnHYbbfI— ANI (@ANI) June 5, 2024ప్రతిపక్ష నేతలంతా కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్(272) దాటకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కసరత్తు లేదా ప్రతిపక్ష హోదా కొనసాగింపు వంటి వివిధ అంశాలపై లోతుగా చర్చించారు. చివరికి ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి నిర్ణయించింది.కాగా జూన్ 4న వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమికి 291, ఇండియా కూటమికి 232 స్థానాలు దక్కాయి. బీజేపీ స్వతహాగా 240 సీట్లు గెలుచుకుంది. అయితే ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో ప్రధాని మోదీ ఎన్డీయే మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రధాని పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతికి సమర్పించారు. జేడీయూ, టీడీపీ వంటి మిత్ర పక్షాలతో కలిసి జూన్ 8న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.


