EC Office: పార్లమెంట్‌ వద్ద ఉద్రిక్తత.. రాహుల్‌ సహా ఎంపీలు అరెస్ట్‌ | INDIA bloc leaders Parliament to Election Commission march Updates | Sakshi
Sakshi News home page

EC Office: విపక్ష ఎంపీల ర్యాలీ అప్‌డేట్స్‌..

Aug 11 2025 11:56 AM | Updated on Aug 11 2025 12:46 PM

INDIA bloc leaders Parliament to Election Commission march Updates

INDIA bloc leaders March Updates..

ఎంపీలు అరెస్ట్‌.. 

  • పార్లమెంట్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
  • రాహుల్‌ గాంధీ సహా ప్రతిపక్ష పార్టీ ఎంపీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
  • ఇండియా కూటమి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
  • కూటమి ఎంపీలను అరెస్ట్‌ చేసి బస్సుల్లో తరలిస్తున్న పోలీసులు. 
  • కేంద్ర ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా ఎంపీల నినాదాలు.

 

రాహుల్‌ కామెంట్స్‌..

  • అరెస్ట్‌ తర్వాత రాహుల్‌ మాట్లాడుతూ..
  • నిజం దేశం ముందు ఉంది.
  • కానీ, వాస్తవం ఏమిటంటే వారు మాట్లాడలేరు.
  • ఈ పోరాటం రాజకీయమైనది కాదు.
  • ఈ పోరాటం రాజ్యాంగాన్ని కాపాడటానికి చేస్తున్నాం.
  • ఈ పోరాటం ఓటు కోసం.
  • మాకు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కావాలి

కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేష్‌ కామెంట్స్‌..

  • కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ మాట్లాడుతూ..
  • ఎన్నికల కమిషన్‌కు నేను రాసిన లేఖ ప్రత్యక్షంగా ఉంది.
  • అన్ని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంటు నుండి ఈసీ ఆఫీసుకు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తారని నేను స్పష్టంగా రాశాను.
  • ఎంపీలందరూ SIR గురించి ఎన్నికల కమిషన్‌కు ఒక డాక్యుమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.
  • ఇది మా డిమాండ్.
  • నేను నిన్న సాయంత్రం ఈ లేఖ రాశాను.
  • ఇప్పుడు వారు 30 మంది ఎంపీలు మాత్రమే రావాలని అంటున్నారు.
  • ప్రతిపక్ష ఎంపీలందరూ సమిష్టిగా ఈసీకి ఒక డాక్యుమెంట్ ఇవ్వాలని మేము కోరుకున్నాం.
  • మమ్మల్ని ఇక్కడే ఆపారు.
  • ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లడానికి అనుమతించడం లేదు.

 

శశి థరూర్ కామెంట్స్‌..

  • కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ..
  • ఈ విషయం చాలా సులభం.
  • రాహుల్ గాంధీ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు.
  • వాటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది.
  • ఎన్నికల కమిషన్ దేశం పట్ల బాధ్యత వహించడమే కాదు.  
  • మన ఎన్నికల విశ్వసనీయత గురించి ప్రజల మనస్సులలో సందేహాలను నివృత్తి చేయాలి.
  • ఈసీకి ఆ బాధ్యత ఉంది.
  • ఎన్నికలు మొత్తం దేశానికి ముఖ్యమైనవి.
  • నకిలీ ఓటింగ్ ఉందా, బహుళ చిరునామాలు ఉన్నాయా లేదా నకిలీ ఓట్లు ఉన్నాయా?.
  • పలు సందేహాలతో మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.
  • ప్రజల మనస్సులలో సందేహాలు ఉంటే వాటిని పరిష్కరించాలి.
  • ఈ ప్రశ్నలకు సమాధానాలు అందుబాటులో ఉండవచ్చు, కానీ ఆ సమాధానాలను విశ్వసనీయంగా అందించాలి.
  • ఎన్నికల కమిషన్ ప్రశ్నలను తీసుకొని వాటిని పరిష్కరించాలి. 
     

పార్లమెంట్‌ వద్ద ఉద్రిక్తత.. 

  • సంసద్‌ మార్గ్‌ను బ్లాక్‌ చేసిన పోలీసులు.
  • ఈసీ ఆఫీసుకు వెళ్లకుండా విపక్ష ఎంపీలను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు.
  • బారికేడ్డు పెట్టి విపక్ష ఎంపీలను నిలువరిస్తున్న ఢిల్లీ పోలీసులు.
  • ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి సవాల్‌ చేసిన రాహుల్‌ గాంధీ. 
  • రోడ్డుపై బైఠాయించి ఎంపీల నిరసనలు.. 

ఢిల్లీలో హైటెన్షన్‌.. అఖిలేష్‌ యాదవ్‌ నిరసన..

  • ఎంపీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.
  • బారికేడ్ల దూకి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన అఖిలేష్‌.
  • అఖిలేష్‌ను అడ్డుకున్న పోలీసులు..
  • పార్లమెంట్‌ వద్ద రోడ్డుపై కూర్చుని అఖిలేష్‌, తృణముల్‌ ఎంపీలు నిరసనలు.
  • నిరసనల్లో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే, శరద్‌ పవార్‌, శశి థరూర్‌ 
  • పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతల నినాదాలు 

 

 

 

 

పార్లమెంట్‌ వద్ద ఉ‍ద్రికత్త..

 

  • పార్లమెంట్‌ బయటే బారికేడ్ల ఏర్పాటు.
  • బారికేడ్లపైకి ఎక్కిన మహిళా ఎంపీలు.
  • ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు. 

ఎంపీల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..

  • ఈసీ అపాయింట్‌మెంట్‌ కోరిన ప్రతిపక్ష నేతలు
  • పార్లమెంట్‌ టు ఈసీ.. విపక్ష ఎంపీల ర్యాలీ
  • బీహార్‌లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల ర్యాలీ
  • కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ర్యాలీ
  • గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ నినాదాలు
  • ఈ ర్యాలీకి అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసులు
  • 30 మందే రావాలంటూ జైరాం రమేష్‌కు లేఖ రాసిన ఈసీ.
  • ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి రాహుల్‌ గాంధీ సవాల్‌. 
  • 300 మంది ఎంపీలతో ర్యాలీకి ఇండియా కూటమి ప్రయత్నం 


👉విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌ నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. బీహార్‌లో ఓట్ల జాబితా సవరణకు నిరసనగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఈ ర్యాలీ కొనసాగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, ఇండియా బ్లాక్‌ నేతలు, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement