టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) న్యూజిలాండ్ సిరీస్‌కు ముందే మరోసారి రంగంలోకి దిగనున్నాడు. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడిన విరాట్, ఇదే టోర్నీలో మరో మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు.
జనవరి 6న ఆలుర్‌లో రైల్వేస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో విరాట్ బరిలో ఉంటాడని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అత్యున్నత అధికారి ఒకరు క్రిక్‌బజ్‌కు లీక్ ఇచ్చారు.
ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం జనవరి 7న భారత జట్టుతో పాటు బరోడాలో కలుస్తాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును అతి త్వరలో ప్రకటిస్తారు.
ఈ జట్టులో విరాట్ ఉండటం లాంఛనమే. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ ఫార్మాట్‌లో విరాట్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేసి పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడిన విరాట్.. ఓ సెంచరీ (ఆంధ్రపై 131), ఓ హాఫ్ సెంచరీ (గుజరాత్‌పై 77) చేశాడు.
విరాట్ రైల్వేస్‌తో జరుగబోయే మ్యాచ్‌లోనూ సత్తా చాటితే న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు టీమిండియాకు అదనపు ధైర్యం వస్తుంది.
విరాట్ తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు (135, 102), ఓ హాఫ్ సెంచరీ (65 నాటౌట్) చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైన విరాట్.. చివరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (74 నాటౌట్) చేసి ఫామ్‌లోకి వచ్చాడు. విరాట్ ఢిల్లీ జట్టులో ఉండటం వల్ల విజయ్ హజారే ట్రోఫీలో ఆ జట్టుకు కూడా అదనపు బలం చేకూరుతుంది.
చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..!


